అజంతా గుహలు
మహారాష్ట్ర రాష్ట్రం, మన్మాడ్ కు తూర్పుగా సుమారు 50 కి.మీ., దూరంలో జలగాం అనే రైల్వేస్టేషన్ ఉంది. ఈ జలగాం నుండి అజంతా గుహలు సుమారు 60 కి.మీ., దూరంలో ఉన్నాయి. రెండువేల సంవత్సరాల క్రితమే అంటే ప్రపంచానికి నాగరికత తెలియని నాడే భారతదేశంలో నాగరికత, ఉత్తమ శాస్త్రీయ విజ్ఞానము, వెల్లివిరిసిందంటే అతిశయోక్తి కాదు. అజంతా, ఎల్లోరా గుహలలోని శిల్పాలు, చిత్రాలు అత్యద్భుతాలు. సుమారు రెండువేల సంవత్సరాలకు పూర్వమే మనవారు చూపించిన శిల్పకళా, చిత్రకళా నైపుణ్యమూ, అద్వితీయం. అజంతాలోని గుహలు అర్థచంద్రాకారంగా ఉన్న ఒక కొండల వరసను, ముందుభాగం వైపు తొలచి నిర్మించారు. గుహల లోపల వివిధ రకాల శిల్పాలే కాక, రంగులతో చిత్రాలు అనేకం చిత్రించారు. ఈ గుహలన్ని కొండపాద భాగం నుండి సుమారు 250 అడుగుల ఎత్తున ఉన్నాయి. అంటే కొండ మధ్యభాగంలో ఉన్నాయి. అర్థచంద్రాకారంగా ఉన్న ఈ వరసకు, ఎదురుగా మరొక అర్థచంద్రాకారపు కొండల వరస ఉంది. ఈ రెండు వరుసలకు మధ్యగా ఉన్న పల్లంలో, ఒక చిన్న వాగు ప్రవహిస్తూ ఉంటుంది. దీనిని ప్రస్తుతం అజంతానది అంటారు. కానీ దీని అసలు పేరు ‘వాఘిర’ నది. ఇది ఏడురూపాలుగా ప్రవహిస్తూ ఉంటుంది. కనుక దీనిని సప్తకుండం అని కూడా అంటారు. అజంతా గుహాలయంలోని 30 గుహలను యునెస్కో ప్రపంచ హెరిటేజ్ ప్రదేశాలుగా గుర్తించింది. ఈ గుహలను 1819 లో యాదృశ్ఛికంగా గుర్తించారు. మద్రాసు 28వ అశ్విక దళానికి చెందిన జాన్ స్మిత్ ఈ ప్రాంతానికి వేటకు వచ్చినపుడు 10వ గుహ అగ్రభాగాన్ని చూడటంతో ప్రస్తుత ప్రపంచంలోకి అజంతా గుహల ఉనికి వెలుగులోకి వచ్చింది.
గుహ నెం 1:- అజంతా గుహలన్నింటిలోకి ఇది చాలా గొప్పది. గుహముందుభాగంలోని వరండా, లోపల ఉన్న స్తంభాల మీద ఎన్నో అందమైన చెక్కడాలు, రంగురంగుల చిత్రాలు ఉన్నాయి. ఈ గుహలోని గోడలకు ఉన్న చిత్రాలలో ఎక్కువ భాగం జాతక కథలకు సంబంధించినవి. ఎడమ వైపు ఉన్న గొడమీద చిత్రాలలో మొదటిది శిబిచక్రవర్తి తన తొడను కోసి, ఆ మాంసం త్రాసులో వేస్తున్న దృశ్యం ఉంది. దాని ప్రక్కనే, గౌతమబుధ్ధుడు జ్ఞానం పొందటం కోసం తపస్సు చేస్తుండగా, ‘మారుడు’ మొదలెన దుష్టశక్తులు ఆయనకు అడ్డంకులు కల్పించటానికి ప్రయత్నిస్తున్నట్లు అద్భుతంగా శిల్పాలు మలిచారు. గర్భగుడిలోని గదిలో పదకొండు అడుగుల ఎత్తు ఉన్న ఒక బుద్దుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం యొక్క ముఖంలో ఒక విశిష్టమైన శిల్పచాతుర్యం ఉంది. ముందువైపు నుండి సూటిగా చూస్తే ఆ ముఖంలో పరమ శాంత రసంతో ఉట్టిపడుతున్నట్లుగా, కుడివైపు నుంటి చూస్తే సంతోషంగా చిరునవ్వు నవ్వుతున్నట్లు, ఎడమ వైపు నుంచి చూస్తే దుఃఖంతో విచారంగా ఉన్నట్లుగానూ కనిపిస్తుంది. ఇచ్చట ఒక స్తంభం మీద ఒక అపురూపమైన శిల్పం ఉంది. నాలుగు లేళ్లు ఒకదాని ప్రక్కన ఒకటి గుంపుగా వివిధ భంగిమల్లో ఉన్నాయి. నాలుగింటికి కలిపి ఉమ్మడిగా ఒకే ఒక మెడ, ఈ మెడతో కూడిన తల కనిపిస్తుంది. ఈ తలతో ఆ నాలుగింటిలో దేని దేహానికైనా కలిపి చూస్తే, ఆ తల భాగం ఆ లేడికి సంబంధించిందిగానే మనకు కనిపనిస్తుంది.
గుహ నెం 2 :- ఇది దాదాపు ఒకటవ నెంబరు గుహలాగే ఉంటుంది. లోపల ఎడమచేతి వైపు గోడమీద బుద్దుని జన్మకు సంబంధించిన దృశ్యాలు అనేకం ఉన్నాయి.
గుహ నెం 3 :- ఏమీ లోవు
గుహ నెం 4 :- ఇది గుహలన్నిటిలోకి అతి పెద్ద గుహ. ఇది ఒక విహారం, ముందు భాగంలోని వరండాలో అత్యంత సుందరమైన చెక్కడపు పని కనిపిస్తుంది. లోపల హాలులో 28 స్తంభావు ఉన్నాయి.
గుహ నెం 5 :- ఈ గుహలో కొన్ని సాసాలభంజికల శిల్పాలు ఉన్నాయి.
గుహ నెం 6 :- ఇది అజంతాలో రెండు అంతస్థులు కలిగిన ఒకే ఒక గుహ. ఇందులో వివిధ భంగిమల్లో ఉన్న బుద్ధుని మూర్తులు అనేకం చెక్కబడి ఉన్నాయి.
గుహ నెం 7,8 :- వీటిలో ఎలాంటి శిల్పాలు లేవు
గుహ నెం 9 :- ఇది క్స్తు పూర్వం ఒకటవ శతాబ్దంలో నిర్మించబడిన గుహ. ఇది ఒక చైతన్యం. ఇందులో బుద్ధుని కాలం నాటి సాఘీక జీవనానికి సంబంధించిన దృశ్యాలు చిత్రించబడి ఉన్నాయి.
గుహ నెం 10 :- ఇది కూడా ఒక చైతన్యమే.
గుహ నెం 11 :- ఈ గుహలోని చిత్రాలన్నీ శిథిలావస్తలో ఉన్నాయి.
గుహ నెం 12 :- ఆది కూడా ఒక ప్రాచీనమైన విహారం. బౌద్ధులు నివసించటానికి వీలుగా గదులు, అందులో పడకలు కూజా ఉన్నాయి.
గుహ నెం 13,14,15 :- ఏమీ లోవు
గుహ నెం 16 :- ఈ గుహ ముందు నిలబడి చూస్తే, అజంతా గుహలు ఉన్న ప్రాంతమంతా, ఆ చివరి నుండి ఈ చివరవరకూ కనిపిస్తుంది. ఈ గుహలోపల ఉన్న బద్ధుని విగ్రహం చాలా అందంగా ఉంటుంది.
గుహ నెం 17 :- ఈ గుహ దాదాపు 16వ నెంబరు గుహ మాదిరే నిర్మించబడింది. ఎడమ చేతి వైపు ఉన్న గొడమీద బౌద్దమత పవుత్ర చిహ్నమైన ‘ధర్మచక్రం’ ఉంది. ఈ చత్రానికి ఆనుకునే మరొక చిత్రం ఉంది. అది సుజాత శరణాగతు. ఈ గుహలోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అజంతా సుందరి అలంకరణ చిత్రం ఉన్నది.
గుహ నెం 18 :- అందులో ఏమీ లేవు
గుహ నెం 19 :- ఇది ఒక చైతన్యం.
గుహ నెం 20,21 :- ఈ రెండు గుహలలోనూ అనేకమైన మంచి శిల్పాలు ఉన్నాయి.
గుహ నెం 22,23,24,25 :- ఇందులో ఏమీ లేవు
గుహ నెం 26 :- ఇది అజంతా గుహలో చివరు గుహ. ఈ గుహలోని గోడలకు బుద్ధుని విగ్రహ మూర్తులు అనేకం ఉన్నాయి. ఎడమవైపున ఉన్న గోడమీద, బుద్ధ భాగవానుని నిర్మాణం చెక్కిన శిల్పం ఉంది. ఇది మహాద్భుతమైనది. సుమారు 20 అడుగుల పొడవుగల పడుకొని ఉన్న భంగిమలో బుద్ధుని ప్రతిన కనిపిస్తుంది. ఆ ముఖంలో ఉండే నిర్వికారమైన శాంతిభావము చూపరులకు స్పష్టంగా కనిపిస్తూ చాలా గొప్పగా ఉన్నది. బుద్ధుని మూర్తికి క్రింది భాగంలోనూ, ప్రక్కలా, ఎంతోమంది దుఃఖిస్తూ ఉండటం సజీవంగా చెక్కబడింది. ఆ దుఃఖిస్తున్న వారిలో ఒక్కొక్క భంగిమ, ఒక్కొక్క ప్రత్యేక భావము వ్యక్తీకరిస్తూ చెక్కిన తీరు నిజంగా అత్యద్భుతమే. బుద్ధుడు తనువు చాలిస్తున్నందుకు ఒక శిష్యుడు కంటతడి పెడుతుండగా, పైన బుద్ధిడి దివ్యశరీరాన్ని దేవతలు స్వాగతిస్తున్నట్లు అద్భుతంగా చెక్కారు. 26ల నెంబరు గుహకు ఆనికొని ఉన్న కొండ శిఖరం మీద నుండి, ఒక నీటి ప్రవాహం క్రిందకూ జారుతూ, జలపాతంలాగా పడుతూ ఉంటుంది. అజంతా గుహలకు సోమవారం సెలవు.
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు
సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు
31, జులై 2017, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి