
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
.

గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

Monday, July 31, 2017
ద్విజుడు అంటే బ్రాహ్మణుడు అని కాదు మరి...?
ద్విజుడు అంటే బ్రాహ్మణుడు అని కాదు
మరి...?
సాధారణంగా ద్విజుడు అనగానే బ్రాహ్మణుడు గుర్తుకు రావడం పరిపాటి. కాని అది సరి కాదు. మనకు నాలుగు రకాల వర్ణాలు వున్నాయన్నది విదితమే. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర వర్ణాలు. అందరూ సమానమే. ఎవరూ గొప్ప కాదు. ఎవరూ తక్కువ కాదు. ఇక్కడ ఉపనయనం జరిగితే అతడు వేద పఠనానికి అర్హుడు అవడం తద్వారా ద్విజుడుగా పిలువబడటం జరుగుతుంది. అయితే వేద పఠనం సాధారణంగా బ్రాహ్మణులే తరతరాలుగా చేయుచున్నారు కాబట్టి వారికి ఆ పేరును ఆపాదించేయటం జరిగింది. నిజానికి పుట్టుకతో సంబంధం లేకుండా వేదం చదువుకోవాలన్న ఆసక్తి ఆ సారం గ్రహించిన ఙ్ఞానినే బ్రాహ్మణుడు అంటారు. ఇది గుణం. అలాగే నాలుగు వర్ణాలలో వారిలో ఎవరైనా సరే వేదాధ్యయనానికి అర్హులే. వారికి అనురక్తి వుంటే చాలు. వారిలో ఆ సారంగ్రహించిన వాల్లు ఉపనయన సంస్కారం జరిపించుకున్న వారు ద్విజులే. నాలుగు వర్ణాలుగా పిలుచుకుంటున్నా కూడా అవన్నీ కర్మ లేదా బుద్ది సంబంధిత గుణాలే. గుణం విద్యపై వుంటే బ్రాహ్మణుడు, పాలన పై వుంటే క్షత్రియుడు, వ్యాపారంపై వుంటే వైశ్యుడు, ఇతర కార్మిక కర్షక వృత్తులపై వుంటే శూద్రులు.
మనిషి భావజాలంలో మార్పులు వలన ఒకటి తక్కువ మరొకటి ఎక్కువలా కనిపిస్తాయి కాని నిజానికి అంతా పవిత్రములే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment