.

.

గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

Tuesday, February 20, 2018

*ఆది దేవుని భిక్షా పాత్రగా కపాలం 🌸*

*ఆది  దేవుని  భిక్షా పాత్రగా  కపాలం 🌸*

*బ్రహ్మకు ఆదిలో ఐదుశిరస్సులుండేవి. శివునికి ఒక్కటే! (ఈ వివాహం నాటికి,
బ్రహ్మకు ఇంకా ఐదుతలలున్న సంగతిని కొన్ని పురాణాలు ప్రస్తావిస్తున్నప్పటికీ) ఈ
కథాంశం ముందు జరిగినదా? తర్వాత జరిగినదా అనే శంక ప్రక్కన పెట్టి, సావధానంగా
వినమని - మన ఋషివరేణ్యులను కోరుతున్నాను.*

*ఒకప్పుడు - బ్రహ్మకూ, శివునికీ మాటపట్టింపువచ్చి నేను అధికుడనంటే - నేను
అధికుడననే అహంకారం ప్రబలమైంది. 'నేను వచ్చిన తరువాతనే, ఈ సృష్టిలో కొచ్చిన
నువ్వు నాకంటే అధికుడవెలా అవుతావు? చూశావా! నాకు ఐదు శిరసులున్నాయి' అన్నాడు
బ్రహ్మ. 'నేనూ చూపించగలను ఐదుతలల్నీ! అంటూ శివుడు తన పంచముఖాన్ని చూపించాడు.*

*ఆ పంచముఖాలూ ఇవి : 1. సద్యోజాత, 2. వామదేవ, 3. అఘోర, 4. తత్పురుష, 5. ఈశాన.*

*దేవతలకు ఎన్నడూ ఐదు ముఖాలూ వరుసగా ఉండవు. నాలుగు దిక్కులకూ నాలుగు,
ఊర్థ్వముగా (పైకి)చూచునట్లు ఇంకొకటీ ఒక పుష్పాకృతిలో ఈ ముఖాల అమరిక ఉంటుంది.
కనుకనే సర్వదిక్కులనూ, సర్వ విశ్వాన్నీ వీక్షించే ఆ మహాశివుడు సర్వతోముఖుడను
నామాంతరము చేత కూడ సుప్రసిద్థుడు. ఆయనకు తెలియని అంశంగాని, ఆయన వివరించలేని
అంశంగాని లేవు. ఎవరేది ఎంత దాచాలన్నా సర్వేశుని వద్ద దాచలేరు.*

*బ్రహ్మకు ఆ విధంగా శివపంచముఖ దర్శనం కలిగినప్పటికీ, అసూయకొద్దీ ఈశ్వరునింకా
రెచ్చగొà

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML