.

.

గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

Tuesday, September 11, 2018

RSS రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ని 1925 విజయ దశమి రోజున మహారాష్ట్ర లోని నాగపూర్ లో పరమ పూజ్య డాక్టర్ కేశవ బలిరంపంత్ హెడ్గేవారు గారు 5 గురు పిల్లలతో ప్రారంభించారు..*రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ని 1925 విజయ దశమి రోజున మహారాష్ట్ర లోని నాగపూర్ లో పరమ పూజ్య డాక్టర్ కేశవ బలిరంపంత్ హెడ్గేవారు గారు 5 గురు పిల్లలతో ప్రారంభించారు..*
సమస్త హిందువులను కలిపి తల్లి భారత్ మాత ను ఈ ప్రపంచానికే విశ్వ గురువు గా నిలబెట్టలనే ఏకైక లక్ష్యం...
Rss లో రెండు రకాల పని చేసే విధానం ఉంటుంది..
1.ప్రచారక్

2.గృహస్థు
1. ప్రచారక్: ప్రచారక్ అంటే పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం తో జీవిత కాలం కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ తల్లీ భారత్ మాత కీ జయము కలగాలని సమాజ శ్రేయస్సు కోరుతూ అను నిత్యం ఎలాంటి లాభాపేక్ష లేకుండా హిందూ సంఘటనము అను ధర్మ రక్షణ కార్యం చేస్తారు..
2.గృహస్థు: గృహస్థు అంటే స్వయం సేవక్ గా తన పనులు తాను చేసుకుంటూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎక్కువలో ఎక్కువ సమయం హిందూ సంఘటనము కోసం పని చేస్తారు. వీరు సొంత ఖర్చు తో ఈ కార్యం లో పాల్గొంటారు..
Rss శాఖ ద్వార వ్యక్తి నిర్మాణం జరుపుతుంది. ఈ సంవత్సరానికి 55 వేల గ్రామాలలో శాఖ లు మరియు 155 000 సేవా కార్యక్రమాలు చేపట్టారు..
Rss హిందూ స్వయం సేవక్ సంఘ్ పేరు తో విశ్వ విభాగ్ ఆధ్వర్యంలో 46 దేశాలలో హిందూ సంఘటనము అను కార్యం చేస్తుంది..
Rss.. నాలుగు రకాల శిక్షణా ఇస్తుంది..
1.ప్రాథమిక శిక్షా వర్గ:
ఈ శిక్షణా లో జిల్లా యూనిట్ గా ఏడూ రోజుల శిక్షణాఇస్తారు నామమాత్రం రుసుము తోనే
2.ప్రథమ వర్ష: ఏడూ రోజుల శిక్షణా పూర్తి చేసుకున్న వారికీ రాష్ట్రం యూనిట్ గా 20 రోజుల శిక్షణ నామమాత్రం రుసుము తోనే
3.ద్వితీయ వర్ష: ప్రథమ వర్ష శిక్షణ పూర్తి చేసుకున్న ఎంపిక చేసిన వారికి మాత్రమే నాలుగు రాష్ట్రాలు యూనిట్ గా 20 రోజుల శిక్షణ ఇస్తారు నామమాత్రం రుసుముతో..
4.తృతీయ వర్ష : ద్వితీయ వర్ష పూర్తి చేసిన ఎంపిక చేసిన వారికి దేశం మరియు ప్రపంచం యూనిట్ గా నాగ్ పూర్ లో 25 రోజుల శిక్షణ ఇస్తారు నామమాత్రం రుసుముతో..
Rss సంవత్సరానికి ఆరు ఉత్సవాలు నిర్వహిస్తుంది..

1.హిందూ సామ్రాజ్య దినోత్సవం

2.శ్రీ గురు పూజోత్సవం

3.రక్షా బంధన్ ఉత్సవం

4.విజయదశమి ఉత్సవం

5.సంక్రాంతి ఉత్సవం

6.ఉగాది ఉత్సవం
Rss సంఘ కార్యాన్ని వ్యాప్తికి అనేక విభాగలని ప్రాభించింది. వీటిని సంఘ్ పరివార్ గా పిలుస్తారు..
వీటిలో ముఖ్యమైనవి...
స్వదేశి జాగరణ మంచ్

సేవా భారతి

విద్యా భారతి

Abvp

Vhp

భజరంగ్ దళ్

వివేకానంద కేంద్ర

హిందూ వాహిని

ధర్మ జాగరణ

భారతీయ కిసాన్ సంఘ్

భారతీయ మస్ధుర్ సంఘ్

న్యాయ వాద పరిషత్

వనవాసి కళ్యాణ పరిషత్

సామాజిక సమరసత

విజ్ఞాన భారతి

సంస్కార భారతి

యూత్ ఫర్ సేవ

శిశు మందిరరాలు

దుర్గ వాహిని

సేవికా సమితి

హిందూ స్వయం సేవక్ సంఘ్
ఇలాంటి అనేక క్షేత్రాల ద్వార హిందూ సంఘటన మరియు దేశ భక్తిని ప్రేరణ ఇస్తూ.. సమాజ హితం కోసం అను నిత్యం పని చేస్తున్నాయి.
రండి..
మీరు ఈ సమాజ కార్యము లో పాల్గోని తల్లీ భారతీ కి జయమునొనరిదము..
భారత్ మాత కీ జై
🙏
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
హిందువునని గర్వించు -హిందువుగా జీవించు

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML