.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

31, జులై 2017, సోమవారం

అంజనాదేవి చరిత్ర

అంజనాదేవి చరిత్ర
తల్లిదండ్రులకు మంచిపేరు వచ్చినా, చెడ్డపేరు వచ్చినా, తమ సంతానంవల్లే. కులములో నొకడు గుణవంతుడైనా కులము వెలయు వాని గుణముచేత అని అంటాడు ‘యోగి వేమన’. నిజమే మరి. శ్రీరాముని కారణంగా, మొత్తం సూర్యవంశ పేరుప్రతిష్ఠలు దశదిశా వ్యాప్తమయ్యాయి. దుర్యోధనుని కారణంగా మొత్తం కురువంశ వృక్షమే కూకటివేళ్ళతో కూలిపోయింది. అలాగే గరుత్మంతుని కారణంగా మొత్తం పక్షిజాతికే గౌరవస్థానం దక్కింది. ఇక ఆంజనేయుని కారణంగా మొత్తం వానరజాతికే విశేషగౌరవం దక్కింది. తను పుడుతూనే తన తల్లికి ఆనందం కలిగించాడు. మరోతల్లి సీతమ్మ శోకాన్ని దూరంచేసాడు. మరి అట్టి మహనీయునికి జన్మనిచ్చిన ‘అంజనాదేవి’ చరిత్ర తెలుసుకుందాం.
పుంజికస్థల అనే అప్సరస, శాపకారణంగా అంజనాదేవిగా జన్మించిన ఓ వానరస్త్రీ. కుంజరుడనే ఓ వానరుని కుమార్తె. సంతాన కాంక్షతో తపస్సు చేస్తే పుట్టిన వానరకాంత ఈ ‘అంజనాదేవి’. ఈమెకు యుక్తవయస్సు రాగానే వివాహ ప్రయత్నాలు ప్రారంభించాడు కుంజరుడు. ఆ అన్వేషణలో తారసపడ్డవాడే ‘కేసరి’ అనే వానరవీరుడు. ఈ కేసరి ప్రభాసతీర్థారణ్య ప్రాంతాలలో సంచరించే ఓ వానరవీరుడు. నిజానికి అతని పేరు ‘కేసరి’ కాదు. అతని అసలు పేరు ఎవరికీ తెలియదు కూడా. అతనికి ‘కేసరి’ అనే పేరు రావడానికి కారణం ఉంది. ప్రభాసతీర్థారణ్యాలలో ఎందరో మునులు తపస్సు చేసుకుంటూండేవారు. ఈ కేసరి, ఆ మునులకు సేవలు చేస్తూ కాలం గడిపేవాడు. ఆ రోజులలో ‘శంఖము, శబలము’ అనే రెండు ఏనుగులు తరచు ఆ మునులను బాధిస్తూండేవి. కేసరి ఆ రెండు ఏనుగులను చంపి మునులకు ఆనందం కలిగించాడు. ఏనుగును చంపగలిగేది సింహం ఒక్కటే. కేసరి అంటే సింహం అనే అర్థం ఉంది. అందుకే...ఆ రెండు ఏనుగులను చంపిన కేసరి ప్రతాపానికి సంతసించిన భరద్వాజమహర్షి అతనికి ‘కేసరి’ అని పేరుపెట్టాడు. ఈ కేసరి ఘనత విన్న కుంజరుడు తన కుమార్తె అయిన అంజనాదేవిని, కేసరికి ఇచ్చి వివాహం జరిపించాడు. అంజన, కేసరుల సంసారయాత్ర సుఖంగా సాగుతోంది. అంజనాదేవి పుట్టుకతో వానరస్త్రీ అయినా అపురూప సౌందర్యవతి. నా దగ్గర ఉన్న పరమేశ్వర తేజోబీజాన్ని ధరించగల శక్తి నీకు మాత్రమే ఉన్నదని గ్రహించి, ఆ బీజాన్ని నీ గర్భక్షేత్రంలో నిక్షిప్తం చేసాను. నీకు మహాబలవంతుడు, కామరూపుడు, కారణజన్ముడు అయిన కుమారుడు కలుగుతాడు. అతని కారణంగా మీ దంపతుల జన్మలు చరితార్థమవుతాయి అని పలికి అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని తన భర్తకు చెప్పింది అంజనాదేవి. కారణజన్మడైన కుమారుడు కలుగబోతున్నందుకు కేసరికూడా సంతోషించాడు. అలా అంజనాదేవి, కేసరులకు జన్మించినవాడే ‘ఆంజనేయుడు’. ఈ కథను కిష్కింథాకాండ చివరిభాగంలో జాంబవంతునిచేత ., హనుమంతునికి చేప్పిస్తాడు వాల్మీకిమహర్షి. అంజనా గర్భసంభూతుడైన ఆంజనేయుడు ఎన్ని మహత్కార్యాలు చేసాడో మనందికీ తెలిసినదే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML