.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

14, మార్చి 2018, బుధవారం

ప్రవర యొక్క అర్ధం..

ప్రవర యొక్క అర్ధం..

చతుస్సాగర పర్యంతం
( మానవ పరిభ్రమణానికి నలువైపులా
కల మహాసముద్రాల అంచుల వరకూ )

గో బ్రాహ్మణేభ్య శుభం భవతు
( సర్వాబీష్ట ప్రదాయిణి అగు.. గోవూ మరియు నిత్యం సంఘహితాన్నే అభిలషించే సద్బ్రాహ్మణుడు అతడి రూపంలో ప్రకాశించే వేదధర్మం.. సర్వే సర్వత్రా దిగ్విజయంగా.. శుభప్రదంగా వర్ధిల్లాలని కోరుకుంటూ)

కాశ్యప అశిత దైవల
త్రయాఋషేయ ప్రవరాన్విత..

( మా వంశమునకూ.. మా గోత్రమునకూ మా నిత్యానుష్ట ధర్మశీలతకు మూలపురుషులైన మా ఋషివరేణ్యులకూ.. త్యాగే నైకే అమృతత్త్వ మానశుః అన్న వారి మహోన్నతమైన త్యాగనిష్ఠకు సాక్షీభూతుడనై..

శ్యాండిల్యస గోత్రః 
(మా గోత్రమునకూ..)

కాత్యాయని సూత్రః శుక్ల యజుశ్శాఖాధ్యాయీ 
( మా శాఖకూ.. అందలి శాస్త్ర మర్మంబులకు.. )

శ్రీనివాస కుమార శర్మ నామధేయస్య 

( కేవలం జన్మతహానే కాక.. ఉపనయనాది సంస్కారాలతో.. శాస్త్రపఠనంతో.. వేదాధ్యయనాది వైదిక క్రతువులతో.. 1. స్నానము 2. సంధ్య 3. జపము 4. హోమము 5. స్వాధ్యాయము 6. దేవ పూజ 7. ఆతిధ్యము 8. వైశ్యదేవము అనబడే అష్టకర్మలనూ క్రమంతప్పక నిర్వహిస్తూ.. త్రివిధాగ్నులు 1. కామాగ్ని 2. క్రోధాగ్ని 3. క్షుద్రాగ్ని.. అనే త్రివిధాగ్నులను అదుపులో (సమస్థితిలో) ఉంచుకొన్న వాడినై.. పేరుకు ముందు శ్రీ అనబడే.. ప్రకృతి స్వరూపమైన శక్తిస్వరూపాన్ని.. శుభప్రదమైన శ్రీకారాన్ని ధరించిన.. శ్రీనివాస్ కుమార్ శర్మా అనబడే సుశ్రోత్రియుడనైన నేను.. జన్మప్రధాతలైన జననీజనకులముందు..  జ్ఞానప్రధాతలైన ఆచార్యులముందు.. జ్ఞానస్వరూపమైన వేదముముందు.. యావత్ ప్రపంచానికే మార్గదర్శకమైన వేదధర్మము ముందు.. నిరాకార నిర్గుణ అవ్యాజ పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మ ముందు..

అహంభో అభివాదయే..
( కేవలం నేనూ అన్నదిలేక.. సర్వం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహ భాగ్యమేయన్న అహంకారభావ రహితుడనై.. నిగర్వినై.. త్రికరణ శుద్ధిగా ( మనసా, వాచా, కర్మణా) సాష్టాంగ పూర్వక (మానవశరీరంలోని అత్యంత ప్రాధాన్యమైన ఎనిమిది శరీరాంగములనూ శరణాగత హృదయంచే నేలపై వాల్చి సమర్పిస్తున్న) దండ ప్రణామమిదే.. అన్న పరిపూర్ణమైన ఆత్మపూర్వక వేదపూర్వక హృదయపూర్వక నమస్కార భావమే.. సశాస్త్రీయమైన ఈ ప్రవరలోని.. అర్ధం అంతరార్ధం పరమార్ధం కూడా.

భగవంతుని అర్చన విధిలో మాత్రం స్వ ప్రవర పూర్తిగా ఇలా చెప్పుట ఉత్తమం:
👉
చతుస్సాగర పర్యంతం
గో బ్రాహ్మణేభ్య శుభం భవతు
కాశ్యప అశిత దైవల
త్రయాఋషేయ ప్రవరాన్విత..
శాండిల్యస గోత్రోద్బ్వస్య భరణి నక్షత్ర ద్వితీయ చరణయుక్త మేషలగ్న్స్య కాత్యాయని సూత్రః శుక్ల యజుశ్శాఖాధ్యాయీ 
శ్రీనివాస కుమార శర్మ నామధేయస్య 
అహంభో అభివాదయే..అని పూర్తిగా చెప్తూ సంకల్పం,ప్రార్ధన చేయుట వల్ల.....ఎటువంటి అనుమానం లేకుండా ప్రతిఫలంను కర్త పొందవచ్చు.

గీర్దేవీ దయారవింద బహుముఖ నందన శ్రీ ఆచార్య శ్రీనివాస కుమార మనోహ్య కృతమిదం సర్వం శ్రీశారదాంకితం.

దేవీ ఇంద్రాయణీ మానసం మాధుర్య రస శోభితం
సతతం శ్రీవైష్ణవ వందితం శివకేశవ ప్రణమామ్యహమ్.

సర్వేజనా సుఖినో భవంతు..
లోకా సమస్తా సుఖినో భవంతు..

స్వస్తి..

Virus-free. www.avast.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML