.

.

గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

Sunday, August 18, 2019

వెంకటేశ్వర స్వామి ముడుపు!

 వెంకటేశ్వర స్వామి ముడుపు!                 
                       ➖➖➖✍

ఇప్పుడు రోజుల్లో టీవీ లు ధర్మ ప్రచారం చేసే వాళ్ళు స్వామిజిలు ఎక్కువగా టీవీలో పరిహారాలు చెప్పడం వల్ల అనేక పూజలు వ్రతాలు, పరిహారాలు హోమాలు బాగా చేయించు కుంటున్నారు.. 

కానీ ఒకప్పుడు ఇలాంటి సౌకర్యం ఉండేది కాదు! అన్ని వర్గాలు అన్ని స్థాయిల వారికి చెప్పే వారు కూడా అందుబాటులో ఉండరు అప్పటిలో కానీ ఇప్పటికీ కానీ పిలిస్తే పలికే కలియుగ దైవం కోట్లాది భక్తులకు ఇల వేలుపు, ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు, కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడతేర్చే దైవం అని వారి కోరికలు చెప్పుకొని ముడుపు కట్టే వాళ్ళు . 

ఎటువంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలి అంటే... వివాహంకోసం, వ్యాపార వృద్ధి కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, ఇల్లు కానీ స్థలం కానీ కొనడం అమ్మడం కోసం, ఉద్యోగం పొందటం కోసం, అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలి అని, పంట నష్టం కలగ కుండా చేతికి రావాలి అని, ఆటంకంగా ఉన్న నిర్మాణం పూర్తి కావాలని, ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసుని కి ముడుపు కడతారు...

ఆ ముడుపు ఎలా కట్టాలి ...

వెంకటేశ్వరస్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతున్న సంకల్పము నెరవేరాలి అని కోరుకొని, ఒక తెల్లటి బట్టకి పసుపు తడిపి ఆరబెట్టినా బట్టని నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో 11 రూపాయలు స్వామిని స్మరించుకుంటూ పెట్టి మీరు ఎందుకు ముడుపు కడుతున్నారు మనసుపూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకుని 11 రూపాయలు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి, కోరిక తీరాక ముడుపుతో దర్శనంకి వస్తాను అని ముందే మాటఇవ్వాలి , వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం , గోవిందా నామాలు చదువుకొని  స్వామి కి హారతి ఇచ్చాక ముడుపుకి కూడా హారతి ఇచ్చి ఆ ముడుపు మీ పని అయ్యే వరకు స్వామి ముందే ఉండాలి..కోరిక తీరాక ఆ ముడుపు తీసుకొని తిరుమలకి దర్శనంకి వెళ్లి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి హుండీలో వేయాలి...

ఇది భక్తిగా నమ్మకంగా చేయాలి, కచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది
x

1 comment:

  1. Lucky Club Casino Site 2021
    Lucky Club Casino was founded in 2020 in South Africa, where the country has been welcoming the world's largest gambling community ever. It's been around since Live Casino: Live on Phone (RU)Mobile Casino: luckyclub 888casino GamesIndustry Specificties: Computer Gaming, CardiBingo: 3D slots, live roulette, virtual Rating: 7.5/10 · ‎Review by Lucky Club Casino

    ReplyDelete

Powered By Blogger | Template Created By Lord HTML