👆ఈశ్వరుడు నందిపై
గర్భగుడిలో ఉండడం అనేది
చాలా అరుదుగా కనిపించే శిల్పం!!
16వ శతాబ్దానికి చెందిన
అందమైన శిల్పం.
ఇది పుర గ్రామం,
సొరబ తాలూకా,
షిమోగా జిల్లా లోని
సోమేశ్వరాలయంలో ఉంది...
ఇక్కడ శివుడుకిరీట
ముఖతలో వున్నాడు
🙏హర హర మహాదేవ్🙏
శుభోదయం
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
👆ఈశ్వరుడు నందిపై
గర్భగుడిలో ఉండడం అనేది
చాలా అరుదుగా కనిపించే శిల్పం!!
16వ శతాబ్దానికి చెందిన
అందమైన శిల్పం.
ఇది పుర గ్రామం,
సొరబ తాలూకా,
షిమోగా జిల్లా లోని
సోమేశ్వరాలయంలో ఉంది...
ఇక్కడ శివుడుకిరీట
ముఖతలో వున్నాడు
🙏హర హర మహాదేవ్🙏
శుభోదయం
*ఆచమనం అంటే..?
➖➖➖
పూజలు, వ్రతాల్లో ”ఆచమనం” అనే మాట చాలా సార్లు వింటాం. వినకపోయినా హిందువు అనే వ్యక్తి ఏదోక సందర్భంగాలో దానిని పాటించే ఉంటారు.
కానీ, దానర్థం మాత్రం తెలియదు. అర్చకులు చెప్పినట్లు చేతిలో నీరు పోసుకుని తాగేయడం పరిపాటి.
కానీ, అలా ఎందుకు తాగమంటున్నారు. దాని అర్థం ఏమిటి అనే విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం మీ వంతు…
సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడో, పూజా సమయంలోనో మనం ఈ ఆచమనాన్ని పాటించి ఉంటాం. సాంప్రదాయబద్ధంగానైతే రోజులో పలుమార్లు పాటిస్తారు.
ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత, పూజకు ముందు, సంధ్యావందనం చేసే సమయంలో భోజనానికి ముందు, తర్వాత, బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత ముఖం, కాళ్ళూ చేతులూ కడుక్కున్న తర్వాత ఆచమనం చేయొచ్చు.
సంస్కృతంలో ”గోకర్ణాకృతి హస్తేన మాషమగ్నజలం పిబేత్” అని వర్ణించారు. అంటే, కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి, నీటిని పోసి, వాటిని తాగడం అన్న మాట.
చేతిలో పోసేనీళ్ళుకి కూడా కొలత ఉంటుంది. మూడు ఉద్ధరిణిల నీటిని మాత్రమే పోయాలి. అంటే ఒక మినపగింజమునిగేంత పరిమాణంలో నీళ్ళు కొలత అంతే ఉండాలి.
ఎందుకు చేయాలి? ఏమిటి దాని వలన ప్రయోజనం అంటే, గతంలో మనం అనేక మార్లు భారతీయత, దాని ప్రభావం అర్థం పరమార్థం గురించి చెప్పుకున్నాం. మన సాంప్రదాయం అంత గొప్పది.
భక్తి మాత్రమే కాదు అణువణువునా శాస్త్రీయత, ఆరోగ్య సూత్రం ఇనుమడింపజేస్తాయి. భక్తి, ఆధ్యాత్మికత ఉట్టిపడతాయి. ఆచమనంలో కూడా అదే దాగి ఉంది.
మన గొంతు ముందు భాగంలోంచి శబ్దాలు వస్తాయి. దీన్ని స్వరపేటిక అంటాం. దీనిచుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది.
కనుక కొంత వరకూ రక్షణ లభిస్తుంది. అయినప్పటికీ, ఇది ఎంత అద్భుతమైనదో, అంత సున్నితమైనది.
ఏ చిన్న గాయం అయినా స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు, ప్రాణమే పోవచ్చు. స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి.
ఇవి ఇంగ్లీషు అక్షరం ‘V’ ఆకారంలో మిళితమై ఉంటాయి. ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి, ఎపెక్స్ ముందుభాగంలో పాతుకుని ఉంటాయి.
స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి.
స్వరపేటిక మహా సున్నితమైనది. ముక్కు, నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు నాళాలు, అంగిలి, కొండనాలుక,
గొంతు లోపలి భాగం, శ్వాస నాళం, అన్ననాళం, స్వర తంత్రులు, వాటిచుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి.
వీటికి బలం, వ్యాయామం కలిగించి ఉత్తేజ పరచడమే ఆచమనం ప్రక్రియ. సాధారణంగా గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటికొస్తుంది.
ఇలా లోపలి నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు. శబ్దం సులువుగా, స్పష్టంగా రావాలి. ఆచమనం పద్దతిలో మెల్లగా తాగడం అలవాటు చేసుకుంటే స్పష్టత అబ్బుతుంది.
“కేశవాయ స్వాహా” అనడంలో ఆంతర్యమేమిటి అంటే అది గొంతునుండి వెలువడుతుంది. ఇక “నారాయణాయ స్వాహా” అనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది.
చివరిగా “మాధవాయ స్వాహా” అనే మంత్రం పెదాలు మాత్రమే పలుకుతాయి. ఆచమనం ద్వారా గొంతు, నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది.
ఇక చాలా మందికి చేతితో ఎందుకు తాగాలి అనే అనుమానం కూడా కలుగవచ్చు. మన చేతుల్లో కొంత విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది.
చేతిలో నీళ్ళు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని నోటి ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వం ఉండేలా, సమ ధాతువుగా ఉండేలా చేస్తుంది.
ఉద్దరిణి అంటే కొద్ది కొద్దిగా తాగడం వలన కొద్దిగా విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు,పెగుల వరకూ ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజ పరుస్తాయి.
ఇలా ఆచమనం వెనుక ఇంతటి శాస్త్రీయత ఉందన్నమాట
*సంధ్యా వందనము ఎందుకు?
*మరియు ఫలము:
ఎన్నోవేల కోట్ల జీవరాసుల మధ్య జడమై,అజరమై, జడపదార్థం కాని ఎన్నెన్నో జీవరాసుల మధ్యలో ఉన్న తేజస్సుకొరకు సంధ్యావందనం. లోకంలో స్థావరమై, జంగమమైన అనేక రూపాలలో మానవ జన్మ అత్యున్నతమైనది. జీవన సాఫల్యం చెందడానికి,(ఎందుకు జన్మించాము) తన చుట్టూ ఉన్న సమాజమును ఉద్దరించ డానికి, ఒక వ్యక్తిగా ఉపాసించడమే సంధ్యావందనము.
గాయత్రి అనగా భూదేవియే ఉపస్తుగా, విష్ణువే హృదయంగా, శివుడే సర్వవ్యాపి తముగా ఉండే దేవి పరదేవత. విశ్వభూతరాళాంత మధ్యలో అంతర్గతంగా ఉండే స్వరూపం ఈ గాయిత్రి మాత. ఒక యోగిగా, ఒక ఋషిగా మనము ఎక్కడికో వెళ్ళి తపస్సు చేయనవసరం లేదు. ప్రతి రోజు ఒక 25 ని||ములు ఈ గాయత్రీ జపం చేయడం వలన తన జన్మకు సాఫల్యం చేకూర్చినవాడు కాగలడు.
మన జీవన యానాన్ని మన చుట్టూ ఉండేవారి జీవనాన్ని, కుటుంబాలని, సమాజాన్ని, నవోన్వేషణము వైపుకు నడపడం, అమ్మకు(తల్లి) నాన్నకు(తండ్రి) గురువులకు, పితృదేవతలకు, మాతృ దేవతలకు, మనకు కనిపించని హితోపదేశులకూ, అందరికీ వారిని స్మరించుచూ వారి శ్రేయస్సుకు, వారి పురోగమనానికి, ఒక నీటి చుక్క విడువడమే, సంధ్యావందన పరమార్థం.
మరియు ఈ మానవ ఉపాధిని ప్రసాదించిన తల్లి తండ్రులకు, ఈ ఉపాధిని సన్మార్గంలో నడపడానికి చుక్కానియైన గురువు గార్లకు, హితులకు,సన్నిహితులకు, మిత్రులకు, దైవోపగతులకు, ఆత్మీయులకు, ఆత్మజులకు, మన ఇరుగు పొరుగులకు, సర్వులకు నమస్కరించి వారి అభ్యున్నతిని, శ్రేయస్సును, త్రికరణ శుద్ధిగా అభిలషిస్తూ చేయడమే సంధ్యావందనము.✅
*సంధ్యావందనము:
సంద్యావందన సమయ వివరణ:
**************************
ప్రాతః సంధ్యాసమయము
ఉదయం 5-12 AM నుండి 6.00 AM వరకు
మద్యాహ్నసంధ్యాసమయము ఉదయం 11-12 AM నుండి 12.00 noonవరకు
సాయం సంధ్యాసమయము సా II 5-12 PM నుండి 6.00 PM వరకు.
ప్రతి రోజూ ప్రాతః సంధ్యావందనము, ఉత్తర సంధ్యావందనము విధిగా ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశములో(దేశములో) ఉన్నా సంధ్యావందనము తప్పనిసరి.
సూర్యోదయమునకు ముందు శౌచముతో శుచిగా(స్నానం చేసి)తూర్పు దిశగా కుడి కాలును సగం మడచి ఎడమకాలును పూర్తిగా మడచి, గొంతుకు కూర్చొని అంటే (ఎడమ కాలు మడిము మీద పృష్టభాగము పిర్రలు ఆనించి) పృష్టభాగము(ముడ్డి,గుదము) నేలను(భూమిని) తాకకుండా కూర్చొని, ఆచమనం చేయాలి. అలా ఆచమనం చేయడం వలన స్థూల, సూక్ష్మ, కారణ శరీరము యందలి తాపములు, వెంటనే ఉప శాంతిని పొందుతాయి.అపుడు మనస్సు నిలబడుతుంది.
ఎప్పుడు ఆచమనం చేసినా ఇదే విధానంలో చేయాలి.
ముఖ్య గమనిక :-
********************************
సంద్యావందనసమయములో తుమ్మడం, దగ్గడం, అపానవాయువును (పిత్తులు, చెడు గాలిని) వదలడం జరిగిన వెంటనే ఆచమనము చేసి కుడిచేతితో కుడిచెవినితాకలి లేదా తడిగా ఉన్న భూమిని తాకాలి.
“ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్తాంగతో పివా!
యస్స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచిరి!”
అంటూ శిరస్సు మీద జలము(శుద్ద జలము)కుడి చేతి బొటన వ్రేలితో శిరస్సు మీద చల్లుకొనుచూ
ఓం పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్షాయ నమః”
కేశవ నామాలు ఆచమనం.
కుడి కాలును సగం మడచి ఎడమ కాలును పూర్తిగా మడచి రెండు కాళ్ళ మీద పృష్టభాగము భూమికి తగులకుండా కాళ్లపైనే కూర్చొని(గొంతుకు)కూర్చొని ఆచమనం చేయాలి.
కుడిచేతి చూపుడు వ్రేలుకు, మధ్య వ్రేలుకు మధ్య, బొటన వ్రేలును ఉంచి, చూపుడు వ్రేలుతో బొటన వ్రేలిని అదిమి పట్టుకొని మిగతా వ్రేళ్లను చాపి ఉంచి, అంటే గోకర్ణాకృతిలో ఉంచి, ఎడమ చేతితో పంచపాత్రలోని శుద్దజలమును కేవలం మినపగింజ మునుగు నంత జలమును, ఉద్ధరణితో కుడిచేతిలో వేసుకొని (తీసుకొనేటప్పుడు కుడి చేతి అరచేతి చివరి భాగమును క్రింది పెదవికి ఆనించి శబ్దము రాకుండా) ముందుగా
“ఓం కేశవాయ స్వాహా” అని చెప్పుకొని శబ్దము రాకుండా, జుర్రకుండా ఆ జలమును నోటిలోకి తీసుకొనవలయును. అలా తీసుకొన్న నీరు కడుపులో బొడ్డు వరకూ దిగిన తర్వాత మరలా
“ఓం నారాయణాయ స్వాహా” అని చెప్పుకొని శబ్దము రాకుండా, జుర్రకుండా ఆ జలమును నోటిలోకి తీసుకొనవలయును.
అలా తీసుకొన్న నీరు కడుపులో బొడ్డు వరకూ దిగిన తర్వాత మరలా
“ఓం మాధవాయ స్వాహా” అని చెప్పుకొని శబ్దము రాకుండా, జుర్రకుండా ఆ జలమును నోటిలోకి తీసుకొనవలయును.
అలా తీసుకొన్న నీరు కడుపులో బొడ్డు వరకూ దిగిన తర్వాత మరలా
“ఓం గోవిందాయ నమః” అని చెప్పుకొనుచూ కుడిచేతిలోని జలమును, ఎడమ వైపు కాలు ప్రక్కన వదలవలయును.
ఎప్పుడు ఆచమనము చేసినా ఇదే పద్దతిన చేయవలయును.
నమస్కారము చేయుచూ ఈ క్రింది నామములు, భక్తితో త్రికరణ శుద్దిగా అంటే మనము ఉచ్ఛరించే ప్రతినామమూ యొక్క రూపమును, హృదయమునందు ఊహించుకొనుచూ శ్రద్ధాభక్తులతో మనో నేత్రముతో స్వామి వారి రూపమును చూచుచూ తదేక ధ్యానముతో ఉచ్చరించవలయును. (కరన్యాస ప్రక్రియ కూడా కలదు) చేయ దలచిన వారు చేయవచ్చు లేదా నామములను మాత్రమే కూడా ఉచ్ఛరించవచ్చు.
ఓం విష్ణవే నమః
ఓం మధుసూధనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోధరాయ నమః
ఓం సంకర్షనాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్దాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అదోక్షజాయ నమః
ఓం నరసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్థనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీ కృష్ణాయ నమః
భూశుద్ది :-
*******************************
ఈ మంత్రం చెప్తూ కొద్ది శుద్దజలమును కుడిచేతిలోనికి తీసుకొని మన చుట్టూ చల్లుకోవలయును. ఎందుకంటే మన గృహంలో నిన్నటి రోజున సింహాసనమునకు చేసిన అలంకారము మరియు భగవంతునికి సమర్పించిన ధూపదీప నైవేద్య ఫల పుష్పఫలాది నిర్మల్యాన్ని మనకంటే ముందు భూత పిశాచములు ఆ నిర్మాల్యాన్ని తీయడానికి ప్రయత్నిస్తాయి.
అందుకొరకు మనము సూర్యోదయానికి పూర్వమే ఆ పని చేయాలి. అందుకొరకు ఈ మంత్రం.
“ఉత్తిష్ఠంతు భూతపిశాచాః యేతే భూమి భారకాః
ఏ తేషా మా విరోధేన బ్రహ్మ కర్మ
సమారంభే ||”
ఈ మంత్రం చెప్పుకొన్న తర్వాత రెండు అక్షింతలు తీసుకొని వాసన చూచి వెనుకకు వేసుకోవలయును.
శ్లో || శుక్లాం భరధరం విష్ణుమ్ శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే ||
శ్లో|| అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దంతం భక్తానాం ఏక దంతం ఉపాస్మహే ||
అని చెప్పుకొని వినాయకుని కి కొద్ది అక్షింతలు, పసుపు, కుంకుమ, పూలు, సమర్పించాలి.
శ్లో || ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్.
శ్లో || సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యేత్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే||
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః
ఓం శ్రీ ఉమామహేశరాభ్యాం నమః
ఓం శ్రీ వాణీ హిరణ్యాగర్భాభ్యాం నమః
ఓం శ్రీ శచీ పురందరాభ్యాం నమః
ఓం శ్రీ అరుంధతీ వశిష్టాభ్యాం నమః
ఓం శ్రీ సీతారామాభ్యాం నమః
ఓం శ్రీ మైత్రేయీ కాత్యాయనీ సహిత యాజ్ఞ వల్కాభ్యాం నమః
ఓం శ్రీ సర్వదిగ్దేవతాభ్యాం నమః
ఓం శ్రీ సర్వభూదేవతాభ్యాం నమః
ఓం శ్రీ గ్రామదేవతాభ్యాం నమః
ఓం శ్రీ గృహదేవతాభ్యాం నమః
ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యాం నమః
ప్రాణాయామం:- తూర్పు వైపుకు తిరిగి గొంతుకు కూర్చొని ప్రాణాయామం చేయాలి.
పూరకం:- కుడి బొటన వ్రేలు ఉంగరపు వ్రేలుతో, ముక్కును పట్టుకొని, మధ్య వ్రేలినిలోనికి ముడువ వలెను. బొటన వ్రేలును కుడి ముక్కు పైన ఉంగరపు వ్రేలును ఎడమ ముక్కుపైన ఉంచి. ఎడమ ముక్కును మూసి కుడి ముక్కుతో, గాలి వదులుతూ, కుడి ముక్కును మూసి, ఎడమ ముక్కుతో, గాలిని పీల్చుతూ, చేయునది పూరకం.
“ ఓం భూః ,ఓం భువః, ఓం స్వః,ఓం మహః, ఓం జనః,ఓం తపః,ఓం సత్యం.”
కుంభకం:- రెండు ముక్కులు మూసి గాలిని లోపల బంధించడం.కుంభకం చేస్తూ
“ఓం తత్స వితుర్వరే ణ్యం భర్గోదేవస్య ధీ మహి! ధీయోయోనః ప్రచోదయాత్!
ఓ మాపో జ్యొతీ రపోమృతం బ్రహ్మ ”
రేచకం:- ఎడమముక్కును మూసి, కుడిముక్కుతో గాలిని పూర్తిగా వదలడం.
కుడిముక్కునుండి గాలిని వదులుతూ
“భూర్భువ స్సువరోమ్ ”
అని చెప్పిన తర్వాత కుడిచేతితో కుడిచివిని తాకవలెను.
ఎప్పుడు ప్రాణాయామము చేసినా ఇదేవిధముగా చేయాలి. సందర్భము ఏదైనా ఇందుకు భిన్నముగా ప్రాణాయామము చేయరాదు.
సంకల్పము:-
కరన్యాసము :- ఎడమ అరచేతిపై కుడి అరచేతిని అడ్డముగా బోర్లించిరెండు చేతులు కలిపి కుడి మోకాలుపై ఉంచి సంకల్పము చెప్పవలయును.
మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞ్యాయా ప్రవర్తమా నస్య ఆద్య బ్రాహ్మణ, ద్వితీయ, పరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వర, మన్వంతరే,కలియుగే, ప్రధమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరుహో, దక్షిణదిగ్భాగే, శ్రీ శైలస్య, ఈశాన్య ప్రదేశే, సమస్త బ్రాహ్మణ, హరి హర, గురు చరణ, సన్నిధౌ, అస్మిన్, వర్తమానస్య, వ్యావహారిక చాంద్రమనేనా,
శ్రీ .........................(శుభకృత్) నామసంవత్సరే, ..................(ఉత్తరాయణే) ఆయనే, .............. (వర్ష) ఋతౌ, ................ (వైశాఖ) మాసే,...........(శుక్ల) పక్షే, ........... (చవితి) తిధౌ, ........ (శుక్ర) వాసరే, శుభ నక్షత్రే, (బ్రాకెట్లలో చూపిన సంవత్సర, ఆయన,ఋతు, మాస, పక్ష, తిధి, వారములు పేర్లు ఉదాహరణకు మాత్రమేనని గ్రహింప గలరు) శుభయోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ, విశిష్టాయామ్, శుభ తిధౌ శ్రీ పరమేశ్వర ముద్దిశ్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, ప్రాతః సంధ్యా, (ఎడమ చేతిలోని ఉద్దరిణితో జలము తీసుకొని కుడిచేతిని పాత్ర పైన ఉంచి ఉద్ధరిణిలోని జలమును కుడిచేతి మీదుగా పాత్రలోనికి వదలుతూ) ముపాశిష్యే, (అనిచెప్పుకోవాలి).
శుద్ధోదక స్నానం:-
ఉద్దరిణితో జలము తీసుకుని కుడి చేతి బొటన వ్రేలిని ఉద్దరణిలోని జలములో ముంచి తలపై చల్లుకొనుచూ ఈ క్రింది మంత్రమును అను సంధానము చేయవలయును. బ్రాకెట్లో (జ) అని ఉన్న చోటుకు ముందు ఆపి జలమును తలపై చల్లుకొనుచూ ఈ మంత్రమును అను సంధానము చేయవలయును.
ఓం “ ఆపోహిష్ఠమయో (జ) భువహ తాన ఊర్జే (జ)
తధా తన! మహేరాణా య చక్షసే (జ) యోవ శ్శివత యో రస్సః (జ)
తస్య భాజయతే హనః (జ) ఉశ తీరివ (జ) మాతరః (జ)
తస్మా ఆరంగ మామ వో (జ) యస్యక్షయాయ జిన్వథ! (జ)
అపో జనయథా చనః!” (జ)
ప్రాతఃస్సంధ్యా వందనములో
అనుసంధానించవలసిన మంత్రము
గోకర్ణాకృతిలో ఉంచుకుని యున్న కుడి చేతిలో జలము తీసుకుని
“ సూర్యశ్చేత్యస్య మంత్రస్య నారాయణ ఋషిః, ప్రకృతీ బంధః
సూర్య మామన్యు పాతయ రాత్రిర్దేవతాః జలాభి మంత్రణే వినియోగః”
మంత్రము:-
“ ఓం సూర్యశ్చ మామ న్యుశ్చ మన్యు పతయశ్చ మన్యు కృతేభ్యః
పాపే భ్యో రక్షన్తాo యద్రా త్ర్యా పాపమ కారుషం
మనసా వాచా హస్తా భ్యాం పద్భ్యా ముదరెణ శిశ్నా
రాత్రి స్తద వలుంపతు యత్కించ దురితం మయి
ఇద మహం మామ మృత యోనౌ సూర్యేజ్యోతిషి జుహోమిస్వాహా !!”
అని సంధానించుకొని చేతిలోని జలమును త్రాగవలెను.
ప్రాతః సంధ్యావందనం సంపూర్ణం✍️
ధన్యవాదాలు చదివినవారికి.🙏
(తప్పులు వుంటే మన్నించ ప్రార్ధన)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
*మణి ద్వీప వర్ణన*
➖➖➖
మహాశక్తి మణిద్వీప నివాసినీ
ముల్లోకాలకు మూలప్రకాశినీ |
మణిద్వీపములో మంత్రరూపిణీ
మన మనసులలో కొలువైయుంది || ౧ ||
సుగంధ పుష్పాలెన్నో వేలు
అనంత సుందర సువర్ణ పూలు |
అచంచలంబగు మనో సుఖాలు
మణిద్వీపానికి మహానిధులు || ౨ ||
లక్షల లక్షల లావణ్యాలు
అక్షర లక్షల వాక్సంపదలు |
లక్షల లక్షల లక్ష్మీపతులు
మణిద్వీపానికి మహానిధులు || ౩ ||
పారిజాతవన సౌగంధాలు
సూరాధినాధుల సత్సంగాలు |
గంధర్వాదుల గానస్వరాలు
మణిద్వీపానికి మహానిధులు || ౪ ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
పద్మరాగములు సువర్ణమణులు
పది ఆమడల పొడవున గలవు |
మధుర మధురమగు చందనసుధలు
మణిద్వీపానికి మహానిధులు || ౫ ||
అరువది నాలుగు కళామతల్లులు
వరాలనొసగే పదారు శక్తులు |
పరివారముతో పంచబ్రహ్మలు
మణిద్వీపానికి మహానిధులు || ౬ ||
అష్టసిద్ధులు నవనవనిధులు
అష్టదిక్కులు దిక్పాలకులు |
సృష్టికర్తలు సురలోకాలు
మణిద్వీపానికి మహానిధులు || ౭ ||
కోటిసూర్యుల ప్రచండ కాంతులు
కోటిచంద్రుల చల్లని వెలుగులు |
కోటితారకల వెలుగు జిలుగులు
మణిద్వీపానికి మహానిధులు || ౮ ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
కంచు గోడల ప్రాకారాలు
రాగి గోడల చతురస్రాలు |
ఏడామడల రత్నరాశులు
మణిద్వీపానికి మహానిధులు || ౯ ||
పంచామృతమయ సరోవరాలు
పంచలోహమయ ప్రాకారాలు |
ప్రపంచమేలే ప్రజాధిపతులు
మణిద్వీపానికి మహానిధులు || ౧౦ ||
ఇంద్రనీలమణి ఆభరణాలు
వజ్రపుకోటలు వైఢూర్యాలు |
పుష్యరాగమణి ప్రాకారాలు
మణిద్వీపానికి మహానిధులు || ౧౧ ||
సప్తకోటిఘన మంత్రవిద్యలు
సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు |
శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు
మణిద్వీపానికి మహానిధులు || ౧౨ ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
మిలమిలలాడే ముత్యపు రాశులు
తళతళలాడే చంద్రకాంతములు |
విద్యుల్లతలు మరకతమణులు
మణిద్వీపానికి మహానిధులు || ౧౩ ||
కుబేర ఇంద్ర వరుణ దేవులు
శుభాల నొసగే అగ్నివాయువులు |
భూమి గణపతి పరివారములు
మణిద్వీపానికి మహానిధులు || ౧౪ ||
భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు
పంచభూతములు పంచశక్తులు |
సప్తఋషులు నవగ్రహాలు
మణిద్వీపానికి మహానిధులు || ౧౫ ||
కస్తూరి మల్లిక కుందవనాలు
సూర్యకాంతి శిల మహాగ్రహాలు |
ఆరు ఋతువులు చతుర్వేదాలు
మణిద్వీపానికి మహానిధులు || ౧౬ ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
మంత్రిణి దండిని శక్తిసేనలు
కాళి కరాళీ సేనాపతులు |
ముప్పదిరెండు మహాశక్తులు
మణిద్వీపానికి మహానిధులు || ౧౭ ||
సువర్ణ రజిత సుందరగిరులు
అనంగదేవి పరిచారికలు |
గోమేధికమణి నిర్మితగుహలు
మణిద్వీపానికి మహానిధులు || ౧౮ ||
సప్తసముద్రములనంత నిధులు
యక్ష కిన్నెర కింపురుషాదులు |
నానాజగములు నదీనదములు
మణిద్వీపానికి మహానిధులు || ౧౯ ||
మానవ మాధవ దేవగణములు
కామధేనువు కల్పతరువులు |
సృష్టి స్థితి లయ కారణమూర్తులు
మణిద్వీపానికి మహానిధులు || ౨౦ ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
కోటి ప్రకృతుల సౌందర్యాలు
సకల వేదములు ఉపనిషత్తులు |
పదారురేకుల పద్మశక్తులు
మణిద్వీపానికి మహానిధులు || ౨౧ ||
దివ్యఫలములు దివ్యాస్త్రములు
దివ్యపురుషులు ధీరమాతలు |
దివ్యజగములు దివ్యశక్తులు
మణిద్వీపానికి మహానిధులు || ౨౨ ||
శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు
జ్ఞానముక్తి ఏకాంత భవనములు |
మణినిర్మితమగు మండపాలు
మణిద్వీపానికి మహానిధులు || ౨౩ ||
పంచభూతములు యాజమాన్యాలు
ప్రవాళసాలం అనేక శక్తులు |
సంతానవృక్ష సముదాయాలు
మణిద్వీపానికి మహానిధులు || ౨౪ ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
చింతామణులు నవరత్నాలు
నూరామడల వజ్రపురాశులు |
వసంతవనములు గరుడపచ్చలు
మణిద్వీపానికి మహానిధులు || ౨౫ ||
దుఃఖము తెలియని దేవీసేనలు
నటనాట్యాలు సంగీతాలు |
ధనకనకాలు పురుషార్ధాలు
మణిద్వీపానికి మహానిధులు || ౨౬ ||
పదునాలుగు లోకాలన్నిటి పైన
సర్వలోకమను లోకము కలదు |
సర్వలోకమే ఈ మణిద్వీపము
సర్వేశ్వరికది శాశ్వత స్థానం || ౨౭ ||
చింతామణుల మందిరమందు
పంచబ్రహ్మల మంచముపైన |
మహాదేవుడు భువనేశ్వరితో
నివసిస్తాడు మణిద్వీపములో || ౨౮ ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
మణిగణఖచిత ఆభరణాలు
చింతామణి పరమేశ్వరిదాల్చి |
సౌందర్యానికి సౌందర్యముగా
అగుపడుతుంది మణిద్వీపములో || ౨౯ ||
పరదేవతను నిత్యముకొలచి
మనసర్పించి అర్చించినచో |
అపారధనము సంపదలిచ్చి
మణిద్వీపేశ్వరి దీవిస్తుంది || ౩౦ ||
నూతన గృహములు కట్టినవారు
మణిద్వీపవర్ణన తొమ్మిదిసార్లు |
చదివిన చాలు అంతా శుభమే
అష్టసంపదల తులతూగేరు || ౩౧ ||
శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి
మణిద్వీప వర్ణన చదివిన చోట |
తిష్టవేసుకుని కూర్చొనునంట
కోటిశుభాలను సమకూర్చుటకై || ౩౨ ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
ఎమ్మెస్ సుబ్బలక్ష్మి,రాధా విశ్వనాధన్
*శ్రీ వేంకటేశ కరావలంబ స్తోత్రం* (Sri Venkatesa Karavalamba Stotram)
శ్రీ శేషశైల సునికేతన దివ్య మూర్తే
నారాయణాచ్యుతహరే నళినాయతాక్ష!
లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!
*రాధ హృదయం*
➖➖➖
*కృష్ణుడు ఇచ్చిన వివరణ:*
*ఒకసారి శ్రీకృష్ణుడు తన పరివారంతో సిద్ధాశ్రమ తీర్థంలో స్నానాలు ఆచరించడానికి వెళ్ళాడు.*
*కాకతాళీయంగా రాధ తన నేస్తాలతో అక్కడకు రావడం తటస్థించింది.*
*రెండు వైపుల వారు ఆకస్మికంగా ఆ పుణ్యతీర్ధంలో అలా కలుసుకున్నందుకు ఎంతో సంతోషించారు; పరస్పరం ముచ్చట్లు చెప్పుకొని, సంభాషించి ఆనందించారు.*
*రాధ ఘనతను స్వయంగా కృష్ణుని ముఖతా ఆయన రాణులు విని ఉన్నారు. కాబట్టి వారు అదను చూసి రాధను ఒక ఏకాంత ప్రదేశంలో కలుసుకున్నారు.*
*రాధ కూడా ఆప్యాయంగా వారిని ఆహ్వానించి, ఉపచర్యలు చేసింది. మాటల సందర్భంలో ఆమె…, "సోదరీమణులారా! చంద్రుడు ఒక్కడే ఉన్నాడు; కాని చకోరాలు అనేకం" అనే అర్థం వచ్చే శ్లోకం చెప్పింది…*
*చంద్రో యథైకో బహవ చ్చకోరాః*
*సూర్యో యథైకో బహవోదృశస్యః |*
*శ్రీకృష్ణచంద్రో భగవాం స్తథైవ*
*భక్తా భగిణ్యో భహవో వయం చ ॥*
*"శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కరే; సోదరీమణులమైన మనం అందరమూ ఆయన భక్తురాండ్రం" అన్నది రాధ.*
*రాధ చెప్పింది విని రాణులు ఎంతో ఆశ్చర్యపోయారు. రాధను మరీ బలవంతపెట్టి తమ విడిదికి ఆహ్వానించి, తోడ్కొని వెళ్ళారు.*
*అక్కడ రాధకు రాజోపచారం లభించింది. ఆమె రాకకు రాణులు అందరూ ఎంతో సంతోషించారు. అందరూ కలసి ఆనందంగా మాట్లాడుకుంటూ.. విందు భోజనం ఆరగించారు.*
*చివరికి రుక్మిణీదేవి తానే స్వయంగా రాధకు ఒక స్వర్ణపాత్రలో పాలు ఇచ్చి, త్రాపించింది. ఆ తరువాత కాసేపు ముచ్చట్లు చెప్పుకొని రాధ తన బసకు తిరిగి వెళ్ళిపోయింది.*
*రాత్రి పొద్దుబోయింది. అందరూ నిద్రించడానికి వెళ్ళారు. దైనందిన ఆనవాయితీ ప్రకారం కృష్ణుని పాదాలు ఒత్తడానికి రుక్మిణి ఆయన పక్కన కూర్చుంది. కృష్ణుని అరికాళ్ళ వంక చూసేసరికి రుక్మిణి విస్తుపోయింది. అరికాళ్ళు మొత్తం బొబ్బలెక్కి ఉన్నాయి!*
*దిగ్భ్రాంతికి గురైన రుక్మిణి వెంటనే తక్కిన రాణులను పిలిచి విషయం తెలిపింది.*
*వారూ కృష్ణుని అరికాళ్ళు బొబ్బలతో నిండి ఉండటం చూసి అవాక్కయ్యారు. భగవానుని ఎలా అడగటం? ఎవరూ సాహసించలేకపోయారు.*
*చివరికి కృష్ణుడు కళ్ళు తెరిచి రాణులంతా అక్కడ గుమిగూడి ఉండటం చూసి కారణం ఏమిటని అడిగాడు.*
*అందుకు జవాబుగా వారు భగవానుని అరికాళ్ళు బొబ్బలెక్కి ఉండటం చూపించారు.*
*మొదట్లో కృష్ణుడు ఆ విషయాన్ని దాటవేయజూశాడు. కాని రాణులు వదల్లేదు. వారు మరీ బలవంతపెట్టడంతో ఆయన వారితో ఇలా చెప్పాడు: “రాధ హృదయంలో నా పాదపద్మాలు సదా సర్వవేళలా నెలకొని ఉంటాయి.*
*నువ్వు బాగా వేడిగా ఉన్న పాలు రాధకు ఇచ్చావు. స్వయంగా నువ్వు ఇవ్వడం వలన రాధ మారుమాట్లాడక అలాగే ఆపాలను తాగింది. పాలు లోపలకు, హృదయంలోకి వెళ్ళడంతో నా అరికాళ్ళు ఆ వేడిని భరించలేక బొబ్బలెక్కాయి. ఇది సహజమే కదా!"*
*పతిదేవుని వచనాలు విన్న రాణులు నోట మాట రాక నిలబడిపోయారు.*
*నాటి నుండి కృష్ణుని పట్ల రాధకు ఉన్న హిమాలయమంత భక్తిప్రపత్తుల ముందు తమవి లెక్కలోకి రావని రాణులు గ్రహించారు.*
*రాధ ఔన్నత్యాన్ని తెలిపే ఈ సంఘటన ‘జాతకసంహిత’లో చోటుచేసుకుని ఉంది.*
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
*ఏడడుగుల బంధం…*
*పెళ్లిలో తంతు వెనుక అర్థం:*
➖➖➖
*పెళ్లంటే... రెండు మనసుల కలయిక, నూరేళ్ల సాన్నిహిత్యం... వైవాహిక జీవితంలో ప్రమాణాలు కట్టుబడి ఉంటే ఆ సంసారం స్వర్గం. ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకం. మానవజీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం. ఆ సందర్భంలో వధూవరులతో చేయించే ప్రతి కార్యక్రమానికి ప్రాధాన్యత ఉంది.*
*జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువకాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. ఆ బంధం పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు. వాటినే లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు.*
*ఆప్రమాణాలను త్రికరణశుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతుంది.*
*ఇక ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలను ఒకటిగా చేసేదే వివాహ బంధం.*
*హిందూ సంప్రదాయంలో జరిగే ప్రతి క్రతువుకూ ఓ ప్రత్యేకత ఉంది. కన్యాదానం పూర్తయిన తర్వాత ముహూర్తానికి జీలకర్ర-బెల్లం తలపై పెట్టించి, ఆ తర్వాత మాంగల్యధారణ చేయిస్తారు. ఇది పూర్తయిన తర్వాత వధూవరులకు కొంగుముడి కలిపి బ్రహ్మముడి వేస్తారు. వధువు చిటికెన వేలును పట్టుకుని వరుడు అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఏడు అడుగులు నడవడాన్ని ‘సప్తపది’ అంటారు. దీనికి విశేష ప్రాధాన్యత ఉంది. భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి, పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం.*
*అందుకే పెద్దలు వివాహబంధాన్ని ఏడడుగుల బంధం అంటారు. ఇందులో వేసే ప్రతీ అడుగుకీ ఒక్కో అర్థం ఉంది.*
**మొదటి అడుగు:*
*‘ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు’ ఆ విష్ణువు మనిద్దరినీ ఒక్కటిగా చేయుగాక!*
**రెండో అడుగు:*
*‘ద్వే వూర్జే విష్ణుః త్వా అన్వేతు’*
*ఇద్దరికీ శక్తి లభించేలా చేయుగాక!*
**మూడో అడుగు:*
*‘త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు’*
*వివాహ వ్రతసిద్ధి కోసం విష్ణువు అనుగ్రహం లభించుగాక!*
**నాలుగో అడుగు:*
*‘చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు’*
*మనకు ఆనందాన్ని విష్ణువు కల్గించుగాక!*
**అయిదో అడుగు:*
*‘పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు’*
*మనకు పశుసంపదను విష్ణువు కల్గించుగాక!*
**ఆరో అడుగు:*
*‘షడృతుభ్యో విష్ణుః త్వా అన్వేతు’*
*ఆరు రుతువులు మనకు సుఖమిచ్చుగాక!*
**ఏడో అడుగు:*
*‘సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు’*
*గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణువు అనుగ్రహించుగాక!*
*‘ఓ అర్ధాంగీ ఏడడుగులతో నువ్వు నా ప్రాణసఖివి అయ్యావు. ఎల్లప్పుడూ నువ్వు నా స్నేహాన్ని వీడవద్దు. ప్రేమగా ఉందాం. మంచి మనసుతో జీవిద్దాం. మన ఇద్దరం సమానమైన ఆలోచనలతో మెలగుదాం’ అంటాడు వరుడు.*
*అప్పుడు వధువు ‘ఓ ప్రాణ సఖుడా! నువ్వెప్పుడూ పొరపాటు చేయకుండా ఉండు. నేనూ ఏ పొరపాటు చేయక నీవెంటే ఉంటాను. నువ్వు ఆకాశమైతే నేను భూమి... నువ్వు శుక్రమైతే నేను శోణితాన్ని... నువ్వు మనసైతే నేను మాట... నేను సామవేదమైతే నువ్వు నన్ను అనుసరించే ఋత్వికుడివి... మనిద్దరిలో వ్యత్యాసం లేదు. కష్ట సుఖాలలో ఒకరికొకరం తోడూ నీడగా కలిసి ఉందాం’ అంటుంది.*
*‘ఓ గుణవతీ! మన వంశాభివృద్ధికి, మనకు ఉత్తమస్థితి కలగడానికి, మంచి బలం, ధైర్యం, ప్రజ్ఞావంతులై వంశ హితాన్ని రక్షించగల, న్యాయమార్గం అనుసరించే ఉత్తమ సంతానాన్ని ప్రసాదించు’ అని పురుషుడు చెబుతాడు.*
*భార్య చిటికిన వేలును భర్త చిటికిన వేలుతో పట్టుకోమని ‘బ్రహ్మ ముడి’ వేస్తారు. భార్యభర్తలు ఇద్థరు ఒకరిని ఒకరు విడిచి ఉండకూడదు. ప్రయాణమైనా, పుణ్యక్షేత్రమైనా, మోక్షమైనా, అరణ్యవాసమైనా భార్యా భర్తలు కలిసే ఉండాలి. భార్యాభర్తలుగా మారటం అంటే ఇద్థరి శరీరాలు ఒకే ప్రాణంగా మనుగడ సాగించటం. భార్యాభర్తల మధ్య ఎన్ని మనస్పర్ధలు ఉన్నా వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ముడి, అంటే వీళ్ళ ఇద్థరి మధ్య ఇంకొకరు దూరటానికి వీలు లేకుండా ఉండాలని, అలా ఉండిపోవాలని గోరంత అవకాశం దొరికినా ఆ అదును చూసుకొని మూడో వ్యక్తి చొరబడతాడని- ఎటువంటి పరిస్థితులలో ఐనా భర్తతోనే జీవితం అనుకోవాలని వథువుకి, భార్యే సర్వస్వంగా అనుకోవాలని వరుడీకి చెప్పి బ్రహ్మ ముడి వేస్తారు -" అంటే ఇరువురి శరీరాలను ఒకే ప్రాణంగా మార్చటం అన్నమాట!*
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
*దేవాలయానికి వెళ్ళినపుడు ఘంట* *మూడు సార్లే ఎందుకు కొట్టాలి. తెలుసా ?*
*శ్లోకము :*
*ఏకతాడే మరణం చైవ*
*ద్వితాడే వ్యాధి పీడనం* !
*త్రితాడే సుఖమాప్నోతి తత్ఘంటానాదలక్షణం* ! !
భావం : దేవుని ముందర *ఘంట ఒకసారి మాత్రమే కొట్టి ఊరుకుంటే అది మన మరణానికి* సంకేతం .
*రెండుసార్లు కొట్టి ఊరుకుంటే వ్యాధుల ద్వారా పీడింపబడతాము* . '
*మూడుసార్లు ఘంటానాదం చేయడం చేత శరీరమునకు , మనస్సుకు సుఖము కలుగుతుంది*.
ఈ పద్దతిని *దేవాలయ ఘంటా నాద లక్షణము* గా శాస్త్రం చెప్పబడింది .
( దేవాలయంలో ఘంటానాదం ద్వారా జనించే ఓంకార ధ్వని తరంగాలను మన చెవుల ద్వారా శరీరంలోకి శబ్ద తరంగాలకు అనుసంధానం చేయండి తద్వారా మానసిక ప్రశాంతతను పొందండి ).
🕉️శ్రీ ఆంజనేయస్వామి నవరత్న మాలా స్తోత్రం🍌
🌹తతో రావణ నీతాయాః సీతాయా శత్రు కర్శన:|
ఇయేష పడమన్వేష్టుం చారణాచరితే పథి|| (మాణిక్యం )
యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యధా తవ|
స్మృతిర్మ తిర్ ధృతి ర్దాక్ష్యం స కర్మసు నా సీదతి|| (ముత్యం )
అనిర్వేదః శ్రియ మూలం అనిర్వేదః పరం సుఖం |
అనిర్వేదో హాయ్ సతతం సర్వార్థేషు ప్రవర్తకః|| (ప్రవాళం )
నమోస్తు రామయ స లక్ష్మణా య దేవ్యై చ తస్మై జనకాత్మజాయై |
నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః || (మరకతం )
ప్రియన్న సంభవేద్దు:ఖం అప్రియాదధికం భయం|
తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం|| (పుష్య రాగము )
రామః కమలపత్రాక్షః సర్వసత్త్వమనోహరః |
రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే || (హీరకము )
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః |
దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్ట కర్మణః || (ఇంద్ర నీలము )
యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః |
యది వాస్త్యేకపత్నీత్వం శీతో భావ హనూమతః|| (గో మేదికము )
నివ్రుత్తవనవాసం తం త్వయా సార్థమరిందమం |
అభిషిక్తమ యోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం ||(వైడూర్యం )
*శుభ శుభోదయం*
🍌🙏🐒🙏🐒🙏🐒🙏🍌
శుభోదయం..
💐 33 కోట్ల దేవతలు ఎవరు..? 💐
హిందువులను విరోధించువారు… మీ 33 కోటి దేవతల పేర్లు ఏమని ప్రశ్న అడిగి వెక్కిరిస్తారు. హిందువులు కూడ ఈ ప్రశ్న విని విచలితులవుతారు.
అసలు ఈ కోటి అను పదముయొక్క అర్థమును సంపూర్ణముగా మరుగునపరచి మెకాలే, ముల్లర్ వంటివారు తమకు కావలసిన ఒక మత ధర్మమునకు అనుకూలమగునటుల చరిత్ర ను తీర్చి తిద్ది తెలివిమంతులు అనిపించుకొన్నారు.
వేదపురాణములు తెలుపునట్టి త్రయ త్రింశతి కోటి (33కోటి) దేవతలు మరియు వారి పేర్లు మరియు హిందూ ధార్మిక సాహిత్య మందు ఉల్లేఖించబడిన 33 కోటి దేవతలు ఎవరు వారి పేర్లు ఏమి అని తెలుసా..?
హిందూ ధర్మ - సంస్క్రతియందు 33 కోటి దేవతల ఉల్లేఖన ఉంది. మిక్కిలి జనులు ఇక్కడ 'కోటి' అంటే సంఖ్య అనుకొన్నారు. మరియు 33 కోట్ల పేర్లను చెప్పమని బలవంతం చేస్తారు. వాస్తవముగా ఈ 'కోటి' సంఖ్యను సూచించే ' కోటి ' కాదు.
సంస్క్రతములో 'కోటి' అనగా 'విధము' 'వర్గము' (type) అని అర్థము ఉంది.
ఉదా: ఉచ్ఛకోటి. దీని అర్థం ఉచ్ఛమైన వర్గమునకు చేరిన వారు అని అర్థం.
అలాగే మరియు ఉదాహరణము: సప్త కోటి బుద్ధులు. దీని అర్థం ఏడు ప్రధాన బుద్ధులు.
యజుర్వేద, అథర్వణ వేద, శతపథ బ్రాహ్మణులు మొదలైన ప్రాచీన కృతులందు 33 విధముల దేవతలను ఉల్లేఖించారు. వీరే త్రయత్రింశతి కోటి (33కోటి) దేవతలు.
హిందూ గ్రంధములేకాదు బౌద్ధ, పార్శీ మొదలైనవి కూడ 33 దేవవర్గముల గురించి తెలుపుతాయి. బౌద్ధుల దివ్యవాదము మరియు సువర్ణప్రభాస సూత్రములందు వీటి ఉల్లేఖన ఉన్నది.
ఇపుడు దేవతల ఈ 33వర్గములనూ, అందులో వచ్చు దేవతల పేర్లనూ చూద్దాము:
12 ఆదిత్యులు (ద్వాదశాదిత్యులు) :
1. త్వష్ట, 2. పూష. 3.వివస్వాన్ 4. మిత్ర 5. ధాతా 6. విష్ణు 7. భగ. 8. వరుణ 9. సవితృ 10. శక్ర 11.అంశ 12. ఆర్యమ.
11 రుద్రులు (ఏకాదశ రుద్రులు):
1.మన్యు 2. మను 3. మహినస 4. మహాన్ 5. శివ 6. ఋతధ్వజ 7. ఉగ్రరేతా 8. భవ 9 కాల 10. వామదేవ 11. ధృతవృత.
8 వసువులు(అష్టవసువులు):
1. ధరా 2. పావక 3 అనిల 4. అప 5. ప్రత్యుష 6. ప్రభాస 7. సోమ 8 ధ్రువ.
మరి ఇద్ధరు: 1. ఇంద్ర 2. ప్రజాపతి.
త్రయత్రింశతి (33) కోటి దేవతలు ఎవరని తెలిసినది కదా! ఈ పేర్లను కంఠపాఠము చేయునది చాలా సులభము. ఎవరైననూ ఇపుడు 33కోటి దేవతల పేర్లను చెప్పమంటే వెనుక ముందు చూడవలసిన అవసరమే లేదు! కదా?