.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

23, ఏప్రిల్ 2026, గురువారం

ఒక నవలలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మంత్ర శాస్త్ర రహస్యాన్ని కథారూపంగా తెలియచేశారు

 ఒక నవలలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మంత్ర శాస్త్ర రహస్యాన్ని కథారూపంగా తెలియచేశారు. ఒక వ్యక్తి ఉన్నట్లుండి రోగగ్రస్తుడై మరణశయ్యపై ఉన్నాడు. వారి కుటుంబ సభ్యులు ఆ ఊరికి వచ్చిన ఒక ధ్యాన యోగికి అతనిని చూపించారు. ఆయన ధ్యానంలో చూడగా అతనిని పీడిస్తున్న ఒక పిశాచి కన్పించింది. దానితో ఆయన మాట్లాడిన తీరును చూడండి.


యోగి : నీవెవరు? నీ వితనిని ఎందుకు పీడిస్తున్నావు ?


పిశాచి : నేను వారాహిని. ఒక దేవతను. నన్నొక మాంత్రికుడు ఇతనిని చంపమని ప్రయోగించాడు.


యోగి :వారాహి గొప్ప దేవత, ఇటువంటి నీచమైన పనులు చేయదు. నీవెవరు?


పిశాచి : 'మంత్రాధీనంతు దైవతం' అన్న మాట నీకు తెలియదా? దేవతలు మంత్రాధీనులు. మాకు మంచి చెడులతో పనిలేదు. మంత్ర సిద్ధుడు కోరిన పని చేయటం మా కర్తవ్యం.


యోగి : కావచ్చు. నిన్ను చూస్తే నీవు అసలైన వారాహివి కాదని స్ఫురిస్తున్నది. నా యోగ శక్తితో ఆజ్ఞాపిస్తున్నాను. నీవెవరు? నిజం చెప్పు.


పిశాచి : నీ యోగ శక్తి బలమైనది. నిజం చెప్తున్నా. నేను మరణించిన ఒక స్త్రీని. ప్రేతమునై శ్మశానంలో తిరుగుతున్నాను. ఒక మాంత్రికుడు అక్కడకు వచ్చి వారాహి సాధన చేశాడు. అతని మంత్ర శక్తికి నేను వశమయినాను. అత డితనిని హింసించి చంపమని ఆజ్ఞాపించాడు. అందుకే ఇలా చేస్తున్నాను. ఇంతలో మీరు వచ్చారు.


యోగి : ఇతనిని విడిచిపెట్టి వెళ్ళు. నా ఆజ్ఞ.


పిశాచి : తప్పదు కనుక వెడుతున్నాను.


తరువాత ఆరోగి వ్యాధి పోయి జీవించాడు. ఇక్కడ గమనించవలసినదేమిటంటే ఒక తీవ్ర దేవతా మంత్రాన్ని ఇంట్లోనో దేవాలయంలోనే చేస్తే ఎప్పటికో గాని సిద్ధించకపోవచ్చు. శ్మశానంలో చేస్తే ఏ భూతమో ప్రేతమో మంత్ర దేవతా రూపాన్ని ధరించి సాధకుని కోరికలు తీరుస్తుంది. అదీకాక, దివ్య క్షేత్రాల దగ్గర ఉన్న మహాశ్మశానాలలో అసలు దేవతలు కూడా రుద్ర భైరవ శక్తి మండలాలకు చెందినవారు ఉంటారు. వారు సాధకుని ధైర్యాన్ని పరీక్షించి, సిద్ధులను ప్రసాదిస్తారు.

Read More

Read More

వైశాఖ శుద్ధ అష్టమీ - శ్రీ బగళాముఖి దేవీ జయన్తీ

 - వైశాఖ శుద్ధ అష్టమీ - శ్రీ బగళాముఖి దేవీ జయన్తీ 𝕝𝕝卐𝕝𝕝_*

*_శ్రీ బగళాముఖి దేవీ జయన్తీ_

వైశాఖ శుద్ధ అష్టమిని "బగళాష్టమి" అంటారు. ఈ రోజు దశమహావిద్యల్లో ఒకరైన బగళాముఖి అమ్మవారి జయంతి.

చింతామణి ద్వీప నివాసిని అయిన ఆదిపరాశాక్తి భండాసుర సంహారానికి లలితాదేవిగా ఆవిర్భవించినప్పుడు ఆమెకు సహకరించిన పది మహాశక్తులైన 


1)కాళీ                 

2)తార 

3)షోడశి               

4)భువనేశ్వరి 

5)భైరవి                 

6)ఛిన్నమస్త 

7)ధూమవతి           

8)బగళాముఖి 

9)మాతంగి             

10)కమలాత్మిక


దశమహావిద్యలని తెలుస్తుంది. అందుకే ఈ మహావిద్యలకి ఇంత గొప్ప ప్రాముఖ్యత కలిగింది. తంత్రసాధనలో దేవి దశమహావిద్యల పూజ అత్యంత ప్రముఖమైనది. ఆ చరిత్రను బ్రహ్మాండపురాణం వివరంగా చెబుతుంది. ఉత్తర భారతదేశంలో *"పీతాంబరి"* అనే పేరుతో శత్రువులను సైతం మనకు అనుకూలంగా మార్చే తల్లిగా బగళాముఖి దేవీని ప్రత్యేకంగా పూజిస్తారు.


*_బగళాముఖి ధ్యానశ్లోమ్_*


*సౌవర్ణాసనసంస్థితాం త్రినయనాం పీతాంశుకోల్లాసినీం* 

*హేమాభాంగరుచిం శశాంకముకుటాం సచ్చంపక గ్యుతాం* 

*హస్త్రైర్ముద్గరపాశవజ్రరశనాః సంబిభ్రతీం భూషణైః*

*వ్యాప్తంగీం బగలాముఖీం త్రిజగతాం సంస్తంభినీం చింతయే*


బగళాముఖి సింహాసనంపై ఆశీనురాలై మూడుకన్నులతో, పసుపు పచ్చని వస్త్రాలు ధరించి, బంగారం వర్ణ శరీరం తో, శిరస్సున కిరీటంతో పాటు చంద్రరేఖను, మెడలో కలవపూల మాలను ధరించినదై, కొరడా, పాశం, వజ్రం భోజన పాత్రలను నాలుగు చేతులలో ధరించి మూడులోకాలలోనూ వ్యాపించినది, భక్త రక్షణ కోసం అన్నింటినీ స్తంభింప చేయగలిగిన శక్తి కలది.


స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాద, ప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.

  

అరిషడ్వర్గాల రూపంలో మనలోనే దాగిఉండే అంతర్గత శత్రువులను శిక్షించి, మన నోటి ద్వారా వచ్చే మాటలు ఎవరికీ హానీ చేయనివిగా, అందరికీ మేలు చేసేవిగా ఉండాలని, మనలో కోపాన్ని, దుర్వాక్కులను నశింపజేయమని ఈ అమ్మవారిని మనం ప్రార్థిస్తే సత్ఫలితాలు పొందుతారు. 


హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా, మధ్యప్రదేశ్ లోని దతియా, గుజరాత్ లోని వడోదరలతో పాటు అస్సాంలోని కామాఖ్యలో అతి ప్రాచీనమైన బగళాముఖి ఆలయాలున్నాయి.


*_𝕝𝕝ॐ𝕝𝕝 oఓo శ్రీ మాత్రే నమః 𝕝𝕝卐𝕝𝕝_*

Read More

చిత్తూరు జిల్లా : తిరుపతి 🔅 శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయం : తిరుపతి

 🕉 


🔅 చిత్తూరు జిల్లా : తిరుపతి


🔅 శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయం :

 తిరుపతి

   

🔅 తాతయ్యగుంట గంగమ్మదేవి తిరుపతిలోని అవిలాలలో జన్మించిందని నమ్ముతారు. తాతయ్యగుంట గంగమ్మను శ్రీవేంకటేశ్వరుని చెల్లెలుగా పూజిస్తారు.


👉 ప్రతి గ్రామంలోని అందరు అన్నోన్యమైత్రి బావంతో ఆరాధించడానికి వీలుగా గ్రామ దేవతా పూజ ఏర్పడింది.

ఒకప్పుడు గ్రామస్తులే స్వయంగా పూజించేవారు,తర్వాత క్రమంగా మందిరాలు, ఆలయాలు ఏర్పడినాయి. మునుపు వేప చెట్టు క్రిందనో,కొండ క్రిందనో,ఎతైన ఒక పెద్ద బండనో,రాయినో వుంచి,దాన్నే గ్రామ దేవతగా బావించేవారు.తర్వాత విగ్రహాలు వచ్చాయి.    ఇప్పటికి చాలా గ్రామంలో గుడిగోపురాలు లేకుండా,విగ్రహాలు లేకుండా,పెద్ద బండలే గ్రామ దేవతలుగా పూజలు అందుకొంటున్న సంగతి మనం గమనించవచ్చు


👉 గ్రామ సంరక్షణకు,మశూచి మొదలగు వ్యాధుల నివారణకు,దుష్టశక్తులను రానివ్వకుండా,జంతువులను వింత వ్యాధులనుండి సంరక్షించుటకు,వర్షాలు వచ్చి భూములు పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండడానికి,పంటలకు తెగుళ్ళు రాకుండా ఉండుటకు- ఇలా అనేక శుభ ఫలితాలకై గ్రామ దేవతలను పూజించుట ఆచారంగా ఏర్పడింది. 


👉 తిరుపతి స్థానిక నివాసితులు 'జాతర' ఆచారబద్ధంగా ఆచరిస్తారు. 

తిరుపతి ప్రజలకు ముఖ్యమైన పండుగ తిరుపతి గంగమ్మ జాతర. పండుగ సమయంలో వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. 

తిరుపతి గంగమ్మ జాతర ప్రతి సంవత్సరం మే మొదటి పక్షం రోజులలో జరుపుకునే వార్షిక పండుగ.


👉అన్ని చోట్లా వున్న గంగమ్మకు, తిరుపతిలో ఎంతో వైభవంగా జాతర జరుపుకుంటున్న గంగమ్మకు చాలా ప్రత్యేకతలు ,విశిష్టతలు ఉన్నాయి.

 ఇక్కడి గంగమ్మకు చాలా చారిత్రక నేపధ్యం ఉంది.

 ఇక్కడి తిరుపతిలో  కొలువైన ఇద్దరు "గంగమ్మలు"  మహా మహిమ గలవారె.


👉తాళ్ళపాక గంగమ్మను పెద్ద గంగమ్మగా అని ,తాతయ్య గుంట గంగమ్మను చిన్న గంగమ్మగా అని పిలుస్తుంటారు


👉 తాళ్ళపాక గంగమ్మ గుడి తాళ్ళపాక చెరువు గట్టు (తిరుపతి)ఫై వుంది. ఈ చేరువునే- నేడు ఆర్.టి.సి. బస్ స్టేషన్ అయింది.తాతయ్య గుంట గంగమ్మ గుడి తుడా ఆఫీసుకు ముందు వైపున ఉంది.

భక్త్తులు  విశేషంగా తమ మొక్కుబడులు  తాతయ్య గుంట గంగమ్మకే సమర్పిస్తుంటారు


👉ఈ ఇద్దరు గంగమ్మల చరిత్ర ,ఇక్కడికి ఎలా వచ్చిందో సంగ్రహంగా చూద్దాం

 పూర్వం తిరుమలఫై శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల నంబి అనే  ఒక వైష్ణవ భక్తుణ్ణి ``తాతా! తాతా అని పిలిచేవారట! అందువల్ల ఆ భక్తుని పేరు తాతచార్యులుగా రూపొందింది.


క్రి.శ.16 వ శతాబ్దంలో ఆ తాతచార్యుల వారి వంశస్తులకు కైంకర్యం కోసం లబించిన చెరువుకు తాతయ్య గుంట అనే పేరు వచ్చింది.

ఆ తాతాచార్యుల వంశస్తులచే  చెరువు(గుంట) గట్టున ప్రతిష్టించిన గంగమ్మ కనుక `తాతయ్య గుంట గంగమ్మ'  అనే పేరు వచ్చింది.


👉 పూర్వం తిరుమలకు యాత్ర చేసే భక్తులు మొదట ఈ గ్రామ దేవతను పూజించి ,పిదప తిరుమలకు బయలుదేరేవారని పెద్దలు అంటారు. గంగమ్మ శ్రీవారి చెల్లలని అందుకే ఒక సోదరుడు తన సోదరికి పుట్టినరోజు కానుకగా తిరుమల తిరుపతి దేవస్థానంవారు నుండి(సారే) చిర,రవిక,పసుపు,కుంకుమ,గాజులు,మున్నగు, మంగళ ద్రవ్యాలు, జాతరకు ముందురోజు గంగమ్మకు పంపడం ఈనాటికి ఆనవాయితీగా వస్తున్న ఆచారం.


👉అది పరాశక్తి అయిన గంగమ్మ తిరుపతికి దక్షిణంవైపున రెండు కి.మీ దూరంలో వున్న అవిలాల గ్రామంలో పుట్టిందని అంటారు.ఇప్పటికి అవిలాల గ్రామం నుంచి పసుపు కుంకుమలు రానిదే గంగమ్మ జాతర జరిపించుకోదు అని చెప్పి...అమ్మవారికి జాతర చేయరు. 

కనుక ఆ గ్రామం నుండి విధిగా అమ్మవారికీ మంగళ ద్రవ్యాలు ప్రతి ఏడు వస్తాయి.


 👉ప్రసిద్ద వైష్ణవచారుడైన తాతాచార్యులు అన్నమాచార్యుల స్వగ్రామమైన తాళ్ళపాక నుండి గంగమ్మను తెచ్చి,తిరుపతిలో నిలిపినందున తాళ్ళపాక గంగమ్మ అయిoదని ప్రతీతి.


🔅తిరుపతి గంగమ్మ జాతర వెనక ఉన్న చరిత్ర : 


👉జానపద కథల ప్రకారం, "పాలెగాడు" అని పిలువబడే స్థానిక నాయకుడు అందమైన స్త్రీలను ప్రలోభపెట్టేవాడని , అతని ఆదేశాల ప్రకారం, కొత్తగా పెళ్లయిన స్త్రీలు తమ మొదటి వివాహ రాత్రి అతనితో గడపవలసి వచ్చింది. 

తిరుపతి సమీపంలోని అవిలాల గ్రామంలో గంగమ్మగా జన్మించిన జగన్మాతను మహిళలు వేడుకున్నారు.


ఆమె పెద్దయ్యాక పాలెగాడు తన కామపు చూపును గంగమ్మపై వేశాడు. ఆ తర్వాత గంగమ్మ తిరస్కరించినప్పుడు ఆమెను  ప్రజల దృష్టికి లాగి పాలెగాడు అవమానించాడు. ఆమె తన భయపెట్టే “విశ్వరూపం” అతనికి చూపించినప్పుడు, మరణం నుండి తప్పించుకోవడానికి, పాలెగాడు పారిపోయి గుర్తు తెలియని ప్రదేశంలో దాక్కున్నాడు. అతని కోసం వెతుకుతూ గంగమ్మ మూడు రోజుల పాటు అనేక వేషధారణలు వేసుకుంది. మరియు నాల్గవ రోజు, ఆమె పాలెగాడు, అతని యజమాని (దొర) వలె ధరించి ఆకర్షించింది. ఆమెను తన యజమాని అని తప్పుగా భావించి, పాలెగాడు ప్రజల్లోకి వచ్చాడు, ఆమె చేత చంపబడ్డాడు.


👉ఈ చిరస్మరణీయ ఘట్టానికి గుర్తుగా, జగన్మాతకు గంగమ్మ దేవి రూపంలో కృతజ్ఞతలు తెలుపుతూ తిరుపతి వాసులు జాతర వేడుకలు నిర్వహిస్తున్నారు...

ఈనాటికి 3 రోజుల పాటు తిరుపతి ప్రజలు వివిధ వేషధారణలతో అమ్మవారిని పూజిస్తారు

Read More

వైశాఖ మాసం ప్రారంభం* --------------------------------------- *వైశాఖమాస స్నాన సంకల్పము*

 ------------------------- వైశాఖ మాసం ప్రారంభం*

---------------------------------------    *వైశాఖమాస స్నాన సంకల్పము*

---------------------------------------- 

*శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |*

*ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ||*

*సర్వపాపహరం పుణ్యం స్నానం వైశాఖకాలికం |*

*నిర్విఘ్నం కురుమేదేవ దామోదర నమోస్తుతే ||*

*వైశాఖః సఫలోమాసః మధుసూదన దైవతః |*

*తీర్థయాత్రా తపోయజ్ఞ దానహోమఫలాధికః ||*

*వైశాఖః సఫలం కుర్యాత్ స్నానపూజాదికం |*

*మాధవానుగ్రహేణైవ సాఫల్యంభవతాత్ సదా ||*

*మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరరౌ |*

*ప్రాత స్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ ||*

----------------------------------------

*ఓం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా శ్రీ శివశంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రథమపాదే , జంబూద్వీపే , భరతవర్షే , భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే  శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా / గంగా /గోదావర్యోః మధ్యదేశే అస్మిన్ (ఆయా ప్రాంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే , ఉత్తరాయనే , వసంతఋతౌ , వైశాఖమాసే , ....పక్షే , ....తిథౌ, ......వాసర యుక్తాయాం , శుభనక్షత్ర, శుభయోగ , శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ , శ్రీ మాన్ .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య , ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం , శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం క్షేమ , స్థైర్య , విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం , గంగావాలుకాభి సప్తర్షిమండల పర్యంతం కృతవారాశేః పౌండరీకాశ్వమేధాది సమస్త క్రతుఫలావాప్త్యర్థం , ఇహజన్మని జన్మాంతరేచ బాల్య యౌవ్వన కౌమారవార్ధకేషు , జాగ్రత్ స్వప్నసుషుప్త్యవస్థాను జ్ఞానతో జ్ఞానతశ్చకామతో కామతః స్వతః ప్రేరణతయా సంభావితానాం , సర్వేషాం పాపానాం అప నోద నార్థంచ గంగా గోదావర్యాది సమస్త పుణ్యనదీ స్నానఫల సిద్ధ్యర్థం , కాశీప్రయాగాది సర్వపుణ్యక్షేత్ర స్నానఫలసిద్ధ్యర్థం , సర్వపాపక్షయార్థం , ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం మేషంగతేరవౌ మహాపవిత్ర వైశాఖమాస ప్రాతః స్నానం కరిష్యే*

---------------------------------------

*సంకల్పము చెప్పుకొనుటకు ముందు చదువవలసిన ప్రార్థనా శ్లోకము*

----------------------------------------

*గంగాగంగేతియోబ్రూయాత్ యోజనానాంశతైరపి*

*ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్ఛతి ||*

*పిప్పలాదాత్సముత్పన్నే కృత్యే లోకాభయంకరి*

*మృత్తికాంతే ప్రదాస్యామి ఆహారార్థం ప్రకల్పయ ||*

*అంబత్వద్దర్శనాన్ముక్తిర్నజానే స్నానజంఫలం*

*స్వర్గారోహణ సోపాన మహాపుణ్య తరంగిణి ||*

*విశ్వేశం మాధవండుంఢిం దండపాణీం చ భైరవం*

*వందేకాశీం గుహం గంగాం భవానీం మణికర్ణికాం ||*

*అతితీక్షమహాకాయ కల్పాంత దహనోపమ*

*భైరవాయనమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి ||*

*త్వంరాజా సర్వతీర్థానాం త్వమేవ జగతః పితా*

*యాచితో దేహిమే తీర్థం సర్వపాపాపనుత్తయే ||*

*యోసౌసర్వగతో విష్ణుః చిత్ స్వరూపీనిరంజనః*

*సేవద్రవ రూపేణ గంగాంభో నాత్రసంశయః ||*

*నందినీ నళినీ సీతా మాలినీ చమహాసగా*

*విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపథ గామినీ ||*

*భాగీరథీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ*

*ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే*

*స్నానకాలేపఠేత్ నిత్యం మహా పాతక నాశనం ||*

*సమస్త జగదాధార శంఖచక్ర గదాధర*

*దేవదేహిమమానుజ్ఞాం తవ తీర్థ నిషేవణే ||*

*నమస్తే విశ్వగుప్తాయ నమో విష్ణుమపాంసతే*

*నమోజలధిరూపాయ నదీనాంపతయే నమః ||*

*మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవౌ*

*ప్రాతఃస్నానం కరిష్యామి నిర్విఘ్నంకురు మాధవ ||*

---------------------------------------

*స్నానం తరువాత ప్రార్థనాశ్లోకాలను చదువుతూ , ప్రవాహానికి యెదురుగా , వాలుగా తీరానికి పరాజ్ముఖముగా కుడిచేతి బొటనవ్రేలుతో నీటిని కదిలించి 3 దోసిళ్ల నీళ్లు తీరానికి జల్లి , తీరానికి చేరి కట్టుబట్టలను పిండుకోవాలి , తరువాత మడి / పొడి బట్టలను కట్టుకొని తమ సాంప్రదాయానుసారం విభూతి వగైరాలని ధరించి సంధ్యావందనం చేసుకోవాలి. తరువాత నదీతీరాన / గృహమున దైవమును అర్చించాలి. స్నానము చేయుచు క్రింది శ్లోకములను చదువుచు శ్రీహరికి - యమునికి అర్ఘ్యమునీయవలెను*

---------------------------------------

*వైశాఖే మేషగే భానౌ ప్రాతఃస్నాన పరాయణః |*

*అర్ఘ్యం తేహం ప్రదాస్వామి గృహాణమధుసూదన ||*

*గంగాయాః సరితస్సర్వాః తీర్థాని చహ్రదాశ్చయే |*

*ప్రగృహ్ణీత మయాదత్త మర్ఘ్యం సమ్యక్ ప్రసీదధ ||*

*ఋషభః పాపినాంశాస్తాత్వం యమ సమదర్శనః |*

*గృహాణార్ఘ్యం మయాదత్తం యథోక్త ఫలదోభవ ||*

---------------------------------------

*దానమంత్రం*

----------------------------------------

*ఏవం గుణవిశేషణ విశిష్టాయాంశుభతిథౌ* *అహం .....గోత్ర, .....నామధేయ ఓం ఇదం వస్తుఫలం(దానంయిచ్చే వస్తువుని పట్టుకొని) అముకం సర్వ పాపక్షయార్థం , శుభఫలావాప్త్యర్థం అముక ......గోత్రస్య(దానం పుచ్చుకొనేవారి గోత్రం చెప్పాలి) ప్రాచ్యం/నవీనందదామి అనేన భగవాన్ సుప్రీతః సుప్రసన్నః భవతు దాత దానము నిచ్చి అతని చేతిలో నీటిని వదలవలెను*.

------------------------------------

*దాన పరిగ్రహణ మంత్రం*

--------------------------------------

*ఓం ఇదం , ఏతద్ ఓమితిచిత్తనిరోధస్స్యాత్ ఏతదితి కర్మణి ఇదమితి కృత్యమిత్యర్థాత్* *అముకం ......గోత్ర , ....నామధేయః దాతృ సర్వపాప అనౌచిత్య* *ప్రవర్తనాదిక సమస్త దుష్ఫలవినాశార్థం ఇదం అముకం దానం ఇదమితి* *దృష్ట్యాన అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయః పరిగృహ్ణామి* *స్వీగృహ్ణామి దానమును తీసికొనవలయును*

-------------------------------------

*నదీస్నానమాచరించే సమయములో చదువవలసిన మంత్రము*

-------------------------------------

*పిప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరీ*

*సైకదం తే మయా దత్తం ఆహారార్తం ప్రకల్పితం*

---------------------------------------

*మృత్తికా లేపన మంత్రం*

----------------------------------------

*అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరే మృత్తికే హరమే పాపం యన్మయా దుష్కృతం కృతం*

----------------------------------------

*స్నానమాచరించే సమయములో స్నానానుజ్ఞ మంత్రము* 

---------------------------------------

*ఉధృతాపి వరాహేన కృష్ణేన శతబాహునా ఆరుహ్య మమగాత్రాణి సర్వం పాపం ప్రమోచయ పుణ్యందేహి మహాభాగే స్నానానుజ్ఞాం కురుష్వమాం*

---------------------------------------

*నదిలో నాభివరకు దిగినతరువాత పఠించవలసిన మంత్రము*

--------------------------------------

*గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ*

*నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు*

---------------------------------------

*నందినీ నళినీ సీతా మాలినీచ మహాపగా*

*విష్ణు పాదాబ్జ సంభూతాం గంగా త్రిపధగామినీ*

*భాగీరధీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ*

*ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే*

*స్నాన కాలే పటేన్నిత్యం మహాపాతక నాశనం*

----------------------------------------

*స్నానమాచరించే సమయములో తలుచుకోవలసిన నామాలు*

----------------------------------------

*పావని,హ్రదిని,నళిని,సీత,సుచెక్షువు,సింధువు,గంగ,పద్మావతి,భోగవతి,స్వర్ణరేఖ,కౌశికి,దక్ష, పృధివి,సుభగా,విశ్వకాయ,శివామృత,*

*విద్యాధరి,సుప్రసన్న,లోకప్రసాదిని,క్షేమ, వైష్ణవి,శాంతిదా,గోమతి,సతి,సావిత్రి,తులసి, దుర్గ,మహాలక్ష్మి,సరస్వతి,రాధిక,లోపాముద్రా, దితి,రతి,అహల్యా,అదితి,సంఙ్ఞ,స్వధా, స్వాహా,అరుంధతి,                        శతరూపా,దేవహూతి.*

---------------------------------------               *వైశాఖ మాసం ప్రారంభం*

-------------------------------------

*వైశాఖ మాసం విశిష్టత*

--------------------------------------

*వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం. మాసాలన్నింట్లో  వైశాఖమాసం ఉత్తమమైనది. విశేషదానాలకి ఎంతో పుణ్య ప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది. శ్రీ మహా విష్ణువు కు ప్రీతి కరమైన ఈ వైశాఖ మాసం లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం. ఈ మాసం లో  ఏక భుక్తం , నక్తం అయాచితం గా భుజించడం ఉత్తమం గా చెప్పబడింది. వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకు , తపస్సులకు పూజాదికాలకు , దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది.ఎవరైతే ఈ మాసం లో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో , వారికి ఉత్తమగతులు కలుగుతాయి. ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటి తో రావి చెట్టు మొదళ్ళను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు. ఈ మాసం లో శివునికి ధారపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితాలనిస్తుంది.మన సంస్కృతి ఉత్కృష్టమైనది. మనకు ఈ ప్రకృతి.. అందులోని చరాచరాలన్ని పూజనీయాలే ! అంతేకాకుండా మనం కాలగణనకు ఉపయోగించే తిథులు , నక్షత్రాలు , వారాలు , మాసాలు అన్నీ ఎంతో గొప్పదనాన్ని , ప్రత్యేకతను సంతరించుకున్నటువంటివే. చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకుని ఫాల్గుణం వరకు పన్నెండు నెలలు ఉన్నాయి. ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత , విశిష్టత ఉన్నాయి.కార్తీక మాఘమాసాల తర్వాత అంతటి మహత్యాన్ని స్వంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం వైశాఖం. ఈ నెలలోనే పూర్ణిమ తిథినాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖమాసం అనే పేరు ఏర్పడింది.ఆద్యాత్మికత , పవిత్రత , దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖమాసానికి ప్రత్యేక స్థానం ఉంది.ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాకరమైన నెల. అందువల్లనే వైశాఖమాసానికి మాధవమాసం అని పేరు.అత్యంత పవిత్రమైన మాసంగా పేరు పొందిన వైశాఖమాస మాహత్మ్యంను పూర్వం శ్రీమహావిష్ణువు  స్వయంగా శ్రీమహాలక్ష్మికి వివరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖమాసంలో ప్రతి దినమూ పుణ్యదినమే. అటువంటి ముప్పై పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణా గ్రంధాల్లో వివరించబడ్డాయి.ముఖ్యంగా స్నాన , పూజ , దానధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం , పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం.వైశాఖమాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది. అందుకు అవకాశం లేని స్థితిలో గంగ , గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ*

----------------------------------------

 *కాలువల్లోగానీ , చెరువులోగాని , బావుల వద్దగానీ అదీ కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి నీటియందు సకల దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు* *చెబుతున్నాయి.వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులను గురిచేస్తూ ఉంటాయి.*

*కనుక వేడిమినుంచి ఉపసమనం కలిగించేవాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం , నీరు , గొడుగు , విసనకర్ర , పాదరక్షలు వంటివి దానం చేయడం శ్రేష్టం. అట్లే దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం , చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది.*

*సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీమహావిష్ణువును తులసీదళాలతో పూజించవలెను. శ్రీమహావిష్ణువు వైశాఖమాసం మొదలుకొని మూడునెలలపాటూ ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు.*

-------------------------------------

*అతనికి అత్యంత ప్రీతికరమైన తులసీదళములతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడుతున్నది.*

---------------------------------------

   *’వైశాఖే మాధవో, రాధో’*

---------------------------------------

*ఈ మాసంలో విష్ణుస్మరణతో, అభీష్ట దేవతారాధనతో నియమపాలన చేయడం ఇహ పర శ్రేయస్సునిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. వైశాఖమాసాన్ని మహిమాన్వితమైన దివ్యమాసంగా శాస్త్రాలు వర్ణించాయి. ఈ మాసాన ప్రాతః కాలాన లేచి మధుసూదనుని స్మరిస్తూ స్నానం చేయడం విశేష ఫలప్రదం.*

-----------------------------------      *ప్రాతః సనియమ స్నాన్యే ప్రీయతాం మధుసూదనః!*

*అదే విధంలో*

---------------------------------------

*"మాధవే మేషగే భానౌ మురారే మధుసూదన*

*ప్రాతః స్నానేన మే నాథ ఫలదోభవ పాపహన్.*

----------------------------------------

*అనే ప్రార్థనతో తీర్థాదులలో చేసిన స్నానం దివ్యఫలాన్నిస్తుంది.*

---------------------------------------

*తులసీ కృష్ణ గౌరాభ్యాం తయాభ్యర్చ్య మధుద్విషమ్!*

*విశేషేణ తు వైశాఖే నరో నారాయణో భవేత్!!*

--------------------------------------

*మాధవం సకలం మాసం తులస్యాయోర్చయే న్నరః!*

*త్రిసంధ్యం మధుహంతారం తస్యనాస్తి పునర్భవః!!*

--------------------------------------

*వైశాఖమాసమంతా శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో అర్చించితే శ్రేష్ఠం.*

------------------------------------

*ప్రాతః స్నానానంతరం అధికజలంతో అశ్వత్థ (రావి) వృక్షపు మూలాన్ని తడిపి ప్రదక్షిణలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు.*

----------------------------------------

*ఈ మాసంలో ఒంటిపూట భోజనం లేదా నక్తం (పగలంతా ఉపవసించి రాత్రి ప్రారంభంలో భుజించడం) ఆచరించడం మంచిది.ఈ మాసంలో చలివేంద్రాలు, పళ్ళరసాలు, మజ్జిగ వంటి పానీయాల శాలలని నిర్వహించడం, విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు దానం చేయడం పుణ్యఫలాన్నిస్తుంది.*          ---------------------------------------      *వైశాఖ పురాణం ప్రారంభo*                               ----------------------------------------     *వైశాఖ పురాణము లోని అధ్యాయములు*

-------------------------------------                                       *1 . వైశాఖమాస ప్రశంస*

*2 . వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు - వాటి ఫలితములు*

*3 . వివిధ దానములు - వాటి మహత్యములు*

*4 . వైశాఖ ధర్మ ప్రశoస*

*5 . వైశాఖమాస విశిష్టత౮

*6 . జలదాన మహత్యము - గృహగోధికా కథ*

*7 . వైశాకమాస  దానములు*

*8 . పిశాచ మోక్షము*

*9 . సతీదేహ త్యాగము*

*10 . దక్షయజ్ఞనాశము కామదహనము*

*11 . రతి దుఃఖము - దేవతల ఊరడింపు*

*12 . కుమార జననము*

*13 . అశూన్య శయన వ్రతము*

*14 . ఛత్రదాన మహిమ*

*15 . వైశాకవ్రత మహిమ*

*16 . యముని పరాజయము*

*17 . యమదుఃఖ నిరూపణము*

*18 . విష్ణువు యముని ఊరడించుట*

*19 . పిశాచత్వ విముక్తి*

*20 . పాంచాలరాజు రాజ్యప్రాప్తి*

*21. పాంచాలరాజు సాయుజ్యము*

*22 . దంతిల కోహల శాపవిముక్తి*

*23 . కిరాతుని పూరజన్మ*

*24 . వాయుశాపము*

*25 . భాగవత ధర్మములు*

*26 . వాల్మీకి జన్మ*

*27 . కలిధర్మములు - పితృముక్తి*

*28 . అక్షయతృతీయ విశిష్టత*

*29 . శునీ మోక్షప్రాప్తి*

*30 . పుష్కరిణి - ఫలశ్రుతి---------------------------------------  *వైశాఖ పురాణం - 1 వ అధ్యాయము*

----------------------------------------

*వైశాఖమాస ప్రశంస:*

----------------------------------------

*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*

*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||*

--------------------------------------

*సూతమహర్షి శౌనకాది మహర్షులనుద్దేశించి యిట్లు పలికెను. మహర్షులారా! వినుడు రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని జూచి నమస్కరించి మహర్షీ! మీరు అన్ని మాసముల మహత్త్వమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి యుత్తమమైనది. శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ప్రీతి పాత్రమైనదని చెప్పినారు. వైశాఖమాసము శ్రీమహావిష్ణువునకు యిష్టమగుటకు కారణమేమి? ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి? మానవు లాచరింవలసిన దానములను, వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ, దానము మున్నగు వానిని యే దైవము నుద్దేశించి చేయవలయును? వాని ఫలమెట్టిది? పూజాద్రవ్యములెట్టివి? మున్నగు విషయములను దయయుంచి వివరింపగోరుచున్నానని సవినయముగ ప్రశ్నించెను.*

----------------------------------------

*నారదుడనేను రాజర్షీ! అంబరీషా! వినుమని యిట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మయు 'నారదా! శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగ వింటిని. నీకిప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోను కార్తికము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ మూడు మాసములలో వైశాఖమాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమందాచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నిటిని నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజా, జప, దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు. విద్యలలో వేదవిద్యవలె, మంత్రములలో ఓంకారమువలె, వృక్షములలో దివ్యవృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువులలో కామధేనువువలె, సర్వసర్పములలో శేషునివలె, పక్షులలో గరుత్మంతునివలె, దేవతలలో శ్రీమహావిష్ణువువలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలె యిష్టమైన వానిలో ప్రాణమువలె, సౌహార్దములు కలవారిలో భార్యవలె, నదులలో గంగానది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రమువలె, ధాతువులలో సువర్ణమువలె, విష్ణుభక్తులలో రుద్రునివలె, రత్నములలో కౌస్తుభమువలె, ధర్మహేతువులగు మాసములలో వైశాఖమాసముత్తమమైనది*

--------------------------------------

*విష్ణుప్రియమగుటచేతనే వైశాఖమాసమును మాధవమాసమనియునందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖమాసమునకు సాటియైనదిలేదు. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగ నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలసి అతిప్రీతితో వానినుద్దరింపనెంచును. ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీమహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించినవారికి అన్ని వరముల నీయ సిద్దమై యున్నాడు. వైశాఖమాసమున ఒకసారి మాత్రమే స్నానమును, పూజను చేసినను, పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారమునాళ్లు స్నానాదికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరియనుగ్రహ బలమున, కొన్నివేల అశ్వమేధయాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును. స్నానము చేయు శక్తి లేక, స్నాన సంకల్పము దృఢముగనున్నచో నతడు నూరు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యము నందును. సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖస్నానము నది/ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడై అశక్తుడై యున్నను, కొంతదూరమైనను యింటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగనున్నచో విష్ణు సాయుజ్యము నందును.*

-------------------------------------

*అంబరీష మహారాజా! సర్వలోకములయందున్న తీర్థ దేవతలు బాహ్యప్రదేశముననున్న జలము నదియైనను, తటాకమైనను, సెలయేరైనను, అందుచేరియుండును. జీవి చేసిన సర్వపాపములను, జీవి అట్టిజలమున పవిత్ర స్నానమాచరించు వరకును, యముని యాజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి రొద చేయుచుండును. జీవి వైశాఖమున అట్టి బాహ్యప్రదేశమున నున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమునధిష్టించి యున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును. సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమునాశ్రయించి యుండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయనివారిని శాపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞననుసరించి యిట్లు చేయుదురు. సూర్యోదయమైన ఆరు ఘడియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలము నావహించి స్నానమాడిన వారి పాపముల నశింప జేయుచుందురు.*

-----------------------------------

*వైశాఖ పురాణం ఒకటవ అధ్యాయము సంపూర్ణము*       -------------------------------------

Read More

మన ధర్మంలో ప్రతి చిన్న పని వెనుక ఒక గొప్ప సైన్స్, ఆధ్యాత్మికత దాగి ఉంటాయి.

 మనం రోజూ చేసే భోజనం కేవలం ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే కాదు.

అదొక పవిత్రమైన "యజ్ఞం" అని మీకు తెలుసా? 


మన ధర్మంలో ప్రతి చిన్న పని వెనుక ఒక గొప్ప సైన్స్, ఆధ్యాత్మికత దాగి ఉంటాయి. పూర్వకాలంలో (కొన్ని ఇళ్లల్లో ఇప్పటికీ) భోజనం చేసేటప్పుడు "ఆపోశనం", "పరిషేచనం" అని చేసేవారు. అసలు ఆ అద్భుతమైన ఆచారం వెనుక ఉన్న గొప్ప పరమార్థం ఏంటో ఇక్కడ చూద్దాం 👇:


💧 1. పరిషేచనం (విస్తరి చుట్టూ ప్రదక్షిణ): భోజనానికి ముందు కంచం లేదా విస్తరి చుట్టూ మంత్రం చదువుతూ నీరు చల్లుతారు. (పగలు పగలైతే "సత్యం త్వర్తేన పరిషించామి" అని, రాత్రి అయితే "ఋతం త్వా సత్యేన పరిషించామి" అని చదువుతారు). ఇలా చేయడం వల్ల మనం తినే ఆహారానికి క్రిమికీటకాల నుండి ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది.


🙏 2. అమృత తుల్యం: ఆ తర్వాత కుడిచేతి గుంటలో కొద్దిగా నీరు తీసుకుని "అమృతమస్తు అమృతోపస్తరణమసి" అని చదువుతూ తాగుతారు. అంటే మనం తినబోయే అన్నం అమృతంగా మారి మన శరీరానికి వంటపట్టాలని దీని అర్థం.


🔥 3. ప్రాణాహుతులు (ఆరు ముద్దలు): భోజనం మొదలుపెట్టే ముందు పవిత్రమైన గాయత్రీ మంత్రం ధ్యానిస్తూ.. ఓం ప్రాణాయ స్వాహా, అపానాయ స్వాహా, వ్యానాయ స్వాహా, ఉదానాయ స్వాహా, సమానాయ స్వాహా, బ్రహ్మణే స్వాహా.. అని ఆరు మంత్రాలు చదువుతూ ఆరు చిన్న ముద్దలను పంటికి తగలకుండా మింగుతారు.


✨ 4. అసలైన అర్థం (The Inner Meaning): మనం భోజనాన్ని ఎందుకు ఒక యజ్ఞం అంటారంటే.. మన శరీరమే ఒక యాగశాల. లోపల జీర్ణక్రియకు సహాయపడే 'జఠరాగ్ని' ఒక యజ్ఞగుండం లాంటిది. లోపల ఉన్న పంచప్రాణాలే యాగ దేవతలు. మనం తినే ఆ మొదటి ఆరు ముద్దలు ఆ దేవతలకు మనం సమర్పించే పవిత్రమైన నైవేద్యం!


🙌 5. ముగింపు: భోజనం పూర్తయ్యాక చివరగా కుడిచేతిలో కొద్దిగా నీరు తీసుకుని "అమృతాపిధానమసి" అని తాగి, మనకు ఈ అన్నం పెట్టిన వారికి, పండించిన రైతులకు "అన్నదాతా సుఖీభవ" అని మనసారా కృతజ్ఞతలు చెప్పాలి.




నిజం చెప్పండి... భోజనం చేసే ముందు కంచం చుట్టూ నీళ్లు చల్లడం (పరిషేచనం) లేదా దేవుడిని తలచుకుని ప్రాణాహుతులు తీసుకోవడం లాంటి ఆచారాలను మీరు ఎప్పుడైనా చూశారా? లేదా 


సర్వే జనాః సుఖినోభవంతు 

 లోకా సమస్తా సుఖినోభవంతు

Read More

13, ఏప్రిల్ 2026, సోమవారం

తమిళనాడు అరుపడైవీడు (6 మురుగన్ ఆలయాలు)

 🙏 తమిళనాడు అరుపడైవీడు (6 మురుగన్ ఆలయాలు)


🛕 1. Thiruparankundram Murugan Temple 🙏

✨ ఇది మురుగన్ స్వామి వివాహ స్థలం 💍

👉 ఇక్కడ స్వామి దేవసేన అమ్మవారిని పెళ్లి చేసుకున్నారు

🏔️ ఇది రాక్ కట్ (గుట్టలో చెక్కిన) పురాతన ఆలయం

🌟 పాపాలు తొలగి, వివాహ సమస్యలు తగ్గుతాయని నమ్మకం


🌊 2. Tiruchendur Subramanya Swamy Temple 🌊🔥

✨ ఇది సముద్ర తీరంలో ఉన్న ఏకైక మురుగన్ ఆలయం

👉 ఇక్కడ మురుగన్ స్వామి సూరపద్మాసురుడిని సంహరించారు ⚔️

🌊 సముద్ర స్నానం చేసి దర్శనం చేస్తే పాప విమోచనం

🙏 శత్రు బాధలు తొలగుతాయని భక్తుల నమ్మకం


⛰️ 3. Palani Murugan Temple 🛕

✨ ఇది చాలా ప్రసిద్ధి గల పళని మలై ఆలయం

👉 స్వామి పేరు: దండాయుధపాణి 🙏

🍯 ప్రసిద్ధి: పంచామృతం ప్రసాదం

🌟 కోరికలు నెరవేరే క్షేత్రంగా పేరు


🪔 4. Swamimalai Murugan Temple 🪔

✨ ఇక్కడ మురుగన్ స్వామి శివుడికి “ఓం” అర్థం చెప్పారు 📖

👉 “గురు”గా నిలిచిన ఆలయం 🙏

🌟 విద్య, జ్ఞానం కోసం భక్తులు ఎక్కువగా వస్తారు


🛕 5. Tiruttani Murugan Temple 🕊️

✨ ఇది శాంతి ప్రసాదించే ఆలయం

👉 యుద్ధం తర్వాత మురుగన్ స్వామి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారు 😌

🌟 కోపం తగ్గి, మనశ్శాంతి లభిస్తుందని నమ్మకం


🌳 6. Pazhamudircholai Murugan Temple 🌳🍃

✨ ఇది అడవిలో ఉన్న పవిత్ర ఆలయం

👉 ఇక్కడ మురుగన్ స్వామి వల్లీ, దేవసేనతో కలిసి ఉంటారు 💞

🌿 ప్రకృతి మధ్యలో దర్శనం చాలా పవిత్రంగా ఉంటుంది

🌟 కుటుంబ సుఖశాంతి కోసం దర్శనం చేస్తారు


🙏 ముగింపు

✨ ఈ 6 ఆలయాలు (అరుపడైవీడు) దర్శనం చేస్తే

👉 జీవితం లో శుభాలు, విజయాలు, శాంతి వస్తాయని నమ్మకం 🙏✨

Read More

ఆదివారం రోజు విశ్వకర్మ భగవణుడు గాయత్రి మాత సూర్యారాధన వల్ల సంపద🌞*

 *🌞ఆదివారం రోజు విశ్వకర్మ భగవణుడు గాయత్రి మాత సూర్యారాధన వల్ల సంపద🌞*


 1. సూర్యుడు – జీవానికి మూలం


సర్వలోకాలకు ప్రాణాధారం సూర్యుడు. భూమిపై జీవం, ఆహారం, వర్షం—ఇవన్నీ సూర్యుడి శక్తివల్లే జరుగుతాయి. అందుకే వేదాలలో సూర్యుని “ప్రత్యక్ష దైవం”గా పూజిస్తారు.


 2. పురాణాలలో సూర్యుని మహిమ


 అక్షయపాత్ర కథ


ధర్మరాజు అరణ్యవాసంలో ఉన్నప్పుడు తనతో వచ్చిన ప్రజలకు ఆహారం ఎలా ఇవ్వాలో తెలియక సూర్యుని ప్రార్థించాడు.

అప్పుడు సూర్యుడు ఆయనకు అక్షయపాత్రను ఇచ్చాడు.


 ఆ పాత్ర ప్రత్యేకత:


ఎప్పుడూ ఖాళీ కాదు

ఎన్ని మందికి అయినా ఆహారం సరిపోతుంది


ఇది “సంపద” అంటే కేవలం డబ్బు కాదు, ఆహారం, సమృద్ధి అని సూచిస్తుంది.


 శమంతక మణి కథ


సత్రాజిత్తు అనే రాజు సూర్యుడిని ఆరాధించి శమంతక మణి పొందాడు.


 ఆ మణి ప్రత్యేకత


ప్రతిరోజూ బంగారం ఉత్పత్తి చేస్తుంది

ఇది ధనసంపదకు సంకేతం.


 3. జ్ఞానం


ఆంజనేయుడు కూడా సూర్యుడిని గురువుగా తీసుకుని వేదాలు నేర్చుకున్నాడు.


గాయత్రీ మంత్రం కూడా చెబుతుంది


సూర్యుడు మన బుద్ధిని ప్రేరేపిస్తాడు

అంటే జ్ఞానం = నిజమైన సంపద



🧘‍♂️ 4. సూర్యారాధన & యోగం


🌞 సూర్య నమస్కారాలు

సూర్య నమస్కారం చేయడం వల్ల

శరీరానికి శక్తి పెరుగుతుంది

మనస్సు ప్రశాంతంగా ఉంటుంది

ఆరోగ్యం మెరుగవుతుంది


 శరీరం + మనస్సు + ప్రాణం → సమతుల్యం అవుతాయి


 5. సూర్య శక్తి ప్రభావం


సూర్యశక్తి మనలో

శక్తి కేంద్రాలను (చక్రాలు) జాగృతం చేస్తుంది

ఆహారం మీద ఆధారాన్ని తగ్గిస్తుంది (యోగ స్థితి)

అంతర్గత శాంతి కలిగిస్తుంది


 ఇది “యోగ శరీరం”గా మారడం అని అంటారు


 6. సూర్య కిరణాలు & రంగులు (చికిత్స)

సూర్యకాంతి 7 రంగులలో ఉంటుంది:


 నారింజ రంగు

వేడి పెంచుతుంది

జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది

చలి సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది



 ఆకుపచ్చ రంగు 

కండరాలు బలపడతాయి

మెదడు శక్తి పెరుగుతుంది

కీళ్ళ నొప్పులు తగ్గుతాయి


నీలం రంగు

శరీరాన్ని చల్లగా ఉంచుతుంది

పిత్త సంబంధిత రోగాలు తగ్గిస్తుంది


 ఈ విధంగా “కలర్ థెరపీ”లో సూర్యకాంతిని ఉపయోగిస్తారు


 7. మనస్సు నియంత్రణలో సూర్యుడు

మనస్సును చంద్రుడు నియంత్రిస్తాడు

చంద్రుడికి వెలుగు ఇచ్చేది సూర్యుడు


కాబట్టి: సూర్యుడు → చంద్రుడు → మనస్సు → కర్మలు

 అంటే సూర్యారాధన వల్ల మన జీవితం సరిగ్గా నడుస్తుంది


సూర్యారాధన వల్ల:

💰 ధనసంపద

🧠 జ్ఞానం

🧘‍♂️ ఆధ్యాత్మిక శాంతి

💪 ఆరోగ్యం

😊 మనశ్శాంతి ఇవన్నీ కలుగుతాయి.


 అందుకే మన పూర్వీకులు ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యునికి నమస్కారం చేయమని చెప్పారు.

Read More

_10-15 నిమిషాల్లో తినేస్తున్నారా ?_*

 *_10-15 నిమిషాల్లో తినేస్తున్నారా ?_* 


*_సాధారణంగా 10-15 నిమిషాల్లో భోజనం చేస్తే దాన్ని వేగంగా తినడంగా భావిస్తారు. అంటే ఆహారాన్ని సరిగా నమల్లేదని అర్థం._*


 *_దీనివల్ల బరువు పెరుగుతారు. బ్లడ్ షుగర్ లెవల్ పెరిగి టైప్-2 డయాబెటిస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది._*


*_శరీరానికి పోషకాలు సరిగా అందవు. 20-30 నిమిషాల పాటు తినాలని, ప్రతి ముద్దను 20-30 సార్లు నమలాలని వైద్యులు సూచిస్తున్నారు._*


*_తినే సమయంలో టీవీలు, మొబైల్స్ పక్కనపెట్టాలట._*

Read More

చెడు సమయం వచ్చే ముందు కనిపించే 5 ప్రధాన సంకేతాలు

 *🌹 చెడు సమయం వచ్చే ముందు కనిపించే 5 ప్రధాన సంకేతాలు 🌹


*ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మనిషి జీవితానికి సంబంధించి ఎన్నో గొప్ప విషయాలను చెప్పారు. ముఖ్యంగా ఒక వ్యక్తికి లేదా ఒక కుటుంబానికి చెడు కాలం రాబోయే ముందు ప్రకృతి మనకు కొన్ని సంకేతాలను ఇస్తుందని ఆయన వివరించారు. ఈ సూచనలను మనం గమనించి ముందే జాగ్రత్త పడితే రాబోయే పెద్ద పెద్ద ఆపదల నుండి తప్పించుకోవచ్చని ఆయన బోధించారు. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.*


*మొదటి సంకేతం ఏమిటంటే ఇంట్లో అకస్మాత్తుగా తులసి మొక్క ఎండిపోవడం. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో అక్కడ తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. కానీ ఏదైనా కారణం లేకుండా తులసి మొక్క ఎండిపోతుంటే అది ఆర్థిక కష్టాలకు మరియు దరిద్రానికి సూచన అని చాణక్యుడు చెప్పారు. ఇది రాబోయే విపత్తు గురించి మనల్ని హెచ్చరిస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.*


*రెండోది ఇంట్లో జరిగే అనవసర గొడవలు. ప్రశాంతంగా ఉండే కుటుంబంలో అకస్మాత్తుగా చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలయ్యాయంటే అది చెడు కాలానికి సంకేతం. ఎక్కడైతే నిత్యం కలహాలు జరుగుతాయో అక్కడ లక్ష్మీదేవి నిలవదు. దీనివల్ల మనిషి మానసిక ప్రశాంతత కోల్పోయి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. ఇది చివరకు ఆస్తి నష్టానికి మరియు సమాజంలో గౌరవం పోవడానికి దారితీస్తుంది.*


*మూడో ముఖ్యమైన విషయం పెద్దలను గౌరవించకపోవడం. ఎప్పుడైతే మనిషికి అహంకారం పెరిగి తన కన్నవారిని లేదా గురువులను కించపరచడం మొదలుపెడతాడో అప్పుడే అతని పతనం మొదలవుతుంది. చెడు కాలం వచ్చే ముందు మనిషికి తన మంచి కోరే పెద్దలు కూడా శత్రువుల్లా కనిపిస్తారు. వారి మాటలను పట్టించుకోకుండా ప్రవర్తించడం వల్ల సర్వనాశనం తప్పదని చాణక్యుడు హెచ్చరించారు.*


*నాలుగోది గాజు వస్తువులు లేదా అద్దం పగిలిపోవడం. ఇంట్లో అకస్మాత్తుగా పదేపదే అద్దాలు పగిలిపోవడం కూడా శుభసూచకం కాదు. ఇది రాబోయే భారీ ఆర్థిక నష్టాన్ని లేదా కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దెబ్బతినడాన్ని సూచిస్తుంది. వ్యాపారం చేసేవారు ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.*


*చివరిగా ఐదవ సంకేతం ఇంట్లో అపవిత్రత పెరగడం. సాధారణంగా శుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కానీ చెడు సమయం వచ్చే ముందు ఆ ఇంట్లో వారు క్రమశిక్షణ కోల్పోయి అపరిశుభ్రంగా ఉండటం లేదా ఇంట్లో వ్యర్థాలను పేరుకుపోయేలా చేయడం చేస్తారు. ఇది ఇంటి ప్రశాంతతను దెబ్బతీసి దరిద్రాన్ని ఆహ్వానిస్తుంది.*


*ఈ ఐదు లక్షణాలు మన జీవితంలో లేదా మన ఇంట్లో కనిపిస్తున్నాయంటే మన లైఫ్ పతనం దిశగా సాగుతోందని అర్థం చేసుకోవాలి. ఆచార్య చాణక్యుడు చెప్పినట్లు ఈ సంకేతాలను గుర్తించిన వెంటనే మన ప్రవర్తనను మార్చుకుని పెద్దల సలహాలు పాటిస్తూ భక్తితో మెలిగితే ఆ కష్టాల నుండి మనం బయటపడవచ్చు. కాబట్టి ఇలాంటి మార్పులు గమనించినప్పుడు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా జాగ్రత్త పడటం ఎంతో అవసరం.*

🌹🌹🌹🌹🌹.                                      

Read More

కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు ఇవే.............!!

 *





కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు ఇవే.............!!


హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.


1. విద్యా ప్రాప్తికి:-

పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!

సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!


2. ఉద్యోగ ప్రాప్తికి :-

హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!

ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!


3. కార్య సాధనకు :-

అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!

రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!


4. గ్రహదోష నివారణకు :-

మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!

శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!


5. ఆరోగ్యమునకు :-

ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!

ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!


6. సంతాన ప్రాప్తికి :-

పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!

సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!


7. వ్యాపారాభివృద్ధికి :-

సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!

అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!


8. వివాహ ప్రాప్తికి :-

యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!

వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!


ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 48 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.













దివ్య మూలిక : అమావాస్య, ఆదివారం మంగళ, శుక్ర అమావాస్య రోజులలోగాని అత్తిపత్తి చెట్టును పూజించి కార్యసిద్ధికై ఆ చెట్టు వేరుని (మొక్క చనిపోకుండా తీసుకోవాలి) సేకరించి భార్యభర్తలు ధరించిన కలహాలు లేని కాపురంగా సాగిపోతుంది. ఇద్దరు స్నేహితులు ధరిస్తే జీవితాంతం వరకు విడిపోరు. వ్యాపార స్థలంలో దీన్నుంచితే శాశ్వత కష్టమర్లు ఆ షాపుకు పెక్కుమంది పెరుగు దురు. వ్యాపారం దినదినాభివృద్ధి చెందును*

Read More

ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు"*

 *"ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు"*



*అప్పట్లో మన దేశములో ఆది వారం సెలవు దినం కాదు .

*నెలలో పున్నమి, అమావాస్య రోజుల్లో మాత్రమే సెలవులు ఇచ్చేవారట. ఇదే  తరువాత రోజుల్లో నానుడి అయింది  -అమావాస్యకో పున్నమికో అంటుంటాము కదా? ఇక పోతే  నేడు మనం సెలవు దినంగా  భావించే ఆదివారము ఆంగ్లేయుల కాలం నుండి మొదలయింది . *ఆదివారం మనకి చాలా శక్తివంతమైన దినం. "ఈ ఆదివారము మనకు సూర్యారాధన దినము , చాలామంది అప్పట్లో సూర్యారాధన చేసేవాళ్ళు . "భారతీయులు యొక్క మేధస్సుకు, శక్తికి ఈ ఆదివార దీక్ష కారణం అని తెలుసుకున్న తెల్లవారు బలవంతంగా మనకి ఆదివారం సెలవును పులిమారు. "ఇపుడు ఆది వారం అంటే సెలవు దినం , మందు మాంసాల దినం అయింది కానీ అంతకు ముందు అదో సుదినం మనకు . 


*అప్పటిలో ఉన్న వృత్తి విద్యల్లో ఉన్నవాళ్ళకి సెలవులు అంటూ  ప్రత్యేకంగా ఏమి ఉండేవి కావు. "విద్యార్థులకు మాత్రం  గురుకులా ల్లో పక్షానికి నాలుగు దినాలు- పాడ్యమి, ఆష్టమి, చతుర్దశి, పూర్ణీమ- అమావాస్య  రోజులు  అవిద్య దినాలని విద్య నేర్పే వారు కాదు. "మనం వాల్మీకి రామాయణములో  అశోకవనంలో ఉన్న  సీతమ్మను "ప్రతిపద్ పాఠశిలస్య విద్యేవ తనుతాంగతా" అని వర్ణించాడు మహర్షి . "పాడ్యమినాడు పాఠాలు చదివే వాడి చదువులాగ సన్నగా  చిక్కిపోయిందట సీతమ్మ. కనుక, పాడ్యమినాడు అయితే  చదువుగాని, చింతనం గాని ససేమిరా ఉండేవి కావు. "చింతన మంటే జరిగినపాఠాన్ని మరొకరితో పాటు చదువుతూ పరిశీలించడం కూడా అసలు ఉండేవి కావు. "ఆదివారం నాడు  విధిగా సూర్య ఉపాసన చేసేవారు.  


*మనకు ప్రపంచములో ఉన్న ఇతర నాగరికతలో కూడా సూర్యారాధన ఉన్న విషయం తెలిసిందే. "మన నుండే ఈ సూర్యారాధన ఇతర దేశాలకు కూడా వెళ్ళింది . "అప్పట్లో దుకాణాలు కూడా పౌర్ణమి, అమావాస్యలకు మూసేసేవారు. "ఆదివారం నాడు నేడు జల్సాలు చేస్తున్నట్టు చేయకూడదని మనకు మన వేదాలలోనే కాదు  "స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి"   అంటూ మన సూర్యాష్టకం లో ఉంది . "మన కర్మ వశాత్తు మానవుడు ఏమి ఆ రోజు చేయకూడదని చెప్పారో నేడు అదే  దారిలో మనం ఆచరిస్తూ ములిగిపోతున్నాము. "అందరికి చెప్పడానికి  శక్తీ సరిపోదు. వందమందితో ఒకరిద్దరు గుర్తించినా ఈ పోస్ట్ సార్ధకత పొందినట్టే. .


            సర్వేజనాః సుఖినోభవంతు


- శివోహం 🙏

Read More

Powered By Blogger | Template Created By Lord HTML