.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

8, జులై 2023, శనివారం

నమః పార్వతి పతయే హర హర

 నమః పార్వతి పతయే హర హర

హర హర శంభో మహాదేవ

హర హర మహాదేవ

హర హర హర హర మహాదేవ

శివ శివ శివ శివ సదాశివ

మహాదేవ సదాశివ

సదాశివ మహాదేవ ||


💥శివాలయంలో పరమేశ్వరుని దర్శనం..


శివాలయంలో పరమేశ్వరుని దర్శిస్తే ముక్కోటి దేవుళ్ళని దర్శించినట్టే.


సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చేసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది.

అందుకే, శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్శించినట్టే అని చెప్పబడింది.


శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి.

అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ధ్వముఖమై (పైకి/ఆకాశంవైపు చూస్తూ) ఉంటుంది.

5 ముఖాల్ని 5 పేర్లు నిర్ధేశించబడ్డాయి.

అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చుని అయినా పూజ చేయవచ్చు అంటారు.


శివాగమనంలో చెప్పినట్లుగా మనం తప్పకుండా శివాలయంలో ఏ దిక్కువైపు వెళితే ఆ శివలింగం పేరుని స్మరించాలి.

ముఖాలు మనకు 5 ఫలితాలని కలుగజేస్తాయి.

ఆ 5 ముఖాలలో నుండే సృష్టి, స్థితి, లయ, తిరోదానము, అనుగ్రహము యివ్వబడతాయి.

🍁🍁🍁🍁🍁


🌹శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది. కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది.. "పశ్చిమాభిముఖమైన" శివాలయం.


అంటే మీరు గుడిలోకి వెళ్ళగానే శివలింగం పశ్చిమం వైపు చూస్తూ ఉంటుంది.

అలా శివలింగానికి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమంవైపు ఉన్నా లేదా శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా దానిని "సద్యోజాత శివలింగం" అని అంటారు.


అప్పుడు మనం తప్పకుండా అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు "ఓం సద్యోజాత ముఖాయ నమః" అని స్మరించుకోవాలి.

శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సద్యోజాత శివలింగం.


🌹శివలింగం "తూర్పు వైపు"కు చూస్తూ ఉంటే, అటుంటి శివలింగాన్ని "తత్పురుష ముఖం" అని అంటారు.

తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది. అంటే చీకటిలో ఉంచటం.

అది మనల్ని మాయ చేత కప్పి బడేస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది.

ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాము.

ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం.


సద్యోజాత ముఖం పూజించ తగినదే. ఏ మాత్రం అనుమానం లేదు. మనల్ని రక్షించినా, శిక్షించినా అన్నీ ఆ పరమేశ్వరుడేగా.


🌹శివలింగం "దక్షిణానికి" చూసే ముఖాన్ని దక్షిణామూర్తి స్వరూపంగా చూడమని చెప్తారు.

ఆ ముఖాన్నే "అఘోర ముఖం" అంటారు.


ఈ అఘోర ముఖం అగ్నిహోత్రానికి అంతటికీ అధిష్ఠానం అయి ఉంటుంది.

ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసే స్వరూపమే ఈ అఘోర ముఖం.

ఈ అఘోర ముఖమే సమస్త ప్రపంచాన్ని లయం చేసి, మళ్ళీ మనకు జన్మను ఇస్తూ ఉంటారు.

మనకు మృత్యువుపట్ల భయం పోగొట్టేది, మనకి జ్ఞానం ఇచ్చేది ఇదే. 


🌹"ఉత్తరం" వైపు చూసి "వాసుదేవ ముఖం'' నీటి మీద అధిష్ఠానం అయి ఉంటుంది.

ఈ వాసుదేవ ముఖమే మనకు సమస్త మంగళము ఇచ్చే ముఖం.

ఈ వాసుదేవ ముఖాన్ని "ఓం వాసుదేవాయ నమః" అని అంటే మనకు అనారోగ్యం కలగకుండా చూస్తాడు.


🌹శివాలయంలో లింగ దర్శనం అయ్యాక ఒకసారి పైకి చూసి ఓం ఈశాన ముఖాయ నమః అని స్మరించుకోవాలి.

ఆ ఈశాన ముఖమే మనకు మోక్షాన్ని ప్రసాదించేది. 


ఈశాన ముఖ దర్శనం మనం మిగిలిన నాలుగు ముఖాల్ని దర్శించిన తరువాతనే దర్శించాలి. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది.

ఈ ఈశాన ముఖం ఆకాశమునకు అధిష్ఠానం అయి ఉంటుంది.


శివాలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది.

అక్కడికి ప్రదక్షిణంగా వెళ్ళినప్పుడు మనలో ఉండే అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకుని ముందుకు సాగాలి.

సేకరణ... 💐🙏


Read More

కపిలతీర్థం తిరుపతి

            కపిలతీర్థం తిరుపతి 

                  ➖➖➖✍️శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది కపిలతీర్థము.


కపిల తీర్ధమునకు ‘చక్రతీర్థం‘ లేదా ‘ఆళ్వార్ తీర్థం’ అని కూడా పిలుస్తారు.


కృతయుగములో పాతాళలోకంలో కపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి,  భూమిని చీల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు.


అందువలన ఇది 'కపిలలింగం'గా పేరొందింది.


త్రేతాయుగములో అగ్ని పూజించిన కారణంగా 'ఆగ్నేయలింగం' అయి, ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలందుకుంటోంది.


ముల్లోకాలలోని సకల తీర్థాలూ ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ పది ఘటికల (నాలుగు గంటల) పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి.


ఆ సమయంలో అక్కడ స్నానం చేసి, నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా, అది మేరుపర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం.


కార్తిక మాసం నందు వచ్చు కార్తీక దీప పర్వ దినాన ఇక్కడ కొండ పైన దీపం సాక్షాత్కరిస్తుంది. భక్తులందరు కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు.


ఈ ఆలయం తి.తి.దే. వారి ఆధ్వర్యంలో పని చేస్తున్నది.


శివరాత్రి పండుగ మరియు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.


తెలుగునాట వున్న సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో కపిలతీర్థం ఒకటి.


ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైష్ణవ తిరుపతి క్షేత్రమైన తిరుపతి పట్టణంలో ఇది వుండటం విశేషం. 


హరిహరులకు ఏ బేధం లేదని నిరూపిస్తూ నిలచిన ఈ తీర్థ రాజం తిరుపతిలోని అలిపిరి మార్గంలో వుంది.


శేషాచల పర్వతపాదాన వున్న ఈ క్షేత్రంలో మనోహరమైన ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, అందమైన జలపాతాలు, యాత్రికులను కట్టిపడేస్తాయంటే ఏ మాత్రం అతిశయోక్తికాదు.


కృతయుగంలో ఈశ్వరుని గురించి ఘోరతపం ఆచరించిన కపిల మహర్షి భక్తికి మెచ్చి పాతాళం నుండి పుడమిని బద్దలు కొట్టుకుంటూ వచ్చిన శివుడు ఈ పవిత్రతీర్థంలో నిలచినట్లు స్థలపురాణం చెబుతోంది.


కపిలుని తపస్సుకు మెచ్చి నిలచిన స్వామిని కపిలేశ్వరునిగాను, ఇక్కడ లింగాన్ని కపిల లింగంగాను పిలుస్తారు.


కామాక్షీ సమేతుడై నిలచిన స్వామివారిని తర్వాతి కాలంలో అగ్నిదేవుడు ఆరాధించిన కారణంగా ఇక్కడి లింగాన్ని అగ్నిలింగంగానూ వ్యవహరిస్తారు.


తిరుమల గిరుల నుంచి గల గల ప్రవహిస్తూ అమితమైన వేగంతో సుమారు 25అడుగుల ఎత్తు నుంచి ఆలయపుష్కరిణిలోకి దూకే ఆకాశ గంగ శివుని జటాజూటాన్ని చేరినట్టు అనిపిస్తుంది. ఇక్కడి పుష్కరిణిని శైవులు కపిలతీర్థమని, వైష్ణవులు ఆళ్వార్ తీర్థమని, చక్రతీర్థమని పిలుస్తారు.


ఇప్పుడున్న ఆలయం సుమారు వెయ్యేళ్ళ నాటిదని చెపుతారు.

అప్పట్లో ఈ ప్రాంతాన్ని ఏలిన రాజేంద్రుని చోళుల కాలంలో ఈ నిర్మాణం జరిగిందని స్వతహాగా శైవమతాయులైన చోళులు దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించినట్టు స్పష్టంగా తెలుస్తుంది.


వైష్ణవతీర్థం విజయనగరరాజుల కాలంలో దీన్ని నాటి పాలకులు వైష్ణవతీర్థంగా పరిగణించి, ఆళ్వార్ తీర్థమని పిలవటం ఆరంభించారు.


ఇప్పటి ఆలయానికి ముందున్న చిన్నగుడి ఆళ్వారులలో ఒకరి పేరిట నమ్మాళ్వార్ పేరిట నిర్మితమైనట్లు చెపుతారు.


విజయనగర పరిపాలన చివరిరోజుల్లో అక్కడ్నుంచి వచ్చి ఈ ప్రాంతంలో నివాసమేర్పరచుకున్న ఒక దేవదాసి ఈ ఆలయంలో గణపతి ప్రతిష్టగావించిందని చెబుతారు.


ఈ ఆలయప్రాంగణంలో కపిలేశ్వరస్వామితో పాటు, కార్తికేయుడు, శ్రీకృష్ణుడు, అగస్తేశ్వ రుడు, కాశీవిశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీ నారాయణుడు కూడాకొలువై వున్నారు.


తిరుపతి, తిరుమల వంటి ప్రసిద్ధ నగరాలకు దగ్గరలో శివుని విగ్రహం ఉన్న ఒకేఒక ఆలయం ‘కపిల తీర్ధం.’ ఈ పెద్ద ఆలయం తిరుమల కొండ పాదాల వద్ద పర్వత ప్రవేశంలో ఉంది.


ఈ ఆలయ ప్రవేశం వద్ద శివుని వాహనం ‘నంది’ ఉంది. శివుని విగ్రహం ముందే ఇక్కడ కపిల మహర్షి ఇక్కడ ఉన్నట్లు, ఆయన పేరుతో దీనికి ఆ పేరు వచ్చినట్లు చెప్తారు.


తీర్థం అంటే ప్రసిద్ధ సరస్సు అని అర్ధం, పాపవినాశనం జలపాతాల ఆలయం దగ్గరలో ఏర్పాటు చేయబడింది.


ఈ ఆలయం 13,16 శతాబ్దాలలో విజయనగర రాజుల ప్రోత్సాహంతో ప్రాచీన కాలంలో బాగా ప్రాచుర్యం పొందిందని చెబుతారు. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంరక్షణలో పోషించబడుతుంది.


విజయనగరరాజుల కాలంలో దీన్ని నాటి పాలకులు వైష్ణవతీర్థంగా పరిగణించి, ఆళ్వార్ తీర్థమని పిలవటం ఆరంభించారు.


ఇప్పటి ఆలయానికి ముందున్న చిన్నగుడి ఆళ్వారులలో ఒకరి పేరిట నమ్మాళ్వార్ పేరిట నిర్మితమైనట్లు చెపుతారు.

సంతతి లేనివారు ఈ క్షేత్ర స్వామిని ఆరాధించి ఒక రాత్రి నిద్రచేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.


పుణ్య స్నానం ఇక్కడి తీర్థంలో ఆచరించిన వారి పాపాలు పటాపంచలౌతాయని భక్తుల విశ్వాసం.


విశేషించి కార్తీక మాసంలో లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. వేకువజాము నుంచి పుణ్యస్నానాలు ఆచరించి ఆలయప్రాంగణంలో ఈశ్వరునికి దీపాలు పెడతారు.✍️

ఓం శివాయ నమః

ఓం నమో  వేంకటేశాయ !!

.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు


Read More

అష్టైశ్వర్యాలు:- --------------------------------- అష్టైశ్వర్యాలు అంటే అష్ట సిద్ధులు! అవి

అష్టైశ్వర్యాలు:- 

---------------------------------

 అష్టైశ్వర్యాలు అంటే అష్ట సిద్ధులు! అవి 


👉 సూక్ష్మరూపం ధరించగలగడం అణిమ.

👉 గొప్ప రూపం ధరించడం మహిమ.

👉 తేలికగా అయిపోవడం లఘిమ.

👉 బరువుగా అయిపోవడం గరిమ.


👉 పొందవలసిన వాటిని పొందడమే ప్రాప్తి.

👉 విశేషమైన కోరిక తీరడమే ప్రకామ్య.

👉 అందరి మీద పరిపాలనా శక్తి ఈశత్వ.

👉 అందరినీ వశపరచుకోవడం వశిత్వ.


 మొదటి నాలుగు.... అణిమ, మహిమ, గరిమ, లఘిమ .. ఇవి ధ్యానంలోంచి లభ్యమవుతాయి.


 చివరి నాలుగు ... ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వ, వశిత్వ... ఇవి బ్రహ్మ జ్ఞానంలోంచి లభ్యమవుతాయి.

Read More

🌼శ్రీరామాష్టకం🌼

🌼శ్రీరామాష్టకం🌼 


భజే విశేషసుందరం సమస్తపాపఖండనమ్ |

స్వభక్తచిత్తరంజనం సదైవ రామమద్వయమ్  ౧ 


జటాకలాపశోభితం సమస్తపాపనాశకమ్ |

స్వభక్తభీతిభంజనం భజేహ రామమద్వయమ్  ౨ 


నిజస్వరూపబోధకం కృపాకరం భవాఽపహమ్ |

సమం శివం నిరంజనం భజేహ రామమద్వయమ్  ౩ 


సదా ప్రపంచకల్పితం హ్యనామరూపవాస్తవమ్ |

నరాకృతిం నిరామయం భజేహ రామమద్వయమ్  ౪ 


నిష్ప్రపంచనిర్వికల్పనిర్మలం నిరామయమ్ |

చిదేకరూపసంతతం భజేహ రామమద్వయమ్  ౫ 


భవాబ్ధిపోతరూపకం హ్యశేషదేహకల్పితమ్ |

గుణాకరం కృపాకరం భజేహ రామమద్వయమ్  ౬ 


మహాసువాక్యబోధకైర్విరాజమానవాక్పదైః |

పరం చ బ్రహ్మ వ్యాపకం భజేహ రామమద్వయమ్  ౭ 


శివప్రదం సుఖప్రదం భవచ్ఛిదం భ్రమాపహమ్ |

విరాజమానదైశికం భజేహ రామమద్వయమ్  ౮ 


రామాష్టకం పఠతి యస్సుఖదం సుపుణ్యం

వ్యాసేనభాషితమిదం శృణుతే మనుష్యః |

విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం

సంప్రాప్య దేహనిలయే లభతే చ మోక్షమ్🙏🍒


Read More

🕉️శ్రీ సుబ్రహ్మణ్య మంగళ స్తోత్రమ్🔯

  🕉️శ్రీ సుబ్రహ్మణ్య మంగళ స్తోత్రమ్🔯


ఓం మంగళం దేవదేవాయ రాజరాజాయ మంగళం

మంగళం నాథనాథాయ కాలకాలాయ మంగళం. || 1 ||


మంగళం కార్తికేయాయ గంగాపుత్రాయ మంగళం

మంగళం జిష్ణుజేశాయ వల్లీనాథాయ మంగళం. || 2 ||


మంగళం శంభుపుత్రాయ జయంతీశాయ మంగళం

మంగళం సుకుమారాయ సుబ్రహ్మణ్యాయ మంగళం. || 3 ||


మంగళం తారకజితే గణనాథాయ మంగళం

మంగళం శక్తిహస్తాయ వహ్నిజాతాయ మంగళం. || 4 ||


మంగళం బాహులేయాయ మహాసేనాయ మంగళం

మంగళం స్వామినాథాయ మంగళం శరజన్మనే. || 5 ||


అష్టనేత్రపురీశాయ షణ్ముఖాయాస్తు మంగళం

కమలాసనవాగీశ వరదాయాస్తు మంగళం. || 6 ||


శ్రీ గౌరీగర్భజాతాయ శ్రీకంఠ తనయాయచ

శ్రీ కాంత భాగినేయాయ శ్రీ మత్ స్కందాయ మంగళం. || 7 ||


శ్రీ వల్లీ రమణాపాద శ్రీ కుమారాయ మంగళం

శ్రీ దేవసేనా కాంతాయ శ్రీ విశాఖాయ మంగళం. || 8 ||


మంగళం పుణ్యరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం

మంగళం పుణ్యయశసే మంగళం పుణ్యతేజసే. || 9 ||


ఇతి శ్రీ సుబ్రహ్మణ్య మంగళ స్తోత్రం సంపూర్ణం.


శుభ శుభోదయం


Read More

5, డిసెంబర్ 2022, సోమవారం

ఇది పుర గ్రామం, సొరబ తాలూకా, షిమోగా జిల్లా లో

 👆ఈశ్వరుడు నందిపై 

గర్భగుడిలో  ఉండడం అనేది

 చాలా అరుదుగా కనిపించే శిల్పం!! 

16వ శతాబ్దానికి చెందిన

 అందమైన శిల్పం.  

ఇది పుర గ్రామం, 

సొరబ తాలూకా, 

షిమోగా జిల్లా లోని


 సోమేశ్వరాలయంలో ఉంది...


ఇక్కడ శివుడుకిరీట 

ముఖతలో వున్నాడు


🙏హర హర మహాదేవ్🙏

          శుభోదయం

Read More

4, డిసెంబర్ 2022, ఆదివారం

శ్రీ శంకరాచార్య విరచిత* *మీనాక్షి పంచరత్న స్తోత్రం.

 


    శ్రీ శంకరాచార్య విరచిత*
*మీనాక్షి పంచరత్న స్తోత్రం.!*


ఉద్యద్భానుసహస్రకోటిసదృశాం కేయూరహారోజ్జ్వలాం
బింబోష్ఠీం స్మితదంతపంక్తిరుచిరాం పీతాంబరాలంకృతామ్ |
విష్ణుబ్రహ్మసురేంద్రసేవితపదాం తత్త్వస్వరూపాం శివాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్  1

ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేందువక్త్రప్రభాం
శింజన్నూపురకింకిణీమణిధరాం పద్మప్రభాభాసురామ్ |
సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్  2

శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీంకారమంత్రోజ్జ్వలాం
శ్రీచక్రాంకితబిందుమధ్యవసతిం శ్రీమత్సభానాయకీమ్ |
శ్రీమత్షణ్ముఖవిఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్  3

శ్రీమత్సుందరనాయకీం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం
శ్యామాభాం కమలాసనార్చితపదాం నారాయణస్యానుజామ్ |
వీణావేణుమృదంగవాద్యరసికాం నానావిధామంబికాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్  4

నానాయోగిమునీంద్రహృత్సువసతీం నానార్థసిద్ధిప్రదాం
నానాపుష్పవిరాజితాంఘ్రియుగళాం నారాయణేనార్చితామ్ |
నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థతత్వాత్మికాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవా 

Read More

*ఆచమనం అంటే..

 *ఆచమనం అంటే..?

       ➖➖➖


పూజలు, వ్రతాల్లో ”ఆచమనం” అనే మాట చాలా సార్లు వింటాం. వినకపోయినా హిందువు అనే వ్యక్తి ఏదోక సందర్భంగాలో దానిని పాటించే ఉంటారు.


కానీ, దానర్థం మాత్రం తెలియదు. అర్చకులు చెప్పినట్లు చేతిలో నీరు పోసుకుని తాగేయడం పరిపాటి. 

కానీ, అలా ఎందుకు తాగమంటున్నారు. దాని అర్థం ఏమిటి అనే విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం మీ వంతు…


సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడో, పూజా సమయంలోనో మనం ఈ ఆచమనాన్ని పాటించి ఉంటాం. సాంప్రదాయబద్ధంగానైతే రోజులో పలుమార్లు పాటిస్తారు.


ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత, పూజకు ముందు, సంధ్యావందనం చేసే సమయంలో భోజనానికి ముందు, తర్వాత, బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత ముఖం, కాళ్ళూ చేతులూ కడుక్కున్న తర్వాత ఆచమనం చేయొచ్చు.


సంస్కృతంలో ”గోకర్ణాకృతి హస్తేన మాషమగ్నజలం పిబేత్” అని వర్ణించారు. అంటే, కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి, నీటిని పోసి, వాటిని తాగడం అన్న మాట.


చేతిలో పోసేనీళ్ళుకి కూడా కొలత ఉంటుంది. మూడు ఉద్ధరిణిల నీటిని మాత్రమే పోయాలి. అంటే ఒక మినపగింజమునిగేంత పరిమాణంలో నీళ్ళు కొలత అంతే ఉండాలి.


ఎందుకు చేయాలి? ఏమిటి దాని వలన ప్రయోజనం అంటే, గతంలో మనం అనేక మార్లు భారతీయత, దాని ప్రభావం అర్థం పరమార్థం గురించి చెప్పుకున్నాం. మన సాంప్రదాయం అంత గొప్పది.


భక్తి మాత్రమే కాదు అణువణువునా శాస్త్రీయత, ఆరోగ్య సూత్రం ఇనుమడింపజేస్తాయి. భక్తి, ఆధ్యాత్మికత ఉట్టిపడతాయి. ఆచమనంలో కూడా అదే దాగి ఉంది.


మన గొంతు ముందు భాగంలోంచి శబ్దాలు వస్తాయి. దీన్ని స్వరపేటిక అంటాం. దీనిచుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది.


కనుక కొంత వరకూ రక్షణ లభిస్తుంది. అయినప్పటికీ, ఇది ఎంత అద్భుతమైనదో, అంత సున్నితమైనది.


ఏ చిన్న గాయం అయినా స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు, ప్రాణమే పోవచ్చు. స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి.


ఇవి ఇంగ్లీషు అక్షరం ‘V’ ఆకారంలో మిళితమై ఉంటాయి. ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి, ఎపెక్స్ ముందుభాగంలో పాతుకుని ఉంటాయి.


స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి.


స్వరపేటిక మహా సున్నితమైనది. ముక్కు, నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు నాళాలు, అంగిలి, కొండనాలుక,


గొంతు లోపలి భాగం, శ్వాస నాళం, అన్ననాళం, స్వర తంత్రులు, వాటిచుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి.


వీటికి బలం, వ్యాయామం కలిగించి ఉత్తేజ పరచడమే ఆచమనం ప్రక్రియ. సాధారణంగా గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటికొస్తుంది.


ఇలా లోపలి నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు. శబ్దం సులువుగా, స్పష్టంగా రావాలి. ఆచమనం పద్దతిలో మెల్లగా తాగడం అలవాటు చేసుకుంటే స్పష్టత అబ్బుతుంది.


“కేశవాయ స్వాహా” అనడంలో ఆంతర్యమేమిటి అంటే అది గొంతునుండి వెలువడుతుంది. ఇక “నారాయణాయ స్వాహా” అనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది.


చివరిగా “మాధవాయ స్వాహా” అనే మంత్రం పెదాలు మాత్రమే పలుకుతాయి. ఆచమనం ద్వారా గొంతు, నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది.


ఇక చాలా మందికి చేతితో ఎందుకు తాగాలి అనే అనుమానం కూడా కలుగవచ్చు. మన చేతుల్లో కొంత విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది.


చేతిలో నీళ్ళు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని నోటి ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వం ఉండేలా, సమ ధాతువుగా ఉండేలా చేస్తుంది.


ఉద్దరిణి అంటే కొద్ది కొద్దిగా తాగడం వలన కొద్దిగా విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు,పెగుల వరకూ ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజ పరుస్తాయి.


ఇలా ఆచమనం వెనుక ఇంతటి శాస్త్రీయత ఉందన్నమాట


*సంధ్యా వందనము ఎందుకు?

*మరియు ఫలము:


ఎన్నోవేల కోట్ల జీవరాసుల మధ్య జడమై,అజరమై, జడపదార్థం కాని ఎన్నెన్నో జీవరాసుల మధ్యలో ఉన్న తేజస్సుకొరకు సంధ్యావందనం. లోకంలో స్థావరమై, జంగమమైన అనేక రూపాలలో మానవ జన్మ అత్యున్నతమైనది. జీవన సాఫల్యం చెందడానికి,(ఎందుకు జన్మించాము) తన చుట్టూ ఉన్న సమాజమును ఉద్దరించ డానికి, ఒక వ్యక్తిగా ఉపాసించడమే సంధ్యావందనము. 


గాయత్రి అనగా భూదేవియే ఉపస్తుగా, విష్ణువే హృదయంగా, శివుడే సర్వవ్యాపి తముగా ఉండే దేవి పరదేవత. విశ్వభూతరాళాంత మధ్యలో అంతర్గతంగా ఉండే స్వరూపం ఈ గాయిత్రి మాత. ఒక యోగిగా, ఒక ఋషిగా మనము ఎక్కడికో వెళ్ళి తపస్సు చేయనవసరం లేదు. ప్రతి రోజు ఒక 25 ని||ములు ఈ గాయత్రీ జపం చేయడం వలన తన జన్మకు సాఫల్యం చేకూర్చినవాడు కాగలడు. 


మన జీవన యానాన్ని మన చుట్టూ ఉండేవారి జీవనాన్ని, కుటుంబాలని, సమాజాన్ని, నవోన్వేషణము వైపుకు నడపడం, అమ్మకు(తల్లి) నాన్నకు(తండ్రి) గురువులకు, పితృదేవతలకు, మాతృ దేవతలకు, మనకు కనిపించని హితోపదేశులకూ, అందరికీ వారిని స్మరించుచూ వారి శ్రేయస్సుకు, వారి పురోగమనానికి, ఒక నీటి చుక్క విడువడమే, సంధ్యావందన పరమార్థం. 

మరియు ఈ మానవ ఉపాధిని ప్రసాదించిన తల్లి తండ్రులకు, ఈ ఉపాధిని సన్మార్గంలో నడపడానికి చుక్కానియైన గురువు గార్లకు, హితులకు,సన్నిహితులకు, మిత్రులకు, దైవోపగతులకు, ఆత్మీయులకు, ఆత్మజులకు, మన ఇరుగు పొరుగులకు, సర్వులకు నమస్కరించి వారి అభ్యున్నతిని, శ్రేయస్సును, త్రికరణ శుద్ధిగా అభిలషిస్తూ చేయడమే సంధ్యావందనము.✅*సంధ్యావందనము:

సంద్యావందన సమయ వివరణ:

**************************


ప్రాతః సంధ్యాసమయము 

ఉదయం 5-12 AM నుండి 6.00 AM వరకు


మద్యాహ్నసంధ్యాసమయము ఉదయం 11-12 AM నుండి 12.00 noonవరకు


సాయం సంధ్యాసమయము సా II 5-12 PM నుండి 6.00 PM వరకు.


ప్రతి రోజూ ప్రాతః సంధ్యావందనము, ఉత్తర సంధ్యావందనము విధిగా ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశములో(దేశములో) ఉన్నా సంధ్యావందనము తప్పనిసరి.

సూర్యోదయమునకు ముందు శౌచముతో శుచిగా(స్నానం చేసి)తూర్పు దిశగా కుడి కాలును సగం మడచి ఎడమకాలును పూర్తిగా మడచి, గొంతుకు కూర్చొని అంటే (ఎడమ కాలు మడిము మీద పృష్టభాగము పిర్రలు ఆనించి) పృష్టభాగము(ముడ్డి,గుదము) నేలను(భూమిని) తాకకుండా కూర్చొని, ఆచమనం చేయాలి. అలా ఆచమనం చేయడం వలన స్థూల, సూక్ష్మ, కారణ శరీరము యందలి తాపములు, వెంటనే ఉప శాంతిని పొందుతాయి.అపుడు మనస్సు నిలబడుతుంది.


ఎప్పుడు ఆచమనం చేసినా ఇదే విధానంలో చేయాలి.


ముఖ్య గమనిక :-

********************************

సంద్యావందనసమయములో తుమ్మడం, దగ్గడం, అపానవాయువును (పిత్తులు, చెడు గాలిని) వదలడం జరిగిన వెంటనే ఆచమనము చేసి కుడిచేతితో కుడిచెవినితాకలి లేదా తడిగా ఉన్న భూమిని తాకాలి.


“ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్తాంగతో పివా!

యస్స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచిరి!”

అంటూ శిరస్సు మీద జలము(శుద్ద జలము)కుడి చేతి బొటన వ్రేలితో శిరస్సు మీద చల్లుకొనుచూ

ఓం పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్షాయ నమః”

కేశవ నామాలు ఆచమనం.

కుడి కాలును సగం మడచి ఎడమ కాలును పూర్తిగా మడచి రెండు కాళ్ళ మీద పృష్టభాగము భూమికి తగులకుండా కాళ్లపైనే కూర్చొని(గొంతుకు)కూర్చొని ఆచమనం చేయాలి.


కుడిచేతి చూపుడు వ్రేలుకు, మధ్య వ్రేలుకు మధ్య, బొటన వ్రేలును ఉంచి, చూపుడు వ్రేలుతో బొటన వ్రేలిని అదిమి పట్టుకొని మిగతా వ్రేళ్లను చాపి ఉంచి, అంటే గోకర్ణాకృతిలో ఉంచి, ఎడమ చేతితో పంచపాత్రలోని శుద్దజలమును కేవలం మినపగింజ మునుగు నంత జలమును, ఉద్ధరణితో కుడిచేతిలో వేసుకొని (తీసుకొనేటప్పుడు కుడి చేతి అరచేతి చివరి భాగమును క్రింది పెదవికి ఆనించి శబ్దము రాకుండా) ముందుగా

“ఓం కేశవాయ స్వాహా” అని చెప్పుకొని శబ్దము రాకుండా, జుర్రకుండా ఆ జలమును నోటిలోకి తీసుకొనవలయును. అలా తీసుకొన్న నీరు కడుపులో బొడ్డు వరకూ దిగిన తర్వాత మరలా

“ఓం నారాయణాయ స్వాహా” అని చెప్పుకొని శబ్దము రాకుండా, జుర్రకుండా ఆ జలమును నోటిలోకి తీసుకొనవలయును. 


అలా తీసుకొన్న నీరు కడుపులో బొడ్డు వరకూ దిగిన తర్వాత మరలా

“ఓం మాధవాయ స్వాహా” అని చెప్పుకొని శబ్దము రాకుండా, జుర్రకుండా ఆ జలమును నోటిలోకి తీసుకొనవలయును. 


అలా తీసుకొన్న నీరు కడుపులో బొడ్డు వరకూ దిగిన తర్వాత మరలా

“ఓం గోవిందాయ నమః” అని చెప్పుకొనుచూ కుడిచేతిలోని జలమును, ఎడమ వైపు కాలు ప్రక్కన వదలవలయును.

ఎప్పుడు ఆచమనము చేసినా ఇదే పద్దతిన చేయవలయును.


నమస్కారము చేయుచూ ఈ క్రింది నామములు, భక్తితో త్రికరణ శుద్దిగా అంటే మనము ఉచ్ఛరించే ప్రతినామమూ యొక్క రూపమును, హృదయమునందు ఊహించుకొనుచూ శ్రద్ధాభక్తులతో మనో నేత్రముతో స్వామి వారి రూపమును చూచుచూ తదేక ధ్యానముతో ఉచ్చరించవలయును. (కరన్యాస ప్రక్రియ కూడా కలదు) చేయ దలచిన వారు చేయవచ్చు లేదా నామములను మాత్రమే కూడా ఉచ్ఛరించవచ్చు.


ఓం విష్ణవే నమః

ఓం మధుసూధనాయ నమః

ఓం త్రివిక్రమాయ నమః

ఓం వామనాయ నమః

ఓం శ్రీధరాయ నమః

ఓం హృషీకేశాయ నమః

ఓం పద్మనాభాయ నమః

ఓం దామోధరాయ నమః

ఓం సంకర్షనాయ నమః

ఓం వాసుదేవాయ నమః

ఓం ప్రద్యుమ్నాయ నమః

ఓం అనిరుద్దాయ నమః

ఓం పురుషోత్తమాయ నమః

ఓం అదోక్షజాయ నమః

ఓం నరసింహాయ నమః

ఓం అచ్యుతాయ నమః

ఓం జనార్థనాయ నమః

ఓం ఉపేంద్రాయ నమః

ఓం హరయే నమః

ఓం శ్రీ కృష్ణాయ నమః


భూశుద్ది :- 

*******************************

ఈ మంత్రం చెప్తూ కొద్ది శుద్దజలమును కుడిచేతిలోనికి తీసుకొని మన చుట్టూ చల్లుకోవలయును. ఎందుకంటే మన గృహంలో నిన్నటి రోజున సింహాసనమునకు చేసిన అలంకారము మరియు భగవంతునికి సమర్పించిన ధూపదీప నైవేద్య ఫల పుష్పఫలాది నిర్మల్యాన్ని మనకంటే ముందు భూత పిశాచములు ఆ నిర్మాల్యాన్ని తీయడానికి ప్రయత్నిస్తాయి. 


అందుకొరకు మనము సూర్యోదయానికి పూర్వమే ఆ పని చేయాలి. అందుకొరకు ఈ మంత్రం.


“ఉత్తిష్ఠంతు భూతపిశాచాః యేతే భూమి భారకాః


ఏ తేషా మా విరోధేన బ్రహ్మ కర్మ 

సమారంభే ||”

ఈ మంత్రం చెప్పుకొన్న తర్వాత రెండు అక్షింతలు తీసుకొని వాసన చూచి వెనుకకు వేసుకోవలయును.


శ్లో || శుక్లాం భరధరం విష్ణుమ్ శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే ||

శ్లో|| అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేక దంతం భక్తానాం ఏక దంతం ఉపాస్మహే ||

అని చెప్పుకొని వినాయకుని కి కొద్ది అక్షింతలు, పసుపు, కుంకుమ, పూలు, సమర్పించాలి.

శ్లో || ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం

లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్.

శ్లో || సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే

శరణ్యేత్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే||


ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః

ఓం శ్రీ ఉమామహేశరాభ్యాం నమః

ఓం శ్రీ వాణీ హిరణ్యాగర్భాభ్యాం నమః

ఓం శ్రీ శచీ పురందరాభ్యాం నమః

ఓం శ్రీ అరుంధతీ వశిష్టాభ్యాం నమః

ఓం శ్రీ సీతారామాభ్యాం నమః

ఓం శ్రీ మైత్రేయీ కాత్యాయనీ సహిత యాజ్ఞ వల్కాభ్యాం నమః

ఓం శ్రీ సర్వదిగ్దేవతాభ్యాం నమః

ఓం శ్రీ సర్వభూదేవతాభ్యాం నమః

ఓం శ్రీ గ్రామదేవతాభ్యాం నమః

ఓం శ్రీ గృహదేవతాభ్యాం నమః

ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యాం నమః


ప్రాణాయామం:- తూర్పు వైపుకు తిరిగి గొంతుకు కూర్చొని ప్రాణాయామం చేయాలి.

పూరకం:- కుడి బొటన వ్రేలు ఉంగరపు వ్రేలుతో, ముక్కును పట్టుకొని, మధ్య వ్రేలినిలోనికి ముడువ వలెను. బొటన వ్రేలును కుడి ముక్కు పైన ఉంగరపు వ్రేలును ఎడమ ముక్కుపైన ఉంచి. ఎడమ ముక్కును మూసి కుడి ముక్కుతో, గాలి వదులుతూ, కుడి ముక్కును మూసి, ఎడమ ముక్కుతో, గాలిని పీల్చుతూ, చేయునది పూరకం.

“ ఓం భూః ,ఓం భువః, ఓం స్వః,ఓం మహః, ఓం జనః,ఓం తపః,ఓం సత్యం.”

కుంభకం:- రెండు ముక్కులు మూసి గాలిని లోపల బంధించడం.కుంభకం చేస్తూ

“ఓం తత్స వితుర్వరే ణ్యం భర్గోదేవస్య ధీ మహి! ధీయోయోనః ప్రచోదయాత్!

ఓ మాపో జ్యొతీ రపోమృతం బ్రహ్మ ”

రేచకం:- ఎడమముక్కును మూసి, కుడిముక్కుతో గాలిని పూర్తిగా వదలడం.

కుడిముక్కునుండి గాలిని వదులుతూ

“భూర్భువ స్సువరోమ్ ”

అని చెప్పిన తర్వాత కుడిచేతితో కుడిచివిని తాకవలెను.


ఎప్పుడు ప్రాణాయామము చేసినా ఇదేవిధముగా చేయాలి. సందర్భము ఏదైనా ఇందుకు భిన్నముగా ప్రాణాయామము చేయరాదు.

సంకల్పము:-

కరన్యాసము :- ఎడమ అరచేతిపై కుడి అరచేతిని అడ్డముగా బోర్లించిరెండు చేతులు కలిపి కుడి మోకాలుపై ఉంచి సంకల్పము చెప్పవలయును.


మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞ్యాయా ప్రవర్తమా నస్య ఆద్య బ్రాహ్మణ, ద్వితీయ, పరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వర, మన్వంతరే,కలియుగే, ప్రధమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరుహో, దక్షిణదిగ్భాగే, శ్రీ శైలస్య, ఈశాన్య ప్రదేశే, సమస్త బ్రాహ్మణ, హరి హర, గురు చరణ, సన్నిధౌ, అస్మిన్, వర్తమానస్య, వ్యావహారిక చాంద్రమనేనా, 


శ్రీ .........................(శుభకృత్) నామసంవత్సరే, ..................(ఉత్తరాయణే) ఆయనే, .............. (వర్ష) ఋతౌ, ................ (వైశాఖ) మాసే,...........(శుక్ల) పక్షే, ........... (చవితి) తిధౌ, ........ (శుక్ర) వాసరే, శుభ నక్షత్రే, (బ్రాకెట్లలో చూపిన సంవత్సర, ఆయన,ఋతు, మాస, పక్ష, తిధి, వారములు పేర్లు ఉదాహరణకు మాత్రమేనని గ్రహింప గలరు) శుభయోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ, విశిష్టాయామ్, శుభ తిధౌ శ్రీ పరమేశ్వర ముద్దిశ్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, ప్రాతః సంధ్యా, (ఎడమ చేతిలోని ఉద్దరిణితో జలము తీసుకొని కుడిచేతిని పాత్ర పైన ఉంచి ఉద్ధరిణిలోని జలమును కుడిచేతి మీదుగా పాత్రలోనికి వదలుతూ) ముపాశిష్యే, (అనిచెప్పుకోవాలి).


శుద్ధోదక స్నానం:-

ఉద్దరిణితో జలము తీసుకుని కుడి చేతి బొటన వ్రేలిని ఉద్దరణిలోని జలములో ముంచి తలపై చల్లుకొనుచూ ఈ క్రింది మంత్రమును అను సంధానము చేయవలయును. బ్రాకెట్లో (జ) అని ఉన్న చోటుకు ముందు ఆపి జలమును తలపై చల్లుకొనుచూ ఈ మంత్రమును అను సంధానము చేయవలయును.

ఓం “ ఆపోహిష్ఠమయో (జ) భువహ తాన ఊర్జే (జ)

తధా తన! మహేరాణా య చక్షసే (జ) యోవ శ్శివత యో రస్సః (జ)

తస్య భాజయతే హనః (జ) ఉశ తీరివ (జ) మాతరః (జ)

తస్మా ఆరంగ మామ వో (జ) యస్యక్షయాయ జిన్వథ! (జ)

అపో జనయథా చనః!” (జ)

ప్రాతఃస్సంధ్యా వందనములో 


అనుసంధానించవలసిన మంత్రము

గోకర్ణాకృతిలో ఉంచుకుని యున్న కుడి చేతిలో జలము తీసుకుని

“ సూర్యశ్చేత్యస్య మంత్రస్య నారాయణ ఋషిః, ప్రకృతీ బంధః

సూర్య మామన్యు పాతయ రాత్రిర్దేవతాః జలాభి మంత్రణే వినియోగః”

మంత్రము:-

“ ఓం సూర్యశ్చ మామ న్యుశ్చ మన్యు పతయశ్చ మన్యు కృతేభ్యః

పాపే భ్యో రక్షన్తాo యద్రా త్ర్యా పాపమ కారుషం

మనసా వాచా హస్తా భ్యాం పద్భ్యా ముదరెణ శిశ్నా

రాత్రి స్తద వలుంపతు యత్కించ దురితం మయి

ఇద మహం మామ మృత యోనౌ సూర్యేజ్యోతిషి జుహోమిస్వాహా !!”

అని సంధానించుకొని చేతిలోని జలమును త్రాగవలెను.

ప్రాతః సంధ్యావందనం సంపూర్ణం✍️


ధన్యవాదాలు చదివినవారికి.🙏

(తప్పులు వుంటే మన్నించ ప్రార్ధన)

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

Read More

*మణి ద్వీప వర్ణన

 *మణి ద్వీప వర్ణన*

       ➖➖➖


మహాశక్తి మణిద్వీప నివాసినీ

ముల్లోకాలకు మూలప్రకాశినీ |

మణిద్వీపములో మంత్రరూపిణీ

మన మనసులలో కొలువైయుంది || ౧ ||


సుగంధ పుష్పాలెన్నో వేలు

అనంత సుందర సువర్ణ పూలు |

అచంచలంబగు మనో సుఖాలు

మణిద్వీపానికి మహానిధులు || ౨ ||


లక్షల లక్షల లావణ్యాలు

అక్షర లక్షల వాక్సంపదలు |

లక్షల లక్షల లక్ష్మీపతులు

మణిద్వీపానికి మహానిధులు || ౩ ||


పారిజాతవన సౌగంధాలు

సూరాధినాధుల సత్సంగాలు |

గంధర్వాదుల గానస్వరాలు

మణిద్వీపానికి మహానిధులు || ౪ ||


భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||


పద్మరాగములు సువర్ణమణులు

పది ఆమడల పొడవున గలవు |

మధుర మధురమగు చందనసుధలు

మణిద్వీపానికి మహానిధులు || ౫ ||


అరువది నాలుగు కళామతల్లులు

వరాలనొసగే పదారు శక్తులు |

పరివారముతో పంచబ్రహ్మలు

మణిద్వీపానికి మహానిధులు || ౬ ||


అష్టసిద్ధులు నవనవనిధులు

అష్టదిక్కులు దిక్పాలకులు |

సృష్టికర్తలు సురలోకాలు

మణిద్వీపానికి మహానిధులు || ౭ ||


కోటిసూర్యుల ప్రచండ కాంతులు

కోటిచంద్రుల చల్లని వెలుగులు |

కోటితారకల వెలుగు జిలుగులు

మణిద్వీపానికి మహానిధులు || ౮ ||


భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||


కంచు గోడల ప్రాకారాలు

రాగి గోడల చతురస్రాలు |

ఏడామడల రత్నరాశులు

మణిద్వీపానికి మహానిధులు || ౯ ||


పంచామృతమయ సరోవరాలు

పంచలోహమయ ప్రాకారాలు |

ప్రపంచమేలే ప్రజాధిపతులు

మణిద్వీపానికి మహానిధులు || ౧౦ ||


ఇంద్రనీలమణి ఆభరణాలు

వజ్రపుకోటలు వైఢూర్యాలు |

పుష్యరాగమణి ప్రాకారాలు

మణిద్వీపానికి మహానిధులు || ౧౧ ||


సప్తకోటిఘన మంత్రవిద్యలు

సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు |

శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు

మణిద్వీపానికి మహానిధులు || ౧౨ ||


భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||


మిలమిలలాడే ముత్యపు రాశులు

తళతళలాడే చంద్రకాంతములు |

విద్యుల్లతలు మరకతమణులు

మణిద్వీపానికి మహానిధులు || ౧౩ ||


కుబేర ఇంద్ర వరుణ దేవులు

శుభాల నొసగే అగ్నివాయువులు |

భూమి గణపతి పరివారములు

మణిద్వీపానికి మహానిధులు || ౧౪ ||


భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు

పంచభూతములు పంచశక్తులు |

సప్తఋషులు నవగ్రహాలు

మణిద్వీపానికి మహానిధులు || ౧౫ ||


కస్తూరి మల్లిక కుందవనాలు

సూర్యకాంతి శిల మహాగ్రహాలు |

ఆరు ఋతువులు చతుర్వేదాలు

మణిద్వీపానికి మహానిధులు || ౧౬ ||


భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||


మంత్రిణి దండిని శక్తిసేనలు

కాళి కరాళీ సేనాపతులు |

ముప్పదిరెండు మహాశక్తులు

మణిద్వీపానికి మహానిధులు || ౧౭ ||


సువర్ణ రజిత సుందరగిరులు

అనంగదేవి పరిచారికలు |

గోమేధికమణి నిర్మితగుహలు

మణిద్వీపానికి మహానిధులు || ౧౮ ||


సప్తసముద్రములనంత నిధులు

యక్ష కిన్నెర కింపురుషాదులు |

నానాజగములు నదీనదములు

మణిద్వీపానికి మహానిధులు || ౧౯ ||


మానవ మాధవ దేవగణములు

కామధేనువు కల్పతరువులు |

సృష్టి స్థితి లయ కారణమూర్తులు

మణిద్వీపానికి మహానిధులు || ౨౦ ||


భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||


కోటి ప్రకృతుల సౌందర్యాలు

సకల వేదములు ఉపనిషత్తులు |

పదారురేకుల పద్మశక్తులు

మణిద్వీపానికి మహానిధులు || ౨౧ ||


దివ్యఫలములు దివ్యాస్త్రములు

దివ్యపురుషులు ధీరమాతలు |

దివ్యజగములు దివ్యశక్తులు

మణిద్వీపానికి మహానిధులు || ౨౨ ||


శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు

జ్ఞానముక్తి ఏకాంత భవనములు |

మణినిర్మితమగు మండపాలు

మణిద్వీపానికి మహానిధులు || ౨౩ ||


పంచభూతములు యాజమాన్యాలు

ప్రవాళసాలం అనేక శక్తులు |

సంతానవృక్ష సముదాయాలు

మణిద్వీపానికి మహానిధులు || ౨౪ ||


భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||


చింతామణులు నవరత్నాలు

నూరామడల వజ్రపురాశులు |

వసంతవనములు గరుడపచ్చలు

మణిద్వీపానికి మహానిధులు || ౨౫ ||


దుఃఖము తెలియని దేవీసేనలు

నటనాట్యాలు సంగీతాలు |

ధనకనకాలు పురుషార్ధాలు

మణిద్వీపానికి మహానిధులు || ౨౬ ||


పదునాలుగు లోకాలన్నిటి పైన

సర్వలోకమను లోకము కలదు |

సర్వలోకమే ఈ మణిద్వీపము

సర్వేశ్వరికది శాశ్వత స్థానం || ౨౭ ||


చింతామణుల మందిరమందు

పంచబ్రహ్మల మంచముపైన |

మహాదేవుడు భువనేశ్వరితో

నివసిస్తాడు మణిద్వీపములో || ౨౮ ||


భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||


మణిగణఖచిత ఆభరణాలు

చింతామణి పరమేశ్వరిదాల్చి |

సౌందర్యానికి సౌందర్యముగా

అగుపడుతుంది మణిద్వీపములో || ౨౯ ||


పరదేవతను నిత్యముకొలచి

మనసర్పించి అర్చించినచో |

అపారధనము సంపదలిచ్చి

మణిద్వీపేశ్వరి దీవిస్తుంది || ౩౦ ||


నూతన గృహములు కట్టినవారు

మణిద్వీపవర్ణన తొమ్మిదిసార్లు |

చదివిన చాలు అంతా శుభమే

అష్టసంపదల తులతూగేరు || ౩౧ ||


శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి

మణిద్వీప వర్ణన చదివిన చోట |

తిష్టవేసుకుని కూర్చొనునంట

కోటిశుభాలను సమకూర్చుటకై || ౩౨ ||

 

భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||


.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

Read More

*శ్రీ వేంకటేశ కరావలంబ స్తోత్రం* (Sri Venkatesa Karavalamba Stotram)

 ఎమ్మెస్ సుబ్బలక్ష్మి,రాధా విశ్వనాధన్*శ్రీ వేంకటేశ కరావలంబ స్తోత్రం* (Sri Venkatesa Karavalamba Stotram)


శ్రీ శేషశైల సునికేతన దివ్య మూర్తే

నారాయణాచ్యుతహరే నళినాయతాక్ష!

లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక

శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!

Read More

*కృష్ణుడు ఇచ్చిన వివరణ

 *రాధ హృదయం*

         ➖➖➖

      *కృష్ణుడు ఇచ్చిన వివరణ:* 


*ఒకసారి శ్రీకృష్ణుడు తన పరివారంతో సిద్ధాశ్రమ తీర్థంలో స్నానాలు ఆచరించడానికి వెళ్ళాడు.*


*కాకతాళీయంగా రాధ తన నేస్తాలతో అక్కడకు రావడం తటస్థించింది.*


*రెండు వైపుల వారు ఆకస్మికంగా ఆ పుణ్యతీర్ధంలో అలా కలుసుకున్నందుకు ఎంతో సంతోషించారు;      పరస్పరం ముచ్చట్లు చెప్పుకొని, సంభాషించి ఆనందించారు.*


*రాధ ఘనతను స్వయంగా కృష్ణుని ముఖతా ఆయన రాణులు విని ఉన్నారు. కాబట్టి వారు అదను చూసి రాధను ఒక ఏకాంత ప్రదేశంలో కలుసుకున్నారు.*


*రాధ కూడా ఆప్యాయంగా వారిని ఆహ్వానించి, ఉపచర్యలు చేసింది. మాటల సందర్భంలో ఆమె…, "సోదరీమణులారా! చంద్రుడు ఒక్కడే ఉన్నాడు; కాని చకోరాలు అనేకం" అనే అర్థం వచ్చే శ్లోకం చెప్పింది…*


*చంద్రో యథైకో బహవ చ్చకోరాః*

*సూర్యో యథైకో బహవోదృశస్యః |*


*శ్రీకృష్ణచంద్రో భగవాం స్తథైవ*

*భక్తా భగిణ్యో భహవో వయం చ ॥*


*"శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కరే; సోదరీమణులమైన మనం అందరమూ ఆయన భక్తురాండ్రం" అన్నది రాధ.*


*రాధ చెప్పింది విని రాణులు ఎంతో ఆశ్చర్యపోయారు.    రాధను మరీ బలవంతపెట్టి తమ విడిదికి ఆహ్వానించి, తోడ్కొని వెళ్ళారు.* 


*అక్కడ రాధకు రాజోపచారం లభించింది. ఆమె రాకకు రాణులు అందరూ ఎంతో సంతోషించారు. అందరూ కలసి ఆనందంగా మాట్లాడుకుంటూ.. విందు భోజనం ఆరగించారు.*


*చివరికి రుక్మిణీదేవి తానే స్వయంగా రాధకు ఒక స్వర్ణపాత్రలో పాలు ఇచ్చి, త్రాపించింది. ఆ తరువాత కాసేపు ముచ్చట్లు చెప్పుకొని రాధ తన బసకు తిరిగి వెళ్ళిపోయింది.*


*రాత్రి పొద్దుబోయింది. అందరూ నిద్రించడానికి వెళ్ళారు. దైనందిన ఆనవాయితీ ప్రకారం కృష్ణుని పాదాలు ఒత్తడానికి రుక్మిణి ఆయన పక్కన కూర్చుంది. కృష్ణుని అరికాళ్ళ వంక చూసేసరికి రుక్మిణి విస్తుపోయింది. అరికాళ్ళు మొత్తం బొబ్బలెక్కి ఉన్నాయి!*


*దిగ్భ్రాంతికి గురైన రుక్మిణి వెంటనే తక్కిన రాణులను పిలిచి విషయం తెలిపింది.*


*వారూ కృష్ణుని అరికాళ్ళు బొబ్బలతో నిండి ఉండటం చూసి అవాక్కయ్యారు. భగవానుని ఎలా అడగటం? ఎవరూ సాహసించలేకపోయారు.*


*చివరికి కృష్ణుడు కళ్ళు తెరిచి రాణులంతా అక్కడ గుమిగూడి ఉండటం చూసి కారణం ఏమిటని అడిగాడు.*


*అందుకు జవాబుగా వారు భగవానుని అరికాళ్ళు బొబ్బలెక్కి ఉండటం చూపించారు.*


*మొదట్లో కృష్ణుడు ఆ విషయాన్ని దాటవేయజూశాడు. కాని రాణులు వదల్లేదు. వారు మరీ బలవంతపెట్టడంతో ఆయన వారితో ఇలా చెప్పాడు: “రాధ హృదయంలో నా పాదపద్మాలు సదా సర్వవేళలా నెలకొని ఉంటాయి.*


*నువ్వు బాగా వేడిగా ఉన్న పాలు రాధకు ఇచ్చావు. స్వయంగా నువ్వు ఇవ్వడం వలన రాధ మారుమాట్లాడక అలాగే ఆపాలను తాగింది. పాలు లోపలకు, హృదయంలోకి వెళ్ళడంతో                  నా అరికాళ్ళు   ఆ వేడిని భరించలేక బొబ్బలెక్కాయి. ఇది సహజమే కదా!"*


*పతిదేవుని వచనాలు విన్న రాణులు నోట మాట రాక నిలబడిపోయారు.*


*నాటి నుండి కృష్ణుని పట్ల రాధకు ఉన్న హిమాలయమంత భక్తిప్రపత్తుల ముందు తమవి లెక్కలోకి రావని రాణులు గ్రహించారు.*


*రాధ ఔన్నత్యాన్ని తెలిపే ఈ సంఘటన ‘జాతకసంహిత’లో చోటుచేసుకుని ఉంది.*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

Read More

*పెళ్లిలో తంతు వెనుక అర్థం:

 *ఏడడుగుల బంధం…*


    *పెళ్లిలో తంతు వెనుక అర్థం:*

         ➖➖➖


*పెళ్లంటే... రెండు మనసుల కలయిక, నూరేళ్ల సాన్నిహిత్యం...    వైవాహిక జీవితంలో ప్రమాణాలు కట్టుబడి ఉంటే ఆ సంసారం స్వర్గం. ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకం. మానవజీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం. ఆ సందర్భంలో వధూవరులతో చేయించే ప్రతి కార్యక్రమానికి ప్రాధాన్యత ఉంది.*


*జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువకాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. ఆ బంధం పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు. వాటినే లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు.*


*ఆప్రమాణాలను త్రికరణశుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతుంది.*


*ఇక ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలను ఒకటిగా చేసేదే వివాహ బంధం.*


*హిందూ సంప్రదాయంలో జరిగే ప్రతి క్రతువుకూ ఓ ప్రత్యేకత ఉంది. కన్యాదానం పూర్తయిన తర్వాత ముహూర్తానికి జీలకర్ర-బెల్లం తలపై పెట్టించి, ఆ తర్వాత మాంగల్యధారణ చేయిస్తారు. ఇది పూర్తయిన తర్వాత వధూవరులకు కొంగుముడి కలిపి బ్రహ్మముడి వేస్తారు. వధువు చిటికెన వేలును పట్టుకుని వరుడు అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఏడు అడుగులు నడవడాన్ని ‘సప్తపది’ అంటారు. దీనికి విశేష ప్రాధాన్యత ఉంది. భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి, పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం.* 


*అందుకే పెద్దలు వివాహబంధాన్ని ఏడడుగుల బంధం అంటారు. ఇందులో వేసే ప్రతీ అడుగుకీ ఒక్కో అర్థం ఉంది.***మొదటి అడుగు:*

*‘ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు’                            ఆ విష్ణువు మనిద్దరినీ ఒక్కటిగా చేయుగాక!*


**రెండో అడుగు:*

*‘ద్వే వూర్జే విష్ణుః త్వా అన్వేతు’*

*ఇద్దరికీ శక్తి లభించేలా చేయుగాక!*


**మూడో అడుగు:* 

*‘త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు’*

*వివాహ వ్రతసిద్ధి కోసం విష్ణువు అనుగ్రహం లభించుగాక!*


**నాలుగో అడుగు:* 

*‘చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు’*

*మనకు ఆనందాన్ని విష్ణువు కల్గించుగాక!*


**అయిదో అడుగు:* 

*‘పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు’* 

*మనకు పశుసంపదను విష్ణువు కల్గించుగాక!*


**ఆరో అడుగు:* 

*‘షడృతుభ్యో విష్ణుః త్వా అన్వేతు’*

*ఆరు రుతువులు మనకు సుఖమిచ్చుగాక!*


**ఏడో అడుగు:*

*‘సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు’*

*గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణువు అనుగ్రహించుగాక!**‘ఓ అర్ధాంగీ ఏడడుగులతో నువ్వు నా ప్రాణసఖివి అయ్యావు. ఎల్లప్పుడూ నువ్వు నా స్నేహాన్ని వీడవద్దు. ప్రేమగా ఉందాం. మంచి మనసుతో జీవిద్దాం. మన ఇద్దరం సమానమైన ఆలోచనలతో మెలగుదాం’ అంటాడు వరుడు.*


*అప్పుడు వధువు ‘ఓ ప్రాణ సఖుడా! నువ్వెప్పుడూ పొరపాటు చేయకుండా ఉండు. నేనూ ఏ పొరపాటు చేయక          నీవెంటే ఉంటాను. నువ్వు ఆకాశమైతే నేను భూమి... నువ్వు శుక్రమైతే నేను శోణితాన్ని... నువ్వు మనసైతే నేను మాట... నేను సామవేదమైతే నువ్వు నన్ను అనుసరించే ఋత్వికుడివి... మనిద్దరిలో వ్యత్యాసం లేదు. కష్ట సుఖాలలో ఒకరికొకరం తోడూ నీడగా కలిసి ఉందాం’ అంటుంది.*


*‘ఓ గుణవతీ! మన వంశాభివృద్ధికి, మనకు ఉత్తమస్థితి కలగడానికి, మంచి బలం, ధైర్యం, ప్రజ్ఞావంతులై వంశ హితాన్ని రక్షించగల, న్యాయమార్గం అనుసరించే ఉత్తమ సంతానాన్ని ప్రసాదించు’ అని పురుషుడు చెబుతాడు.*


*భార్య చిటికిన వేలును భర్త చిటికిన వేలుతో పట్టుకోమని ‘బ్రహ్మ ముడి’ వేస్తారు. భార్యభర్తలు ఇద్థరు ఒకరిని ఒకరు విడిచి ఉండకూడదు. ప్రయాణమైనా, పుణ్యక్షేత్రమైనా, మోక్షమైనా, అరణ్యవాసమైనా భార్యా భర్తలు కలిసే ఉండాలి. భార్యాభర్తలుగా మారటం అంటే ఇద్థరి శరీరాలు ఒకే ప్రాణంగా మనుగడ సాగించటం. భార్యాభర్తల మధ్య ఎన్ని మనస్పర్ధలు ఉన్నా వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ముడి, అంటే వీళ్ళ ఇద్థరి మధ్య ఇంకొకరు దూరటానికి వీలు లేకుండా ఉండాలని, అలా ఉండిపోవాలని గోరంత అవకాశం దొరికినా ఆ అదును చూసుకొని మూడో వ్యక్తి చొరబడతాడని- ఎటువంటి పరిస్థితులలో ఐనా భర్తతోనే జీవితం అనుకోవాలని  వథువుకి,     భార్యే సర్వస్వంగా అనుకోవాలని వరుడీకి చెప్పి బ్రహ్మ ముడి వేస్తారు -" అంటే ఇరువురి శరీరాలను ఒకే ప్రాణంగా మార్చటం అన్నమాట!*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

Read More

*దేవాలయానికి వెళ్ళినపుడు ఘంట* *మూడు సార్లే ఎందుకు కొట్టాలి. తెలుసా ?*

 *దేవాలయానికి వెళ్ళినపుడు ఘంట* *మూడు సార్లే  ఎందుకు కొట్టాలి. తెలుసా ?*


 *శ్లోకము :*

 

*ఏకతాడే మరణం చైవ*

*ద్వితాడే వ్యాధి పీడనం* !

*త్రితాడే సుఖమాప్నోతి  తత్ఘంటానాదలక్షణం* ! ! 


భావం : దేవుని ముందర *ఘంట ఒకసారి మాత్రమే కొట్టి ఊరుకుంటే అది మన మరణానికి* సంకేతం .


*రెండుసార్లు కొట్టి ఊరుకుంటే వ్యాధుల ద్వారా పీడింపబడతాము* . '


*మూడుసార్లు ఘంటానాదం చేయడం చేత శరీరమునకు , మనస్సుకు సుఖము కలుగుతుంది*. 


ఈ పద్దతిని  *దేవాలయ ఘంటా నాద లక్షణము* గా శాస్త్రం చెప్పబడింది .


( దేవాలయంలో ఘంటానాదం ద్వారా జనించే ఓంకార ధ్వని తరంగాలను మన చెవుల ద్వారా శరీరంలోకి శబ్ద తరంగాలకు అనుసంధానం చేయండి తద్వారా మానసిక ప్రశాంతతను పొందండి ).

Read More

🕉️శ్రీ ఆంజనేయస్వామి నవరత్న మాలా స్తోత్రం🍌

 🕉️శ్రీ ఆంజనేయస్వామి నవరత్న మాలా స్తోత్రం🍌


🌹తతో రావణ నీతాయాః సీతాయా శత్రు కర్శన:|

ఇయేష పడమన్వేష్టుం చారణాచరితే పథి|| (మాణిక్యం )


యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యధా తవ|

స్మృతిర్మ తిర్ ధృతి ర్దాక్ష్యం స కర్మసు నా సీదతి|| (ముత్యం )


అనిర్వేదః శ్రియ మూలం అనిర్వేదః పరం సుఖం |

అనిర్వేదో హాయ్ సతతం సర్వార్థేషు ప్రవర్తకః|| (ప్రవాళం )


నమోస్తు రామయ స లక్ష్మణా య దేవ్యై చ తస్మై జనకాత్మజాయై |

నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః || (మరకతం )


ప్రియన్న సంభవేద్దు:ఖం అప్రియాదధికం భయం|

తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం|| (పుష్య రాగము )


రామః కమలపత్రాక్షః సర్వసత్త్వమనోహరః |

రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే || (హీరకము )


జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః |

దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్ట కర్మణః || (ఇంద్ర నీలము )


యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః |

యది వాస్త్యేకపత్నీత్వం శీతో భావ హనూమతః|| (గో మేదికము )


నివ్రుత్తవనవాసం తం త్వయా సార్థమరిందమం |

అభిషిక్తమ యోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం ||(వైడూర్యం )


*శుభ శుభోదయం*


🍌🙏🐒🙏🐒🙏🐒🙏🍌

Read More

ఆదిత్యులు (ద్వాదశాదిత్యులు,. రుద్రులు (ఏకాదశ రుద్రులు. వసువులు(అష్టవసువులు)

 శుభోదయం..


        💐 33 కోట్ల దేవతలు ఎవరు..? 💐

          

హిందువులను విరోధించువారు… మీ 33 కోటి దేవతల పేర్లు ఏమని ప్రశ్న అడిగి వెక్కిరిస్తారు. హిందువులు కూడ ఈ ప్రశ్న విని విచలితులవుతారు.


అసలు ఈ  కోటి అను పదముయొక్క అర్థమును సంపూర్ణముగా మరుగునపరచి మెకాలే, ముల్లర్ వంటివారు తమకు కావలసిన ఒక మత ధర్మమునకు అనుకూలమగునటుల చరిత్ర ను తీర్చి తిద్ది తెలివిమంతులు అనిపించుకొన్నారు.


వేదపురాణములు తెలుపునట్టి త్రయ త్రింశతి కోటి (33కోటి) దేవతలు మరియు వారి పేర్లు మరియు హిందూ ధార్మిక సాహిత్య మందు ఉల్లేఖించబడిన 33 కోటి దేవతలు ఎవరు వారి పేర్లు ఏమి అని తెలుసా..?


హిందూ ధర్మ - సంస్క్రతియందు 33 కోటి దేవతల ఉల్లేఖన ఉంది.  మిక్కిలి జనులు ఇక్కడ 'కోటి' అంటే సంఖ్య అనుకొన్నారు. మరియు 33 కోట్ల పేర్లను చెప్పమని  బలవంతం చేస్తారు.  వాస్తవముగా ఈ 'కోటి' సంఖ్యను సూచించే  ' కోటి '  కాదు.


సంస్క్రతములో 'కోటి' అనగా 'విధము'  'వర్గము' (type)  అని అర్థము ఉంది.


ఉదా: ఉచ్ఛకోటి. దీని అర్థం ఉచ్ఛమైన వర్గమునకు చేరిన వారు అని అర్థం.


అలాగే మరియు ఉదాహరణము: సప్త కోటి బుద్ధులు. దీని అర్థం ఏడు ప్రధాన బుద్ధులు.


యజుర్వేద, అథర్వణ వేద, శతపథ బ్రాహ్మణులు మొదలైన ప్రాచీన కృతులందు 33 విధముల దేవతలను ఉల్లేఖించారు. వీరే త్రయత్రింశతి  కోటి (33కోటి)  దేవతలు.


హిందూ గ్రంధములేకాదు  బౌద్ధ, పార్శీ మొదలైనవి కూడ 33 దేవవర్గముల గురించి తెలుపుతాయి.  బౌద్ధుల దివ్యవాదము మరియు సువర్ణప్రభాస సూత్రములందు వీటి ఉల్లేఖన ఉన్నది.


 ఇపుడు దేవతల ఈ 33వర్గములనూ, అందులో  వచ్చు దేవతల పేర్లనూ చూద్దాము:


12 ఆదిత్యులు (ద్వాదశాదిత్యులు) :

 1. త్వష్ట, 2. పూష. 3.వివస్వాన్  4. మిత్ర  5. ధాతా  6. విష్ణు  7. భగ. 8. వరుణ  9. సవితృ  10. శక్ర   11.అంశ  12. ఆర్యమ.


11 రుద్రులు (ఏకాదశ రుద్రులు):

1.మన్యు  2. మను  3. మహినస  4. మహాన్ 5. శివ  6. ఋతధ్వజ 7. ఉగ్రరేతా  8. భవ  9  కాల 10. వామదేవ 11. ధృతవృత.  


8 వసువులు(అష్టవసువులు):

1. ధరా 2. పావక  3  అనిల  4. అప 5. ప్రత్యుష  6. ప్రభాస  7. సోమ  8  ధ్రువ. 


మరి ఇద్ధరు: 1. ఇంద్ర  2. ప్రజాపతి. 


త్రయత్రింశతి (33) కోటి దేవతలు ఎవరని తెలిసినది కదా!  ఈ పేర్లను  కంఠపాఠము చేయునది చాలా సులభము.  ఎవరైననూ ఇపుడు  33కోటి దేవతల పేర్లను చెప్పమంటే  వెనుక ముందు చూడవలసిన అవసరమే లేదు! కదా?

Read More

3, డిసెంబర్ 2022, శనివారం

జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు నిత్యం గంగాస్తోత్రం

జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు నిత్యం గంగాస్తోత్రం చదవాలని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఇది పఠనీయమైన గంగాస్తుతి. దీనికి 'దశపాపహర గంగాస్తుతి' అని పేరు. దీనిని జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు పారాయణ చేయాలి. దశమినాడు పది మారులు చదవడం మంచిది.

*త్రికరణములతో చేసిన పదిరకముల పాపములను నశింపజేసే 'శ్రీ గంగా దశహరా స్తోత్రమ్'*
1. అపాత్రులకు దానం చేయుట, హింసించుట, పరస్త్రీయందు కామనాబుద్ధి అనబడే శారీరక పాపములు, 2. కఠినంగా మాట్లాడుట, అసత్యము, చాడీలు చెప్పుట, అనవసరపు మాటలాడుట, అనే వాక్కుకి సంబంధించిన పాపములు, 3. పరుల ధనాదుల యందు ఆసక్తి, ఇతరులకు కీడు తలపెట్టుట, పాపకార్యములయందు ఆసక్తి కలిగియుండుట, అనబడే మానసిక పాపములు, పశ్చాత్తాపముతో ఈ స్తోత్రమును చదివిన వానియొక్క ఈ పదిరకముల పాపములను (ఏ జన్మలో చేసినవైనప్పటికీ) ఈ స్తోత్ర పఠనము నశింపజేయును.
బ్రహ్మోవాచ-
ఓం నమః శివాయై గంగాయై శివదాయై నమో నమః!
నమస్తే రుద్రరూపిణ్యై శాంకర్యై తే నమోనమః!
నమస్తే విశ్వరూపిణ్యై బ్రహ్మమూర్త్యై నమోనమః!!
సర్వదేవస్వరూపిణ్యై నమో భేషజమూర్తయే!!
సర్వస్య సర్వవ్యాధీనాం భిషక్ శ్రేష్ఠ్యై నమోస్తుతే!
స్థాణుజంగమ సంభూత విషహంత్ర్యై  నమోనమః!!
భోగోపభోగ్యదాయినై భగవత్త్యై నమోనమః!!
మందాకిన్యై నమస్తేస్తు స్వర్గదాయై నమో నమః!
నమస్త్రైలోక్యభూషాయై జగద్ధాత్ర్యై నమో నమః!!
నమస్త్రిశుక్ల సంస్థాయై తేజోవత్యై నమో నమః!
నందాయై లింగధారిణ్యై నారాయణ్యై నమో నమః!
నమస్తే విశ్వముఖ్యాయై రేవత్యై తే నమో నమః!!
బృహత్యైతే నమస్తేస్తు లోకధాత్ర్యై నమోనమః!
నమస్తే విశ్వమిత్రాయై నందిన్యై తే నమో నమః!!
పృథ్వ్యై శివామృతాయైచ సువృషాయై నమో నమః!
శాంతాయైచ వరిష్ఠాయై వరదాయై నమో నమః!!
ఉగ్రాయై సుఖదోగ్ద్యైచ సంజీవిన్యై నమోనమః!
బ్రహ్మిష్ఠాయై బ్రహ్మదాయై దురితఘ్న్యై నమోనమః!!
ప్రణతార్తి ప్రభంజిన్యై జగన్మాత్రే నమోస్తుతే!
సర్వాపత్ప్రతిపక్షాయై మంగళాయై నమో నమః!!
శరణాగతదీనార్త పరిత్రాణ పరాయణే!
సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే!!
నిర్లేపాయై దుర్గహంత్ర్యై దక్షాయై తే నమో నమః!
పరాత్పరపరతరే తుభ్యం నమస్తే మోక్షదే సదా!
గంగే మమాగ్రతో భూయాత్ గంగే మే దేవి పృష్ఠతః!
గంగే మే పార్శ్వయోరేహి త్వయి గంగేస్తుమే స్థితిః!!
ఆదౌ త్వమంతే మధ్యే చ సర్వం త్వం గాంగ తే శివే!
త్వమేవ మూలప్రకృతిస్త్వం హి నారాయణః పరః!!
గంగేత్వం పరమాత్మా చ శివస్తుభ్యం నమః శివే!
య ఇదం పఠతి స్తోత్రం భక్త్యా నిత్యం నరోపి యః!!
శృణుయాత్ శ్రధ్ధయా యుక్తః కాయవాక్చిత్తసంభవై:!
దశధా సంస్థితైర్దోషై: సర్వైరేవ ప్రముచ్యతే!!
సర్వాన్ కామానవాప్నోతి ప్రేత్య బ్రహ్మణి లీయతే!
జ్యేష్టేమాసి సితే పక్షే దశమీ హస్త సంయుతా!!
తస్యాం దశమ్యామేతచ్చ స్తోత్రం గంగాజలే స్థితః!
యః పఠేత్ దశకృత్వస్తు దరిద్రో వాపి చాక్షమః!!
సోపి తత్ ఫలమవాప్నోతి గంగాం సంపూజ్య యత్నతః!
అదత్తానాముపాదానం హింసా చైవావిధానతః!!
పరదారోపసేవా చ కాయికం త్రివిధం స్మృతమ్!
పారుష్యమనృతం చైవ పైశున్యం చాపి సర్వశ:!!
అసంబద్ధ ప్రలాపశ్చ వాఙ్మయం స్యాచ్చతుర్విధమ్! 
పరద్రవ్యేష్వభిధ్యానం మనసానిష్టచిన్తనమ్!!
వితథాభినివేశశ్చ మానసం త్రివిధం స్మృతమ్!
ఏతాని దశపాపాని హర త్వం మమ జాహ్నవి!!
ధశపాపహరా యస్మాత్తస్మాద్దశహరా స్మృతా!
త్రయస్త్రింశచ్ఛతం పూర్వాన్ పితౄనథ పితామహాన్!!
ఉద్ధరత్యేవ సంసారాన్మంత్రేణానేన పూజితా!
నమోభగవత్యై దశపాపహరాయై గఙ్గాయై నారాయణ్యై రేవత్యై శివాయై దక్షాయై అమృతాయై విశ్వరూపిణ్యై నన్దిన్యై తే నమోనమః!!
Read More

18, ఆగస్టు 2019, ఆదివారం

భాగవతము... ప్రథమ స్కంధము...

భాగవతము...

ప్రథమ స్కంధము...

కథాప్రారంభము...

1-36-సీ.              సీస పద్యము

శ్రీమంతమై మునిశ్రేష్ఠకృతంబైన; 
భాగవతంబు సద్భక్తితోడ
వినఁ గోరువారల విమలచిత్తంబులఁ; 
జెచ్చెర నీశుండు చిక్కుఁ గాక
యితరశాస్త్రంబుల నీశుండు చిక్కునే; 
మంచివారలకు నిర్మత్సరులకుఁ
గపట నిర్ముక్తులై కాంక్ష సేయకయును; 
దగిలి యుండుట మహాతత్త్వబుద్ధిఁ

1-36.1-తే.

బరఁగ నాధ్యాత్మికాది తాపత్రయంబు
నడఁచి పరమార్థభూతమై యధిక సుఖద
మై సమస్తంబుఁ గాకయు నయ్యు నుండు
వస్తు వెఱుఁగంగఁ దగు భాగవతమునందు.

ప్రతిపదార్ధము :

శ్రీమంతము = శుభంకరము; ఐ = అయిన ; ముని = మునులలో; శ్రేష్ఠ = శ్రేష్ఠునిచే - వ్యాసునిచేత; కృతంబు = రచింపబడినది; ఐన = అయినట్టి; భాగవతంబు = భాగవతము; సద్భక్తి = మంచిభక్తి; తోడన్ = తో; వినన్ = వినుటను; కోరువారల = కోరేవారి; విమల = నిర్మలమైన; చిత్తంబులన్ = మనస్సులలో; చెచ్చెరన్ = తొందరగా; ఈశుండు = జీవులలోనున్న ఈశ్వరుడు; చిక్కున్ = దొరకును; కాక = అంతేకాని; ఇతర = ఇతర; శాస్త్రంబులన్ = శాస్త్రములకు; ఈశుండు = ఈశ్వరుడు; చిక్కునే = దొరుకుతాడా; మంచివారల = మంచి వాళ్ళ; కున్ = కును; నిర్మత్సరులు = మాత్త్సర్యం లేని వాళ్ళ; కున్ = కును; కపట = మాయ నుంచి; నిర్ముక్తులై = విడిపింప బడ్డవారై; ఐ = అయ్యి; కాంక్ష = కోరుట; సేయకయును = చేయకుండక; తగిలి = తగిలి (భక్తికి); ఉండుటన్ = ఉండటమును; మహాతత్త్వ = మహత్త్వమైన అంతర్యామి యందు; బుద్ధిన్ = ధ్యాస; పరఁగ = ప్రవర్తిల్లగ; ఆధ్యాత్మిక = ఆధ్యాత్మికము; ఆది = మొదలైన; తాపత్రయంబున్ = మూడు రకాలైన తాపములను {తాపత్రయంబు - (ఆధ్యాత్మిక, ఆధిభౌతిక , ఆధిదైవిక)}; అడఁచి = అణచి; 

పరమార్థ = మోక్షము యొక్క; భూతము = రూపము; ఐ = అయ్యి; అధిక = మిక్కిలి; సుఖదము = సుఖప్రదము; ఐ = అయ్యి; సమస్తంబున్ = సర్వమును; కాకయు = కాకుండాను; అయ్యున్ = అయ్యికూడా; ఉండు = ఉండే టటువంటి; వస్తువు = వస్తువు; ఎఱుఁగంగన్ = తెలిసికొనుటకు; తగు = వీలున్నది; భాగవతమున్ = భాగవతము; అందున్ = లో.

భావం :

శ్రీమంతమైనది, వేదవ్యాస మహామునిచే విరచితము ఐన ఈ భాగవత మహాపురాణాన్ని అచంచల భక్తితో ఆకర్ణించగోరే భక్తుల అంతరంగాలలోనే భగవంతుడు నిరంతరం నివసిస్తాడు. అంతే గాని ఇతర గ్రంథాల వల్ల ఈశ్వరుడు చిక్కడు. సజ్జనులు మాత్సర్యరహితులు మహాతత్వబుద్ధి కలిగి కపటమార్గాన పోకుండ, ఎటువంటి కాంక్షా లేకుండ, భాగవత శ్రవణమందే ఆసక్తులై ఉంటారు. ఇందువల్ల తాపత్రయం అంటే ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదైవికము అనే త్రివిధ తాపాలూ నశించి వారికి తత్త్వజిజ్ఞాస కలుగుతుంది. ఈ భాగవతంలో పరమార్థభూతము, పరమానంద దాయకము, వ్యక్తావ్యక్తము అయిన పరబ్రహ్మ స్వరూపం అభివ్యక్త మవుతుంది.

|| ఓం నమః శివాయ ||
Read More

శ్రీమద్భాగవతం - 43

శ్రీమద్భాగవతం - 43

షష్ఠ స్కంధము – అజామిళోపాఖ్యానం:

ఒకానొక సమయంలో కన్యాకుబ్జము అనబడే ఒక నగరం వుండేది. ఆ నగరంలో ఒక శ్రోత్రియుడయిన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన త్రికాల సంధ్యావందనమును ఆచరించి వేదవేదాంగములను తాను పఠించి పదిమందికి వేదమును వివరణ చేస్తూ పదిమందికి పురాణ ప్రవచనం చేస్తూ దొరికిన దానితో అత్యంత సంతోషంతో జీవితమును గడపగలిగిన సమర్థుడు అయినవాడు. యాదృచ్ఛికముగా ఆయనకు ఐశ్వర్యము సమకూరింది. ఆయన మనస్సు మాత్రం సర్వకాలముల యందు భగవంతుని యందు రామించే స్థితిని కలిగి వున్నవాడు. అటువంటి మహాపురుషుడికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు అజామీళుడు. బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు తదనంతరం ఆయనకు ఒక ఉత్తమమయిన సౌందర్యవతియైన కన్యను తెచ్చి వివాహం చేశారు. ఆయన శీలం ఎటువంటిది? పుట్టినపుడు గతంలో చేసిన సత్కర్మల వలన బ్రాహ్మణ కులమున జన్మించాడు. సత్కర్మ అంటే చేసిన పని. అజామీళుడు యజ్ఞోపవీతం వుంది సంధ్యావందనం చేసిగాయత్రీమంత్రం జపించేవాడు. ఈవిధంగా అతడు జ్ఞానమును పొందినవాడు. శాంత లక్షణమును కలిగి ఉన్నాడు. బ్రాహ్మణునకు మొట్టమొదటి లక్షణము శాంతము.

దాంతుడై ఉన్నాడు. దాంతుడు మనసును గెలవడం. మనస్సు ఇంద్రియముల మీద ఆధారపడి ఉంటుంది. ఆయన మనసును ఇంద్రియములను గెలిచాడు. ఇక్కడే మీరొక విషయమును గుర్తుపెట్టుకోవాలి. ఒకరాజు ఒక రాజ్యమును గెలిచాడనుకోండి. ఆయన మరణించే వరకు ఆ రాజ్యం ఆయనదై ఉంటుందనే నమ్మకమేమీ ఉండదు. ఈయనకన్నా బలవంతుడయిన రాజు వచ్చి ఈయనను చంపి ఆ రాజ్యం ఆయన కొల్ల గొట్టవచ్చు. అలాగే ఇంద్రియములను గెలిచినా వాడు మరొక పదినిమిషములు గడిచిన తరువాత పతనమై క్రిందపడి పోవచ్చు. ఆయన మోక్షమును పొందితే ఆయన ఇంద్రియములను మనసును గెలిచినట్లు లెక్క. అవి ఏ క్షణంలో అయినా కాటు వేయడానికి నిరంతరమూ కాచుకుని ఉంటాయి. మంచి యౌవనమును పొందడానికి ముందు భార్యను చేపట్టక ముందు శాంతుడై, దాంతుడై ధర్మసంశీలుడై ఉన్నాడు.

శీలము అంటే స్వభావము. అజామీళుడు నిరంతరమూ తాను చేయవలసిన కర్తవ్యమును గూర్చి తాను ఆలోచించ గలిగినవాడు. తన ధర్మమును తాను నెరవేర్చిన వాడు. అంతమాత్రం చేత జ్ఞాని అయ్యాడని అనడానికి లేదు. తాను చదువుకున్నది అనుష్ఠాన పర్యంతము తీసుకువచ్చాడు. ఎన్నోమంత్రముల సిద్ధిని పొందాడు. అతని శరీరము మంత్రపూతమయింది. అంతగా దేవతానుగ్రహమును పొందాడు.

అజామీళుడు సత్యభాషణా నియమమును పెట్టుకున్నాడు. ధర్మమును వదలలేదు. నిత్య నైమిత్తిక కర్మలను వదిలి పెట్టలేదు. ఈవిధంగా అజామీళుడు రాశీభూతమయిన బ్రాహ్మణ తేజస్సు.

భగవంతుని గొప్పతనం గురించి ఎంత స్తోత్రం చేస్తారో అజామీళుడి యౌవనం గురించి పోతన గారు అన్ని పద్యములు వ్రాశారు. కొంచెం యుక్తాయుక్త విచక్షణతో దేనిని అసలు పెట్టుకోవాలి. దేనిని వదిలిపెట్టాలి అని తెలుసుకో గలిగినది, పట్టుకోవాలని తెలిసినా పట్టుకోవడానికి ఓపిక ఉన్నది యౌవనము మాత్రమే. ఈ యౌవనమును ప్రధానముగా రెండు భ్రంశము చేస్తాయి. ఒకటి అర్థార్జన. అర్థ సంపాదనకు అనువుగా అధికారులను పొగడుట యందు నిమగ్నమయిన వాడు, బెల్లపు పరమాన్నమయినా అదే రుచి, పంచదార పరమాన్నమయినా అదే రుచి – ఒకే పాయస పాత్రను తీసుకువచ్చి ఎన్ని గ్లాసులలోకి సర్దుకు తిన్నా ఒకే రుచి ఉంటుందని ఎరుగక కామినీ పిశాచము పట్టుకుని తన ధర్మపత్ని జంట వుండగా ఇతర స్త్రీలయందు వెంపర్లాట పెట్టుకున్న దౌర్భాగ్యుడు అలాగే నశించి పోతున్నాడు. ఈ రెండింటి చేత యౌవనము నశించిపోతున్నది. అలా నశించి పోవడం అత్యంత ప్రమాదకరము.

ఇప్పుడు అజామీళుడికి యౌవనం అంకురించింది. మానవుడు అయిదు ఇంద్రియములతో భోగములను అనుభవించవచ్చు. ఈశ్వరుడిని చేరుకోవచ్చు. కన్ను తప్పుగా భ్రమను కల్పిస్తే దీపపు పురుగు నశించి పోతుంది. దీపపు పురుగు దీపమును చూసి తినే వస్తువు అనుకుని దీపం మీదకి వెళుతుంది. రెక్కలు కాలి క్రింద పడిపోయి మరణిస్తుంది. దాని దృష్టికి దీపము ఆకర్షించేదానిలా ప్రవర్తిస్తుంది. మా ఇంటి దీపమే కదా అని ముసలాయన దీపమును ముద్దెట్టుకుంటే మూతి కాలిపోయినట్లు యౌవనంలో ఉన్న పిల్లవాడిని పొగిడి పాడు చేయకూడదు. కన్ను బాగా పనిచేస్తే దీపపు పురుగు నశించి పోయింది.

పాట అంటే చెవికి ప్రీతి. లేడికి ఒక పెద్ద దురలవాటు ఉంటుంది. వేటకాడు రెండు మూడు రోజులు వల పన్నుతాడు. ఒకవేళ జింక అటుగా రాకపోతే తానొక చెట్టు మీద కూర్చుని పాట పాడతాడు. ఎక్కడో గడ్డి తింటున్న లేడి ఆపాట విని దానికోసం పరుగెత్తుకుంటూ వచ్చి వేటగాని వలలో పడిపోతుంది. వెంటనే వేటగాడు దానిని చంపేస్తాడు. అందుకని చెవి వలన లేడి మరణిస్తోంది.

చర్మమునకు కండూతి’ అనగా దురద ఉంటుంది. ఈ దురద ఏనుగుకి ఉంటుంది ఈ కండూతి దోషం. అందుకని ఏనుగులను పట్టుకునే వారు గొయ్యి తీసి పైన గడ్డి పరిచి అది ఒళ్ళు గోక్కోవడానికి వీలయిన పరికరములు అక్కడ పెడతాడు. ఏనుగు అక్కడకు వచ్చి ఒళ్ళు గోక్కుందామని ఆ కర్రలకు తగులుతుంది. ఆ ఊగుకి పుచ్చు కర్రలు విరిగిపోయి గోతిలో పడుతుంది. అలా ఏనుగు దొరికిపోతుంది. ఈవిధంగా స్పర్శేంద్రియ లౌల్యం చేత ఏనుగు నశించి పోతున్నది.

నాల్గవది రసనేంద్రియము – నాలుక. దీనివలన పాడయిపోయేది చేప. ఈశ్వరుడు చేపలకు మొప్పలతో ప్రాణ వాయువును తీసుకుని బ్రతకగల శక్తిని ఇచ్చాడు. కానీ దానికి రుచులు అంటే ఎంత ఇష్టమో. ఎరను తిందామని ఉచ్చులో చిక్కుకుని ప్రాణం పోగొట్టుకుంటుంది. ఏది తిందామని వచ్చిందో అది ఇంకొకరికి ఆహారమై తినబడుతోంది. ఈవిధంగా రసనేంద్రియం చేత చేప నశించి పోతోంది.

ఇక వాసన. పద్మమునందు సుగంధము ఉంటుంది. ఆ సుగంధమును అనుభవించడం కోసం ఎక్కడినుంచో వస్తుంది సీతాకోక చిలుక. అది పువ్వులలో మకరందమును పీల్చి మకరందం అయిపోయినా సరే కాసేపు అక్కడే పడుకుంటుంది. దానికి ఆ వాసన మరిగి మత్తెక్కుతుంది. ఒక్కొక్క సారి చీకటి పడి పువ్వు ముకుళించుకు పోతుంది. అది పువ్వులో చిక్కుకు పోతుంది. ఆ సమయమునకు నీళ్ళు త్రాగుదామని ఏనుగులు వస్తాయి. అవి నీళ్ళు త్రాగి వెళ్ళిపోతూ ఈ పద్మములను తొండముతో పీకివేసి నేలమీద పారవేసి తొక్కేసి వెళ్ళిపోతాయి. పద్మమునందు సుగంధమును ఆఘ్రాణిస్తూ వున్న సీతాకోకచిలుక ఏనుగు పాదము క్రింద పడి మరణిస్తుంది. వాసన మరిగి సీతాకోక చిలుక నశించింది.

ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క లౌల్యమునకు నశించి పోతోంది. ఈ ఇంద్రియములలో ఏ ఇంద్రియమయినా మిమ్మల్ని కరచి వేయవచ్చు. ఇంద్రియములను త్రిప్పడానికి జ్ఞానమును ఉపయోగించాలి. అలా ఎవరు ఉపయోగించడో వాడు నశించిపోతాడు. ఇప్పుడు అజామీళుడు నిలబెట్టుకోగలడా? ఇది పరీక్ష. భాగవతమును అందరూ వినవచ్చు. కానీ యౌవనంలో ఉన్నవాడు విన్నట్లయితే జీవితమును సార్థకత చేసుకోగలడు. ఆయనను తండ్రిగారు ఒకరోజు పిలిచి రేపటి పూజకు దళములు, దర్భలు పువ్వులు తీసుకు రావలసినది అని చెప్పారు. తండ్రి మాట ప్రకారం అడవికి వెళ్ళి పువ్వులు, సమిధలు కోసి సంతోషంగా ఇంటివైపుకి వచ్చేస్తున్నాడు. అంతలో అతనికి ఒక పొదలో ఏదో ధ్వని వినపడింది. దానిని ముందు చెవి గ్రహించింది. అది వినవలసిన ధ్వని కాదు అని ఆయన వెళ్ళిపోయి ఉంటే వేరు. ఈ ధ్వని ఎటు వినపడిందో అటు కన్ను తిరిగింది. పొదవైపు చూశాడు. కల్లుకుండలు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని చాలా హీనమయిన జన్మను పొందిన ఒక స్త్రీ, ఆ కల్లును తాను విశేషముగా సేవించి శారీరకమయిన తుచ్ఛమయిన కామమునందు విశేషమయిన ప్రవేశము అనురక్త అయిన ఒక స్త్రీ కళ్ళు సేవించిన పురుషుడు శృంగార క్రీడయందు విశేషమయిన అభినివేశము ఉన్న వాడితో ఆనందముగా పునః పునః రతిక్రీడ జరుపుతున్నది.

అజామీళుడు ఆ సన్నివేశము చూశాడు. శుకుడికి కూడా ఇదే పరీక్ష వచ్చింది. బ్రహ్మమని ఆయన వెళ్ళిపోయాడు. అందుకని భాగవతం చెప్పగలిగాడు. కానీ ఇక్కడ అజామీళుడి మనస్సును ఆ దృశ్యము ఆక్రమించింది. కర్మేంద్రియ సంఘాతము ఆయనను నిలబెట్టేసింది. చూస్తున్న సన్నివేశం మనస్సులో ముద్రపడడం ప్రారంభం అయిపొయింది. అలా నిలబడి తమకముతో ఆ సన్నివేశమును వీక్షించాడు. అనగా ఇన్నాళ్ళు వశములో ఉన్న ఇంద్రియ లౌల్యము గలవడం ప్రారంభం అయింది. వారిద్దరూ వెళ్ళిపోయిన తరువాత తానూ వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి దర్భలు తండ్రికి ఇచ్చి అసుర సంధ్య వేళా సంధ్యావందనమునకు కూర్చున్నాడు. కానీ మనస్సులో కనపడుతున్నది ప్రార్థనా శ్లోకము కాదు. పొదలమాటున తన కన్ను దేనిమీద నిలబడిందో అది కనపడుతోంది. ఇంట ధర్మపత్నియై సుగుణాల రాశియై సౌందర్యవతియైన భార్య ఉన్నది. కానీ ఆయన కోర్కె వేరొక కులటయందు ప్రవేశించింది. ఆచార్య వాక్కులు గుర్తు తెచ్చుకుని అధిగమించాలని ప్రయత్నం చేశాడు. కానీ అతడు చూసిన సన్నివేశము వీటన్నింటిని తొలగదోసినది. ఒకనాటి రాత్రి తన భార్యకు తల్లికి, తండ్రికి తెలియకుండా ఆహీనకుల సంజాత అయిన ఆస్త్రీని చేరాడు. సంధ్యావందన భ్రష్టుడై రాత్రింబవళ్ళు అక్కడే ఉన్నాడు. తల్లిదండ్రులను ఎదిరించాడు. భార్యను విడిచిపెట్టేశాడు. తల్లిదండ్రులు వృద్ధులైపోయారు. వారి ధనమును దోచుకున్నాడు. కులట స్త్రీయందు 9మంది బిడ్డలను కన్నాడు.

అతడు చేసిన ఒకే ఒక మంచి పని – ఆవిడ కడుపున పుట్టిన ఆఖరు బిద్దడికి ‘నారాయణ’ అని పేరు పెట్టడం. ఆఖరి పిల్లాడు అవడం మూలాన వాడిమీద మమకారం ఉండిపోయి వాడిని నారాయణ నారాయణ అంటూ తరచూ పిలుస్తూ ఉండేవాడు. ఆవిడ పిల్లల పోషణార్థమై డబ్బు సంపాదించుకు రామ్మనేది. అందుకుగాను దొంగతనములు చేయడం మొదలు పెట్టాడు. ఎంత వేదం చదువుకున్నాడో, ఎవడు నిత్య నైమిత్తికములను నెరపినాడో, ఎవడు శాంతుడై దాంతుడై సకల వేదములను చదివాడో ఎవడు మంత్రసిద్ధులను పొందాడో అటువంటి అజామీళుడు ఈవేళ ఆరితేరిన దొంగయై అంతటి దొంగ లేదని అనిపించుకున్నాడు.

ఇంత పతనం ఎక్కడినుంచి వచ్చింది? ఒక్క ఇంద్రియ లౌల్యం వల్ల వచ్చింది. మనిషి మనిషిగా బ్రతకడం, ఈశ్వరుని చేరుకోవడం ఇంద్రియములను గలవడం ఎంతకష్టమో చూడండి.
Read More

.శ్రీవారి ఆలయ నిర్మాణచాతుర్యం...🏕

.శ్రీవారి ఆలయ నిర్మాణచాతుర్యం...🏕

                తిరుమల శేషాచలగిరుల్లో వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం భారతదేశంలోని ప్రముఖ ఆలయాల్లో విశిష్టమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. 
క్రీ.పూ.12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో శ్రీవారి ఆలయం నిర్మితమైంది.

                శ్రీవారి ఆలయంలో మొత్తం #మూడు 3⃣🔄 ప్రాకారాలున్నాయి. ఆలయం గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరుచుకోవడానికి వేర్వేరుగా గదులున్నాయి. వీటితోపాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంటగదులున్నాయి.

                శ్రీవారి ఆలయం అభివృద్ధికి ఎన్నో రాజవంశాలకు రాజులు, రాణులు ఇతోధికంగా విరాళాలు అందించి సహకరించారు. అద్భుత నిర్మాణమైన శ్రీవారి ఆలయంలో పలు ఉప ఆలయాలు, మండపాలు కొలువుదీరాయి. ఆలయంలోని నిర్మాణాలను ఒకసారి పరిశీలిద్దాం.

1⃣వ ప్రాకారం :-
〰〰〰〰〰〰

⛩ మహాద్వార గోపురం ⛩ :-

                శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించడానికి శ్రీవారి ఆలయంలో ప్రవేశించే .....ప్రధాన ప్రవేశద్వార.... గోపురమే మహాద్వార గోపురం.⛩

 పడికావలి, 
సింహద్వారం, 
ముఖద్వారం 
అని ఈ ద్వారానికి వేర్వేరు పేర్లు ఉన్నాయి. 
దీనినే తమిళంలో..... ”పెరియ తిరువాశల్‌”... అని కూడా అంటారు. అనగా #పెద్దవాకిలి అని అర్థం.

                ఈ ప్రధాన ద్వారగోపురంతో అనుసంధింపబడుతూ నిర్మించిన ప్రాకారమే మహాప్రాకారం. వైకుంఠం క్యూకాంప్లెక్సుల ద్వారా వచ్చిన భక్తులు ఈ మహాద్వార మార్గంలో మాత్రమే వెళ్లి స్వామివారిని దర్శించవలసి ఉంటుంది.

ఇక్కడే మనం క్రింద ఉన్న పైపు కు గల రంధ్రాల  ద్వారా వచ్చే నీటితో కాళ్ళు కడుగుకొని లోపలికి ప్రవేశిస్తాం.

ఇక్కడే

కుడిగోడపై #అనంతాళ్వారులు ఉపయోగించిన గుణపం ⛏ వ్రేలాడదీయబడి ఉంటుంది. 

✡ సంపంగి ప్రాకారం ✡ :-

                మహాద్వార గోపుర ప్రాకారానికి, నడిమి పడికావలి(వెండివాకిలి) ప్రాకారానికి మధ్యలో ఉన్న ప్రదక్షిణ మార్గమే సంపంగి ప్రాకారం. ప్రతి ఆలయానికి స్థల వృక్షాలనేవి ఉండడం పరిపాటి. తిరుమల ఆలయం స్థలవృక్షం #సంపంగి. 🌷 ఒకప్పుడు ఈ ప్రాంతం అంతటా సంపంగి చెట్లు ఉన్నందువల్ల ఇలా పిలవబడుతోంది.

                ఈ ప్రాకారంలో అద్దాలమండపం, 
రంగనాయక మండపం, తిరుమలరాయ మండపం, ధ్వజస్తంభమండపం, శ్రీవేంకటరమణస్వామి కల్యాణమండపం, 
ఉగ్రాణం, 
విరజానది, 
పడిపోటు, 
వగపడి అర 

తదితర మండపాలున్నాయి.

🏫 #కృష్ణరాయమండపం

                మహాద్వారానికి ఆనుకొని లోపలి వైపు 16 స్తంభాలతో ఉన్న ఎత్తైన మండపమే కృష్ణరాయమండపం. దీనినే #ప్రతిమామండపం అని కూడా అంటారు. 
లోపలికి ప్రవేశిస్తున్నపుడు కుడివైపున రాణులు తిరుమల దేవి, చిన్నాదేవులతో కూడిన శ్రీకృష్ణరాయల నిలువెత్తు రాగి ప్రతిమలు. 
అలాగే ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతి రాయల రాగిప్రతిమ, ఆ పక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మాణ్ణి వీరి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు తిరుమల యాత్ర చేసి శ్రీ స్వామికి ఎన్నో కానుకలు సమర్పించాడు. అచ్యుతరాయలు తనపేరిట అచ్యుతరాయ బ్రహ్మోత్సవాన్ని నిర్వహించాడు. 

⚛ రంగనాయక మండపం ⚛ :-

                కృష్ణరాయమండపానికి దక్షిణం వైపుగా ఉన్నదే ”రంగనాయకమండపం”. శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు కొంతకాలం పాటు ఈ మండపంలో భద్రపరిచారు. 
అందువల్లే దీన్ని రంగనాయక మండపమని పిలుస్తున్నారు. ఒకప్పుడు నిత్యకల్యాణోత్సవాలు జరిగిన ఈ మండపంలో ప్రస్తుతం ఆర్జితసేవలయిన వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, వాహనసేవలు జరుగుతున్నాయి.

                రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తదితర ప్రముఖులకు శ్రీవారి దర్శనానంతరం ఈ మండపంలోనే వేదాశీర్వచనంతోపాటు శ్రీవారి ప్రసాదాలను అందజేస్తారు.

✡ తిరుమలరాయ మండపం ✡ :-

                రంగనాయక మండపాన్ని అనుకుని పడమర వైపునకు ఉన్న ఎత్తయిన స్తంభాల మండపమే తిరుమలరాయ మండపం. 
ఈ మండపంలోని వేదిక భాగాన్ని తొలుత సాళువ నరసింహరాయలు నిర్మించగా,(సాళ్వ నరసింహ మండపం) ఆ తర్వాతికాలంలో సభాప్రాంగణ మండపాన్ని తిరుమలరాయలు నిర్మించాడు. 
ఈ మండపాన్ని ..…అణ్ణాఊయల మండపం..... అని అంటారు. అణ్ణై అనగా #హంస.🕊 బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీస్వామివారు ఈ మండపంలోనికి వేంచేసి పూజలందుకుంటారు.

 ☸ అద్దాల మండపం – అయినామహల్‌ ☸ :-

                ప్రతిమా మండపానికి ఉత్తరం దిక్కున ఉన్నదే అద్దాల మండపం. దీన్నే అయినామహల్‌ అని కూడా అంటారు. అయినా అనేది హిందీ పదం. తమిళంలో కన్నాడి అరై అంటారు.

 ⬆ ధ్వజస్తంభ మండపం ⬆:-

                ధ్వజస్తంభ మండపంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. వెండివాకిలికి ఎదురుగా బంగారు ధ్వజస్తంభం ఉంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవంలో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారు. దీన్నే ధ్వజారోహణం అంటారు. 

                ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున అనుకొని ఉన్న ఎత్తైన పీఠమే బలిపీఠం. దీనికి కూడా బంగారు రేకు తాపబడింది. శ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు బలిని(అన్నాన్ని 🍙🍚) ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు.

2⃣ 2వ ప్రాకారం :-
〰〰〰〰〰〰

....వెండి వాకిలి – నడిమి పడికావలి...

                ధ్వజస్తంభానికి ముందు ఉన్న ప్రవేశద్వారమే వెండివాకిలి. నడిమి పడికావలి అని పిలువబడే ఈ వెండివాకిలి గుండా వెళ్లి శ్రీస్వామివారిని భక్తులు దర్శిస్తారు. ప్రవేశద్వారమంతటా వెండి రేకు తాపబడినందువల్ల దీన్ని వెండివాకిలి అని అంటారు. 
ఈ ద్వారంలో మహంతు బావాజీ, శ్రీ వేంకటేశ్వరస్వామి పాచికలాడుతున్న 🎲 శిల్పం ఉంది.

✡ వసంత మండపం ✡

                తిరుమల శ్రీవారి ఆలయానికి మహాప్రదక్షిణ మార్గంలో నైరుతిమూలలో వసంత మండపం ఉంది. 

🏕 శ్రీ వరదరాజస్వామి ఆలయం 🏕 :-

                విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయమూలన శ్రీ వరదరాజస్వామి ఆలయం ఉంది. ఈ గుడిలో(సుమారు 4 అడుగుల) నిలువెత్తు శ్రీ వరదరాజస్వామివారి శిలామూర్తి 🕴 ప్రతిష్ఠింపబడింది.

🍱 🍨 ప్రధాన వంటశాల (పోటు) 🍱🍨

                విమాన ప్రదక్షిణంలో ఉన్న ప్రధాన వంటశాలను పోటు అంటారు. ఈ వంటశాలలో దద్దోజనం, చక్కెరపొంగలి, పులిహోర, ముళహోర, కదంబం, పొంగలి, సీరా, మాత్రాలతో పాటు కల్యాణోత్సవ దోశ, చిన్నదోశ, తోమాల దోశ, జిలేబి, పోలి, పాల్‌ పాయసం, అప్పం మొదలైనవాటిని తయారు చేస్తారు. ఆయా నియమాలను అనుసరించి వీటిని స్వామివారికి నివేదన చేస్తారు.

🏟 కళ్యాణ మండపం 🏟 :-

                సంపంగి ప్రదక్షిణం దక్షిణంవైపు మార్గంలో రేకులతో దీర్ఘచతురస్రాకారంగా కల్యాణమండపం నిర్మించబడింది. ఇందులో తూర్పుముఖంగా ఏర్పాటుచేయబడిన కల్యాణవేదికపై శ్రీమలయప్పస్వామివారికి, శ్రీదేవి భూదేవులకు ప్రతినిత్యం ఉదయం కల్యాణోత్సవం జరుగుతుంది. 

🐘🐎 వాహనం స్టోర్స్. 🐘 🐎 :-

ఉత్సవాలలో ఉపయోగించే గరుడ , సింహ ,  సూర్య , చంద్రాది వాహనాలు ఉంచే ప్రదేశం.

📚 సంకీర్తన భండారం 📚 :-

                సభ అరను అనుకుని ఉన్నదే సంకీర్తన భండారం. దీన్నే ”🗂 .....తాళ్లపాక అర”, ”రాగిరేకుల అర”...... 🗂  అంటారు. తాళ్లపాక కవులు సంకీర్తనలు చెక్కిన రాగిరేకులు ఈ అరలో భద్రపరిచి ఉండేవి. 
ఈ భాండారంపై తాళ్లపాక అన్నమయ్య, ఆయన కుమారుడు పెద తిరుమలయ్యల శిల్పమూర్తులు మలచబడివున్నాయి.

🏟 బంగారు బావి 🏟 :-

                విమాన ప్రదక్షిణంలో పోటుకు వెళ్లే మార్గం పక్కన బంగారు బావి ఉంది. ఈ బావి ఒఱకు బంగారు రేకు తాపబడినందువల్ల ‘బంగారుబావి’ అని పిలువబడుతున్నది. శ్రీవారి వంటలకు, శుక్రవారాభిషేకానికి, నిత్యార్చనలకు ఈ బంగారుబావి జలాన్నే ఉపయోగిస్తారు. #రంగదాసు(తొండమానుని పూర్వజన్మ) అనే భక్తుడు ఈ బంగారు బావిని నిర్మించాడట.

🏕 రామానుజ ఆలయం – భాష్యకార్ల సన్నిధి 🏕 :-

                సంకీర్తన భాండారానికి పక్కగా, హుండీకి ఎదురుగా సన్నిధి భాష్యకారులు ఉన్నారు. భగ్రవద్రామానుజుల వారినే భాష్యకారులంటారు. శ్రీవారి సన్నిధిలో ఉండడం వల్ల ”సన్నిధి భాష్యకారుల’ని ప్రసిద్ధి ఏర్పడింది. తిరుమల క్షేత్రాన్ని చక్కగా తీర్చిదిద్దిన ఘనత #శ్రీరామానుజులవారిదే.

 🛐 శ్రీ యోగనరసింహస్వామి సన్నిధి 🛐 :-

                శ్రీ నరసింహాలయం క్రీ.శ 1330-1360 మధ్య నిర్మించబడిందని పరిశోధకుల అభిప్రాయం.  క్రీ.శ 1469లోని కందాడై రామానుజయ్యంగారి శాసనంలో ఈ యోగనరసింహుని ప్రస్తావన ఉంది. ‘అళగియ సింగర్‌'(అందమైన సింహం) అని, వేంకటాత్తరి(వేంకటశైలంపై ఉన్న సింహం) అని ప్రస్తావన ఉంది.

 🦅 గరుడ సన్నిధి 🦅 :-

మూలవిరాట్ కు ఎదురుగా జయ విజయులకు వెలుపలగా  గరుడాళ్వారులు గారు ఉన్న మండపం.
బంగారు వాకిలి ఎదురుగా, గరుడాళ్వార్‌ మందిరం ఉంది. శ్రీస్వామివారికి అభిముఖంగా, నమస్కార భంగిమలో సుమారు 5 అడుగుల ఎత్తు ఉన్న గరుడాళ్వారు శిలాప్రతిమ ప్రతిష్టించబడింది. ఈ మందిరానికి వెలుపల అంతటా ఇటీవలే బంగారం రేకు తాపబడింది. ఈ శిలామూర్తి గాక శ్రీవారి ఆలయంలో గరుడాళ్వార్‌ చిన్న పంచలోహ ప్రతిమ, బంగారు గరుడ వాహనం కూడా ఉన్నాయి.

✡ తిరుమామణి మండపం ✡ :-

బంగారు వాకిలి కి గరుడ సన్నిధి కి మధ్యగల ప్రదేశం.

సుప్రభాత సేవ లో భక్తులను ఇక్కడే ఉంచుతారు.

🔔 ఘంట:- 🔔

పూర్వం జయవిజయులకు ఇరువైపులా రెండు పెద్ద గంటలు ఉండేవి. హారతి సమయాలలో వీనిని మ్రోగించేవారు.

ఇప్పుడు రెండూ ఒకేచోటికి చేర్చారు. దర్శనానంతరం వెలుపలకు వచ్చే ద్వారం ప్రక్కనే ఉంటాయి.

🕴ద్వారపాలకులు 🕴 :-

బంగారు వాకిలికి వెలుపలగా ఇరువైపులా ఉండే జయ విజయులు.
మహాలఘుదర్శనం ఇక్కడే చేసుకొంటారు.

3⃣ మూడవ ప్రాకారం:-
〰〰〰〰〰〰〰〰
 ⛩ బంగారువాకిలి ⛩ :-

                శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధికి వెళ్లడానికి అత్యంత ప్రధానమైన ఏకైకద్వారం బంగారువాకిలి. వాకిలికి, గడపకు అంతటా బంగారు రేకు తాపబడినందువల్ల ఈ ప్రవేశద్వారానికి బంగారు వాకిలి అనే ప్రసిద్ధి ఏర్పడింది. ప్రతిరోజూ ఈ బంగారువాకిలి ముందు తెల్లవారుజామున సుప్రభాతం పఠనం జరుగుతుంది. ప్రతి బుధవారం భోగ శ్రీనివాసమూర్తికి, శ్రీ మలయప్పస్వామివారికి ఇక్కడే సహస్ర కలశాభిషేకం జరుగుతుంది.

⚛ స్నపనమండపం ⚛:-

                బంగారువాకిలి దాటి లోపలికి వెళ్లిన వెంటనే ఉండేదే ‘స్నపనమంపం’. క్రీ.శ.614లో పల్లవరాణి రామవై ఈ మండపాన్ని నిర్మించి, భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించిందట. ఈ స్నపనమండపాన్నే తిరువిలాన్‌ కోయిల్‌ అంటారు. ఆనందనిలయం జీర్ణోర్ధరణ సమయంలో ఈ మండపం నిర్మించబడిందని చెబుతారు.

✡ రాములవారి మేడ ✡ :-

                స్నపనమండపం దాటగానే కుడివైపు ఎత్తుగా కనిపించే నడవ ”రాములవారిమేడ”. తమిళంలో మేడు అంటే ఎత్తయిన ప్రదేశం అని అర్థం. ఇక్కడ రాములవారి పరివారమైన అంగద, హనుమంత, సుగ్రీవుల విగ్రహాలున్నాయి. ప్రస్తుతం ఆనందనిలయంలో ఉన్న శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ ఉండేవని, అందువల్లే ఇది రాములవారి మేడ అని పిలువబడుతోంది.

🛌 శయనమండపం 🛌 :-

                రాములవారి మేడ దాటి లోపల ప్రవేశించిన వెంటనే ఉన్న గదే శయనమండపం. శ్రీవేంకటేశ్వరస్వామివారు వెలసిన గర్భాలయానికి ముందున్న అంతరాళమే శయనమండపం. ప్రతిరోజూ ఏకాంత సేవ ఈ మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంమీద శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శయనిస్తారు.

 ➖➖ కులశేఖరపడి ➖➖ :-

 శయనమండపానికి, శ్రీవారి గర్భాలయానికి మధ్యన రాతితో నిర్మించిన ద్వారబంధం ఉంది. అదే కులశేఖరప్పడి. పడి అనగా మెట్టు, గడప అని అర్థం.

🏛 గర్భగృహం 🏛 :-

                కులశేఖరపడి అనే బంగారు గడపను దాటితే ఉన్నదే శ్రీవారి గర్భాలయం. శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి ఉన్నచోటే గర్భాలయం. దీనినే ”ఆనంద నిలయం” అంటారు. ఈ ఆనంద నిలయంపై ఒక బంగారు గోపురం నిర్మించబడింది. దీనినే ఆనందనిలయ విమానం అంటారు.

*శ్రీ వేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు) 🚹 :-

                గర్భాలయంలో స్వయంవ్యక్తమూర్తిగా నిలిచివున్న పవిత్ర శిలా దివ్యమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి. నిలబబడివున్నందున ఈ ఆర్చామూర్తిని ”....స్థానకమూర్తి....” అంటారు.
 అంతేగాక స్థిరంగా ఉన్నందువల్ల ”....ధ్రువమూర్తి....” అని, ”ధ్రువబేరం” అని కూడా అంటారు.

                శ్రీ స్వామివారి మూర్తి అత్యంత విలక్షణమైన పద్ధతిలో దర్శనమిస్తూ భక్తులను ఆనందింపజేస్తున్నది. సుమారు 8 అడుగుల ఎత్తుగల #స్వయంభూమూర్తి.

𝕾𝖔𝖚𝖗𝖈𝖊:- (మూలం)

నేను చాలాసార్లు తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నాను  ఎంతగా ఊహించుకుంటూ వెళ్తామో అంతకంటే శీఘ్రంగా బయటకు వస్తాము.(⁉పంపివేయబడతాము 😋 😪) . నేనేకాదు మనలో చాలామంది కి ఎక్కువసార్లు బంగారు వాకిలి బయటనుండే దర్శనం లభించేది. 😪
అయితే బంగారు వాకిలి నుండి గర్భగుడి వరకు ఏం ఉంటుంది అందులో ఏఏ కార్యక్రమాలు నిర్వహించేవారు అని తెలుసుకునే #కుతూహలం కోసం సేకరించిన సమాచారం.  దానితో పాటు గుడి గురించిన సమాచారం. ఇంకా ఏవైనా ప్రత్యేకతలు ఉంటే తెలుపగలరు, తెలుసుకుందాం  & తెలియచేద్దాం.🏕 ....శ్రీవారి ఆలయ నిర్మాణచాతుర్యం...🏕

                తిరుమల శేషాచలగిరుల్లో వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం భారతదేశంలోని ప్రముఖ ఆలయాల్లో విశిష్టమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. 
క్రీ.పూ.12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో శ్రీవారి ఆలయం నిర్మితమైంది.

                శ్రీవారి ఆలయంలో మొత్తం #మూడు 3⃣🔄 ప్రాకారాలున్నాయి. ఆలయం గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరుచుకోవడానికి వేర్వేరుగా గదులున్నాయి. వీటితోపాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంటగదులున్నాయి.

                శ్రీవారి ఆలయం అభివృద్ధికి ఎన్నో రాజవంశాలకు రాజులు, రాణులు ఇతోధికంగా విరాళాలు అందించి సహకరించారు. అద్భుత నిర్మాణమైన శ్రీవారి ఆలయంలో పలు ఉప ఆలయాలు, మండపాలు కొలువుదీరాయి. ఆలయంలోని నిర్మాణాలను ఒకసారి పరిశీలిద్దాం.

1⃣వ ప్రాకారం :-
〰〰〰〰〰〰

⛩ మహాద్వార గోపురం ⛩ :-

                శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించడానికి శ్రీవారి ఆలయంలో ప్రవేశించే .....ప్రధాన ప్రవేశద్వార.... గోపురమే మహాద్వార గోపురం.⛩

 పడికావలి, 
సింహద్వారం, 
ముఖద్వారం 
అని ఈ ద్వారానికి వేర్వేరు పేర్లు ఉన్నాయి. 
దీనినే తమిళంలో..... ”పెరియ తిరువాశల్‌”... అని కూడా అంటారు. అనగా #పెద్దవాకిలి అని అర్థం.

                ఈ ప్రధాన ద్వారగోపురంతో అనుసంధింపబడుతూ నిర్మించిన ప్రాకారమే మహాప్రాకారం. వైకుంఠం క్యూకాంప్లెక్సుల ద్వారా వచ్చిన భక్తులు ఈ మహాద్వార మార్గంలో మాత్రమే వెళ్లి స్వామివారిని దర్శించవలసి ఉంటుంది.

ఇక్కడే మనం క్రింద ఉన్న పైపు కు గల రంధ్రాల  ద్వారా వచ్చే నీటితో కాళ్ళు కడుగుకొని లోపలికి ప్రవేశిస్తాం.

ఇక్కడే

కుడిగోడపై #అనంతాళ్వారులు ఉపయోగించిన గుణపం ⛏ వ్రేలాడదీయబడి ఉంటుంది. 

✡ సంపంగి ప్రాకారం ✡ :-

                మహాద్వార గోపుర ప్రాకారానికి, నడిమి పడికావలి(వెండివాకిలి) ప్రాకారానికి మధ్యలో ఉన్న ప్రదక్షిణ మార్గమే సంపంగి ప్రాకారం. ప్రతి ఆలయానికి స్థల వృక్షాలనేవి ఉండడం పరిపాటి. తిరుమల ఆలయం స్థలవృక్షం #సంపంగి. 🌷 ఒకప్పుడు ఈ ప్రాంతం అంతటా సంపంగి చెట్లు ఉన్నందువల్ల ఇలా పిలవబడుతోంది.

                ఈ ప్రాకారంలో అద్దాలమండపం, 
రంగనాయక మండపం, తిరుమలరాయ మండపం, ధ్వజస్తంభమండపం, శ్రీవేంకటరమణస్వామి కల్యాణమండపం, 
ఉగ్రాణం, 
విరజానది, 
పడిపోటు, 
వగపడి అర 

తదితర మండపాలున్నాయి.

🏫 #కృష్ణరాయమండపం

                మహాద్వారానికి ఆనుకొని లోపలి వైపు 16 స్తంభాలతో ఉన్న ఎత్తైన మండపమే కృష్ణరాయమండపం. దీనినే #ప్రతిమామండపం అని కూడా అంటారు. 
లోపలికి ప్రవేశిస్తున్నపుడు కుడివైపున రాణులు తిరుమల దేవి, చిన్నాదేవులతో కూడిన శ్రీకృష్ణరాయల నిలువెత్తు రాగి ప్రతిమలు. 
అలాగే ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతి రాయల రాగిప్రతిమ, ఆ పక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మాణ్ణి వీరి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు తిరుమల యాత్ర చేసి శ్రీ స్వామికి ఎన్నో కానుకలు సమర్పించాడు. అచ్యుతరాయలు తనపేరిట అచ్యుతరాయ బ్రహ్మోత్సవాన్ని నిర్వహించాడు. 

⚛ రంగనాయక మండపం ⚛ :-

                కృష్ణరాయమండపానికి దక్షిణం వైపుగా ఉన్నదే ”రంగనాయకమండపం”. శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు కొంతకాలం పాటు ఈ మండపంలో భద్రపరిచారు. 
అందువల్లే దీన్ని రంగనాయక మండపమని పిలుస్తున్నారు. ఒకప్పుడు నిత్యకల్యాణోత్సవాలు జరిగిన ఈ మండపంలో ప్రస్తుతం ఆర్జితసేవలయిన వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, వాహనసేవలు జరుగుతున్నాయి.

                రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తదితర ప్రముఖులకు శ్రీవారి దర్శనానంతరం ఈ మండపంలోనే వేదాశీర్వచనంతోపాటు శ్రీవారి ప్రసాదాలను అందజేస్తారు.

✡ తిరుమలరాయ మండపం ✡ :-

                రంగనాయక మండపాన్ని అనుకుని పడమర వైపునకు ఉన్న ఎత్తయిన స్తంభాల మండపమే తిరుమలరాయ మండపం. 
ఈ మండపంలోని వేదిక భాగాన్ని తొలుత సాళువ నరసింహరాయలు నిర్మించగా,(సాళ్వ నరసింహ మండపం) ఆ తర్వాతికాలంలో సభాప్రాంగణ మండపాన్ని తిరుమలరాయలు నిర్మించాడు. 
ఈ మండపాన్ని ..…అణ్ణాఊయల మండపం..... అని అంటారు. అణ్ణై అనగా #హంస.🕊 బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీస్వామివారు ఈ మండపంలోనికి వేంచేసి పూజలందుకుంటారు.

 ☸ అద్దాల మండపం – అయినామహల్‌ ☸ :-

                ప్రతిమా మండపానికి ఉత్తరం దిక్కున ఉన్నదే అద్దాల మండపం. దీన్నే అయినామహల్‌ అని కూడా అంటారు. అయినా అనేది హిందీ పదం. తమిళంలో కన్నాడి అరై అంటారు.

 ⬆ ధ్వజస్తంభ మండపం ⬆:-

                ధ్వజస్తంభ మండపంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. వెండివాకిలికి ఎదురుగా బంగారు ధ్వజస్తంభం ఉంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవంలో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారు. దీన్నే ధ్వజారోహణం అంటారు. 

                ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున అనుకొని ఉన్న ఎత్తైన పీఠమే బలిపీఠం. దీనికి కూడా బంగారు రేకు తాపబడింది. శ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు బలిని(అన్నాన్ని 🍙🍚) ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు.

2⃣ 2వ ప్రాకారం :-
〰〰〰〰〰〰

....వెండి వాకిలి – నడిమి పడికావలి...

                ధ్వజస్తంభానికి ముందు ఉన్న ప్రవేశద్వారమే వెండివాకిలి. నడిమి పడికావలి అని పిలువబడే ఈ వెండివాకిలి గుండా వెళ్లి శ్రీస్వామివారిని భక్తులు దర్శిస్తారు. ప్రవేశద్వారమంతటా వెండి రేకు తాపబడినందువల్ల దీన్ని వెండివాకిలి అని అంటారు. 
ఈ ద్వారంలో మహంతు బావాజీ, శ్రీ వేంకటేశ్వరస్వామి పాచికలాడుతున్న 🎲 శిల్పం ఉంది.

✡ వసంత మండపం ✡

                తిరుమల శ్రీవారి ఆలయానికి మహాప్రదక్షిణ మార్గంలో నైరుతిమూలలో వసంత మండపం ఉంది. 

🏕 శ్రీ వరదరాజస్వామి ఆలయం 🏕 :-

                విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయమూలన శ్రీ వరదరాజస్వామి ఆలయం ఉంది. ఈ గుడిలో(సుమారు 4 అడుగుల) నిలువెత్తు శ్రీ వరదరాజస్వామివారి శిలామూర్తి 🕴 ప్రతిష్ఠింపబడింది.

🍱 🍨 ప్రధాన వంటశాల (పోటు) 🍱🍨

                విమాన ప్రదక్షిణంలో ఉన్న ప్రధాన వంటశాలను పోటు అంటారు. ఈ వంటశాలలో దద్దోజనం, చక్కెరపొంగలి, పులిహోర, ముళహోర, కదంబం, పొంగలి, సీరా, మాత్రాలతో పాటు కల్యాణోత్సవ దోశ, చిన్నదోశ, తోమాల దోశ, జిలేబి, పోలి, పాల్‌ పాయసం, అప్పం మొదలైనవాటిని తయారు చేస్తారు. ఆయా నియమాలను అనుసరించి వీటిని స్వామివారికి నివేదన చేస్తారు.

🏟 కళ్యాణ మండపం 🏟 :-

                సంపంగి ప్రదక్షిణం దక్షిణంవైపు మార్గంలో రేకులతో దీర్ఘచతురస్రాకారంగా కల్యాణమండపం నిర్మించబడింది. ఇందులో తూర్పుముఖంగా ఏర్పాటుచేయబడిన కల్యాణవేదికపై శ్రీమలయప్పస్వామివారికి, శ్రీదేవి భూదేవులకు ప్రతినిత్యం ఉదయం కల్యాణోత్సవం జరుగుతుంది. 

🐘🐎 వాహనం స్టోర్స్. 🐘 🐎 :-

ఉత్సవాలలో ఉపయోగించే గరుడ , సింహ ,  సూర్య , చంద్రాది వాహనాలు ఉంచే ప్రదేశం.

📚 సంకీర్తన భండారం 📚 :-

                సభ అరను అనుకుని ఉన్నదే సంకీర్తన భండారం. దీన్నే ”🗂 .....తాళ్లపాక అర”, ”రాగిరేకుల అర”...... 🗂  అంటారు. తాళ్లపాక కవులు సంకీర్తనలు చెక్కిన రాగిరేకులు ఈ అరలో భద్రపరిచి ఉండేవి. 
ఈ భాండారంపై తాళ్లపాక అన్నమయ్య, ఆయన కుమారుడు పెద తిరుమలయ్యల శిల్పమూర్తులు మలచబడివున్నాయి.

🏟 బంగారు బావి 🏟 :-

                విమాన ప్రదక్షిణంలో పోటుకు వెళ్లే మార్గం పక్కన బంగారు బావి ఉంది. ఈ బావి ఒఱకు బంగారు రేకు తాపబడినందువల్ల ‘బంగారుబావి’ అని పిలువబడుతున్నది. శ్రీవారి వంటలకు, శుక్రవారాభిషేకానికి, నిత్యార్చనలకు ఈ బంగారుబావి జలాన్నే ఉపయోగిస్తారు. #రంగదాసు(తొండమానుని పూర్వజన్మ) అనే భక్తుడు ఈ బంగారు బావిని నిర్మించాడట.

🏕 రామానుజ ఆలయం – భాష్యకార్ల సన్నిధి 🏕 :-

                సంకీర్తన భాండారానికి పక్కగా, హుండీకి ఎదురుగా సన్నిధి భాష్యకారులు ఉన్నారు. భగ్రవద్రామానుజుల వారినే భాష్యకారులంటారు. శ్రీవారి సన్నిధిలో ఉండడం వల్ల ”సన్నిధి భాష్యకారుల’ని ప్రసిద్ధి ఏర్పడింది. తిరుమల క్షేత్రాన్ని చక్కగా తీర్చిదిద్దిన ఘనత #శ్రీరామానుజులవారిదే.

 🛐 శ్రీ యోగనరసింహస్వామి సన్నిధి 🛐 :-

                శ్రీ నరసింహాలయం క్రీ.శ 1330-1360 మధ్య నిర్మించబడిందని పరిశోధకుల అభిప్రాయం.  క్రీ.శ 1469లోని కందాడై రామానుజయ్యంగారి శాసనంలో ఈ యోగనరసింహుని ప్రస్తావన ఉంది. ‘అళగియ సింగర్‌'(అందమైన సింహం) అని, వేంకటాత్తరి(వేంకటశైలంపై ఉన్న సింహం) అని ప్రస్తావన ఉంది.

 🦅 గరుడ సన్నిధి 🦅 :-

మూలవిరాట్ కు ఎదురుగా జయ విజయులకు వెలుపలగా  గరుడాళ్వారులు గారు ఉన్న మండపం.
బంగారు వాకిలి ఎదురుగా, గరుడాళ్వార్‌ మందిరం ఉంది. శ్రీస్వామివారికి అభిముఖంగా, నమస్కార భంగిమలో సుమారు 5 అడుగుల ఎత్తు ఉన్న గరుడాళ్వారు శిలాప్రతిమ ప్రతిష్టించబడింది. ఈ మందిరానికి వెలుపల అంతటా ఇటీవలే బంగారం రేకు తాపబడింది. ఈ శిలామూర్తి గాక శ్రీవారి ఆలయంలో గరుడాళ్వార్‌ చిన్న పంచలోహ ప్రతిమ, బంగారు గరుడ వాహనం కూడా ఉన్నాయి.

✡ తిరుమామణి మండపం ✡ :-

బంగారు వాకిలి కి గరుడ సన్నిధి కి మధ్యగల ప్రదేశం.

సుప్రభాత సేవ లో భక్తులను ఇక్కడే ఉంచుతారు.

🔔 ఘంట:- 🔔

పూర్వం జయవిజయులకు ఇరువైపులా రెండు పెద్ద గంటలు ఉండేవి. హారతి సమయాలలో వీనిని మ్రోగించేవారు.

ఇప్పుడు రెండూ ఒకేచోటికి చేర్చారు. దర్శనానంతరం వెలుపలకు వచ్చే ద్వారం ప్రక్కనే ఉంటాయి.

🕴ద్వారపాలకులు 🕴 :-

బంగారు వాకిలికి వెలుపలగా ఇరువైపులా ఉండే జయ విజయులు.
మహాలఘుదర్శనం ఇక్కడే చేసుకొంటారు.

3⃣ మూడవ ప్రాకారం:-
〰〰〰〰〰〰〰〰
 ⛩ బంగారువాకిలి ⛩ :-

                శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధికి వెళ్లడానికి అత్యంత ప్రధానమైన ఏకైకద్వారం బంగారువాకిలి. వాకిలికి, గడపకు అంతటా బంగారు రేకు తాపబడినందువల్ల ఈ ప్రవేశద్వారానికి బంగారు వాకిలి అనే ప్రసిద్ధి ఏర్పడింది. ప్రతిరోజూ ఈ బంగారువాకిలి ముందు తెల్లవారుజామున సుప్రభాతం పఠనం జరుగుతుంది. ప్రతి బుధవారం భోగ శ్రీనివాసమూర్తికి, శ్రీ మలయప్పస్వామివారికి ఇక్కడే సహస్ర కలశాభిషేకం జరుగుతుంది.

⚛ స్నపనమండపం ⚛:-

                బంగారువాకిలి దాటి లోపలికి వెళ్లిన వెంటనే ఉండేదే ‘స్నపనమంపం’. క్రీ.శ.614లో పల్లవరాణి రామవై ఈ మండపాన్ని నిర్మించి, భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించిందట. ఈ స్నపనమండపాన్నే తిరువిలాన్‌ కోయిల్‌ అంటారు. ఆనందనిలయం జీర్ణోర్ధరణ సమయంలో ఈ మండపం నిర్మించబడిందని చెబుతారు.

✡ రాములవారి మేడ ✡ :-

                స్నపనమండపం దాటగానే కుడివైపు ఎత్తుగా కనిపించే నడవ ”రాములవారిమేడ” అంటే ఎత్తయిన ప్రదేశం అని అర్థం. ఇక్కడ రాములవారి పరివారమైన అంగద, హనుమంత, సుగ్రీవుల విగ్రహాలున్నాయి. ప్రస్తుతం ఆనందనిలయంలో ఉన్న శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ ఉండేవని, అందువల్లే ఇది రాములవారి మేడ అని పిలువబడుతోంది.

🛌 శయనమండపం 🛌 :-

                రాములవారి మేడ దాటి లోపల ప్రవేశించిన వెంటనే ఉన్న గదే శయనమండపం. శ్రీవేంకటేశ్వరస్వామివారు వెలసిన గర్భాలయానికి ముందున్న అంతరాళమే శయనమండపం. ప్రతిరోజూ ఏకాంత సేవ ఈ మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంమీద శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శయనిస్తారు.

 ➖➖ కులశేఖరపడి ➖➖ :-

 శయనమండపానికి, శ్రీవారి గర్భాలయానికి మధ్యన రాతితో నిర్మించిన ద్వారబంధం ఉంది. అదే కులశేఖరప్పడి. పడి అనగా మెట్టు, గడప అని అర్థం.

🏛 గర్భగృహం 🏛 :-

                కులశేఖరపడి అనే బంగారు గడపను దాటితే ఉన్నదే శ్రీవారి గర్భాలయం. శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి ఉన్నచోటే గర్భాలయం. దీనినే ”ఆనంద నిలయం” అంటారు. ఈ ఆనంద నిలయంపై ఒక బంగారు గోపురం నిర్మించబడింది. దీనినే ఆనందనిలయ విమానం అంటారు.

*శ్రీ వేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు) 🚹 :-

                గర్భాలయంలో స్వయంవ్యక్తమూర్తిగా నిలిచివున్న పవిత్ర శిలా దివ్యమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి. నిలబబడివున్నందున ఈ ఆర్చామూర్తిని ”....స్థానకమూర్తి....” అంటారు.
 అంతేగాక స్థిరంగా ఉన్నందువల్ల ”....ధ్రువమూర్తి....” అని, ”ధ్రువబేరం” అని కూడా అంటారు.

                శ్రీ స్వామివారి మూర్తి అత్యంత విలక్షణమైన పద్ధతిలో దర్శనమిస్తూ భక్తుల ఆనందింపజేస్తున్నది. సుమారు 8 అడుగుల ఎత్తుగల #స్

నేను చాలాసార్లు తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నాను  ఎంతగా ఊహించుకుంటూ వెళ్తామో అంతకంటే శీఘ్రంగా బయటకు వస్తాము.(⁉పంపివేయబడతాము 😋 😪) . నేనేకాదు మనలో చాలామంది కి ఎక్కువసార్లు బంగారు వాకిలి బయటనుండే దర్శనం లభించేది. 😪
అయితే బంగారు వాకిలి నుండి గర్భగుడి వరకు ఏం ఉంటుంది అందులో ఏఏ కార్యక్రమాలు నిర్వహించేవారు అని తెలుసుకునే #కుతూహలం కోసం సేకరించిన సమాచారం.  దానితో పాటు గుడి గురించిన సమాచారం. ఇంకా ఏవైనా ప్రత్యేకతలు ఉంటే తెలుపగలరు, తెలుసుకుందాం  & తెలియచేద్దాం.
Read More

Powered By Blogger | Template Created By Lord HTML