.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

5, మే 2026, మంగళవారం

కృష్ణాజ్గారక చతుర్థి 𝕝𝕝卐𝕝𝕝_*

- కృష్ణాజ్గారక చతుర్థి 𝕝𝕝卐𝕝𝕝_*

*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*


భూమి పుత్రుడు అంగారకుడు. నవగ్రహాలలో కుజునిగా పేరు గాంచాడు. మంగళుడు అని కూడా అంటారు. ఏడు వారాల్లో మంగళవారానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. వినాయకునికి ఇష్టమైన చతుర్థి తిథి మంగళవారం నాడు వచ్చినప్పుడు ఆరోజును అంగారక చతుర్థి అంటారు. అలాగే బహుళపక్షంలో చవితి తిథి మంగళవారం వస్తే దానిని కృష్ణాంగారక చతుర్థి అంటారు. 

కృష్ణ అంగారక చతుర్థికి సూర్యగ్రహణంతో సమానమైన శక్తి ఉంటుందని చెబుతారు. సూర్యగ్రహణం రోజున కొన్ని పనులు చేస్తే ఏ విధంగా అయితే మంచి ఫలితాలు వస్తాయో అదేవిధంగా కృష్ణ అంగారక చతుర్థి రోజు కూడా కొన్నిపనులు మీకు శుభ ఫలితాలను ఇస్తాయని అదృష్టం తీసుకువస్తాయని చెబుతున్నారు.

కుజుని ధ్యానం వల్ల దాంపత్య సమస్యలు, సంతాన సంబంధమైన సమస్యలు, ఋణ సమస్యలు తొలగిపోతాయి.

నేడు కుజ భగవానుడికి పూజ చేసిన, ఋణవిమొచన అంగారక స్తోత్రమ్ చదివిన, కందిపప్పు (1.25) కేజీ, ఎర్రటి వస్త్రం దానం చేసిన, కుజ భగవానుడికి ఎర్ర దారం వత్తితో కలిపి దీపారాధన చేసిన, వ్యవసాయ భూమి, ఇల్లు, కోర్టు, అప్పుల భాధల నుండి ఉపశమనం కలుగుతుంది. నేడు పితృ తర్పణం ఇస్తే మామూలు రోజుల్లో పితృతర్పణం చేసిన దానికన్నా ఎక్కువ ఫలితం ఉంటుంది.


ఓం అంగారకాయ విద్మహే

శక్తి హస్తాయ ధీమహి

తన్నో కుజః ప్రచోదయాత్

*_ॐ లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 卐_*

Read More

*కాకబలి :*

 *కాకబలి :*


దురదృష్టవశాత్తు కొంతమంది చిన్న పిల్లలు అకస్మాత్తుగా చనిపోతారు. అలాంటి అభాగ్యులైన బిడ్డలకు పితృపక్షంలో వచ్చే త్రయోదశినాడు ఒక ప్రత్యేకమైన శాంతి ప్రక్రియను చేస్తారు. దీనిని "కాకబలి” అని పిలుస్తారు. ఆ మర్నాడు ఆ బిడ్డల ఆత్మశాంతికోసం శ్రార్ధకర్మలను నిర్వహిస్తారు.


సాధారణంగా, భారతదేశంలోని హైందవులు- గయ/కాశి/ప్రయాగ/కురుక్షేత్ర/నైమిశారణ్యం/రామేశ్వరం- క్షేత్రాలలో తమ పితృదేవతలకు ముఖ్యంగా తల్లిదండ్రులకు శ్రార్ధకర్మలు చెయ్యటం జరుగుతుంది. కలకత్తా నగరంలోని జగన్నాధ్ ఘాట్ వద్ద పితృపక్షంలో పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం ఎంతో పుణ్యాన్ని ఇస్తుందని చెబుతారు.


ఈలోకంలో ఏ సుఖాలు అనుభవించకుండానే చనిపోయిన చిన్న పిల్లలకు మరియు సుఖాలను విసర్జించి సన్యాసులుగా మారిపోయిన వారికి పితృపక్షంలోని ద్వాదశినాడు శ్రార్ధకర్మలు చేస్తారు. ఆయుధాలచేత చనిపోయినవారికి, హింసాత్మక చావు పొందినవారికి పితృపక్షంలోని చతుర్దశి తిధినాడు శ్రార్ధకర్మలు చేస్తారు. దీనిని "ఘాతచతుర్దశి” (గాయముల/దెబ్బల) అని పిలుస్తారు.


ఏ తిధినాడు చనిపోయాడు/చనిపోయింది అనే ప్రశ్న లేకుండా, చనిపోయిన పెద్దలందరికీ (పితృదేవతలు) పితృపక్షంలోని చివరి రోజు అయిన అమావాస్యనాడు చేసే శ్రార్థప్రక్రియను “సర్వపిత్రి అమావాస్య" అనే పేరుతో పిలుస్తారు. ఈ తిధి రోజున పితృదేవతలకు తర్పణాలు వదిలితే, గయా క్షేత్రంలో శ్రార్ధకర్మలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, అంత పుణ్యం వస్తుందని హైందవ మంత్రశాస్త్రాలు ఉద్ఘాటిస్తున్నాయి.

Read More

1, మే 2026, శుక్రవారం

0p_*పాశ్చాత్య మేధావులు పలికిన ఈ వాక్యాలను మీరు చదివారా?*_0

 _*పాశ్చాత్య మేధావులు పలికిన ఈ వాక్యాలను మీరు చదివారా?*_


*1. మైఖేల్ నాస్ట్రాడమస్ (1503-1566)*

_*"హిందూమతం ఐరోపాకు పాలక మతంగా మారుతుంది. ఐరోపాలోని ప్రసిద్ధ మహానగరం హిందూ రాజధానిగా అవతరిస్తుంది."*_


*2. జోహన్ కీత్ (1749-1832)*

_*ఈ రోజు కాకపోయినా, ఏదో ఒక రోజు మనం హిందూమతాన్ని స్వీకరించక తప్పదు. ఎందుకంటే అదే నిజమైన మతం."*_


*3. లియో టాల్‌స్టాయ్ (1828-1910)*

_*"హిందూమతం మరియు హిందువులు ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తారు; ఎందుకంటే ఇది 'జ్ఞానం మరియు విజ్ఞత'ల సమ్మేళనం."*_


*4. హ్యూస్టన్ స్మిత్ (1919)*

*హిందుత్వం అనేది మనపై మనకు ఉన్న నమ్మకం కంటే భిన్నమైనది కాదు.*

*మనం మన ఆలోచనలను, హృదయాలను హిందుత్వం వైపు మళ్ళించగలిగితే, అది మనకు ఎంతో మేలు చేస్తుంది."*


*5. కోస్టా లోబన్ (1841-1931)*

_*"హిందువులు కేవలం శాంతి మరియు సయోధ్యల గురించే మాట్లాడుతారు. క్రైస్తవులు దీనిని ప్రశంసించాలని, దీని వైపు మారాలని మరియు దీనిని విశ్వసించాలని నేను ఆహ్వానిస్తున్నాను."*_


*6. హెర్బర్ట్ వెల్స్ (1846-1946)*

_*"హిందూమతాన్ని సరిగ్గా అర్థం చేసుకునేలోపు, ఇంకెన్ని తరాలు అకృత్యాలను మరియు హత్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో కదా?*_

_*కానీ ఈ ప్రపంచం ఏదో ఒక రోజు హిందుత్వం ద్వారా ప్రేరణ పొందుతుంది. ఆ రోజు మాత్రమే ఈ ప్రపంచం మానవులు నివసించడానికి అనువైన ప్రదేశంగా మారుతుంది."*_


*7. బెర్నార్డ్ షా (1856-1950)*

_*"ఏదో ఒక రోజు ఈ ప్రపంచం హిందూమతాన్ని స్వీకరిస్తుంది. హిందూమతానికి ఉన్న నిజమైన పేరును స్వీకరించడానికి నిరాకరించినా సరే, దాని సూత్రాలను మాత్రం స్వీకరించక తప్పదు.*_

_*పాశ్చాత్య దేశాలు ఖచ్చితంగా ఏదో ఒక రోజు హిందూమతంలోకి మారుతాయి. విజ్ఞుల మతం హిందూమతానికి సమానమైనది."*_


*8. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ (1879-1955)*

_*"ఆయన (?) యూదులు చేయలేని పనిని చేస్తారు. ఆయన దానిని జ్ఞానంతో మరియు అపారమైన శక్తితో సాధించారు."*_

_*"కానీ శాంతి వైపు నడిపించే శక్తి కేవలం హిందూమతానికి మాత్రమే ఉంది."*_


*9. *  బెర్ట్రాండ్ రస్సెల్ (1872-1970)*

_*"నేను హిందూ మతం గురించి చదివాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళి మొత్తానికి ఇదే నిజమైన మతం అని నేను భావిస్తున్నాను. హిందూ మతం ఐరోపా అంతటా విస్తరించింది. భవిష్యత్తులో ఐరోపాలో హిందూ మతాన్ని అధ్యయనం చేసే ఎంతోమంది పండితులు ఉద్భవిస్తారు. ఏదో ఒక రోజు, ప్రపంచాన్ని కేవలం హిందువులు మాత్రమే నడిపించే పరిస్థితి ఏర్పడుతుంది."*_


*దయచేసి మీ పరిచయస్తులందరికీ దీనిని పంచుకోండి*👏

Read More

Powered By Blogger | Template Created By Lord HTML