.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

5, మే 2026, మంగళవారం

కృష్ణాజ్గారక చతుర్థి 𝕝𝕝卐𝕝𝕝_*

- కృష్ణాజ్గారక చతుర్థి 𝕝𝕝卐𝕝𝕝_*

*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*


భూమి పుత్రుడు అంగారకుడు. నవగ్రహాలలో కుజునిగా పేరు గాంచాడు. మంగళుడు అని కూడా అంటారు. ఏడు వారాల్లో మంగళవారానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. వినాయకునికి ఇష్టమైన చతుర్థి తిథి మంగళవారం నాడు వచ్చినప్పుడు ఆరోజును అంగారక చతుర్థి అంటారు. అలాగే బహుళపక్షంలో చవితి తిథి మంగళవారం వస్తే దానిని కృష్ణాంగారక చతుర్థి అంటారు. 

కృష్ణ అంగారక చతుర్థికి సూర్యగ్రహణంతో సమానమైన శక్తి ఉంటుందని చెబుతారు. సూర్యగ్రహణం రోజున కొన్ని పనులు చేస్తే ఏ విధంగా అయితే మంచి ఫలితాలు వస్తాయో అదేవిధంగా కృష్ణ అంగారక చతుర్థి రోజు కూడా కొన్నిపనులు మీకు శుభ ఫలితాలను ఇస్తాయని అదృష్టం తీసుకువస్తాయని చెబుతున్నారు.

కుజుని ధ్యానం వల్ల దాంపత్య సమస్యలు, సంతాన సంబంధమైన సమస్యలు, ఋణ సమస్యలు తొలగిపోతాయి.

నేడు కుజ భగవానుడికి పూజ చేసిన, ఋణవిమొచన అంగారక స్తోత్రమ్ చదివిన, కందిపప్పు (1.25) కేజీ, ఎర్రటి వస్త్రం దానం చేసిన, కుజ భగవానుడికి ఎర్ర దారం వత్తితో కలిపి దీపారాధన చేసిన, వ్యవసాయ భూమి, ఇల్లు, కోర్టు, అప్పుల భాధల నుండి ఉపశమనం కలుగుతుంది. నేడు పితృ తర్పణం ఇస్తే మామూలు రోజుల్లో పితృతర్పణం చేసిన దానికన్నా ఎక్కువ ఫలితం ఉంటుంది.


ఓం అంగారకాయ విద్మహే

శక్తి హస్తాయ ధీమహి

తన్నో కుజః ప్రచోదయాత్

*_ॐ లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 卐_*


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML