కాశ్మీరు లోని అనేక నగరాల, ప్రదేశాల మూల నామాలు, ఇప్పటి నామాలు
కాశ్మీరు--దీని మూల నామము --శారదాదేశము
ఇక్కడ ఆచార్య శంకర భగవత్పాదులు శారదాదేవి సమక్షములో పాండిత్యాన్ని ప్రదర్శించి, తల్లి భారతి అనుగ్రహాన్ని పొందిన ప్రదేశము. ఇక్కడి మూల నివాసులు శారదా భక్తులు, మరియు సంస్కృత పండితులు.
అష్టాదశ శక్తిపీఠాల శ్లోకము లో ఇలాగుంది
|| వారణ్యస్యమ్ విశాలాక్షీ కాశ్మీరేషు సరస్వతీ || అని వ్యాఖ్యానము.
నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని ... అని భక్తితో పాడుకుంటాము.
కాశ్మీరము కేవలము హిందువులది. తురుష్క ముష్కరుల దాడిలో లక్షల కాశ్మీర పండితులు తమ స్వస్థానాలను వదలి ప్రాణాలు నిలుపుకొనుట కోసము వలస వెళ్ళారు.
ఇప్పుడు మోడీజీ నిర్ణయముతో కాశ్మీరుకు పూర్వ వైభవము, ప్రాచుర్యము, సాంస్కృతిక ప్రాధాన్యము వస్తాయనుటలో ఎటువంటి సందేహము లేదు. దేశములో ఎవరైనా యథేఛ్ఛగా కాశ్మీర్ లో వెళ్ళి నివశించవచ్చు.
ఇంకా కాశ్మీరు లోని పట్టణాల పేర్లు
* వరాహ మూల --బారాముల్లా
* జంబూదేశ -- జమ్ము
* కర్ణరాజ పురం -పీర్ పంజల్
* సూర్య పుర --సోపుర్
* అవంతీ పురం - పుల్వామా
*జయపురం - సంబల్
ఒకప్పుడు కాశ్మీరులో ఐదు లక్షలకన్న ఎక్కువ మంది ఉన్న కాశ్మీర పండితులు ఈ నాడు రెండు వేల కన్నా ఎక్కువ లేరు.
కాశ్మీరు మన భారతపు శిరోభాగము. దాన్ని కాపాడుకుందాము
అక్కడ శారదా సర్వజ్ఞ పీఠము ఉంది. దానికి నాలుగు ద్వారాలు. భారత దేశపు నాలుదిశల జ్ఞానానికి అది సంకేతము. అక్కడ శారద విశ్వవిద్యాలయము ఉండింది.
శంకరాచార్యులు ఎనిమిదో శతాబ్దపు చివర అక్కడికి వెళ్ళి పండితుల వాదములో గెలిచి దక్షిణ దిక్కున ఉన్న ద్వారాన్ని తెరచి దక్షిణ భారత పేరు నిలబెట్టారు.
కాశ్మీరము శైవ సాంప్రదాయ మూలాలు కలిగినది.
ఇక్కడ వుండీ వేలాది మందికి తత్త్వ, సిద్ధాంత, ఆధ్యాత్మ, సంగీతము--ఇలాగ వేర్వేరు అంశాల- విచారాల ఆలవాలమై ఉండింది.
హిందూ, బౌద్ధ , శిక్ఖు ధర్మాలు ఇక్కడ ప్రాచుర్యము పొందినాయి. ఇక్కడ శిల్పకళ యొక్క భవ్యమైన పరంపర ఉండినది.
ఇక్కడి లిపి, ’ శారదా లిపి ’. భాష కాశ్మీరీ.
రండి, " శారదా సర్వజ్ఞ పీఠాన్ని " మరలా తెరచి పూజ చేద్దాము.
జగద్గురువులు ఈ కార్యక్రమము కోసము ప్రధానికి పత్రము రాసినారని తెలిసినది.
యతిద్వయం సంకల్పానికి శారదా అనుగ్రహము తోడై శారదా దేశము మనదిగా మారిన ఈ శుభవేళ అందరికీ అభినందనల అభివందనాలు.
----విభాత మిత్ర
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు
సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు
18, ఆగస్టు 2019, ఆదివారం
కాశ్మీరు లోని అనేక నగరాల, ప్రదేశాల మూల నామాలు, ఇప్పటి నామాలు కాశ్మీరు--దీని మూల నామము
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి