*కాకబలి :*
దురదృష్టవశాత్తు కొంతమంది చిన్న పిల్లలు అకస్మాత్తుగా చనిపోతారు. అలాంటి అభాగ్యులైన బిడ్డలకు పితృపక్షంలో వచ్చే త్రయోదశినాడు ఒక ప్రత్యేకమైన శాంతి ప్రక్రియను చేస్తారు. దీనిని "కాకబలి” అని పిలుస్తారు. ఆ మర్నాడు ఆ బిడ్డల ఆత్మశాంతికోసం శ్రార్ధకర్మలను నిర్వహిస్తారు.
సాధారణంగా, భారతదేశంలోని హైందవులు- గయ/కాశి/ప్రయాగ/కురుక్షేత్ర/నైమిశారణ్యం/రామేశ్వరం- క్షేత్రాలలో తమ పితృదేవతలకు ముఖ్యంగా తల్లిదండ్రులకు శ్రార్ధకర్మలు చెయ్యటం జరుగుతుంది. కలకత్తా నగరంలోని జగన్నాధ్ ఘాట్ వద్ద పితృపక్షంలో పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం ఎంతో పుణ్యాన్ని ఇస్తుందని చెబుతారు.
ఈలోకంలో ఏ సుఖాలు అనుభవించకుండానే చనిపోయిన చిన్న పిల్లలకు మరియు సుఖాలను విసర్జించి సన్యాసులుగా మారిపోయిన వారికి పితృపక్షంలోని ద్వాదశినాడు శ్రార్ధకర్మలు చేస్తారు. ఆయుధాలచేత చనిపోయినవారికి, హింసాత్మక చావు పొందినవారికి పితృపక్షంలోని చతుర్దశి తిధినాడు శ్రార్ధకర్మలు చేస్తారు. దీనిని "ఘాతచతుర్దశి” (గాయముల/దెబ్బల) అని పిలుస్తారు.
ఏ తిధినాడు చనిపోయాడు/చనిపోయింది అనే ప్రశ్న లేకుండా, చనిపోయిన పెద్దలందరికీ (పితృదేవతలు) పితృపక్షంలోని చివరి రోజు అయిన అమావాస్యనాడు చేసే శ్రార్థప్రక్రియను “సర్వపిత్రి అమావాస్య" అనే పేరుతో పిలుస్తారు. ఈ తిధి రోజున పితృదేవతలకు తర్పణాలు వదిలితే, గయా క్షేత్రంలో శ్రార్ధకర్మలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, అంత పుణ్యం వస్తుందని హైందవ మంత్రశాస్త్రాలు ఉద్ఘాటిస్తున్నాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి