.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

20, ఫిబ్రవరి 2018, మంగళవారం

కురుక్షేత్ర యుధ్ధం రెండవరోజు 1

కురుక్షేత్ర యుధ్ధం రెండవరోజు 1 
 
మధ్యాహ్నసమయం వరకు యుద్ధం సాగిన పిదప ధృష్టద్యుమ్నుడు ద్రోణుని ముందుకు రధాన్ని పోనిచ్చి ద్రోణుని తన నిశిత శరములతో నొప్పించాడు.  ద్రోణుడు కోపించి దృష్టద్యుమ్నుని సారధిని కొట్టి, తరువాత నాలుగు బణాలు వేసి అశ్వాలను చంపాడు.  అతడి విల్లును నడిమికి విరిచి కేతనమును విరిచాడు.  అయినా ధృష్టద్యుమ్నుడు బెదరక అమిత కోపంతో ద్రోణుడిని ఎదిరించాడు.  ద్రోణుని పైన శరపరంపర కురిపించాడు.  ద్రోణాచార్యుడు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని ధృష్టద్యుమ్నునిపై బాణాల వాన కురిపించాడు.  ఇలా ఇరువురి నడుమ భంయంకరమైన పోరు కొనసాగింది. ధృష్టద్యుమ్నుడు ద్రోణునిపై గదాయుధం ప్రయోగించాడు.  ద్రోణుడు దానిని పొడి చేసాడు.  ధృష్టద్యుమ్నుడు బల్లెం విసిరాడు.  ద్రోణుడు దానిని కూడా విరిచాడు.  మరొక విల్లు తీసుకుని ధృష్టద్యుమ్నుడు ద్రోణునిపైన శరపరంపర కురిపించాడు.  ద్రోణుడు ధృష్టద్యుమ్నుని సారధిని, హయములను చంపి విల్లును విరిచాడు.  ధృష్టద్యుమ్నుడు రధము దిగి గదను తీసుకుని గిరగిరా తిప్పి ద్రోణుని పై విసిరాడు.  ద్రోణుడు దానిని బాణములతో నుగ్గు చేసాడు.  ధృష్టద్యుమ్నుడు కరవాలంతో విజంభించాడు.  ఇలా ఇరువురి నడుమ ఘోర యుద్ధం కొనసాగింది.  ద్రోణుని శరపరంపరకు ధృష్టద్యుమ్నుడు తట్టుకోలేక పోయాడు.  ఇది చూసిన భీముడు ధృష్టద్యుమ్నునికి సాయం వచ్చాడు.  ద్రోణునిపై ఏడు బాణములు వేసి ధృష్టద్యుమ్నుని వేరు రథం ఎక్కించాడు. ఇది చూసిన సుయోధనుడు కళింగ రాజుకు సైగ చేసి భీముని ఎదుర్కొనమని చెప్పాడు.

సుయోధనుని సైగను గ్రహించిన కళింగ రాజు తన సైన్యంతో భీముని మీదకు వచ్చాడు.  ఇంతలో ద్రోణుడు విజృంభించి విరాటుని పైన , ద్రుపదుని పైన బాణములు సంధించాడు.  ధర్మరాజు ఇంతలో ధృష్టద్యుమ్నునికి సాయం వచ్చాడు.  ఛేది, కురుదేశాల రాజులు భీమునికి అడ్డుగా నిలిచాడు.  కేతుమంతుడు భీముని మీదకు ఉరికాడు.  కేతుమంతుని ధాటికి పాండవ సైన్యాలు మంటలలో పడిన పురుగులులా భస్మం అయ్యాయి.  మిగిలి వారు పారి పోయారు.  కేతుమంతుడు విజయోత్సాహంతో భీమునిపై ముందు వెనుకలు చూడక బాణవృష్టి కురిపించాడు.  కేతుమంతుడు భీముని హయములు చంపగా భీముడు కుపితుడై గధను తీసుకుని వాడి పైన విసరగానే ఆ గదాఘాతానికి వాడి రథం విరిగి, కేతనం విరగటమే కాక నిముషాలలో కేతుమంతుని స్వర్గలోకానికి పంపింది.  భీముడు తన కత్తిని తీసుకుని వీరవిహారం చేసాడు.  అది చూసిన కళింగ రాజు కుమారుడు శక్రదేవుడు ఆగ్రహంతో భీముని మీదకు వచ్చి కరకు బాణాలతో భీమసేనుని రధాశ్వాలను వధించి భీముని శరీరమంతా బాణములతో కొట్టగా, భీమసేనుడు బెదరక ఒక్క గదా ఘాతంతో శక్రదేవుని సంహరించాడు.  కుమారుని చావు చూసి కుపితుడైన కళింగరాజు భీమునిపై పదునాలుగు తోమరములు విసిరాడు.  భీమసేనుడు వాటిన అన్నిటినీ తన కరవాలంతో తుత్తునియలు చేసాడు.  కళింగ రాజు సోదరుడు భానుమంతుడు తన గజబలంతో భీముని ఎదుర్కొని భీమునిపై శరవర్షం కురిపించాడు.  ఒక ఏనుగును భీమునిపై నడిపించాడు.  భీమసేనుడు చేసిన సింహనాదానికి దిక్కులు దద్దరిల్లాయి.  భీముడు ఆ ఏనుగును పట్టుకుని దంతములు, తొండము నరికి భానుమంతుని నరికి వేసి అతని ఏనుగును నరికాడు.  అది చూసిన కళింగరాజు ఒక్క సారిగా భీమసేనుని పైన పడమని తన గజ సన్యాలను పురికొల్పాడు.  ఒంటరిగా నేలపై ఉన్న భీముడు కత్తితో ఏనుగుల తొండములు నరక సాగాడు.  రధికులను, సారధులను, రధములకు కట్టిన అశ్వములను నరక సాగాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML