ఔషధ విలువలు సమృద్ధిగా ఉన్న తులసి వల్ల లాభాలు ఎన్నో ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది.కాచిచలార్చిన నీళ్లలో తులసి రసాన్ని కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు జీర్ణక్రియ మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. తులసి రసంలో తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో ఉండే రాళ్లు కరిగిపోతాయని అంటున్నారు. అల్లంరసంతో తులసి రసాన్ని కలిపి తాగితే కడుపునొప్పి తగ్గుతుందంటున్నారు.పొట్టలో నులిపురుగులు నశిస్తాయని, జలుబు చేసినప్పుడు తేనెలో ఒక టేబుల్ స్పూన్ తులసి రసం కలుపుకొని తాగితే ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. బెల్లంతో తులసి ఆకులు కలిపి తింటే కామెర్లు తగ్గు ముఖం పడతాయని నిపుణులు వాపోతున్నారు. అంతేకాకుండా తులసీ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తుంది.అల్సర్‌ల నుండి రక్షిస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా నియంత్రిస్తుంది. కాలేయం శక్తివంతంగా పనిచేయడానికి దోహదపడుతుంది. నోటినుండి దుర్వాసన వెలువడకుండా నిషేధిస్తుంది.
అలర్జీల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎండవల్ల సోకే అలర్జీలు, పొగ, దుమ్ము నుండి శరీరానికి కలిగే హానిని అరికడుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. దాదాపు అందరి ఇళ్లలోనూ ప్రధాన ద్వారానికి ఎదు రుగా లేదంటే పెరట్లో తులసి మొక్క ఉంటుంది. ఎందుకంటే తులసి ఆకుల నుంచి వచ్చే సువాసన ఇల్లంతా పరుచుకొని మంచి యాంటీసెప్టిక్‌గా పనిచేస్తూ వ్యాధులు రాకుండా చేస్తుందని విశ్వసిస్తారు. తులసి ఆకులను చప్పరించడం వల్ల దానిలో ఉండే ఔషధ గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తులసి ఆకులో ఉండే రసం ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. అందుకే చాలా దేవాలయాలలో తీర్ధంలో తలసీ దళాలను వేసిస్తారు.
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు
సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు
31, జులై 2017, సోమవారం
ఔషధ విలువలు సమృద్ధిగా ఉన్న తులసి వల్ల లాభాలు ఎన్నో ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి