*_𝕝𝕝ॐ𝕝𝕝 22/09/2025 - శ్రీ దేవీ శరన్నవరాత్రులు 1వ రోజు - అలంకారం: “ఇంద్రకీలాద్రి”పై అమ్మవారు "శ్రీ బాలా త్రిపుర సుందరి దేవీ" అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. 𝕝𝕝卐𝕝𝕝_*
*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*
*_శ్రీ బాలా త్రిపుర సుందరి దేవీ_*
*≈≈≈━❀꧁ 🔆 ꧂❀━≈≈≈*
*_శ్లో|| హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వసుధాదౌతాం; త్రినేత్రోజ్జ్వలామ్ వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్!!_*
త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అందుకే ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజచేస్తారు. త్రిశతీ పారాయణం గావిస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలిగిపోతాయి.
*𝕝𝕝ॐ𝕝𝕝 _oఓo శ్రీమాత్రే నమః_ 𝕝𝕝卐𝕝𝕝*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి