.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

18, ఆగస్టు 2019, ఆదివారం

అభీష్ట సిద్ధికై ఆశాదశమి

అభీష్ట సిద్ధికై ఆశాదశమి 

శ్రావణమాసంలో వచ్చే శుక్ల దశమి ప్రతివారి ఆశలను నెరవేర్చే శక్తివంతమైన తిథి. అందుకే ఈ దశమి తిథిని ఆశాదశమి అంటారు. 
జీవితంలో మనకు ఏమేం కావాలో ఒక్కోసారి మనకే తెలియదు 

మనకు తెలిసినవి, తెలియనివి, మనకు కావాల్సినవి అన్నీ కూడా భగవతికి తెలుసు. ఒక్కోసారి ఏవైతే మనకు అవసరమో వాటిని మాత్రమే కోరుకుంటుంటాం. ఆ తర్వాత తల్లి అనుగ్రహించిన తర్వాత మరికొంత కాలానికి మరొకటి ఏదో కోరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. 

ఎందుకంటే... జీవితంలో  ఇలా ఏది అవసరమో... ఆ సమయంలో దానిని మాత్రమే కోరుకునేదానికన్నా శ్రావణమాసంలో వచ్చే శుక్ల దశమి తిథి రోజున దేవతను భక్తి పూర్వకంగా ప్రార్థిస్తే, ఈ శ్రావణ శుక్ల దశమి నుంచి పై శ్రావణ శుక్ల దశమి వరకు మనకు అవసరమైన కోరికల చిట్టా అంతా భగవతికి అవగతమవుతుంది.

 ఆశాదేవి అనే పేరుతో ఓ దేవతాస్వరూపం ఉన్నప్పటికీ... ఈ దశమి తిథి రోజున సాయంత్ర సమయంలో అన్నపూర్ణా దేవిని ఆరాధించాలి. 
సాయంత్ర వ్యాప్తిలో ఏర్పడిన 
ఈ తిథి ఈ సంవత్సరం 
2019 ఆగష్టు 9వ తేదీ శుక్రవారం దశమి తిథి (ఆశాదశమి)నాడే.

మరో ముఖ్య విషయం ఏమిటంటే ఇదే 9వ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావటం కూడా మరో ముఖ్య విశేషం. 

ఒక వైపు వరలక్ష్మీ దేవిని ఆరాధిస్తూనే మరోవైపు 9వ తేదీ సాయంత్ర సమయంలో.... 

"భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ" 
అంటూ అన్నపూర్ణా దేవిని ప్రార్థన చేయండి మరియు శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారిని దర్శించుకోండి..

అవకాశముంటే అన్నపూర్ణా అష్టకాన్ని భక్తి విశ్వాసాలతో మనసు లగ్నం చేసి పఠించండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML