ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు
సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు
31, జులై 2017, సోమవారం
కర్ణుడిని కృష్ణుడు ఎప్పుడు పడితే అప్పుడు దానకర్ణుడని అభివర్ణించడం అర్జునుడికి నచ్చలేదు.
కర్ణుడిని కృష్ణుడు ఎప్పుడు పడితే అప్పుడు దానకర్ణుడని అభివర్ణించడం అర్జునుడికి నచ్చలేదు. కృష్ణుడితో అర్జునుడు వాదనకు దిగుతాడు. ఈ విషయమై వీరి మధ్య చాలాసేపే మాటలు సాగాయి. ఇక లాభం లేదనుకున్న కృష్ణుడు వెంటనే ఒక బంగారు పర్వతం సృష్టించాడు. అర్జునుడితో కృష్ణుడు ఆ బంగారు పర్వతాన్ని ఈ రోజు సాయంత్రం లోపల ఒక్క ముక్క మిగల్చకుండా దానం చెయ్యాలి. అలా నువ్వు చేస్తే నేను నిన్ను దానం చేయడంలో కర్ణుడి కన్నా గొప్ప వాడిగా చెప్తాను. కొనియాడుతాను. సరేనా అని అంటాడు. అర్జునుడు ఈ విషయాన్ని ఊరు ఊరంతా ప్రచారం చేయిస్తాడు. తాను బంగారు పర్వతాన్ని దానం చేయబోతున్నాను అని అంటాడు. అందరినీ రమ్మంటాడు. అలాగే అందరూ వస్తారు. బంగారాన్ని ముక్కలు చేసి దానం చెయ్యడం ప్రారంభిస్తాడు అర్జునుడు. అలా ఇస్తూనే ఉంటాడు అర్జునుడు. అయినా వరస తగ్గుతోంది కాని బంగారం ఇంకా మిగిలే ఉంది. కృష్ణుడు చెప్పినట్టు ఆ రోజు సాయంత్రం లోపల అర్జునుడు దానం చెయ్యలేకపోతాడు. సగం కూడా దానం చెయ్యలేదు. ఇంతలో ఆవైపుగా కర్ణుడు వస్తాడు. కృష్ణుడు కర్ణుడిని పిలిచి "కర్ణా...ఈ బంగారు పర్వతాన్ని రేపు ఉదయం లోపు దానం చెయ్యాలి...నీ వల్ల అవుతుందా" అని అడుగుతాడు. కర్ణుడు "అదేం పెద్ద పని కాదే...ఇది దానం చెయ్యాలి అంతేగా... " అంటూ కర్ణుడు అటు వచ్చిన ఇద్దరిని పిలిచి "ఈ బంగారు పర్వతాన్ని మీ ఇద్దరికీ దానం చేస్తున్నాను...దీనిని మీరిద్దరూ సరిసమానంగా పంచుకుని ఉపయోగించుకోండి" అని వారిద్దరికీ ఆ బంగారాన్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కర్ణుడు. అప్పుడు కృష్ణుడు అర్జునుని చూసి "ఇప్పుడు నీకు, కర్ణుడికి మధ్య ఉన్న తేడా తెలిసిందా...? ఈ బంగారు పర్వతాన్ని పూర్తిగా ఇచ్చేయ్యాలనే ఆలోచన రానే లేదు. మరి నిన్ను దానం చేయడంలో కర్ణుడిని మించిన వాడివని ఎలా కొనియాడను" అని ప్రశ్నిస్తాడు. అర్జునుడి నోటంట మరో మాట లేదు. ఒక్కొక్కరి గుణం ఒక్కొక్కలాంటిది. ఎవరి ప్రత్యేకత వారిది. కర్ణుడు దానం చేయడంలో దిట్ట. ఈ విషయంలో అతనిని మించిన వారు లేరు అని చెప్పడానికి కృష్ణుడు ఆడిన నాటకమిది
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి