.

.

గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

Tuesday, February 20, 2018

బ్రాహ్మణత్వము గురించి భీష్ముణ్ణి ధర్మరాజు ఇలా అడిగాడు.

బ్రాహ్మణత్వము గురించి భీష్ముణ్ణి ధర్మరాజు ఇలా అడిగాడు.
బ్రాహ్మణత్వము గురించి భీష్ముణ్ణి
ధర్మరాజు ఇలా అడిగాడు.
"పితామహా ! బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే గుణకర్మల వలన బ్రాహ్మణత్వము
పొందవచ్చునా ! " అని తన సందేహం వెలిబుచ్చాడు.

భీష్ముడు " ధర్మనందనా ! బ్రాహ్మణత్వము పొందడం చాలా దుర్లభం. ఎన్నో జన్మలు
ఎత్తిన తరువాత కాని బ్రాహ్మణజన్మ లభించదు. ఈ విషయము గురించి నీకు ఒక ఇతిహాసము
చెప్తాను విను. పూర్వము మతంగుడు అనే విప్రకుమారుడు ఉండే వాడు. అతడు తండ్రి
ఆదేశానుసారము ఒక యజ్ఞానికి వెడుతున్నాడు. దారిలో అతడు ఒక గాడిదపిల్లను కర్రతో
గట్టిగా కొట్టాడు. ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తనతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి
చెప్పింది. ఆ గాడిద తన కూతురుతో " అమ్మా ! ఇతడు చంఢాలుడు, క్రూరుడు అందుకే
నిన్ను అలా కొట్టాడు " అని చెప్పింది. గాడిద మాటలను అర్ధము చేసుకున్న
విప్రకుమారుడు "ఆ గాడిద ఊరికే అలా అన లేదు. గాడిద మాటలలో ఏదో అంతరార్ధము ఉంది.
లేకుంటే అలా ఎందుకు అంటుంది? " అనుకున్నాడు. విప్రకుమారుడు ఆ గాడిద వద్దకు
వెళ్ళి తన జన్మరహస్యము చెప్పమని అడిగాడు. గాడిద " విప్రకుమారా ! నీ తల్లి
కామంతో ఒక క్షురకుని వలన నిన్ను కన్నది. కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు " అని
చెప్పింది. ఆపై అతడికి యజ్ఞముకు వెళ్ళడానికి మనస్కరించక ఇంటికి తిరిగి వెళ్ళి
తండ్రితో " తండ్రీ ! నేను బ్రాహ్మణ స్త్రీకి క్ష�±

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML