.

.

గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

Tuesday, February 20, 2018

శివుడు ఎవరు ?

శివుడు ఎవరు ?

     ఆది శంకరాచార్యుల వారి ప్రకారం "శివ" అనగా కల్మషము లేని వాడు. అంటే ప్రకృతి యొక్క (సత్వ, తమో, రజో) గుణాలేవీ అంటని వాడు. అందుచేత శివనామస్మరణం తోనే సకలజనులని పరిశుద్ధము చేయువాడు. స్వామి చిన్మయానందుల వారి ప్రకారం శివుడు అనగా అనంత పరిశుద్ధుడు, ఏ గుణములు అతడిని కళంకితుడిని చేయలేని వాడు.

శివుడు జననమరణాలుకు అతీతుడు. కాలాతీతుడు అనగా కాలమునకు వశము అందని కానివాడు. అ౦దుకే సదా శివుడు అ౦టాము. అ౦తయు శివుడే అ౦దుకే ఆ౦దరు దేవతలు శివారాదకులే. బ్రహ్మ, విష్ణువు మరియు ఇతర దేవతలు సదా శివలి౦గారాదన చేస్తు౦టారు. పరమశివుడు సర్వవ్యాపి సర్వాంతర్యామి అ౦తటా ఉ౦డేవాడు. శివుడు ఎ౦తవరకు విస్తరి౦చాడో కనుగొనట౦ అస౦బవ౦. అది విష్ణువు, బ్రహ్మలకు కూడా అసాధ్యం.

మరొక ఇతిహాసములో:
"బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులగు త్రిమూర్తులకు జన్మ నిచ్చింది ఆది పరాశక్తి. పరాశక్తి కి మూడవ నేత్రం ఉండేది. అనంతరం, తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడవలసిందిగా కోరింది. మొదట ముగ్గురూ నిరాకరించారు. ఆమె నచ్చచెప్పిన పిమ్మట, శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి, ఒక షరతు పెట్టాడు. అది, తనను (ఆది పరాశక్తిని) వివాహమాడిన అనంతరం మూడవ నేత్రం శివునికి ఇవ్వాలి. అందుకు ఆ దేవత అంగీకరించి, వివాహా నంతరం శివునికి మూడవ నేత్రమును ఇచ్చింది. అప్పుడు శివుడు ఆ మూడవ నేత్రముతో ఆ దేవతను భస్మం చేసి, ఆ భస్మరాశిని మూడు భాగాలుగా విభజించి, లక్ష్మి, సరస్వతి, పార్వతి లను సృష్టించాడు. ఆ ముగ్గురమ్మలను ఈ త్రిమూర్తులు పరిణయమాడారు " అని ఉంది.

పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్కఅర్ధం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాల కు ప్రతి రూపాలు. ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆసనం పైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక.

శివుడు కేవలం రుద్ర (రౌద్ర) స్వరూపమే కాక, ప్రేమ స్వరూపుడు కూడా. శివుణ్ణి, అతని కుటుంబాన్ని మనం రెండు విధాలుగా దర్శించవచ్చును. రుద్రస్వరూపముగ ఐతే శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచగణాలుగా దర్శనం ఇస్తే - శాంత స్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పార్వతీ దేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేద వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు.
దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణా మూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు.
Read More

శ్రీ నారాయణ తీర్ధులు

 శ్రీ నారాయణ తీర్ధులు

ఎక్కడ పుట్టాడో, ఎప్పుడు పుట్టాడో, గురువు ఎవరో తెలియని వైనం సాయిబాబా.. మహాసమాధియైన ప్రదేశం గూర్చి ఏకాభిప్రాయం ఉన్నది. అయితే లీలాశుకుల, జయదేవుల అవతారంగా భావింపబడే నారాయణతీర్థులవారి మహాసమాధి అయిన క్షేత్రం గూర్చి భిన్నాభిప్రాయాలున్నాయి.

శ్రీనారాయణతీర్ధులు పూర్వాశ్రమ నామం తల్లావఝుల గోవిందశాస్త్రి, తండ్రి పేరు నీలకంఠశాస్త్రి, వీరిది గుంటూరు జిల్లాలోని కాజగ్రామం.

గోవింద శాస్త్రికి వివాహమైంది. అత్తవారింటికి వెళ్తుంటే కృష్ణానది వరదల్లో చిక్కుకుపోయాడు. ప్రాణసంరక్షణార్టం సన్యాసం స్వీకరించాడు. అనంతరం అత్తవారింటికి. చేరుకున్నాడు క్షేమంగా. ఆయన భార్యకు యతీశ్వరునిలాగా కన్పడ్డాడు. కారణం ఏమిటని భార్య అడిగింది. సంగతి చెప్పాడు. ఆమె ఆయన పాదాలకు నమస్కరించి, తనను శిష్యురాలిగా స్వీకరింపుమని కోరింది. వారిద్దరిప్పుడు భార్యాభర్తలు కారు. గురువు శిష్యులు. అది దైవలీల!

ఆయన చేసిన రచనల వల్ల గోవిందశాస్త్రి (అంటే నారాయణతీర్థులవారు) రామగోవిందులనే శివరామతీర్ధుల వద్ద సన్యాసదీక్ష తీసుకున్నారని, వాసుదేవశాస్త్రి వద్ద సకల శాస్త్రాలు తెలుసుకున్నారని తెలుస్తుంది.

గురువు శివరామతీర్ధులు (శివరామానంద) కాశీపురవాసి. శిష్యుడు నారాయణతీర్ధులు గొప్ప కృష్ణ భకుడు, సిద్ధపురుషుడు. అనేక రచనలను చేశాడు. ఆయన రచనలు పండిత పామర మనోరంజకాలు. వాచస్పతిమిశ్ర, మధుసూధన సరస్వతులను పాండిత్య ప్రభావైభవాలలో మించినవారు నారాయణతీర్థులు,

సంస్కృతయక్షగానం శ్రీకృష్ణలీలాతరంగణి, లీలాశుకుల శ్రీకృష్ణకర్ణామృతమును, జయదేవుల గీతాగోవిందాన్ని మరిపిస్తాయి.

"కృష్ణం కలయ సఖి సుందరం...." వినని తెలుగు వారుండరేమో, తెలుగులో పారిజాతాపహరణం అనే యక్షగానాన్ని మేలటూరు భాగవతుల కోసం రాశారు. శ్రీకృష్ణలీలాతరంగిణి కృష్ణ కథను (రుక్మిణీ కళ్యాణం వరకు) 12 అంకాలుగా మలచిన యక్షగానం, ప్రదర్శనకు అనుకూలంగా ఉంటుంది. ఇది భాగవతానికి ఉన్న 12 స్కంధాలకు ప్రతీక అనే పేరున్నది.

త్యాగరాజుల గురువు శొంఠి వెంకటరమణయ్య తండ్రి నారాయణతీర్కలవారి శిష్యుడే. ఇంకా ఆయనకు గౌడ బ్రహ్మానందులు, కాశ్మీర సదానందులు, ఆంధ్రమహేశ్వర తీర్థులు.. ఇలా ఎందరో శిష్యులు ఉన్నారు. గురువును మించిన శిష్యుడు గురువు రామానందులు ఒక కుటీరంలో, శిష్యుడు నారాయణతీర్ధులు మరో కుటీరంలో దూరంగా ఉండేవారు. 

భక్తి భావనచే నారాయణతీర్థులకు కృష్ణదర్శనం అయ్యేది. అప్పుడు కుటీరమంతా వెలుగులతో నిండిపోయి ఉండేది. ఇదేమీ అర్థం కానట్టి ఇతర శిష్యులు నారాయణతీర్దులపై చాడీలు చెప్పారు. ఒకనాటి రాత్రి స్వయంగా గురువు రామానందులు శిష్యుని కుటీరంలోనికి తొంగి చూచాడు. 

ఆ "వెలుగుకు కంటి చూపుపోయింది. అక్కడే కూలబడిపోయాడు. తెల్లవారింది, నారాయణ తీర్థులు బయటకు వచ్చి గురుదేవులను చూచాడు. గురుదేవులు తాను చేసిన పనిని చెప్పి, కృష్ణదర్శనం తనకు చేయింపుమని కోరాడు శిష్యుడిని. 

తన గురువుకు కంటిచూపును, దర్శనాన్ని కలుగ చేయమని కృష్ణుడిని ప్రార్ధించాడు నారాయణ తీర్థులు, కృష్ణుడు దర్శనమిచ్చాడు. కంటిచూపు వచ్చింది గురువుకు. కృష్ణుడిని చూడగలిగాడు. 
ఏ శిష్యుడైనా గురువుకు ఇంతకంటే ఎక్కువగా ఏం రుణం తీర్చగలడు? 

కడుపునొప్పి :

ఒకసారి నారాయణతీర్థులకు కడుపునొప్పి వచ్చింది, ఎంతకూ తగ్గలేదు. స్వప్నంలో పందులు కనబడతాయని, వాటిని అనుసరింపుమని ఆదేశం వచ్చింది. తెల్లవారింది. పందులు కనబడ్డాయి. వాటి వెంట పోగా వరాహపురి వద్ద ఆగాయి. ఆ క్రితం రాత్రి గ్రామ పొలిమేరలకు వచ్చే వ్యక్తిని మేళతాళాలతో వెంకటేశ్వరాలయానికి తీసుకుపొమ్మని గ్రామ పెద్దలకు ఆదేశం వచ్చింది. అలాగే వారు వచ్చి నారాయణతీర్శలను వెంకటేశ్వరాలయానికి తీసుకుపోగానే కడుపునొప్పి మటుమాయమైంది. అక్కడనే ఆయన మహాసమాధి చెందాడంటారు. దగ్గరలోనే ఉన్న తిరుప్పందురుత్తిలో మహాసమాధి అయ్యాడని మరొక వాదన.

"కృష్ణంకలయసఖి సుందరం..." అని పాడుతూ ఆయనను స్మరిద్దాం.

సద్గురుకృప మాస పత్రిక నుంచి.

Read More

: పరాశర భట్టరు దత్తకోశం చేస్తూ ఓ శ్లోకమిచ్చారు మనకు. అదేమంటుందంటే.

: పరాశర భట్టరు దత్తకోశం చేస్తూ ఓ శ్లోకమిచ్చారు మనకు. అదేమంటుందంటే... చతుర్ముఖ బ్రహ్మగారు జీవుడిని సృజించే ముందు పుర్రె చేత్తో పట్టుకుని రాయడం మొదలుపెడతాడట. వీడికి చదువెంత ఉండాలి.. రాస్తాడు. వీడికి ఆయుర్దాయం ఎంత... రాస్తాడు. బలం... రాస్తాడు. ఐశ్వర్యం ఎంతుండాలి...ఇది రాసేముందు తల్లి లక్ష్మీదేవి వంక చూస్తాడట. ''గతజన్మలో ఈ పుర్రెపేరేమిటి? ఈ జీవుడు ఏ పేరుతో బతికాడు ?'' అని అడుగుతుందట అమ్మవారు. ఫలానా వాడమ్మా... అని చెబుతాడు.. ఆవిడ ఏమీ అనకపోతే...'సామాన్యం' అని రాస్తాడు.

ఆవిడ విని 'వీడా, ఒకరికి పెట్టినవాడు కాదు' అని తలదించుకుంటే... 'దరిద్రుడు' అని రాస్తాడు. పేరు వినగానే 'ఆ! వాడా.. అని ఆవిడ కనుబొమ్మ పైకెత్తితే....'మహదైశ్వర్యవంతుడు' అని రాస్తాడట. కలిసొచ్చింది, కలిసొచ్చింది... అంటారే, ఎక్కడినుంచి వచ్చింది? అదంతా గత జన్మలతాలూకు పుణ్యం. దాన్ని ఆధారం చేసుకుని ఇక్కడ దాని ఫలితాన్ని అనుభవిస్తున్నావు. అదంతా ఇక్కడిదానికి సరిపోయింది. ఆ ఐశ్వర్యాన్ని, ఆ బలాన్ని, ఆ తెలివితేటలను ఉపయోగించి ఈ జన్మలో నీవు కూడబెట్టిందేమిటి? దాన్ని పుణ్యంకింద మార్చుకోవాలిగా...!!! ఎలా..!!!

నేనిక్కడినుంచి అమెరికా వెళ్ళాలి. ఇక్కడి రూపాయలు ఎన్ని పట్టుకెళ్ళినా అక్కడ ఓ కప్పు కాఫీకూడా దొరకదు. ఇక్కడి ధనం అక్కడ పనికిరాదు. అందుకని బయల్దేరేముందే దాన్ని అక్కడి ధనం ... డాలర్లకింద మార్చుకోవాలి. అప్పుడు అది పెట్టి కాఫీ కానీ మరేదయినా కానీ తీసుకోవచ్చు. కానీ రూపాయలు అక్కడ చెల్లవు. అలాగే, ఇక్కడ సంపాదించిన ధనం, బలం, తేజస్సు, తెలివితేటలు... అన్నీ ఇక్కడితో సరి. అవి ఉత్తర జన్మలకిక పనికిరావు. మరి ఉత్తరజన్మలకూ కూడా పనికివచ్చేటట్లు మార్చుకునే ప్రక్రియ ఒకటుంది.

రూపాయలు అమెరికా డాలర్లుగా మారినట్లు, దానితో ఇక్కడి బలం, ధనం... పుణ్యధనంగా మారుతుంది. ఎలా ?నీకు ఒంట్లో బలముంది. మనగుడి కార్యక్రమానికి వెళ్ళి ఓ దేవాలయాన్ని తుడిచావు. కొంతమంది  ఏ క్షేత్రానికి వెళ్ళినా కొంతసేపు అక్కడ శ్రమించి స్వచ్ఛందంగా గుడికి, భక్తులకు సేవ చేస్తుంటారు. 63 మంది నాయనార్లలో ఒకడైన అప్పర్‌ నాయనార్‌ ఇలా చేస్తుండేవారు. ఇక్కడ బలం ఉంది. పల్లకి మోసావు. పూజా సామాగ్రిని శుభ్రపరిచావు. నీకు పాండిత్యం ఉంది.. పరుల హితం కోసం ఉపయోగించావు. 

శాస్త్రాన్ని శాస్త్రంగా ప్రబోధం చేసావు. ఇలా నీవు ఇక్కడ ఉపయోగించినదంతా పుణ్యధనంగా మారుతుంది. ఎవరు మారుస్తారు అలా... చిత్రంగా ఇక్కడ కూర్చుని గుప్తంగా రాసుకునే వాడొకడున్నాడు. వాడే చిత్రగుప్తుడు.  వాడెవరో కాదు, ఈశ్వరుడే. నీకిచ్చిన బలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు రాసుకుంటాడు.ఇక్కడ ఏ విభూతిని ఈశ్వరుడిచ్చాడో దానిని పుణ్యధనంగా మార్చుకోవడానికి ఏర్పడిన కేంద్రం– ఇంటిలో అయితే పూజగది, సమాజంలో అయితే దేవాలయం. ప్రతివాడికి ఏదో ఒక విభూతిపెట్టాడు, దానిని పరుల హితంకోరి, ఈశ్వరపరంచేయడమే పుణ్యధనంగా మార్చుకోవడం.

అటువంటి విభూతులలో ఒకటి–అతిథి. ఇంటికి వచ్చిన అతిథి సామాన్యుడిగా కనిపించినా, సామాన్యుడు మాత్రంకాడు. నీ గతజన్మ తాలూకు పాపాలను త్వరగా నశింపచేయడానికి పరమేశ్వరుడు ఏరికోరి మహాత్ములను అతిథులుగా పంపుతాడు. కనుక ఇంటికి వచ్చిన అతిథిని పూజించి, ఆదరించి, తృప్తిగా అన్నంపెట్టి సత్కరించడంవల్ల నీ పాపాలన్నీ నశించి, ఉత్తర జన్మలకోసం కావలసినంత పుణ్యధనాన్ని మూటగట్టుకోవచ్చని శాస్త్రం చెబుతున్నది.

- ✍ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
సేకరణ హిందూ ధర్మచక్రం

Read More

రేపటి నుంచి ఫాల్గునమాసం.

రేపటి నుంచి ఫాల్గునమాసం. 

పౌర్ణమినాడు ఫల్గునీ నక్షత్రం ఉన్న 'చాంద్రమాన'మాసం ఫాల్గునమాసం. ఫాల్గుణము అని వ్రాయకూడదు. ఫాల్గునము అన్న అక్షర క్రమమే సరైన శబ్ద స్వరూపము. ఉత్తర ఫల్గునీ నక్షత్రం నాడు పుట్టిన పాండవ మధ్యముడు ఫల్గునుడయ్యాడు. ఈ మాసం శిశిర ఋతువుకు పరాకాష్ఠ. వసంత ఋతువుకు 'ద్వారం' వంటిది.

శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం - ఫాల్గుణ మాసం. ఫాల్గుణమాసంలో మొదటి పెన్నెండు రోజులు, అంటే శుక్లపక్షపాడ్యమి మొదలు ద్వాదశి వరకూ శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన రోజులు. ప్రతి రోజూ తెల్లవారు ఘామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, శిరస్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చిన అనంతరం, శ్రీమహావిష్ణువును షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి, పాలను నైవేద్యంగా సమర్పించాలి. ఈ పన్నెండురోజుల్లో ఒకరోజుగానీ లేదంటే ద్వాదశి నాడుగానీ వస్త్రాలు, వివిధదాన్యాలను పండితులకు దానముగా ఇవ్వడం మంచిది. శక్తివున్నవారు ఏదైనా వైష్ణవాలయానికి ఆవును దానమివ్వడం విశేష ఫలితాలనిస్తుంది. పూర్ణిమనాడు పరమశివుడిని, శ్రీకృష్ణపరమాత్మను, మహాలక్ష్మినీ పూజించడంతో పాటూ "లింగపురాణం" ను దానముగా ఇవ్వడం మంచిది. అట్లే ఈనాటి సాయంత్రం శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఊపవలెను. దీనిని డోలోత్సవం అని అంటారు. దీనినే కొన్ని ప్రాంతాలలో డోలాపూర్ణిమ అని అంటారు. నరాడోలాగతం దృష్ట్యా గోవిందం పురుషోత్తమం ఫాల్గున్యాం ప్రయతోభూత్వా గోవిందస్య పురంప్రజేత్‌ ఉయ్యాలలో అర్చింపబడిన పురుషోత్తముడైన గోవిందుని ఈ రోజున దర్శించిన భక్తులకు వైకుంఠప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ రోజున రంగుపొడులను, రంగునీళ్ళను చల్లుకోవాలని చెప్పబడింది. ఈ రోజున ఉదయాన్నే నూనెతో తలంటిస్నానం చేసి 'చూత కుసుమ భక్షణం' తప్పక చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పూజ ప్రకారం, ఇంటిని శుభ్రం చేసి, ఇంటి ప్రాంగణంలో తెల్లనిగుడ్డను ఆసనంగా తూర్పుముఖంగా కూర్చుని, ఒక ముత్తైదువుచే వందన తిలకం, నీరాజనాన్ని పొంది చందనంతో కూడిన మామిడి పువ్వులను తినాలి. చూతమగ్ర్యం వసంతస్య మాకందకుసుమం తద సచందనం పిచామ్యద్య సర్వకామ్యార్థ సిద్దయే అనే శ్లోకంతో మామిడిపూతను స్వీకరించాలి. అనంతరం రంగులను నృత్యగానాదులతో చల్లుకోవాలని చెప్పబడింది. అట్లే, హరిహరసుతుడు అయిన అయ్యప్పస్వామి వారు జన్మించిన దినం కూడా ఈనాడే కనుక వారిని పూజించడం విశేష ఫలితాలనిస్తుంది. ఫాల్గుణమాసంలో పూర్ణిమరోజున హోళీపండుగను నిర్వహిస్తుంటారు. ఈ పూర్ణిమ శక్తితో కూడినది. ఏ సంవత్సరమైనా పూర్ణిమ, ఉత్తరఫల్గుణి కలిసి వస్తే, ఆ రోజున మహాలక్ష్మిని షోడశోపచారాలతో ఆరాధించి, లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారా స్తోత్రాలను పారాయణం చేయడం మంచిది. హోళిరోజూన లక్ష్మీదేవిని ఆరాధిస్తే సమస్త శుభములు కలుగుతాయని పెద్దలవాక్కు. కొన్ని దక్షిణాది ఆలయాలలో ఫాల్గుణపూర్ణిమను చాలా గొప్పగా చేస్తారు. ఈ ఉత్సవం వెనుక ఒక కథ ఉంది. ఒకసారి పార్వతి తన ప్రభావం చేత శివుని కళ్ళు మూతపడేటట్లు చేసింది. శివుని కళ్ళు మూతపడినందు వల్ల జగమంతా అంధకారబంధురమైంది. శివుడు కోపగించు కోవడంతో, అలిగిన పార్వతీదేవి కాంచీపురానికి వచ్చి, తిరిగి శివుని అభిమానాన్ని పొందేందుకు ఒక మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించింది. ఒకానొక పాల్గుణపూర్ణిమనాడు మామిడి చెట్టు కింద పార్వతీదేవి ప్రాయశ్చిత్త కర్మకాండను పూర్తిచేసింది. అప్పుడు సంతసించిన శివుడు పార్వతిని అనుగ్రహించాడు. అప్పటినుంచి కాంచీపురంలో ఫాల్గుణ పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఫాల్గుణ మాసములో ఈ విధమైన పూజలను, దానాలను చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రవచనం.
Read More

కస్తూరి

కస్తూరి

కస్తూరి జింక కస్తూరిని తయారుచేసే గ్రంధి కలిగి ఉంటుంది.

కస్తూరిని ఎర్రటి జాకెట్టు గుడ్డలో ఉంచి బీరువాలోగాని,లాకర్లో గాని ఉంచిన డబ్బు వృధాగా ఖర్చు అవ్వదు.

"కస్తూరీ తిలకం లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం
కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరి చందనం చ కలయమ్
కంఠేచ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో
విజయతే గోపాల చూడామణి"

అంటూ చిన్నప్పుడు అందరూ నేర్చుకుని శ్రీకృష్ణుడిని స్తుతించే ఉంటారు కదూ!  ఆ సమయంలోముందు నీకొచ్చిన సందేహం ఏమిటి అంటారా?  ఈ కస్తూరి అనేదితిలకం పేరా?  లేక తిలకాన్నే కస్తూరి అంటారా?  అదొక తిలకం బదులు వాడే ఆభరణమా?  కస్తూరి అంటే ఏమిటి?  అని.

పూర్వ కాలంలో మరియు పురాణాలలో కూడా దీని ప్రస్తావనఉంది. వాటిల్లో దీనిని అలంకారానికి, సుగంధ పరిమళానికి, ఆరోగ్యానికి, హోమాలకి రక రకాలుగా వాడినట్లు చెప్పబడింది.మనకి తెలుసున్నంతవరకు లేదా విన్నంతవరకు దీని ప్రస్తావన ఎక్కువగా కృష్ణుని వద్దనే విన్నాం కాని ఇది చూడండి. 

"చారు చంపక వర్ణాభం హ్యేక వక్త్రం త్రిలోచనం
ఈషద్ధాస్య ప్రసన్నాస్యం రత్న స్వర్ణాది భూషితం
మాలతీ మలయాయుక్తం సద్రత్న ముకుటోజ్జ్వలం
సత్కంఠాభరణం చారు వలయాంగద భూషితం

వహ్నిశౌచేనాతులైన త్వతి సూక్షేణ చారుణా అమూల్య
వస్త్ర యుగ్మేన విచిత్రేణాతి రాజితం
చందనాగరు కస్తూరి చారు కుంకుమ భూషితం రత్న
దర్పణ హస్తం చ కజ్జలోజ్జ్వలలోచనం"

అందమయిన సంపెంగల కాంతి వంటి మేని కాంతితో ప్రకాశించేవాడు, ఒక ముఖము కలవాడు, మూడు కన్నులు కలవాడు, చిరునవ్వుతో కూడిన ప్రసన్నమైన ముఖము కలవాడు, బంగారు రత్నాభరణములతో అలంకరింపబడిన వాడు, మల్లె మాలలను ధరించినవాడు, గొప్పవైన రత్నములతో పొదిగిన కిరీటముతో విరాజిల్లువాడు, మంచి కంఠహారమును ధరించినవాడు, సుందరమైన కంకణములు, అంగదములతో అలంకరింపబడినవాడు, అగ్నివలే ప్రకాశించే సాటిలేని సన్నని నూలుతో వడకిన రంగుల వస్త్రముల జంటతో ప్రకాశించువాడు, చందనము, అగరు, కస్తూరి, మంచి కుంకుమలతో అలంకరింపబడినవాడు, రత్నపుటద్దమును చేతియందు కలవాడు, కాటుకతో ఒప్పారు కన్నులు కలవాడు అయినటువంటి ఆ శివుడు కళ్యాణార్థం సర్వావిధ అలంకృతుడై తరలి వెళ్ళాడు అని శివపురాణంలో చెప్పబడింది. 

ఎంత అద్భుతమయిన వర్ణనో కదా! కేవలం
కృష్ణుడి అలంకరణలో వినే కస్తూరిని శివుడు కూడా వాడటం జరిగిందని ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది!

"కస్తూరి తిలక తిద్దువె కాలిగె గెజ్జె కట్టువె
కాశీ పీతాంబర కొడువె కణ్ణిగె కాడిగె హచ్చువె"
అంటూ ఆ విష్ణువుని భజనలో కూడా కస్తూరిదే ప్రథమ స్థానం.

కస్తూరిని శని, రాహు గ్రహాలకు; రోహిణి, మూల, భరణి నక్షత్రాలకు హోమద్రవ్యము క్రింద వాడవలెనని శ్రీ విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పబడింది.

అలానే మణిద్వీపంలో కస్తూరి మృగాలు సంచరిస్తూ నిత్యం పరిమళాలను వెదచల్లుతూ ఉంటాయి అని మణిద్వీప వర్ణన (దేవీ భాగవతం) లో కూడా ఉంది. ఇన్నిటిలో ముఖ్య పాత్రను పోషించే కస్తూరి గురించి మరికొన్నివిషయాలు తెలుసు కుందాం. 

వాస్తవానికి కస్తూరి అనేది
అత్యంత ఖరీదయిన జంతు ఉత్పత్తులలో ఒకటి. కస్తూరికిలో వెల దాదాపు రెండున్నర లక్షల రూపాయలు! పంతొమ్మిదవ శతాబ్దం చివరి వరకూ దీనిని సహజసిద్ధంగా తయారు చేసినా దానికున్న ఎన్నో ఉపయోగాల వలనకృత్రిమంగా కూడా దీనిని తయారుచేస్తున్నారు. కస్తూరికి ఆంగ్ల నామమయిన మస్క్ సంస్కృత పదమయిన ముష్క (వృషణాలు) నుండి ఉద్భవించింది. 

ఇది మగ కస్తూరి జింక (Moschus moschiferus L.) యొక్క ఉదరము మరియు పురుషాంగాల మధ్యన ఉండే ఒక ప్రత్యేక గ్రంధి నుండి వెలువడే పరిమళము.

కస్తూరిని పొందటం కోసం ఈ గ్రంధి మొత్తాన్ని జింక శరీరం నుండి వేరు చేస్తారు. బాగా పెరిగిన, ఆరోగ్యకరమయిన గ్రంధిలో నలభై శాతం కస్తూరి ఉంటుంది. ఈ గ్రంధిని బాగా ఎండపెట్టడం వలన అందులో దాగి ఉన్న ముదురు ఎరుపు రంగులో ఉండే కస్తూరి నలుపు రంగులోకి మారుతుంది. ఇలా మారినప్పుడు అది వాడకానికి సిద్ధమయినదని అర్థం. ఇంతకీ ఈ మగ జింక కస్తూరిని ఆడ జింకను ఆకర్షించుకోవడానికి తయారుచేసుకుంటుందిట.  ప్రత్యుత్పత్తి కాలంలో (మే - జూన్) ఎక్కువ శాతం కస్తూరిని తరాయుచేస్తుంది అని శాస్త్రవేత్తలు చెప్పారు.దీనిని టిబెట్, చైనా, తదితరప్రాంతాలలో ఎక్కువగా తయారుచేస్తారు.

కృత్రిమంగా వీటిని పెద్ద మోతాదులో తయారుచేస్తున్నారు. ఆ ఇతర సంబంధిత పరిమళాలను కూడా కస్తూరి (ధవళ కస్తూరి) అనే పిలుస్తారు. అయితే ఇలాంటివి చాలా మటుకు అసలైన కస్తూరి కంటే భిన్నమైన రసాయన పదార్ధాల నుండి ఉత్పన్నమై ఉండవచ్చు కూడా. కస్తూరి జింక కాకుండా ఇతర జంతువుల యొక్క గ్రంధి స్రావకాలు, కస్తూరిని పోలిన పరిమళాన్ని వెదజల్లే అనేక మొక్కల యొక్క స్రావకాలు, ఈ వాసన కలిగిన కృత్తిమ పదార్ధాలను కూడా కస్తూరి అనే భావిస్తున్నారు జనాలు. కస్తూరిలో ఆ స్వభావ సిద్ధమైన వాసనకు ప్రధాన కారణమైన ఆర్గానిక్ కాంపౌండు ముస్కోన్.  దీనికి ఉన్న ప్రాముఖ్యమయిన పరిమళాన్ని గుర్తించిన యూరోపియన్లు దానిని perfumes తయారీలో వాడుతారుట.

అదే కాక దానికున్న పరిమళం వలన అగరుబత్తులు, సాంబ్రాణి అన్నిటికీ కస్తూరి పేరు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అందులో ఎంతవరకు నిజమయిన జింక కస్తూరిని కలుపుతారో తెలియదు! సారంగ నాభి, కురంగ నాభి, జింక పొక్కిలి, ఏణమదము, ఇట్టి గోరోజనము, సహస్ర వేధి, లత, మోదిని, మొదలయినవి కస్తూరి రకములు.

ఆయుర్వేదములో కూడా కస్తూరి ప్రముఖ పాత్రని పోషిస్తోంది.
ఎలా అంటే:

01. చాలా కాలంగా కస్తూరి మాత్రలను తమలపాకు రసంలోనూరి తేనెలో కలిపి జలుబుకి, దగ్గుకి ఔషధంగావాడుతున్నారు.

02. గర్భిణీ స్త్రీలకు కస్తూరిని ఎక్కువగా నొప్పులకివాడతారు. వాతపు నొప్పులయితే తగ్గుతాయి, అదే పురిటినొప్పులయితే కాన్పు జరుగుతుంది అని కస్తూరిరసం పట్టించేవారు.

03. వాతానికి అద్భుతమయిన మందు కస్తూరి. అందుకనేదీనిని తాంబూలంలో కలిపి తింటారు.

04. అజీర్ణం, కఫం, అతిసారం, అధికమయిన చెమట,బాలింత ఒంటి నొప్పులు, వాంతులు మొదలయినవాటికిఇది పెట్టింది పేరు. తేనెతో కాని అల్లం రసంతో కాని పరగడపున పట్టిస్తారు.

05. మనిషి చనిపోయే ముందు శరీరం చల్లబడితే సారంగనాభి కస్తూరిని పట్టిస్తే వేడి పుంజుకుని (మరి వాతాన్నితగ్గించడానికి వాడతారు అంటేనే తెలుస్తోంది కదాచల్లదనాన్ని తగ్గించి వేడిని పెంచుతుంది అని!) మనిషిబ్రతుకుతాడని నమ్మిక.

06. గుండె జబ్బులు, ఉబ్బసం, ఆస్తమా, మూర్థ,నరాల బలహీనత, ధనుర్వాతం, పక్షవాతం, మొదలయినవాటికిఇది చక్కని మందు.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీముఖ్యమయినవి మాత్రం . కస్తూరి శ్రేష్టతకి మారు పేరు అంటారు.  శ్రేష్టమయిన పసుపుని కస్తూరి పసుపు అనీ శ్రేష్టమయినకుంకుమని కస్తూరి కుంకుమ అనీ అంటారు.

కస్తూరిని మన కవులు మాత్రం వదులుతారా?  ముఖ్యంగా వేమన శతకంలో మనకి ఈ క్రింది పద్యాలలో తారసపడుతుంది.

"మృగ మదంబు చూడ మీద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ!"

కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నా ఏ విధముగా ఐతే మంచివాసన వెదజల్లుతుందో అదే విధముగా గొప్పవారు బయటకిఆడంబరము లేకపోయినా గొప్ప శక్తి కలవారై ఉండును.దేనినీ రంగు లేదా హంగు చూసి మోసపోకూడదు అన్నది....దీని నీతి.

"కన్నె దాని మేను కస్తూరి వాసన
ముసలిదాని మేను ముఱికి కంపు
వయసుదాని మేను వర్ణింప శక్యమా
విశ్వదాభిరామ వినురవేమ!"

"గార్ధబంబెరుగునా కస్తూరి వాసన
మిక్కుటంగ చెడుగు మేసుగాక
నుత్తమోత్తములకు వత్తురా వేశ్యలు
విశ్వదాభిరామ వినురవేమ!"

అంత సరళమయిన భాష వాడారు.

అంతే కాకుండా కస్తూరిని తిలకధారణలోను, పండుగలు విశేష కార్యక్రమాలలో దేవుళ్ళకు అభిషేకం లోను వాడుతారు.  ఈ సుగంధద్రవ్యం ప్రత్యేక సువాసనే కాదు ప్రతేక ఆకర్షణని కూడా కలిగి ఉంటుంది.  కస్తూరిని ఆరోగ్యం, అభిషేకం, పూజ, హోమం మొదలైన వాటిలో వాడుతారు.  కస్తూరి పసుపు ను అందం కోసం వాడుతారు.  కస్తూరి కుంకుమ ను ఆకర్షణ కోసం వాడుతారు.  కస్తూరి కాయ ను స్థిర లక్ష్మి కోసం ప్రయోగిస్తారు.  కస్తూరి తిలకం ఆకర్షణ మరియు అభిషేకాలలో వాడుతారు.

… శ్రీ ములుగు విశ్వనాథ శర్మ
Read More

శ్రవణబెళగొళ... దక్షిణ భారతదేశంలో జైనుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతాన్ని 'దక్షిణ కాశి' అని కూడా పిలుస్తారు.

శ్రవణబెళగొళ... దక్షిణ భారతదేశంలో     జైనుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతాన్ని 'దక్షిణ కాశి' అని కూడా పిలుస్తారు.

శ్రవణబెళగొళ... దక్షిణ భారతదేశంలొ    జైనుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతాన్ని 'దక్షిణ కాశి' అని కూడా పిలుస్తారు. శ్రవణబెళగొళకు చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. జైనుల క్షేత్రంగా ఉన్న  శ్రవణబెళగొళ మళ్లీ ఇన్నేళ్ళకు పర్యాటకులతో సందడి కానుంది. అందుకూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ వివరాలేవో ఇప్పుడు తెలుసుకుందాం..!!

కర్ణాటకలోని హసన్ జిల్లాలో శ్రవణబెళగొళ ఉంది. చరిత్ర విషయానికి వస్తే.. మౌర్యచంద్రగుప్తుడు యుద్ధ జీవితంతో విసిగి ఇక్కడికి వచ్చి ధ్యానంతో మనశ్శాంతి పొందినట్లు చెబుతారు. బెంగళూరుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రవణబెళగొళలో దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఎత్తైన గొమఠేశ్వరుడి  విగ్రహం(బాహుబలి విగ్రహం) ఉంది. పట్టణంలోకి ప్రవేశిస్తున్నప్పుడు కనుచూపు మేర నుంచే ఈ విగ్రహం కనిపిస్తుంది. అబూ కొండలు(రాజస్థాన్), ఉదయగిరి కొండలు (ఒడిశా) తరువాత జైనులకు పవిత్ర పుణ్యస్థలిగా శ్రవణబెళగొళ ఖ్యాతి గాంచింది. 

శ్రవణబెళగొళ మళ్లీ పర్యాటకులను ఆకర్షిస్తుండటానికి ప్రధాన కారణం గోమఠేశ్వరుడి విగ్రహం(బాహుబలి విగ్రహం). ఇక్కడ 12 ఏళ్లకోసారి లేదా పుష్కరానికోసారి భారీ వేడుక జరుగుతుంది. 58.8 అడుగుల ఎత్తున్న బాహుబలి విగ్రహానికి మహామస్తకాభిషేకం చేస్తారు. ఈ వేడుక ఫిబ్రవరి 7 నుండి 26 వరకు కన్నులపండుగగా జరగనుంది. క్రీ.శ.981లో ప్రతిష్టించిన ఈ విగ్రహానికి ప్రతి 12 ఏళ్లకొకసారి అభిషేకం జరుగుతుంది. పాలు, పెరుగు, నెయ్యి, కుంకుమ పూలు, బంగారునాణేలతో అభిషేకం చేస్తారు. 

మహామస్తకాభిషేకాన్ని తిలకించడానికి  దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. జైన మతస్థులతో పాటు ఇతర మతాలవారు కూడా ఈ భారీ వేడుకలకు హాజరుకానున్నారు. ఉత్సవంలో విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తారు.  ఆ మహత్తర ఘటాన్ని చూడాలే గానీ.. మాటల్లో వర్ణించలేము. 

శ్రవణబెళగొళ వెళ్లే పర్యాటకులు, భక్తులు సమీపంలో ఉన్న హాలిబేడు, బేలూరు ప్రాంతాలను సందర్శించవచ్చు. అలానే శృంగేరీ, కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయం, ధర్మస్థల వంటి పర్యాటక ప్రదేశాలను చూడవచ్చు. 

శ్రవణబెళగొళ ఎలా చేరుకోవాలి? 

శ్రవణబెళగొళ బెంగళూరుకు 150 కిలోమీటర్ల దూరంలో, మైసూర్‌కు 85 కిలోమీటర్ల దూరంలో  ఉంది. బెంగళూరు నుండి శ్రవణబెళగొళకు నిత్యం ప్రభుత్వ బస్సులు నడుస్తాయి. క్యాబ్, ప్రైవేట్ టాక్సీ లలో కూడా ప్రయాణించవచ్చు. సమీపంలో హసన్ రైల్వే స్టేషన్ కలదు.🙏🙏🙏
Read More

బాహుబలి కోసమే ఈ ఉత్సవాలు ప్రత్యేకం

బాహుబలి కోసమే ఈ ఉత్సవాలు ప్రత్యేకం
☀☀☀☀☀☀☀☀☀☀☀
శ్రవణబెళగొళ... దక్షిణ భారతదేశంలో     జైనుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతాన్ని 'దక్షిణ కాశి' అని కూడా పిలుస్తారు.

శ్రవణబెళగొళ... దక్షిణ భారతదేశంలొ    జైనుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతాన్ని 'దక్షిణ కాశి' అని కూడా పిలుస్తారు. శ్రవణబెళగొళకు చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. జైనుల క్షేత్రంగా ఉన్న  శ్రవణబెళగొళ మళ్లీ ఇన్నేళ్ళకు పర్యాటకులతో సందడి కానుంది. అందుకూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ వివరాలేవో ఇప్పుడు తెలుసుకుందాం..!!

కర్ణాటకలోని హసన్ జిల్లాలో శ్రవణబెళగొళ ఉంది. చరిత్ర విషయానికి వస్తే.. మౌర్యచంద్రగుప్తుడు యుద్ధ జీవితంతో విసిగి ఇక్కడికి వచ్చి ధ్యానంతో మనశ్శాంతి పొందినట్లు చెబుతారు. బెంగళూరుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రవణబెళగొళలో దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఎత్తైన గొమఠేశ్వరుడి  విగ్రహం(బాహుబలి విగ్రహం) ఉంది. పట్టణంలోకి ప్రవేశిస్తున్నప్పుడు కనుచూపు మేర నుంచే ఈ విగ్రహం కనిపిస్తుంది. అబూ కొండలు(రాజస్థాన్), ఉదయగిరి కొండలు (ఒడిశా) తరువాత జైనులకు పవిత్ర పుణ్యస్థలిగా శ్రవణబెళగొళ ఖ్యాతి గాంచింది. 

శ్రవణబెళగొళ మళ్లీ పర్యాటకులను ఆకర్షిస్తుండటానికి ప్రధాన కారణం గోమఠేశ్వరుడి విగ్రహం(బాహుబలి విగ్రహం). ఇక్కడ 12 ఏళ్లకోసారి లేదా పుష్కరానికోసారి భారీ వేడుక జరుగుతుంది. 58.8 అడుగుల ఎత్తున్న బాహుబలి విగ్రహానికి మహామస్తకాభిషేకం చేస్తారు. ఈ వేడుక ఫిబ్రవరి 7 నుండి 26 వరకు కన్నులపండుగగా జరగనుంది. క్రీ.శ.981లో ప్రతిష్టించిన ఈ విగ్రహానికి ప్రతి 12 ఏళ్లకొకసారి అభిషేకం జరుగుతుంది. పాలు, పెరుగు, నెయ్యి, కుంకుమ పూలు, బంగారునాణేలతో అభిషేకం చేస్తారు. 

మహామస్తకాభిషేకాన్ని తిలకించడానికి  దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. జైన మతస్థులతో పాటు ఇతర మతాలవారు కూడా ఈ భారీ వేడుకలకు హాజరుకానున్నారు. ఉత్సవంలో విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తారు.  ఆ మహత్తర ఘటాన్ని చూడాలే గానీ.. మాటల్లో వర్ణించలేము. 

శ్రవణబెళగొళ వెళ్లే పర్యాటకులు, భక్తులు సమీపంలో ఉన్న హాలిబేడు, బేలూరు ప్రాంతాలను సందర్శించవచ్చు. అలానే శృంగేరీ, కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయం, ధర్మస్థల వంటి పర్యాటక ప్రదేశాలను చూడవచ్చు. 

శ్రవణబెళగొళ ఎలా చేరుకోవాలి? 

శ్రవణబెళగొళ బెంగళూరుకు 150 కిలోమీటర్ల దూరంలో, మైసూర్‌కు 85 కిలోమీటర్ల దూరంలో  ఉంది. బెంగళూరు నుండి శ్రవణబెళగొళకు నిత్యం ప్రభుత్వ బస్సులు నడుస్తాయి. క్యాబ్, ప్రైవేట్ టాక్సీ లలో కూడా ప్రయాణించవచ్చు. సమీపంలో హసన్ రైల్వే స్టేషన్ కలదు.🙏🙏🙏
Read More

Powered By Blogger | Template Created By Lord HTML