21 రకాల పత్రి
వినాయక వ్రత పూజలో వాడే పత్రిలో చాల ప్రత్యేకత ఉంది. 21 రకాల పత్రాలతో వినాయకుడిని పూజిస్తాము. అది ఒక పూజద్రవ్యమే కాక, పెద్ద ఓషధుల సమూహం అని చెప్పొచ్చు. పూర్వకాలంలో పిల్లలు చవితి ముందు రోజు, ఊరంతా తిరిగి ఆ 21 రకాల పత్రాలను సేకరించేవారు, అవి పూజకు ఉపయోగించుటకే కాక, పిల్లలు చెట్లను గుర్తు పట్టడానికి కూడ సహాయపడేది. అవి
1. మాచీ పత్రం : ఈ పత్ర కషాయం వలన దద్దుర్లు, పుండ్లు తగ్గడమే కాక, కుష్టు వంటి వ్యాధులకు చక్కని ఓషది.
2. బృహతీ పత్రం : శ్వాసకోశ సంబందిత వ్యాధులను తగ్గిస్తుంది.
3. బిల్వ పత్రం / మారేడు : పరమశివునికి మహా ప్రీతికరమైనది, ఇది విరోచనాలు తగ్గటానికి వాడుతారు.
4. గరిక : గణప్పయ్య కు చాల ప్రీతి. రోజు పూలు ఉన్నా లేకపోయినా గరికతో పూజిస్తే చాలు వినాయకుడు సంత్రుప్తుడవుతాడు. గాయాలకు గరిక, ఉప్పు, పసుపు కలిపి రాస్తే తగ్గుతాయి.
5. దత్తూర పత్రం / ఉమ్మెత్త : లైంగిక వ్యాధులకు నివారిణి.
6. రేగు పత్రం : అజీర్తి, చర్మ వ్యాధులకు చక్కటి మందు.
7. కరవీర పత్రం / గన్నేరు : దురదల నివారణకు ఉపయోగిస్తారు.
8. విష్ణుక్రాంత పత్రం : జలుబు, దగ్గు, జ్వరాలకు మంచి మందు.
9. దాడిమీ / దాన్నిమ్మ పత్రం : జీర్ణకోశ వ్యాధులకు మందు.
10. మరువక పత్రం : పూల మధ్య వేసి కడ్తారు, దీన్నే మరువం అంటాం. మంచి వాసన వస్తూ ఉంటుంది. జుట్టు కి బలాన్ని చేకురుస్తుంది, జీర్ణపుష్టికి మంచిది.
11. వావిలాకు : కీళ్ళనొప్పులకు మంచి మందు
12. జాజి పత్రం : నోటిపూతకు, వాతానికి, పైత్యానికి మంచిది.
13. శమీ పత్రం : కుష్ఠువ్యాధులకు మంచి మందు
14. అశ్వత్ధ పత్రం : శ్వాసకోశ వ్యాధుల నివారణకు మంచిది
15. మద్ది ఆకు : గాయాలు, పుండ్లు వంటివాటికి మంచిది
16. జిల్లేడు ఆకు : విషాన్ని హరిస్తుంది.
17. గండకీ పత్రం : ఇందులో కూడ చాలమంచి ఓషద గుణాలు ఉన్నాయి
18. ఉత్తరేణి : జీర్ణ సంబంధిత వ్యాదులకు దివ్య ఓషధి
19. తులసి
20. దేవదారు
21. మామిడాకులు
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు
సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు
31, జులై 2017, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి