.

.

గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

Tuesday, February 20, 2018

శ్రవణబెళగొళ... దక్షిణ భారతదేశంలో జైనుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతాన్ని 'దక్షిణ కాశి' అని కూడా పిలుస్తారు.

శ్రవణబెళగొళ... దక్షిణ భారతదేశంలో     జైనుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతాన్ని 'దక్షిణ కాశి' అని కూడా పిలుస్తారు.

శ్రవణబెళగొళ... దక్షిణ భారతదేశంలొ    జైనుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతాన్ని 'దక్షిణ కాశి' అని కూడా పిలుస్తారు. శ్రవణబెళగొళకు చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. జైనుల క్షేత్రంగా ఉన్న  శ్రవణబెళగొళ మళ్లీ ఇన్నేళ్ళకు పర్యాటకులతో సందడి కానుంది. అందుకూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ వివరాలేవో ఇప్పుడు తెలుసుకుందాం..!!

కర్ణాటకలోని హసన్ జిల్లాలో శ్రవణబెళగొళ ఉంది. చరిత్ర విషయానికి వస్తే.. మౌర్యచంద్రగుప్తుడు యుద్ధ జీవితంతో విసిగి ఇక్కడికి వచ్చి ధ్యానంతో మనశ్శాంతి పొందినట్లు చెబుతారు. బెంగళూరుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రవణబెళగొళలో దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఎత్తైన గొమఠేశ్వరుడి  విగ్రహం(బాహుబలి విగ్రహం) ఉంది. పట్టణంలోకి ప్రవేశిస్తున్నప్పుడు కనుచూపు మేర నుంచే ఈ విగ్రహం కనిపిస్తుంది. అబూ కొండలు(రాజస్థాన్), ఉదయగిరి కొండలు (ఒడిశా) తరువాత జైనులకు పవిత్ర పుణ్యస్థలిగా శ్రవణబెళగొళ ఖ్యాతి గాంచింది. 

శ్రవణబెళగొళ మళ్లీ పర్యాటకులను ఆకర్షిస్తుండటానికి ప్రధాన కారణం గోమఠేశ్వరుడి విగ్రహం(బాహుబలి విగ్రహం). ఇక్కడ 12 ఏళ్లకోసారి లేదా పుష్కరానికోసారి భారీ వేడుక జరుగుతుంది. 58.8 అడుగుల ఎత్తున్న బాహుబలి విగ్రహానికి మహామస్తకాభిషేకం చేస్తారు. ఈ వేడుక ఫిబ్రవరి 7 నుండి 26 వరకు కన్నులపండుగగా జరగనుంది. క్రీ.శ.981లో ప్రతిష్టించిన ఈ విగ్రహానికి ప్రతి 12 ఏళ్లకొకసారి అభిషేకం జరుగుతుంది. పాలు, పెరుగు, నెయ్యి, కుంకుమ పూలు, బంగారునాణేలతో అభిషేకం చేస్తారు. 

మహామస్తకాభిషేకాన్ని తిలకించడానికి  దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. జైన మతస్థులతో పాటు ఇతర మతాలవారు కూడా ఈ భారీ వేడుకలకు హాజరుకానున్నారు. ఉత్సవంలో విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తారు.  ఆ మహత్తర ఘటాన్ని చూడాలే గానీ.. మాటల్లో వర్ణించలేము. 

శ్రవణబెళగొళ వెళ్లే పర్యాటకులు, భక్తులు సమీపంలో ఉన్న హాలిబేడు, బేలూరు ప్రాంతాలను సందర్శించవచ్చు. అలానే శృంగేరీ, కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయం, ధర్మస్థల వంటి పర్యాటక ప్రదేశాలను చూడవచ్చు. 

శ్రవణబెళగొళ ఎలా చేరుకోవాలి? 

శ్రవణబెళగొళ బెంగళూరుకు 150 కిలోమీటర్ల దూరంలో, మైసూర్‌కు 85 కిలోమీటర్ల దూరంలో  ఉంది. బెంగళూరు నుండి శ్రవణబెళగొళకు నిత్యం ప్రభుత్వ బస్సులు నడుస్తాయి. క్యాబ్, ప్రైవేట్ టాక్సీ లలో కూడా ప్రయాణించవచ్చు. సమీపంలో హసన్ రైల్వే స్టేషన్ కలదు.🙏🙏🙏

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML