.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

5, మార్చి 2018, సోమవారం

జర్మన్‌ భాషావేత్త మాక్స్‌ముల్లర్‌ను అక్కడి విలేకరులు అడిగారు...



జర్మన్‌ భాషావేత్త మాక్స్‌ముల్లర్‌ను అక్కడి విలేకరులు అడిగారు...
‘పునర్జన్మ ఎలా ఉండాలని ప్రభువును కోరుకుంటారు’ అని...
‘భారత దేశంలో పుట్టించమని అడుగుతాను’... ఠక్కున సమాధానం చెప్పారాయన...

*ప్రఖ్యాత షెహనాయ్‌ విద్వాంసులు, రససిద్ధులు ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ను అమెరికాలో స్థిరపడమని, కోరినవన్నీ ఇస్తామని ఒత్తిడి చేశారు అక్కడి ప్రముఖులు ‘అమెరికాకు నాతోపాటు గంగామాయీ ఎలా వస్తుంది?’ అని ప్రశ్నించారాయన.


* ఈ ప్రపంచాన్ని రైలుబండితో పోలుస్తూ సత్యసాయిబాబా ‘భారతదేశం దానికి ఇంజిను’ అన్నారు. అప్పుడు విదేశీ పాత్రికేయులు ఆయనను అడిగారు ‘దేవతలందరూ మీ దేశంలోనే ఎందుకు పుడతారు?’ అని దానికి బాబా బదులిస్తూ ‘డ్రైవర్‌ ఇంజిన్‌లో కాకపోతే బోగీల్లో ఎక్కుతారా?’ అని ప్రశ్నించారు.

* స్వామి వివేకానంద చికాగో ప్రసంగాలను సమీక్షిస్తూ ‘‘భారతీయమైన ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక శక్తి ఆయనలో ఉప్పొంగాయి. ఆ దేశపు ప్రత్యేకత విశ్వానికి వెల్లడయింది’ అని ఒక పత్రిక రాసింది.
మహాత్ములు, కారణజన్ములు సైతం ఈ దేశాన్ని అదే విధంగా దర్శించారు. తరించారు!

మేరా భారత్‌ మహాన్‌

‘నాదేశం భగవద్గీత.. నా దేశం అగ్ని పునీత సీత... నా దేశం కరుణాంతరంగ. దేశం సంస్కార గంగ’

- డా.సి. నారాయణరెడ్డి

అత్యున్నత ఆశయాలు, ఉదాత్త లక్ష్యాలు, ఉత్తమ భావాలు కలిగిన ఓ వ్యక్తి కోరుకునేవన్నీ భారతదేశంలో పుష్కలంగా ఉన్నాయి. ఇది నా దేశం కాబట్టి నేను ప్రేమించడం లేదు. విశిష్ఠ లక్షణాలను ఇక్కడ గమనించాను కాబట్టి ప్రేమిస్తున్నాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML