వేపచెట్టు విశిష్టత
హిందువులు వేప చెట్టును పూజిస్తారు. మామిడి చెట్టును పూజించరు. ఎందుకిలా చేస్తారు అని నన్ను ఒకరు ప్రశ్నించారు. వేప కాయలు చేదు. ఆకులు పచ్చి చేదు. చెట్టంతా చేదుమయం. చేదుగా ఉంటుందని వేపని నిర్లక్ష్యం చేయకూడదు. మనకు అనుభవాల్లో కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి. షడ్రచుల్లో కూడా చేదు ఒకటి. కాబట్టి, చేదుని పూర్తిగా తొలగించలేము. విస్మరించలేము కూడా. పనికట్టుకొని ఎవ్వరూ వేపతోట వేయరు. పైపెచ్చు, సహజంగా మొలచిన మొక్కలను అజ్ఞానంతో పీకిపారవేస్తే, వేప జాతే అంతరించిపోతుంది. అలా జరగకుండా చూడడంలోనే భారతీయ వివేకం ఉట్టిపడుతుంది.
వేప చెట్టుకు చెదలు పట్టవు. దాని ఎదుగుదలకు మనం శ్రద్ధ వహించనవసరం లేదు. పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అది క్రిమి సంహారకంగా పనిచేస్తుంది. తల్లి బిడ్డను ఎలా రక్షిస్తుందో, అలాగే వేప చేట్టు కూడా మనలను అన్ని విధాల సంరక్షిస్తుంది. వేప చెట్టు పైనుంచి వీచే గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు శుద్ధమవుతాయి. ఈ గాలి రక్తనాళాలకు మంచిది. దీని వల్ల చర్మవ్యాధులు దరిచేరవు. వృక్షజాతిలో వేపచెట్టు ఎక్కువ ప్రాణ వాయువునిస్తుంది. ఇది అంటురోగాలను కూడా తరిమికొడుతుంది.
వేపకర్ర ఇంటి గుమ్మాలకు, కిటికీలకు ఉపయోగపడుతుంది. పూర్వం దీనినే తప్పనిసరిగా వాడేవారు. ఇంటి ప్రాగణంలో వేప చెట్టు ఉంటే ఆయుష్షు వృద్ధి చెందుతుందని ఆయుర్వేదం కూడా చెబుతుంది. ఔషద రసాయనాలలో వేప పాత్ర చాలా ప్రధానమైనది. వేపపుల్లతో దంతశుద్ధి చేసుకునేవారికి 90 ఏళ్ళ వయసులో కూడా పటిష్ఠమైన దంతాల వరస ఉంటుందని వైద్యశాస్త్రం చెబుతుంది. వేప చెట్టు క్రింద కూర్చుంటే ఎన్నో మానసిక వైకల్యాలను కూడా అధిగమించవచ్చునంటారు. మండు వేసవిలో వేప చెట్టు కింద చాలా చల్లగా ఉంటుంది. తాపాన్ని, పాపాన్ని హరించగలిగే ఒక్క వేపవృక్షానికే ఉంది. అందుకే ఆరోగ్యకరమైన పరిసరాల కోసం వేపచెట్లను పెంపొందించుకోవాలి. వేప చెట్టుని అమ్మవారి ప్రతిరూపంగా భావించి, పసుపు పూసి బొట్టు పెట్టి పూజించడంలో భారతీయుల అభిరుచి స్పష్టంగా అర్థమౌతుంది. ఇదే మన భారతీయత.
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు
సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు
31, జులై 2017, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి