.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

18, ఆగస్టు 2019, ఆదివారం

భాగవతము... ప్రథమ స్కంధము...

భాగవతము...

ప్రథమ స్కంధము...

కథాప్రారంభము...

1-36-సీ.              సీస పద్యము

శ్రీమంతమై మునిశ్రేష్ఠకృతంబైన; 
భాగవతంబు సద్భక్తితోడ
వినఁ గోరువారల విమలచిత్తంబులఁ; 
జెచ్చెర నీశుండు చిక్కుఁ గాక
యితరశాస్త్రంబుల నీశుండు చిక్కునే; 
మంచివారలకు నిర్మత్సరులకుఁ
గపట నిర్ముక్తులై కాంక్ష సేయకయును; 
దగిలి యుండుట మహాతత్త్వబుద్ధిఁ

1-36.1-తే.

బరఁగ నాధ్యాత్మికాది తాపత్రయంబు
నడఁచి పరమార్థభూతమై యధిక సుఖద
మై సమస్తంబుఁ గాకయు నయ్యు నుండు
వస్తు వెఱుఁగంగఁ దగు భాగవతమునందు.

ప్రతిపదార్ధము :

శ్రీమంతము = శుభంకరము; ఐ = అయిన ; ముని = మునులలో; శ్రేష్ఠ = శ్రేష్ఠునిచే - వ్యాసునిచేత; కృతంబు = రచింపబడినది; ఐన = అయినట్టి; భాగవతంబు = భాగవతము; సద్భక్తి = మంచిభక్తి; తోడన్ = తో; వినన్ = వినుటను; కోరువారల = కోరేవారి; విమల = నిర్మలమైన; చిత్తంబులన్ = మనస్సులలో; చెచ్చెరన్ = తొందరగా; ఈశుండు = జీవులలోనున్న ఈశ్వరుడు; చిక్కున్ = దొరకును; కాక = అంతేకాని; ఇతర = ఇతర; శాస్త్రంబులన్ = శాస్త్రములకు; ఈశుండు = ఈశ్వరుడు; చిక్కునే = దొరుకుతాడా; మంచివారల = మంచి వాళ్ళ; కున్ = కును; నిర్మత్సరులు = మాత్త్సర్యం లేని వాళ్ళ; కున్ = కును; కపట = మాయ నుంచి; నిర్ముక్తులై = విడిపింప బడ్డవారై; ఐ = అయ్యి; కాంక్ష = కోరుట; సేయకయును = చేయకుండక; తగిలి = తగిలి (భక్తికి); ఉండుటన్ = ఉండటమును; మహాతత్త్వ = మహత్త్వమైన అంతర్యామి యందు; బుద్ధిన్ = ధ్యాస; పరఁగ = ప్రవర్తిల్లగ; ఆధ్యాత్మిక = ఆధ్యాత్మికము; ఆది = మొదలైన; తాపత్రయంబున్ = మూడు రకాలైన తాపములను {తాపత్రయంబు - (ఆధ్యాత్మిక, ఆధిభౌతిక , ఆధిదైవిక)}; అడఁచి = అణచి; 

పరమార్థ = మోక్షము యొక్క; భూతము = రూపము; ఐ = అయ్యి; అధిక = మిక్కిలి; సుఖదము = సుఖప్రదము; ఐ = అయ్యి; సమస్తంబున్ = సర్వమును; కాకయు = కాకుండాను; అయ్యున్ = అయ్యికూడా; ఉండు = ఉండే టటువంటి; వస్తువు = వస్తువు; ఎఱుఁగంగన్ = తెలిసికొనుటకు; తగు = వీలున్నది; భాగవతమున్ = భాగవతము; అందున్ = లో.

భావం :

శ్రీమంతమైనది, వేదవ్యాస మహామునిచే విరచితము ఐన ఈ భాగవత మహాపురాణాన్ని అచంచల భక్తితో ఆకర్ణించగోరే భక్తుల అంతరంగాలలోనే భగవంతుడు నిరంతరం నివసిస్తాడు. అంతే గాని ఇతర గ్రంథాల వల్ల ఈశ్వరుడు చిక్కడు. సజ్జనులు మాత్సర్యరహితులు మహాతత్వబుద్ధి కలిగి కపటమార్గాన పోకుండ, ఎటువంటి కాంక్షా లేకుండ, భాగవత శ్రవణమందే ఆసక్తులై ఉంటారు. ఇందువల్ల తాపత్రయం అంటే ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదైవికము అనే త్రివిధ తాపాలూ నశించి వారికి తత్త్వజిజ్ఞాస కలుగుతుంది. ఈ భాగవతంలో పరమార్థభూతము, పరమానంద దాయకము, వ్యక్తావ్యక్తము అయిన పరబ్రహ్మ స్వరూపం అభివ్యక్త మవుతుంది.

|| ఓం నమః శివాయ ||
Read More

శ్రీమద్భాగవతం - 43

శ్రీమద్భాగవతం - 43

షష్ఠ స్కంధము – అజామిళోపాఖ్యానం:

ఒకానొక సమయంలో కన్యాకుబ్జము అనబడే ఒక నగరం వుండేది. ఆ నగరంలో ఒక శ్రోత్రియుడయిన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన త్రికాల సంధ్యావందనమును ఆచరించి వేదవేదాంగములను తాను పఠించి పదిమందికి వేదమును వివరణ చేస్తూ పదిమందికి పురాణ ప్రవచనం చేస్తూ దొరికిన దానితో అత్యంత సంతోషంతో జీవితమును గడపగలిగిన సమర్థుడు అయినవాడు. యాదృచ్ఛికముగా ఆయనకు ఐశ్వర్యము సమకూరింది. ఆయన మనస్సు మాత్రం సర్వకాలముల యందు భగవంతుని యందు రామించే స్థితిని కలిగి వున్నవాడు. అటువంటి మహాపురుషుడికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు అజామీళుడు. బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు తదనంతరం ఆయనకు ఒక ఉత్తమమయిన సౌందర్యవతియైన కన్యను తెచ్చి వివాహం చేశారు. ఆయన శీలం ఎటువంటిది? పుట్టినపుడు గతంలో చేసిన సత్కర్మల వలన బ్రాహ్మణ కులమున జన్మించాడు. సత్కర్మ అంటే చేసిన పని. అజామీళుడు యజ్ఞోపవీతం వుంది సంధ్యావందనం చేసిగాయత్రీమంత్రం జపించేవాడు. ఈవిధంగా అతడు జ్ఞానమును పొందినవాడు. శాంత లక్షణమును కలిగి ఉన్నాడు. బ్రాహ్మణునకు మొట్టమొదటి లక్షణము శాంతము.

దాంతుడై ఉన్నాడు. దాంతుడు మనసును గెలవడం. మనస్సు ఇంద్రియముల మీద ఆధారపడి ఉంటుంది. ఆయన మనసును ఇంద్రియములను గెలిచాడు. ఇక్కడే మీరొక విషయమును గుర్తుపెట్టుకోవాలి. ఒకరాజు ఒక రాజ్యమును గెలిచాడనుకోండి. ఆయన మరణించే వరకు ఆ రాజ్యం ఆయనదై ఉంటుందనే నమ్మకమేమీ ఉండదు. ఈయనకన్నా బలవంతుడయిన రాజు వచ్చి ఈయనను చంపి ఆ రాజ్యం ఆయన కొల్ల గొట్టవచ్చు. అలాగే ఇంద్రియములను గెలిచినా వాడు మరొక పదినిమిషములు గడిచిన తరువాత పతనమై క్రిందపడి పోవచ్చు. ఆయన మోక్షమును పొందితే ఆయన ఇంద్రియములను మనసును గెలిచినట్లు లెక్క. అవి ఏ క్షణంలో అయినా కాటు వేయడానికి నిరంతరమూ కాచుకుని ఉంటాయి. మంచి యౌవనమును పొందడానికి ముందు భార్యను చేపట్టక ముందు శాంతుడై, దాంతుడై ధర్మసంశీలుడై ఉన్నాడు.

శీలము అంటే స్వభావము. అజామీళుడు నిరంతరమూ తాను చేయవలసిన కర్తవ్యమును గూర్చి తాను ఆలోచించ గలిగినవాడు. తన ధర్మమును తాను నెరవేర్చిన వాడు. అంతమాత్రం చేత జ్ఞాని అయ్యాడని అనడానికి లేదు. తాను చదువుకున్నది అనుష్ఠాన పర్యంతము తీసుకువచ్చాడు. ఎన్నోమంత్రముల సిద్ధిని పొందాడు. అతని శరీరము మంత్రపూతమయింది. అంతగా దేవతానుగ్రహమును పొందాడు.

అజామీళుడు సత్యభాషణా నియమమును పెట్టుకున్నాడు. ధర్మమును వదలలేదు. నిత్య నైమిత్తిక కర్మలను వదిలి పెట్టలేదు. ఈవిధంగా అజామీళుడు రాశీభూతమయిన బ్రాహ్మణ తేజస్సు.

భగవంతుని గొప్పతనం గురించి ఎంత స్తోత్రం చేస్తారో అజామీళుడి యౌవనం గురించి పోతన గారు అన్ని పద్యములు వ్రాశారు. కొంచెం యుక్తాయుక్త విచక్షణతో దేనిని అసలు పెట్టుకోవాలి. దేనిని వదిలిపెట్టాలి అని తెలుసుకో గలిగినది, పట్టుకోవాలని తెలిసినా పట్టుకోవడానికి ఓపిక ఉన్నది యౌవనము మాత్రమే. ఈ యౌవనమును ప్రధానముగా రెండు భ్రంశము చేస్తాయి. ఒకటి అర్థార్జన. అర్థ సంపాదనకు అనువుగా అధికారులను పొగడుట యందు నిమగ్నమయిన వాడు, బెల్లపు పరమాన్నమయినా అదే రుచి, పంచదార పరమాన్నమయినా అదే రుచి – ఒకే పాయస పాత్రను తీసుకువచ్చి ఎన్ని గ్లాసులలోకి సర్దుకు తిన్నా ఒకే రుచి ఉంటుందని ఎరుగక కామినీ పిశాచము పట్టుకుని తన ధర్మపత్ని జంట వుండగా ఇతర స్త్రీలయందు వెంపర్లాట పెట్టుకున్న దౌర్భాగ్యుడు అలాగే నశించి పోతున్నాడు. ఈ రెండింటి చేత యౌవనము నశించిపోతున్నది. అలా నశించి పోవడం అత్యంత ప్రమాదకరము.

ఇప్పుడు అజామీళుడికి యౌవనం అంకురించింది. మానవుడు అయిదు ఇంద్రియములతో భోగములను అనుభవించవచ్చు. ఈశ్వరుడిని చేరుకోవచ్చు. కన్ను తప్పుగా భ్రమను కల్పిస్తే దీపపు పురుగు నశించి పోతుంది. దీపపు పురుగు దీపమును చూసి తినే వస్తువు అనుకుని దీపం మీదకి వెళుతుంది. రెక్కలు కాలి క్రింద పడిపోయి మరణిస్తుంది. దాని దృష్టికి దీపము ఆకర్షించేదానిలా ప్రవర్తిస్తుంది. మా ఇంటి దీపమే కదా అని ముసలాయన దీపమును ముద్దెట్టుకుంటే మూతి కాలిపోయినట్లు యౌవనంలో ఉన్న పిల్లవాడిని పొగిడి పాడు చేయకూడదు. కన్ను బాగా పనిచేస్తే దీపపు పురుగు నశించి పోయింది.

పాట అంటే చెవికి ప్రీతి. లేడికి ఒక పెద్ద దురలవాటు ఉంటుంది. వేటకాడు రెండు మూడు రోజులు వల పన్నుతాడు. ఒకవేళ జింక అటుగా రాకపోతే తానొక చెట్టు మీద కూర్చుని పాట పాడతాడు. ఎక్కడో గడ్డి తింటున్న లేడి ఆపాట విని దానికోసం పరుగెత్తుకుంటూ వచ్చి వేటగాని వలలో పడిపోతుంది. వెంటనే వేటగాడు దానిని చంపేస్తాడు. అందుకని చెవి వలన లేడి మరణిస్తోంది.

చర్మమునకు కండూతి’ అనగా దురద ఉంటుంది. ఈ దురద ఏనుగుకి ఉంటుంది ఈ కండూతి దోషం. అందుకని ఏనుగులను పట్టుకునే వారు గొయ్యి తీసి పైన గడ్డి పరిచి అది ఒళ్ళు గోక్కోవడానికి వీలయిన పరికరములు అక్కడ పెడతాడు. ఏనుగు అక్కడకు వచ్చి ఒళ్ళు గోక్కుందామని ఆ కర్రలకు తగులుతుంది. ఆ ఊగుకి పుచ్చు కర్రలు విరిగిపోయి గోతిలో పడుతుంది. అలా ఏనుగు దొరికిపోతుంది. ఈవిధంగా స్పర్శేంద్రియ లౌల్యం చేత ఏనుగు నశించి పోతున్నది.

నాల్గవది రసనేంద్రియము – నాలుక. దీనివలన పాడయిపోయేది చేప. ఈశ్వరుడు చేపలకు మొప్పలతో ప్రాణ వాయువును తీసుకుని బ్రతకగల శక్తిని ఇచ్చాడు. కానీ దానికి రుచులు అంటే ఎంత ఇష్టమో. ఎరను తిందామని ఉచ్చులో చిక్కుకుని ప్రాణం పోగొట్టుకుంటుంది. ఏది తిందామని వచ్చిందో అది ఇంకొకరికి ఆహారమై తినబడుతోంది. ఈవిధంగా రసనేంద్రియం చేత చేప నశించి పోతోంది.

ఇక వాసన. పద్మమునందు సుగంధము ఉంటుంది. ఆ సుగంధమును అనుభవించడం కోసం ఎక్కడినుంచో వస్తుంది సీతాకోక చిలుక. అది పువ్వులలో మకరందమును పీల్చి మకరందం అయిపోయినా సరే కాసేపు అక్కడే పడుకుంటుంది. దానికి ఆ వాసన మరిగి మత్తెక్కుతుంది. ఒక్కొక్క సారి చీకటి పడి పువ్వు ముకుళించుకు పోతుంది. అది పువ్వులో చిక్కుకు పోతుంది. ఆ సమయమునకు నీళ్ళు త్రాగుదామని ఏనుగులు వస్తాయి. అవి నీళ్ళు త్రాగి వెళ్ళిపోతూ ఈ పద్మములను తొండముతో పీకివేసి నేలమీద పారవేసి తొక్కేసి వెళ్ళిపోతాయి. పద్మమునందు సుగంధమును ఆఘ్రాణిస్తూ వున్న సీతాకోకచిలుక ఏనుగు పాదము క్రింద పడి మరణిస్తుంది. వాసన మరిగి సీతాకోక చిలుక నశించింది.

ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క లౌల్యమునకు నశించి పోతోంది. ఈ ఇంద్రియములలో ఏ ఇంద్రియమయినా మిమ్మల్ని కరచి వేయవచ్చు. ఇంద్రియములను త్రిప్పడానికి జ్ఞానమును ఉపయోగించాలి. అలా ఎవరు ఉపయోగించడో వాడు నశించిపోతాడు. ఇప్పుడు అజామీళుడు నిలబెట్టుకోగలడా? ఇది పరీక్ష. భాగవతమును అందరూ వినవచ్చు. కానీ యౌవనంలో ఉన్నవాడు విన్నట్లయితే జీవితమును సార్థకత చేసుకోగలడు. ఆయనను తండ్రిగారు ఒకరోజు పిలిచి రేపటి పూజకు దళములు, దర్భలు పువ్వులు తీసుకు రావలసినది అని చెప్పారు. తండ్రి మాట ప్రకారం అడవికి వెళ్ళి పువ్వులు, సమిధలు కోసి సంతోషంగా ఇంటివైపుకి వచ్చేస్తున్నాడు. అంతలో అతనికి ఒక పొదలో ఏదో ధ్వని వినపడింది. దానిని ముందు చెవి గ్రహించింది. అది వినవలసిన ధ్వని కాదు అని ఆయన వెళ్ళిపోయి ఉంటే వేరు. ఈ ధ్వని ఎటు వినపడిందో అటు కన్ను తిరిగింది. పొదవైపు చూశాడు. కల్లుకుండలు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని చాలా హీనమయిన జన్మను పొందిన ఒక స్త్రీ, ఆ కల్లును తాను విశేషముగా సేవించి శారీరకమయిన తుచ్ఛమయిన కామమునందు విశేషమయిన ప్రవేశము అనురక్త అయిన ఒక స్త్రీ కళ్ళు సేవించిన పురుషుడు శృంగార క్రీడయందు విశేషమయిన అభినివేశము ఉన్న వాడితో ఆనందముగా పునః పునః రతిక్రీడ జరుపుతున్నది.

అజామీళుడు ఆ సన్నివేశము చూశాడు. శుకుడికి కూడా ఇదే పరీక్ష వచ్చింది. బ్రహ్మమని ఆయన వెళ్ళిపోయాడు. అందుకని భాగవతం చెప్పగలిగాడు. కానీ ఇక్కడ అజామీళుడి మనస్సును ఆ దృశ్యము ఆక్రమించింది. కర్మేంద్రియ సంఘాతము ఆయనను నిలబెట్టేసింది. చూస్తున్న సన్నివేశం మనస్సులో ముద్రపడడం ప్రారంభం అయిపొయింది. అలా నిలబడి తమకముతో ఆ సన్నివేశమును వీక్షించాడు. అనగా ఇన్నాళ్ళు వశములో ఉన్న ఇంద్రియ లౌల్యము గలవడం ప్రారంభం అయింది. వారిద్దరూ వెళ్ళిపోయిన తరువాత తానూ వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి దర్భలు తండ్రికి ఇచ్చి అసుర సంధ్య వేళా సంధ్యావందనమునకు కూర్చున్నాడు. కానీ మనస్సులో కనపడుతున్నది ప్రార్థనా శ్లోకము కాదు. పొదలమాటున తన కన్ను దేనిమీద నిలబడిందో అది కనపడుతోంది. ఇంట ధర్మపత్నియై సుగుణాల రాశియై సౌందర్యవతియైన భార్య ఉన్నది. కానీ ఆయన కోర్కె వేరొక కులటయందు ప్రవేశించింది. ఆచార్య వాక్కులు గుర్తు తెచ్చుకుని అధిగమించాలని ప్రయత్నం చేశాడు. కానీ అతడు చూసిన సన్నివేశము వీటన్నింటిని తొలగదోసినది. ఒకనాటి రాత్రి తన భార్యకు తల్లికి, తండ్రికి తెలియకుండా ఆహీనకుల సంజాత అయిన ఆస్త్రీని చేరాడు. సంధ్యావందన భ్రష్టుడై రాత్రింబవళ్ళు అక్కడే ఉన్నాడు. తల్లిదండ్రులను ఎదిరించాడు. భార్యను విడిచిపెట్టేశాడు. తల్లిదండ్రులు వృద్ధులైపోయారు. వారి ధనమును దోచుకున్నాడు. కులట స్త్రీయందు 9మంది బిడ్డలను కన్నాడు.

అతడు చేసిన ఒకే ఒక మంచి పని – ఆవిడ కడుపున పుట్టిన ఆఖరు బిద్దడికి ‘నారాయణ’ అని పేరు పెట్టడం. ఆఖరి పిల్లాడు అవడం మూలాన వాడిమీద మమకారం ఉండిపోయి వాడిని నారాయణ నారాయణ అంటూ తరచూ పిలుస్తూ ఉండేవాడు. ఆవిడ పిల్లల పోషణార్థమై డబ్బు సంపాదించుకు రామ్మనేది. అందుకుగాను దొంగతనములు చేయడం మొదలు పెట్టాడు. ఎంత వేదం చదువుకున్నాడో, ఎవడు నిత్య నైమిత్తికములను నెరపినాడో, ఎవడు శాంతుడై దాంతుడై సకల వేదములను చదివాడో ఎవడు మంత్రసిద్ధులను పొందాడో అటువంటి అజామీళుడు ఈవేళ ఆరితేరిన దొంగయై అంతటి దొంగ లేదని అనిపించుకున్నాడు.

ఇంత పతనం ఎక్కడినుంచి వచ్చింది? ఒక్క ఇంద్రియ లౌల్యం వల్ల వచ్చింది. మనిషి మనిషిగా బ్రతకడం, ఈశ్వరుని చేరుకోవడం ఇంద్రియములను గలవడం ఎంతకష్టమో చూడండి.
Read More

.శ్రీవారి ఆలయ నిర్మాణచాతుర్యం...🏕

.శ్రీవారి ఆలయ నిర్మాణచాతుర్యం...🏕

                తిరుమల శేషాచలగిరుల్లో వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం భారతదేశంలోని ప్రముఖ ఆలయాల్లో విశిష్టమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. 
క్రీ.పూ.12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో శ్రీవారి ఆలయం నిర్మితమైంది.

                శ్రీవారి ఆలయంలో మొత్తం #మూడు 3⃣🔄 ప్రాకారాలున్నాయి. ఆలయం గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరుచుకోవడానికి వేర్వేరుగా గదులున్నాయి. వీటితోపాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంటగదులున్నాయి.

                శ్రీవారి ఆలయం అభివృద్ధికి ఎన్నో రాజవంశాలకు రాజులు, రాణులు ఇతోధికంగా విరాళాలు అందించి సహకరించారు. అద్భుత నిర్మాణమైన శ్రీవారి ఆలయంలో పలు ఉప ఆలయాలు, మండపాలు కొలువుదీరాయి. ఆలయంలోని నిర్మాణాలను ఒకసారి పరిశీలిద్దాం.

1⃣వ ప్రాకారం :-
〰〰〰〰〰〰

⛩ మహాద్వార గోపురం ⛩ :-

                శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించడానికి శ్రీవారి ఆలయంలో ప్రవేశించే .....ప్రధాన ప్రవేశద్వార.... గోపురమే మహాద్వార గోపురం.⛩

 పడికావలి, 
సింహద్వారం, 
ముఖద్వారం 
అని ఈ ద్వారానికి వేర్వేరు పేర్లు ఉన్నాయి. 
దీనినే తమిళంలో..... ”పెరియ తిరువాశల్‌”... అని కూడా అంటారు. అనగా #పెద్దవాకిలి అని అర్థం.

                ఈ ప్రధాన ద్వారగోపురంతో అనుసంధింపబడుతూ నిర్మించిన ప్రాకారమే మహాప్రాకారం. వైకుంఠం క్యూకాంప్లెక్సుల ద్వారా వచ్చిన భక్తులు ఈ మహాద్వార మార్గంలో మాత్రమే వెళ్లి స్వామివారిని దర్శించవలసి ఉంటుంది.

ఇక్కడే మనం క్రింద ఉన్న పైపు కు గల రంధ్రాల  ద్వారా వచ్చే నీటితో కాళ్ళు కడుగుకొని లోపలికి ప్రవేశిస్తాం.

ఇక్కడే

కుడిగోడపై #అనంతాళ్వారులు ఉపయోగించిన గుణపం ⛏ వ్రేలాడదీయబడి ఉంటుంది. 

✡ సంపంగి ప్రాకారం ✡ :-

                మహాద్వార గోపుర ప్రాకారానికి, నడిమి పడికావలి(వెండివాకిలి) ప్రాకారానికి మధ్యలో ఉన్న ప్రదక్షిణ మార్గమే సంపంగి ప్రాకారం. ప్రతి ఆలయానికి స్థల వృక్షాలనేవి ఉండడం పరిపాటి. తిరుమల ఆలయం స్థలవృక్షం #సంపంగి. 🌷 ఒకప్పుడు ఈ ప్రాంతం అంతటా సంపంగి చెట్లు ఉన్నందువల్ల ఇలా పిలవబడుతోంది.

                ఈ ప్రాకారంలో అద్దాలమండపం, 
రంగనాయక మండపం, తిరుమలరాయ మండపం, ధ్వజస్తంభమండపం, శ్రీవేంకటరమణస్వామి కల్యాణమండపం, 
ఉగ్రాణం, 
విరజానది, 
పడిపోటు, 
వగపడి అర 

తదితర మండపాలున్నాయి.

🏫 #కృష్ణరాయమండపం

                మహాద్వారానికి ఆనుకొని లోపలి వైపు 16 స్తంభాలతో ఉన్న ఎత్తైన మండపమే కృష్ణరాయమండపం. దీనినే #ప్రతిమామండపం అని కూడా అంటారు. 
లోపలికి ప్రవేశిస్తున్నపుడు కుడివైపున రాణులు తిరుమల దేవి, చిన్నాదేవులతో కూడిన శ్రీకృష్ణరాయల నిలువెత్తు రాగి ప్రతిమలు. 
అలాగే ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతి రాయల రాగిప్రతిమ, ఆ పక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మాణ్ణి వీరి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు తిరుమల యాత్ర చేసి శ్రీ స్వామికి ఎన్నో కానుకలు సమర్పించాడు. అచ్యుతరాయలు తనపేరిట అచ్యుతరాయ బ్రహ్మోత్సవాన్ని నిర్వహించాడు. 

⚛ రంగనాయక మండపం ⚛ :-

                కృష్ణరాయమండపానికి దక్షిణం వైపుగా ఉన్నదే ”రంగనాయకమండపం”. శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు కొంతకాలం పాటు ఈ మండపంలో భద్రపరిచారు. 
అందువల్లే దీన్ని రంగనాయక మండపమని పిలుస్తున్నారు. ఒకప్పుడు నిత్యకల్యాణోత్సవాలు జరిగిన ఈ మండపంలో ప్రస్తుతం ఆర్జితసేవలయిన వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, వాహనసేవలు జరుగుతున్నాయి.

                రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తదితర ప్రముఖులకు శ్రీవారి దర్శనానంతరం ఈ మండపంలోనే వేదాశీర్వచనంతోపాటు శ్రీవారి ప్రసాదాలను అందజేస్తారు.

✡ తిరుమలరాయ మండపం ✡ :-

                రంగనాయక మండపాన్ని అనుకుని పడమర వైపునకు ఉన్న ఎత్తయిన స్తంభాల మండపమే తిరుమలరాయ మండపం. 
ఈ మండపంలోని వేదిక భాగాన్ని తొలుత సాళువ నరసింహరాయలు నిర్మించగా,(సాళ్వ నరసింహ మండపం) ఆ తర్వాతికాలంలో సభాప్రాంగణ మండపాన్ని తిరుమలరాయలు నిర్మించాడు. 
ఈ మండపాన్ని ..…అణ్ణాఊయల మండపం..... అని అంటారు. అణ్ణై అనగా #హంస.🕊 బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీస్వామివారు ఈ మండపంలోనికి వేంచేసి పూజలందుకుంటారు.

 ☸ అద్దాల మండపం – అయినామహల్‌ ☸ :-

                ప్రతిమా మండపానికి ఉత్తరం దిక్కున ఉన్నదే అద్దాల మండపం. దీన్నే అయినామహల్‌ అని కూడా అంటారు. అయినా అనేది హిందీ పదం. తమిళంలో కన్నాడి అరై అంటారు.

 ⬆ ధ్వజస్తంభ మండపం ⬆:-

                ధ్వజస్తంభ మండపంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. వెండివాకిలికి ఎదురుగా బంగారు ధ్వజస్తంభం ఉంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవంలో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారు. దీన్నే ధ్వజారోహణం అంటారు. 

                ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున అనుకొని ఉన్న ఎత్తైన పీఠమే బలిపీఠం. దీనికి కూడా బంగారు రేకు తాపబడింది. శ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు బలిని(అన్నాన్ని 🍙🍚) ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు.

2⃣ 2వ ప్రాకారం :-
〰〰〰〰〰〰

....వెండి వాకిలి – నడిమి పడికావలి...

                ధ్వజస్తంభానికి ముందు ఉన్న ప్రవేశద్వారమే వెండివాకిలి. నడిమి పడికావలి అని పిలువబడే ఈ వెండివాకిలి గుండా వెళ్లి శ్రీస్వామివారిని భక్తులు దర్శిస్తారు. ప్రవేశద్వారమంతటా వెండి రేకు తాపబడినందువల్ల దీన్ని వెండివాకిలి అని అంటారు. 
ఈ ద్వారంలో మహంతు బావాజీ, శ్రీ వేంకటేశ్వరస్వామి పాచికలాడుతున్న 🎲 శిల్పం ఉంది.

✡ వసంత మండపం ✡

                తిరుమల శ్రీవారి ఆలయానికి మహాప్రదక్షిణ మార్గంలో నైరుతిమూలలో వసంత మండపం ఉంది. 

🏕 శ్రీ వరదరాజస్వామి ఆలయం 🏕 :-

                విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయమూలన శ్రీ వరదరాజస్వామి ఆలయం ఉంది. ఈ గుడిలో(సుమారు 4 అడుగుల) నిలువెత్తు శ్రీ వరదరాజస్వామివారి శిలామూర్తి 🕴 ప్రతిష్ఠింపబడింది.

🍱 🍨 ప్రధాన వంటశాల (పోటు) 🍱🍨

                విమాన ప్రదక్షిణంలో ఉన్న ప్రధాన వంటశాలను పోటు అంటారు. ఈ వంటశాలలో దద్దోజనం, చక్కెరపొంగలి, పులిహోర, ముళహోర, కదంబం, పొంగలి, సీరా, మాత్రాలతో పాటు కల్యాణోత్సవ దోశ, చిన్నదోశ, తోమాల దోశ, జిలేబి, పోలి, పాల్‌ పాయసం, అప్పం మొదలైనవాటిని తయారు చేస్తారు. ఆయా నియమాలను అనుసరించి వీటిని స్వామివారికి నివేదన చేస్తారు.

🏟 కళ్యాణ మండపం 🏟 :-

                సంపంగి ప్రదక్షిణం దక్షిణంవైపు మార్గంలో రేకులతో దీర్ఘచతురస్రాకారంగా కల్యాణమండపం నిర్మించబడింది. ఇందులో తూర్పుముఖంగా ఏర్పాటుచేయబడిన కల్యాణవేదికపై శ్రీమలయప్పస్వామివారికి, శ్రీదేవి భూదేవులకు ప్రతినిత్యం ఉదయం కల్యాణోత్సవం జరుగుతుంది. 

🐘🐎 వాహనం స్టోర్స్. 🐘 🐎 :-

ఉత్సవాలలో ఉపయోగించే గరుడ , సింహ ,  సూర్య , చంద్రాది వాహనాలు ఉంచే ప్రదేశం.

📚 సంకీర్తన భండారం 📚 :-

                సభ అరను అనుకుని ఉన్నదే సంకీర్తన భండారం. దీన్నే ”🗂 .....తాళ్లపాక అర”, ”రాగిరేకుల అర”...... 🗂  అంటారు. తాళ్లపాక కవులు సంకీర్తనలు చెక్కిన రాగిరేకులు ఈ అరలో భద్రపరిచి ఉండేవి. 
ఈ భాండారంపై తాళ్లపాక అన్నమయ్య, ఆయన కుమారుడు పెద తిరుమలయ్యల శిల్పమూర్తులు మలచబడివున్నాయి.

🏟 బంగారు బావి 🏟 :-

                విమాన ప్రదక్షిణంలో పోటుకు వెళ్లే మార్గం పక్కన బంగారు బావి ఉంది. ఈ బావి ఒఱకు బంగారు రేకు తాపబడినందువల్ల ‘బంగారుబావి’ అని పిలువబడుతున్నది. శ్రీవారి వంటలకు, శుక్రవారాభిషేకానికి, నిత్యార్చనలకు ఈ బంగారుబావి జలాన్నే ఉపయోగిస్తారు. #రంగదాసు(తొండమానుని పూర్వజన్మ) అనే భక్తుడు ఈ బంగారు బావిని నిర్మించాడట.

🏕 రామానుజ ఆలయం – భాష్యకార్ల సన్నిధి 🏕 :-

                సంకీర్తన భాండారానికి పక్కగా, హుండీకి ఎదురుగా సన్నిధి భాష్యకారులు ఉన్నారు. భగ్రవద్రామానుజుల వారినే భాష్యకారులంటారు. శ్రీవారి సన్నిధిలో ఉండడం వల్ల ”సన్నిధి భాష్యకారుల’ని ప్రసిద్ధి ఏర్పడింది. తిరుమల క్షేత్రాన్ని చక్కగా తీర్చిదిద్దిన ఘనత #శ్రీరామానుజులవారిదే.

 🛐 శ్రీ యోగనరసింహస్వామి సన్నిధి 🛐 :-

                శ్రీ నరసింహాలయం క్రీ.శ 1330-1360 మధ్య నిర్మించబడిందని పరిశోధకుల అభిప్రాయం.  క్రీ.శ 1469లోని కందాడై రామానుజయ్యంగారి శాసనంలో ఈ యోగనరసింహుని ప్రస్తావన ఉంది. ‘అళగియ సింగర్‌'(అందమైన సింహం) అని, వేంకటాత్తరి(వేంకటశైలంపై ఉన్న సింహం) అని ప్రస్తావన ఉంది.

 🦅 గరుడ సన్నిధి 🦅 :-

మూలవిరాట్ కు ఎదురుగా జయ విజయులకు వెలుపలగా  గరుడాళ్వారులు గారు ఉన్న మండపం.
బంగారు వాకిలి ఎదురుగా, గరుడాళ్వార్‌ మందిరం ఉంది. శ్రీస్వామివారికి అభిముఖంగా, నమస్కార భంగిమలో సుమారు 5 అడుగుల ఎత్తు ఉన్న గరుడాళ్వారు శిలాప్రతిమ ప్రతిష్టించబడింది. ఈ మందిరానికి వెలుపల అంతటా ఇటీవలే బంగారం రేకు తాపబడింది. ఈ శిలామూర్తి గాక శ్రీవారి ఆలయంలో గరుడాళ్వార్‌ చిన్న పంచలోహ ప్రతిమ, బంగారు గరుడ వాహనం కూడా ఉన్నాయి.

✡ తిరుమామణి మండపం ✡ :-

బంగారు వాకిలి కి గరుడ సన్నిధి కి మధ్యగల ప్రదేశం.

సుప్రభాత సేవ లో భక్తులను ఇక్కడే ఉంచుతారు.

🔔 ఘంట:- 🔔

పూర్వం జయవిజయులకు ఇరువైపులా రెండు పెద్ద గంటలు ఉండేవి. హారతి సమయాలలో వీనిని మ్రోగించేవారు.

ఇప్పుడు రెండూ ఒకేచోటికి చేర్చారు. దర్శనానంతరం వెలుపలకు వచ్చే ద్వారం ప్రక్కనే ఉంటాయి.

🕴ద్వారపాలకులు 🕴 :-

బంగారు వాకిలికి వెలుపలగా ఇరువైపులా ఉండే జయ విజయులు.
మహాలఘుదర్శనం ఇక్కడే చేసుకొంటారు.

3⃣ మూడవ ప్రాకారం:-
〰〰〰〰〰〰〰〰
 ⛩ బంగారువాకిలి ⛩ :-

                శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధికి వెళ్లడానికి అత్యంత ప్రధానమైన ఏకైకద్వారం బంగారువాకిలి. వాకిలికి, గడపకు అంతటా బంగారు రేకు తాపబడినందువల్ల ఈ ప్రవేశద్వారానికి బంగారు వాకిలి అనే ప్రసిద్ధి ఏర్పడింది. ప్రతిరోజూ ఈ బంగారువాకిలి ముందు తెల్లవారుజామున సుప్రభాతం పఠనం జరుగుతుంది. ప్రతి బుధవారం భోగ శ్రీనివాసమూర్తికి, శ్రీ మలయప్పస్వామివారికి ఇక్కడే సహస్ర కలశాభిషేకం జరుగుతుంది.

⚛ స్నపనమండపం ⚛:-

                బంగారువాకిలి దాటి లోపలికి వెళ్లిన వెంటనే ఉండేదే ‘స్నపనమంపం’. క్రీ.శ.614లో పల్లవరాణి రామవై ఈ మండపాన్ని నిర్మించి, భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించిందట. ఈ స్నపనమండపాన్నే తిరువిలాన్‌ కోయిల్‌ అంటారు. ఆనందనిలయం జీర్ణోర్ధరణ సమయంలో ఈ మండపం నిర్మించబడిందని చెబుతారు.

✡ రాములవారి మేడ ✡ :-

                స్నపనమండపం దాటగానే కుడివైపు ఎత్తుగా కనిపించే నడవ ”రాములవారిమేడ”. తమిళంలో మేడు అంటే ఎత్తయిన ప్రదేశం అని అర్థం. ఇక్కడ రాములవారి పరివారమైన అంగద, హనుమంత, సుగ్రీవుల విగ్రహాలున్నాయి. ప్రస్తుతం ఆనందనిలయంలో ఉన్న శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ ఉండేవని, అందువల్లే ఇది రాములవారి మేడ అని పిలువబడుతోంది.

🛌 శయనమండపం 🛌 :-

                రాములవారి మేడ దాటి లోపల ప్రవేశించిన వెంటనే ఉన్న గదే శయనమండపం. శ్రీవేంకటేశ్వరస్వామివారు వెలసిన గర్భాలయానికి ముందున్న అంతరాళమే శయనమండపం. ప్రతిరోజూ ఏకాంత సేవ ఈ మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంమీద శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శయనిస్తారు.

 ➖➖ కులశేఖరపడి ➖➖ :-

 శయనమండపానికి, శ్రీవారి గర్భాలయానికి మధ్యన రాతితో నిర్మించిన ద్వారబంధం ఉంది. అదే కులశేఖరప్పడి. పడి అనగా మెట్టు, గడప అని అర్థం.

🏛 గర్భగృహం 🏛 :-

                కులశేఖరపడి అనే బంగారు గడపను దాటితే ఉన్నదే శ్రీవారి గర్భాలయం. శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి ఉన్నచోటే గర్భాలయం. దీనినే ”ఆనంద నిలయం” అంటారు. ఈ ఆనంద నిలయంపై ఒక బంగారు గోపురం నిర్మించబడింది. దీనినే ఆనందనిలయ విమానం అంటారు.

*శ్రీ వేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు) 🚹 :-

                గర్భాలయంలో స్వయంవ్యక్తమూర్తిగా నిలిచివున్న పవిత్ర శిలా దివ్యమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి. నిలబబడివున్నందున ఈ ఆర్చామూర్తిని ”....స్థానకమూర్తి....” అంటారు.
 అంతేగాక స్థిరంగా ఉన్నందువల్ల ”....ధ్రువమూర్తి....” అని, ”ధ్రువబేరం” అని కూడా అంటారు.

                శ్రీ స్వామివారి మూర్తి అత్యంత విలక్షణమైన పద్ధతిలో దర్శనమిస్తూ భక్తులను ఆనందింపజేస్తున్నది. సుమారు 8 అడుగుల ఎత్తుగల #స్వయంభూమూర్తి.

𝕾𝖔𝖚𝖗𝖈𝖊:- (మూలం)

నేను చాలాసార్లు తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నాను  ఎంతగా ఊహించుకుంటూ వెళ్తామో అంతకంటే శీఘ్రంగా బయటకు వస్తాము.(⁉పంపివేయబడతాము 😋 😪) . నేనేకాదు మనలో చాలామంది కి ఎక్కువసార్లు బంగారు వాకిలి బయటనుండే దర్శనం లభించేది. 😪
అయితే బంగారు వాకిలి నుండి గర్భగుడి వరకు ఏం ఉంటుంది అందులో ఏఏ కార్యక్రమాలు నిర్వహించేవారు అని తెలుసుకునే #కుతూహలం కోసం సేకరించిన సమాచారం.  దానితో పాటు గుడి గురించిన సమాచారం. ఇంకా ఏవైనా ప్రత్యేకతలు ఉంటే తెలుపగలరు, తెలుసుకుందాం  & తెలియచేద్దాం.🏕 ....శ్రీవారి ఆలయ నిర్మాణచాతుర్యం...🏕

                స్నపనమండపం దాటగానే కుడివైపు ఎత్తుగా కనిపించే నడవ ”రాములవారిమేడ” అంటే ఎత్తయిన ప్రదేశం అని అర్థం. ఇక్కడ రాములవారి పరివారమైన అంగద, హనుమంత, సుగ్రీవుల విగ్రహాలున్నాయి. ప్రస్తుతం ఆనందనిలయంలో ఉన్న శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ ఉండేవని, అందువల్లే ఇది రాములవారి మేడ అని పిలువబడుతోంది.

🛌 శయనమండపం 🛌 :-

                రాములవారి మేడ దాటి లోపల ప్రవేశించిన వెంటనే ఉన్న గదే శయనమండపం. శ్రీవేంకటేశ్వరస్వామివారు వెలసిన గర్భాలయానికి ముందున్న అంతరాళమే శయనమండపం. ప్రతిరోజూ ఏకాంత సేవ ఈ మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంమీద శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శయనిస్తారు.

 ➖➖ కులశేఖరపడి ➖➖ :-

 శయనమండపానికి, శ్రీవారి గర్భాలయానికి మధ్యన రాతితో నిర్మించిన ద్వారబంధం ఉంది. అదే కులశేఖరప్పడి. పడి అనగా మెట్టు, గడప అని అర్థం.

🏛 గర్భగృహం 🏛 :-

                కులశేఖరపడి అనే బంగారు గడపను దాటితే ఉన్నదే శ్రీవారి గర్భాలయం. శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి ఉన్నచోటే గర్భాలయం. దీనినే ”ఆనంద నిలయం” అంటారు. ఈ ఆనంద నిలయంపై ఒక బంగారు గోపురం నిర్మించబడింది. దీనినే ఆనందనిలయ విమానం అంటారు.

*శ్రీ వేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు) 🚹 :-

                గర్భాలయంలో స్వయంవ్యక్తమూర్తిగా నిలిచివున్న పవిత్ర శిలా దివ్యమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి. నిలబబడివున్నందున ఈ ఆర్చామూర్తిని ”....స్థానకమూర్తి....” అంటారు.
 అంతేగాక స్థిరంగా ఉన్నందువల్ల ”....ధ్రువమూర్తి....” అని, ”ధ్రువబేరం” అని కూడా అంటారు.

                శ్రీ స్వామివారి మూర్తి అత్యంత విలక్షణమైన పద్ధతిలో దర్శనమిస్తూ భక్తుల ఆనందింపజేస్తున్నది. సుమారు 8 అడుగుల ఎత్తుగల #స్

నేను చాలాసార్లు తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నాను  ఎంతగా ఊహించుకుంటూ వెళ్తామో అంతకంటే శీఘ్రంగా బయటకు వస్తాము.(⁉పంపివేయబడతాము 😋 😪) . నేనేకాదు మనలో చాలామంది కి ఎక్కువసార్లు బంగారు వాకిలి బయటనుండే దర్శనం లభించేది. 😪
అయితే బంగారు వాకిలి నుండి గర్భగుడి వరకు ఏం ఉంటుంది అందులో ఏఏ కార్యక్రమాలు నిర్వహించేవారు అని తెలుసుకునే #కుతూహలం కోసం సేకరించిన సమాచారం.  దానితో పాటు గుడి గురించిన సమాచారం. ఇంకా ఏవైనా ప్రత్యేకతలు ఉంటే తెలుపగలరు, తెలుసుకుందాం  & తెలియచేద్దాం.
Read More

ఆది గురువు దక్షిణామూర్తి:

ఆది గురువు దక్షిణామూర్తి:

భారతీయ సంస్కృతి ప్రపంచదేశాలకు అనుసరణీయం. మార్గదర్శనం చేస్తోందంటే ఈ సంస్కృతి వికాసానికి మూలం గురువే అన్న సత్యం బోధిస్తుంది. వ్యక్తి షోడశ సంస్కారాలు పరిపూర్ణం కావడానికి దోహదపడే వాడు గురువు.
అజ్ఞానతిమిరాన్ని పోకార్చి జ్ఞాన జ్యోతులు వెలిగించే గురువును ప్రత్యక్షదైవంగా మన భారతీయ సంస్కృతి సాహిత్యాలు అభివర్ణిం చాయి.
''ఆలయం కరుణాలయం'' అని ఆది గురువు దక్షిణామూర్తిశంకరులను కీర్తించింది మన సంస్కృతి. గురుసేవ మహాభాగ్యంగా భావించి తరించిన ఎందరో సత్పుర్షులు ఈ వేద భూమిని మరింత పవిత్రం చేశారు.
వ్యక్తి క్రమ శిక్షణాత్మక జీవితాన్ని జన్మ ఉన్నంత వరకు ఒక మంచి సంస్కా రంగా తెలియజేసిన మన సంస్కృతిలో గురువుకు ఉన్నత స్థానం ఈయ బడింది. మానవ సమాజం ఉన్నంత ఉత్తమ సంస్కారా లతో ఆదర్శవంతమైన జీవితం గడిపిన పురుషార్థా లను సుసంపన్నం చేసే ప్రక్రియలో గురుస్థానం ప్రముఖమైనది. వ్యక్తి పుట్టుకతో సంస్కార వంతుడు కావడానికి తొలి గురువు తల్లి. ఆమె శిక్షణలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వ్యక్తి విద్యాసంస్కారం అలవరచు కోవడానికి గురువును ఆశ్రయిస్తాడు.
గురువు ద్వారా లభించిన జ్ఞానాన్ని పదు గురికి పంచుతూ ఒక నాటి శిష్యుడు గురు స్థానానికి చేరుకుంటాడు. ఈ సందర్భంలో గురువు ఇచ్చే జ్ఞానాన్ని విశ్లేషిస్తూ ఒకచైనా సామెతను మనం స్మరించుకోవాలి. ఆ సామెత ఇలా వుంది.

''జ్ఞానం లేని జీవితం పండని పొలం రెండూ వ్యర్థమే''.
పై భావం ఏ దేశానిదైనా, ఏ భాషదైనా అంత రార్థం ఒక్కటే. గురు ముఖత:

 నేర్చిన జ్ఞానమే మనిషి జీవితాన్ని ఆదర్శ వంతం చేస్తుంది. అందుకే హయగ్రీవుని స్తుతిలో జ్ఞాన ఆనందాలకు హేతువుగా తెలియజేయడం జరిగింది. మన భారతీయ సంస్కృతి ఆది గురువుగా దక్షిణా మూర్తిని అభివర్ణించింది. ఆ శ్లోకం ఇలా వుంది.

''గురవే సర్వలోకానాం
భిషజే భవ రోణినాం
నిధయే సర్వ విద్యానాం
దక్షిణా మూర్తయేనమ:''

అన్న దక్షిణామూర్తి శ్లోకం దక్షిణామూర్తిని మేధ దక్షిణా మూర్తి గానూ, ఆదిగురువుగాను తెలియ జేస్తోంది. గురువు విశ్వానికి, జ్ఞానానికి వుండే సంబం ధాన్ని విశదప రుస్తాడు. గురువంటే గమించే జ్ఞానం. అంథకా రాన్ని తొలగించే జ్ఞానం. అచేతనం నుండి చేతనా నికి తీసుకపోయే మార్గ దర్శి.
గురువు జ్ఞానాన్ని నిష్కామకర్మ రూపంగా శిష్యులకు అందిస్తాడు. ''పూర్వ దత్తేషు యా విద్యా'' అన్న విధంగా పూర్వ జన్మలో చేసిన పుణ్యం వల్లనే గొప్ప విద్య శిష్యునికి అలవడటానికి పుణ్యమూర్తి గురువే ఆధారం అవుతాడు. అందుకే గురుస్తుతిలో

''గురుమూర్తించి దాకాశం సచ్చిదానంద విగ్రహం
నిర్వి కల్పం నిరాబాధం దత్తమానంద మాశ్రయే
గురుస్తుతితో ధన్యులమౌదాం.
ఓం శ్రీత్రిమూర్తి స్వరూప గురవేనమ:

ఓం నమో దక్షిణామూర్తియే నమః
ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||
వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం ఙ్ఞానదాతారమారాత్ |
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేద దక్షం నమామి ||
Read More

భాగవతం - 25

భాగవతం - 25

శుకబ్రహ్మ రావడంలో ఒక గొప్పతనం ఉంది. ఒక సమస్య ఏర్పడడం గొప్పతనం కాదు. కలియుగ ప్రవేశం జరిగితే దానివల్ల ప్రభావితుడయినవాడు పరీక్షిన్మహారాజు గారు ఒక్కడే కాదు – కలియుగంలో ఉన్న మనం అందరూ కూడా కలిచేత బాధింపబడుతున్న వాళ్ళమే. కాబట్టి ఇప్పుడు కలి బాధనుండి తప్పుకోవడానికి మార్గం ఏదయినా ఉంటుందా – ఇది చెప్పేవాడు ఎవరయినా ఉండాలి. మనం అందరం కలి బాధలను పడుతున్నాము. కలి ప్రభావం మనమీద ప్రసరించకుండా ఉండడం కోసమని మనం చేయవలసిన ప్రయత్నమునయినా చెప్పగలిగిన సమర్థుడు ఒకడు రావాలి. అటువంటి సమర్థుడు ఇప్పుడు వచ్చాడు. ఆయనే శుకుడు. 
ఇక్కడ మన ఒక విషయమును పరిశీలించాలి. ఎవరికయినా మృత్యువు ఆసన్నమయిపోయిందని చెప్పారనుకోండి – ‘అయ్యా మీరు ఇక రెండుమూడు రోజులలో వెళ్ళిపోతారు’ అని చెప్పారనుకోండి – అప్పుడు ఆ చనిపోబోయే ఆయన దగ్గరకు ఎవరయినా వెళ్ళి ‘అయ్యా, మీకు కొన్ని మంచి విషయములు చెపుదామని వచ్చామండి – మీకు భాగవతము చెపుదామని వచ్చామండి’ అని అన్నారనుకోండి – వాడు ఆ మంచి విషయమును వినడానికి అంగీకరించడు. ఇప్పుడు ఎందుకండీ అంటాడు. ‘చచ్చేవేళ సందిమంత్రం’ అని మనవాళ్ళు ఒక మోటు సామెత ఒకటి చెపుతూ ఉంటారు. అపుడు సామాన్యమయిన వ్యక్తి చచ్చే వేల ఎవరు రామాయణం గురించి, భాగవతం గురించి విందామని అనుకుంటాడు? ఎవడికయినా ఎలా ఉంటుంది అంటే – ఆ ఉన్న రెండురోజులు భార్యాబిడ్డలను చూసుకోవాలని అనిపిస్తుంది. కానీ ఇక్కడ పరీక్షిన్మహారాజు గారు ఒక గొప్ప విషయం చేశాడు. శుకమహర్షి వస్తే ఈయనను ఎవ్వరూ వేయని ప్రశ్న ఒకటి వేశాడు. పరీక్షిన్మహారాజు గారు అన్నాడు – ‘ఏడు రోజులలో నాకు మరణము ఖాయమన్న విషయము తెలిసిపోయినది. నేను పాముచేత కరవబడతానని శృంగి శపించాడు. శృంగి నన్ను శపించాడని నేను ఎంతమాత్రమూ ఖేదపడడం లేదు. కానీ నేను పరమధార్మికులయిన పాండవుల వంశములో జన్మించిన వాడనయి, తపస్సు చేసుకుంటున్న బ్రాహ్మీ మూర్తియై వున్న ఒక మహర్షి మేడలో మృత సర్పమును వేశాను. నేను చేయరాని పనిని చేశాను అని బాధపడుతున్నాను. శృంగి నన్ను ఎలా శపించాడో అలాగే ఈ శరీరమును తీసుకువెళ్ళి ఆ పాముకి అప్పచేప్పేస్తాను. నేను నా మరణాన్ని అంగీకరిస్తున్నాను. నాకు భవిష్యత్తులో మళ్ళా జన్మము వచ్చినప్పుడు నా మనస్సు ఎప్పుడూ శ్రీమహావిష్ణువునే స్మరిస్తూ ఉండాలి. ఎక్కడయినా స్వామి వారి ఉత్సవమూర్తి కనపడ్డా, స్వామి దేవాలయం కనపడ్డా, గభాలున శిరస్సువంచి నమస్కరించగలిగిన సంస్కారబలం నాకు కావాలి. ఆ స్వామి గురించి నాలుగు మాటలు చెప్పేవాడు దొరికితే చాలు పరుగెత్తుకుంటూ వెళ్ళి వాని మాటలు వినే జిజ్ఞాస నాకు కలుగు గాక! నిరంతరమూ ఈశ్వరుని పాదసేవనము చేయగలిగిన కర్మేంద్రియములు నాకు కావాలి. నేను దానిని అర్థిస్తున్నాను. ఇది కలిగేటట్లుగా మీరందరూ నన్ను అనుగ్రహించ వలసినది. నాకు ఆశీర్వచనం చేయవలసింది’ అని ప్రార్థించాడు.
ఉత్తర జన్మలో ఉత్కృష్టమయిన జన్మ కావాలని ఆయన అడగలేదు. ఆయన అడిగింది – ఏ జన్మలో ఉన్నా, ఏ శరీరములో ఉన్నా కావలసినవి ఏమిటో వాటిని అడిగాడు పరీక్షిత్తు. ‘హరిచింతారతియున్’ ‘హరి ప్రణుతి’ ‘భాషాకర్ణనాసక్తియున్’ ‘హరిపాదాంబుజసేవయుం’ ఈ నాలుగూ నాకు కావాలి అని అడిగాడు. శుకబ్రహ్మ వచ్చి కూర్చుని ఉంటే శుకబ్రహ్మకు పాదప్రక్షాళనం చేశాడు. ఆచమనీయం ఇచ్చాడు. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒకమాట చెప్పాడు. ‘అయ్యా, నాకునాకు ఒక్క కోరిక ఉంది. నేను మళ్ళా పుట్టవలసిన అవసరం లేని మోక్షమును పొందడానికి కల్పవృక్షంలా మీరు వచ్చారు. మీరు ఒకచోట ఉండేవారు కాదు. అటువంటిది మీరు అనుకోకుండా వచ్చి నన్ను అనుగ్రహించారు కనుక, నాకు అటువంటి విషయము ఏది ఉన్నదో దానిని నాకు తెలియజేయవలసినది’ అని ప్రార్థించాడు.
భాగవతం - ద్వితీయస్కంధము – 25 
భాగవతంలో శుకుడు రావడమే ఒక పవిత్ర ఘట్టం. అటువంటి శుకబ్రహ్మ వచ్చి పరీక్షిత్తు చెప్పిన మాటలను విన్నాడు. తనగురించి తానూ ఏమీ చెప్పుకోలేదు. కానీ ఒక్కమాట చెప్పాడు. “పరీక్షిన్మహారాజా! నేనొక విషయం చెపుతాను. జాగ్రత్తగా విను. పూర్వం ఖట్వాంగుడు అనే ఒకరాజు ఉండేవాడు. అతడు దేవతలకు సాయం చేయడం కోసమని యుద్ధం చేయడం కోసమని భూమిని విడిచిపెట్టి రథమును ఎక్కి స్వర్గలోకమునకు వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేశాడు. చాలా దీర్ఘకాలము పోరు సాగింది. రాక్షసులు ఓడిపోయారు. తదుపరి దేవతలు అందరూ ఖట్వాంగుడిని అభినందించారు. ‘నీవు మాకోసమని పైలోకమునకు వచ్చి యుద్ధం చేశావు. నీకేమి వరం కావాలో కోరుకో’ అన్నారు. అపుడు ఆయన ‘నాకేమీ వరం అక్కర్లేదు. కానీ నా ఆయుర్దాయం ఎంత మిగిలిందో చెపుతారా’ అని అడిగాడు. అపుడు దేవతలు వాని ఆయుర్దాయం లేక్కచూసి ఇంకొక ఘడియ మాత్రమే ఉన్నాడని చెప్పారు. తాను తరించిపోవడానికి ఆ ఒక్క ఘడియ ఆయుర్దాయం చాలునని ఖట్వాంగుడు భావించాడు. వెంటనే తన రథం ఎక్కి గబగబా భూమండలమునకు వచ్చి అంతఃపురంలోకి వెళ్ళి ఈమాట చెప్పేసి, ధ్యానమగ్నుడై ఈశ్వరుడిని ధ్యానం చేస్తూ కూర్చుని శరీరమును విడిచి పెట్టేసి మోక్షమును పొందాడు. ఒక్క ఘడియ కాలం మాత్రమే ఆయుర్దాయం కలిగిన ఖట్వాంగుడే మోక్షమును పొందగలిగాడు. నీకు ఇంకా ఏడురోజుల సమయం ఉంది. నీకు తప్పక మోక్షం లభిస్తుంది’ అని చెప్పాడు శుకుడు.
ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. ఇలా మాట్లాడిన వాడు గురువు. మరణించే వారందరికీ పరీక్షిత్తు ప్రతినిధి. నేను నేననుకున్న ఈ శరీరమే రాకుండా కట్టెదుట అగ్నిహోత్రములో కాలి దోసెడు బూడిద అయిపోతోంది ఒక్క అరగంటలో ఏది నామరూపములు? వాడు పెట్టుకుంటే ఒక ఫోటో మిగిలిపోతుందంతే! పెట్టుకోక పోతే ఏ గొడవా లేదు. కాబట్టి ఇంతటి ఆభిజాత్యం కూడా పోయిందంతే! ఈ అహంకారమును గుర్తించని కారణము చేత మరల హీనోపాధిలోకి వెళ్ళిపోతున్నావు. అందుకని నీవు ఈశ్వరాభిముఖుడవు కావలసింది. నీకు సంబంధించన ఈ భౌతిక సంబంధములు కాని, వ్యక్తులు కాని, ఆస్తులు కాని, సంపద కాని, ఏవీ నిన్ను రక్షించవు. నీవు ఈశ్వరుడి పాదములను పట్టుకో. అవి మాత్రమే నిన్ను రక్షిస్తాయి. వివేకము తెలుసుకో అని చెప్పాడు. ఇక్కడ శుకుడు విరాడ్రూప వర్ణనమునంతా చేశాడు. చేసి హరిలేని పదార్థము లేదు. ఋషులు, సముద్రములు, భూమి, పంచామహాభూతములు ఇవన్నీ కూడా ఈశ్వరుని అంగాంగములై ఉన్నాయి. కాబట్టి ఎక్కడ చూసిన ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. కానీ ఈశ్వరుడు కనపడడం లేదు. ఎందుకు? అదే మాయ. అది నామ రూపములయండు కలిగిన తాదాత్మ్యం తదధిష్టానమయిన బ్రహ్మమునందు కలుగదు. అలా కలగాలంటే మాయ తొలగిపోవాలి. ప్రపంచంలో ఉన్నది మాయ అని తెలిస్తే అది తొలగిపోతుంది. ఇది మాయ అని గురుముఖంగా తెలియగానే మాయ తొలగిపోతుంది. అప్పటివరకు తొలగదు. దానికి ఈశ్వర కృప తోడయితే తొలగుతుంది. మాయ తొలగినపుడు లోపల వున్న ఆత్మ భాసిస్తుంది. కానీ మాయ తొలగడం అనేది అంత తేలికయిన విషయం కాదు. 
ఈశ్వరుని కోసం నీవు ఎక్కడా తిరగనక్కరలేదు. విశ్వము హరి. హరి విశ్వము. అజ్ఞానము చేత లోకములో ఈశ్వరుడు, లోకము ఇంకా ఇంకా అలా కనపడుతున్నాయి. కానీ జ్ఞాన నేత్రము చేత చూస్తె ఉన్నది ఒక్కటే. నీవు కానీ సక్రమముగా వినదలుచుకుంటే హరిమయము కాని పదార్థము ఈ ప్రపంచమునందు లేదు. ఇది తెలుసుకొని సమస్తము ఈశ్వరమయం జగత్ అని అంగీకరించి, అంతటా బ్రహ్మమును చూసి ఉన్నది బ్రహ్మమే అని నీవు అంగీకరించగలిగితే నీకు ఉత్తర క్షణమే మోక్షము’ అని బోధచేసి భక్తి నిలబడడానికి శుకుడు ఒక మాట చెప్పాడు. ‘నేను భక్తిగా ఉంటాను అంటే కుదరదు. నీకు ఈశ్వరునియందు పూనిక కలగాలి. ఇంట్లో కూర్చుని భగవంతుని మీద భక్తి రావాలని అనుకుంటే రాదు. ఈశ్వరునికి ముందు నీవు నమస్కారం చేయడం మొదలుపెడితే ఆయన నీకొక దారి చూపిస్తాడు. భగవంతుని కథలు వినదమనే స్థితికి నిన్ను తీసుకువెడతాడు. కానీ మనిషి కొన్ని కోట్ల కోట్ల జన్మల వరకు అసలు భాగవత కథవైపు వెళ్ళడు. కానీ వెళ్ళాడు అంటే అతని జీవితంలో గొప్ప మార్పు ప్రారంభమయిందన్న మాట. భగవంతుని కథలను వినడం నీవు ప్రారంభిస్తే భక్తి కలుగుతుంది. ఆ భక్తితో అంతటా నిండియుండి చూస్తున్న వాడు, చేయిస్తున్న వాడు సర్వేశ్వరుడనే భావన నీకు కలిగిన నాడు, నీకు తెలియకుండా భక్తిలో ఒక విచిత్రం ఏర్పడుతుంది. 
భాగవతం మనస్సుకు ఆలంబనం ఇస్తుంది. మనస్సును మారుస్తుంది. ఈశ్వరుని వైపు తిప్పుతుంది. దీనిని అందరూ పొందలేరు. ఈ అదృష్టం పొందాలి అంటే ఈశ్వరానుగ్రహం కూడా ఉండాలి. ఎవరిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడో వారు మాత్రమే భాగవతమును వినగలరు తప్ప అందరూ భాగవతమును వినలేరు. అందుచేత ‘నీవు భగవత్ కథా శ్రవణముతో ప్రారంభము చెయ్యి. ఈ సమస్త జగత్తును సృష్టించిన వాడు ఆయనే’ అని చెప్పాడు.
Read More

శ్రీ నారాయణాయ అష్టోత్తరశతనామావళి

శ్రీ నారాయణాయ అష్టోత్తరశతనామావళి

ఓం విష్ణవే నమ:
ఓం లక్ష్మీపతయే నమ:
ఓం కృష్ణాయ నమ:
ఓం వైకుంఠాయ నమ:
ఓం గరుడధ్వజాయ నమ:
ఓం పరబ్రహ్మణే నమ:
ఓం జగన్నాథాయ నమ:
ఓం వాసుదేవాయ నమ:
ఓం త్రివిక్రమాయ నమ:
ఓం దైత్యాంతకాయ నమ:
ఓం మధరిపవే నమ:
ఓం తార్‌క్ష్యవాహాయ నమ:
ఓం నారాయణాయ నమ:
ఓం పద్మనాభాయ నమ:
ఓం హృషీకేశాయ నమ:
ఓం సుధాప్రదాయ నమ:
ఓం మాధవాయ నమ:
ఓం పుణ్డరీకాక్షాయ నమ:
ఓం స్థితికర్త్రే నమ:
ఓం పరాత్పరాయ నమ:
ఓం వనమాలినే నమ:
ఓం యజ్ఞరూపాయ నమ:
ఓం చక్రపాణినే నమ:
ఓం గదాధరాయ నమ:
ఓం ఉపేంద్రాయ నమ:
ఓం కేశవాయ నమ:
ఓం హంసాయ నమ:
ఓం సముద్రమథనాయ నమ:
ఓం హరయే నమ:
ఓం గోవిందాయ నమ:
ఓం బ్రహ్మజనకాయ నమ:
ఓం కైటబాసురమర్దనాయ నమ:
ఓం శ్రీధరాయ నమ:
ఓం కామజనకాయ నమ:
ఓం శేషశాయినే నమ:
ఓం చతుర్భుజాయ నమ:
ఓం పాఞ్చజన్యధరాయ నమ:
ఓం శ్రీమతే నమ:
ఓం శార్‌ఙ్గపాణయే నమ:
ఓం జనార్దనాయ నమ:
ఓం పీతాంబరధరాయ నమ:
ఓం దేవాయ నమ:
ఓం సూర్యచంద్రవి లోచనాయ నమ:
ఓం మత్స్యరూపిణే నమ:
ఓం కర్మరూపిణే నమ:
ఓం క్రోడరూపిణే నమ:
ఓం నృకేసరిణి నమ:
ఓం వామనాయ నమ:
ఓం భార్గవాయ నమ:
ఓం రామాయ నమ:
ఓం హలినే నమ:
ఓం కల్కినే నమ:
ఓం హయననాయ నమ:
ఓం విశ్వంభరాయ నమ:
ఓం శిశుమారాయ నమ:
ఓం శ్రీకరాయ నమ:
ఓం కపిలాయ నమ:
ఓం ధ్రువాయ నమ:
ఓం దత్తాత్రేయాయ నమ:
ఓం అచ్యుతాయ నమ: 
ఓం అనంతాయ నమ:
ఓం ముకుందాయ నమ:
ఓం దధివాహనాయ నమ:
ఓం ధన్వంతరిణే నమ:
ఓం శ్రీనివాసాయ నమ:
ఓం ప్రద్యుమ్నాయ నమ:
ఓం పురుషోత్తమాయ నమ:
ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమ:
ఓం పురారాతయే నమ:
ఓం అధోక్షజాయ నమ:
ఓం వృషభాయ నమ:
ఓం మోహినీరూపధారిణే నమ:
ఓం సంకర్షణాయ నమ:
ఓం క్షీరాబ్ధిశాయినే నమ:
ఓం భూతాత్మనే నమ:
ఓం అనిరుద్ధాయ నమ:
ఓం భక్తవత్సలాయ నమ:
ఓం నరాయ నమ:
ఓం గజేన్ద్రవరదాయ నమ:
ఓం త్రిధామ్నే నమ:
ఓం బూతభావనాయ నమ:
ఓం శ్వేతద్వీపసువాస్తవ్యాయ నమ:
ఓం సూర్యమండలమధ్యగాయ నమ:
ఓం సనకాదిమునిధ్యేయాయ నమ:
ఓం భగవతే నమ:
ఓం శంకరప్రియాయ నమ:
ఓం నీలాకాంతాయ నమ:
ఓం ధరాకాంతాయ నమ:
ఓం వేదాత్మనే నమ:
ఓం బాదరాయణాయ నమ:
ఓం భాగీరథీజన్మభూమి నమ:
ఓం పాద పద్మాయ నమ:
ఓం సతాంప్రభవే నమ:
ఓం స్వధయే నమ:
ఓం విభవే నమ:
ఓం ఘనశ్యామాయ నమ:
ఓం జగత్కారణాయ నమ:
ఓం అవ్యయాయ నమ:
ఓం బుద్ధావతారాయ నమ:
ఓం శాంతాత్మనే నమ:
ఓం లీలామానుషవిగ్రహాయ నమ:
ఓం దామోదరాయ నమ:
ఓం విరాడ్రూపాయ నమ:
ఓం భూతభవ్యభవత్ప్రభవే నమ:
ఓం ఆదిదేవాయ నమ:
ఓం మహాదేవాయ నమ:
ఓం ప్రహ్లాదపరిపాలకాయ నమ:
Read More

నవగోప్యాలు:

నవగోప్యాలు: 
ఆయువు,  విత్తము,  ఇంటిగుట్టు,   మంత్రం,   ఔషధం, 
సంగమం,   దానం,   మానము,  అవమానం- 

ఈ తొమ్మిదింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచాల్సినవి.

భగవంతుడు అన్ని జంతువులకు ఇచ్చినట్లు శరీరం ఇచ్చినప్పటికీ ‘వివేకము’ అనే గొప్ప గుణం మనిషికి ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు. ఈమూడు కారణాలవల్ల మనిషి పిచ్చెక్కకుండా సుఖంగా ఉండగలుగుతున్నాడు. మరుక్షణంలో మనిషి చస్తాడని తెలిస్తే ముందు క్షణమే ఆలోచనతో చావడం ఖాయం. నిజంగా నీ ఆయుఃప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై వాడిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్తక్రారుడు.

ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదు. ‘లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మ్రింగబోడు’ అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే. ‘అతి సంచయేచ్ఛ తగదు’ అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం. అయినా మన దగ్గర ఉన్నవిషయం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు (ప్రభుత్వం) దాన్ని స్వాధీనపరచుకోవడమో, అగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో జరుగుతుంది.

ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దాన్నే ఇంటిగుట్టు’ అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమ పూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని. సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు.

మననం చేసేది మంత్రం- మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం మన సంప్రదాయం. మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడంవల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడంవల్ల నష్టమని భావన. దానిమీద భక్తిలేని వాడికి చెబితే అది అభాసుపాలవుతుంది. మంత్రంపై అచంచల నమ్మకం ఉండాలి.

ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే. ఇవాళ భయంకర రసాయనాలు ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఇవి అందరికి బహిరంగ పరచి ఎవ్వరంటేవారు తయారుచేయకూడదు. ఔషధం రహస్యంగా ఉంచడం మంచిదే.

సంగమం అంటే కలయిక. మనం కొన్ని రహస్యమైన భేటీలు జరుపుతాం. అవి అధికారిక, అనధికారమైనవి ఏవైనా కావచ్చు. రహస్యంగా ఉంచడం ఉత్తమం. అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యలున్న సమావేశాలు ఉంటుంటాయి. అవి బహిర్గతమైనపుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే సంగమం రహస్యంగా ఉంచడం మంచిది.

దానం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుంది.

మానం అంటే గౌరవం. దాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఏమీ చేతగాకున్నా నేనింతవాణ్ణి అంతవాణ్ణి అని చెప్పకూడదు. మనం గౌరవాన్ని ఎంత రహస్యంగా ఉంచితే అంత పెరుగుతుంది. 

అలాగే తనకు జరిగిన అవమానం మరిచిపోవాలి. అవమానాలను అస్తమానం మననం చేస్తే క్రోధం పెరుగుతుంది. దాంతో పగ.. అలా అంతే ఉండదు. 

ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం కానీ మన చెప్పులు వేసుకొని వెళ్ళడం సులభం. ఈ తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం అని పెద్దలు చెప్పిన జ్ఞానబోధ
Read More

Powered By Blogger | Template Created By Lord HTML