.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

9, డిసెంబర్ 2017, శనివారం

శ్రీ కూర్మం - క్షేత్ర దర్శనంశ్రీ కూర్మం - క్షేత్ర దర్శనం

మహావిష్ణువు దశావతారాల్లో రెండోది కూర్మావతారం. ఈ రూపంలో ఉన్న ఏకైక ఆలయం శ్రీకూర్మం. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ఆలయం లేదు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో.. శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌కు 27 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో ఉందీ ఆలయం. బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగానూ ఈ ఆలయం ప్రసిద్ధి. అంతేకాదు మరెన్నో విశిష్ఠతలు ఈ ఆలయం సొంతం. ఎక్కడా లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి. స్వామివారు కూడా పడమటి ముఖంగా ఉండడం మరో ప్రత్యేకత. కూర్మనాథుడి ఆలయంతో పాటు శ్రీరామానుజాచార్యులు, శ్రీ వరద రాజస్వామి, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాలు కూడా ఈ ప్రాంగణంలోనే ఉంటాయి. పవిత్ర పుష్కరిణి, విశాలమైన ప్రాకారంతో పాటు కూర్మవతారానికి నిజరూపమైన తాబేళ్లు ఇక్కడ కనువిందు చేస్తాయి.
స్థల పురాణం
పూర్వం దేవ దానవులు అమృతం కోసం క్షీర సాగరాన్ని మదించడానికియత్నించి, మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. కింద ఆధారం లేకపోవడంతో ఆ పర్వతం నిలవలేదు. దాంతో దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా.. విష్ణువు తాబేలు అవతారమెత్తి మందర పర్వతానికి ఆధారంగా నిలిచాడని కూర్మ పురాణం చెబుతోంది. ఆ రూపాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీకూర్మంలో ప్రతిష్ఠించాడని చెబుతారు. ఈ క్షేత్ర ప్రస్తావన పద్మ పురాణంలోనూ, బ్రహ్మాండ పురాణంలోనూ కనిపిస్తుంది.

వారణాసి తర్వాత..
పితృ కార్యాలయాలంటే ముందుగా గుర్తొచ్చేది కాశీ. అయితే వారణాసితో సమానంగా ఈ క్షేత్రాన్ని భావిస్తారు. కాశీ వెల్లలేని చాలామంది ఇక్కడే పితృ కార్యాలు నిర్వహిస్తుంటారు. వారణాసి నుంచి గంగామాత ప్రతి మాఘ శుద్ధ చవితి నాడు ఇక్కడికి వచ్చి శ్వేతపుష్కరిణిలో స్నానమాచరిస్తుందని చెబుతారు. తాము విడిచిన పాపాలను ఆ మాత ప్రక్షాళన చేస్తుందని భక్తుల నమ్మకం. అంతటి పవిత్రమైన ఈ పుష్కరిణిలో పితృదేవతల అస్థికలు కలిపితే కొంతకాలానికి సాలగ్రామ శిలలుగా మారుతాయని ఇక్కడి వారి విశ్వాసం. అందుకే చాలామంది ఇక్కడ తమ పితృదేవతల అస్థికలను కలిపేందుకు వస్తుంటారు.
ఎప్పుడు స్థాపించారు..?
శ్రీమన్నారాయణుడి అవతార రూపమైన ఈ ఆలయాన్ని రెండో శతాబ్దానికి ముందు నిర్మించారని ప్రాశస్త్యం. కృతయుగంనాటి శాసనాల ఆధారంగా ఈ విషయం తెలుస్తుంది. నిర్మాణ విషయంలో భిన్న వాదనలు ఉన్నాయి. నిజానికి ఇప్పటికీ ఆలయం ఎవరు నిర్మించారన్నది స్పష్టంగా తెలీదు. ఏడో శతాబ్దం నుంచి ఆలయం ప్రాధాన్యం తెలుస్తూ వచ్చింది. దీంతో వివిధ రాజవంశాల వారు ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. కళింగ, ఆంధ్ర, చోళుల రాజవంశ పాలనలో దీన్ని అభివృద్ధి చేశారు.8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు, 11వ శతాబ్దంలో రామానుజాచార్యులు, 13వ శతాబ్దంలో మధ్వాచార్యుల శిష్యులైన శ్రీనరహరితీర్థులు సందర్శించినట్లు చరిత్రకారులు చెబుతారు. శ్రీరాముడి తనయులు లవకుశలు కూడా ఆలయాన్ని సందర్శించారని చెబుతుంటారు.
ఆకర్షించే శిల్పరాతి సౌందర్యం
ఆలయ పైభాగం అష్టదళ పద్మాకారంలో ఉంటుంది. తూర్పు, దక్షిణ ద్వారాలపై చక్కని శిల్పాలు కనువిందు చేస్తాయి. ఇక్కడ ద్వారాలు, స్తంభాలపై చక్కని శిల్ప సంపద మరింత ఆకర్షణగా నిలుస్తుంది. అబ్బుపరిచే శిల్పాలు, కుడ్య చిత్రాలు ఇక్కడ ప్రత్యేకాకర్షణ. మొత్తం 108 రాతి స్తంభాలు ఉన్నాయి. ఒక దానితో మరొకటి పోలిక ఉండకపోవడం మరో విశేషం.

సౌకర్యాలు..
కూర్మనాథ క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సత్రం ఉంది. దీంతో పాటు శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం అరసవెల్లి కూడా ఇక్కడకు పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ రెండు ఆలయాలను చూడాలనుకునేవారు శ్రీకాకుళంలో బస చేయొచ్చు.
ఎలా చేరుకోవాలి..?
బస్సులో వెళ్లేవారికోసం శ్రీకాకుళం పాత బస్టాండ్‌ నుంచి ప్రతి 15 నిమిషాలకు అరసవల్లి మీదుగా బస్సు సౌకర్యం ఉంది. దీంతో పాటు ఆటోలు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. రైళ్లలో వెళ్లేవారు శ్రీకాకుళం రోడ్డు స్టేషన్‌లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి శ్రీకాకుళానికి చేరుకుని వెళ్లాల్సి ఉంటుంది.
పూజలు- దర్శన వేళలు
జ్యేష్ఠ బహుళ ద్వాదశినాడు స్వామివారి జయంతి. ఆ రోజు స్వామివారికి ఉదయం క్షీరాభిషేకం నిర్వహించి అనంతరం ప్రత్యేక పూజలు చేస్తారు.
* అభిషేకం (తిరుమంజనం): ప్రతిరోజూ ఉదయం 4.30 నుంచి 6 గంటల వరకు
* ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు ప్రతి రోజూ స్వామివారి దర్శనం ఉంటుంది.
Read More

9, అక్టోబర్ 2017, సోమవారం

"గరుడ పురాణం"!! "గరుడుడు విష్ణువు వాహనవైన విధం"!!!

"గరుడ పురాణం"!!

"గరుడుడు విష్ణువు వాహనవైన విధం"!!!

"ఈ ఇద్దరు భార్యలలోనూ కద్రువకు సవతి మాత్సర్యం అధికం. వాటికి తోడు ఈర్ష్యాసూయాలు ఎక్కువే! కద్రువ స్వభావం తెలిసిన వినత, తానే ఎన్నో సందర్భాలలో సరిపుచ్చుకుంటూ ఉండేది. కద్రువకు అప్పటికే సంతానం ఉంది."!!
"శ్రీహరి ఇచ్చిన వరం ప్రభావాన, వినత కొంతకాలానికి గర్భవతి అయ్యింది. తనకు చాలామంది పుత్రసంతానం ఉన్నప్పటికీ -వినత గర్భందాల్చడం , కద్రువకు ఈర్ష్యా కారణమైంది"!!

"ఒకరోజు సవతులిద్దరూ క్షీరసాగరతీరానికి విహారానికి వెళ్ళారు. అక్కడ వారికి ఇంద్రుని గుర్రం ఉచ్చైశ్శ్రవం కన్పించింది."

"అసుర సంధ్యవేళలో -కనుచీకట్లు పడుడతుండగ ఆ గుర్రాన్ని చూశారు వినత,కద్రువులు. "తెల్లని తెలుపు రంగులో ఆ గుఱ్ఱం ఎంత అందంగా ఉందో చూశావా అక్కా "అంది వినత. "ఆ చూశా !తోక దగ్గర మాత్రం నలుపురంగు ఉంది.అదే లేకుండా ఉంటే , అది అందమైనదే అనడానికి సందేహించనక్కర్లేదు" అంది కద్రువ. ఇక్కడ చెల్లెలు చెప్పిందాన్ని ఖండించడమే ధ్యేయంగా పెట్టుకున్న కద్రువ ఉద్దేశం పాపం వినతకు తెలీదు. ఇంతలో గుర్రం వెల్లిపోయింది"!!

"అదేమిటక్కా !అలా అంటావేం? తోకకూడా తెల్లగానే ఉందికదా!!" అంది తెల్లబోయిన వినత. కొట్టిపారేసింది కద్రువ."!!

"కొంతసేపు సవతులిద్దరికీ వాగ్వాదం జరిగింది. "మన పతిదేవునికి సాయం సంధ్యానుష్టానం ఏర్పాటు చూడాల్సి ఉంది. పద! రేపు కూడా ఆగుర్రం మేతకు ఇటే వస్తుంది కదా అప్పుడైనా బాగాచూడు " అంది వినత.""

"బాగాచూడాల్సింది నేనుకాదు నువ్వే సరే నేను చెప్పినట్టుగా తోకభాగం మాత్రం నల్లగా ఉంటే , నువ్వు నాకు దాస్యం చేస్తావా? అలాగాకాకుండా నువ్వుఅన్నట్టు పూర్తితెల్లగాఉంటే, నేనునీకుదాస్యం చేస్తా అంది కద్రువ"!!

"సరేనన్నది వినతి. చాకటిపడడంతో ఇద్దరూ ఎవరి గ్రుహాలకు వాళ్ళువెల్లిపోయారు. కద్రువకూడా వినత చెప్పిందే నిజమని తెలుసు అయిన మాత్సర్యం కొద్దీ అలాఅన్నది. కనుక పంతం నెగ్గించుకోవడానికి ఆరాత్రి తన పుత్రులలో ముఖ్యులైన సర్పశ్రేష్టుల్ని పిలిచి 'మీలోనల్లనివాళ్ళువెల్లి ఆ ఉచ్చైశ్రవం తోకకు చుట్టుకుని ఉండండి. రేపుమేము గుర్రాన్ని చూసేవేళకు తోకభాగం నల్లగా కన్పించేలా చెయ్యండు" అని ఆజ్ఞాపించింది"!!

"ఈ అన్యాయం చేయడానికి అందులో ఎవరూ ఇష్టపడలేదు. పైగా ఆ అధర్మక్రుత్యం చెయ్యడానికి ప్రేరేపించిన తల్లికే ధర్మసూక్షాలు చెప్పసాగారు కోపించిన కద్రువ 'మీరంతా అగ్ని గుండాన పడిచస్తారు' అని శపించింది"!!

"వాసుకి అనే సర్పరాజు 'అమ్మా ఇది అధర్మం అని నీకు తెలుసు కనుక ఎవరైతే ధర్మం తప్పక ప్రవర్తిస్తారో వారికి నీశాపం తగలదు' అని ప్రతిక్రియగా అన్నాడు. కొందరు మాత్రం తల్లి పక్షాన చేరి ఆమెపంతం నెగ్గేలా చేసారు"!!

"అమాయకురాలైన వినతకూ శ్రీహరి వరం వల్ల ఆమెకు పుట్టిన గరుత్మంతుడనే పుత్రునికీ దాస్యవ్రుత్తి తప్పలేదు. తండ్రి వద్దకువెల్లి గరుడుడు మొరపెట్టుకోగా నాయనా నీకు ఆ ఇంద్రుడే సహాయం చేయాలని ఆకాంక్షించగలను ఇంద్రునితో మైత్రి సంపాదించు నీవు శ్రీహరి వాహనమై అఖండ కీర్తి గడిస్తావు 'అని వలం ఇచ్చాడు కశ్యప్రజాపతి. దాస్యవ్రుత్తికి అమ్రుతం తెచ్చివ్వమంది కద్రువ."!!

"గరుడుడు దేవలోకానికి వెల్లి ఇంద్రునికి తన పరాక్రమం చూపి ఆయనతో మైత్రిని పొంది , తనతల్లి దాస్యం సంగతి చెప్పాడు. అంతావిన్న ఇంద్రుడు ఉపాయం ప్రకారం , దాస్యవిముక్తి జరగగలదని ఆ ఉపాయం గరుడునికి ఉపదేశించాడు. పాములకు అమ్రుతం పోయడం కూడా మంచిది కాదన్నాడు కూడా"!!

"ఇంద్రుడు చెప్పినట్టే అమ్రుతభాండం తీసుకెళ్ళీ కద్రువ చేతిలో పెట్టి దాస్యవిముక్తి జరిగినట్లుగా ఆమెతో మాట తీసుకున్నాడు. వినతను స్వేఛ్ఛగా సంచరించేందుకు కద్రువ ఒప్పుకోగానే, ఇంద్రుడు అద్రుశ్యరూపంలో వచ్చి ఆ అమ్రుతభాండాన్ని మాయం చేశాడు. తల్లీకొడుకులకు దాస్యవిముక్తి లభించింది. తన విజయగాథను తండ్రికి వివరించాడు గరుడుడు."!!

"కశ్యప్రజాపతి పుత్రుడి శిరస్సు నిమిరి 'సర్పాల్లాంటి పుత్రులు వేనకువేలు ఉన్నా ప్రయోజనం శూన్యం. నీవంటి ఒక్క పుత్రునివల్ల నాకీర్తి కూడా ఇనుమడించింది. నువ్వు శ్రీహరి వాహనమై, నిరంతర విష్ణులోక వాసి వవుతావు'అని దీవించాడు"!!

"శ్రీహరిని గూర్చి కఠోరతపస్సు చేసిన గరుడుడు, ఆయనను మెప్పించి , తనతండ్రి ఇచ్చిన దీవెన నిజం చెయ్యమన్నాడు. గరుడుని అసాధారణ భక్తిశ్రద్దలకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు గరుత్మంతుని తన వాహనంగా చేసుకోడానికి అంగీకరించాడు. ఇదీ గరుడుడు విష్ణువుకు వాహనవైన విధం"!!
'సమాప్తం'

"ఓంనమఃశ్శివాయ"
"జై శ్రీరాం"!!
Read More

కలిసంతానం వినాయకుడిపై పడింది...కలిసంతానం వినాయకుడిపై పడింది... శివుడు కన్నకొడుకునే చంపాడు..అంత క్రూరమైనవాడా?.ఆయన దేవుడైతే తన కొడుకని తెలియదా? మనిషితల కాకుండా ఎనుగుతల ఎందుకు పెట్టాడు?వినాయకుడు దేవుడెలా అయ్యాడు?..ఇలా రాంగోపాల్ వర్మని గుర్తు చేస్తున్నారు.
నా వాల్ లో.విఘ్నేశ్వరుడి గురించి రాయడం అద్రుష్టంగా భావిస్తూ వీటన్నిటికి సమాధానంగా ఈ పోస్ట్ రాస్తున్నాను..
మీ సందేహాలు అన్ని తీరిపోయాక కూడా మళ్లీ ఇలాంటి కామెంట్స్ చేస్తే మీరు ఒకే తల్లి,తండ్రులకి పుట్టలేదని భావించాల్సి ఉంటుంది..

పూర్వం గజాసురుడనే రాక్షసుడు ఉండేవాడు...వీడు మహా శివభక్తుడు..ఎంతటి భక్తి అంటే శివుడు తన ఒక్కడికే సొంతం కావాలని..ఘోర తపస్సు చేసి మహాదేవుడిని తన ఉదరంలోనే ఉండమని వరం కోరుకున్నాడు..శివుడు సరేనన్నాడు..మహాదేవుడే అచేతనంగా ఉండటంతో సృష్టిధర్మం గతి తప్పింది..విష్ణువు ఒక ఉపాయం ద్వారా గజాసురుడికి బుద్ది చెప్పి శివుడు బైటకు వచేలా చేసాడు..
అలా బైటకు వచేటప్పుడు గజాసురుడి ఉదరం చీలింది..
అప్పుడు మహాదేవుడు "గజాసురా నీది గొప్పభక్తి.కాని స్వార్ధం వల్ల వినాశనం కొనితెచ్చుకున్నావు..ఇంకేదైనా వరం కోరుకో" అన్నాడు...అందుకు ఆ రాక్షసుడు దేవా! నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని చూస్తూ మీ సమక్షంలో ఉండేలా అనుగ్రహించమన్నాడు.శివుడు 'తధాస్తు' అన్నాడు.
ఆ తర్వాత కైలాసానికి వస్తున్న శివుడిని వినాయకుడు అడ్డుకోవడం,వద్దని వారించిన దేవతలను పరాజితులని చేయడంతో తప్పనిసరి పరిస్థితులలో శివుడు వినాయకుడిని దండించాడు...మళ్లీ గజాసురుడి శిరస్సుతో బ్రతికించాడు..


కైలాసంలో జరగబోయే సంఘటన ముందే తెలుసుకనుకే గజాసురుడికి నువ్ ఎల్లప్పుడూ మా సమక్షంలో ఉంటావని వరమిచ్చాడు..అలాగని ఏ చెట్టుగానో చీమగానో కైలాసంలో ఉండమని చెప్పవచ్చు..కాని అతని అనితరసాద్యమైన భక్తికి మెచ్చుకుని ఏకంగా తన పుత్రుడి స్థానాన్నే ఇచ్చాడు..
అది మహాదేవుడి కరుణ..అపారం.....

ఏనుగు మదించిన బలానికి,బుద్దికి గుర్తు....
వర్షాకాలంలో అడవిఅంతా దట్టంగా అల్లుకుపోతుంది...అప్పుడు అన్ని జీవులు ఏనుగు కోసం చూస్తాయి...ఏనుగు నడుస్తూ పోతుంటే దారి ఏర్పడుతుంది..ఆదారిలో ఇతర జీవులు తేలికగా ప్రయాణం చేయగలుగుతాయి.."అందువల్ల వినాయకుడు దారి చూపించేవాడు".
ఎలుక చపల చిత్తానికి,తామస బుద్దికి ప్రతీక.ఎలుక మీద స్వారి చేయడమంటే కామ,క్రోదాలని అదుపులో ఉంచడమే..
భూత,భవిష్య,వర్తమాన కాలాలను బొజ్జలో దాచుకుంటాడు కనుక లంభోదరంతో ఉంటాడు.
ఒకపక్క విరిగిన దంతం త్యాగాబుద్దిని సూచిస్తుంది.
.
వినాయకుడు అంటే "విశేషమైన నాయకుడు" అని అర్ధం... ప్రమదగణాలకు,దేవగణాలకు నాయకత్వం వహించడానికి అత్యంత సమర్ధత ఉండాలి..అంతటి సమర్ధుడు కనుక శివుడు ఆ భాద్యతని వినాయకుడికి ఇచ్చాడు.
ఉపాసనా సాంప్రదాయంలో దైవరూపంలోని శక్తిని భార్యలుగా ఆరాధిస్తారు..సిద్ది,బుద్ధి ని కలిగించే దైవం కనుక వాటిని ఆయన భార్యలుగా,స్త్రీదేవతా రూపంలో ఆరాధిస్తారు
గణపతి ఆరాధన చాలా తేలిక. గడ్డిపరకతో పూజించినా ప్రసన్నుడౌతాడు.
ఇంకా చాలా చెప్పవచ్చు కాని లెంగ్త్ ఎక్కువవుతుంది కనుక ఇక్కడితో ముగిస్తున్నాను..

శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశం
అనేకదమ్‌ తమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే.
Read More

ఓ స్త్రీ బైబిల్ లో నీ స్థానం ఎక్కడ?"..ఓ స్త్రీ బైబిల్ లో నీ స్థానం ఎక్కడ?"..
"స్త్రీలకి దైవత్వం ఉండదని, అలాగే దైవానికి స్త్రీ తత్వం ఉండే అవకాశమే లేదని బైబిల్ రచయతల నమ్మకం".
అందుకే వారు దైవాన్ని పురుషుడుగానే సంభోదించారు..ఎక్కడా స్త్రీ దేవత అనే పదం వారి ఊహలో కూడా చేయలేకపోయారు..
స్త్రీకి దైవత్వం ఇవ్వకపోయారు సరే కనీసం మనిషిగానైనా గుర్తించారా???
"క్రీ.శ.581 లో స్త్రీలకూ కూడా ఆత్మలు ఉంటాయా?" అనే తీవ్రచర్చ యూరప్ లోని చర్చ్ లో జరిగింది..జంతువులు మాదిరి స్త్రీలకూ ఆత్మలు లేకుంటే ...స్త్రీ జంతువుతో సమానమే కదా.మరి జంతువుకు ఏసులాంటి మహనీయుడు జన్మించాగాలడా?అనే ప్రశ్న వచ్చి వారు "మేరీ ని పవిత్రకన్య గా అంగీకరించి పూజించేవారు క్యాథలిక్కులు...దీనిని వ్యతిరేకించి కేవలం యెహోవా,జీసస్ లను పూజించేవారు ప్రోతెష్టేంట్ లుగా చర్చి విడిపోయింది"


ఆదికాండం- 3;16..పురుషుడు స్త్రీని ఏలును..
తిమోతి -2;12..స్త్రీ మౌనంగా ఉండవలసిందేగాని ఉపదేశించుటకైనా,పురుషుని మీద అదికారము చేయుటకైననూ ఆమెకు సెలవీయను..
పురుషుడి ముందు స్త్రీ మాట్లాడటానికి కూడా ఒప్పునేది లేదని బైబిల్ సెలవిస్తుంది...

ఇది బైబిల్ రాయబడిన 2000 సంవత్సరాల క్రితంనాటి "రోము-గ్రీసు" సంస్కృతులకు దర్పణం పడుతుంది..

పాశాత్య దేశాలలో దీనిని వ్యతిరేకించి స్త్రీ స్వేఛ్చ కోసం పోరాటాలు జరిగి అవి ఇప్పుడు విశృంఖలంగా మారాయి..

"స్త్రీని జగన్మాతగా, ఆదిశక్తిగా పూజించే" హైందవధర్మాన్ని విడిచి సుమంగళి రూపం ఐన పసుపు కుంకుమ, బొట్టు గాజులు తీసి ఇలాంటి బైబిల్ ని దైవగ్రంధం అని నమ్మి.. చర్చిల్లో నెత్తిమీద ముసుగేసుకుని చేతులు పైకెత్తి శోకాలు పెట్టే మిమ్మల్ని చూసి........

మీకు తగినశాస్తి జరిగిందని ఆనందపడాలో, మా భారతీయ ఆడపడుచులకి పట్టిన ఈ దుస్థితికి భాదపడాలో అర్ధంకావడం లేదు....


Read More

యేసుని పట్టించిన యూదా ఆ తర్వాత ఏమయ్యాడు??..యేసుని పట్టించిన యూదా ఆ తర్వాత ఏమయ్యాడు??..
ఈ ప్రశ్నకి సమాదానం బైబిల్ లో దొరుకుతుంది.....ఒకటి కాదు రెండు దొరుకుతాయి...పరిశుద్దగ్రందం అంటే మాటలా..
1)అతడు పశ్చాతాపం చెంది యేసుని అమ్మగా వచ్చిన ఆ వెండి నాణాలను దేవాలయంలో పారవేసి ఉరి పెట్టుకునెను..(మత్తయ్-27;3,4,5)
2)యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను..అతడు తలకిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బైటకు వచ్చెను..ఆ పొలానికి రక్తభూమి అని పేరు వచ్చెను..(అపోస్తులుల కార్యములు-1;18)


చూశారా ఎంత అద్భుతంగా రెండు రకాలుగా ఉందో....ఈ రెండు వెర్షన్ లే కాక మూడోది కూడా ఉంది..
యేసు శిష్యులు మిగిలిన పదకొండు మంది అతనిని కొట్టి చంపారనేది చారిత్రిక సత్యం....దానికి వక్రీకరించి ఇలా రాశారు...రాసుకున్నారు సరే అందరూ ఒకరకంగా రాయకుండా ఎవడికి నచ్చినట్టు వాడు రాసుకున్నాడు..

అసలు యేసుని పాపుల కోసం సిలువ వేయబడటానికే దేవుడు పంపించాడు అని చెప్పుకుంటారు కదా!!!!...

"దేవుడు కోరుకున్నదే యూదా చేశాడు........ దేవుడి నిర్ణయాన్ని అమలు చేసి యేసు సిలువ వేయబడటానికి కారణమైన యుధాని పాపిగా,విలన్ గా చూపించారెందుకు"???

ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు?
Read More

31, జులై 2017, సోమవారం

సూర్యాష్టకం –సూర్యాష్టకం –

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే

సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

లోహితం రథమారూఢం సర్వ లోక పితామహం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

బృంహితం తేజసాం పుంజం వాయు రాకాశ మేవచ
ప్రభుస్త్వం సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం

బంధూక పుష్ప సంకాశం హర కుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

శ్రీ విష్ణుం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా

స్త్రీ తైల మధు మాంసాని ఏత్యజంతి రవేర్దినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి

ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం
Read More

జీవితం అంటే ?

జీవితం అంటే ?
జీవితం మసిపూసిన వదనం
జీవితం అఖండ భయసదనం
జీవితం గాలి వీచని సాయంత్రం
మనిషి పుట్టుక నుండి మరణం దాకా సాగే ప్రయాణమే జీవితం. చూడగలిగితే ప్రతి జీవితం ఓ అద్భుతమే. చదవగలిగితే ప్రతి జీవితమూ ఓ చరిత్రే..
• తోటి సోదరుల మంచి కోసం కష్టించని జీవితం మానవుడికి జీవితమే కాదు.
• జివితంలో ఒంటరిగా నడవడం నేర్పేదే విద్య .....
• లాంగ్ షాట్ లో ఆనందంగానూ, క్లోజప్ లో విషాదంగానూ కన్పించేదే జివితం.....
• జీవితం చివర తెలియని చీకటి వంతెన--మాదిరాజు రంగారావు.
• జీవితం కరిగిపోయే మంచు-ఉన్నదానిని నలుగురికి పంచు.
• జీవితంలో అందరి ప్రయత్నమూ గెలవడానికే, ఎవడూ ఓడదలచడు.
• కొద్దిగా లోకజ్ఞానం, సహనం, హస్యరసజ్ఞత ఉంటే మనిషి హాయిగా జీవించవచ్చు.
• జీవితమంటే రెండు సుదీర్ఘ అంధకారాల మధ్యనుండే వెలుతురు రేఖ .
• తథ్యమైన మరణం కంటే తాత్కాలికమైన జీవితమే ప్రాణుల్ని అధికంగా ప్రలోభపెడుతుంది.
• జీవితం సహారా ఎడారి కాదు- చిగురించే స్వభావం కలది.
• తథ్యమైన మరణం కంటే తాత్కాలికమైన జీవితమే ప్రాణులని అధికంగా ప్రలోభపెడుతుంది.
• మనిషి బతకటం గొప్ప కాదు, సాటి మనిషిని బతికించటం గొప్ప.
• తాను బతకటం కోసం ఇంకో మనిషిని చంపటం కాదు, ఇంకో మనిషి బతకటం కోసం అవసరమైతే తాను చావాలి.
• అవినీతి పద్ధతులలో ధనవంతులైపోవడం కన్నా, నీతిగా బతుకుతూ దరిద్రులుగా మిగిలిపోవడమే ఉత్తమం.
• ప్రతి జీవిమీద జాలి వున్నావాడే గొప్ప వ్యక్తి.
• కష్టసుఖాల కలగలుపే జీవితం.
• బతుకు ఒక పోరాటం. దానికోసం ఆరాటం పనికి రాదు.
• అతి దగ్గరగా వున్నప్పుడు జీవితం విషాదంగా ..... దూరంగా వున్నప్పుడు సుఖంగా కనుపిస్తుంది.
Read More

దారిద్ర్య దహన శివ స్తోత్రం

దారిద్ర్య దహన శివ స్తోత్రం
ఈ స్తోత్రం చదవడం వలన దారిద్ర్యం పోతుంది.
విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ |
కర్పూరకాన్తి ధవళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 1 ||
గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ
కాలాన్తకాయ భుజగాధిప కఙ్కణాయ |
గఙ్గాధరాయ గజరాజ విమర్ధనాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 2 ||
భక్తప్రియాయ భవరోగ భయాపహాయ
ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ |
జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 3 ||
చర్మామ్బరాయ శవభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణికుణ్డల మణ్డితాయ |
మఞ్జీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 4 ||
పఞ్చాననాయ ఫణిరాజ విభూషణాయ
హేమాఙ్కుశాయ భువనత్రయ మణ్డితాయ
ఆనన్ద భూమి వరదాయ తమోపయాయ |
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 5 ||
భానుప్రియాయ భవసాగర తారణాయ
కాలాన్తకాయ కమలాసన పూజితాయ |
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 6 ||
రామప్రియాయ రఘునాథ వరప్రదాయ
నాగప్రియాయ నరకార్ణవ తారణాయ |
పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 7 ||
ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతాప్రియాయ వృషభేశ్వర వాహనాయ |
మాతఙ్గచర్మ వసనాయ మహేశ్వరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 8 ||
వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగ నివారణమ్ |
సర్వసమ్పత్కరం శీఘ్రం పుత్రపౌత్రాది వర్ధనమ్ |
త్రిసన్ధ్యం యః పఠేన్నిత్యం న హి స్వర్గ మవాప్నుయాత్ || 9 ||
|| ఇతి శ్రీ వసిష్ఠ విరచితం దారిద్ర్యదహన శివస్తోత్రమ్ సమ్పూర్ణమ్ ||
Read More

పూజ గదిలో కృష్ణుడి విగ్రహం ఉంటే ఇవి తప్పనిసరిపూజ గదిలో కృష్ణుడి విగ్రహం ఉంటే ఇవి తప్పనిసరి
శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణుడిని ప్రేమకు స్వరూపంగా పేర్కొంటారు. తనను ఆరాధించేవారి పట్ల ఉదారంగా వ్యవహరించే గొప్ప మనసున్న దేవుడు. ఇతర దేవతా విగ్రహాల కంటే కృష్ణుడి విగ్రహాం ఇంట్లో కొంచెం భిన్నంగా ఉంచాలి. విగ్రహంతోపాటు భగవానుడికి ఇష్టమైన వస్తువులను కూడా దీంతో పాటు పూజా మందిరంలో ఉంచాలి. ఇలా చేస్తే నారాయణుడు అనుగ్రహం లభిస్తుంది.
కృష్ణుడు తన పిల్లనగ్రోవితో రాగాలపాన చేస్తుంటే గోపికలంతా మైమరిచి నృత్యం చేసేవారు. జగన్నాటక సూత్రధారికి ఇష్టమైన వేణువును కూడా పూజా మందిరంలో చేర్చాలి. హిందూ పురాణాల ప్రకారం ఆవులో 33 కోట్ల దేవతలు కొలువుంటారు. కృష్ణుడికి పాలు, వెన్న ఎంతో ప్రీతికరమైనవి. ఇవన్నీ ఆవు నుంచి ఉత్పత్తి అవుతాయి. కాబట్టి దూడతో ఉన్న ఆవు విగ్రహాన్ని కూడా పూజ గదిలో ఉంచాలి. నెమలి పింఛం భౌతిక అందంతోపాటు వ్యక్తిని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. దీన్ని కృష్ణుడు ఎంతో ఇష్టంగా తన తలపైన ధరించాడు. నెమలి ఫించం ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ప్రభావాన్ని తగ్గిస్తాయి. కలువ బురదలో నుంచి జన్మించినా తన సువాసనను పంచుతుంది. మనిషిలో స్థిరత్వం వృద్ధి చెందడానికి కమలాన్ని పూజ మందిరంలో ఉంచాలి. రోజు తాజా కలువను తీసుకోవాలి. కృష్ణుడికి సమర్పించే నైవేద్యం వెన్న, కలకండ. అందుకే వీటిని రోజు నైవేద్యంగా సమర్పించాలి. వైజంతిమాలను శ్రీకృష్ణుడు తన కంఠంలో లేదా చేతికి ధరించేవాడు. ఈ కంఠాభరణం తప్పనిసరిగా పూజగదిలో ఉండాలి. చందనంతో తయారుచేసిన ఈ మాలను దేవదేవుడు ఎంతో ఇష్టంగా ధరించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. రాధాకృష్ణులు విగ్రహానికి మాత్రం తులసితో అర్చన చేయరాదు.
Read More

బొట్టు విశిష్టత

బొట్టు విశిష్టత
నిజానికి బొట్టు ప్రతివారికీ ఎల్లప్పుడూ ఉండవలసునదే. ఎలా ధరించాలి? దేనితో ధరించాలి – అనే విషయంలో తేడాలు ఉండవచ్చు తప్ప, తిలకం ధరించి తీరాలనడంలో మాత్రం సందేహం, భేదాభిప్రాయం లేవు. "సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమోస్తుతే" అని జగన్మాతను ప్రార్థిస్తూ నుదుటన పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగుతాయి. ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి చేకూరుతుంది. నడిమి వేలితే పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది. బొటన వేలుతో పెట్టుకుంటే పుష్ఠి కలుగుతుంది. చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అసలు నొసటన బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? అని కొంతమంది ప్రశ్నలు లేవనెత్తుతుంటారు. మన శరీరంలో జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలన మిగిలిన అవయవాలకు ఒక్కొక్క అధి దేవత ఉన్నారు. వారిలో లలాట అధిదేవత బ్రహ్మ. పరమ ప్రమాణములైన వేదాలు బ్రహ్మ ముఖకమలం నుండి వెలువడ్డాయి. అందుకే బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మ స్థానమైన లలాటం స్థానమైంది. ద్వాదశ పుండ్రాలను పెట్టుకోక పోయినా, కనీసం బొట్టు అయినా పెట్టుకోవాలి. అప్పుడు దేవుని పూజించినట్లే అవుతుంది. చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు. అందుకే బ్రహ్మస్థానమైన నొసటిపై ఎరుపురంగు వ్యాప్తిలోకి వచ్చింది. ఇందులో నిగూఢార్థముంది. మనలోని జీవుడు జ్యోతి స్వరూపుడు. ఆ జీవుడు జాగ్రదావస్థలో భ్రూమధ్యంలోని ఆజ్ఞాచక్రంలో సంచరిస్తుంటాడు. మన నొసటిపై పెట్టుకున్న కుంకుమబొట్టుపైన సూర్యకాంతి ప్రసరిస్తే, కనుబొమల మధ్య నుండే ఇడా పింగళ నాడులు సూర్యశక్తిని గ్రహించి శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి. ప్రాణశక్తికి కారణమైన నరాలకు కేంద్రస్థానము కనుబొమల మధ్య నుండే ఆజ్ఞాచక్రము. కుంకుమ బొట్టును పెట్టుకోవడం వల్ల ఆజ్ఞాచక్రాన్ని పూజించినట్లే అవుతుందని పెద్దలంటారు. మానసిక ప్రవృత్తులను నశింపజేసేదే ఆజ్ఞాచక్రమని పురోహితులు అంటున్నారు.
Read More

శ్రీ వేంకటేశ్వర స్తోత్రం

శ్రీ వేంకటేశ్వర స్తోత్రం
కమలాకుచ చూచుక కుంకుమతో
నియతారుణి తాతుల నీలతనో
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే|| 1
శ చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ
ప్రముఖాఖిల దైవత మౌళిమణే
శరణాగతవత్సల సారనిధే
పరిపాలయ మం వృషశైలపతే|| 2
అతివేలతయా తవదుర్విషహై
రనువేల కృతైరపరాధశతైః
భరితం త్వరితం వృషశైలపతే
పరయా కృపయా పరిపాహిహరే|| 3
అధివేంకటశైల ముదారమతే
ర్జనతాభిమ తాధిక దానరతాత్
పరదేవతయా గదితా న్నిగమైః
కమలాదయితా న్న పరంకలయే|| 4
కలవేణు రవా వశ గోపవధూ
శతకోటి వృతాత్స్మర కోటి సమాత్
ప్రతిపల్లవి కాభిమాతాత్సుఖదాత్
వసుదేవసుతా న్న పరం కలయే|| 5
అభిరామ గుణాకర దాశరథే
జగదేక ధనుర్ధర ధీరమతే
రఘునాయక రామ రమేశవిభో
వరదోభవ దేవ దయాజలధే|| 6
అవనీ తనయా కమనీయకరం
రజనీకర చారుముఖాంబురుహమ్
రజనీచర రాజ తమోమిహిరం
మహనీయ మహం రఘురామమయే|| 7
సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుఖాయ మమోఘశరమ్
అసహాయ రఘూద్వాహ మన్య మహం
న కథం చ న కంచన జాతు భజే|| 8
వీణా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశం ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ|| 9
అహందూరతస్తే పదాంభోజయుగ్మ
ప్రణామేచ్చయాగత్య సేవాం కరోమి
సకృత్సేవయా నిత్యసేవా ఫలం త్వం
ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ|| 10
అజ్ఞానినా మయాదోషా నశేషా న్విహితాన్ హరే
క్షమస్వతం క్షమస్వతం శేషశైల శిఖామణే|| 11
Read More

జీవాత్మ–పరమాత్మజీవాత్మ–పరమాత్మ
ఓంకార రహితమైన ‘నమఃశివాయ’ అనేది ‘పంచాక్షరీ’ మంత్రమనీ, ఓంకార సహితమైన ‘ఓంనమఃశివాయ’ అనేది ‘షడక్షరీ’ మంత్రమని చెప్పబడింది.
“ఓం నమః శివాయ” షడక్షరీమహామంత్రంలోని ‘ఓం’ – పరబ్రహ్మస్వరూపాన్ని, ‘న’ – పృథ్విని, బ్రహ్మను, ‘మ’ – జలాన్ని, విష్ణువును, ‘శి’ – తేజస్సును, మహేశ్వరుని, ‘వా’ – వాయువును, జీవుని (ఆత్మ), ‘య’ – ఆకాశాన్ని, పరమాత్మను… ఈ విధంగా షడక్షరీమంత్రంలో మంత్రాక్షరాలు పంచభూతాలను, బ్రహ్మాదిదేవతలను సూచిస్తున్నాయి.
ఇక, ‘నమఃశివాయ’ అనే పంచాక్షరీమంత్రంలో, ‘నమః’ అను పదానికి జీవాత్మ అనీ, ‘శివా’ అనే పదానికి పరమాత్మ అనీ, ‘ఆయ’ అను పదానికి ఐక్యం అని అర్థమవడం వలన జీవాత్మ పరమాత్మలో ఐక్యం చెందటం అని అర్థం. ఈవిధంగా పంచాక్షరీమహామంత్రం బ్రహ్మస్వరూపాన్ని తెలుపుతోంది.
Read More

తల్లిదండ్రుల సేవ, కులవృత్తిని మించిన దైవం లేదు

తల్లిదండ్రుల సేవ, కులవృత్తిని మించిన దైవం లేదు
కౌశికుడు ఒక బ్రాహ్మణుని కుమారుడు. ఇతని తల్లిదండ్రులు వృద్ధులు. కౌశికుడు మొదటినుంచీ అహంకారి. తపస్సుచేసి శక్తులు సాధించాలనే కోరిక ఎక్కువ. అందుకే తల్లిదండ్రులు ఎంత చెబుతున్నా వినకుండా అరణ్యాలకు పోయి ఒక చెట్టు క్రింద కూర్చుని తపస్సు ప్రారంభించాడు.అతని తపోదీక్షలో చాలా కాలం గతించి పొయింది. అయినా కౌశికుడు పట్టుదలగా తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఓ కొంగ, కౌశికుడు తపస్సు చేస్తున్న చెట్టుమీద వ్రాలి అతనిమీద రెట్ట వేసింది. దానితో కౌశికునకు తపోభంగమై, కన్నులు తెరచి కోపంగా ఆ కొంగవైపు చూసాడు. అంతే..ఆ కొంగ మలమల మాడి భస్మమైపోయింది. అదిచూసి కౌశికుడు ఆశ్చర్యపోయాడు. తన తపస్సు సిద్ధించిందనీ, తను మహాతపశ్శక్తి సంపన్నుడననీ తలచి, తపస్సు విరమించి, అరణ్యాలు వదలి నగరంలో ప్రవేశించాడు. నగరపౌరులెవ్వరూ అతని శక్తిని గుర్తిచడం లేదు. ఎవరి దారిన వారు పోతున్నారు. కౌశికుడు ఒక ఇంటిముందు నిలబడి ‘భవతీ భిక్షాం దేహి’ అని అరిచాడు. ఆ ఇంటి ఇల్లాలు బయటకు వచ్చి కౌశికుని చూసి, భిక్ష తెస్తాను ఇక్కడే ఉండు అని చెప్పి లోపలకు వెళ్లింది. సరిగ్గా అదే సమయానికి ఆమె భర్త ఇంటికి వచ్చాడు. భిక్ష తెస్తున్న ఆ ఇల్లాలు వచ్చిన భర్తను చూసి, భిక్షపాత్రను పక్కనపెట్టి, భర్త సేవలో నిమగ్నమైంది. కౌశికుడు ‘భవతీ భిక్షాం దేహి’ అని అరుస్తూనే ఉన్నాడు. ఆ అరుపులు ఇల్లాలుకు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ.. అదేమీ ఆమె పట్టించుకోకుండా, భర్తకు భోజనం పెట్టి, అతను నిద్రపోయేవరకూ అతని పాదాలు ఒత్తి, ఆ తర్వాత భిక్ష తీసుకుని గుమ్మం దగ్గరకు వచ్చింది. ఆమెను చూస్తూనే కౌశికుడు కోపంతో ఊగిపోతూ ‘ఇంత ఆలస్యంగానా భిక్ష తీసుకురావడం నేనేమైనా సాధారణ భిక్షగాడిననుకున్నావా మహాతపశ్శక్తి సంపన్నులం’ అని కోపంతో ఎర్రబడిన కన్నులతో ఆమెవంక చూసాడు. ఆమె అడవిలోని కొంగలా మలమలా మాడి మసైపోలేదు. అదిచూసి మరింత ఆశ్చర్యపోయాడు కౌశికుడు. అది గమనించిన ఆ ఇల్లాలు ‘మీ కోపానికి మలమలా మాడిపోవడానికి నేనేమీ అడవిలోని కొంగను కాదు’ అంది. అడవిలో జరిగిన సంఘటన ఆ ఇల్లాలుకు ఎలా తెలిసిందో కౌశికునకు అర్థంకాలేదు. అదే ప్రశ్న ఆమెను అడిగాడు. అప్పుడా ఇల్లాలు ‘నాకు తెలిసినదల్లా నా భర్తను సేవించుకోవడమే. అంతకుమించి నేను ఏ దైవపూజలు చెయ్యను.’ అని బదులిచ్చింది. కౌశికుడు ఆమెను పతివ్రతగా గుర్తించి, ఆమె పాదాలకు నమస్కరించి ధర్మోపదేశం చెయ్యమని ఆమెను అర్థించాడు. ఆమె తనకు తెలిసిన ధర్మాలు చెప్పి, ‘మీకింకా ధర్మాలు తెలుసుకోవాలని ఉంటే మిథిలానగరంలో ఉండే ధర్మవ్యాథుని కలవండి’ అని చెప్పింది ఆ ఇల్లాలు. ధర్మవ్యాథుని కలుసుకోవాలని కౌశికుడు మిథిలానగరం వచ్చి అతనుండే ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ మాంసం విక్రయిస్తూ ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి కౌశికుని చూస్తూనే చిరునవ్వుతో అతని దగ్గరకు వచ్చి ‘ఆ పతివ్రత పంపితే నా దగ్గరకు వచ్చారు కదూ’ అన్నాడు. ఆసంగతి ఇతనికెలా తెలిసిందో కౌశికునకు అర్థంకాలేదు. కానీ అతనే ధర్మవ్యాథుడై ఉంటాడని ఊహించాడు. అది గమనించి ‘అయ్యా... నేనే ధర్మవ్యాథుడను..నానుంచి ధర్మాలు తెలుసుకుందామని వచ్చారు..కొంతసేపు ఇక్కడ విశ్రమించండి.. నా వ్యాపారం ముగిసిన తర్వాత మీతో ధర్మ ప్రసంగం చేస్తాను’ అని చెప్పి తన వ్యాపారంలో నిమగ్నమయ్యాడు ధర్మవ్యాథుడు. కౌశికుడు అతని రాకకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి ధర్మవ్యాథుడు అతని దగ్గరకు వచ్చాడు. కౌశికునితో ఎన్నో ధర్మసూక్ష్మాలు చర్చించాడు. కౌశికుడు ఆశ్చర్యపోతూ ‘మాంసం విక్రయించుకునే మీకు ఇన్ని ధర్మాలు మీకెలా తెలిసాయి’ అని ప్రశ్నించాడు. ధర్మవ్యాథుడు కౌశికుని తన ఇంటిలోకి తీసుకుని వెళ్లాడు. అక్కడ వృద్ధులైన దంపతులు ఉన్నారు. ధర్మవ్యాథుడు వారిని కౌశికునకు చూపిస్తూ ‘వీరు నా తల్లిదండ్రులు. వీరికి సేవలు చెయ్యడం తప్ప మరే పూజలు నేను చెయ్యను. అంతేకాక మాంసం విక్రయించడం నా కులవృత్తి. కులవృత్తిని మించిన దైవం మరేదీ లేదు.. మాతా పితరుల సేవను మించిన ధర్మం లేదు’ అని పలికాడు ధర్మవ్యాథుడు. కౌశికునకు ధర్మం ఏమిటో పూర్తిగా అర్థమైంది. అతను ధర్మవ్యాధుని దగ్గర సెలవు తీసుకుని తన తల్లిదండ్రులకు సేవలు చేసుకోవడానికి స్వగ్రామానికి బయలుదేరాడు.
Read More

వేపచెట్టు విశిష్టత

వేపచెట్టు విశిష్టత
హిందువులు వేప చెట్టును పూజిస్తారు. మామిడి చెట్టును పూజించరు. ఎందుకిలా చేస్తారు అని నన్ను ఒకరు ప్రశ్నించారు. వేప కాయలు చేదు. ఆకులు పచ్చి చేదు. చెట్టంతా చేదుమయం. చేదుగా ఉంటుందని వేపని నిర్లక్ష్యం చేయకూడదు. మనకు అనుభవాల్లో కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి. షడ్రచుల్లో కూడా చేదు ఒకటి. కాబట్టి, చేదుని పూర్తిగా తొలగించలేము. విస్మరించలేము కూడా. పనికట్టుకొని ఎవ్వరూ వేపతోట వేయరు. పైపెచ్చు, సహజంగా మొలచిన మొక్కలను అజ్ఞానంతో పీకిపారవేస్తే, వేప జాతే అంతరించిపోతుంది. అలా జరగకుండా చూడడంలోనే భారతీయ వివేకం ఉట్టిపడుతుంది.
వేప చెట్టుకు చెదలు పట్టవు. దాని ఎదుగుదలకు మనం శ్రద్ధ వహించనవసరం లేదు. పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అది క్రిమి సంహారకంగా పనిచేస్తుంది. తల్లి బిడ్డను ఎలా రక్షిస్తుందో, అలాగే వేప చేట్టు కూడా మనలను అన్ని విధాల సంరక్షిస్తుంది. వేప చెట్టు పైనుంచి వీచే గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు శుద్ధమవుతాయి. ఈ గాలి రక్తనాళాలకు మంచిది. దీని వల్ల చర్మవ్యాధులు దరిచేరవు. వృక్షజాతిలో వేపచెట్టు ఎక్కువ ప్రాణ వాయువునిస్తుంది. ఇది అంటురోగాలను కూడా తరిమికొడుతుంది.
వేపకర్ర ఇంటి గుమ్మాలకు, కిటికీలకు ఉపయోగపడుతుంది. పూర్వం దీనినే తప్పనిసరిగా వాడేవారు. ఇంటి ప్రాగణంలో వేప చెట్టు ఉంటే ఆయుష్షు వృద్ధి చెందుతుందని ఆయుర్వేదం కూడా చెబుతుంది. ఔషద రసాయనాలలో వేప పాత్ర చాలా ప్రధానమైనది. వేపపుల్లతో దంతశుద్ధి చేసుకునేవారికి 90 ఏళ్ళ వయసులో కూడా పటిష్ఠమైన దంతాల వరస ఉంటుందని వైద్యశాస్త్రం చెబుతుంది. వేప చెట్టు క్రింద కూర్చుంటే ఎన్నో మానసిక వైకల్యాలను కూడా అధిగమించవచ్చునంటారు. మండు వేసవిలో వేప చెట్టు కింద చాలా చల్లగా ఉంటుంది. తాపాన్ని, పాపాన్ని హరించగలిగే ఒక్క వేపవృక్షానికే ఉంది. అందుకే ఆరోగ్యకరమైన పరిసరాల కోసం వేపచెట్లను పెంపొందించుకోవాలి. వేప చెట్టుని అమ్మవారి ప్రతిరూపంగా భావించి, పసుపు పూసి బొట్టు పెట్టి పూజించడంలో భారతీయుల అభిరుచి స్పష్టంగా అర్థమౌతుంది. ఇదే మన భారతీయత.
Read More

గుడిముందు ధ్వజస్తంభం ఎందుకు?

గుడిముందు ధ్వజస్తంభం ఎందుకు?
పురాణాలలో శిబిచక్రవర్తి గురించిన కథను విన్నాము. ఒక పావురాన్ని రక్షించడం కోసం తన తొడను కోసి ఇచ్చిన శిబిని గొప్ప దాతగా గుర్తిస్తారందరూ. శిబి తల్చుకుంటే తన రక్తం చిందించకుండానే ఆ పావురాన్ని రక్షించేవాడేమో! కానీ తానే త్యాగాన్ని చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు, తన ధర్మాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు... దేనికైనా వెరువకపోవడమే శిబి చరిత్ర నేర్పే పాఠం. అలాంటి మరో పాత్రే మహాభారతంలో కూడా కనిపిస్తుంది. అదే మయూరధ్వజుడు!
మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత క్షత్రియ ధర్మం ప్రకారం అశ్వమేధయాగాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు పాండవులు. పాండవులు వదిలిన యాగాశ్వాన్ని ఆపే ధైర్యం ఎవ్వరూ చేయలేకపోయారు. ఒకరిద్దరు ధైర్యం చేసినా, పాండవులతో యుద్ధం చేసి నిలువలేకపోయారు. అలా ఒకో రాజ్యమూ పాండవుల పాదాక్రాంతమవుతూ వచ్చింది. ఇంతలో యాగాశ్వం మణిపుర రాజ్యాన్ని చేరుకుంది. ఆ రాజ్యాన్ని పాలిస్తున్నవాడు శ్రీకృష్ణుని పరమభక్తుడైన మయూరధ్వజుడనే రాజు. అపర పరాక్రమవంతుడైన ఆ మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు కూడా తండ్రికి తగినవాడే!
అలాంటి తామ్రధ్వజుడు మణిపురానికి రక్షగా ఉన్న సమయంలో యాగాశ్వం ఆ రాజ్యంలోకి ప్రవేశించింది. తామ్రధ్వజునికి పాండవుల మీదా, వారి ధర్మ ప్రవర్తన మీదా గౌరవం లేకపోలేదు. కానీ క్షత్రియ ధర్మాన్ని అనుసరించి పోరాడకుండా లొంగిపోకూడదని నిశ్చియించుకున్నాడు. అందుకే ఆ యాగాశ్వాన్ని బంధించివేశాడు. నిరాఘాతంగా సాగిపోతున్న తమ అశ్వమేధ యాగానికి అడ్డంకి ఎదురొచ్చేసరికి పాండవులకు ఎక్కడలేని కోపం వచ్చింది. సకల సైన్య సమేతంగా వారంతా తమ అశ్వాన్ని విడిపించుకునేందుకు సిద్ధపడ్డారు. కానీ ఆశ్చర్యం! వారందరూ కలిసి పోరు సల్పినా కూడా తామ్రధ్వజుని ఓడించలేకపోయారు. వారి మీద పైచేయి సాధించిన తామ్రధ్వజుడు ఠీవిగా ఆ అశ్వాన్ని తనతో పాటు తీసుకుపోయాడు. జరిగిన సంఘటనతో ధర్మరాజు ఒక్కసారిగా మ్రాన్పడిపోయాడు. ఆ రాత్రి కృష్ణుడు దగ్గరకి చేరుకుని ఉపాయం సూచించమంటూ అర్థించాడు. దానికి కృష్ణుడు, తన భక్తుడైన మయూరధ్వజుడు రాజ్యాన్ని కోల్పోవడం అయ్యే పని కాదనీ... కాబట్టి అతని అడ్డు తొలగించుకునేందుకు ఓ ఉపాయాన్ని సూచించాడు. కృష్ణుడు సూచించి ఉపాయం మేరకు మరుసటి ఉదయం వారిరువురూ బ్రహ్మణవేషాలను ధరించి మయూరధ్వజుని అంతఃపురానికి చేరుకున్నారు. తన కళ్ల ఎదురుగా ఉన్న విప్రులిద్దరినీ చూసిన మయూరధ్వజుడు సంతోషంగా వారిని ఆహ్వానించి క్షేమసమాచారాలను తెలుసుకోగోరాడు.
రాజు వారిని కదపడమే ఆలస్యం ‘రాజా మేము మీ అతిథి సత్కారాల కోసం రాలేదు! మేం ఒక అడవిగుండా మీ రాజ్యం వైపు వస్తుండగా ఒక సింహం ఇతని కుమారుడిని పట్టుకుంది. పైగా అతడిని విడిచిపెట్టాలంటే ఒక షరతుని సైతం విధించింది’ అన్నాడు విప్ర వేషంలో ఉన్న కృష్ణుడు. ‘ఆ షరతేమితో చెప్పండి! తప్పకుండా తీరుద్దాము,’ అన్నాడు మయూరధ్వజుడు. ‘మయూరధ్వజుని శరీరంలో సగభాగాన్ని అందిస్తే ఆ పిల్లవాడిని విడిచిపెడతానన్నదే ఆ షరతు,’ అన్నాడు కృష్ణుడు, మయూరధ్వజుని వంక సాలోచనగా చూస్తూ. కృష్ణుని మాటలకు మయూరధ్వజుడు తొణకలేదు సరికదా ‘అయ్యో! అదెంత భాగ్యం. మరో జీవితాన్ని కాపాడేందుకు నా శరీరం ఉపయోగపడుతోందంటే అంతకంటే ఏం కావాలి. తక్షణమే ఆ షరతుని తీరుద్దాం ఉండండి,’ అంటూ తన శరీరంలో సగభాగాన్ని కోసి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాడు. సేవకులు మయూరధ్వజుని ఆదేశాల ప్రకారం అతని శరీరంలోని సగభాగాన్ని ఛేదిస్తున్నారు. ఇంతలో ధర్మరాజు ఒక విషయాన్ని గమనించాడు. మయూరధ్వజుని ఎడమకంట కన్నీరు కారుతూ ఉండగాన్ని చూశాడు. వెంటనే ‘రాజా! ఈ దానం ఇవ్వడం మీకు ఇష్టం లేనట్లుగా ఉంది. ఇలా బాధపడుతూ ఇచ్చిన దానం చెల్లదు కదా,’ అన్నాడు. దానికి మయూరధ్వజుడు ‘విప్రోత్తమా! దానం చేయడం ఇష్టం లేక వచ్చిన కన్నీరు కాదు ఇది. నా కుడిభాగం ఎవరో ఒకరికి ఉపయోగపడిందే కానీ, ఎడమభాగం ఏ ఉపయోగమూ లేకుండానే నాశనం అయిపోతోంది కదా అన్నదే నా ఆవేదన’ అన్నాడు మయూరధ్వజుడు.
మయూరధ్వజుని జవాబుకి ధర్మరాజులు నివ్వెరబోయాడు. అతని ధర్మ నిరతిని పరీక్షించేందుకే కృష్ణుడు ఈ నాటకం ఆడాడని గ్రహించారు. కృష్ణుడు సైతం మయూరధ్వజునికి తన నిజరూప దర్శనాన్ని అందించి అతడిని స్వస్థతపరిచాడు.
‘మయూరధ్వజా! నీ వ్యక్తిత్వం నిరుపమానం. నీకు ఏం కావాలో కోరుకో,’ అంటూ చిరునవ్వులు చిందించాడు పరంధాముడు.
‘కృష్ణా! ఈ శరీరం నశించిపోయినా కూడా, నా ఆత్మ చిరకాలం నీ సాన్నిధ్యంలో ఉండేలా అనుగ్రహించండి’ అని కోరుకున్నాడు మయూరధ్వజుడు. ‘ఇక నుంచి దైవం ఉండే ప్రతి దేవాలయం ముందూ నీ ప్రతిరూపం ఉంటుంది. భక్తులు ముందుగా దానికి మొక్కిన తరువాతనే నన్ను దర్శించుకుంటారు. నీ ముందు దీపాన్ని ఉంచి తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటారు,’ అంటూ సెలవిచ్చాడు కృష్ణపరమాత్ముడు.
ఇప్పటికీ ప్రతి దేవాలయం ముందరా ఉండే ధ్వజస్తంభమే ఆ మయూరధ్వజునికి ప్రతిరూపం. దేవతలకు సైతం దారిచూపుతూ, ఉత్సవాలకు ఆరంభాన్ని అందిస్తూ, దైవానికి నిలువెత్తు కీర్తిపతాకగా నిలిచే ఆ ధ్వజస్తంభం... మయూరధ్వజుని వ్యక్తిత్వానికి ప్రతిరూపం!
Read More

కపట మాటల్ని నమ్మకూడదు

కపట మాటల్ని నమ్మకూడదు
అంపశయ్య మీద ఉన్న భీష్ముడు తన మృత్యువు కోసం ఎదురుచూస్తూ ఊరికే కాలక్షేపం చేయలేదు. భగవంతుని ప్రార్థనలోనూ, ధర్మోపదేశాలతోనూ ఆ కాస్త సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు. అలా భీష్ముడు రాజనీతి గురించి ధర్మరాజుకి చేసిన ఉపదేశాలతో నిండిన శాంతిపర్వం మహాభారతంలోనే ఒక అరుదైన ఘట్టం. అందులోని తృతీయాశ్వాసంలోని కథ ఈరోజుకీ విలువైందిగానే కనిపిస్తుంది....
పూర్వం విదిశాపట్నంలో ఒక బ్రాహ్మణు కుటుంబం ఉండేది. ఆ ఇంట్లోని ముక్కుపచ్చలారని పిల్లవాడు అర్థంతరంగా చనిపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లవాడు చనిపోవడంతో బ్రాహ్మణుడి గుండె పగిలిపోయింది. ఆ శోకంలోనే పిల్లవాడిని తీసుకుని భార్యాభర్తలు స్మశానానికి చేరుకున్నారు. కానీ బిడ్డను అక్కడ వదిలి వెళ్లేందుకు వారికి చేతులు రావడం లేదు. ఆ దేహం పక్కన ఎంతసేపు ఏడ్చినా ఓదార్పు దక్కడం లేదు. ఇదంతా దూరంగా ఉంటున్న ఓ గద్ద గమనించింది. బాలుడి శవాన్ని చూడగానే దానికి నోరూరింది. కానీ బాలుడి తల్లిదండ్రులు ఎంతకీ ఆ శవాన్ని వదిలివెళ్లడం లేదే! చీకటిపడిపోతే తను నేల మీద సంచరించడం కష్టం. అందుకని నిదానంగా ఆ కుటుంబం దగ్గరకి చేరింది- ‘అయ్యా, ఎంతసేపని ఇలా ఏడుస్తూ కూర్చుంటారు? చీకటిపడితే భూతప్రేతాలన్నీ ఇక్కడకు చేరుకుంటాయి. కాబట్టి వెంటనే ఈ శవాన్ని వదిలేసి బయలుదేరండి,’ అంటూ తొందరపెట్టింది. ఇంతలో ఈ హడావుడి అంతా చూసి ఓ నక్క కూడా అటువైపుగా వచ్చింది. శవాన్ని చూసి దానికి కూడా నోరూరింది. కానీ ఆ శవం కోసం గద్ద కాచుకుని ఉండటం దానికి ఇబ్బందిగా తోచింది. ఎలాగొలా ఆ కుటుంబాన్ని చీకటిపడేవారకూ ఆపగలిగితే తనే ఆ శవాన్ని ఆరగించవచ్చు కదా అనుకుంది. అందుకనే నిదానంగా బ్రాహ్మణుడి వద్దకు వచ్చి- ‘ఈ పిల్లవాడిని వదిలివెళ్లడానికి మీకు మనసెలా ఒప్పుతోంది. కాసేపు వేచి చూడండి. ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పగలరు. ఏ దేవతైనా కరుణించి మీ బిడ్డకు ప్రాణదానం చేయవచ్చు కదా!’ అంది. ఇక పిల్లవాడి తల్లిదండ్రులని పంపేందుకు గద్దా, ఆపేందుకు నక్కా కంకణం కట్టుకున్నాయి. ‘నేను వందల ఏళ్లుగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను. ఇంతవరకూ పోయిన ప్రాణం తిరిగిరావడాన్ని ఎక్కడా చూడలేదు. ఆ గుంటనక్క మాటలు విని మీరు లేనిపోని ఆశలు పెంపుకుని భంగపడవద్దు,’ అంటూ గద్ద హెచ్చరించింది. ఆ మాటలకు బ్రాహ్మణ కుటుంబం బయల్దేరేలోగా... ’ఈ గద్ద మనసు మహా క్రూరమైంది. పూర్వం రాముడు ఒక బ్రాహ్మణుడిని బతికించిన కథ వినలేదా! సృంజయుడి కుమారుడైన సువర్ణష్టీవిని, నారదుడు బతికించలేదా! అలాగే ఏ దేవతో, యక్షుడో నీ కుమారుడిని కూడా బతికించవచ్చు కదా!’ అంటూ నక్క వారిని నిలువరించింది. అలా అటు నక్కా, ఇటు గద్దా బాలుడి శవం కోసం వేటికి అనుగుణమైన వాదనలను అవి వినిపించసాగాయి. ఈలోగా పరమేశ్వరుడు రుద్రభూములలో విహారం చేస్తూ అక్కడికి చేరుకున్నాడు. బ్రాహ్మణ కుటుంబపు దీనావస్థను చూసి- మీకేం కావాలో కోరుకోమన్నాడు. దానికి ఆ భార్యాభర్తలు తమ బిడ్డను బతికించమంటూ కోరుకున్నారు. వారి కోరికను శివుడు మన్నించాడు. అంతేకాదు! ఇలాంటి పాపాలు మున్ముందు చేసే అవసరం లేకుండా గద్ద, నక్కలు ఆకలి లేకుండా చిరకాలం జీవిస్తాయంటూ వరమిచ్చాడు.
అక్కడితో ఆ కథ సుఖాంతమైంది. కానీ వినిపించే ప్రతిమాటా, మన మంచి కోసమే అని నమ్మకూడదన్న లౌక్యాన్ని కూడా అందించింది. కపటమైన వారు ఎదుటివారి కష్టాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. తియ్యటి మాటలతో తమ పథకాన్ని అమలుచేస్తుంటారు. ఆ కపటత్వాన్ని మనం గ్రహించగలగాలి. వారి మాటల వెనుక ఉన్న మర్మాన్ని పసిగట్టగలగాలి.
Read More

ఓంకారం అన్నది గొప్ప మంత్రం. సనాతన ఔషధ భీజాక్షరం.ఓంకారం అన్నది గొప్ప మంత్రం. సనాతన ఔషధ భీజాక్షరం.
వేదాలలో నిక్షిప్తమైన ఓంకార నాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం.
ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఉపవాస దీక్షలలో కూడా ఆరోగ్యవంతులుగా ఉండటం వెనక ఓంకార నాదమే రహస్యం. విదేశాల్లోని అనేక యూనివర్సిటీల్లో ఓంకారనాదంపై జరిపిన పరిశోధనల్లో ఓంకారం మృత్యుంజయ జపం అని తేలింది.


నాభిలోనుంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. ఓంకారం పదిహేను నిముషాల పాటు ఉచ్ఛరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక అలసట, అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.

యోగాకు ఓంకారానికి విడదీయుట లేదునిశ్శబ్ధ వాతావరణం లో ప్లేబ్యాక్ లో కూడా మనం ఓంకారాన్ని వినటంవలన తప్పక ప్రశాంతత కలుగుతుంది.
Read More

భగవంతుడు సర్వాంతర్యామి

భగవంతుడు సర్వాంతర్యామి
భగవంతుడు సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు అని అన్ని మతాలు నిర్దంద్వంగా అంగీకరిస్తాయి. కానీ, భగవంతుణ్ణి విగ్రహరూపంతో ఆరాధించే ప్రక్రియను మాత్రం ఇతర మతాలు సహించలేవు. అంగీకరించలేవు కూడా. ..? పైపెచ్చు హిందువులు రాళ్ళనీ, రప్పలనీ పూజాస్తారంటూ నోటికొచ్చినట్లుగా విమర్శించే వారు కోకొల్లలు.
ఈ విమర్శలకు హిందూధర్మంలో నాకు చక్కని సమాధానం దొరికింది. శరీరంలో ఏ అవయవాన్ని తాకినా వ్యక్తిని తాకినట్లే. వ్యక్తి స్పందిస్తాడు తప్ప, అవయవం స్పందిచదు కదా! వ్యక్తి కంటికి కనబడడు. శరీరంలో భాగమైన అవయవాన్ని ముట్టుకుంటే చాలు కనబడని వ్యక్తి స్పందిస్తాడు.
ఈ శరీరంలో నీవుండే చోటేది? నీ ఉనికికి కేంద్రమేది? అని వ్యక్తిని ప్రశ్నిస్తే.. తన ఉనికి ఈ శరీరమంతా వ్యాపించి ఉంది అని వివరిస్తాడు. ఆరడుగుల ఎత్తు, 80 కిలోల బరువు ఉన్న దేహంలోనే వ్యక్తి అంతటా వ్యాపించి ఉన్నపుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ సర్వాంతర్యామిగా ఈ ప్రకృతిలో అంతటా వ్యాపించి ఉండడంలో అతిశయోక్తి లేదు. అన్నీ తానే అయినపుడు దేనిని పూజించినా దానికి ఆయన స్పందిచడంలో ఆశ్చర్యమే లేదు. విగ్రహాన్ని పూజిస్తే పరమాత్ముణ్ణి పూజించడమే అవుతుంది.
అందుకే! హిందువులు సగుణాన్ని ఆరాధిస్తున్నా, వారు నిర్గుణానికి ఎంత మాత్రమూ దూరం కారనే సత్యాన్ని హిందూధర్మం చాటుతోంది.
స్వామి పరిపూర్ణానంద
Read More

శ్రీరామభక్తుడైన ఆంజనేయస్వామిని స్మరిస్తే సకల భూత, ప్రేత, పిశాచ భయాలు తొలగిపోతాయి.

శ్రీరామభక్తుడైన ఆంజనేయస్వామిని స్మరిస్తే సకల భూత, ప్రేత, పిశాచ భయాలు తొలగిపోతాయి. స్వామివారి ఆరాధనలో పంచముఖ ఆంజనేయస్వామి ప్రార్థనకు విశిష్టత వుంది. శ్రీ హనుమాన్‌ మాలా మంత్రాన్ని జపిస్తే అన్ని వ్యాధులు, పీడలు తొలగిపోతాయని పరాశర సంహితలోని ఆంజనేయచరిత్ర వివరిస్తోంది. ఐదు ముఖాలతో వుండే స్వామివారి ఒక్కొక్క ముఖానికి ఒక్కో గుణముంది. హనుమాన్‌ ప్రధానముఖంగా వుంటుంది. ఈ ముఖాన్ని చూస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది. నారసింహునికి అభీష్టసిద్ధి, గరుడునికి సమస్త కష్టాలను నాశనం చేసే శక్తి వుంటుంది. కుడివైపు చివరన వుండే వరహా ముఖం దానప్రపత్తిని ఎడమవైపు చివరన వుండే హయగ్రీవ ముఖం సర్వవిద్యలను కలుగజేస్తాయి. అందుకనే పంచముఖ ఆంజనేయస్వామి దర్శనం అన్ని విధాల శుభమని పురాణాలు చెబుతున్నాయి. తుంగభద్ర నదీతీరంలో స్వామి వారి కోసం తపస్సు ఆచరించిన శ్రీరాఘవేంద్రస్వామికి ఆంజనేయస్వామి పంచముఖ ఆంజనేయులుగా ప్రత్యక్షమైనట్టు తెలుస్తోంది. పంచముఖ హనుమాన్‌కు వున్న పదిచేతుల్లోని ఆయుధాలు భక్తులను సదా రక్షిస్తాయి. నాలుగు దిక్కులతో పాటు పైనుంచి వచ్చే విపత్తులనుంచి భక్తులను కాపాడేందుకు స్వామి పంచముఖంగా దర్శనమిస్తారు.
Read More

అజంతా గుహలు

అజంతా గుహలు
మహారాష్ట్ర రాష్ట్రం, మన్మాడ్ కు తూర్పుగా సుమారు 50 కి.మీ., దూరంలో జలగాం అనే రైల్వేస్టేషన్ ఉంది. ఈ జలగాం నుండి అజంతా గుహలు సుమారు 60 కి.మీ., దూరంలో ఉన్నాయి. రెండువేల సంవత్సరాల క్రితమే అంటే ప్రపంచానికి నాగరికత తెలియని నాడే భారతదేశంలో నాగరికత, ఉత్తమ శాస్త్రీయ విజ్ఞానము, వెల్లివిరిసిందంటే అతిశయోక్తి కాదు. అజంతా, ఎల్లోరా గుహలలోని శిల్పాలు, చిత్రాలు అత్యద్భుతాలు. సుమారు రెండువేల సంవత్సరాలకు పూర్వమే మనవారు చూపించిన శిల్పకళా, చిత్రకళా నైపుణ్యమూ, అద్వితీయం. అజంతాలోని గుహలు అర్థచంద్రాకారంగా ఉన్న ఒక కొండల వరసను, ముందుభాగం వైపు తొలచి నిర్మించారు. గుహల లోపల వివిధ రకాల శిల్పాలే కాక, రంగులతో చిత్రాలు అనేకం చిత్రించారు. ఈ గుహలన్ని కొండపాద భాగం నుండి సుమారు 250 అడుగుల ఎత్తున ఉన్నాయి. అంటే కొండ మధ్యభాగంలో ఉన్నాయి. అర్థచంద్రాకారంగా ఉన్న ఈ వరసకు, ఎదురుగా మరొక అర్థచంద్రాకారపు కొండల వరస ఉంది. ఈ రెండు వరుసలకు మధ్యగా ఉన్న పల్లంలో, ఒక చిన్న వాగు ప్రవహిస్తూ ఉంటుంది. దీనిని ప్రస్తుతం అజంతానది అంటారు. కానీ దీని అసలు పేరు ‘వాఘిర’ నది. ఇది ఏడురూపాలుగా ప్రవహిస్తూ ఉంటుంది. కనుక దీనిని సప్తకుండం అని కూడా అంటారు. అజంతా గుహాలయంలోని 30 గుహలను యునెస్కో ప్రపంచ హెరిటేజ్ ప్రదేశాలుగా గుర్తించింది. ఈ గుహలను 1819 లో యాదృశ్ఛికంగా గుర్తించారు. మద్రాసు 28వ అశ్విక దళానికి చెందిన జాన్ స్మిత్ ఈ ప్రాంతానికి వేటకు వచ్చినపుడు 10వ గుహ అగ్రభాగాన్ని చూడటంతో ప్రస్తుత ప్రపంచంలోకి అజంతా గుహల ఉనికి వెలుగులోకి వచ్చింది.
గుహ నెం 1:- అజంతా గుహలన్నింటిలోకి ఇది చాలా గొప్పది. గుహముందుభాగంలోని వరండా, లోపల ఉన్న స్తంభాల మీద ఎన్నో అందమైన చెక్కడాలు, రంగురంగుల చిత్రాలు ఉన్నాయి. ఈ గుహలోని గోడలకు ఉన్న చిత్రాలలో ఎక్కువ భాగం జాతక కథలకు సంబంధించినవి. ఎడమ వైపు ఉన్న గొడమీద చిత్రాలలో మొదటిది శిబిచక్రవర్తి తన తొడను కోసి, ఆ మాంసం త్రాసులో వేస్తున్న దృశ్యం ఉంది. దాని ప్రక్కనే, గౌతమబుధ్ధుడు జ్ఞానం పొందటం కోసం తపస్సు చేస్తుండగా, ‘మారుడు’ మొదలెన దుష్టశక్తులు ఆయనకు అడ్డంకులు కల్పించటానికి ప్రయత్నిస్తున్నట్లు అద్భుతంగా శిల్పాలు మలిచారు. గర్భగుడిలోని గదిలో పదకొండు అడుగుల ఎత్తు ఉన్న ఒక బుద్దుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం యొక్క ముఖంలో ఒక విశిష్టమైన శిల్పచాతుర్యం ఉంది. ముందువైపు నుండి సూటిగా చూస్తే ఆ ముఖంలో పరమ శాంత రసంతో ఉట్టిపడుతున్నట్లుగా, కుడివైపు నుంటి చూస్తే సంతోషంగా చిరునవ్వు నవ్వుతున్నట్లు, ఎడమ వైపు నుంచి చూస్తే దుఃఖంతో విచారంగా ఉన్నట్లుగానూ కనిపిస్తుంది. ఇచ్చట ఒక స్తంభం మీద ఒక అపురూపమైన శిల్పం ఉంది. నాలుగు లేళ్లు ఒకదాని ప్రక్కన ఒకటి గుంపుగా వివిధ భంగిమల్లో ఉన్నాయి. నాలుగింటికి కలిపి ఉమ్మడిగా ఒకే ఒక మెడ, ఈ మెడతో కూడిన తల కనిపిస్తుంది. ఈ తలతో ఆ నాలుగింటిలో దేని దేహానికైనా కలిపి చూస్తే, ఆ తల భాగం ఆ లేడికి సంబంధించిందిగానే మనకు కనిపనిస్తుంది.
గుహ నెం 2 :- ఇది దాదాపు ఒకటవ నెంబరు గుహలాగే ఉంటుంది. లోపల ఎడమచేతి వైపు గోడమీద బుద్దుని జన్మకు సంబంధించిన దృశ్యాలు అనేకం ఉన్నాయి.
గుహ నెం 3 :- ఏమీ లోవు
గుహ నెం 4 :- ఇది గుహలన్నిటిలోకి అతి పెద్ద గుహ. ఇది ఒక విహారం, ముందు భాగంలోని వరండాలో అత్యంత సుందరమైన చెక్కడపు పని కనిపిస్తుంది. లోపల హాలులో 28 స్తంభావు ఉన్నాయి.
గుహ నెం 5 :- ఈ గుహలో కొన్ని సాసాలభంజికల శిల్పాలు ఉన్నాయి.
గుహ నెం 6 :- ఇది అజంతాలో రెండు అంతస్థులు కలిగిన ఒకే ఒక గుహ. ఇందులో వివిధ భంగిమల్లో ఉన్న బుద్ధుని మూర్తులు అనేకం చెక్కబడి ఉన్నాయి.
గుహ నెం 7,8 :- వీటిలో ఎలాంటి శిల్పాలు లేవు
గుహ నెం 9 :- ఇది క్స్తు పూర్వం ఒకటవ శతాబ్దంలో నిర్మించబడిన గుహ. ఇది ఒక చైతన్యం. ఇందులో బుద్ధుని కాలం నాటి సాఘీక జీవనానికి సంబంధించిన దృశ్యాలు చిత్రించబడి ఉన్నాయి.
గుహ నెం 10 :- ఇది కూడా ఒక చైతన్యమే.
గుహ నెం 11 :- ఈ గుహలోని చిత్రాలన్నీ శిథిలావస్తలో ఉన్నాయి.
గుహ నెం 12 :- ఆది కూడా ఒక ప్రాచీనమైన విహారం. బౌద్ధులు నివసించటానికి వీలుగా గదులు, అందులో పడకలు కూజా ఉన్నాయి.
గుహ నెం 13,14,15 :- ఏమీ లోవు
గుహ నెం 16 :- ఈ గుహ ముందు నిలబడి చూస్తే, అజంతా గుహలు ఉన్న ప్రాంతమంతా, ఆ చివరి నుండి ఈ చివరవరకూ కనిపిస్తుంది. ఈ గుహలోపల ఉన్న బద్ధుని విగ్రహం చాలా అందంగా ఉంటుంది.
గుహ నెం 17 :- ఈ గుహ దాదాపు 16వ నెంబరు గుహ మాదిరే నిర్మించబడింది. ఎడమ చేతి వైపు ఉన్న గొడమీద బౌద్దమత పవుత్ర చిహ్నమైన ‘ధర్మచక్రం’ ఉంది. ఈ చత్రానికి ఆనుకునే మరొక చిత్రం ఉంది. అది సుజాత శరణాగతు. ఈ గుహలోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అజంతా సుందరి అలంకరణ చిత్రం ఉన్నది.
గుహ నెం 18 :- అందులో ఏమీ లేవు
గుహ నెం 19 :- ఇది ఒక చైతన్యం.
గుహ నెం 20,21 :- ఈ రెండు గుహలలోనూ అనేకమైన మంచి శిల్పాలు ఉన్నాయి.
గుహ నెం 22,23,24,25 :- ఇందులో ఏమీ లేవు
గుహ నెం 26 :- ఇది అజంతా గుహలో చివరు గుహ. ఈ గుహలోని గోడలకు బుద్ధుని విగ్రహ మూర్తులు అనేకం ఉన్నాయి. ఎడమవైపున ఉన్న గోడమీద, బుద్ధ భాగవానుని నిర్మాణం చెక్కిన శిల్పం ఉంది. ఇది మహాద్భుతమైనది. సుమారు 20 అడుగుల పొడవుగల పడుకొని ఉన్న భంగిమలో బుద్ధుని ప్రతిన కనిపిస్తుంది. ఆ ముఖంలో ఉండే నిర్వికారమైన శాంతిభావము చూపరులకు స్పష్టంగా కనిపిస్తూ చాలా గొప్పగా ఉన్నది. బుద్ధుని మూర్తికి క్రింది భాగంలోనూ, ప్రక్కలా, ఎంతోమంది దుఃఖిస్తూ ఉండటం సజీవంగా చెక్కబడింది. ఆ దుఃఖిస్తున్న వారిలో ఒక్కొక్క భంగిమ, ఒక్కొక్క ప్రత్యేక భావము వ్యక్తీకరిస్తూ చెక్కిన తీరు నిజంగా అత్యద్భుతమే. బుద్ధుడు తనువు చాలిస్తున్నందుకు ఒక శిష్యుడు కంటతడి పెడుతుండగా, పైన బుద్ధిడి దివ్యశరీరాన్ని దేవతలు స్వాగతిస్తున్నట్లు అద్భుతంగా చెక్కారు. 26ల నెంబరు గుహకు ఆనికొని ఉన్న కొండ శిఖరం మీద నుండి, ఒక నీటి ప్రవాహం క్రిందకూ జారుతూ, జలపాతంలాగా పడుతూ ఉంటుంది. అజంతా గుహలకు సోమవారం సెలవు.
Read More

తెలుగు హనుమాన్ చాలిసాతెలుగు హనుమాన్ చాలిసా

శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు ||

బుద్ధిహీనతను కలిగిన తనువులు
బుద్భుదములని తెలుపు సత్యములు ||శ్రీ||

1. జయ హనుమంత జ్ణానగుణవందిత
జయపండిత త్రిలోక పూజిత ||

2.రామదూత అతులిత బలధామ
అంజనీపుత్ర పవనసుతనామ ||

3. ఉదయభానుని మధురఫలమని
భావన లీల అమృతమును గ్రోలిన ||

4. కాంచనవర్ణ విరాజితవేశా
కుండలమండిత కుంచితకేశా ||శ్రీ||

5. రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి
రాజపదవి సుగ్రీవున నిలిపి ||

6. జానకీపతి ముద్రిక దోడ్కొని
జలధి లంఘించి లంక జేరుకొని ||

7. సూక్ష్మరూపమున సీతను చూచి
వికటరూపమున లంకను గాల్చి ||

8. భీమరూపమున అసురుల జంపిన
రామకార్యమును సఫలముజేసిన ||శ్రీ||

9. సీత జాడకని వచ్చిననిను కని
శ్రీరఘువీరుడు కౌగిట నినుగొని ||

10. సహస్రరీతుల నిను కొనియాడగ
కాగలకార్యం నీపై నిడగా ||

11. వానరసేనతో వారధిదాటి
లంకేశునితో తలపడి పోరి ||

12. హోరుహోరున పోరుసాగిన
అసురసేనల వరుసన గోల్చిన ||శ్రీ||

13. లక్ష్మణ మూర్చతో రాముడడలగ
సంజీవిదెచ్చిన ప్రాణప్రదాత ||

14. రామలక్ష్మణుల అస్త్రధాటికి
అసురవీరులు అస్తమించిరి ||

15. తిరుగులేని శ్రీరామ బాణము
జరిపించెను రావణ సంహారము ||

16. ఎదిరిలేని ఆ లంకాపురమున
ఏలికగా ఆ విభీషణు చేసిన ||శ్రీ||

17. సీతారాములు నగవులు గనిరి
ముల్లోకాల హారతులందిరి ||

18. అంతులేని ఆనందాశ్రువులే
అయోధ్యాపురి పొంగిపొరలే ||

19. సీతారాముల సుందర మందిరం
శ్రీకాంతుపదం నీ హృదయం ||

20. రామచరిత కర్ణామృతగానా
రామనామ రసామృతపాన ||శ్రీ||

21. దుర్గమమగు ఏ కార్యమైన
సుగమమేయగు నీ కృపజాలిన ||

22. కలుగు సుఖములు నిను శరణన్న
తొలగు భయములు నీ రక్షణయున్న ||

23. రామద్వారపు కాపరివైన నీ
కట్టడిమీర బ్రహ్మాదుల తరమా ||

24. భూతపిశాచ శాకినీ ఢాకినీ
భయపడి పారు నీ నామ జపమువిని ||శ్రీ||

25. ధ్వజావిరాజా వజ్రశరీరా
భుజబలతేజా గదాధరా ||

26. ఈశ్వరాంశ సంభూత పవిత్ర
కేసరీపుత్ర పావనగాత్ర ||

27. సనకాదులు బ్రహ్మాదిదేవతలు
శారద నారద ఆదిశేషులు ||

28. యమకుబేర దిక్పాలురు కవులు
పులకితులైరి నీ కీర్తిగానముల ||శ్రీ||

29. సోదర భరత సమానాయని
శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమా ||

30. సాధులపాలిట ఇంద్రుడవన్నా
అసురలపాలిట కాలుడవన్నా ||

31. అష్టసిద్ధి నవనిధులకు దాతగా
జానకీమాత దీవించెనుగా ||

32. రామరసామృతపానము చేసిన
మృత్యుంజయదవై వెలసిన ||శ్రీ||

33. నీనామ భజన శ్రీరామ రంజన
జన్మ జన్మాంతర దుఃఖభంజన ||

34. ఎచ్చటుండినా రఘువరదాసు
చివరకు రాముని చేరుట తెలుసు ||

35. ఇతర చింతనలు మనసున మోతలు
స్థిరముగ మారుతి సేవలు సుఖములు ||

36. ఎందెందున శ్రీరామ కీర్తన
అందందున హనుమాను నర్తన ||శ్రీ||

37. శ్రద్ధగా దీనిని ఆలకింపుమా
శుభమగు ఫలములు గలుగుసుమా ||

38. భక్తిమీరగ గానముసేయగ
ముక్తి గలుగు గౌరీశులసాక్షిగ ||

39. తులసీదాస హనుమాను చాలీసా
తెలుగున సుళువుగ నలుగురు పాడగ ||

40. పలికిన సీతారాముని పలుకున
దోశములున్న మన్నింపుమన్నా ||శ్రీ||

మంగళ హారతి గొను హనుమంత - సీతారామ లక్ష్మణ సమేత |
నా అంతరాత్మ నిలుమో అనంత - నీవే అంతా శ్రీహనుమంత ||
సంపూర్ణము ఓం శాంతిః శాంతిః శాంతిః
Read More

అజంతా గుహలు

అజంతా గుహలు
మహారాష్ట్ర రాష్ట్రం, మన్మాడ్ కు తూర్పుగా సుమారు 50 కి.మీ., దూరంలో జలగాం అనే రైల్వేస్టేషన్ ఉంది. ఈ జలగాం నుండి అజంతా గుహలు సుమారు 60 కి.మీ., దూరంలో ఉన్నాయి. రెండువేల సంవత్సరాల క్రితమే అంటే ప్రపంచానికి నాగరికత తెలియని నాడే భారతదేశంలో నాగరికత, ఉత్తమ శాస్త్రీయ విజ్ఞానము, వెల్లివిరిసిందంటే అతిశయోక్తి కాదు. అజంతా, ఎల్లోరా గుహలలోని శిల్పాలు, చిత్రాలు అత్యద్భుతాలు. సుమారు రెండువేల సంవత్సరాలకు పూర్వమే మనవారు చూపించిన శిల్పకళా, చిత్రకళా నైపుణ్యమూ, అద్వితీయం. అజంతాలోని గుహలు అర్థచంద్రాకారంగా ఉన్న ఒక కొండల వరసను, ముందుభాగం వైపు తొలచి నిర్మించారు. గుహల లోపల వివిధ రకాల శిల్పాలే కాక, రంగులతో చిత్రాలు అనేకం చిత్రించారు. ఈ గుహలన్ని కొండపాద భాగం నుండి సుమారు 250 అడుగుల ఎత్తున ఉన్నాయి. అంటే కొండ మధ్యభాగంలో ఉన్నాయి. అర్థచంద్రాకారంగా ఉన్న ఈ వరసకు, ఎదురుగా మరొక అర్థచంద్రాకారపు కొండల వరస ఉంది. ఈ రెండు వరుసలకు మధ్యగా ఉన్న పల్లంలో, ఒక చిన్న వాగు ప్రవహిస్తూ ఉంటుంది. దీనిని ప్రస్తుతం అజంతానది అంటారు. కానీ దీని అసలు పేరు ‘వాఘిర’ నది. ఇది ఏడురూపాలుగా ప్రవహిస్తూ ఉంటుంది. కనుక దీనిని సప్తకుండం అని కూడా అంటారు. అజంతా గుహాలయంలోని 30 గుహలను యునెస్కో ప్రపంచ హెరిటేజ్ ప్రదేశాలుగా గుర్తించింది. ఈ గుహలను 1819 లో యాదృశ్ఛికంగా గుర్తించారు. మద్రాసు 28వ అశ్విక దళానికి చెందిన జాన్ స్మిత్ ఈ ప్రాంతానికి వేటకు వచ్చినపుడు 10వ గుహ అగ్రభాగాన్ని చూడటంతో ప్రస్తుత ప్రపంచంలోకి అజంతా గుహల ఉనికి వెలుగులోకి వచ్చింది.
గుహ నెం 1:- అజంతా గుహలన్నింటిలోకి ఇది చాలా గొప్పది. గుహముందుభాగంలోని వరండా, లోపల ఉన్న స్తంభాల మీద ఎన్నో అందమైన చెక్కడాలు, రంగురంగుల చిత్రాలు ఉన్నాయి. ఈ గుహలోని గోడలకు ఉన్న చిత్రాలలో ఎక్కువ భాగం జాతక కథలకు సంబంధించినవి. ఎడమ వైపు ఉన్న గొడమీద చిత్రాలలో మొదటిది శిబిచక్రవర్తి తన తొడను కోసి, ఆ మాంసం త్రాసులో వేస్తున్న దృశ్యం ఉంది. దాని ప్రక్కనే, గౌతమబుధ్ధుడు జ్ఞానం పొందటం కోసం తపస్సు చేస్తుండగా, ‘మారుడు’ మొదలెన దుష్టశక్తులు ఆయనకు అడ్డంకులు కల్పించటానికి ప్రయత్నిస్తున్నట్లు అద్భుతంగా శిల్పాలు మలిచారు. గర్భగుడిలోని గదిలో పదకొండు అడుగుల ఎత్తు ఉన్న ఒక బుద్దుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం యొక్క ముఖంలో ఒక విశిష్టమైన శిల్పచాతుర్యం ఉంది. ముందువైపు నుండి సూటిగా చూస్తే ఆ ముఖంలో పరమ శాంత రసంతో ఉట్టిపడుతున్నట్లుగా, కుడివైపు నుంటి చూస్తే సంతోషంగా చిరునవ్వు నవ్వుతున్నట్లు, ఎడమ వైపు నుంచి చూస్తే దుఃఖంతో విచారంగా ఉన్నట్లుగానూ కనిపిస్తుంది. ఇచ్చట ఒక స్తంభం మీద ఒక అపురూపమైన శిల్పం ఉంది. నాలుగు లేళ్లు ఒకదాని ప్రక్కన ఒకటి గుంపుగా వివిధ భంగిమల్లో ఉన్నాయి. నాలుగింటికి కలిపి ఉమ్మడిగా ఒకే ఒక మెడ, ఈ మెడతో కూడిన తల కనిపిస్తుంది. ఈ తలతో ఆ నాలుగింటిలో దేని దేహానికైనా కలిపి చూస్తే, ఆ తల భాగం ఆ లేడికి సంబంధించిందిగానే మనకు కనిపనిస్తుంది.
గుహ నెం 2 :- ఇది దాదాపు ఒకటవ నెంబరు గుహలాగే ఉంటుంది. లోపల ఎడమచేతి వైపు గోడమీద బుద్దుని జన్మకు సంబంధించిన దృశ్యాలు అనేకం ఉన్నాయి.
గుహ నెం 3 :- ఏమీ లోవు
గుహ నెం 4 :- ఇది గుహలన్నిటిలోకి అతి పెద్ద గుహ. ఇది ఒక విహారం, ముందు భాగంలోని వరండాలో అత్యంత సుందరమైన చెక్కడపు పని కనిపిస్తుంది. లోపల హాలులో 28 స్తంభావు ఉన్నాయి.
గుహ నెం 5 :- ఈ గుహలో కొన్ని సాసాలభంజికల శిల్పాలు ఉన్నాయి.
గుహ నెం 6 :- ఇది అజంతాలో రెండు అంతస్థులు కలిగిన ఒకే ఒక గుహ. ఇందులో వివిధ భంగిమల్లో ఉన్న బుద్ధుని మూర్తులు అనేకం చెక్కబడి ఉన్నాయి.
గుహ నెం 7,8 :- వీటిలో ఎలాంటి శిల్పాలు లేవు
గుహ నెం 9 :- ఇది క్స్తు పూర్వం ఒకటవ శతాబ్దంలో నిర్మించబడిన గుహ. ఇది ఒక చైతన్యం. ఇందులో బుద్ధుని కాలం నాటి సాఘీక జీవనానికి సంబంధించిన దృశ్యాలు చిత్రించబడి ఉన్నాయి.
గుహ నెం 10 :- ఇది కూడా ఒక చైతన్యమే.
గుహ నెం 11 :- ఈ గుహలోని చిత్రాలన్నీ శిథిలావస్తలో ఉన్నాయి.
గుహ నెం 12 :- ఆది కూడా ఒక ప్రాచీనమైన విహారం. బౌద్ధులు నివసించటానికి వీలుగా గదులు, అందులో పడకలు కూజా ఉన్నాయి.
గుహ నెం 13,14,15 :- ఏమీ లోవు
గుహ నెం 16 :- ఈ గుహ ముందు నిలబడి చూస్తే, అజంతా గుహలు ఉన్న ప్రాంతమంతా, ఆ చివరి నుండి ఈ చివరవరకూ కనిపిస్తుంది. ఈ గుహలోపల ఉన్న బద్ధుని విగ్రహం చాలా అందంగా ఉంటుంది.
గుహ నెం 17 :- ఈ గుహ దాదాపు 16వ నెంబరు గుహ మాదిరే నిర్మించబడింది. ఎడమ చేతి వైపు ఉన్న గొడమీద బౌద్దమత పవుత్ర చిహ్నమైన ‘ధర్మచక్రం’ ఉంది. ఈ చత్రానికి ఆనుకునే మరొక చిత్రం ఉంది. అది సుజాత శరణాగతు. ఈ గుహలోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అజంతా సుందరి అలంకరణ చిత్రం ఉన్నది.
గుహ నెం 18 :- అందులో ఏమీ లేవు
గుహ నెం 19 :- ఇది ఒక చైతన్యం.
గుహ నెం 20,21 :- ఈ రెండు గుహలలోనూ అనేకమైన మంచి శిల్పాలు ఉన్నాయి.
గుహ నెం 22,23,24,25 :- ఇందులో ఏమీ లేవు
గుహ నెం 26 :- ఇది అజంతా గుహలో చివరు గుహ. ఈ గుహలోని గోడలకు బుద్ధుని విగ్రహ మూర్తులు అనేకం ఉన్నాయి. ఎడమవైపున ఉన్న గోడమీద, బుద్ధ భాగవానుని నిర్మాణం చెక్కిన శిల్పం ఉంది. ఇది మహాద్భుతమైనది. సుమారు 20 అడుగుల పొడవుగల పడుకొని ఉన్న భంగిమలో బుద్ధుని ప్రతిన కనిపిస్తుంది. ఆ ముఖంలో ఉండే నిర్వికారమైన శాంతిభావము చూపరులకు స్పష్టంగా కనిపిస్తూ చాలా గొప్పగా ఉన్నది. బుద్ధుని మూర్తికి క్రింది భాగంలోనూ, ప్రక్కలా, ఎంతోమంది దుఃఖిస్తూ ఉండటం సజీవంగా చెక్కబడింది. ఆ దుఃఖిస్తున్న వారిలో ఒక్కొక్క భంగిమ, ఒక్కొక్క ప్రత్యేక భావము వ్యక్తీకరిస్తూ చెక్కిన తీరు నిజంగా అత్యద్భుతమే. బుద్ధుడు తనువు చాలిస్తున్నందుకు ఒక శిష్యుడు కంటతడి పెడుతుండగా, పైన బుద్ధిడి దివ్యశరీరాన్ని దేవతలు స్వాగతిస్తున్నట్లు అద్భుతంగా చెక్కారు. 26ల నెంబరు గుహకు ఆనికొని ఉన్న కొండ శిఖరం మీద నుండి, ఒక నీటి ప్రవాహం క్రిందకూ జారుతూ, జలపాతంలాగా పడుతూ ఉంటుంది. అజంతా గుహలకు సోమవారం సెలవు.
Read More

సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం

సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం
ఈ స్తోత్రం పఠించడం వలన సర్వవిద్యా ప్రాప్తి – వాక్శుద్ధి కలుగుతుంది.
సరస్వతీ త్వియం దృష్ట్వా వీణా పుస్తకధారిణీ
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ|| 1
ప్రథమం భారతీనామం ద్వితీయం చ సరస్వతీ
తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహనా|| 2
పంచమం జగతీఖ్యాటం షష్టం వాగీశ్వరీ తథా
కౌమౌరీ సప్తమం ప్రోక్త మష్టమం బ్రహ్మచారిణీ|| 3
నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయినీ
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ|| 4
బ్రాహ్మీ ద్వాదశనామాని త్రిసంధ్యం యఃపఠేవ్నరః
సర్వసిద్ధి కరీం తస్య ప్రసన్నా పరమేశ్వరీ|| 5
సా మే వస్తూనే జిహ్వాగ్రే బ్రహ్మరూపీ సరస్వతీ||
ఇతి శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రమ్ సంపూర్ణం||
Read More

కర్ణుడిని కృష్ణుడు ఎప్పుడు పడితే అప్పుడు దానకర్ణుడని అభివర్ణించడం అర్జునుడికి నచ్చలేదు.

కర్ణుడిని కృష్ణుడు ఎప్పుడు పడితే అప్పుడు దానకర్ణుడని అభివర్ణించడం అర్జునుడికి నచ్చలేదు. కృష్ణుడితో అర్జునుడు వాదనకు దిగుతాడు. ఈ విషయమై వీరి మధ్య చాలాసేపే మాటలు సాగాయి. ఇక లాభం లేదనుకున్న కృష్ణుడు వెంటనే ఒక బంగారు పర్వతం సృష్టించాడు. అర్జునుడితో కృష్ణుడు ఆ బంగారు పర్వతాన్ని ఈ రోజు సాయంత్రం లోపల ఒక్క ముక్క మిగల్చకుండా దానం చెయ్యాలి. అలా నువ్వు చేస్తే నేను నిన్ను దానం చేయడంలో కర్ణుడి కన్నా గొప్ప వాడిగా చెప్తాను. కొనియాడుతాను. సరేనా అని అంటాడు. అర్జునుడు ఈ విషయాన్ని ఊరు ఊరంతా ప్రచారం చేయిస్తాడు. తాను బంగారు పర్వతాన్ని దానం చేయబోతున్నాను అని అంటాడు. అందరినీ రమ్మంటాడు. అలాగే అందరూ వస్తారు. బంగారాన్ని ముక్కలు చేసి దానం చెయ్యడం ప్రారంభిస్తాడు అర్జునుడు. అలా ఇస్తూనే ఉంటాడు అర్జునుడు. అయినా వరస తగ్గుతోంది కాని బంగారం ఇంకా మిగిలే ఉంది. కృష్ణుడు చెప్పినట్టు ఆ రోజు సాయంత్రం లోపల అర్జునుడు దానం చెయ్యలేకపోతాడు. సగం కూడా దానం చెయ్యలేదు. ఇంతలో ఆవైపుగా కర్ణుడు వస్తాడు. కృష్ణుడు కర్ణుడిని పిలిచి "కర్ణా...ఈ బంగారు పర్వతాన్ని రేపు ఉదయం లోపు దానం చెయ్యాలి...నీ వల్ల అవుతుందా" అని అడుగుతాడు. కర్ణుడు "అదేం పెద్ద పని కాదే...ఇది దానం చెయ్యాలి అంతేగా... " అంటూ కర్ణుడు అటు వచ్చిన ఇద్దరిని పిలిచి "ఈ బంగారు పర్వతాన్ని మీ ఇద్దరికీ దానం చేస్తున్నాను...దీనిని మీరిద్దరూ సరిసమానంగా పంచుకుని ఉపయోగించుకోండి" అని వారిద్దరికీ ఆ బంగారాన్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కర్ణుడు. అప్పుడు కృష్ణుడు అర్జునుని చూసి "ఇప్పుడు నీకు, కర్ణుడికి మధ్య ఉన్న తేడా తెలిసిందా...? ఈ బంగారు పర్వతాన్ని పూర్తిగా ఇచ్చేయ్యాలనే ఆలోచన రానే లేదు. మరి నిన్ను దానం చేయడంలో కర్ణుడిని మించిన వాడివని ఎలా కొనియాడను" అని ప్రశ్నిస్తాడు. అర్జునుడి నోటంట మరో మాట లేదు. ఒక్కొక్కరి గుణం ఒక్కొక్కలాంటిది. ఎవరి ప్రత్యేకత వారిది. కర్ణుడు దానం చేయడంలో దిట్ట. ఈ విషయంలో అతనిని మించిన వారు లేరు అని చెప్పడానికి కృష్ణుడు ఆడిన నాటకమిది
Read More

Why does a mother give birth to a baby though it is an excruciating task or why a soldier does encounter the enemy though he knows it is a risky mission?Why does a mother give birth to a baby though it is an excruciating task or why a soldier does encounter the enemy though he knows it is a risky mission?
Yes, these questions are indeed genuine and the answers are much more valid.

Let us try to understand what Poojyasri Paripoornananda Swamiji is trying to communicate regarding the likes and dislikes Vs Duty mindedness.

The individual shall perform one’s own duty with firm determination and strong conviction. Sometimes, one may develop a sort of disliking towards one’s sense of duty. But if the individual start performing it with great zeal and attention, then that eventually gives the pleasure of doing it. Doesn’t the bitter guard juice taste better when we take it regularly? Of course, it does. In a similar manner, if we make up our mind and strongly determined for doing so, then there is nothing difficult in this world. Some people may attend for a spiritual discourse instead of killing the time by nonsensical means. What is the reason? Because they think that going to discourse would be a superior choice.
A mother is prepared to give birth to a baby though she knows that she is going to experience the intolerable pain. Why? Because the mother has a strong liking towards giving birth to her baby. A soldier never runs away from the enemy though he gets terribly injured. He fights for his nation even from the death-bed. What is the reason behind this sacrifice? It is very obvious that he had the awareness that his life becomes meaningful in performing his duty with honesty and sincerity.
On the other hand, if anybody gets inclined to betray the nation and turns out to be a traitor, he may enjoy the benefits temporarily but he falls from his dignity or virtue forever. Hence one shall carry out the duties based with conviction and duty mindedness but not with respect to the personal liking or disliking.
That was what announced in Bhagavath Geeta (counselling given by Lord Krishna to Arjuna in order to perform his duty instead of thinking about his liking or disliking).It says that even if the life gets ended up in carrying out one’s own duty without any second thought is always prosperous and the other way it creates unnecessary fear if we perform the duty based on our liking or disliking.
Read More

అన్నదానానికి నిజమైన అర్థం:-

అన్నదానానికి నిజమైన అర్థం:-
భారతీయులు “అన్నాన్ని” పరబ్రహ్మంతో పోల్చతూ ‘ అన్నం పరబ్రహ్మ స్వరూపం ‘ అని భావించారు. అన్నం కారణంగానే మన జీవన నాటకం భూమి మీద కొనసాగుతోంది. జీవితంలో ఓ వ్యక్తికి ఏది లోపించినా బ్రతకగలడు కానీ అన్నం లోపిస్తే ఎన్ని ఉన్నా బ్రతుక లేడు. కావున అన్నదానం మహోన్నతమైనది. అన్నం లేనివాడికి లేదా తినడానికి ఆ సమయంలో అన్నం లేనివాడికి పెట్టిన అన్నమే అన్నదానమౌతుందని ఇక్కడ గ్రహించాలి. అన్నదానంలో పాల్గోంటే పుణ్యమస్తుందని ఉన్నవాడు కూడా తినడానికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది సరైనది కాదు. విందుకు మరియు అనందానానికి ఎంతో తేడా ఉంది. అన్నదానంలో అన్నాన్ని స్వీకరించిన వారు నేలపైబడిన ఎంగిలి మెతుకులను మరియు అన్నంపెట్టబడిన ఆకును అతడే తీసిపారవేయాలి. కానీ అన్నం పెట్టిన వారితో ఆ పని చేయించరాదు. అలాగే అన్నం పెట్టిన వారు కూడా అన్నం తిన్నవాడి ఎంగిలి మెతుకులకు మరియు అరటి ఆకులు తీసివేయడం సరియైనది కాదు. అలా చేస్తే తిన్నవాడికి హానికరమని చెప్పడం జరిగింది.
దీనికి విరుద్దముగా బంధుమిత్రులకు, సాధు సన్యాసులకు మరియు మహాత్మలకు అన్నం పెట్టినవాడు వారి పాత్రలను, మెతుకులను ఎత్తివేయుట, కంచాలను శుభ్రము చేయుట సరియైనది. అతిథి చేత అంట్లు తోమించారాదు, కేవలం అతిథ్యం మాత్రమే ఇవ్వలి. అలా అతిథి చేత ఎంగిలి మెతుకులు ఏరిస్తే, వారి కంచాలను వారినే కడిగేసుకో – మంటే అది విందు ఇచ్చిన వాడికి హానికరం. ‘ అన్నమో రామ చంద్రా! ‘ అనే వారే మన దేశం – లో ఎక్కువగా ఉన్నరు కాబట్టి, అలాంటి వారికి అన్నాని దానం చేయడంలో వెనుకంజ వేయరాదు. ఒకే రోజు కుప్పలు తెప్పలుగా జనాన్ని పిలిచి అన్నం పెట్టాడమే అన్నదాన మని భ్రమించకండి. మొదట మీ ఇంటి ముందుకు వచ్చిన బిక్షగాళ్ళకు ఒక వ్యక్తి తినేంతటి అన్నాన్ని మరియు శాకాన్ని దానం చేయంది.ఇంక ఎక్కువగా అన్నదానం చేయలనుకుంటే ప్రకటన ఇవ్వవచ్చు. అలా మనుషులకే కాక కుక్కలకు, కాకులకు, పిల్లలకు, చీమలు, పక్షులకు మొదలగు అనేక ప్రాణులకు కూడా ఆహారాన్ని ఇవ్వడం ఓక యజ్ఞమే అవుతుంది. సాధువులకు, భక్తులకు మరియు సాధకులకు విందునిచ్చుట ఎంతో ఫలవంతమైన కార్యమై ఉన్నది.
Read More

ప్రదక్షిణలు చేసేటపుడు మనం ఎలా ఉండాలి?

ప్రదక్షిణలు చేసేటపుడు మనం ఎలా ఉండాలి?
మనము దేవాలయమునకు వెళ్ళాలనుకున్నప్పుడు, స్వామివారిని దర్శించడానికి ముందు దేవాలయంలో ప్రదక్షిణలు చేసేటపుడు తొందర పనికిరాదు. మనస్సును ప్రశాంతపరచి, స్వామివారిని మనస్సును ధ్యానిస్తూ మంత్రం గాని, అష్టోత్తరం గాని, ఇవి ఏవి తెలియని వారు ఆ స్వామివారి నామజపము చేస్తూ భక్తితో ఆ దైవం చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఆలయంలోని గర్భగుడిలో దేవతా విగ్రహం ఉంటుంది. ప్రతి నిత్యం పురోహితులు జరిపే అర్చనలలోని మంత్రాల ద్వారా ఆ మంత్రాలలో ఉండే శక్తిని విగ్రహం క్రిందనున్న యంత్రం ఆ శక్తిని గ్రహించి, ఆ శక్తి ద్వారా మన కోర్కెలను తీరుస్తుంది. కనుక భగవదర్శనానికి వెళ్ళినప్పుడు మన మది నిండా భగవంతుని రూపమే నింపి నిదానంగా ప్రదక్షిణ చేసి ఆ స్వామి కృపకు పాత్రులు కావాలి.
Read More

శ్రీ అన్నపూర్ణాష్టకము

శ్రీ అన్నపూర్ణాష్టకము
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్దూతాఖిలఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీన
ప్రాలేయాచల వంశాపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్నేశ్వరీ|| 1
నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజుకుంభాంతరీ
కాశ్మీరాగరు వాసితాంగ రుచిరే కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ|| 2
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్టాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరి
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నా పూర్ణేశ్వరీ|| 3
కైలాసాచల కందరాలయకరీ గౌరీ ఉమా శంకరీ
కౌమారీ నిగమార్ధగోచరకరీ ఓంకార బీజాక్షరీ
మోక్షద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ|| 4
దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాదోదరీ
లీలానాటక సూత్రఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ
శ్రీవిశ్వేశమనః ప్రమోదనకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ|| 5
ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శాంకరీ
కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ
స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ|| 6
ఉర్వీ సర్వజయేశ్వరీ దయాకరీ మాతాకృపాసాగరీ
నారీ నీలసమానకుంతలధరీ నిత్యాన్న దానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నా పూణేశ్వరీ|| 7
దేవీ సర్వవిచిత్రరత్న రచితా దాక్షాయణీ సుందరీ
వామాస్వాదుపయోధర ప్రియకరీ సౌభాగ్యమహేశ్వరీ
భక్తాభీష్టకరీ దశాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ|| 8
చంద్రార్కనల కోటికోటి సదృశా చంద్రాంశు బింబాధరీ
చంద్రారాగ్ని సమాన కుండలభరీ చంద్రార్క వర్ణేశ్వరీ
మాలాపుస్తక పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ|| 9
క్షత్రత్రాణకరీ సదా శివకరీ మాతాకృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబకరీ మాతాన్న పూర్ణేశ్వరీ|| 10
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం బిక్షాం దేహీ చ పార్వతి|| 11
మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః
భాందవా శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్|| 12
Read More

అంజనాదేవి చరిత్ర

అంజనాదేవి చరిత్ర
తల్లిదండ్రులకు మంచిపేరు వచ్చినా, చెడ్డపేరు వచ్చినా, తమ సంతానంవల్లే. కులములో నొకడు గుణవంతుడైనా కులము వెలయు వాని గుణముచేత అని అంటాడు ‘యోగి వేమన’. నిజమే మరి. శ్రీరాముని కారణంగా, మొత్తం సూర్యవంశ పేరుప్రతిష్ఠలు దశదిశా వ్యాప్తమయ్యాయి. దుర్యోధనుని కారణంగా మొత్తం కురువంశ వృక్షమే కూకటివేళ్ళతో కూలిపోయింది. అలాగే గరుత్మంతుని కారణంగా మొత్తం పక్షిజాతికే గౌరవస్థానం దక్కింది. ఇక ఆంజనేయుని కారణంగా మొత్తం వానరజాతికే విశేషగౌరవం దక్కింది. తను పుడుతూనే తన తల్లికి ఆనందం కలిగించాడు. మరోతల్లి సీతమ్మ శోకాన్ని దూరంచేసాడు. మరి అట్టి మహనీయునికి జన్మనిచ్చిన ‘అంజనాదేవి’ చరిత్ర తెలుసుకుందాం.
పుంజికస్థల అనే అప్సరస, శాపకారణంగా అంజనాదేవిగా జన్మించిన ఓ వానరస్త్రీ. కుంజరుడనే ఓ వానరుని కుమార్తె. సంతాన కాంక్షతో తపస్సు చేస్తే పుట్టిన వానరకాంత ఈ ‘అంజనాదేవి’. ఈమెకు యుక్తవయస్సు రాగానే వివాహ ప్రయత్నాలు ప్రారంభించాడు కుంజరుడు. ఆ అన్వేషణలో తారసపడ్డవాడే ‘కేసరి’ అనే వానరవీరుడు. ఈ కేసరి ప్రభాసతీర్థారణ్య ప్రాంతాలలో సంచరించే ఓ వానరవీరుడు. నిజానికి అతని పేరు ‘కేసరి’ కాదు. అతని అసలు పేరు ఎవరికీ తెలియదు కూడా. అతనికి ‘కేసరి’ అనే పేరు రావడానికి కారణం ఉంది. ప్రభాసతీర్థారణ్యాలలో ఎందరో మునులు తపస్సు చేసుకుంటూండేవారు. ఈ కేసరి, ఆ మునులకు సేవలు చేస్తూ కాలం గడిపేవాడు. ఆ రోజులలో ‘శంఖము, శబలము’ అనే రెండు ఏనుగులు తరచు ఆ మునులను బాధిస్తూండేవి. కేసరి ఆ రెండు ఏనుగులను చంపి మునులకు ఆనందం కలిగించాడు. ఏనుగును చంపగలిగేది సింహం ఒక్కటే. కేసరి అంటే సింహం అనే అర్థం ఉంది. అందుకే...ఆ రెండు ఏనుగులను చంపిన కేసరి ప్రతాపానికి సంతసించిన భరద్వాజమహర్షి అతనికి ‘కేసరి’ అని పేరుపెట్టాడు. ఈ కేసరి ఘనత విన్న కుంజరుడు తన కుమార్తె అయిన అంజనాదేవిని, కేసరికి ఇచ్చి వివాహం జరిపించాడు. అంజన, కేసరుల సంసారయాత్ర సుఖంగా సాగుతోంది. అంజనాదేవి పుట్టుకతో వానరస్త్రీ అయినా అపురూప సౌందర్యవతి. నా దగ్గర ఉన్న పరమేశ్వర తేజోబీజాన్ని ధరించగల శక్తి నీకు మాత్రమే ఉన్నదని గ్రహించి, ఆ బీజాన్ని నీ గర్భక్షేత్రంలో నిక్షిప్తం చేసాను. నీకు మహాబలవంతుడు, కామరూపుడు, కారణజన్ముడు అయిన కుమారుడు కలుగుతాడు. అతని కారణంగా మీ దంపతుల జన్మలు చరితార్థమవుతాయి అని పలికి అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని తన భర్తకు చెప్పింది అంజనాదేవి. కారణజన్మడైన కుమారుడు కలుగబోతున్నందుకు కేసరికూడా సంతోషించాడు. అలా అంజనాదేవి, కేసరులకు జన్మించినవాడే ‘ఆంజనేయుడు’. ఈ కథను కిష్కింథాకాండ చివరిభాగంలో జాంబవంతునిచేత ., హనుమంతునికి చేప్పిస్తాడు వాల్మీకిమహర్షి. అంజనా గర్భసంభూతుడైన ఆంజనేయుడు ఎన్ని మహత్కార్యాలు చేసాడో మనందికీ తెలిసినదే.
Read More

సర్పయాగాన్ని ఆపిన ఆస్తీకుడు

సర్పయాగాన్ని ఆపిన ఆస్తీకుడు
"జరత్కారుడు'' అనే మహాముని ఉండేవాడు. అతడు మహా తపశ్శక్తి సంపన్నుడు, మహాజ్ఞాని, బ్రహ్మచారి. ఒకసారి జరత్కారుడు దేశసంచారం చేస్తూ పర్వతశిఖరాన ఉన్న ఓ వృక్షశాఖను వ్రేలాడుతూ, సద్గతులు లేక అలమటిస్తున్న తన పితురులను చూసి వారి ఆవేదనను అర్థం చేసుకుని వారికి సద్గతులు కలిగించాలని తలచి వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని కన్యాన్వేషణ చేస్తూ దేశాలు పట్టి తిరుగుతున్నాడు. అయితే, వార్థక్యస్థితిలో ఉన్న జరత్కారునకు, కన్యాదానం చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. పైగా జరత్కారుడు తన పేరు లాంటి పేరు వున్న కన్యనే వివాహం చేసుకుంటానని నియమం పెట్టుకున్నవాడు. ఇది ఒక కారణం జరత్కారునకు వివాహం కాకపోవడానికి. అందుచేత జరత్కారుడు బాధా తప్తహృదయుడై అరణ్యమధ్యంలోకి వెళ్ళి "ఈ చరాచర ప్రాణులు నా బాధను అర్థం చేసుకొనుగాక. నా పితరుల హితం కోరి, సంతాన కాంక్షతో వివాహం చేసుకోవాలని ప్రయత్నించి విఫలుడనయ్యాను. దయచేసి నా మనోభీష్టానికి తగిన కన్యను భిక్షగా ఇవ్వమని యాచిస్తున్నాను'' అని బిగ్గరగా రోదించాడు. జరత్కారుని సమీపంలో ఉన్న కొందరు నాగులు, అతని ఆవేదన విని ... ఈవిషయాన్ని తమ సోదరుడు, ప్రభువు అయిన వాసుకికి నివేదించాయి.
వాసుకికి జరత్కారుని శక్తిసామర్థ్యాలు, అతని నియమాలు తెలుసు. వెంటనే తన సోదరి అయిన "జరత్కారువు''ను నవవధువుగా అలంకరించి, జరత్కారుని దగ్గరకు తీసుకుని వెళ్ళి వివాహం చేసుకోమని అర్థించాడు. "నాగరాజా! వివాహానంతరం కూడా నీ సోదరి పోషణ భారం నీవే భరించాలి. నాకు ఇష్టంలేని పని ఈమె ఎప్పుడూ చెయ్యకూడదు. అలా చేసిన మరుక్షణం ఈమెను విడిచి వెళ్ళిపోతాను'' అన్నాడు. వాసుకి ఈ షరతులకు అంగీకరించాడు. జరత్కారునకు, జరత్కారువుతో రంగరంగ వైభావంగా వివాహం జరిగింది. మహర్షులందరూ నూతనదంపతులను ఆశీర్వదించారు. నాగకన్య జరత్కారువు శవాన న్యాయంతో మెలగుతూ భర్తకు ఇష్టానుసారంగా నడుచుకుంటూ, పతివ్రతా నియమంతో సేవిస్తూ కాలం గడుపోతోంది. కాలచక్ర నియమానుసారం ఋతుస్నాత అయిన భార్య గర్భవతి కావడం కూడా అంతే సహజం. జరత్కారుని సేవలో జరత్కారువు గర్భవతి అయింది. ప్రజ్వలితాగ్ని సమతేజుడు, తపస్సంపన్నుడు అయిన శిశువు ఆమె గర్భంలో దినదిన ప్రవర్థనుడు అవుతున్నాడు. ఒకరోజు, సాయంసంధ్యా సమయంలో జరత్కారుడు గర్భవతి అయిన తన భార్య ఒడిలో తలవుంచి నిద్రస్తున్నాడు. సూర్యుడు అస్తాద్రికి చేరుతున్నాడు. సంధ్యాసమయంలో సూర్యునకు ఆర్ఘ్యం ఇవ్వకుండా నిద్రించడం ధర్మం కాదని, తన భర్తకు ధర్మలోపం జరుగుతుందేమోనని జరత్కారువు భయపడింది. తమ వివాహ నియమాలు ఆమెకు ఇంకా గుర్తున్నాయి. భర్తకు నిద్రాభంగం చేస్తే, తనను వదిలి వెళ్ళిపోతాడు. లేపకపోతే ధర్మభంగం జరుగుతుంది. ఆమె బాగా ఆలోచించింది. తనను భర్త వదిలేసినా బాధలేదు. ధర్మలోపం జరగకూడదు అని నిర్ణయించుకుంది. భర్తను మేల్కొలిపింది. కర్తవ్యాన్ని నివేదించింది. భార్య చేసిన పనికి జరత్కారుడు ఉగ్రుడయ్యాడు "నాగాకన్యా! నియమాన్ని ఉల్లంఘించి, నన్ను అవమానించావు. మాట నిలుపుకోలేని నీతో, నేను జీవనయాత్ర సాగించలేను. ఈ క్షణమే నిన్ను పరిత్యజ్యిస్తున్నాను'' అన్నాడు. భర్త పలుకులకు జరత్కారువు వణికిపోయింది. కన్నీళ్ళతో భర్తవంక చూస్తూ "స్వామీ! ఇది నేను మిమ్మల్ని అవమానించాలని చేసిన పనికాదు. ధర్మలోపం మీ వల్ల జరగకూడదని ఇలా సాహసించాను'' అని పలికింది. "సాధ్వీ! కారణం ఏదైనా, నేను విధించిన షరతును ఉల్లంఘించావు కనుక మనకీ ఎడబాటు తప్పదు'' అన్నాడు జరత్కారుడు.
"స్వామీ! మా సోదరుడైన వాసుకి, నన్ను మీకిచ్చి వివాహం చేసే సమయంలో "సోదరీ! మాతృశాపానికి గురైన మన నాగవంశం నీ సంతానం వల్లనే ఉద్ధరింపబడాలి అన్నాడు. మీ అనుగ్రహం వల్ల నేను గర్భవతినయ్యాను. ఈ సమయంలో మీరు నన్ను వదిలి వెడతాననడం ధర్మమా?'' అని అర్థించింది జరత్కారువు."సాధ్వీ! మాటతప్పి నేను చరించలేను ... బాధపడకు. నీ గర్భంలో పెరుగుతున్న బాలుడు అగ్నిసమ తెజుడు. వేదవేదాంగ పారంగుడు. మహా తపశ్శాలి. వాని వల్ల మీ నాగవంశం ఉద్ధరింపబడుతుంది'' అని భార్యను ఓదార్చి, జరత్కారుడు తపోభూమికి వెళ్ళిపోయాడు. జరత్కారువు తన సోదరుడైన వాసుకి ఇంటికి చేరుకుంది. నవమాసాలు నిండిన అనంతరం ఓ బాలుని ప్రసవించింది. మేనమామ అయిన వాసుకి ఇంటిలో ఆ బాలుడు పెరుగుతున్నాడు. ఋషులతో సంప్రదించి, ఆ బాలునకు "ఆస్తీకుడు'' అని నామకరణం చేశాడు వాసుకి. పంచవర్ష ప్రాయుడైన ఆస్తీకునికి ఉపనయనం కాగానే, భృగువంశ శ్రేష్ఠుడయిన చ్యవనమహర్షి దగ్గరకు విద్యాభ్యాసానికి పంపాడు వాసుకి. అతి శీఘ్రకాలంలోనే ఆస్తీకుడు సకల విద్యాపారంగతుడయ్యాడు.
ఆ రోజులలో హస్తినాపురాన్ని పరిపాలిస్తున్న జనమేజయుడు ... తన తండ్రి అయిన పరీక్షిత్తు మరణానికి కారణమైన సర్పకులాన్ని అంతం చేయాలనే సర్పయాగం చేస్తున్నాడు. ఋత్విక్కుల వేదమంత్రాలకు బద్ధులైన అనేక సర్పాలు యాగగుండంలో పడి భస్మమవుతున్నాయి. శాపానికి భయపడిన తక్షకుడు ఇంద్రుని శరణుకోరాడు. ఇంద్రుడు తక్షకునకు అభయం ఇచ్చాడు. సర్పయాగం సాగుతోంది. అప్పుడు వాసుకి ఆస్తీకుని పిలిచి "నాయనా! జనమేజయుడు చేస్తున్న సర్పయాగానికి మన సర్పజాతి మొత్తం నాశనం కాకుండా, నీవే ఎలాగైనా ఆ యాగాన్ని ఆపాలి'' అని అర్థించాడు. ఆస్తీకుడు స్థిరసంకల్పచిత్తుడై, జనమేజయుడు చేస్తున్న యాగాభూమికి వచ్చి తన విద్యాగంధంతో అందరినీ ఆకర్షించాడు. అపర వామనుడులా వచ్చిన ఆస్తీకుని పాండిత్యానికి సంతసించిన జనమేజయుడు "ఏ వరం కావాలో కోరుకో'' అన్నాడు. "మహారాజా! పితృభక్తితో ఇంతవరకూ నీవు చేసిన సర్పహవనం చాలు. ఇక ఈ సర్పయాగాన్ని ఇక్కడతో ఆపేయాలి. ఇదే నా కోరిక'' అన్నాడు ఆస్తీకుడు. సత్యసంధుడైన జనమేజయుడు సర్పయాగాన్ని సగంలో ఆపేశాడు. ఆస్తీకుని కారణంగా సర్పవంశం నిర్వంశం కాకుండా నిలిచింది. తమ జాతి అంతరించి పోకుండా కాపాడిన ఆస్తీకునికి సర్పజాతి మొత్తం దాసోహం అయింది. ఆస్తీకుడు సర్పజతికి ఆరాధ్యదైవమయ్యాడు.
Read More

అష్ట సిద్ధులు అని వేటిని అంటారు?అష్ట సిద్ధులు అని వేటిని అంటారు?

అణిమ: అన్ని జంతువుల కంటే స్వల్ప జంతువు వలే కనపడుట . తన ఆకారం కంటే కొద్ది ఆకారం గల జీవము వలే యుండుట .

మహిమ:బ్రహ్మ , విష్ణు, శివుడు ఈ త్రిమూర్తులు కంటే పెద్దవాడిగా కనపడుట.

లఘిమ:దూది కంటే తేలిక అయ్యి ఉండుట. యే మాత్రం బరువు లేకుండా ఉండుట .

గరిమ : బరువుగల సమస్త జీవములు, సమస్త పదార్దముల కంటే బరువు అయ్యి ఉండుట.

ప్రాప్తి : కోరిన దానినేల్లా కలగ చేసుకొనుట . తనకే ఆకారం కావలెను అన్న ఆ ఆకారంని పొందుట. కొరిన చోటుకెల్లా క్షణ మాత్రములో పోవుట , కొరిన వస్తువుని గాని జీవముని గాని తన వద్దకి తెప్పించు కొనుట .

ప్రాకామ్యము : ఆకాశ గమనము కలిగి యుండుట, తన శరీరం వదిలి త్రిలోక సుందరమగు యవ్వన శరీరము తాను కోరినంత కాలము పొంది యుండుట.

వశిత్వము:సమస్త జంతువులను , దుష్ట మృగములను పెద్ద పులి,చిరుత పులి , సింహము, మదగజము మొదలగు అడివి జంతువులను మొసలి, తాంబేలు, చేప మొదలగు నీటి జంతువులను, సర్పములు మొదలగు వాటిని మచ్చిక చేసుకొనుట .

ఈశత్వము : కామ, క్రోధ, లోభ, మోహ , మధ, మాత్సర్యము అనెడు అరిషడ్వర్గములను జయించి ఆధ్యాత్మిక , బౌతికాది , ధైవికములు అనెడి తాపత్రయములు లేనివాడై జితేన్ద్రియుడై , భూత, భవిష్యత్ , వర్తమాన విషయాలను సర్వమును గ్రహించి ఈశ్వరుని వలే సృష్టి, స్థితి, లయములు లకు కారణ భూతుడు అగుట .

అష్ట సిద్ధులను పురాణ పురుషులు ప్రదర్శించారు.
అణిమా సిద్ధిని హనుమంతుడు సీతాన్వేషణ లో భాగంగా లంకలో ప్రవేశించేటపుడు చిన్న పరిమాణంలో మారి ప్రదర్శించాడు.
మహిమా సిద్ధిని హను మంతుడు సముద్రోల్లంఘన సమయంలో ప్రదర్శించాడు.
ఇక సురస నోరు తెరిచినపుడు పెద్దవాడుగా మారి ఒక్క సారిగా చిన్నవాడిగా మారి అణిమా మహిమా సిద్ధుల్ని ఒక దాని వెంట ఒకటి ప్రదర్శిం చాడు.
ఇంకా ఎన్నో చోట్ల ఆయన కాయాన్ని పెంచడం కనిపిస్తుంది.

ఇక వామనావతారంలో విష్ణువు మూడడు గులతో భూమ్యా కాశాలను ఆవరించిన పుడు కూడా ఇదే విధంగా పెరిగాడు.

గరిమా సిద్ధిని కృష్ణుడు చిన్నతనంలో తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో ఎత్తుకు పోవడానికి వచ్చినపుడు అతనితో బాటు పైకె గిరి వాడి భుజాల మీద కూర్చుని బరువుగా మరరడంతో వాడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. వాడిని కృష్ణుడు చంపివేశాడు.
భీముడు సౌగంధిక పుష్పాలను తెచ్చేందుకు వెళ్లినపుడు హనుమంతుడుడు తన తోకను అడ్డుగా పెట్టి దానిని భీముడు ఎత్తలేనంత బరువుగా మార్చాడు.
లఘిమా అంటే తేలికగా అయిపోవడం. ఆకాశగమనం వంటివి కూడా దీనితో అనుబంధంగా వచ్చే శక్తులని చెబుతారు.
ఈ సిద్ధుల ప్రదర్శన మనకు రామాయణ, భాగవతాదుల్లో ప్రముఖంగా కనిపిస్తుంది.
ఒక్క సిద్ధి సరైన గురువు వద్ద పొండానికే 40 సంవత్సరాలు పడుతుందని చెబుతారు. దీనికి సంబందించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. ఆది శంకరులకు ఒక పర్యాయంఒక సిద్ధుడు తారసపడ్డాడు.తన కు ఉన్న ఆకాశ గమన విద్యను ఆయన ముందు ప్రర్శించాడు. అది సాధించేందుకు ఎంత కాలం పట్టిందని ఆయన అడిగారు. 40 ఏళ్లు పట్టిందని చెప్పాడు.
ఆ విద్య పొందేందుకు నీ జీవితంలో 40 ఏళ్లు ఖర్చు పెట్టావు. ఏ సత్పురుషుడిని దూషించినా కాకివై పుట్టి పుట్టుకతోనే ఆకాశగమనం సాధించేవాడివి కదా అని ఆయన ఎద్దేవా చేసినట్టు చెబుతారు. సిద్ధులు సాధించడం అనవసరమని, అందుకు జీవితం లో అంత కాలం వృధా చేయకుండా భగవన్నామ స్మరణ వల్ల ఉత్తమ గతులు పొందితే బాగుండుననేది ఆయన ఉద్దేశం.

(సేకరణ)
Read More

ధర్మం గురించిధర్మం గురించి

సూటిగా సత్యసహితముగా

చదివాక అందరికీ చేరవేయండి

హైందవ ధర్మం అసలు పేరు సనాతన ధర్మం

సనాతనమంటే ఎంతో ప్రాచీనమని అర్ధం

ధర్మం అంటే సత్ప్రవర్తన అని భావం

సనాతన ధర్మం అనాది కాలం నుండీ ఆచరింపబడుతూ వస్తూన్న సత్ప్రవర్తన

హైందవ ధర్మం అంటే మరేదో కాదు – సత్ప్రవర్తన తో కూడిన జీవన విధానం అంతే గాని ఇది ఒక పుస్తకానికి పరిమితమైన మతం కాదు

సనాతనము అనే పదానికి ఇంత అనే కాలపరిమితి లేదు

ధర్మం అనే పదానికి ఋతం అనే అర్ధం కూడా వుంది
ఋతం అంటే ప్రకృతి స్వభావం లేదా సృష్ఠి

పునరావృతమవుతూ అనాది కాలం నుండి విశ్వవ్యాప్తంగా వున్న క్రమమే సనాతన ధర్మం

ఈ హైందవ ధర్మం అన్ని యుగాలకు అనుచితమే

దీనికి ఆర్యుడు వగైరా వంటి వారు ఎవ్వరూ స్థాపకులు కాదు. అది మూర్ఖులు మెట్ట వాదన

ధ్యానస్థితి లో నుండి గ్రహింపబడిన ఋషుల దర్శనమే ఈ ధర్మం

ఈ ధర్మాన్ని గురించి వివరించడానికి అనేక లక్షల పుస్తకాలు వచ్చాయి.. వక్ర భాష్యాలు వచ్చాయి..

ఇన్ని లక్షల గ్రంధాలు అర్ధం చేసుకునుట సాధ్యం కాదు కనుక కనీసం ఈ ధర్మాన్ని అనుసరిస్తున్న వారు భగవద్గీతను ప్రామాణికముగా చేసుకోవాలి...
Read More

చంద్రశేఖరాష్టకం

చంద్రశేఖరాష్టకం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం||
రత్న సాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం
శింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం
క్షిప్రదగ్దపురత్రయం త్రిదశాలయై రభివందితం
చంద్రశేఖర మాశ్రయే కిం కరిష్యతి వైయమః 1
పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితం
ఫాలలోచన జాతపావక దగ్దమన్మధ విగ్రహం
భస్మ దిగ్ధకళేబరం భవనాశనం భవమవ్యయం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయమః 2
మత్తవారనముఖ్యచర్మకృతో త్తరీయ మనోహరం
పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం
దేవసింధు తరంగశీకర సిక్తశుభ్రజటాధరం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయముః 3
యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం
శైలరాజసుతాపరిష్కృత చారువామ కళేబరమ్
క్ష్వేళనీలగళం పరళ్వథ ధారణం మృగధారిణమ్
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయముః 4
కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం
నారదాదిమునీశ్వర స్తుతవైభవం భువనేశ్వరం
అంధకాంతక మాశ్రితామరపాదపం శమనాంతకం
చంద్రశెఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయముః 5
భెషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణం
దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం
భుక్తిముక్తి ఫలప్రదం సకలాఘసంఘ నిబర్హణం
చంద్రశెఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయముః 6
భక్తవత్సల మర్చితం నిధి మక్షయం హరిపంజరం
సర్వభూతపతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం
సోమవారుణ భూహుతాశన సోమపానిఖిలాకృతిం
చంద్రశెఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయముః 7
విశ్వసృష్టి విధాయినం పున్ రేవపాలన తత్పరం
సమ్హరం త మపి ప్రపంచ మశేషలోక నివాసినం
క్రీడయంత మహర్నిశం గణనాథయూధ సమన్వితం
చంద్రశేఖర మాత్రయే మమ కిం కరిష్యతివై యమః 8
మృత్యుభీతమృకండుసూనుకృత స్తవం శివసన్ని ధౌ
యత్ర కుత్ర చ యః పఠేన్నహి తస్య మృత్యుభయంభవేత్
పూర్ణమాయుర రోగతా మఖిలార్ధ సంపద మాదరం
చంద్రశేక్షర ఏవ తసదదాతి ముక్తి మయత్నతః 9
సంసార సర్పస్య దష్టానాం జంతూణా మవివేకినాం
చంద్రశెఖర పాదాబ్జ స్మరణం పరమౌషధం 10
రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠ ముమాపతిం
నమామి శిరసా దేవం కిన్నో మృత్యుః కరిష్యతి 11
కాలకంఠం కలామూర్తిం కాలాగ్నిం కాలనాశనం
నమామి సిరసా దేవం కిన్నో మృత్యుః కరిష్యతి 12
అనంతమవ్యయం సాంట మక్షమాలాధరం హరం
నమామి శిరసా దేవం కిన్నో మృత్యుః కరిష్యతి 13
ఆనంద పరమం నిత్యం కైవల్యపద కారనం
నమామి శిరసాదేవం కిన్నో మృత్యుః కరిష్యతి 14
దేవ దేవం జగన్నాథం దేవేశం వృషభద్వజం
నమామి శిరసాదేవం కిన్నో మృత్యుః కరిష్యతి 15
స్వర్గాపవర్గ దాతారం సృష్టి స్థిత్యంతకారణం
నమామి శిరసాదేవం కిన్నో మృత్యుః కరిష్యతి 16
గంగాధరం శశిధరం శంకరం శూలపాణినం
నమామి శిరసాదేవం కిన్నో మృత్యుః కరిష్యతి 17
భస్మోద్దూళితసర్వాంగం నాగాభరన భూషితం
నమామి శిరసాదేవం కిన్నో మృత్యుః కరిష్యతి 18
మార్కండేయకృతం స్తోత్రం యః పరేచ్ఛివసన్నిధౌ
తస్య మృత్యుభయం నాస్తి సత్యం సత్యంవదామ్యహం
శివేశాన మహాదేవ వాసుదేవ సదాశివ
కల్పాయు ర్దేహిమే పూర్ణం యావదాయురరోగతాం
Read More

తల్లిదండ్రుల సేవ, కులవృత్తిని మించిన దైవం లేదు

తల్లిదండ్రుల సేవ, కులవృత్తిని మించిన దైవం లేదు
కౌశికుడు ఒక బ్రాహ్మణుని కుమారుడు. ఇతని తల్లిదండ్రులు వృద్ధులు. కౌశికుడు మొదటినుంచీ అహంకారి. తపస్సుచేసి శక్తులు సాధించాలనే కోరిక ఎక్కువ. అందుకే తల్లిదండ్రులు ఎంత చెబుతున్నా వినకుండా అరణ్యాలకు పోయి ఒక చెట్టు క్రింద కూర్చుని తపస్సు ప్రారంభించాడు.అతని తపోదీక్షలో చాలా కాలం గతించి పొయింది. అయినా కౌశికుడు పట్టుదలగా తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఓ కొంగ, కౌశికుడు తపస్సు చేస్తున్న చెట్టుమీద వ్రాలి అతనిమీద రెట్ట వేసింది. దానితో కౌశికునకు తపోభంగమై, కన్నులు తెరచి కోపంగా ఆ కొంగవైపు చూసాడు. అంతే..ఆ కొంగ మలమల మాడి భస్మమైపోయింది. అదిచూసి కౌశికుడు ఆశ్చర్యపోయాడు. తన తపస్సు సిద్ధించిందనీ, తను మహాతపశ్శక్తి సంపన్నుడననీ తలచి, తపస్సు విరమించి, అరణ్యాలు వదలి నగరంలో ప్రవేశించాడు. నగరపౌరులెవ్వరూ అతని శక్తిని గుర్తిచడం లేదు. ఎవరి దారిన వారు పోతున్నారు. కౌశికుడు ఒక ఇంటిముందు నిలబడి ‘భవతీ భిక్షాం దేహి’ అని అరిచాడు. ఆ ఇంటి ఇల్లాలు బయటకు వచ్చి కౌశికుని చూసి, భిక్ష తెస్తాను ఇక్కడే ఉండు అని చెప్పి లోపలకు వెళ్లింది. సరిగ్గా అదే సమయానికి ఆమె భర్త ఇంటికి వచ్చాడు. భిక్ష తెస్తున్న ఆ ఇల్లాలు వచ్చిన భర్తను చూసి, భిక్షపాత్రను పక్కనపెట్టి, భర్త సేవలో నిమగ్నమైంది. కౌశికుడు ‘భవతీ భిక్షాం దేహి’ అని అరుస్తూనే ఉన్నాడు. ఆ అరుపులు ఇల్లాలుకు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ.. అదేమీ ఆమె పట్టించుకోకుండా, భర్తకు భోజనం పెట్టి, అతను నిద్రపోయేవరకూ అతని పాదాలు ఒత్తి, ఆ తర్వాత భిక్ష తీసుకుని గుమ్మం దగ్గరకు వచ్చింది. ఆమెను చూస్తూనే కౌశికుడు కోపంతో ఊగిపోతూ ‘ఇంత ఆలస్యంగానా భిక్ష తీసుకురావడం నేనేమైనా సాధారణ భిక్షగాడిననుకున్నావా మహాతపశ్శక్తి సంపన్నులం’ అని కోపంతో ఎర్రబడిన కన్నులతో ఆమెవంక చూసాడు. ఆమె అడవిలోని కొంగలా మలమలా మాడి మసైపోలేదు. అదిచూసి మరింత ఆశ్చర్యపోయాడు కౌశికుడు. అది గమనించిన ఆ ఇల్లాలు ‘మీ కోపానికి మలమలా మాడిపోవడానికి నేనేమీ అడవిలోని కొంగను కాదు’ అంది. అడవిలో జరిగిన సంఘటన ఆ ఇల్లాలుకు ఎలా తెలిసిందో కౌశికునకు అర్థంకాలేదు. అదే ప్రశ్న ఆమెను అడిగాడు. అప్పుడా ఇల్లాలు ‘నాకు తెలిసినదల్లా నా భర్తను సేవించుకోవడమే. అంతకుమించి నేను ఏ దైవపూజలు చెయ్యను.’ అని బదులిచ్చింది. కౌశికుడు ఆమెను పతివ్రతగా గుర్తించి, ఆమె పాదాలకు నమస్కరించి ధర్మోపదేశం చెయ్యమని ఆమెను అర్థించాడు. ఆమె తనకు తెలిసిన ధర్మాలు చెప్పి, ‘మీకింకా ధర్మాలు తెలుసుకోవాలని ఉంటే మిథిలానగరంలో ఉండే ధర్మవ్యాథుని కలవండి’ అని చెప్పింది ఆ ఇల్లాలు. ధర్మవ్యాథుని కలుసుకోవాలని కౌశికుడు మిథిలానగరం వచ్చి అతనుండే ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ మాంసం విక్రయిస్తూ ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి కౌశికుని చూస్తూనే చిరునవ్వుతో అతని దగ్గరకు వచ్చి ‘ఆ పతివ్రత పంపితే నా దగ్గరకు వచ్చారు కదూ’ అన్నాడు. ఆసంగతి ఇతనికెలా తెలిసిందో కౌశికునకు అర్థంకాలేదు. కానీ అతనే ధర్మవ్యాథుడై ఉంటాడని ఊహించాడు. అది గమనించి ‘అయ్యా... నేనే ధర్మవ్యాథుడను..నానుంచి ధర్మాలు తెలుసుకుందామని వచ్చారు..కొంతసేపు ఇక్కడ విశ్రమించండి.. నా వ్యాపారం ముగిసిన తర్వాత మీతో ధర్మ ప్రసంగం చేస్తాను’ అని చెప్పి తన వ్యాపారంలో నిమగ్నమయ్యాడు ధర్మవ్యాథుడు. కౌశికుడు అతని రాకకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి ధర్మవ్యాథుడు అతని దగ్గరకు వచ్చాడు. కౌశికునితో ఎన్నో ధర్మసూక్ష్మాలు చర్చించాడు. కౌశికుడు ఆశ్చర్యపోతూ ‘మాంసం విక్రయించుకునే మీకు ఇన్ని ధర్మాలు మీకెలా తెలిసాయి’ అని ప్రశ్నించాడు. ధర్మవ్యాథుడు కౌశికుని తన ఇంటిలోకి తీసుకుని వెళ్లాడు. అక్కడ వృద్ధులైన దంపతులు ఉన్నారు. ధర్మవ్యాథుడు వారిని కౌశికునకు చూపిస్తూ ‘వీరు నా తల్లిదండ్రులు. వీరికి సేవలు చెయ్యడం తప్ప మరే పూజలు నేను చెయ్యను. అంతేకాక మాంసం విక్రయించడం నా కులవృత్తి. కులవృత్తిని మించిన దైవం మరేదీ లేదు.. మాతా పితరుల సేవను మించిన ధర్మం లేదు’ అని పలికాడు ధర్మవ్యాథుడు. కౌశికునకు ధర్మం ఏమిటో పూర్తిగా అర్థమైంది. అతను ధర్మవ్యాధుని దగ్గర సెలవు తీసుకుని తన తల్లిదండ్రులకు సేవలు చేసుకోవడానికి స్వగ్రామానికి బయలుదేరాడు.
Read More

అష్టాదశ పురాణాల వివరాలు

అష్టాదశ పురాణాల వివరాలు
శ్లో!! మద్వయం భద్వయం చైవ
బ్రత్రయం వచతుషటయం
అనాపలింగ కూస్కానీ
పురాణాని ప్రచక్షత!!
మద్వయం: మ కారంతో 2. అవి మత్స్య పురాణం. మార్కండేయ పురాణం.
భద్వయం: భ కారంతో 2. అవి భాగవత పురాణం. భవిష్యత్ పురాణం.
బ్రత్రయం: బ్ర కారంతో 3. అవి బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం.
వచుతష్టయం: వకారంతో 4. అవి వాయుపురాణం, వరహా పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం.
అ కారంతో అగ్ని పురాణం, నా కారంతో నారద పురాణం, ప కారంతో పద్మ పురాణం, లి కారంతో లింగ పురాణం, గ కారంతో గరుడ పురాణం, కూ కారంతో కూర్మ పురాణం మరియు స్క కారంతో స్కంద పురాణం రచించిరి.
1. మత్స్య పురాణం: దీనిలో 14000 శ్లోకములన్నవి. మత్స్యావతార మెత్తిన విష్ణువుచే మనువుకు బోధింపబడినది. కార్తికేయ, మయాతి, సావిత్రుల చరిత్రలు. ధర్మాచరణములు, ప్రయాగ, వారణాసి మొదలగు పుణ్యక్షేత్ర మహత్మ్యములు చెప్పబడినవి.
2. మార్కండేయ పురాణము: ఇందులో 9000 శ్లోకములు కలవు. మార్కండేయ మహర్షిచే చెప్పబడినది. శివవిష్ణువుల మహత్మ్యములు, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహత్మ్యములు మరియు సప్తపతి (లేక దేవి మహత్మ్యము) చెప్పబడినవి. చండీ హోమము, శతచండీ సహస్ర చండీ హోమ విధానమునకు ఆధారమయినది ఈ సప్తశతియే.
3. భాగవత పురాణము: దీనిలో 18,000 శ్లోకాలు కలవు. వేద వ్యాసుని వలన శుకునకు, శుకుని వలన పరీక్షత్ మహారాజునకు 12 స్కందములులో మహా విష్ణు అవతారలు శ్రీ కౄష్ణ జనన, లీలాచరితాలు వివరించబడినవి.
4. భవిష్య పురాణము: దీనిలో 14,500 శ్లోకాలు కలవు. సూర్య భగవానునిచే మనువునకు సూర్Yఓపాసన విధి, అగ్ని దేవతారాధన విధానం, వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడినవి. ముఖ్యంగా భవిష్యత్ అనగా రాబోవు కాలం. భవిష్యత్తులో జరుగబోవు విషయాల వివరణ ఇందు తెలుపబడినది.
5. బ్రహ్మపురాణము: దీనినే ఆదిపురాణం లేక సూర్యపురాణం అందురు. దీనిలో 10,000 శ్లోకాలున్నవి. బ్రహ్మచే దక్షునకు శ్రీ కౄష్ణ, మార్కండేయ, కశ్యపుల చరిత్ర వర్ణనలు, వర్ణధర్మాలు, ధర్మాచరణాలు, స్వర్గ – నరకాలను గూర్చి వవరించబడినవి.
6. బ్రహ్మాండ పురాణము: దీనిలో 12,000 శ్లోకాలు కలవు. ఈ పురాణం బ్రహ్మచే మరీచికి చెప్పబడినది. రాధాదేవి, శ్రీకౄష్ణుడు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు. శ్రీ లలితా సహస్ర నామస్తోత్రాలు, శివకౄష్ణ సోత్రాలు, గాంధర్వం, ఖగోళశాస్త్రం మరియు స్వర్గ నరకాలు వివరణ ఇందు వివరించబడినది.
7. బ్రహ్మ వైవర్త పురాణము: దీనిలో 18,000 శ్లోకాలు కలవు. సావర్ణునిచే నారదునకు చెప్పబడినది. స్కంద, గణేశ, రుద్ర శ్రీకౄష్ణుల వైభవములు, సౄష్టికర్త బ్రహ్మ, సౄష్టికి కారణమయిన భౌతిక జగత్తు (ప్రకౄతి) మరియు దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ మొదలగు పంచ శక్తుల ప్రభావము గురించి వివరించబడినది.
8. వరాహ పురాణము: దీనిలో 24,000 శ్లోకములు కలవు. వరాహ అవతార మొత్తిన విష్ణువుచే భూదేవికి చెప్పబడినది. విష్ణూమూర్తి ఉపాసనా విధానము ఎక్కువగా కలదు. ప్రమేశ్వరీ, ప్రమేశ్వరుల చరిత్రలు, ధర్మశాస్త్రము, వ్రతకల్పములు, పుణ్య క్షేత్రవర్ణనలు ఈ పురాణములో కలవు.
9. వామన పురాణము: దీనిలో 10,000 శ్లోకములు కలవు. పులస్త్వ ౠషి నారద మహర్షికి ఉపదేశించినది. శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణము, శివగణేశ, కార్తికేయ చరిత్రలు, భూగోళము – ౠతు వర్ణనలు వివరించబడినవి.
10. వాయు పురాణము: దీనిలో 24,000 శ్లోకములు కలవు. ఇది వాయుదేవునిచే చెప్పబడినది. శివభగవానుని మహాత్మ్యము, కాలమానము, భూగోళము, సౌరమండల వర్ణనము చెప్పబడినది.
11. విష్ణు పురాణము: ఇందు 23,000 శ్లోకములు కలవు. పరాశరుడు తన శిష్యుడయిన మైత్రేయునికి బోధించినది. విష్ణుమహాత్మ్యము, శ్రీ కౄష్ణ, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరిత్రలు వర్ణింపబడినవి.
12. అగ్ని పురాణము: దీనిలో 15,400 శ్లోకాలు కలవు. అగ్ని భగవానునిచే వశిష్ణునకు శివ, గణేస, దుర్గా భగవదుపాసన, వ్యాకరణం, చంధస్సు, వైద్యం, లౌకిక ధర్మములు, రాజకీయము, భూగోళ ఖగోళ శాస్త్రాము, జ్యొతిషం మొదలగు విషయాలు చెప్పబడినవి.
13. నారద పురాణము: ఇందు 25,000 శ్లోకములు కలవు. నారదుడు సనక, సనందన, సనత్కుమార, సనాతరన్ అను నలుగురు బ్రహ్మామానసపుత్రులకు చెప్పినది. అతి ప్రసిద్ధి చెందిన వేదపాదస్తవము (శివస్తోత్రము) ఇందు కలదు వేదాంగములు, వ్రతములు, బదరీ ప్రయాగ, వారణాసి క్షేత్ర వర్ణనలు ఇందు కలవు.
14. స్కంద పురాణము: దీనిలో 81,000 శ్లోకములు కలవు. ఇది కుమారస్వామి (స్కందుడు) చే చెప్పబడినది. ఇందు ముఖ్యముగా శివచరిత్ర వర్ణనలు, స్కందుని మహాత్యము, ప్రదోష స్తోత్రములు, కాశీఖండము, కేదారఖండము, రేవా ఖండము (సత్యనారాయణ వ్రతము ఇందులోనివే), వైష్ణవ ఖండము (వేంకటాచల క్షేత్రము), ఉత్కళ ఖండము (జగన్నాధ క్షేత్రము), కుమారికా ఖండము (అరుణాచల క్షేత్రము), బ్రహ్మ ఖండము (రామేశ్వర క్షేత్రము) బ్రహోత్తర ఖండము. (గోకర్ణక్షేత్రము, ప్రదోషపూజ), అవంతికాఖండము (క్షీప్రానదీ, మహాకాల మహాత్మ్యము) మొదలగునవి కలవు.
15. లింగ పురాణము: ఇది శివుని ఉపదేశములు. లింగరూప శివ మహిమ, దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు. ఖగోళ జ్యోతిష, భూగోళ శాస్త్రములు వివరించబడినవి.
16. గరుడ పురాణము: ఇందు 19,000 శ్లోకములున్నవి. ఇది విష్ణువుచే గరుత్మంతునకు ఉపదేశించబడినది. శ్రీ మహావిష్ణు ఉపాసన, గరుత్మంతుని ఆవిర్భావము, జనన మరణములు, జీవి యొక్క స్వర్గ – నరక ప్రయాణములు తెలుపబడినవి.
17. కూర్మ పురాణము: ఇందులో 17,000 శ్లోకములున్నవి. కూర్మావతార మెత్తి విష్ణువుచే చెప్పబడినది. వరాహ నారసిమ్హ అవతారములు, లింగరూప శివారాధన, ఖగోళము, భూగోళముతో వారణాసి, ప్రయోగక్షేత్ర వర్ణనలు తెలుపబడినవి.
18. పద్మపురాణము: ఇందులో జన్మాంతరాల నుండి చేసిన పాపాలను, కేవలం వినినంత మాత్రముననే పొగొట్టగలిగేది ఈ పద్మపురాణము. అష్టాదశ పురాణాలలో కెల్ల అత్యధిక పొగొట్టగలిగేది ఈ పద్మ పురాణము. 85,000 శ్లోకములలో కెల్ల అత్యధిక శ్లోకాలు కల్గినది విశేషాలను మనుకు తెలియజేస్తుంది. మరియు మదుకైటభవధ, బ్రహ్మసృష్టికార్యము, గీతార్థసారం – పఠనమహాత్య్మం, గంగామహాత్మ్యం, పద్మగంధి దివ్యగాధ, గాయత్రీ చరితము, రావివౄక్షమహిమ, విభూతి మహాత్మ్యం, పూజావిధులు – విధాణం, భగవంతుని సన్నిథిలో ఏ విధంగా ప్రవర్తించాలో పద్మపురాణంలో వివరంగా తెలియజేయబడింది.
ఈ విధముగా పురాణములందలి విషయములు క్రమముగా సంక్షిప్త రూపమున వేద వ్యాస పీఠ మందిరము నందు రచింపబడి నైమిశారణ్యమునందు ప్రసిద్ధములైనవి.
Read More

వచ్చేది శ్రావణమాసం:-వచ్చేది శ్రావణమాసం:-
ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. అంత గొప్ప పవిత్రమాసం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు విశిష్ట పండుగలు రానున్నాయి. సనాతన ధర్మంలో (హిందూ) చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది ఎంతో పవిత్రత కలిగినటువంటింది శ్రావణమాసం. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది.
వర్ష రుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి(భార్య) మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు. వివిధరకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో మేలయినది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి.
శివారాధనకు ఎంతో విశిష్టత..

శ్రావణమాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివపూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివ, కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్ర వచనం. సోమవారాల్లో శివుడి ప్రీత్యా ర్థాం ఈ వ్రతాన్ని (ఉపవాసదీక్షను) చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు పూర్తిగా, అలా సాధ్యంకానీ పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ ఒక్కోరోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేద శాస్త్రలు చెబుతున్నాయి. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారు పండితులు.

మంగళ గౌరీ వ్రతం..

శ్రావణ మాసంలో అన్ని మంగళవారల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గురించి నారధుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా ప్ళ్లైన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి.
వరలక్ష్మీ వ్రతం..
పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ శ్లోకాని పటించాలి.
శ్లోకం : బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం
పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే
అని పటిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. అలాగే మంత్రాలను పటిస్తూనే ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి ఆశ్వీరాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి..
శ్రావణ మాసంలోని విశిష్టతలు..
శుక్లపక్ష ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణునువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది.
శుక్ల పక్ష పౌర్ణమి : శ్రావణపౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షబంధనం జరుపుకుంటున్నాం. అంతే కాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్రధారణ, వేదభ్యాసాన్ని ప్రారంభం చేస్తారు.
కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య రోజులు వచ్చేవి శ్రావణమాసంలోనే. కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలు, తూచ తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయంటున్నారు పెద్దలు.
Read More

కాలభైరవాష్టకం

కాలభైరవాష్టకం
దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాళయజ్ఞసూత్ర మిందు శేఖరం కృపాకరం
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశిపురాధినాథ కాలభైరవం భజే|| 1
భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పఠం
నీలకంఠ మిప్సితార్ధదాయకం త్రిలోచనం
కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం
కాశిపురాధినాథ కాలభైరవం భజే|| 2
శూలటంక పాశ దండపాణి మాది కారణం
శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయం
భీమవిక్ర్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం
కాశిపురాధినాథ కాలభైరవం భజే|| 3
భుక్తి ముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోక నిగ్రహం
నిక్వణన్మనోజ్ఞ హేమకింకిణీలసత్కటిం
కాశిపురాధినాథ కాలభైరవం భజే|| 4
ధర్మసేతు పాలకం త్వధర్మమార్గ నాశకం
కర్మపాశమోచకం సుశర్మ దాయకం విభుం
స్వర్ణకర్ణ కేశపాశ శోభితాంగ మండలం
కాశిపురాధినాథ కాలభైరవం భజే|| 5
రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్య మద్వితీయ మిష్టదైవతం నిరంజనం
మృత్యుదర్శనాశనం కరాళదంష్ట్ర భీషణం
కాశిపురాధినాథ కాలభైరవం భజే|| 6
అట్తహాస భిన్న పద్మజాండకోశ సంతతిం
దృష్టిపాతనష్ట పాపతజాల ముగ్రనాశనం
అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం
కాశిపురాధినాథ కాలభైరవం భజే|| 7
భూతసంఘ నాయకం విశాలకీర్తి దాయకం
కాశివాసి లోక పుణ్యపాపశొధకం విభుం
నీతిమార్గ కోవిదం పురాతనం జగత్ప్రభుం
కాసిపురాధినాథ కాలభైరవం భజే|| 8
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తి విచిత్రపుణ్యవర్ధనం
శోక మోహ దైన్యలోభ కోపతాప నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం|| 9
ఈ శ్మలోకం పఠించడం వలన నశ్శంతి, ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది.
Read More

సింధునది ప్రాంతంలో వున్న వారిని హిందువులు అని పిలవడం కాలక్రమేణా జరిగింది.సింధునది ప్రాంతంలో వున్న వారిని హిందువులు అని పిలవడం కాలక్రమేణా జరిగింది. నిజానికి పార్శీకులకు 'స'కారానికి బదులు 'హ'కారం పలికేవారు. అందువలన సింధువులు--------- హిందువులు గా పిలువబడ్డారు
అలాగే..

హిందువు అనే పదానికి కూడా చక్కటి అర్ధం తెలిపారు. అది ఏంటంటే హిందూ అనగా హిం అనగా హింసను దూ అనగా దూషయతి అని అర్ధం. హింసను నాశనం చేయువాడు, హింసకు దూరంగావుండే వాడు, హింసించేవాళ్ళను నాశనం చేయువాడు అనే పలు అర్ధాలు వున్నాయి.
మన సంస్కతి అనాది కాలం నుండి పరిఢవిల్లడానికి కారణం మన ప్రతి అడుగులో శాస్ర్తీయత, సత్యం, ధర్మం వున్నాయి కాబట్టి.
మన గురించి మనం తెలుసుకుందాం. ఆత్మస్థైర్యంతో ముందుకు నడుద్దాం. ఆదర్శవంతులుగా నిలుద్దాం.
Read More

షోడశోపచారములు:

షోడశోపచారములు:

1. ఆవాహనం - భగవంతున్ని ఆహ్వానించడం
2. ఆసనం - భగవంతున్ని కూర్చోపెట్టటం
3. పాద్యం - పాద ప్రక్షాలనకై భగవంతునికి జలాన్ని సమర్పించడం
4. అర్ఘ్యం - చేతులు కడుక్కోవడానికి జలాన్ని భగవంతునికి సమర్పించడం
5. ఆచమనం - తాగటానికి జలాన్ని భగవంతునికి సమర్పించటం
6. స్నానం - స్నానం చేయించటానికి జలాన్ని భగవంతునికి సమర్పించడం
7. వస్త్రం - నూతన వస్త్రాలను భగవంతునికి సమర్పించడం
8. యఙ్ఞోపవీతం - పవిత్ర యఙ్ఞోపవీతాన్ని భగవంతునికి సమర్పించడం
9. గంధం - సువాసనకై గంధాన్ని భగవంతునికి సమర్పించడం
10. అలంకారం - సౌందర్యం కోసం అలంకార వస్తువులను సమర్పించడం
11. పుష్పం
12. ధూపం
13. దీపం
14. నైవేద్యం
15. తాంబూలం
16. కర్పూర నీరాజనం
Read More

విశ్వనాథాష్టకం

విశ్వనాథాష్టకం
ఈ శ్లోకం పఠించడం వల్ల ధనధాన్యాలూ, విద్యా విజయాలూ, ఇహపర సర్వసౌఖ్యాలు సిద్ధిస్తాయి.
గంగాతరంగ రమణీయ జటాకలాపం
గౌరీ నిరంతర విభూషిత వామభాగం
నారాయణ ప్రియ మనంగ మదాప హారం
వారాణసీ పురపతిం భజ విశ్వనాథం|| 1
వాచమగోచర మమేయ గుణస్వరూపం
వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం
వామేన విగ్రహవరేణ కళత్రవంతం
వారాణసీ పురపతిం భజ విశ్వనాథం|| 2
భూతాధిపం భుజగభూషణ భూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం
పాశాంకు శాభయవరప్రద సూలఫణిం
వారాణసీ పురపతిం భజ విశ్వనాథం|| 3
శీతాంశు సోభిత కిరీట విరాజమానం
ఫాలేక్షణానల విశోషిత పంచబాణం
నాగాధిపా రచిత భాసుర కఋనపూరం
వారాణసీ పురపతిం భజ విశ్వనాథం|| 4
పంచాననం దురిత మత్తమతంగజానాం
నాగాంతకం దనుజపుంగవ పన్నగానాం
దావానలం మరణశోక జరాటవీనాం
వారాణసీ పురపతిం భజ విశ్వనాథం|| 5
తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం
ఆనందకంద మపరాజిత మప్రమేయం
నాదాత్మకం సకల నిష్కళ మాత్మరూపం
వారాణసీ పురపతిం భజ విశ్వనాథం|| 6
ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం
పాపేరతించ సునివార్య మనస్సమాధౌ
ఆదాయ హృత్కుమల మధ్యగతం పరేశం
వారాణసీ పురపతిం భజ విశ్వనాథం|| 7
రాగాదిదోష రహితం స్వజనానురాగం
వైరాగ్య శాంతినిలయం గిరిజా సహాయమ్
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
వారాణసీ పురపతిం భజ విశ్వనాథం|| 8
వారణసీ పురపతేః స్తవం శివస్య
వ్యాసోక్త మష్టక మిదం పఠతే మనుష్యః
విద్యాం శ్రియం విపులసౌఖ్య మనంతకీర్తిం
సంప్రాప్య దేహవిలయే లభతేచ మోక్షం|| 9
విశ్వనాథష్టక మిదం పుణ్యం యః పఠే చ్చివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే|| 10
Read More

పరుశురాముడి జన్మంపరుశురాముడి జన్మం
ప్రజాపతులలో ఒకరైన భృగువు కుమారుడు ఋచీకుడు. ఇతను తన తండ్రిలాగే గొప్ప తపశ్శక్తి సంపన్నుడు, సకలవిద్యాప్రపూర్ణుడు. యుక్తవయసు వచ్చిన తర్వాత ఋచీకునకు వివాహం చేయాలను అతని తండ్రి సంకల్పించాడు. అయితే, ఒకసారి బుచీకుడు, సత్యవతి అనే సుందరిని చూడడం తటస్ధించింది. చూడగానే ఆమెను మోహించాడు, ఆమెనే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కుమారుని మనస్సును గ్రహించిన భృగువు ఈ వివాహానికి సమ్మతించాడు. కుశనాభుని కుమారుడైన గాధి మహారాజుó ఏకైక కుమార్తె ఈ సత్యవతి. ఋచీకుడు గాధి దగ్గరకువచ్చి, సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని అర్ధించాడు. వయసుడిగిన ఋచీకునకు సత్యవతినిచ్చి పెళ్లి చెయ్యడానికి గాధికి మనసొప్పలేదు. అయితే, ఋచీకుడు ఎక్కడ శసిస్తాడో అని భయపడి, ‘‘ శరీరమంతా తెల్లగానూ, ఒక్క చెవి మాత్రం నీలిరంగులోను ఉండే వెయ్యి అశ్వాలను తనకు బహూకరిస్తే సత్యవతితో నీ వివామం జరిపిస్తాను’’ అని షరతు పెట్టాడు గాధిమహరాజు. ఋచీకుడు తన తపస్సుతో వరుణదేవుని మెప్పించాడు. వరుణదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. ‘‘శరీరమంతా తెల్లగానూ, ఒక్క చెవి మాత్రం నల్లగానే ఉండే వెయ్యి గుఱ్ఱాలు తనకు కన్యాకుబ్జనగరానికి సమీపంలో కావాలి’’ అని కోరాడు ఋచీకుడు. వరుణుడు అనుగ్రహించాడు. ఋచీకుడు ఆ అశ్వాలను గాధికి సమర్పించి సత్యవతిని వివాహం చేసుకున్నాడు. సత్యవతి, ఋచీకుల సంసారజీవితం ఆనందమయంగా సాగుతోంది. భర్త మనసెరిగి పతివ్రతా ధర్మంతో సేవిస్తోంది సత్యవతి. భార్య సేవలకు సంతసించిన ఋచీకుడు, ఏ వరం కావాలో కోరుకోమన్నాడు ఋచీకుడు. ‘‘ స్వామీ! నా తండ్రికి మగ సంతానం లేదు. మా రాజ్యానికి ఉత్తరాధికారి లేడు. కనుక నా తండ్రికి సకల సద్గుణవంతుడైన కుమారుడు, అలాగే నాకూ ఓ సత్పుత్రుని అనుగ్రహించండి’’ అని కోరుకుంది సత్యవతి.
ఋచీకుడు బ్రహ్మతేజస్సు గల కుమారుడు తన భార్యకు, క్షత్రియతేజస్సు గల కుమారుడు గాధికి కలగాలని సంకల్పించి, రెండు విభిన్న యాగాలు నిర్వహించి, బ్రహ్మతేజస్సు గల యాగప్రసాదాన్ని మేడిచెట్టు దగ్గర, క్షత్రియతేజస్సు గల యాగప్రసాదాన్ని రావిచెట్టు దగ్గర ఉంచి, తన భార్యతో ‘‘ మేడిచెట్టును కౌగిలించుకుని అక్కడున్న ప్రసాదాన్ని తినమని’’, గాధి భార్యతో ‘‘రావిచెట్టును కౌగిలించుకుని అక్కడున్న ప్రసాదాన్ని తినమని’’ చెప్పాడు. సత్యవతి, ఆమె తల్లి శుచిస్నాతలె ౖ వచ్చి, తమ కోరిక నెరవేరబోతోందన్న ఆతురతతో సత్యవతి రావిచెట్టు మ్రానును, ఆమె తల్లి మేడిమ్రానును కౌగిలించుకుని, అక్కడున్న యాగ ప్రసాదాలను భుజించారు. వారి పొరపాటు గ్రహించిన ఋచీకుడు తన భార్యతో ‘‘ క్షత్రియ తేజస్సు గల కుమారుడు, నీ తల్లికి బ్రహ్మతేజస్సు గల కుమారుడు జన్మిస్తాడు’’ అని చెప్పాడు. సత్యవతి బాధపడి ‘‘తన కుమారుడు బ్రహ్మతేజస్సుతోనే పుట్టాలని, తన మనుమడు క్షత్రియ తేజస్సుతో పుట్టినా పరవాలేదు, అని భర్తను వేడుకుంది. భార్య బాధను అర్ధంచేసుకున్న ఋచికుడు తన తపశ్శక్తితో ఆ విధమైన మార్పును చేసాడు. అందుచేతనే ఋచీకునకు బ్రహ్మతేజస్సుతో జమదగ్ని జన్మించినా, అతని మనుమడు పరశురాముడు జన్మత్ణ బ్రాహ్మణ వంశసంజాతుడైనా, క్షత్రియధర్మానుసారం ఆయుధాన్ని ధరించి క్షత్రియ సంహారం చేసాడు. గాధి కుమారుడైన విశ్వామిత్రుడు జన్మత్ణ క్షత్రియుడైనా, బ్రాహ్మణధర్మానుసారం పట్టుదలతో తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు.
Read More

శ్రీ పెద్దమ్మ దేవాలయం – జూబ్లీహిల్స్

శ్రీ పెద్దమ్మ దేవాలయం – జూబ్లీహిల్స్
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లోని ప్రధాన రహదారి సమీపంలో శ్రీ పెద్దమ్మ వారి దేవాలయం ఉన్నది. శ్రీ పెద్దమ్మ దేవాలయం సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించియున్న సనాతనమైన అతి పురాతనమైన దేవాలయం. జంటనగరాలలో గల అతి పురాతన మరియు పెద్ద దేవాలయాలలో ఈ ఆలయం ఒకటి. వేలసంవత్సరాల క్రితం నుండే ఇక్కడ ఈ దేవాలయమున్నట్లుగా తెలియుచున్నది.
ప్రవేశద్వారం స్వాగతిస్తున్న దేవతామూర్తితో సాక్షాత్కరిస్తుంది. ఆలయ రాజగోపురం ప్రవేశద్వారం పైన ఉన్న పెద్దమ్మతల్లి మూర్తి చూడగానే ఆకట్టుకుంటుంది. ఎడమచేతివైపు ఉన్న పెద్దమ్మతల్లి చిన్న గుడి సుమారు 150 సమవత్సరాల చరిత్రగల మూలగుడి అంటారు. ఆ తర్వాత మాజీమంత్రి దేవాలయ స్థాపక ధర్మకర్త కీ.శే.పి.జనార్ధన రెడ్డి(ఆలయ ఫౌండర్ ట్రస్టీ) గారి ఈధ్వర్యంలో పునర్నిర్మాణం జరిగింది. వీరి నేతృత్వంలో ఐదు అంతస్తుల గర్భగుడి, ఏడు అంతస్తుల రాజగోపురం, కళ్యాణమండపం, వసతి గృహములు, శ్రీ గణపతి, లక్ష్మీ, సరస్వతి దేవాలయాలు నిర్మించబడి, 1994 లో హంపి విరూపాక్ష పీఠాధిపతులచే నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మరియు కుంభాభిషేకాలు జరిగాయి. ఆనాటి నుండి నగరంలో పెద్దమ్మగుడి మరింత వైభవాన్ని సంతరించుకుంటుంది.
ఆలయ ప్రాంగణంలో ధ్వజస్థంభం ఉన్నది. ధ్వజస్థంభం ముందు ఉన్న పీఠం మధ్యభాగాన రూపాయి బిళ్ళను అంచుమీద పడిపోకుండా నిలబెట్టగలిగితే మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. భ్వజస్తంభానికి ఇరుప్రక్కలా పోతురాజు విగ్రహ మూర్తులు ఉన్నారు. గర్భాలయంలో పెద్దమ్మతల్లి చతుర్భుజాలతో, విశాల నేత్రాలతో ఎడమవైపు చేతులలో శంఖం, ప్రత్యేక త్రిశూలం, కుంకుమభరిణెతోనూ, కుడివైపు చేతులలో చక్రం, ఖడ్గంతో దర్శనమిస్తుంది. అర్చనామూర్తియైన ప్రధాన విగ్రహంతో పాటు ఉత్సవమూర్తి కూడా ఇక్కడే ఉన్నారు. గర్భాలయాన అమ్మవారి పై కప్పు ఇష్టదళ పద్మాకారంతో కాంతులీనుతూ ఉంటుంది. ఉత్సవ మూర్తి ముందు ఉన్న శ్రీచక్రానికి నిత్యం కుంకుమార్చనలు జరుగుతాయి. అమ్మ నవరత్నఖచిత ఆభరణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది.
ప్రతిరోజు ఈ పెద్దమ్మతల్లికి నిత్య అభిషేకములు, కుంకుమార్చన, అలంకారములు, ఉత్సవ విగ్రహమునకు అభిషేకములు మరియు ప్రతి శుక్రవారం ప్రత్యేక అభిషేకములు జరపబడుచున్నవి. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు విజయదశమి వరకు దసరా నవరాత్రులు, ఆషాడశుద్ధ సప్తమి నుండి నవమి వరకు శాకాంబరి ఉత్సవములు మరుయు శ్రీ నాగదేవత దేవాలయంలో ప్రతి మంగళవారం నాగదోషపూజలు, మాఘ శుద్ధ పంచమి మొదలు సప్తమి వరకు వార్షిక రథోత్సవములు, రథసప్తమి రోజు రథము ఊరేగింపు కన్నుల పండగగా జరుపుతారు. రథసప్తమి రోజున చండీహోమం, బలిహరణం, అన్నదానం, జరుగుతాయి. పెద్దమ్మతల్లికి ఎరుపు, పసుపు వస్త్రాలను పరచి వేడివేడి అన్నం నివేదిస్తారు. హలిపీఠం వద్ద పసుపు కుంకుమలతో ముగ్గులు వేసి, ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. నవరత్న ఖచిత వజ్ర వైఢూర్య ఆభరణాలతో, బంగారుజడతో శోభయమానంగా అలంకరిస్తారు. వెండి సింహాసనం పై కూర్చోపెడతారు. మహానివేదన అన్నంపై దీపాలు పెట్టి బలిపీఠం ఏర్పాట్లు చేస్తారు. ఉత్సవవిగ్రహం ముందే కూష్మాండం అనగా గుమ్మడికాయను కుంకుమనీటితో కడిగి బలిపీఠంపై ఉంచుతారు. ఖడ్గాన్ని అలంకరించి పూజించి, బలిపీఠంపైన ఉన్న గుమ్మడికాయను కత్తితో రెండు ముక్కలు చేసి బలినివేదన చేస్తారు. ఈ దేవాలయంనకు భక్తులు జంటనగరాల నుండే కాక, ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి కూడా వేల సంఖ్యలో వస్తారు. ప్రతి ఆది, మంగళ, శుక్రవారాలలో ఆలయమునకు వచ్చిన భక్తులు సంప్రదాయ సిద్ధంగా బోనములు పెద్దమ్మ తల్లికి సమర్పించి వారి మొక్కులను చెల్లించుకుంటారు. అమ్మవారికి మొక్కుబడులుగా గాజులు, చీరలు కూడా భక్తులు సమర్పించుకుంటారు. గర్భాలయం వనుకవైపున నవదుర్గల ఆలయం ఉన్నది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రిగా నవనిధ దుర్గామాత మూర్తులను ఇచ్చట దర్శించుకుంటారు. ఈ పెద్దమ్మతల్లిని నిత్యం ఎంతోమంది భక్తులు దర్శించి తరిస్తారు.
Read More

తీజ్ ఉత్సవం విశిష్టతతీజ్ ఉత్సవం విశిష్టత
గిరిజన తెగలలో అధిక శాతం ఉన్న లంబాడీలకు ప్రత్యేక సంస్కృతి ఉన్నది. ప్రత్యేకమైన వేషధారణ ఉంటుంది. వీళ్లు అతి తక్కువ దేవతలను పూజిస్తారు. కొన్ని పండుగలను జరుపుకుంటారు. అందులో ఒకటి తీజ్ పండుగ. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వీరు ఈ రోజుల్లో తీజ్ పండుగను నిర్వహించుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతూ ఇష్టం వచ్చినప్పుడు నిర్వహించుకుంటున్నారు.

దేశంలోని లంబాడీలను బంజారా, చరన్ బంజారా, లవన్ బంజారా, సుగాలీ, వణజర వాటి ఉప కులాలు (భాట్, ఢాడీ) మొదలగు పేర్లతో పిలుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బంజారాలు (గోర్‌మాటి) అనే పేరు ఎక్కువ వాడుకలో ఉన్నది. భారతదేశంలోని బంజారాలు ఆర్థిక పరిస్థితుల వల్ల రాష్ర్టాల వారీగా ప్రత్యేక గుర్తింపు పొందారు. వారు ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా పయనిస్తున్నారు. సమాజంలో మమేకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి ఘన చరిత్ర ఉన్నప్పటికీ వీరి భాషకు లిపి లేదు. దీంతో వీరి చరిత్ర మౌఖికంగా వారి ఉపకులంలోని భాట్, ఢాడీలు వినిపిస్తుంటారు.

లిపిలేని కారణంగా కుల ఆచారాలలో, పండుగల నిర్వహణలో ప్రాంతాల వారీగా కొద్దిపాటి వ్యత్యాసాలు న్నాయి. బంజారాలు దసరా, దీపావళి, ఉగాది, హోలీలతో పాటు తమ జాతి విశిష్టతకు ప్రతీక అయిన తీజ్ పండుగను దక్షిణ భారతదేశంలో వైభవంగా జరుపుకుంటారు. ఈ తీజ్ పండుగను భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలుగా జరుపుకుంటారు. ఇందులో తెలంగాణ ప్రాంత లాంబాడీలు అధికం. వీరు జీవనోపాధి లేక ఏజెన్సీ ప్రాంతాల కంటే మైదాన ప్రాంతంలోనే ఎక్కువగా స్థిరపడ్డారు. పట్టణాలకు వలస వచ్చి కూలీలుగా జీవిస్తున్నారు. తీజ్ అనగా హరియాలి (పచ్చని గరక వలె ఉండే గోధుమ నారు) అని అర్థం.

ఈ పండుగను వివాహం కావాల్సిన లంబాడీ యువతులు జరుపుకుంటారు. వరుస కలిసిన ఇద్దరు యువతులు పూజారులుగా ఉంటారు. వీరు తొమ్మిది రోజులు నిష్టతో ఉండి రోజుకు ఒక పూట శాకాహారం తీసుకుంటారు. భక్తిశ్రద్ధలతో గణ్ గోర్ (శివ పార్వతులు), వీరి కుల దేవతలైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్, దండీ మేరమయాడీలను పూజిస్తారు. వారి సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రతిరోజూ ఆట, పాటలతో తొమ్మిదవ రోజు చెరువులో నిమజ్జనం చేసే చేసే వరకు ఉత్సవం కొనసాగుతుంది.

బుట్టలలో గోధుమలు ఎంత పచ్చగా పెరిగితే (తీజ్) అంత శుభంగా జరుగుతుందని నమ్మకం. మా తండాలు, మా ప్రాంతం, మా రాష్ట్రం, మా దేశం సుభిక్షంగా ఉండాలని, పంటలు పచ్చగా ఉండాలని లంబాడీ యువతులు దేవతలను, పూర్వీకులను వేడుకుంటారు. తండాలో పెళ్లి చేసుకోబోయే యువతులు ఆ తండా నాయకుడిని తీజ్ పండుగ నిర్వహించాలని వేడుకుంటారు. తీజ్ పండుగ జరుపుకోవడానికి కుల పెద్ద అయిన నాయకుడు అనుమతించిన తర్వాత జూలై మాసం మొదలుకొని సెప్టెంబర్ మాసం మొదటి వారం లోపు జరుపుకోవచ్చు. తీజ్ పండుగ ప్రారంభానికి ముందురోజు (మంగళవారం) వనభోజనానికి వెళ్లి, సప్తమాతల్లో ఒకరైన సీత్ల భవానీ పూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంలో పశుపక్ష్యాదులకు వ్యాధులు సోకకూడదని, సీత్ల భవాని ముందు నుంచి పశువుల మందలను దాటిస్తూ దేవలకు సమర్పించిన పదార్థాల నుంచి (గుడాలు కొన్నింటిని వాటిపై చల్లుతారు. అదేరోజు సాయంత్రం తండా నాయకుని ఇంటి ముందు తీజ్‌కు సంబంధించిన గోధుమలను ఒక బిందెలో పోసి నానబెట్టి, ఉట్టి సాయంతో ఒక కొయ్యకు వేలాడదీస్తారు. మరుసటిరోజు బుధవారం సాయంత్రం కంకతో తయారుచేయబడిన బుట్టలతో కొంత ఎరువులు వేసి గోధుమలను నాటుతారు.

గోధుమలతో కూడిన ప్రతి ఒక్క బుట్ట ఆ తండాలో ఉన్న ఆడపిల్లలకు సమానంగా ఉంటాయి. అవి కాకుండా వారి బంధువుల ఆడపిల్ల పేరు మీద కూడా బుట్టలను కడతారు. వీటితో పాటు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్, దండీమేరమయాడీ పేర్ల మీద టేకాకులతో తయారు చేసిన రెండు డొప్పలలో కూడా గోధుమలను పెంచుతారు. బట్టలను ఒక ప్రదేశంలో కట్టిన రోజు నుంచి తొమ్మిది రోజుల వరకు ప్రతిరోజు మూడుసార్లు పూజారులుగా ఉన్న ఆడపిల్లలు, ఇతరులు డప్పువాయిద్యాలతో పాటలతో చెరువు లేదా చేతబావి నుంచి తెచ్చిన నీళ్లను గోధుమలకు పోస్తారు.

గణగోర్: దీన్ని శివపార్వతుల ప్రతిరూపంగా భావిస్తారు. నిమజ్జనానికి ముందురోజు పుట్టి మట్టిని తెచ్చి రెండు విగ్రహాలను తయారు చేస్తారు. ఆట పాటలతో తీజ్‌ను నెలకొల్పిన ప్రదేశానికి తీసుకువచ్చి పూజారులైన ఆడపిల్లలు హోమంలో నైవేద్యాన్ని సమర్పిస్తారు. వారి మనసులో ఉన్న కోరికలను కోరుకుంటారు.
ఢమోళీ: ఈ కార్యక్రమం కూడా నిమజ్జనానికి ముందురోజు సాయత్రం జరుగుతుంది. ప్రతి ఇంటి నుంచి బియ్యపు పిండి, బెల్లం, నెయ్యితో తయారు చేసిన తీపి పదార్థాలు ఒక పెద్ద పాత్రలో వేసుకుని తలపై ప్రత్యేకంగా అలంకరించబడిన చుట్టబట్టపై పట్టుకుని, ప్రత్యేకంగా అలంకరించిన వస్త్రం (అద్దాలు, గవ్వలు, పూసలతో తయారు చేసినటువంటి గోణో) పాత్రపై కప్పుకుని అందరూ తీజ్ నెలకొల్పిన పెద్దమనిషి ఇంటికి వస్తారు.

తీజ్ బుట్టలో నుంచి రెండింటిని తీసి పూజారులైన అమ్మాయిలు వాటి ముందు హోమం పెట్టి నైవేద్యాన్ని సమర్పిస్తారు. తర్వాత తెచ్చిన తీపిని ఇంటింటికి వెళ్లి పంచుకుంటారు. నిమజ్జనం రోజు ఉదయం (గురువారం) సంప్రదాయం ప్రకారంగా శ్రీ సేవాలాల్ మహరాజ్‌కు హోమం పెట్టి, దండిమేరమయాడీకి బలి పూజ చేస్తారు. ఆ రోజు వచ్చిన బంధువులతో (పామణ్) కలిసి సాంస్కృతిక కార్యక్రమాలైన (నాచేరో, దండామారేరో) ఘనంగా నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం గోధుమనారుతో కూడిన తీజ్ బుట్టలను ఎవరివి వారు తీసుకుని నిమజ్జనానికి ఆడుతూపాడుతూ బయలుదేరుతారు. చెరువులో నిమజ్జనం చేసిన తర్వాత వారి ఆడపడుచుల కాళ్లు (పిడియ)పైన ఉంచి కడిగి దండం పెడుతారు.
Read More

Powered By Blogger | Template Created By Lord HTML