ధర్మం గుఱించి "కర్ణ-శ్రీకృష్ణ" సంవాదం
ఓ కృష్ణా! నేను పుట్టి పుట్టక ముందే నా తల్లి కుంతి నన్నువదిలి వేసింది,
అలా పుట్టడం నా తప్పా? నా పాపం కాదు గదా ?
నేను సూతుడనైనందున ద్రోణుడు నాకు విద్య నేర్పలేదు
పరశు రాముడు నాకు యుద్ద విద్య నేర్పాడు కాని, అవసర సమయంలో నాకు మంత్రప్రేరిత అస్త్రాలు ఏమీ గుర్తు రావు అని శపించాడు
పొరపాటున నేను వదిలిన బాణం గోవుకు తగిలి ఒక బ్రాహ్మణుడు నన్ను అకారణంగా శపించాడు
ద్రౌపది స్వయంవర సమయంలో అవమానించబడ్డాను
చివరికి నా తల్లి కుంతి కుడా యుద్ధం ఆరంభం అవుతుందన్న చివరి క్షణం లోనే నా జన్మ రహస్యం నాతో చెప్పింది , అదీ కుడా తన బిడ్డలను కాపాడుకోవడం కోసం
ఇంత వరకు నేను ఏదైనా పొందాను, గౌరవించబడ్డాను అంటే, అది దుర్యోధనుని దయాబిక్ష !!!
ఇప్పుడు చెప్పు కృష్ణా! నేను దుర్యోదనుని పక్షాన నిలబడం లో తప్పేంటి ?
ఓ కర్ణా! నేను చెరసాల లో పుట్టాను
నేను పుట్టక ముందు నుండే నన్ను చంపడానికి చూసారు
నేను పుట్టిన రాత్రే, నేను నా జననీ జనకుల నుండి నుండి వేరుచేయ బడ్డాను
నీవు చిన్నప్పటి నుండే కత్తిసాము, కర్రసాము , రథారోహణ, అశ్వచాలనం, ధనుస్సు, బాణాలు వంటి వాటిని సాధన చేస్తూ పెరిగావు
నేను ఆల మందలను కాస్తూ పెరిగాను, పైగా నడక రాక మునుపే, నన్ను చంపడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి
నన్ను సంరక్షించడానికి ఏ సైన్యమూ లేదు, నాకు ఏ ప్రాధమిక విద్యా లేదు
"జనమంతా వాళ్ళ భాదలకు కారణం నేనే కారణం అట" కొన్నిసార్లు జనాలు అనడం నేను విన్నాను
నీ శౌర్య ప్రదర్శనలో నీ గురువుల చేత నువ్వు మన్ననలు పొందుతున్నపుడు, కనీసం నాకు ప్రాధమిక విద్య కుడా లేదు , నేను సాందీపముని గురుకులానికి చేరింది ఎప్పుడో తెలుసా! నా 16వ ఏట !
నువ్వు నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నావు నేను ఎవరైతే నన్ను కోరుకుంటున్నారో వాళ్ళను మరియు, రాక్షసుల / దుష్టుల నుండి నేను కాపాడిన వారిని చేసుకున్నాను
జరాసంధుడి బారినుండి నా పరివారాన్ని కాపాడుకోవడం కోసం, నేను మొత్తం యదుకులాన్ని యమునా నదీ తీరం నుండి (మధుర) ఎక్కడో ఉన్న సముద్ర తీర ద్వారకకు తరలించవలసి వచ్చింది. దానికి కొందరు పిరికి వాడు అనికూడా అన్నారు
ఒక విషయం గుర్తుంచుకో కర్ణా!
జీవితంలో ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయి జీవితం అనేది ఎవరికీ పూల పాన్పు కాదు..ధర్మరాజు కుడా ఎన్నో సార్లు ఎన్నో కష్టాలు అనుభవించాడు. కానీ అతను నమ్మిన ధర్మాన్ని అతను ఎప్పుడూ తప్పలేదు . ధర్మం ఏంటో? నీ అంతరాత్మకు తెలుసు.
ఎన్ని సార్లు నువ్వు అవమానింపబడ్డావు అనేది కాదు , జీవితం ఎంత చెడు అనుభవాలను చవి చూపించిది అనేది కాదు , ఎన్నిసార్లు నీకు అన్యాయం జరిగింది అనేది కాదు ఆయా సమయాలలో ధర్మం తప్పకుండా నువ్వెలా నిలబడ్డావు అనేది ముఖ్యం .
ఆరోపణలు ఆపు కర్ణా!
దుర్యోధనుడు అన్నివేళలా ధర్మం తప్పాడు. ఇది నీకు పూర్తిగా తెలుసు అయినా అతని పక్షం వహించావు. నీ జీవితంలో నీకు జరిగిన అన్యాయాలు, నువ్వు అధర్మం పక్షాన నిలవడానికి కారణాలు కాబోవు కాకూడదు
"ధర్మోరక్షతి రక్షితః" అనే సూక్తి ని అందంగా అర్ధం అయ్యేలాగ వివరించారు. ఎంత కఠోర పరిస్థితుల కారణం గానైనా ధర్మం తప్పితే అధర్మం.
ధర్మోరక్షతి రక్షిత:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి