.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

5, మార్చి 2018, సోమవారం

#యమలోకం ఎంతదూరం లో ఉందో తెలుసా?🤔



#యమలోకం ఎంతదూరం లో ఉందో తెలుసా?🤔

గరుడ పురాణంలో నరకం గురించి చాలా విషయాలే చెప్పారు.. గరుడ పురాణంలోనే కాదు.. ఇస్లాం, క్రిస్టియానిటీలోనూ నరకం గురించి, గేట్స్‌ ఆఫ్‌ హెల్‌ గురించి సవివరంగా ఉంది.. నరకం ద్వారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి అన్న విషయాలు ఈ గ్రంథాల్లో స్పష్టంగానే వివరణలు కనిపిస్తాయి. వీటిని ఆధారం చేసుకుని నిర్వహించిన పరిశోధనలు ఇదిగో ఫలితాలను ఇచ్చాయి. నరకం ఎలా ఉంటుందో మనం జీవించి ఉండే, స్పష్టంగా చూసేయొచ్చు.

యమపురి-పాపులకు శిక్షలు విధించే సుప్రీం కోర్టు..
😯భూమికి 86 వేల యోజనాల దూరంలో ,అంటే సుమారు మనకు ఏడు లక్షల కిలోమీటర్ల దూరంలో నరకం ఉంది. నరకానికి దారిలో 16 చిన్న యమ నగరాలు ఉన్నట్లు గరుడ పురాణం చెప్తుంది🤔.

వైతరణీ నదీ వైశాల్యాన్ని మినహాయించి యమపురి 86 వేల ఆమడల దూరంలో ఉంది. ఆమడ అంటే యోజనం. నాలుగు క్రోసుల దూరం ఒక ఆమడ. మరణానంతరం జీవుడు ఈ మార్గాన్ని ఒక రాత్రి, ఒక పగలు (మొత్తం ఒక్క రోజు కాలంలో) 247 ఆమడల చొప్పున నడుస్తూ 😮సౌమ్యము, సౌరి, నాగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, బహ్వా పద, దుఃఖద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, శీతాడ్య, బహుభీతి😯 అనే #పదహారుపురములను దాటుకుని యమపురికి చేరుతాడు. #ఊనషాణ్మాసికం (171 వ రోజు) పిండాలు భుజించిన తరువాత యముని సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే ,😯విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరతాడట. అక్కడ నుంచే వైతరణి దాటాలి.

మనిషి చనిపోయిన తరువాత జీవుడు ఈ నగరాల మీదుగానే వెళ్తాడట. చనిపోయిన తరువాత 🔥13 రోజుల పాటు కర్మకాండ జరిగినంత సేపు అతను భూమిపైనే ఉంటాడు. పుత్రులు సమర్పించే పిండాన్ని ప్రేతరూపంలో స్వీకరించి, కర్మ భాగాన్నిఅందుకున్న తరువాత 14వ రోజున యమపురికి బయలుదేరుతాడు. రోజుకు పగలూ రాత్రి కలిసి 247 యోజనాలు అంటే సుమారు 😵రెండు వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడట.. మొత్తం 348రోజులు పూర్తయిన తరువాత అంటే సరిగ్గా చనిపోయిన ఒక ఏడాదికి మూడు రోజుల ముందు తన గమ్యమైన ప్రధాన నరకానికి చేరుతాడు. మార్గమధ్యంలో 16 నగరాలను అతను చూసి వెళ్లాల్సి ఉంటుంది... 361 రోజునుంచి 😮మూడు రోజుల పాటు భూమిపై ఆ జీవునికి #సంవత్సరీకం జరుగుతుంది.. దానితో జీవుడు భూమి నుంచి అన్ని సంబంధాలతో ముక్తుడవుతాడు.

నరకానికి దక్షిణం వైపున వైతరిణి నది ఉంటుంది.. ఇది రక్తమాంసాలతో అతి భయంకరంగా ఉంటుంది. పాపాలు చేసిన వాళ్లు ఈ నదిని దాటి నరకంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. పాపికి తొలి హర్డిల్‌ ఇదే. ఇది వంద యోజనాల పొడవుంటుంది. .

పునరపి జననం, పునరపి మరణం అంటారు… అంటే చనిపోయిన వాళ్లు మళ్లీ పుడతారు అని… మరణం శరీరానికే గాని ఆత్మకి లేదని మన పురాణాల ప్రకారం మనకి తెలిసిన విషయం. మనిషి లేదా జీవి చనిపోవడం అంటే… ఆజీవిలోని ఆత్మ, శరీరాన్ని వదలి భయటికి వెళ్లిపోవడమే… శరీరాన్ని వదిలి బయటికి వెళ్ళిపోయిన ఆత్మ తరువాత ఏమౌతుంది? ఎక్కడికి వెళుతుంది? ఎలా వెళుతుంది? అసలు ఆత్మ ఏరూపంలో ఉంటుంది? మన సినిమాల్లో చూపినట్టు… శరీర రూపంలోనే ఉంటూ… గాల్లో విహారిస్తుందా??? ఎలా ఎన్నో ప్రశ్నలతో పాటు అమెరికాకి చెందిన #మెక్_డగెల్ అనే డాక్టర్ కమ్ సైంటిస్ట్ ఇంకో విచిత్రమైన అనుమానం కూడా కలిగింది.

అదేమిటంటే… 👉ఆత్మ బరువు ఎంత అని???👈

వినడానికి విచిత్రంగా ఉన్నా ఆయన దానిమీద ఎన్నో పరిశోధనలు చేసి చివరకి #ఆత్మ_బరువు 🙄21 గ్రాములని డిసైడ్ అయ్యాడు. 21 గ్రాముల బరువు ఎలా వచ్చిందో… ఆయన ప్రయోగం ఏమిటో… అది ఎంత వరకు సహేతుకమో ఒకసారి చూద్దాం.

మరణానికి సమీపంలో ఉన్న వ్యక్తి పడుకున్న బెడ్ కు బరువును కొలిచే పరికరాన్ని అమర్చాడు. పేషెంట్ మరణానికి కంటే కొన్ని సెకన్ల ముందు అతని బరువును, అలాగే మరణించిన వెంటనే అతడి బరువును కొలిచాడు. ఈ రెండు బరువుల మద్య తేడా 21 గ్రాములుగా తేలింది. తగ్గిన ఈ 21 గ్రాముల బరువు మనిషి యొక్క ఆత్మదే అని ప్రకటించాడు డగెల్.

అయితే ఈ ప్రయోగంపై చాలా మంది డాక్టర్లు, సైంటిస్ట్లు ఈప్రయోగాన్ని వ్యతిరేకించారు.మనిషి చనిపోయాక…అతడి శ్వాసక్రియ ఆగుతుందని, గుండె, ఊపిరితిత్తులు పనిచేయడం ఆపుతాయని, ఇంకా శరీర అతర్భాగంగా జరిగే ప్రతీక్రియ ఆగుతుందని..అందుకే చనిపోయాక మనిషి బరువులో 21 గ్రాముల తేడా వస్తుందని ఇతర డాక్టర్ల వాదన. జవాబులని ఈజీగా కొట్టిపారేయవచ్చు గాని ప్రశ్నలని తేలికగా తీసుకోకూడదు… ఎందుకంటే న్యూటన్ మహాశేయుడికి వచ్చిన ఒక్క ప్రశ్న ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది… అలాగే ఎన్నో ప్రశ్నలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML