.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

31, జులై 2017, సోమవారం

భక్తి మార్గాలు

భక్తి మార్గాలు
భక్తి ఒక పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు.భగవంతుని పొందడానికి భాగవతంలో నవవిధభక్తి మార్గాలు అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడ్డాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలో ఉంది. ఆ శ్లోకం:
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం
1. శ్రవణం: భగవంతుని గూర్చిన గాధలు, భజనలు, కీర్తనలు వినడాన్ని శ్పవణం అంటారు. ఉదా: హరికథ శ్రోతలు, ధర్మరాజు, జనమేజయుడు, శౌనకాది మునులు.
2. కీర్తనం: భగవంతుని గుణగణములను కీర్తించుటను కీర్తనం అంటారు. ఉదా: రామదాసు, దాసగణు, అన్నమయ్య, త్యాగరాజు, తులసీదాసు, మీరాబాయి - మరెందరో భక్త గాయకులు.
3. స్మరణం: భగవంతుని స్మరించడాన్ని స్మరణం అంటారు. ఉదా:నిత్యం ధ్యానం చేసే కోట్లాది భక్తులు.
4. పాదసేవ: దేవుని పాదముల పూజ చేయటాన్ని పాదసేవ అంటారు.
5. అర్చనం: గుడిలోగాని, ఇంటిలోగాని, హృదయములో గాని విధివిధానములతో అర్చించడాన్ని అర్చనం అంటారు.
6. వందనం: ప్రణామం, నమస్కరించడాన్ని వందనం చేయడం అంటారు.
7. దాస్యం: భగవంతునకు దాసుడవుటను దాస్యం అంటారు. ఉదా: హనుమంతుడు, రామదాసు
8. సఖ్యం: అర్జునుడు
9. ఆత్మనివేదనం: తనను పూర్తిగా దేవునకు సమర్పించుకోవడాన్ని ఆత్మనివేదనం అంటారు. ఉదా: గోదాదేవి, మీరాబాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML