.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

10, ఏప్రిల్ 2018, మంగళవారం

ఆంజనేయుని పూజిస్తే శని పీడ వుండదా.....?

ఆంజనేయుని పూజిస్తే శని పీడ వుండదా.....?
యుద్ధంలో మైరావణుని తలపడే సమయంలోఅనుకోని విధంగా లక్ష్మణుడు,కొంతమంది వానరులు మైరావణుని శరాఘాతాలకి మూర్ఛపోతాడు .ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోక నిరుత్సాహంగా,దిగులుతో ఉవ్న శ్రీరాముని వంక చూసినహనుమ తన వంతు సహాయం కోసం,రామచంద్రుని అజ్ఞకోసం ఎదురచూడసాగాడు .

దీన్నిగమనించిన రాములవారు మునీశ్వరులు తదితరులు చెప్పిన విధంగా సంజీవిని పర్వతం తీసుకురమ్మని చెప్పారు రామచంద్రుని అజ్ఞరాగానే హనుమ వాయువేగంతో ఆకాశమార్గానికేసి పయనమయ్యాడు.

దిన్ని గమనించిన శుక్రాచార్యులు (రాక్షసుల కుల గురువు) వారు ఎలాగైనాసరే హనుమ పయనాన్ని ఆపాలని నిర్ణయించుకున్నాడు .కార్యసాధకుడని పేరుగల హనుమ సంజీవిని మూలికలను తీసుకువస్తే ముర్చపోయిన అందరికి తిరిగి శక్తి అపరిమితంగా వస్తుంది .ఇక వారితో తలపడటం ఎవరివల్లాకాదు అని దుర్బుద్ధితో నవగ్రహాల్లో అత్యంతభయోత్పాతకుడైన శనిని హనమను ఇబ్బందిపాలుచేసి అతని కార్య సాధనకు భంగం కలిగించమని అజ్ఞ జారీ చేసాడు.

గురువుగారు చెప్పిందే తడవుగా శనేశ్వరుడు తన ప్రతాపాలన్నిటిని హనుమమీదప్రయోగించటానికి సిద్ధమవుతాడు .

ఈ లోగ హనుమ తాను వెళ్ళిన ప్రదేశమంతా వెతికి వెతికి ఆ సంజీవిని మూలిక ఏదో తెలీక మొత్తం పర్వతాన్నే పెకిలించుకుని ఆకాశ మార్గాన వస్తుంటాడు, దీన్నిచూసిన శని హనుమని మర్గమధ్యన ఆపి ,తను రావణాసురుడు పంపగా వచ్చానని ,ఈ పర్వతాన్ని తీసుకు వెళ్ళడానికి వీల్లేదని గొడవ చేస్తాడు .ఈ మాటలకి హనుమకు విపరీతమైన కోపం వచ్చి తన ఆవేశాన్ని ఆపుకుంటూరామనామ జపం చేస్తూ తన పాదాలతో శనికి ఊపిరికూడా ఆడకుండా నొక్కి పెడతాడు .

హనుమ మహిమ తెలుసుకున్న శని చివరకు తను తప్పుగా అడ్డుకున్నానని హనుమకు క్షమాపణలు చెప్పి తనను వదిలేయమని ప్రాదేయపడతాడు.
తన కాళ్ళక్రింద  శని పడే బాధను చూసి, తప్పు తెలుసుకున్న శనిని హనుమ విడిచిపెడుతూ .....కొన్ని షరతులు పెడతాడు .

ఎవరైతే ప్రతిరోజు మూడుపూటలా రామనామ జపం జపిస్తూ౦టారో వారి జోలికి, ఎవరైతే తనను ఎల్ల వేళలాపూజిస్తుంటారోవారి జోలికి వెళ్ళటంకానీ ,వారి మీద కనీసం నీ చూపు కూడా పడటానికి వీల్లెదని శని భయపడేవిధంగా అజ్ఞ జారీ చేస్తాడు .దానికి శనేశ్వరుడు తన అంగీకారం తెలియజేస్తూ తనూ ఓ కోరిక కోరతాడు .అది ఏమిటంటే .....

మీ దేవాలయాలు ఉండేచోట నా విగ్రహం ఉంటూ ,ప్రతి శనివారం మీతోపాటునాకు అభిషేకాలు జరిగేలా చూడాలని అప్పుడే భక్తుల పాలిట జాగ్రత్తగా వుంటానని తన కోరికను హనమకు చెప్తాడు.

హనుమ శని కోరికకు తధాస్తు పలికి శనేశ్వరుని అశ్వీర్వదించి పంపిస్తాడు .అప్పట్నించి శని దశ నడుస్తున్నవారు ,మాములుగా భక్తులు ప్రతి శనివారం ఆంజనేయస్వామికి అభిషేకాలు ,పూజలు తప్పకచేస్తుంటారు అలా చేస్తేనే శని మహారాజు వీరిపట్ల తన తీక్షణతను విరమిస్తాడని పురాణ కధనం .

జై భజరంగబలి కి జై

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML