.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

4, డిసెంబర్ 2022, ఆదివారం

*కృష్ణుడు ఇచ్చిన వివరణ

 *రాధ హృదయం*

         ➖➖➖

      *కృష్ణుడు ఇచ్చిన వివరణ:* 


*ఒకసారి శ్రీకృష్ణుడు తన పరివారంతో సిద్ధాశ్రమ తీర్థంలో స్నానాలు ఆచరించడానికి వెళ్ళాడు.*


*కాకతాళీయంగా రాధ తన నేస్తాలతో అక్కడకు రావడం తటస్థించింది.*


*రెండు వైపుల వారు ఆకస్మికంగా ఆ పుణ్యతీర్ధంలో అలా కలుసుకున్నందుకు ఎంతో సంతోషించారు;      పరస్పరం ముచ్చట్లు చెప్పుకొని, సంభాషించి ఆనందించారు.*


*రాధ ఘనతను స్వయంగా కృష్ణుని ముఖతా ఆయన రాణులు విని ఉన్నారు. కాబట్టి వారు అదను చూసి రాధను ఒక ఏకాంత ప్రదేశంలో కలుసుకున్నారు.*


*రాధ కూడా ఆప్యాయంగా వారిని ఆహ్వానించి, ఉపచర్యలు చేసింది. మాటల సందర్భంలో ఆమె…, "సోదరీమణులారా! చంద్రుడు ఒక్కడే ఉన్నాడు; కాని చకోరాలు అనేకం" అనే అర్థం వచ్చే శ్లోకం చెప్పింది…*


*చంద్రో యథైకో బహవ చ్చకోరాః*

*సూర్యో యథైకో బహవోదృశస్యః |*


*శ్రీకృష్ణచంద్రో భగవాం స్తథైవ*

*భక్తా భగిణ్యో భహవో వయం చ ॥*


*"శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కరే; సోదరీమణులమైన మనం అందరమూ ఆయన భక్తురాండ్రం" అన్నది రాధ.*


*రాధ చెప్పింది విని రాణులు ఎంతో ఆశ్చర్యపోయారు.    రాధను మరీ బలవంతపెట్టి తమ విడిదికి ఆహ్వానించి, తోడ్కొని వెళ్ళారు.* 


*అక్కడ రాధకు రాజోపచారం లభించింది. ఆమె రాకకు రాణులు అందరూ ఎంతో సంతోషించారు. అందరూ కలసి ఆనందంగా మాట్లాడుకుంటూ.. విందు భోజనం ఆరగించారు.*


*చివరికి రుక్మిణీదేవి తానే స్వయంగా రాధకు ఒక స్వర్ణపాత్రలో పాలు ఇచ్చి, త్రాపించింది. ఆ తరువాత కాసేపు ముచ్చట్లు చెప్పుకొని రాధ తన బసకు తిరిగి వెళ్ళిపోయింది.*


*రాత్రి పొద్దుబోయింది. అందరూ నిద్రించడానికి వెళ్ళారు. దైనందిన ఆనవాయితీ ప్రకారం కృష్ణుని పాదాలు ఒత్తడానికి రుక్మిణి ఆయన పక్కన కూర్చుంది. కృష్ణుని అరికాళ్ళ వంక చూసేసరికి రుక్మిణి విస్తుపోయింది. అరికాళ్ళు మొత్తం బొబ్బలెక్కి ఉన్నాయి!*


*దిగ్భ్రాంతికి గురైన రుక్మిణి వెంటనే తక్కిన రాణులను పిలిచి విషయం తెలిపింది.*


*వారూ కృష్ణుని అరికాళ్ళు బొబ్బలతో నిండి ఉండటం చూసి అవాక్కయ్యారు. భగవానుని ఎలా అడగటం? ఎవరూ సాహసించలేకపోయారు.*


*చివరికి కృష్ణుడు కళ్ళు తెరిచి రాణులంతా అక్కడ గుమిగూడి ఉండటం చూసి కారణం ఏమిటని అడిగాడు.*


*అందుకు జవాబుగా వారు భగవానుని అరికాళ్ళు బొబ్బలెక్కి ఉండటం చూపించారు.*


*మొదట్లో కృష్ణుడు ఆ విషయాన్ని దాటవేయజూశాడు. కాని రాణులు వదల్లేదు. వారు మరీ బలవంతపెట్టడంతో ఆయన వారితో ఇలా చెప్పాడు: “రాధ హృదయంలో నా పాదపద్మాలు సదా సర్వవేళలా నెలకొని ఉంటాయి.*


*నువ్వు బాగా వేడిగా ఉన్న పాలు రాధకు ఇచ్చావు. స్వయంగా నువ్వు ఇవ్వడం వలన రాధ మారుమాట్లాడక అలాగే ఆపాలను తాగింది. పాలు లోపలకు, హృదయంలోకి వెళ్ళడంతో                  నా అరికాళ్ళు   ఆ వేడిని భరించలేక బొబ్బలెక్కాయి. ఇది సహజమే కదా!"*


*పతిదేవుని వచనాలు విన్న రాణులు నోట మాట రాక నిలబడిపోయారు.*


*నాటి నుండి కృష్ణుని పట్ల రాధకు ఉన్న హిమాలయమంత భక్తిప్రపత్తుల ముందు తమవి లెక్కలోకి రావని రాణులు గ్రహించారు.*


*రాధ ఔన్నత్యాన్ని తెలిపే ఈ సంఘటన ‘జాతకసంహిత’లో చోటుచేసుకుని ఉంది.*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML