.

.

గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

Monday, July 31, 2017

మనలోనే శక్తి వుంది అని తెలిపే ఓ చక్కటి కధమనలోనే శక్తి వుంది అని తెలిపే ఓ చక్కటి కధ

ఓ రోజు బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు
ప్రపంచాన్ని సృష్టించాను
పసుపక్ష్యాదులను సృష్టించాను
అయినా తృప్తిగా లేదెందుకని
ఓ చిన్న ఆలోచన చేసి ఒక కొత్త జీవిని సృష్టించాడు
మనిషి అని నామకరణం చేశాడు


అన్ని తెలివితేటలను సకల సామర్థ్యాలనూ ఇచ్చాడు

ధైర్యం
సాహసం
నమ్మకం
ముందుచూపు
ఆత్మ విశ్వాసం నిండా నింపేశాడు
భూమి మీద వదిలేటప్పుడు బ్రహ్మకి భయం పట్టుకుంది

వీడు
కాలాంతకుడు
ప్రాణాంతకుడు
దేవాంతకుడు
అయిపోతాడేమో
వీడి బలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలి అనుకున్నాడు

"నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను. నాకివ్వు" అంది గద్ద
"మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని జయిస్తాడు
ఆ రోజు మళ్లీ తీసేసుకుంటాడు"
అన్నాడు బ్రహ్మ

"పోనీ నేను నీటి అట్టడుగున దాచేస్తాను " అంది చేప
"మనిషి ఏదో ఒక రోజు నీటిని జయిస్తాడు"

"నేను నేల పొరల్లో దాచేస్తాను" అంది ఎలుక
"మనిషి నేలను చీల్చి మరీ సాధించేస్తాడు"

అప్పుడు ఒక కోతి నెమ్మదిగా ముందుకు వచ్చింది
"సర్వ శక్తులనీ మనిషి లోపలే దాచేద్దాం.." అంది.
"భేష్"
మనిషి అన్ని చోట్లకు వెళ్తాడు
అన్నిటినీ గెలుస్తాడు కానీ తన లోపలికి వెళ్లడు
తనను తాను గెలిచే ప్రయత్నమే చేయడు. అక్కడే దాచేద్దాం"
అన్నాడు బ్రహ్మ
అప్పటి నుంచీ బలం
మనిషి తనలోనే ఉంచుకుని
బయట వెతుకుతూనే ఉన్నాడు
So search For
OUR INNER POWER
Every one is UNIQUE

believe in your self then in god
అని చెప్పిన వివేకానందుని మాటలు గుర్తుకు తెచ్చుకుందాం
ఇది చదివాక తప్పక అందరికీ share చేద్దాంNo comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML