.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

31, జులై 2017, సోమవారం

పరుశురాముడి జన్మం



పరుశురాముడి జన్మం
ప్రజాపతులలో ఒకరైన భృగువు కుమారుడు ఋచీకుడు. ఇతను తన తండ్రిలాగే గొప్ప తపశ్శక్తి సంపన్నుడు, సకలవిద్యాప్రపూర్ణుడు. యుక్తవయసు వచ్చిన తర్వాత ఋచీకునకు వివాహం చేయాలను అతని తండ్రి సంకల్పించాడు. అయితే, ఒకసారి బుచీకుడు, సత్యవతి అనే సుందరిని చూడడం తటస్ధించింది. చూడగానే ఆమెను మోహించాడు, ఆమెనే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కుమారుని మనస్సును గ్రహించిన భృగువు ఈ వివాహానికి సమ్మతించాడు. కుశనాభుని కుమారుడైన గాధి మహారాజుó ఏకైక కుమార్తె ఈ సత్యవతి. ఋచీకుడు గాధి దగ్గరకువచ్చి, సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని అర్ధించాడు. వయసుడిగిన ఋచీకునకు సత్యవతినిచ్చి పెళ్లి చెయ్యడానికి గాధికి మనసొప్పలేదు. అయితే, ఋచీకుడు ఎక్కడ శసిస్తాడో అని భయపడి, ‘‘ శరీరమంతా తెల్లగానూ, ఒక్క చెవి మాత్రం నీలిరంగులోను ఉండే వెయ్యి అశ్వాలను తనకు బహూకరిస్తే సత్యవతితో నీ వివామం జరిపిస్తాను’’ అని షరతు పెట్టాడు గాధిమహరాజు. ఋచీకుడు తన తపస్సుతో వరుణదేవుని మెప్పించాడు. వరుణదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. ‘‘శరీరమంతా తెల్లగానూ, ఒక్క చెవి మాత్రం నల్లగానే ఉండే వెయ్యి గుఱ్ఱాలు తనకు కన్యాకుబ్జనగరానికి సమీపంలో కావాలి’’ అని కోరాడు ఋచీకుడు. వరుణుడు అనుగ్రహించాడు. ఋచీకుడు ఆ అశ్వాలను గాధికి సమర్పించి సత్యవతిని వివాహం చేసుకున్నాడు. సత్యవతి, ఋచీకుల సంసారజీవితం ఆనందమయంగా సాగుతోంది. భర్త మనసెరిగి పతివ్రతా ధర్మంతో సేవిస్తోంది సత్యవతి. భార్య సేవలకు సంతసించిన ఋచీకుడు, ఏ వరం కావాలో కోరుకోమన్నాడు ఋచీకుడు. ‘‘ స్వామీ! నా తండ్రికి మగ సంతానం లేదు. మా రాజ్యానికి ఉత్తరాధికారి లేడు. కనుక నా తండ్రికి సకల సద్గుణవంతుడైన కుమారుడు, అలాగే నాకూ ఓ సత్పుత్రుని అనుగ్రహించండి’’ అని కోరుకుంది సత్యవతి.
ఋచీకుడు బ్రహ్మతేజస్సు గల కుమారుడు తన భార్యకు, క్షత్రియతేజస్సు గల కుమారుడు గాధికి కలగాలని సంకల్పించి, రెండు విభిన్న యాగాలు నిర్వహించి, బ్రహ్మతేజస్సు గల యాగప్రసాదాన్ని మేడిచెట్టు దగ్గర, క్షత్రియతేజస్సు గల యాగప్రసాదాన్ని రావిచెట్టు దగ్గర ఉంచి, తన భార్యతో ‘‘ మేడిచెట్టును కౌగిలించుకుని అక్కడున్న ప్రసాదాన్ని తినమని’’, గాధి భార్యతో ‘‘రావిచెట్టును కౌగిలించుకుని అక్కడున్న ప్రసాదాన్ని తినమని’’ చెప్పాడు. సత్యవతి, ఆమె తల్లి శుచిస్నాతలె ౖ వచ్చి, తమ కోరిక నెరవేరబోతోందన్న ఆతురతతో సత్యవతి రావిచెట్టు మ్రానును, ఆమె తల్లి మేడిమ్రానును కౌగిలించుకుని, అక్కడున్న యాగ ప్రసాదాలను భుజించారు. వారి పొరపాటు గ్రహించిన ఋచీకుడు తన భార్యతో ‘‘ క్షత్రియ తేజస్సు గల కుమారుడు, నీ తల్లికి బ్రహ్మతేజస్సు గల కుమారుడు జన్మిస్తాడు’’ అని చెప్పాడు. సత్యవతి బాధపడి ‘‘తన కుమారుడు బ్రహ్మతేజస్సుతోనే పుట్టాలని, తన మనుమడు క్షత్రియ తేజస్సుతో పుట్టినా పరవాలేదు, అని భర్తను వేడుకుంది. భార్య బాధను అర్ధంచేసుకున్న ఋచికుడు తన తపశ్శక్తితో ఆ విధమైన మార్పును చేసాడు. అందుచేతనే ఋచీకునకు బ్రహ్మతేజస్సుతో జమదగ్ని జన్మించినా, అతని మనుమడు పరశురాముడు జన్మత్ణ బ్రాహ్మణ వంశసంజాతుడైనా, క్షత్రియధర్మానుసారం ఆయుధాన్ని ధరించి క్షత్రియ సంహారం చేసాడు. గాధి కుమారుడైన విశ్వామిత్రుడు జన్మత్ణ క్షత్రియుడైనా, బ్రాహ్మణధర్మానుసారం పట్టుదలతో తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML