.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

31, జులై 2017, సోమవారం

మితిమీరితే...



మితిమీరితే...

మితిమీరిన ఖర్చు ... పేదరికం పాలు చేస్తుంది.
మితిమీరిన పొదుపు .. కష్టాల పాలు చేస్తుంది.
మితిమీరిన సంపాదన ... మనశ్శాంతిని లేకుండా చేస్తుంది.
మితిమీరిన కర్తవ్యం ... అగచాట్ల పాలు చేస్తుంది.
మితిమీరిన క్రమ శిక్షణ ... రక్త సంబధీకులను దూరం చేస్తుంది.
మితిమీరిన బాధ్యతలు ... అప్పుల పాలు చేస్తుంది.
మితిమీరిన హాస్యం ... నవ్వుల పాలు చేస్తుంది.
మితిమీరిన కోపం ... శతృవులను వృద్ధి చేస్తుంది.
మితిమీరిన ఆలోచనలు ... జీవితాన్ని దుర్భరం చేస్తుంది.
మితిమీరిన వ్యసనాలు ... అప మృత్యు పాలు చేస్తుంది.
మితిమీరిన స్వార్ధం ... అందరినీ దూరం చేస్తుంది.
మితిమీరిన పోటీ ... నష్టాల పాలు చేస్తుంది.
మితిమీరిన లాభార్జన ... వ్యాపార ఉనికికే మోసం తెస్తుంది .
మితిమీరిన వస్తుత్పత్తి ...నాణ్యతా ప్రమాణాలను దెబ్బ తీస్తుంది.
మితిమీరిన గర్వాహంకారం ... ఆపదలు కొని తెస్తుంది.
మితిమీరిన అలంకారం ... వెగటు పుట్టిస్తుంది.
మితిమీరిన అత్యాశ ... నేరాల పాలు చేస్తుంది.
మితిమీరిన అధికార దాహం ... హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తుంది.
మితిమీరిన త్యాగం .. కడగండ్ల పాలు చేస్తుంది.
మితిమీరిన వ్యవసాయకోత్పత్తి ... భూమిని నిస్సారం చేస్తుంది.
మితిమీరిన జనాభా పెరుగుదల ... దేశ ప్రగతిని త్రొక్కేస్తుంది.
మితిమీరిన స్నేహాలు ... అభిప్రాయ భేదాలను సృష్టిస్తుంది.
మితిమీరిన గారాబం ... చెడు స్నేహాల పాలు చేస్తుంది.
మితిమీరిన ఈర్షా ద్వేషాలు .. నిద్రా సుఖాన్ని దూరం చేస్తుంది.
మితిమీరిన అభిరుచి ... దుబారాకు దారి తీస్తుంది.
మితిమీరిన కీర్తి దాహం ... ఆదాయాన్ని మింగేస్తుంది.
అతి సర్వత్రా వర్జేయత్


మితా హారం ...
మిత భాషణం ...
మితమైన నిద్ర ...
మిత సంసారం ...
మిత సంపాదన
మనో కాలుష్య రహితంగా ... జీవన యానం సాగిస్తే ...
పరిపూర్ణమైన జీవితానంద ప్రక్రియకు అదే రాచబాట...
ప్రశాంత యుతమైన మనశ్శాంతికి
అదే పూల తోట_మూర్తీభవించిన మానవతా విలువలకు
అదే పెట్టని కోట.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML