.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

20, ఫిబ్రవరి 2018, మంగళవారం

శివుడు ఎవరు ?

శివుడు ఎవరు ?     ఆది శంకరాచార్యుల వారి ప్రకారం "శివ" అనగా కల్మషము లేని వాడు. అంటే ప్రకృతి యొక్క (సత్వ, తమో, రజో) గుణాలేవీ అంటని వాడు. అందుచేత శివనామస్మరణం తోనే సకలజనులని పరిశుద్ధము చేయువాడు. స్వామి చిన్మయానందుల వారి ప్రకారం శివుడు అనగా అనంత పరిశుద్ధుడు, ఏ గుణములు అతడిని కళంకితుడిని చేయలేని వాడు.శివుడు జననమరణాలుకు అతీతుడు. కాలాతీతుడు అనగా కాలమునకు వశము అందని కానివాడు. అ౦దుకే సదా శివుడు అ౦టాము. అ౦తయు శివుడే అ౦దుకే...
Read More

శ్రీ నారాయణ తీర్ధులు

 శ్రీ నారాయణ తీర్ధులుఎక్కడ పుట్టాడో, ఎప్పుడు పుట్టాడో, గురువు ఎవరో తెలియని వైనం సాయిబాబా.. మహాసమాధియైన ప్రదేశం గూర్చి ఏకాభిప్రాయం ఉన్నది. అయితే లీలాశుకుల, జయదేవుల అవతారంగా భావింపబడే నారాయణతీర్థులవారి మహాసమాధి అయిన క్షేత్రం గూర్చి భిన్నాభిప్రాయాలున్నాయి.శ్రీనారాయణతీర్ధులు పూర్వాశ్రమ నామం తల్లావఝుల గోవిందశాస్త్రి, తండ్రి పేరు నీలకంఠశాస్త్రి, వీరిది గుంటూరు జిల్లాలోని కాజగ్రామం.గోవింద శాస్త్రికి వివాహమైంది. అత్తవారింటికి...
Read More

: పరాశర భట్టరు దత్తకోశం చేస్తూ ఓ శ్లోకమిచ్చారు మనకు. అదేమంటుందంటే.

: పరాశర భట్టరు దత్తకోశం చేస్తూ ఓ శ్లోకమిచ్చారు మనకు. అదేమంటుందంటే... చతుర్ముఖ బ్రహ్మగారు జీవుడిని సృజించే ముందు పుర్రె చేత్తో పట్టుకుని రాయడం మొదలుపెడతాడట. వీడికి చదువెంత ఉండాలి.. రాస్తాడు. వీడికి ఆయుర్దాయం ఎంత... రాస్తాడు. బలం... రాస్తాడు. ఐశ్వర్యం ఎంతుండాలి...ఇది రాసేముందు తల్లి లక్ష్మీదేవి వంక చూస్తాడట. ''గతజన్మలో ఈ పుర్రెపేరేమిటి? ఈ జీవుడు ఏ పేరుతో బతికాడు ?'' అని అడుగుతుందట అమ్మవారు. ఫలానా వాడమ్మా... అని చెబుతాడు.. ఆవిడ...
Read More

రేపటి నుంచి ఫాల్గునమాసం.

రేపటి నుంచి ఫాల్గునమాసం. పౌర్ణమినాడు ఫల్గునీ నక్షత్రం ఉన్న 'చాంద్రమాన'మాసం ఫాల్గునమాసం. ఫాల్గుణము అని వ్రాయకూడదు. ఫాల్గునము అన్న అక్షర క్రమమే సరైన శబ్ద స్వరూపము. ఉత్తర ఫల్గునీ నక్షత్రం నాడు పుట్టిన పాండవ మధ్యముడు ఫల్గునుడయ్యాడు. ఈ మాసం శిశిర ఋతువుకు పరాకాష్ఠ. వసంత ఋతువుకు 'ద్వారం' వంటిది.శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం - ఫాల్గుణ మాసం. ఫాల్గుణమాసంలో మొదటి పెన్నెండు రోజులు, అంటే శుక్లపక్షపాడ్యమి మొదలు ద్వాదశి వరకూ...
Read More

కస్తూరి

కస్తూరికస్తూరి జింక కస్తూరిని తయారుచేసే గ్రంధి కలిగి ఉంటుంది.కస్తూరిని ఎర్రటి జాకెట్టు గుడ్డలో ఉంచి బీరువాలోగాని,లాకర్లో గాని ఉంచిన డబ్బు వృధాగా ఖర్చు అవ్వదు."కస్తూరీ తిలకం లలాట ఫలకేవక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికంకరతలే వేణుం కరే కంకణంసర్వాంగే హరి చందనం చ కలయమ్కంఠేచ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితోవిజయతే గోపాల చూడామణి"అంటూ చిన్నప్పుడు అందరూ నేర్చుకుని శ్రీకృష్ణుడిని స్తుతించే ఉంటారు కదూ!  ఆ సమయంలోముందు నీకొచ్చిన సందేహం...
Read More

శ్రవణబెళగొళ... దక్షిణ భారతదేశంలో జైనుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతాన్ని 'దక్షిణ కాశి' అని కూడా పిలుస్తారు.

శ్రవణబెళగొళ... దక్షిణ భారతదేశంలో     జైనుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతాన్ని 'దక్షిణ కాశి' అని కూడా పిలుస్తారు.శ్రవణబెళగొళ... దక్షిణ భారతదేశంలొ    జైనుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతాన్ని 'దక్షిణ కాశి' అని కూడా పిలుస్తారు. శ్రవణబెళగొళకు చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. జైనుల క్షేత్రంగా ఉన్న  శ్రవణబెళగొళ మళ్లీ ఇన్నేళ్ళకు పర్యాటకులతో సందడి కానుంది. అందుకూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ వివరాలేవో ఇప్పుడు...
Read More

బాహుబలి కోసమే ఈ ఉత్సవాలు ప్రత్యేకం

బాహుబలి కోసమే ఈ ఉత్సవాలు ప్రత్యేకం☀☀☀☀☀☀☀☀☀☀☀శ్రవణబెళగొళ... దక్షిణ భారతదేశంలో     జైనుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతాన్ని 'దక్షిణ కాశి' అని కూడా పిలుస్తారు.శ్రవణబెళగొళ... దక్షిణ భారతదేశంలొ    జైనుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతాన్ని 'దక్షిణ కాశి' అని కూడా పిలుస్తారు. శ్రవణబెళగొళకు చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. జైనుల క్షేత్రంగా ఉన్న  శ్రవణబెళగొళ మళ్లీ ఇన్నేళ్ళకు పర్యాటకులతో సందడి కానుంది. అందుకూ...
Read More

కురుక్షేత్ర యుధ్ధం రెండవరోజు 1

కురుక్షేత్ర యుధ్ధం రెండవరోజు 1  మధ్యాహ్నసమయం వరకు యుద్ధం సాగిన పిదప ధృష్టద్యుమ్నుడు ద్రోణుని ముందుకు రధాన్ని పోనిచ్చి ద్రోణుని తన నిశిత శరములతో నొప్పించాడు.  ద్రోణుడు కోపించి దృష్టద్యుమ్నుని సారధిని కొట్టి, తరువాత నాలుగు బణాలు వేసి అశ్వాలను చంపాడు.  అతడి విల్లును నడిమికి విరిచి కేతనమును విరిచాడు.  అయినా ధృష్టద్యుమ్నుడు బెదరక అమిత కోపంతో ద్రోణుడిని ఎదిరించాడు.  ద్రోణుని పైన శరపరంపర కురిపించాడు. ...
Read More

రామకోటి రాయడానికి పాటించాల్సిన నియమాలు

రామకోటి రాయడానికి పాటించాల్సిన నియమాలు       🌷🌷🌷 ..... చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే 'రామ' అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది...... 'రామకోటి' రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం..... . చాలామంది శ్రీరామనవమినాడు రామకోటి రాయడం...
Read More

వివాహ వేడుకలో వధూవరుల చేత ఏడడుగులు నడిపిస్తారు కదా! ఎందువల్ల?

వివాహ వేడుకలో వధూవరుల చేత ఏడడుగులు నడిపిస్తారు కదా! ఎందువల్ల?'సప్తపది'కి ప్రత్యేకమైన అర్థమేమైనా ఉందా? ఇద్దరు వ్యక్తులను, రెండు కుటుంబాలను ఒకటిగా చేసేదే వివాహ బంధం. హిందూ వివాహ సంప్రదాయంలో జరిగే ప్రతి క్రతువుకూ ప్రత్యేకమైన అర్థం పరమార్థం ఉన్నాయి. కన్యాదానం పూర్తయిన తర్వాత వివాహ ముహూర్తానికి జీలకర్ర-బెల్లం తలపై పెట్టించి, ఆ తర్వాత మాంగల్యధారణ చేయిస్తారు వేదపండితులు. ఈ క్రతువు పూర్తయిన తర్వాత వధూవరులకు కొంగుముడులు...
Read More

Excellent. Must Read...

Excellent. Must Read...A rare conversation between Ramkrishna Paramahansa & Swami VivekanandaPlease share with our next generation or read it loud to family, it's one of  the best message I have come across...1. Swami Vivekanand:- I can't find free time. Life has become hectic.Ramkrishna Paramahansa:- Activity gets you busy. But productivity gets you free.2. Swami Vivekanand:- Why has life become complicated...
Read More

ఇది కధ కాదు. బ్రిటిష్ కాలంలో మధురై డిస్ట్రిక్ట్ కి పీటర్ అనే వ్యక్తి కలెక్టర్ గా ఉండేవారు.

ఇది కధ కాదు. బ్రిటిష్ కాలంలో మధురై డిస్ట్రిక్ట్ కి పీటర్ అనే వ్యక్తి కలెక్టర్ గా ఉండేవారు. ఆయన ఆఫీస్ కి ఇంటికి మధ్యలోనే మీనాక్షి అమ్మవారి టెంపుల్. పీటర్ ప్రతిదినం తన కార్యాలయానికి అమ్మవారి దేవాలయం ముందరనుండి తన గుర్రంమీద వెళ్లేవారు. అలా వెడుతున్న సమయంలో పీటర్ తన కాళ్లకున్న చెప్పులు తీసి గుర్రం దిగి నడచి వెళ్లేవారు భక్తిగా. ఒకసారి రాత్రి ఉరుములు మెరుపులతో పెద్ద గాలితో వర్షం కురుస్తోంది. పీటర్ తన ఇంట్లో పడుకుని ఉండగా పెద్ద శబ్దం...
Read More

శివాభిషేకాలు - వాటి ఫలితాలు

శివాభిషేకాలు - వాటి ఫలితాలు1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన...
Read More

లింగోద్భవకాలంలో బ్రహ్మాదిదేవతల స్తుతి (మహాలింగ స్తుతి)

లింగోద్భవకాలంలో బ్రహ్మాదిదేవతల స్తుతి (మహాలింగ స్తుతి)అనాదిమల సంసార రోగ                         వైద్యాయ శంభవే!నమశ్శివాయ శాంతాయ                        బ్రహ్మణే లింగ మూర్తయే!!ఆదిమధ్యాంత హీనాయ       ...
Read More

*ఆది దేవుని భిక్షా పాత్రగా కపాలం 🌸*

*ఆది  దేవుని  భిక్షా పాత్రగా  కపాలం 🌸**బ్రహ్మకు ఆదిలో ఐదుశిరస్సులుండేవి. శివునికి ఒక్కటే! (ఈ వివాహం నాటికి,బ్రహ్మకు ఇంకా ఐదుతలలున్న సంగతిని కొన్ని పురాణాలు ప్రస్తావిస్తున్నప్పటికీ) ఈకథాంశం ముందు జరిగినదా? తర్వాత జరిగినదా అనే శంక ప్రక్కన పెట్టి, సావధానంగావినమని - మన ఋషివరేణ్యులను కోరుతున్నాను.**ఒకప్పుడు - బ్రహ్మకూ, శివునికీ మాటపట్టింపువచ్చి నేను అధికుడనంటే - నేనుఅధికుడననే అహంకారం ప్రబలమైంది. 'నేను వచ్చిన తరువాతనే,...
Read More

ఏం జరిగినా ఎదుర్కోగలను అన్న కాన్ఫిడెన్స్ మనిషి విజయానికి పునాదులు, ఈ పునాదులు బలంగా ఉంటేనే జీవితం అనే భవనం దృఢంగా ఉంటుంది.

1.FAITH వర్షాలు పడటం లేదని ఊర్లో వాళ్ళందరూ దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్లారు. కానీ ఒకడు మాత్రం గొడుగు తీసుకొని వెళ్ళాడు ఇదే విశ్వాసం. 2.TRUST తండ్రి బిడ్డను పైకి ఎగరేస్తాడు, బిడ్డ ఏడవాలి కానీ నవ్వుతుంది, అదే నమ్మకం. 3.HOPE రేపు మనం బతికుంటామో లేదో తెలియదు, కానీ అలారం పెట్టుకుని మరీ పడుకుంటాం. ఇదే ఆశ. 4.CONFIDENCE రేపు ఏం జరుగుతుందో తెలియదు, మన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో, ప్రతికూలతలను ఎలా ఓడించాలో ఆలోచిస్తుంటాం....
Read More

బ్రాహ్మణత్వము గురించి భీష్ముణ్ణి ధర్మరాజు ఇలా అడిగాడు.

బ్రాహ్మణత్వము గురించి భీష్ముణ్ణి ధర్మరాజు ఇలా అడిగాడు.బ్రాహ్మణత్వము గురించి భీష్ముణ్ణిధర్మరాజు ఇలా అడిగాడు."పితామహా ! బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే గుణకర్మల వలన బ్రాహ్మణత్వముపొందవచ్చునా ! " అని తన సందేహం వెలిబుచ్చాడు.భీష్ముడు " ధర్మనందనా ! బ్రాహ్మణత్వము పొందడం చాలా దుర్లభం. ఎన్నో జన్మలుఎత్తిన తరువాత కాని బ్రాహ్మణజన్మ లభించదు. ఈ విషయము గురించి నీకు ఒక ఇతిహాసముచెప్తాను విను. పూర్వము మతంగుడు అనే విప్రకుమారుడు ఉండే వాడు. అతడు...
Read More

ఆది శంకరాచార్య విరచిత ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం *ఆది శంకరాచార్య విరచిత ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం *

 ఆది శంకరాచార్య విరచిత ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం*ఆది శంకరాచార్య విరచిత ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం **లఘు స్తోత్రమ్**సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ |**ఉజ్జయిన్యాం మహాకాలమ్ ఓంకారేత్వమామలేశ్వరమ్ ||**పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ |**సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ||**వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే...
Read More

Powered By Blogger | Template Created By Lord HTML