.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

8, జులై 2023, శనివారం

నమః పార్వతి పతయే హర హర

 నమః పార్వతి పతయే హర హర

హర హర శంభో మహాదేవ

హర హర మహాదేవ

హర హర హర హర మహాదేవ

శివ శివ శివ శివ సదాశివ

మహాదేవ సదాశివ

సదాశివ మహాదేవ ||


💥శివాలయంలో పరమేశ్వరుని దర్శనం..


శివాలయంలో పరమేశ్వరుని దర్శిస్తే ముక్కోటి దేవుళ్ళని దర్శించినట్టే.


సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చేసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది.

అందుకే, శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్శించినట్టే అని చెప్పబడింది.


శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి.

అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ధ్వముఖమై (పైకి/ఆకాశంవైపు చూస్తూ) ఉంటుంది.

5 ముఖాల్ని 5 పేర్లు నిర్ధేశించబడ్డాయి.

అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చుని అయినా పూజ చేయవచ్చు అంటారు.


శివాగమనంలో చెప్పినట్లుగా మనం తప్పకుండా శివాలయంలో ఏ దిక్కువైపు వెళితే ఆ శివలింగం పేరుని స్మరించాలి.

ముఖాలు మనకు 5 ఫలితాలని కలుగజేస్తాయి.

ఆ 5 ముఖాలలో నుండే సృష్టి, స్థితి, లయ, తిరోదానము, అనుగ్రహము యివ్వబడతాయి.

🍁🍁🍁🍁🍁


🌹శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది. కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది.. "పశ్చిమాభిముఖమైన" శివాలయం.


అంటే మీరు గుడిలోకి వెళ్ళగానే శివలింగం పశ్చిమం వైపు చూస్తూ ఉంటుంది.

అలా శివలింగానికి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమంవైపు ఉన్నా లేదా శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా దానిని "సద్యోజాత శివలింగం" అని అంటారు.


అప్పుడు మనం తప్పకుండా అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు "ఓం సద్యోజాత ముఖాయ నమః" అని స్మరించుకోవాలి.

శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సద్యోజాత శివలింగం.


🌹శివలింగం "తూర్పు వైపు"కు చూస్తూ ఉంటే, అటుంటి శివలింగాన్ని "తత్పురుష ముఖం" అని అంటారు.

తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది. అంటే చీకటిలో ఉంచటం.

అది మనల్ని మాయ చేత కప్పి బడేస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది.

ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాము.

ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం.


సద్యోజాత ముఖం పూజించ తగినదే. ఏ మాత్రం అనుమానం లేదు. మనల్ని రక్షించినా, శిక్షించినా అన్నీ ఆ పరమేశ్వరుడేగా.


🌹శివలింగం "దక్షిణానికి" చూసే ముఖాన్ని దక్షిణామూర్తి స్వరూపంగా చూడమని చెప్తారు.

ఆ ముఖాన్నే "అఘోర ముఖం" అంటారు.


ఈ అఘోర ముఖం అగ్నిహోత్రానికి అంతటికీ అధిష్ఠానం అయి ఉంటుంది.

ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసే స్వరూపమే ఈ అఘోర ముఖం.

ఈ అఘోర ముఖమే సమస్త ప్రపంచాన్ని లయం చేసి, మళ్ళీ మనకు జన్మను ఇస్తూ ఉంటారు.

మనకు మృత్యువుపట్ల భయం పోగొట్టేది, మనకి జ్ఞానం ఇచ్చేది ఇదే. 


🌹"ఉత్తరం" వైపు చూసి "వాసుదేవ ముఖం'' నీటి మీద అధిష్ఠానం అయి ఉంటుంది.

ఈ వాసుదేవ ముఖమే మనకు సమస్త మంగళము ఇచ్చే ముఖం.

ఈ వాసుదేవ ముఖాన్ని "ఓం వాసుదేవాయ నమః" అని అంటే మనకు అనారోగ్యం కలగకుండా చూస్తాడు.


🌹శివాలయంలో లింగ దర్శనం అయ్యాక ఒకసారి పైకి చూసి ఓం ఈశాన ముఖాయ నమః అని స్మరించుకోవాలి.

ఆ ఈశాన ముఖమే మనకు మోక్షాన్ని ప్రసాదించేది. 


ఈశాన ముఖ దర్శనం మనం మిగిలిన నాలుగు ముఖాల్ని దర్శించిన తరువాతనే దర్శించాలి. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది.

ఈ ఈశాన ముఖం ఆకాశమునకు అధిష్ఠానం అయి ఉంటుంది.


శివాలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది.

అక్కడికి ప్రదక్షిణంగా వెళ్ళినప్పుడు మనలో ఉండే అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకుని ముందుకు సాగాలి.

సేకరణ... 💐🙏



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML