.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

13, సెప్టెంబర్ 2025, శనివారం

శ్రీరామకృత కాత్యాయని స్తుతి.!🙏

 శ్రీరామకృత కాత్యాయని స్తుతి.!🙏


నమస్తే త్రిజగద్వన్ద్యే సంగ్రామే జయదాయిని ।

ప్రసీద విజయం దేహి కాత్యాయని నమోఽస్తుతే ॥


“మూడులోకాలచే పూజింపబడే కాత్యాయనీ దేవీ!

నీకు నా నమస్కారము,

యుద్ధరంగం లో నాకు విజయాన్ని ప్రసాదించు.


సర్వశక్తిమయే దుష్టరిపునిగ్రహకారిణి|

దుష్టజృమ్భిణి సంగ్రామే జయందేహి నమోఽస్తుతే॥


సమస్తమైన శక్తుల రూపంలో నిండిన ఓ దేవీ!

నీకు నా నమస్కారములు.”

దుష్టులైన శత్రువులను సంహరించు, యుద్ధరంగంలో నాకు విజయాన్ని ప్రసాదించు.


త్వమేకా పరమాశక్తిః సర్వభూతేష్వవస్థితా|

దుష్టాన్సంహర సంగ్రామే జయందేహి నమోఽస్తుతే॥


సమస్త భూతాలలో వ్యాపించి ఉన్న “ఓ పరమశక్తి నీకు నా నమస్కారం.”

యుద్ధ రంగములో దుష్టులను సంహరించి నాకు విజయాన్ని ప్రసాదించుము.


రణప్రియే రక్తభక్షే మాంసభక్షణకారిణి।

ప్రపన్నార్తిహరే యుద్ధే జయందేహి నమోఽస్తుతే॥


రక్తమాంసాలను భుజించే భయానకరూపిణి! 

ఓ రణప్రియ! నీకు నా నమస్కారం.”

నిన్ను శరణుజొచ్చిన వారి కష్టాలను తొలగించు.

యుద్ధంలో నాకు విజయాన్ని ప్రసాదించు.


ఖట్వాంగాసికరే ముండమాలాద్యోతితవిగ్రహే ।

యే త్వాం స్మరన్తి దుర్గేషు తేషాం దుఃఖహరా భవ ॥


చేతులలో ఖట్వాంగం (మృత్యుదండం) మరియు ఖడ్గం పట్టినదానవు, మెడలో కపాల మాలలతో ప్రకాశించే దివ్య స్వరూపిణివి. కష్ట సమయాల లోను, ప్రమాదపు అంచుల లోను నిన్ను స్మరించే వారి యొక్క దుఃఖాలను తొలగించు.”


త్వత్పాదపంకజాద్దైన్యం నమస్తే శరణప్రియే|

వినాశాయ రణే శత్రూన్ జయందేహి నమోఽస్తుతే॥


శరణాగతులను రక్షించుట యందు ఆసక్తికల ఓ దేవి , నీ పాద పద్మములను ధ్యానించి నమస్కరిస్తున్నాను నా శత్రువులను నశింపచేసి నాకు విజయాన్ని ప్రసాదించు.”


చిన్త్యవిక్రమేఽచిన్త్యరూపసౌన్దర్యశాలినీ ।

అచిన్త్యచరితేఽచిన్త్యే జయందేహి నమోఽస్తుతే॥


ఓ అచిన్త్యశక్తి! నీకు నా నమస్కారం.”ఆలోచించలేనంత మహావిక్రమం కలిగిన దానవు, మనస్సు తో ఊహించని నిగూఢ కార్యములు చేయు దానవు వర్ణించలేనంత సౌందర్యరూపిణివి , యుద్ధంలో నాకు విజయాన్ని ప్రసాదించు.


యే త్వాం స్మరన్తి దుర్గేషు దేవీం దుర్గవినాశినీమ్ ।

నావసీదన్తి దుర్గేషు జయం దేహి నమోఽస్తుతే ॥


దుర్గవినాశినీ దేవీ! నీకు నమస్కారం.

కష్ట సమయాలలో నిన్ను స్మరించే వారు ఎన్నడూ కృశించరు. వారికి ఎల్లప్పుడూ విజయాలను ప్రసాదించు.


మహిషాసృక్ప్రియే సంగ్యే మహిషాసురమర్దినీ ।

శరణ్యే గిరికన్యే మే జయం దేహి నమోఽస్తుతే ॥


మహిషాసురమర్దినివి , శరణాగతులకు ఆశ్రయమైన దానవు హిమగిరికుమార్తె అయిన ఓ పార్వతీ దేవి నీకు నమస్కారం.”

యుద్ధరంగంలో నాకు విజయాన్ని ప్రసాదించు.


ప్రసన్నవదనే చణ్డి చణ్డాసురవిమర్దినీ ।

సంగ్రామే విజయం దేహి శత్రూన్ జహి నమోఽస్తుతే ॥


ప్రసన్నమైన వదనముగల దానవు , చండాసురుని సంహరించిన దానవు అయిన ఓ చండికా దేవి నీకు నమస్కారం !

నా శత్రువులను జయించి యుద్ధరంగంలో నాకు విజయాన్ని ప్రసాదించు.


రక్తాక్షి రక్తదశనే రక్తచర్చితగాత్రకే ।

రక్తబీజనిహన్త్రీ త్వం జయందేహి నమోఽస్తుతే॥


ఎరుపు కళ్ళుగల దానవు 

ఎరుపు పళ్ళుగల దానవు 

 రక్తముతో అలంకరింపబడిన శరీరముగల దానవు 

రక్తబీజాసురుని సంహరించినవు అయిన దేవీ నాకు యుద్ధంలో విజయాన్ని ప్రసాదించు. 


నిశుమ్భశుమ్భసంహన్త్రి విశ్వకర్త్రి సురేశ్వరి ।

జహి శత్రూన్ రణే నిత్యం జయందేహి నమోఽస్తుతే॥


“ఓ సురేశ్వరి! నిశుంబుడు, శుంబుడను అను దుష్టులను సంహరించిన దేవీ!

జగత్తు నకు సృష్టికర్తవు నీవే. యుద్ధంలో నా శత్రువులను సంహరించి నాకు విజయాన్ని ప్రసాదించు.”


భవాన్యేతత్సర్వమేవ త్వం పాలయసి సర్వదా ।

రక్ష విశ్వమిదం మాతర్హత్వైతాన్ దుష్టరాక్షసాన్॥


“ఓ భవాని! ఈ జగత్తు నంతా ఎల్లప్పుడూ నీవే పాలిస్తున్నావు.

మాతా! 

ఈ దుష్టరాక్షసులను సంహరించి మా విశ్వాన్ని రక్షించు.”


త్వం హి సర్వగతా శక్తిర్దుష్టమర్దనకారిణి ।

ప్రసీద జగతాం మాతర్జయం దేహి నమోఽస్తుతే ॥


 నీవు సర్వవ్యాపక శక్తివి, దుష్టులను సంహరించే దానవు, జగన్మాతా 

నీకు నమస్కారము 

కరుణించి నాకు విజయాన్ని ప్రసాదించు.”


దుర్వృత్తవృన్దదమిని సద్వృత్తపరిపాలినీ ।

నిపాతయ రణే శత్రూన్ జయందేహి నమోఽస్తుతే॥


దుర్మార్గులను అణచివేసి దుష్టశక్తులను నశింపజేసి ఆపదల నుండి కాపాడి సద్గుణులను రక్షించే తల్లి”నీకు నమస్కారం 

నా శత్రువులను నశింపజేసి నాకు విజయాన్ని ప్రసాదించు. 


కాత్యాయని జగన్మాతః ప్రపన్నార్తిహరే శివే ।

సంగ్రామే విజయం దేహి భయేభ్యః పాహి సర్వదా ॥


“ఓ జగన్మాతా కాత్యాయనీ! శరణాగతుల యొక్క కష్టాలను తొలగించే శివస్వరూపిణి!

అన్ని భయాలనుండి ఎల్లప్పుడూ రక్షించు.”

యుద్ధరంగంలో నాకు విజయాన్ని ప్రసాదించు.


ఇతి శ్రీమహాభాగవతే మహాపురాణే శ్రీరామకృతా కాత్యాయనీస్తుతిః॥

సేకరణ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML