.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

17, జూన్ 2025, మంగళవారం

మంత్ర విశిష్టత..ఫలితాలు

 #మంత్ర విశిష్టత..ఫలితాలు


#మంత్ర తంత్రాలు మనిషి జీవితంలోని గ్రహదోషాలకు పరిష్కార మార్గాలు చూపిస్తాయి. దేనికి ఏ మంత్రం పఠిస్తే ఎలాంటి పరిష్కార మార్గం లభిస్తుందో మీ కోసం.....


#వ్యాపార లాభాలకు మంత్రం:.

1. దుర్గే శివే భయనాశిని మాయే నారాయణి సనాతని

జయే మే పత్య దేహేదేహిన్‌ రక్షరక్ష కృపాకరీ 

2. ఓం నమో ప్రీం పీతాంబరాయ నమః


#మంత్రం::

శివశక్తి కామక్షితి రధ రవి శ్శీతకిరణం స్మరో హంస శక్రస్త

ధనుజ పరామార హరయః 

అమీ హృల్లేకాభిఃతి స్వభావ రసానేషు ఘటితా

భజన్తే వర్ణాస్తే తవ జననీ నామావయవతాం


#హనుమాన్‌ శత్రుంజయ మంత్రం:

ఓం నమో భగవతే మహాబల పరాక్రమాయ మహా విపత్తి నివారణాయ

భక్తజన మనోభీష్ట కల్పనాకల్ప ధ్రుమాయ 

దుష్టజన మనోరథ స్తంభనాయ 

ప్రభంజన ప్రాణప్రియాయ శ్రీం


#ధనప్రద శ్రీ లక్ష్మీ కుబేర మంత్రం:


కుబేరో ధన దః శ్రీ దః రాజరాజో ధనేశ్వరః

ధనలక్ష్మీ ప్రయతమో ధనాడ్యో ధనిక ప్రియః

ఓం శ్రీం క్లీం శ్రీం కార్యసిద్థి కుబేరాయ నమః

ఓం శ్రీం క్లీం శ్రీం లక్ష్మీ కుబేరాయ నమః

ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం యుక్తేశ్వరాయ నమః

ఓం యక్షాయవిద్మహే వైశ్రవణాయ ధీమహే

తన్నో కుబేర ప్రచోదయాత్‌


#విద్యా విజయానికి మంత్రాలు..

1. ఆనంద తీర్థ వరదే దానవారణ్య పావకే

జ్ఞానదాయనే సర్వేశే శ్రీనివాసేస్తు మే మనః

2. శ్రీవేంకటేశా శ్రీనివాసా సర్వశత్రు వినాశకా 

త్వమేవ శరణం స్వామిన్‌ సర్వత్ర విజయం దిశా


#సంతాన గోపాల మంత్రం:

ఓం హ్రీం కృష్ణాయ హూం శ్రీం క్లీం గోవిందాయ ఫట్‌ స్వాహా

ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణా గోవిందా గోపీజన వల్లభా మమ పుత్ర దేహీ స్వాహా

దేవకీ సుత గోవిందా దేవదేవ జగత్పతే దేహిమే తనయే కృష్ణా తవమహం శరణం గతః


#విద్యాప్రాప్తికి సరస్వతీ స్తోత్రం:

సరస్వతీ మాం దృష్ట్యా వీణా పుస్తక ధారిణీం

హంస వాహన సమాయుక్తా విద్యాదాన కరే మమ

ప్రథమం భారతీనామా, ద్వితీయంచ సరస్వతీ

తృతీయ శారదాదేవీ, చతుర్థం హంస వాహిని

పంచమం జగతీ ఖ్యాతా, షష్ట్యం వాణీశ్వరీ తథా

కౌమారీ సప్తమం ప్రోక్తా, అష్టమం బ్రహ్మచారిణి

నవమం బుద్ధి ధాత్రీచా, దశమం వరదాయని

ఏకాదశం క్షుద్ర ఘంటా, ద్వాదశం భువనేశ్వరీ

ద్వాదశైతాని నామాని త్రిసంధ్య యః పఠేన్నరః

సర్వసిద్ధి ఖరీతస్య ప్రసన్న పరమేశ్వరీ 

సామేవసతు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతీ


#విజయానికీ సకల దోష నివారణకూ తగిన మంత్రాలు, స్తోత్రాలు......


#లక్ష్మీగణపతి:.

సర్వవిజ్ఞ హరం దేవం సర్వవిజ్ఞ వివర్జితం 

సర్వసిద్ధి ప్రదాతారం లక్ష్మీగణపతిం భజే


#క్షమాపణకు:.

నారాసింహానంత గోవిందా భూతభావన కేశవా 

దురుక్తం దుష్కృతం ధ్యాతం శమయాషు జనార్దనా


#సర్వఫలప్రదభైరవ స్తోత్రం:

ఓం భైరవాయ అనిష్ట నివారణాయ స్వాహా

మమ సర్వేగ్రహ అనిష్ట నివారణాయ స్వాహా 

జ్ఞనం దేహి ధనం దేహి మమ దారిద్య్రం నివారణాయ స్వాహా

సుతం దేహి యశం దేహి మమ గృహక్లేశం నివారణాయ స్వాహా

స్వాస్థ్యం దేహి బలం దేహి మమ శత్రు నివారణాయ స్వాహా

సిద్ధం దేహి జయం దేహి మమ సర్వ రుణాం నివారణాయ స్వాహా


#దీర్ఘాయువుకూ, చిరంజీవత్వానికి:

అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంచ్ఛ విభీషణః

కృపః పరశురామాచ్ఛ సప్తైతే చిరంజీవి నమః

సప్తైతాన్‌ సంస్మరే నిత్యం మార్కండేయ మదాష్టకం 

జీవేద్వర్ష శతంశోపి సర్వవ్యాధి వివర్జితః


#విద్యావిజయంకరీ మంత్రం:

ఓం ఐం హ్రీం హ్రీం క్లీం క్లీం హౌం సః 

నీల సరస్వతే నమః 

(ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం కనీసం 11సార్లు 

లేదా 108సార్లు జపిస్తే సత్వర విద్యాభివృద్ధి కలుగుతుంది)


#సత్వర వివాహానికి - దాంపత్య దోష నివారణకు...

1. కాత్యాయనీ మహాభాగే మహాయోగిన్‌ యతీశ్వరీ 

నందగోప సుతం దేవీ పతిమే కురుతే నమః

2. అనాకలిత సాదృశ్య చుబుక విరాజితః

కామేశ బద్ద మాంగల్య సూత్ర శోభిత కందర

3. విదేహి కళ్యాణం విదేహీ పరమాశ్రయం 

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజమే

3 సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే 

శరణ్యే త్రయంబకే దేవీ నారాయణే నమోస్తుతే

గమనిక: రుక్మిణీ కల్యాణం పారాయణం చేయటం కూడా మంచిది


#మంగళచండికా స్తోత్రం:

రక్షరక్ష జగన్మాతా దేవీ మంగళ చండికే

హారికే విపదం రక్షే హర్ష మంగళ కారికే

హర్ష మంగళ దక్షేచా హర్ష మంగళ దాయినే

శుభే మంగళ దక్షేచా శుభే మంగళ చండికే

మంగళే మంగళా ర్హేచా సర్వమంగళ మంగళే

సదా మంగళాదేవీ సర్వేశాం మంగళలయే


#భార్యాభర్తల పరస్పర ఆకర్షణకు...

ద్రాం ద్రవిణే బాణాయ నమః

ద్రీం సంక్షోభణ బాణాయ నమః

క్లీం ఆకర్షణ బాణాయ నమః

బ్లూం వశీకరణ బాణాయ నమః

సం సమ్మోహన బాణాయ నమః


#పురుషత్వం,సంతాన ప్రాప్తికి....

కథాకాళేమాతః కథయా కళితాలక కరశం

పిబేయం విద్యార్థీ తవచరణ నిర్లేజన జలం

ప్రకీర్తా మూకనామ పిచకలితాకారణ తయా 

యథాదత్తే వాణీముఖ కమల తాంబూల రసతాం


#శీఘ్ర వివాహానికి..

కన్య నిత్యం స్నానానంతరం తులసి చెట్టుకు 

12 ప్రదక్షిణాలు చేసి గౌరీమాతను ప్రార్థిస్తూ సౌందర్యలహరిలోని 4,11,27 శ్లోకాలలో 

ఏదో ఒకదాన్ని పఠించాలి. 

ఇలా 120 రోజులు చేస్తే త్వరగా వివాహమవుతుంది.🙏🙏🙏

Read More

సర్వ గాయత్రి మంత్రములు ... గాయత్రీ మంత్రం రకములు, రూపాలు

*శతగాయత్రి_మంత్రావళి_విశిష్ఠతలు*

బ్రహ్మ గాయత్రి :-
1. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//
2. తత్పురుషాయ విద్మహే చతుర్ముఖాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//
3. సురారాధ్యాయ విద్మహే వేదాత్మనాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్. //

విష్ణు గాయత్రి :-
4. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //
5. లక్ష్మీనాధాయ విద్మహే చక్రధరాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్//
6. దామోదరాయ విద్మహే చతుర్భుజాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //

శివ గాయత్రి :-
7. శివోత్తమాయ విద్మహే మహోత్తమాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //
8. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్.//
9. సదాశివాయ విద్మహే జటాధరాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్//
10. పంచవక్త్రాయ విద్మహే అతిశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ //
11. గౌరీనాధాయ విద్మహే సదాశివాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //
12. తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //

వృషభ గాయత్రి :-
13. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//
14. తీష్ణశృంగా విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//

చండీశ్వర గాయత్రి :-
15. ద్వారస్థితాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//
16. చండీశ్వరాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//

భృంగేశ్వర గాయత్రి :-
17. భృంగేశ్వరాయ విద్మహే శుష్కదేహాయ ధీమహి తన్నోభృంగి ప్రచోదయాత్.//

వీరభద్ర గాయత్రి :-
18. కాలవర్ణాయ విద్మహే మహాకోపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//
19. చండకోపాయ విద్మహే వీరభద్రాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//
20. ఈశపుత్రాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//

శిఖరగాయత్రి :-
21. శీర్ష్యరూపాయ విద్మహే శిఖరేశాయ ధీమహి తన్న స్థూపః ప్రచోదయాత్.//

ధ్వజగాయత్రి :-
22. ప్రాణరూపాయ విద్మహే త్రిమేఖలాయ ధీమహి తన్నోధ్వజః ప్రచోదయాత్.//

దత్త గాయత్రి :-
23. దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్.//

శాస్త [అయ్యప్ప] గాయత్రి :-
24.భూతనాధాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నశ్శాస్తా ప్రచోదయాత్.//

సుదర్శన గాయత్రి :-
25. సుదర్శనాయ విద్మహే జ్వాలాచక్రాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//
26. సుదర్శనాయ విద్మహే యతిరాజాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//

మత్స్య గాయత్రి :-
27. జలచరాయ విద్మహే మహామీనాయ ధీమహి తన్నోమత్స్యః ప్రచోదయాత్.//

కూర్మ గాయత్రి :-
28. కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నోకూర్మ: ప్రచోదయాత్.//

వాస్తుపురుష గాయత్రి :-
29. వాస్తునాధాయ విద్మహే చతుర్బుజాయ ధీమహి తన్నో వాస్తుః ప్రచోదయాత్.//

శ్రీ గణపతి గాయత్రి :-
30. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.//
31. ఆఖుధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.//

శ్రీ కృష్ణ గాయత్రి :-
32. దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//
33. గోపాలకాయ విద్మహే గోపీ ప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//
34. వాసుదేవాయ విద్మహే రాధాప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//

శ్రీ రామ గాయత్రి :-
35. దాశరధాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//
36. ధర్మ రూపాయ విద్మహే సత్యవ్రతాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//

శ్రీ ఆంజనేయ గాయత్రి :-
37. ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.//
38. పవనాత్మజాయ విద్మహే రామభక్తాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.//

శ్రీ హయగ్రీవ గాయత్రి :-
39. వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హగ్ం సహః ప్రచోదయాత్.//

శ్రీ స్కంద గాయత్రి :-
40. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//
41. తత్పురుషాయ విద్మహే శిఖిధ్వజాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//
42. షడాననాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//

శ్రీ సుబ్రహ్మణ్య గాయత్రి :-
43. భుజగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//
44. కార్తికేయాయ విద్మహే వల్లీనాధాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//

శ్రీ గరుడ గాయత్రి :-
45. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్.//

శ్రీ అనంత గాయత్రి :-
46. అనంతేశాయ విద్మహే మహాభోగాయ ధీమహి తన్నో నంతః ప్రచోదయాత్.//

శ్రీ ఇంద్రాద్యష్టదిక్పాలక గాయత్రి :-
47. దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్రః ప్రచోదయాత్.//
48. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్.//
49. కాలరూపాయ విద్మహే దండధరాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్.//
50. ఖడ్గాయుధాయ విద్మహే కోణ స్థితాయ ధీమహి తన్నో నిఋతిః ప్రచోదయాత్.//
51. జలాధిపాయ విద్మహే తీర్థరాజాయ ధీమహి తన్నో పాశిన్ ప్రచోదయాత్.//
52. ధ్వజహస్తయ విద్మహే ప్రాణాధిపాయ ధీమహి తన్నో వాయుః ప్రచోదయాత్.//
53. శంఖ హస్తయ విద్మహే నిధీశ్వరాయ ధీమహి తన్నో సోమః ప్రచోదయాత్.//
54. శూలహస్తయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ఈశః ప్రచోదయాత్.//

శ్రీ ఆదిత్యాది నవగ్రహ గాయత్రి :-
55. భాస్కరాయ విద్మహే మహా ద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్.//
56. అమృతేశాయ విద్మహే రాత్రించరాయ ధీమహి తన్న శ్చంద్రః ప్రచోదయాత్.//
57. అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో కుజః ప్రచోదయాత్.//
58. చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్.//
59. సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్.//
60. భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్.//
61. రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నో శనిః ప్రచోదయాత్.//
62. శీర్ష్యరూపాయ విద్మహే వక్రఃపంథాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్.//
63. తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్.//

శ్రీ సాయినాథ గాయత్రి :-
64. జ్ఞాన రూపాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నస్సాయీ ప్రచోదయాత్.//

శ్రీ వేంకటేశ్వర గాయత్రి :-
65. శ్రీ నిలయాయ విద్మహే వేంకటేశాయ ధీమహి తన్నోహరిః ప్రచోదయాత్.//

శ్రీ నృసింహ గాయత్రి :-
66. వజ్రనఖాయ విద్మహే తీష్ణదగ్ ష్ట్రాయ ధీమహి తన్నః సింహః ప్రచోదయాత్.//

శ్రీ లక్ష్మణ గాయత్రి :-
67. రామానుజాయ విద్మహే దాశరధాయ ధీమహి తన్నః శేషః ప్రచోదయాత్.//

శ్రీ క్షేత్రపాల గాయత్రి :-
68. క్షేత్రపాలాయ విద్మహే క్షేత్రస్థితాయ ధీమహి తన్నః క్షేత్రః ప్రచోదయాత్.//

యంత్ర గాయత్రి :-
69. యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నోః యంత్రః ప్రచోదయాత్.//

మంత్ర గాయత్రి :-
70. మంత్రరాజాయ విద్మహే మహా మంత్రాయ ధీమహి తన్నోః మంత్రః ప్రచోదయాత్.//

శ్రీ సరస్వతీ గాయత్రి :-
71. వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నోవాణీః ప్రచోదయాత్.//

శ్రీ లక్ష్మీ గాయత్రి :-
72. మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.//
73. అమృతవాసిని విద్మహే పద్మలోచని ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.//

శ్రీ గౌరి గాయత్రి :-
74. గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//
75. మహా దేవ్యైచ విద్మహే రుద్ర పత్న్యై చ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//

శ్యామలా గాయత్రి :-
76. శుకప్రియాయ విద్మహే క్లీం కామేశ్వరి ధీమహి తన్నః శ్యామలా ప్రచోదయాత్.//
77. మాతంగేశ్వరి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నః క్లిన్నే ప్రచోదయాత్.//

భైరవ గాయత్రి :-
78. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నో భైరవీ ప్రచోదయాత్.//

శక్తి గాయత్రి :-
79. త్రిపురాదేవి విద్మహే సౌః శక్తీశ్వరి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.//

శ్రీ కన్యకాపరమేశ్వరీ గాయత్రి :-
80. బాలారూపిణి విద్మహే పరమేశ్వరి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.//
81. త్రిపురాదేవి విద్మహే కన్యారూపిణి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.//

శ్రీ బాలా గాయత్రి :-
82. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరిచ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్.//

శ్రీ సీతా గాయత్రి :-
83. మహాదేవ్యైచ విద్మహే రామపత్న్యై చ ధీమహి తన్నః సీతా ప్రచోదయాత్.//

శ్రీ దుర్గా గాయత్రి :-
84. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్.//

శ్రీ శూలినీ దుర్గా గాయత్రి :-
85. జ్వాలామాలిని విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్.//

శ్రీ ధరా గాయత్రి :-
86. ధనుర్దరాయ విద్మహే సర్వసిద్దించ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్.//

శ్రీ హంస గాయత్రి :-
87. హంసహంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్.//

శ్రీ ముక్తీశ్వరీ గాయత్రి :-
88. త్రిపురాదేవి విద్మహే ముక్తీశ్వరీ ధీమహి తన్నో ముక్తిః ప్రచోదయాత్.//

శ్రీ గంగా దేవీ గాయత్రి :-
89. త్రిపధగామినీ విద్మహే రుద్రపత్న్యై చ ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.//
90. రుద్రపత్న్యై చ విద్మహే సాగరగామిని ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.//

శ్రీ యమునా గాయత్రి :-
91. యమునా దేవ్యైచ విద్మహే తీర్థవాసిని ధీమహి తన్నో యమునా ప్రచోదయాత్.//

శ్రీ వారాహీ గాయత్రి :-
92. వరాహముఖి విద్మహే ఆంత్రాసనిచ ధీమహి తన్నో వారాహీ ప్రచోదయాత శ్రీ చాముండా గాయత్రి :-
93. చాముండేశ్వరి విద్మహే చక్రధారిణి ధీమహి తన్నః చాముండా ప్రచోదయాత్.//

శ్రీ వైష్ణవీ గాయత్రి :-
94. చక్రధారిణి విద్మహే వైష్ణవీ దేవి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.//

శ్రీ నారసింహ గాయత్రి :-
95. కరాళిణిచ విద్మహే నారసింహ్యైచ ధీమహి తన్నః సింహేః ప్రచోదయాత్.//

శ్రీ బగాళా గాయత్రి :-
96. మహాదేవ్యైచ విద్మహే బగళాముఖి ధీమహి తన్నో అస్త్రః ప్రచోదయాత్.//

శ్రీ సాంబ సదాశివ గాయత్రి :-
97. సదాశివాయ విద్మహే సమాస్రాక్షాయ ధీమహి తన్నః సాంబః ప్రచోదయాత్.//

శ్రీ సంతోషీ గాయత్రి :-
98. రూపాదేవీచ విద్మహే శక్తిరూపిణి ధీమహి తన్నస్తోషి ప్రచోదయాత్.//

శ్రీ లక్ష్మీ గణపతి గాయత్రి :-
99. తత్పురుషాయ విద్మహే శక్తియుతాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//
100. దశభుజాయ విద్మహే వల్లభేశాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//

సర్వే జనాః స్సుఖినోభవంతు..!
Read More

15, జూన్ 2025, ఆదివారం

🎻🌹🙏 వేల ఏళ్ళుగా శివయ్య ను అభిషేకిస్తున్న నంది

 🎻🌹🙏 వేల ఏళ్ళుగా శివయ్య ను  అభిషేకిస్తున్న నంది...!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌿ఈ ఒక్క క్షేత్రం యొక్క విశిష్టత చాలు మన పూర్వ భారతీయులు ఎంతగా ఆధునిక విజ్ఞానాన్ని అభివృద్ధి చేశారో తెలుస్తుంది.


🌸నిజంగా ఎలాంటి మోటార్ సాయం లేకుండా వేల సంవత్సరాల నుండి ఈ క్షేత్రంలో ఉన్న నంది,కింద భాగంలో ఉన్న శివ లింగాన్ని నిరంతరం అభిషేకం చేస్తూనే ఉంది.


🌿ఈ పుణ్యక్షేత్రం పేరు దక్షిణాముఖ నంది తీర్థ కల్యాణి క్షేత్రం. దీన్ని నంది తీర్థం అని మరియు బసవ తీర్థం అని కూడా పిలుస్తారు


🌸ఈ క్షేత్రం బెంగుళూరులోని మల్లేశ్వరం దగ్గరలో ఉంది.గంగమ్మ ఆలయం దగ్గరలో ఈ క్షేత్రం ఉంటుంది.


🌿ఈ క్షేత్రం లోపల పైన భాగంలో నంది,రాతికప్పు క్రింది భాగంలో శివ లింగం ప్రతిష్టించబడి ఉన్నాయి.


🌸 అయితే పైన నంది నోటి నుండి జాలు వారుతున్న నీరు రాతి కప్పుకున్న రంధ్రం ద్వారా శివలింగం పై పడి,అక్కడ శివలింగం నుండి కల్యాణి తీర్థంలోకి వెళ్ళిపోతాయి.


🌿 అయితే ఆ కల్యాణి తీర్థంలో ఒక సుడి గుండం ఉంది.ఆ సుడి గుండం ద్వారా నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయో మాత్రం ఎవరికి తెలియదు. 


🌸ఇప్పటి వరకు ప్రపంచ శాస్త్రవేత్తలు కూడా ఈ తీర్థంలోని నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయో కనిపెట్టలేకపోయారు.


🌿కానీ అలా సుడి గుండం ద్వారా వెళ్తున్న నీరు చాలా లోతు వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి నంది నోటి నుండి వస్తాయని మన భారతీయ వేద శాస్త్రవేత్తలు చెప్తున్నారు.


🌸ఇలాంటి పంపింగ్ పద్దతిని మన వేద జ్ఞానాన్ని ఉపయోగించి మన పూర్వ భారతీయ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు నిర్మించారని చెప్తున్నారు. 


🌿ఎందుకంటే కల్యాణి తీర్థంలో నీరు ఎప్పుడు నిండటం లేదు అలాగే తగ్గటం కూడా లేదు మరియు నంది నోటి నుండి నిరంతరం నీరు వస్తూనే ఉంది కానీ ఆగడం లేదు.


🌸ఇలా మోటార్ లేకుండా ప్రపంచంలో మొట్ట మొదటి పంపింగ్ సిస్టమ్ ని తయారు చేసింది మన పూర్వ భారతీయ ఇంజనీర్ లు,శాస్త్రవేత్తలే.


🌿ఇక్కడ నంది ఏ శివ క్షేత్రంలో లేని విధంగా దక్షిణ వైపుగా ముఖం పెట్టి ఉంటుంది ఇది ప్రత్యేకం...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Read More

అరుణాచలేశ్వరుడు

అరుణాచలేశ్వరుడు 

మనకి అష్టమూర్తి తత్త్వము అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు. అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు సాకారోపాసన శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు. కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతగుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యాజమాన లింగం – ఈ ఎనిమిది అష్టమూర్తులు. ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే. కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు.

అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు. అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది. అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ్గంగా ఒక గీత పెట్టబడుతుంది. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర. అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు. అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది. కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. అరుణాచల ప్రవేశామునకు ఈశ్వరానుగ్రహం కావాలి. అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.

అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు. అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు. అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.

మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు. 

దర్శనాత్ అభ్రశదసి జననాత్ కమలాలే స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!

స్మరణము మనసుకు సంబంధించినది. మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు. కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాషిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది. అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది. దాని పేరే అరుణాచలం. అచలము అంటే కొండ. దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది. ఆకొండ అంతా శివుడే. అక్కడ కొండే శివుడు. కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి. గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి. ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గురి ఉంటుంది. అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు. అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది. ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి. ఈ యమ లింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి. అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది. 

ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది. అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి. ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు. అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగాస్థానం. కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి. 

అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు.  అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది. 

మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది. అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది. అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు. 

అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు. అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం. ఈ గోపురమును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు. ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి. అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది. అప్పడికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు. ‘ఈశ్వరా నేను ఐశ్వర్యవంతురాలను కాను. నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని చందా ఇవ్వమని అడిగేది. ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది. అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు. అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది. తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.

అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది. రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు. ఆ తరువాత కుడివైపుకు వెడితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది. అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది. తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది. ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు. అటువంటి పరమ పావనమయిన క్షేత్రం. 

ఇది దాటగానే ఒక పెద్ద నంది కనపడుతుంది. దానిని మొదటి నంది అంటారు. దానిని దాటి ప్రాకారం లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనపడుతుంది. అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది. అయ్యవారికి ఇటువైపున అపీతకుచాంబ అనే పేరుతొ పార్వతీదేవి ఉంటుంది. 

ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్సు స్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనపడుతుంది. ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసమునకు మూసినా కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోషపరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి ‘పచ్చయ్యమ్మన్’ అనే పేరుతో అరుణ గిరియందు వెలసింది. పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నాకోసం

Read More

Powered By Blogger | Template Created By Lord HTML