.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

18, మార్చి 2018, ఆదివారం

ఎవరు ముందు చెప్పినట్లు..?🤔


ఎవరు ముందు చెప్పినట్లు..?🤔

స్ర్తీయొక్క మానసిక స్థితి ప్రభావం ఆమె గర్భంలోని పిండంపై పడుతుందనేది ఫ్రాయిడ్ చెప్పిన సిద్ధాంతం కదా!

మరి ఈదేశంలో ఎప్పటినుంచో గర్భవతులు భక్తిగాథలూ వీరగాథలూ వినాలనీ చదవాలనీ ఎల్లపుడూ అందమైన ఆరోగ్యవంతమైన బిడ్డకోసం శ్రీరాముని చిత్రపటాన్ని చూస్తుండాలనీ స్మరించుకోవాలనీ..భయంకర వార్తలూ విషాద సంఘటనలకూ దూరంగా ఉండలనీ ఈ ఫ్రాయిడ్ చెప్పకముందునుండే ఎలా చెప్పేవారబ్బా?

బిగ్ బ్యాంగ్ థీరి ఒక అగ్నిగోళం బ్రద్ధలయి స్రుష్ఠి ఏర్పడిందని తేల్చింది కదా!
మరి మన దేశంలో అనామకుడు సైతం" బ్రహ్మాండం బద్దలయ్యిందనే "వేదజనిత స్రుష్ఠి మూలం పలుకుతున్నాడెలా??

భూమి మీద ప్రకృతి ఏర్పడి దాదాపు 200కోట్ల సంవత్సరాలయిందని నేటి సైటింష్ఠులు చెబుతున్నారు కదా!

మరి మన పురాణాలు చెప్పే కాలమాణం ప్రకారం యుగాలు మహాయుగాలూ మన్వంతరాలూ సంధికాలం లను లెక్కేస్తే...మనం శ్వేతవరాహ కల్పంలో 28 వ మహాయుగంలో కలియుగంలో ఉన్నామని ప్రస్తుత సంవత్సరం  ...అంటే 2018 నాటికి 197,29,49,120 సంవత్సరాలు అవుతోంది...మరి సైంటిస్టుల కాలగణనతో సరిపోతోందెలా??

బిగ్ బేంగ్ జరిగి విడిపోయిన పదార్థం వల్ల సృష్టి ఏర్పడిందని అది తిరిగి కేంద్రం వల్ల ఆకర్షింపబడి పదార్థం ఏర్పడటం వల్ల సృష్ఠి నశించి శూన్యం అవుతుందనీ అది తిరిగి మల్లీ బ్రద్దలయి సృష్ఠి మొదలవుతుందని ఇలా జరుగుతునే ఉంటుందని నేటి సైన్స్ చెప్పిన విశ్వముఖులిత సూత్రం కదా!

మరి వేదసారమైన భగవద్గీత లో చెప్పబడిందేంటి?కల్పకం అంతమందు సకల ప్రాణులూ తన యందు లీనమవుతాయని మళ్ళీ కల్పకం ఆరంభంలో అన్నీ తననుండి పుట్టుకొస్తాయని భగవానుడు చెప్పినట్లు ఉందెలా??

ప్రతీ చర్యకూ సమాన స్థాయిలో ప్రతిచర్య ఉంటుందనేది న్యూటన్ చెప్పిన సూత్రం కదా!
మరి వేల సంవత్సరాల నుండి భారతదేశంలో వినిపించే కర్మసిద్ధాంతం చెప్పేది ఏంటి?? ఎవరు ముందు చెప్పినట్లు?

తొలివిమాన నిర్మాణం చేసిన మేధావులు రైట్ సోదరులు కదా!

అంతకు ముందు భారతీయులకు ఉన్న విమాన శాస్ర్తాన్ని కూడా కాస్త పక్కన పెడదాం..రైట్ సోదరుల కంటే ముందు శివరాం బాపూజీ తళ్పాడే అనే పండితుడు మన పురాతన గ్రంధాల ఆధారంగా తయారు చేసిన "మరుత్సబి" గాలిలో ఎగిరింది కదా.. మధ్యలో ఆగిపోయిన ఆ విమాన ప్లాన్ ఈయన వారసులు ఓ ఆంగ్లేయ కంపెనికీ అమ్మినట్లు తెలుస్తోంది...మరి అది ఏమైనట్లో...ఆ ప్రస్తావనే తేదెందుకు ఈ ప్రపంచం...

మొక్కలకు ఫీలింగ్స్ ప్రాణం ఉన్నాయని నిరూపించింది మన  దేశీయుడైన శాస్ర్తవేత్త జగదీశ్ చంద్రబోస్ కదా!

మరి ముందు ఈ విషయం మనవారికి తెలియదా?మన గ్రంధాలలో వృక్షాల భావాల ప్రస్తావనలు లెక్కలేనన్ని ఉన్నాయే...మన ఋషులు మొక్కలను ప్రార్థించే దర్బలను సేకరించేవారు(భాధ పెడుతున్నందుకు క్షమించమని)..మరి వారికి ఈ విషయాలు తెలియదనే అనుకుందామా...

పెద్దపెద్ద వృక్షాలయే మొక్కల్ని రూపలక్షణాలు మారకుండా కుండీలలో చిన్నమొక్కలుగా పెంచే ప్రక్రియ"బోన్సాయ్"నేటి విజ్ఞానశాస్ర్తం కదా!

మరి భారతీయ ప్రాచీన ఆయుర్వేద ఋషి చరకుడు తన చరకసంహిత గ్రంథంలో "వామన తను వృక్ష్యాది విద్య"అను ప్రకరణంలో వైద్యానికి ఉపయోగించే పెద్దవృక్షాలను గుణం చెడకుండా చిన్నమొక్కలుగా పెంచే ఈ విధానాన్నే తెలిపాడెలా??

తులసి మొక్క ద్వారా స్వైన్ ఫ్లూ వంటి ప్రాణాంతక వ్యాదుల్ని అరికట్టవచ్చని వైద్యులు ఇప్పుడు ఒప్పుకుంటే.... మరి యుగాల కాలం నుండి ప్రతి ఇంట తులసి మొక్కను పూజిస్తారెందుకబ్బా!......

సముద్రగర్భంలో అగ్నిపర్వాతాలు ఉన్నట్లు మనం ఈమధ్య గమనించినట్లు చెప్పుకుంటాం కదా!

మరి మన పురాణాలకాలం వారికి "బడభాగ్ని"గురించి ఎలా తెలిసిందబ్బా...

భారతీయ గోవు మనిషి ఆరోగ్యాన్ని పెంచుతుందని శాస్త్రవేత్తలు పరీక్షించి ఇప్పుడు నిర్దారిస్తే....మరి గోమాతను దైవంగా భావించి కొలిచే ఆనవాయితీ యుగాలకాలం నుంచి ఎందుకుందబ్బా!.....

లోహవిజ్ఞానంలో నేటిమనం చాలా అడ్వాన్స్ గా ఉన్నమని చెబుతాం కదా!

మరి ప్రాచీన భారతీయులు ఢిల్లీలో నిర్మించిన ఇనుప స్తంభం (విష్ణు ద్వజం) ఇప్పటికీ తుప్పు పట్టకుండా నిలిచి ఉంటే దానికి పోటిగా ఆధునికులు నిర్మించిన ఇనుప స్తభం తుప్పపట్టి కనిపిస్తుందెలా??

నిర్మాణ రంగంలో ఆధునికులు చాలా ముందున్నాం అని చెప్పుకుంటాం కదా!

మరి వేల సంవత్సరాల నాటి ఆలయాలు కోటలూ ఇప్పటికీ నిలచి ఉంటే గత 500సం లోపు నిర్మాణాలు నిలబడుటలేదేమి?
గోల్కొండకోటలోని శబ్ధప్రసారపద్దతి వివిధ దేవాలయాలోని సంగీతం పలికే స్తంభాలూ శివాలయంలో లింగంపై చెక్కుచదరని నీడ పడే నిర్మాణాలూ.....ఏ సమయంలోనూ నీడ కనిపించని ఆలయాలు, స్తంబాలు గాల్లో నిలబడి బరువులు మోసే భారీ కట్టడాలు, గోపురం నీడ ఒక సమయంలో వ్యతిరేకదిశలో పడే అద్బుత కట్టడములు వీటన్నింటి గురించి ప్రాచీన భారతీయులకు నేటి ప్రపంచం ఇచ్చే సమాధానమేంటి??

అణువు పరమాణువు గురించి వాటిలోని శక్తి గురించి ఆధునికులకు మాత్రమే తెలుసు కదా!

మరి భారతీయ గ్రంధాలు తిరగేస్తే పరమాణువుల గురించి "వైషేశిక సూత్రం" అంటూ ఓ గ్రంధమే కనిపిస్తుందే...దీనిని రాశిన కశ్యపుడను ఋషికి కణాల వివరణ చెప్పిన కారణంగా కణాదమహర్షి అను పేరు వచ్చినట్లు తెలుస్తోంది...ఎవరు ముందు చెప్పినట్లు??

మెండలీఫ్ ఆవర్తన పట్టికలో పాదరసం,బంగారం పక్కపక్కన చూపించేవరకూ పాదరసం నుండి బంగారం చేయవచ్చని మనకు తెలియదు కదా!

మరి వీటి గురించి తెలీకుండానే మన పూర్వీకులు ఈపని ఎలా చేశారు...ఈ పని చేసేవారిని "రసవాదులు"అనికూడా పేరెట్టి పిలిచారే.....

సూర్యుడు ఓ నక్షత్రమనీ చాలా నక్షత్రాలలో సూర్యుడు కూడా ఒకడు మాత్రమేనని మన నేటి శాస్రజ్ఞుల విజ్ఞానం కదా!

మరి మన పూర్వీకులకు ఇది తెలియకుండానే అరుణ మంత్రంలో "సప్తదిశో నానా సూర్యాః" అని చెప్పారనుకుందామా??

భూమినుండి విడివడిన కొంతభాగమే చంద్రుడనీ ఆ భాగం విడివడిన చోటు పసిఫిక్ మహా సముద్రం ఏర్పడిందనీ శాస్ర్తవేత్తల పరిశీలన కదా!

విజ్ఞానాన్ని కథలుగా చెప్పే సంస్కృతి గల మన దేశ పూర్వులు చెప్పిన సాగరమధనం కథ ద్వారా బాగా గమనిస్తే తెలిసేదేంటి?పాల సముద్రం నుండి చంద్రుడు పైకెగసినట్లు చెప్పారే...

ప్రపంచం నేడు చదువుతున్న చరిత్ర ప్రకారం గ్రహణం గురించి మొదటగా చెప్పింది చైనావారని చెప్తున్నారు కదా!(2137 క్రీ.పూ)
అంతకు పూర్వం వాడైన అత్రిమహాముని చరిత్రకు పనికిరానివాడెలా అయ్యాడు?ఆయన తయారు చేసిన "తురీయ బ్రహ్మ"అనే టెలిస్కోప్ సహాయంతో మొదటగా గ్రహణం పరిశీలించాడే(ఋగ్వేదం 5వమండలం 40-6 మంత్రం)
ఈ విషయం మన గ్రంధాలలో అనేక చోట్ల కనిపిస్తోందని శ్రీ బాలగంగాధర్ తిలక్ తేల్చారు కూడా.....

ప్రస్తుతం భారతదేశం న్యాయవ్యవస్ద విదేశాలను అనుసరించిది అని వాదిస్తుంటారే!
మరి క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల క్రితం విఘ్నేశ్వరుడు రచించిన "మితాక్షర" గ్రంధం లోని అంశములను తెలియబరుస్తూ యాజ్ఞవల్క ఋషి రచించిన  స్మృతులను, 13వ శతాబ్దంనాటి తెలుగు కవి కేతన రచించిన విఘ్నేశ్వరం అనే గ్రంధంలోని అంశములను, ఇప్పటికి హిందూ న్యాయ వ్యవస్ద అనుసరిస్తున్నదని న్యాయ పుస్తకాల్లోనే ఎందుకుంది?

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో....మనకు జరిగిన అన్యాయం వర్ణించలేనిది...రాతి యగంలో వేదాలు రాశిన వారికి అంత జ్ఞానం ఉండదని విదేశీయులు నేర్పిన చిలకపలుకులు నేటికీ వల్లే వేసే బానిస మనస్కులు తెలుసుకోవలసిందీ ఒకటుంది...రాతియుగం పరాయి పాలన...అంతకుముందంతా రత్నయుగమేనని...
ప్రపంచం కళ్ళు తెరవక ముందే మనం చిరునవ్వు నవ్వాం, ఆటలాడి పాటలు పాడాం..```
నేడు నీచులచే వక్రీకరింపబడ్డ మన చరిత్రను నమ్మి మన భారత జాతిని, పురాణాలను, గ్రంధాలను, ఇతిహాసాలను తూలనాడే స్థితిలో ఉన్నాం...

ఇప్పుడు చెప్పండి.. ఎవరు చెప్పినట్లు ముందు ఈ లోకానికి లౌక్యం..?
  
 ఇలాంటి మరుగునపడిన భారతీయ చరిత్ర గురించి చిన్నతన్నం నుండి పాఠ్య పుస్తకాలలోగాని పాఠశాలల ద్వారాగాని పిల్లలకు తెలియనియక మెకలె  విద్యా  విధానం ద్వారా వక్రీకరించబడ్డ చరిత్ర చదివి ప్రతి ఒక్కటీ విదేశీవాడే కనుగొన్నాడన్న ధోరణిలో విదేశాలకు జేజేలు పలుకుతూ మన భరత మాతను భారతదేశాన్ని పనికిమాలిన దేశం ఇక్కడ ఏమున్నదని తిట్టే స్దాయికి చేరుకున్నాం. కనుక మన దేశ ఘన చరిత్ర గురించి భావితరానికి తెలియజేయండి మన పూర్వీకుల జ్ఞాన భాండాగారాన్ని తిరిగి పంచండి అప్పుడే దేశం పట్ల జాతి పట్ల సంస్కృతి పట్ల ఆచార వ్యవహారాల పట్ల గౌరవ భావం తోపాటుగా దేశ భక్తి పెరుగుతుంది.

మేరా భారత్ మహాన్ 
భారత్ మాతాకి జై...🙏

Virus-free. www.avast.com
Read More

సర్ జాన్ వుడ్రాఫ్ మహాశయుడు కిండలినీ యోగం పై ది సర్పెంట్ పవర్ అనే పుస్తకం వ్రాశారు

సర్ జాన్ వుడ్రాఫ్ మహాశయుడు కిండలినీ యోగం పై ది సర్పెంట్ పవర్ అనే పుస్తకం వ్రాశారు. ఏం జరిగింది ? సాధన ఏమీలేని, సాధన చేయాలనే అభిప్రాయం కూడా లేని పెద్దలు మూలాధారం, సహస్రారం అంటూ పుస్తకాలు వ్రాయడం మొదలు పెట్టారు. ఈ యోగాన్ని కరతలామలకం చేసికొన్నామనుకొంటున్న పెద్దలు ఏకంగా పెద్ద ఎత్తున శిక్షణా శిబిరాలనే ఏర్పాటు చేస్తున్నారు. సాధన చేసే వారెంతమందో, తుదివరకూ నిలబడే వారెంతమందో కానీ ఈ రోజుల్లో అందరూ కుండలినీ శక్తి గురించి మాట్లాదేవారే!

అయితే ఒకరకంగా మనం వుడ్రాఫ్ కు కృతజ్ఞులముగా ఉండాలి. పాశ్చాత్యులు మన యోగ రహస్యాలన్నీ కల్పనలని ప్రచారం చేసేవారు. చిలకపలుకులు వల్లించే మన పెద్దలు దానికి తాళం వేసేవారు. ఈయన వ్రాయడం వల్ల అటువంటి వారి దృక్పథంలో మార్పురావడమేకాక,ఎవరైనా ధీరులంటూ ఉంటే ఇటువంటి యోగమొకటున్నదనే విషయం తెలిసి దానికై ప్రయత్నించే అవకాశం కల్గించింది.

మంత్రయోగం విషయంలో కూడా కుండలినీ యోగమంత కాకపోయినా జాగ్రత్త అవసరం. నాడీ ప్రకంపనల ద్వారా మంత్ర ప్రయోగం కూడా కుండలినీ యోగపు ఫలితాలనిస్తుంది. సవ్యమైన గురూపదేశం లేని మంత్రములు ఎఱుకవలన ఎటువంటి ప్రయోజనమూ లేదు. ఇంట్లో వైరింగ్ అంతా చేయించి పంకాలు, దీపాలు అమర్చినా విద్యుత్ కేంద్రానికి తీగలద్వారా జోడించకపోతే ప్రయోజనమేమీ ఉండదు. మంత్రనాదం విద్యుత్ వంటిది. నేరుగా ముట్టుకొంటే ప్రమాదం. గురువనే తీగ ద్వారా గురుబోధన అనే బల్బులోనికి ప్రవేశపెట్టినప్పుడే కాంతి వస్తుంది. 

తీగలద్వారా ప్రవహించే శక్తి మనకు కనబడదు. దాని మూలం కూడా మన మెరుగం. అలాగే మంత్రం కూడా గుప్తమైనది. మంత్ర శస్త్రం గోప్యమైనది. అలాగని మంత్రయోగము, కుండలినీ యోగములు అనుసరణీయమైన మార్గములు కావని, నే చెబుతున్నానని అపోహపడవద్దు. అద్వైత సిద్ధికి ఇది నిశ్చయంగా దగ్గర దారి. లేకుంటే మహామునులెందరో, అంతెందుకు భగవత్పాదుల వారే తమ గ్రంథాలలో ఈ యోగాన్ని పదేపదే ఎందుకు స్పృశిస్తారు. ఈ మార్గాలపైన ఆసక్తిగల సాహసులు ఉంటే వారికి నేనీయవలసిన సలహా ఒకటున్నది.

ఈనాటికీ ఈ యోగంలో నిష్ణాతులైన అనేకమంది మహానుభావులున్నారు. వారికి మనపై అవ్యాజమైన అనుగ్రహం తప్పితే వేరొక ఆశలేదు. వారు సాధనలో శిష్యుని ఒక్కొక్క మెట్టుగా పైకి తీసుకొని వెళ్ళదగిన సద్గురువులు. వారిని ఆశ్రయించంది. మీ అంతట మీరుగా పుస్తకాలు చదివి సాధన చేయవద్దు. యోగులమని పేర్లు పెట్టుకొని డంభంగా తిరిగేవారిని చూసి మోసపోవద్దు. ఎంతో జాగరూకత అవసరం.
కానీ మరొక్కసారి నేను మీకు భక్తి జ్ఞాన మార్గాలలో కలగని ఆత్యంతికమైన అనుభూతి ఈ మార్గంలో క్రొత్తది ఏదీ లేదని గుర్తు చేస్తున్నాను. తుదికి అన్ని మార్గాలూ అక్కడ లయమవవలసిందే! అయినా మీమీ అభిరుచుని బట్టి ఈ మార్గంపైకి మక్కువ కలిగిందంటే సద్గురువును ఆశ్రయించండి. అటువంటి సద్గురువు లభించాలని భక్తితో అంబికను ప్రార్థించండి. ఆమె అనుగ్రహంతోనే సద్గురువు సంప్రాప్తమవుతాడు.

కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే! గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి!! (మూకపంచసతి)

Virus-free. www.avast.com
Read More

కుండలినీ యోగం కష్టమే!

తొమ్మిది, పది శ్లోకాల ఉపోద్ఘాతం - రెండవ భాగం

కుండలినీ యోగం కష్టమే! అయితే భక్తి జ్ఞాన యోగ మార్గాల్లో సాధకుడు సులభంగా తుదిగమ్యాన్ని చేరగలుగుతున్నాడా అని ప్రశ్నించవచ్చు. ఇది సముచితమైన ప్రశ్నే. అయితే ఆ సాధనా మార్గాలు కుండలినీ యోగమంతటి క్లిష్టతరమైనవి కాదు. ఆయా మార్గాలలో పయనిస్తుంటే తప్పులు దొర్లినా విపరీత ఫలాన్నీయవు. భక్తులకు, జ్ఞాన మార్గంలో ఉన్నవారికి కూడా అంబిక తన శక్తిని ఎఱుకపరుస్తుంది. ఆ భక్తునికో, ఆ సాధకునికో ఆ శక్తుల మీద ఇచ్ఛలేదు. అంబిక పాదాలపై చిక్కటి అనురాగంతో భక్తుడు ఆనందాంబుధిలో ఓలలాడుతుంటే,అనంతమైన శాంతితో నిశ్చలునిగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయినా నిర్మల హృదయులైన వీరికి లోకక్షేమార్థం అంబిక కొన్ని శక్తులను అనుగ్రహిస్తుంది. ఆ శక్తులను వారు తమ ప్రయోజనాలకు ఉపయొగించుకోరు. ఆర్తులనెవరినైనా చూసి వారి కష్టానికి వీరి హృదయం కరిగినపుడు అంబికానుగ్రహాన ఆ అర్తులకు కష్టాలు తీరుతాయి.

కుండలినీ యోగం చేసేవారిలో ఎక్కువమంది రాజసంతో ఏవో కొన్ని శక్తులు సంపాదించి చూపాలనే ఉద్దేశ్యంతో ఉంటారు. ఆ శక్తులకై వారు చెల్లించాల్సిన మూల్యం అంబిక గట్టిగా బేరం చేసి మరీ పుచ్చుకొంటుందా అనిపిస్తుంది. పరాశక్తి జీవిని నిశ్చల నిర్మల తత్త్వమైన పరబ్రహ్మలో లయం చేయడం కంటే మహాశక్తి స్వరూపమైన తన తత్త్వంలో కలుపుకోవడం కష్టతరంగా కల్పించింది. ఎలాగూ తుది గమ్యం ఏ మార్గంలో అయినా పరబ్రహ్మానుసంధానమే! మనలో లక్షకొకరు కుండలినీ యోగసాధనలో సరియైన దిశలో పయనిస్తే కోటికోకరు ఉత్తీర్ణత సాధించగలరేమో!

గీతలో భగవానుడు భక్తి యోగ మార్గాల గురించి –

*నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో నవిద్యతే
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతోద్భయాత్* 

అంటారు. ఈ మార్గంలో చేసిన ప్రయత్నమెప్పుడూ వ్యర్థమవదు. విపరీత ఫలాన్నీయదు. ఈ మర్గంలో చేసిన స్వల్ప ప్రయత్నమైనా మహాభయం నుండి రక్షిస్తుంది. కుండలిని యోగ విషయంలో ఇది కుదరదు. అందులో ఉన్న అగాధాలని దాటే ప్రయత్నంలో నిస్పృహ చెంది. ఎక్కువశాతం సాధకులు ప్రయత్నాన్ని విరమిస్తారు. మళ్ళీ కుండలిని మామూలుగా యథాస్థానం చేరుతుంది. ప్రయత్నమంతా వృథా అయిపోతుంది. కొంచెం సాధన తప్పుదోవ పట్టిందా – విపరీత ఫల రూపంలో ప్రత్యవాయం కూడా సిద్ధిస్తుంది. తుదివరకూ తన ప్రయత్నం పై తనకు నమ్మకం లేక మహాభయాన్ని కలగజేస్తుంది.

సిద్ధి అనే విషయం అటుంచి ఈ యోగంలో ఇంకొక ప్రమాదం కూడా ఉంది. సాధకునికి మూలాధారంలో కుండలిని కదలిక ఆరంభమవగానే ఆ శక్తి సహస్రారం చేరిందనే ఆలోచన కలుగుతుంది. కొంచెం ఒకటి రెండు చక్రాలు తిరిగి వచ్చిందా, తద్వారా కల్గిన అల్ప శక్తులను చూసుకొని తానిక సిద్ధుడ్నయిపోయాననుకొంటాడు. ఇది సప్త ప్రాకారాలతో కూడి ఉన్న గుడిలో మొదటి గాలి గోపురాల్లో ప్రవేశించి గర్భగుడిలోనికి చేరాననుకోవడం వంటిది. సాత్వికతను పెంపొందించే భక్తి జ్ఞాన మార్గాలలో ఈ ఇబ్బంది లేదు. భక్తి జ్ఞాన మార్గాలు ద్వారా పొందలేని పరిపూర్ణత ఈ కుండలినీ యోగం వల్ల సిద్ధించదు. పరిపూర్ణత ఏ మార్గంలోనైనా ఒకటే!

ఎవరైనా కాంచీపురం కామాక్షీ గుడికి వెళ్ళడమెలాగని అడిగారనుకోండి. బ్రాడ్వేకి వెళ్ళి బస్సు ఎక్కితే కామాక్షీ గుడి సమీపంలోనే బస్సు ఆగుతుందని చెబుతాం. అంతేకాని తిరువట్రియూరు దేవాలయంలోని పల్లవుల కాలం నాటి సొరంగం నేరుగా కాంచీపురం కైలసనాథర్ దేవాలయంకి చేరుతుంది. అక్కడ నుండి ఒక అరమైలు దూరంలోనే కామాక్షీ గుడి ఉన్నదని చెబుతామా! అలాంటి సొరంగం ఉండి ఉండవచ్చు. కానీ దానిలో నుండి పోగల సాహసం చేయగల వారెవ్వరు ? దానిని గురించి తెలుసుకోవడం వల్లన మన పూర్వీకుల నైపుణ్యం పైన అబ్బుర పాటు కలుగుతుంది. కానీ ఆ మార్గాన్ని సాధారణ మానవుడు ఉపయోగించుకోలేడు.

(సశేషం)

Virus-free. www.avast.com
Read More

వేదం - అనుగ్రహం

వేదం - అనుగ్రహం

పరమాచార్య స్వామివారు సాక్షాత్తు దైవస్వరూపులు. కలియుగంలో వైదిక ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన అపర శంకరావతారులు. మా తండ్రిగారికి పరమాచార్య స్వామివారు తప్ప వేరు దైవము లేదు. స్వామివారి ఉపదేశం విని మా ముగ్గురు అన్నదమ్ములను వేదసేవకే వినియోగించారు. వేదపండితుడైన యువకునికే మా చెల్లిని ఇచ్చి కన్యా వివాహం చేశారు. అలాగే, వారి ఇష్టానుసారమే మా అన్నకు నాకు కూడా కన్యా వివాహమే చేశారు. 

నేను వేదపాఠశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు రెండు మూడు రోజులు వరుసగా సెలవు వస్తే, మా గురువు గారు మమ్మల్ని మహాస్వామివారి వద్దకు "స్వామివారి సమక్షంలో వేదం చెప్పండి" అని పంపేవారు. అప్పుడు మహాస్వామివారు మా అహార విహారాదుల గురించి అన్ని విషయాలు అడిగేవారు. ఆంధ్రదేశ పర్యటనప్పుడు నేను వారితో పాటు కార్వేటి నగరం, బుక్క, రామగిరిలో ఉన్నాను. స్వామివారు నన్ను అనుగ్రహించి బ్రహ్మశ్రీ గోదా మంత్రాలయం వద్దకు పంపారు. తరువాత నేను తిరుపతిలో వేదపారయణదార్ ఉద్యోగానికి అర్జీ పెడితే స్వామివారి అనుగ్రం వల్ల పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాను. స్వామివారి అనుమతితో వెళ్దామని చెప్పడానికి వారి వద్దకు వెళ్ళాను. అనుకోకుండా స్వామివారు వెళ్ళమని అనుజ్ఞ ఇచ్చారు. ఆశ్శీపూర్వకంగా నాచేతిలో ఒక కమలం పెట్టారు. ప్రేమతో వారు నాతో, "శాస్త్రాన్ని ఉల్లంఘించకుండా నీ కర్తవ్యం నిర్వర్తించు. ఒకవేళ శాస్త్రాన్ని ధిక్కరించవలసిన పరిస్థితి వస్తే, ఉద్యోగం వదిలేసి నావద్దకు రా. నీ బాధ్యత నేను తీసుకుంటాను" అని అన్నారు. 

చిన్న కాంచీపురంలోని మహాస్వామి వారి వేదపాఠశాలలో నేను వేదం నేర్చుకున్నాను. అక్కడ నేను విద్యార్థిగా ఉన్నప్పుడు మాకు భోజన సదుపాయాలు అంతగా ఉండేవి కావు. కనుక స్వామివారు భక్తులను ప్రతి నెలా తమ జన్మనక్షత్రం రోజున ఏవైనా మధుర పదార్థాలు, తినుబండారలు చేసి తనకు చూపించి వేదపాఠశాలలో ఇమ్మని చెప్పారు. భక్తులు అలాగే చేసేవారు. మేము పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారు మమ్మల్ని ప్రేమపూరిత మాటలతో అడిగేవారు, "ఈరోజు తినుబండారాలను ఎవరు తీసుకొనివచ్చారు?" అని. ఫలనా వారు మీకు ఈరోజు మధుర పదార్థాలు తెచ్చారా? అని ప్రేమగా అడిగేవారు. దాన్ని తలచుకోవడం ఇప్పటికి ఒక మధురానుభూతి. 

పరమాచార్య స్వామివారి కటాక్షం పొందాలంటే విశేషంగా ఏమీ చెయ్యనక్కరలేదు. వేదం పఠిస్తే పరమాచార్య స్వామివారు వారంతట వారే వచ్చి మనల్ని అనుగ్రహిస్తారు. "మంత్రాదీనంతు దైవతం" అంటే దేవతలు మంత్రం యొక్క ఆధీనంలో ఉంటారు అన్నట్టు మనం వేద పారాయణం మొదలుపెట్టగానే వారే స్వతహాగా మనం కూర్చున్న చోటికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు. 

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

--- శ్రీ కె. చంద్రశేఖర ఘనాపాటి, న్యాయ - వేదాంత శిరోమణి, తిరుపతి. మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్

Virus-free. www.avast.com
Read More

అంబికను కుండలినీ యోగంతోనూ, మంత్రయోగంతోనూ ఆరాధించడాన్నీ, అటువంటి ఆరాధన వలన కలిగే ఫలితాలన్నీ తరువాతి శ్లోకములు వివరిస్తున్నాయి.

తొమ్మిది, పది శ్లోకాల భాష్యం - మొదటి భాగం

అంబికను కుండలినీ యోగంతోనూ, మంత్రయోగంతోనూ ఆరాధించడాన్నీ, అటువంటి ఆరాధన వలన కలిగే ఫలితాలన్నీ తరువాతి శ్లోకములు వివరిస్తున్నాయి.

మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి .
మనోऽపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం
సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే .. (9)

(అమ్మా! నీవు సుషుమ్నా మార్గములో మూలాధార చక్రమునందు భూతతత్త్వమును, మణిపూరక మందు జలతత్త్వమును, అనాహత మందు వాయుతత్త్వమును, విశుద్ద చక్రమందు ఆకాశతత్త్వమును, ఆజ్ఞా చక్రమునందు మనోతత్త్వమును చేధించుకొని సహస్రార చక్రమందు నీ భర్తతో ఏకాంతముగా విహరిస్తున్నావు)

సుధాధారాసారై శ్చరణయుగలాంతర్విగలితైః
ప్రపంచం సించంతీ పునరపి రసామ్నాయమహసః .
అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం
స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుణ్డే కుహరిణి. (10)

(తల్లీ! నీపాదద్వయము నుండి జాలువారిన అమృతధారలచే లోకమును తడుపుదువు. అమృత  రూపమగు చంద్రుని వలన నీ స్వస్థానము చేరుటకు పాము వలె నన్ను నీ నిజరూపమును పొంది సూక్ష్మరంధ్రము గల సుషుమ్నా ద్వారమున వున్న మూలాధారమందు సర్వదా నిద్రించెదవు.)

మానవుని దేహంలో పద్మములని పిలవబడే చక్రములు ఆరింటిని గురించి కుండలినీ యోగము చెబుతుంది. అంబిక మొదట అయిదు చక్రాలలో పృథివ్యాపస్తేజో వాయురాకాశాదులు గాను, ఆరవచక్రములో మనస్సుగానూ వసించుతోందని ఆచార్యులవారు వివరిస్తారు. ఈ పద్మాలను కలుపుతూ వాటి నడుమ సుషుమ్నా నాడి ఉంటుంది. ఆ నాడి చివర వెయ్యి రేకులున్న పద్మంగా ప్రకాశించే సహస్రార చక్రమున్నది. ఆ పద్మంలోనే అంబిక తన పతి అయిన సదాశివునితో ఐక్యమవుతుంది. ఎప్పుడైతే జీవాత్మ కుండలినీ శక్తి ద్వారా సహస్రార పద్మమునకు తీసుకొని రాబడుతుందో, అప్పుడు అంబిక అద్వైతానందాన్ని ప్రసాదిస్తుంది. స్థూల ప్రపంచ నిర్మాణమే సూక్ష్మ ప్రపంచంలో కూడా కాన వస్తుంది. అంబిక తనను ప్రపంచంగా విస్తరించుకొనినపుడు మహాభూతములుగా, మహత్తు అని పిలవబడే లోకాలను శాసించే మహామనస్సుగా ఎలా వెలుగొందుతుందో, సాధకుడు ఆయా కుండలినీ చక్రాదులతో దర్శించవచ్చు. ఆయా అనుభూతులను పొందవచ్చు. ఆ మహామనస్సు సహస్రార పద్మములో పరబ్రహ్మయైన పరమశివునితో ఐక్యం చెందినపుడు అద్వైతానుభూతీ పొందగలుగుతాడు.

అటువంటి అద్వైత రసానుభూతి అమృత రసానుభూతి అవడం తరువాతి శ్లోకంలో చెప్పబడింది. పొందబడే అద్వైత రసము, పొందే జీవుడు, అనుగ్రహించే అంబిక – ఈ మూడింటి మధ్య భేదం లేదు. ఏదో మాటవరసకు దీనిని రసానుభవం అంటారు. కానీ నిజానికి ఈ స్థితి మాటలకందనిది. అనుభూతికి ముందు, తరువాత పొందేది, పొందబడేది, పొందించేది అన్న త్రిపుట ఉంటుంది. అనుభూతి కాలంలో నష్టమైపోతుంది. 

నేను చెప్పిన పద్మములు చెరువులలో పెరిగే పద్మముల వంటివి కాదు. చెరువులోని ఆ పద్మములు సూర్యరశ్మికి వికసిస్తాయి. చంద్రకాంతికి ముకుళించుకొని పోతాయి. నిప్పు సెగకు వాడిపోతాయి. నే చెప్పిన కుండలినీ పద్మములు అగ్నికాండము, సూర్యకాండము, చంద్రకాండము ఈ మూడిటికీ వికసిస్తాయి. తుదకు శిరస్సున పూర్ణచంద్రుడు సహస్రార పద్మాన్ని వికసింప చేస్తాడు. ఆ చంద్రకాంతితో అమృతం ప్రవహిస్తుంది.

అది అంబికానుగ్రహమును స్రవించిన రసం శిరస్సుపై నాడులను తడిపివేస్తుంది. నిజానికి అమృతం స్రవించినది పూర్ణచంద్రుని నుండి కాదు. జాగ్రత్తగా చూసామా ఆ పూర్ణచంద్రునిపై అమ్మ పాదాలు మన గురుపాదాలుగా దర్శనమిస్తాయి. ఆ పాదముల నుండే అమృతం ప్రవహించేది. జీవాత్మ ఆ అమృతాన్ని ఆస్వాదిస్తోంది. అంబిక చేత ప్రసాదించబడిన ఆ అమృతాన్ని ఆస్వాదించే జీవాత్మకు అద్వైత జ్ఞానముంటుంది. అటువటి స్థితి ఒక కుండలినీ యోగం ద్వారానే సిద్ధిస్తుందా ? నేను మరొక్కసారి చెప్పదలిచాను. మీరెంచుకొన్న ఏ మార్గంలోనైనా నమ్మకంతో త్రికరణసుద్ధిగా సాధన చేయండి, మీకు తెలియకుండానే ఈ యోగఫలం మీకు సిద్ధిస్తుంది.

Virus-free. www.avast.com
Read More

14, మార్చి 2018, బుధవారం

Fwd: ఎనిమిదవ శ్లోక భాష్యం - మూడవ భాగం


---------- Forwarded message ----------
From: Krishna Kishore <kishoreor777@gmail.com>
Date: 2018-03-15 8:37 GMT+05:30
Subject: ఎనిమిదవ శ్లోక భాష్యం - మూడవ భాగం
To: Krishna Kishore <kishoreor777@gmail.com>


ఎనిమిదవ శ్లోక భాష్యం - మూడవ భాగం

కామేశ్వరుని పర్యంక నిలయయైన అంబికకు భగవత్పాదులవారు కామేశ్వరి అనో, రాజేశ్వరి అనో, రాజరాజేశ్వరి అనో శృంగార సుందరి అనో పిలవడం లేదు. జ్ఞానంలో పరాకాష్ట చేర్చుతూ ఆమెను చిదానందలహరి అన్న పేరుతో స్తుతిస్తున్నారు. ఆచార్యులవారి కవిత్వపటిమను ఈ సంబోధన తెలియజేస్తుంది. అంబిక అయ్యతో శృంగార మూర్తిగా ఉన్నా అది ఆత్మ శృంగారం. సత్యవస్తువుకు అభిన్నమైన స్పృహవలన జనించిన బ్రహ్మానందం కదా అది. సింహాసనం పైనో, మంచం పైనో, మేరుపర్వత శిఖరం పైన ఉన్న భవంతిలోనో, సుధాసాగర మధ్యస్తమైన మహాప్రాసాదంలోనో ఎక్కడుంటే ఏమి ఆమె ఆత్మస్పృహ వలన జనించిన చిదానంద ప్రవాహం. ఈ పదం ఉపయోగించడంలో ఆచార్యులవారి ఉద్దేశం ఇది.

అటువంటి చిదానంద ప్రవాహాన్ని - భజంతి త్వాం ధన్యః కతిచన అంటే అదృష్టవంతులైన కొందరు అటువంటి నిన్ను పూజిస్తున్నారు. కొద్దిమంది మాత్రమే ఏమి. ఎంతోమంది దేవీ పూజలు చేస్తున్నారు. రోజురోజుకూ సంఖ్య పెరుగుతూ ఉంది కూడా! కొన్ని పదాలు గొణగడం, కర్పూరం వెలిగించడం పూజ అవుతుందా ? నిజమైన పూజ అంటే ఏమిటి ?

క్రిందటి శ్లోకంలో అంబిక మూర్తిని గురించి వివరించబడింది కదా! ఆ మూర్తిని భావించి హృదయంలో ముద్రించుకోవాలి. మనం కూడా అంబిక నివసిస్తున్న శ్రీనగరంలో ఉన్నామని భావించుకోవాలి. ఆమె దయ అమృతసాగరమని, మనం కల్పవృక్షాల మధ్యలో మణిద్వీపంపై ఉన్నామని, మన పూజగది సర్వకాంక్షలను తీర్చగలిగే చింతామణులతో నిర్మించబడిందని ఊహించాలి. ఈ భావం స్థిరపడినప్పుడు సిద్ధించేది సాలోక్య మోక్షమని నా ఉద్దేశం. సాధారణంగా సాలోక్యముక్తి అంటే మన ఇష్టదేవతలకు సంబంధించిన లోకంలో ఆవాసం చేయడమన్న భావం ఉంది. అయితే మనమున్న ఈ ప్రదేశమే మన ఇష్టదేవత నివసించే లోకమనే భావనను దిటవు చేసుకోవడమే ఉత్తమం.

సాలోక్యం తరువాతది సామీప్యం. సుధాసాగరపు గట్టుమీద నుండి కల్ప వృక్షాల అరణ్యాన్ని, కడిమిచెట్ల ఉద్యానవనాలను దాటుకుని, చింతామణి గృహంలో ప్రవేశించి అంబిక శయనించే మంచం దగ్గరకు చేర్చడం సామీప్యం. ఇక సారూప్యం. తుమ్మెద గురించి నిరంతరం ఆలోచిస్తూ తుమ్మెద అయిపొయే రీతిలో నిరంతరం అంబిక దివ్య మోహన రూపాన్ని ఆలోచిస్తూ అదే మూర్తిని పొందవచ్చు. ముందు శ్లోకంలో వర్ణించిన అంబిక స్వరూపాన్ని ధారణచేసి, ధ్యానిస్తే కామేశ్వర పర్యంక నిలయగా ఆ తల్లిని భావనతో చూస్తూ కరిగిపోతే సారూప్యం సిద్ధిస్తుంది.

పరమమైన ముక్తి సాయుజ్యం ఇష్టదేవతతో ఐక్యమయిపోవడం. ఇంతకుముందు ముక్తిలో మనం అంబికను పోలిన రూపాన్ని పొందాం. ఇప్పుడు అంబికే అయిపోవడం. అదే సత్యం మనమయిపోవడం. ఆ సత్యాన్నే ఆచార్యులవారు చిదానందలహరి - అనంతమైన ఆనంద ప్రవాహమైన ఆత్మస్పృహ అంటున్నారు. ఆ ప్రవాహంలో మనం కరిగిపోవాలి. అదే సాయుజ్యం. దానితరువాత మరి ఇంకే పూజా అవసరం లేదు. పూజ చేయవలసిన స్థితిలో ఉన్నంతవరకూ ఆ చిదానందలహరిలో ఆ అద్వైత తత్త్వంతో కరిగిపోయే లక్షణం పెంపొందించుకోవాలి.

అంబిక లోకమైన శ్రీపురాన్ని చేరడం, ఆమె రూపాన్ని పొందడం, ఆమెలో ఐక్యమయిపోవడం అని క్రమంగా జరగనీయండి. ప్రస్తుతానికి మానసికంగా మనలను ఆ స్థితులకు (సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యాలకు) ఆయత్త పరుచుకోవాలి. పూజకు కూర్చున్నామా మన మనస్సు ఆమె పాదాలకు అటుఇటు కదలకూడదు. ఆఫీసుకు సమయం అయిపోతున్నదేమో, ఈ రోజు కాంటీనులో ఏ రకం వడ వేస్తాడన్న ఆలోచనలు మీ ఏకాగ్రతను భంగం చేయరాదు. మీ మనస్సు అమృత సముద్రపు అలలలో తడిసిపోవాలి. చివరకు చిదానంద సాగరమైన అంబిక సత్యరూపంతో కలిసిపోవాలి.

మనం ఆ రకమైన పూజ చేస్తున్నామా ? కొందరు మహాపురుషులు పూర్వజన్మ సుకృతం వలన అంబిక స్వరూపంలో చిదానంద రసాన్ని ఎఱుకలోనికి తెచ్చుకొనేంతటి ఏకాగ్రతతో పూజచేస్తారు. వారే ఆచార్యులవారు చెప్పిన కతిచన ధన్యః - కొందరు ధన్యులు.

(సశేషం)

Virus-free. www.avast.com



--
kishore always with u....!
Read More

భీష్మ పర్వము – 15 అయిదవ రోజు యుద్ధం - ii

భీష్మ పర్వము – 15
అయిదవ రోజు యుద్ధం - ii

ఇది చూసిన సాత్యకి క్రూర బాణములను భీష్మునిపై గుప్పించాడు.  భీష్ముడు కుపితుడై సాత్యకి సారధిని చంపాడు.  సాత్యకి రథం ఊగిసలాడింది.  రధముకు కట్టిన గుర్రములు కకావికలై పోగా వికల రధుడైన సాత్యకితో పోరు సల్ప ఇష్టపడక భీష్ముడు అతడిని విడిచి పాండవ సైన్యాలపై తన ప్రతాపం చూపసాగాడు.  ఇంతలో విరాటుడు భీష్ముని ఎదుర్కొని మూడు బాణాలతో భీష్ముని కొట్టాడు.  భీష్ముడు ఆ బాణములను మధ్యలో త్రుంచి పది బాణములతో విరాటుని కొట్టాడు.  భీష్ముని ఎదుర్కోవడానికి వచ్చిన అర్జునునికి అశ్వథ్థామ అడ్డం వచ్చి ఆరు బాణములతో అర్జునుని కొట్టాడు.  అర్జునుడు నవ్వుతూ అశ్వథ్థామ విల్లును విరిచాడు.  అశ్వథ్థామ మరొక విల్లందుకుని అర్జునుని మీద శరపరంపర కురిపించాడు.  అశ్వథ్థామ అస్త్ర, శస్త్ర ధాటికి నరనారాయణులు బాగా నొచ్చుకున్నారు.  కుపితుడైన అర్జునుడు అశ్వథామ శరీరాన్ని బాణాలతో కొట్టి రక్తసిక్తం చేసాడు.  భీష్ముని ఎదుర్కొన్న భీముని సుయోధనుడు అడ్డుకుని అయిదు బాణములు ప్రయోగించి భీముని కవచాన్ని ఛేదించాడు.  ఇరువురి మధ్య పోరు తీవ్ర రూపం దాల్చింది.  సుయోధనునికి సాయంగా భీష్ముడు, చిత్ర సేనుడు, పురుమిత్రులు వచ్చారు.  వారిని అభిమన్యుడు సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు.  అభిమన్యుని బాణములను వారిరువురు సమర్ధవంతంగా ఎదుర్కొని అభిమన్యునిపై బాణవర్షం కురిపించాడు.  అభిమన్యుడు కోపించి వేసవిలో అడవిని దావాగ్ని దహించిన విధంగా బాణపరంపర ప్రయోగించి చిత్ర సేనుని విల్లు విరిచి అతడి రధాశ్వాలను చంపాడు.  అలా పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్న అభిమన్యుని సుయోధన కుమారుడైన లక్ష్మణ కుమారుడు ఎదుర్కొన్నాడు.

అభిమన్యుడు ముందు లక్ష్మణుని గుర్రములను చంపి తరువాత సారధిని చంపి అతని రధమును విరుగ కొట్టాడు.  విరధుడైన లక్ష్మణుడు శక్తి బాణమును అర్జునిపై ప్రయోగించాడు.  అభిమన్యుడు దానిని మధ్యలోనే విరిచి లక్ష్మణుని శరీరం తూట్లు పడేలా బాణ ప్రయోగం చేసాడు.  ఇది గమనించిన కృతవర్మ లక్ష్మణుని తన రథంపై ఎక్కించుకుని తీసుకు పోయాడు. సుయోధనుడు తన సేనలను పోరుకు ఉత్సాహపరిచాడు.  భీష్ముడు పాండవ సేనను దునుమాడ సాగాడు.  సాత్యకి తన శరములతో కౌరవ సేనలను చికాకు పరుస్తున్నాడు.  ఇది గమనించిన సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఎదుర్కొని సాత్యకిని చికాకు పరిచాడు.  సాత్యకి పుత్రులు భూరిశ్రవుని ఎదుర్కొని "భూరిశ్రవా!  నీతో యుద్ధం చేసి వినోదించడానికి వచ్చాము.  కనుక మాలో ఒకరిని ఎన్నుకుని నీ పరాక్రమం చూపించు" అన్నారు.  భూరిశ్రవుడు "మీరంతా ఒక్కటిగా వచ్చినా నాకు భయం లేదు" అన్నాడు.  వారంతా ఒక్కుమ్మడిగా బాణవర్షం భూరిశ్రవునిపై కురిపించగా భూరిశ్రవుడు వారిని శరపరంపరలో ముంచెత్తాడు.  వీరోచితంగా పోరాడుతున్న సాత్యకి పుత్రులను భూరిశ్రవుడు వారి తలలు నరికి నేల కూల్చాడు.  ఇది చూసిన కౌరవ సేనలోఉత్సాహం పెల్లుబికింది.  తన కుమారుల మరణం సాత్యకిని ఆగ్రహోదగ్రుని చేయగా కౌరవ సేనపై విరుచుకు పడి దొరికిన వారిని దొరికినట్లు చంపి భూరిశ్రవుని రధాశ్వములు, సారధిని చంపాడు.  భూరిశ్రవుడు కూడా సాత్యకి రథం విరుగ కొట్టాడు.  ఇరువురు నేల మీదకు దుమికి కరవాలంతో యుద్ధం చేయసాగారు.  ఇంతలో సాత్యకిని భీముడు, భూరిశ్రవుని సుయోధనుడు తమ తమ రధములపై ఎక్కించుకుని తీసుకు వెళ్ళారు.  అర్జునుడు కౌరవ సేన మీదకు దూకి తన శరపంపరతో కౌరవ సేనుని నుగ్గు నుగ్గు చేసాడు.  సూర్యుడు పశ్చిమాద్రికి చేరుకుంటున్న తరుణంలో భీష్ముని ఆదేశంతో ఆనాటి యుద్ధం ముగిసింది.

Virus-free. www.avast.com
Read More

శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర నమో నమః

శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర నమో నమః
*"మన భక్తి ప్రపంచం "*

*📌శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర నమో నమః......!!*

*శ్రీ సుబ్రహ్మణ్య   28 నామములు ...*

*గౌరీ శంకరుల మంగళకర ప్రేమకు,అనుగ్రహానికి ఐక్య రూపంసుబ్రహ్మణ్యస్వామి.
షణ్ముఖుడు,కార్తీకేయుడు, వేలాయుధుడు,కుమారస్వామి గా పేరు గడించినస్వామి
కారణజన్ముడు.తారకాసురుడు, సురావణుడుమరికొందరు రాక్షసులు ప్రజలను,దేవతలను
హింసిస్తూ ఉండేవారు.ఈ అసురల బారి నుండి కాపాడమనిబ్రహ్మను కోరగా, శివ
పార్వతులకుజన్మించిన పుత్రుడు వారినివధిస్తాడని చెప్పాడు. ఆ రకంగాపార్వతి
పరమేశ్వరుల అనుగ్రహం తోకుమారస్వామి పుట్టుకవిలక్షనమైనది.*
*శివాంశతో జన్మించినసుబ్రహ్మణ్యస్వామి గంగాదేవి గర్భంలో పెరుగుతాడు.గంగాదేవి ఆ
పుత్రుని భారంమోయలేక రెల్లు పొదల్లోకి జారవిడుస్తుంది. అప్పుడు కృత్తికా
దేవతలు ఆరుగురు తమస్తన్యమిచ్చి పెంచుతారు. రెల్లు పొదల్లో పెరిగినందువల్ల
శరవణుడు అని, కృత్తికా దేవతలుపెంచినందు వల్ల కార్తికేయుడని పేరు వచ్చినది అని
పురాణాలు చెబుతున్నాయి. ఆరుముఖాలు కలిగినందు వల్లనా షణ్ముఖుడు అని అంటారు.
నెమలి వాహనం కలిగినస్వామి గణేశునికి సోదరుడు. ఆరు ముఖాలలో ఐదు పంచేంద్రియాలకు,
ఒకటిమనసుకు ప్రతీక.*
*స్వామి అనే నామధేయం సుబ్రహ్మణ్య స్వామి కి మాత్రమే సొంతం. సేనాపతిగా
సకలదేవగణాల చేత పూజలు అంà


Virus-free. www.avast.com
Read More

సంప్రదాయం - సమస్య

సంప్రదాయం - సమస్య

చాలాసంవత్సరాల క్రితం ఉషోదయకాలంలో కాంచీపురం శ్రీమఠం. ఆ రోజు చాలామంది భక్తులు లేరు. పరమాచార్య స్వామివారు దర్శనం ఇస్తున్నప్పుడు దేవతలా నగలు వేసుకుని అలంకరించుకున్న ఒక సుమంగళి నేరుగా స్వామివద్దకు వెళ్ళి నమస్కరించింది. అశ్రుపూరిత నయనాలతో లేచి నిలబడింది. 

పరమాచార్య స్వామివారి మార్గదర్శనం కోసం ప్రార్థిస్తోంది. బహుశా ఏదో విపరీతమైన వ్యక్తిగత సమస్య అయ్యింటుంది. కళ్ళతో అర్థిస్తూ, వణుకుతున్న పెదాలనుండి వస్తున్న మాటలతో, "ఒక్క క్షణం కూడా నాపై మీ అనుగ్రహదృష్టి ప్రసరించరా? కనీసం నా ప్రార్థన కూడా ఆలకించరా అని వేడుకుంటోంది". ఆ కరుణామయుడు ఆమె ప్రార్థనను వినాలనుకుంటున్నారు. కాని పక్కన ఎవరితోడు లేకుండా ఒంటరి ఆడవారి మాటలను వినరాదన్న పీఠ నియమానికి కట్టుబడి ఉన్నారు. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తుండగా నిస్సహాయురాలై అక్కడే నిలబడి ఉంది. ఆమె తప్పుకుంటే కాని ఇతర భక్తులు స్వామివారు దర్శనానికి రాలేరు. మరి అలా ఎంతసేపు అడ్డగించగలదు? స్వామివారు చేతి సంజ్ఞతో ఒక పరిచారకుణ్ణి రమ్మని పిలిచారు. 

"ఇక్కడ పూర్తి చవిటివాడు ఎవరైనా ఉన్నారేమో చూడు" అని అన్నారు. సహాయకుని అదృష్టం కొద్దీ ఒక చవిటివాడు దొరికాడు. "నేను చెప్పేది విను. ఆ చవిటివాడు ఈమెతో కలిసి రాగానే నువ్వు చప్పట్లు చరిచి అతణ్ణి పేరుతో పిలువు. అతని ప్రతిక్రియను బట్టి అతను నిజంగా చవిటివాడో కాదో నీకు అర్థం అవుతుంది"

పరమాచార్య స్వామివారి సలహా అమోఘం. ఎవర్నో ఒకడిని తీసుకునిరావాలని నిజంగా చవిటివాణ్ణి కానివాడిని ఆ శిష్యుడు తీసుకునివస్తే. అప్పుడు కుటుంబ కష్టాలు చెప్పాలనుకున్న ఆమెకి హానికారం కదా! కనుక ఈ సలహా మహాస్వామివారు ఇంకొక శిష్యునికిచ్చారు కనిపెట్టమని. ఆ చవిటివాడు పక్కనుండగా ఆమె తన కష్టాన్నంతా స్వామివారికి చెప్పుకుంది. పరమాచార్య స్వామివారు ఓపికగా అంతా విని ఆమెను అనునయించారు. ఇప్పుడు కూడా ఆమె ఏడుస్తోంది, సంతోషంతో!! ఆమె ప్రసాదం తీసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళిపోయిన తరువాత ఆ చవిటివాణ్ణి కూడా వెళ్ళమని చెప్పారు స్వామివారు.

ఎటువంటి పరిస్థుతులలోనూ సన్యాసాశ్రమ ధర్మాలను తప్పేవారు కాదు స్వామివారు. అలా అని నమ్మిన భక్తులను కరుణించడంలో ఏమాత్రమూ అలసత్వం చూపేవారు కాదు. 

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

--- మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్

Virus-free. www.avast.com
Read More

సర్వం శక్తిమయం జగత్.

సర్వం శక్తిమయం జగత్.

🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆
      'సర్వం శక్తిమయం జగత్‌' అని భక్తులు విశ్వసిస్తారు. శక్తి లేనిదే సృష్టి లేదు. శక్తి లేనిదే ఏ ప్రాణీ చైతన్యం పొందలేదు. పరాశక్తి లేకుండా, ఈశ్వరుడైనా అశక్తుడే! మానవాతీత మహత్తర శక్తిని భగవత్‌ స్వరూపంగా వర్ణిస్తున్నాయి శాస్త్రాలు. జ్యోతి స్వరూపిణి అయిన పరాశక్తిని కొలిచి, మహర్షులు దివ్యశక్తుల్ని సముపార్జించారు. జ్ఞాన సంపన్నులై లోకానికి అపురూపమైన ప్రబోధాలు చేశారు.

     జ్ఞాన, శక్తి, ఆనందాలకు మూలాధారుడు- భగవంతుడు. ఆయనను ఆరాధించడానికి, పలు దివ్యశక్తుల్ని సాధించడానికి భక్తి ఒక్కటే ప్రధాన సాధనమని వేదం చెబుతుంది. మూలశక్తి 'గాయత్రి'. అంటే, గానం చేసేవారిని రక్షించే శక్తి అని అర్థం. చిత్‌ శక్తికి, జీవశక్తికి మూలాధారం గాయత్రి. ఇందులో శబ్దబ్రహ్మం ఉంది. దీని బాహ్యరూపం- ప్రణవం. గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలుంటాయి. అవన్నీ ఆరు దివ్యశక్తులకు ప్రతీకలు. అవి: పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, కుండలినీ శక్తి, మాతృకా శక్తి.

    శక్తులన్నింటికీ మూలాధారమైన, మహిమాన్వితమైన పరంజ్యోతి స్వరూపమే పరాశక్తి. జ్ఞానశక్తి అనేది సకల విద్యలకూ ఆధారం. సత్వ రజో తమో గుణాలకు అతీతులైన తరవాత- జ్ఞానశక్తి ద్వారా దూరదృష్టి, అంతర్‌ దృష్టి, అంతర్‌ జ్ఞానం పొందగల సిద్ధులవుతారు. జ్ఞానశక్తికి గల గౌరవం అపారమని వేద పురాణాలు చాటి చెబుతున్నాయి.
జ్ఞానం మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. 'తమసోమా జ్యోతిర్గమయ' అనే సూత్రానికి భాష్యాన్ని అది అభివ్యక్తం చేస్తుంది. విద్య, ధనం, పదవి- వీటిని జ్ఞానం లేకుండా ఆర్జించలేం. ఐహిక వాంఛల్ని విడిచి, ఆముష్మిక పథం వైపు నడిపించే ఆత్మజ్ఞానానికి జ్ఞానమే తొలి సోపానం. అర్జునుణ్ని గీతాచార్యుడు జాగృతం చేసింది ఈ జ్ఞాన బోధతోనే!
ఇచ్ఛాశక్తి ద్వారా సాత్విక ఇచ్ఛాశక్తి కార్యరూపం ధరిస్తుంది. కోరిన సత్ఫలితాలనిస్తుంది. ఏకాగ్రత, శ్రద్ధ వల్లనే ఈ శక్తి సిద్ధిస్తుంది. సాత్విక, ఆధ్యాత్మిక, క్రియాశక్తుల వల్ల మనిషి- యోగి, పరమ యోగి కాగలడు. క్రియాశక్తి వల్ల శరీరంలో తరంగాలు ఉత్పన్నమవుతాయి. సత్వగుణం తోడైనప్పుడు ఈ శక్తి మనిషిలో శాంతిని, లోక హిత భావనను వృద్ధి చేస్తుంది. కుండలినీ శక్తికి సమష్టి, వ్యష్టి అని రెండు రూపాలుంటాయి. సృష్టిలోని జీవశక్తి ఈ రెండు రూపాల్లోనూ వృద్ధి చెందుతుంటుంది. కర్మను అనుసరించి ఈ శక్తి బాహ్యంగా, ఆంతరంగికంగా సమానమైన ప్రభావం చూపుతుంటుంది. మానవ శరీరంలో అంతర్గతంగా గల తేజమే కుండలినీ శక్తి. ఇది పంచప్రాణాల ఉనికిని కాపాడుతుంది. దీని ద్వారా ఇంద్రియాలు, మనసు నిరంతరం చైతన్యవంతమై ఉంటాయి. సాత్విక గుణంతో మాయాబంధం నుంచి విముక్తి కలిగించి, మనసును శివోన్ముఖం చేయడంలో ఈ శక్తి ప్రమేయం అపారం. యోగాతో ఈ శక్తిని వికసింప జేసుకోవచ్చు.

      అరిషడ్వర్గాలను జయించకుండా- అహింస, సత్యం, శౌచం, బ్రహ్మచర్యం, సంతోషం, తపం వంటివాటితో హృదయాన్ని వికసింప జేయలేం. కేవలం బాహ్య ప్రక్రియలైన హఠ యోగం వంటివి సాధన చేసినంతమాత్రాన, ఈ శక్తి జాగృతం అవుతుందని భావించలేం. ఆధ్యాత్మిక దృక్పథం లేకుండా ఎవరూ పరిణతి, పరిపక్వత సాధించలేరు.

      వలం హఠయోగ సాధకులకు హృదయంలోని అష్టదళ పద్మంలో విరాజిల్లే మహా విద్య అందదు. సద్గురు కృపతో రాజయోగులు- ఆ మహా విద్యను పొందగలరు. మాతృకా శక్తిపై అక్షరం, బీజాక్షరం, శబ్దం, వాక్యం, గానం, మంత్రశాస్త్రంలోని మంత్రాల ప్రభావం ఉంటుంది. ఇవన్నీ ఆ శక్తిపై ఆధారపడినవే. దాని వల్ల ఇచ్ఛ, క్రియా శక్తులు ఫలవంతమవుతాయి. మాతృకా శక్తి లేకుండా ఆధ్యాత్మిక భావనా పటిమ జాగృతం కాదు.

శబ్దమే సృష్టికి మూల కారణం. సృష్టిలోని అన్ని నామాలూ ఈ శక్తికి రూపాంతరాలు. నియమ రహితులకు మాతృకా శక్తి సాధన సాధ్యం కాదు. పరస్పర సంబంధం కలిగిన దివ్యశక్తులివి. సాధకులు కొన్నింటినైనా పొందగలిగే ప్రయత్నం చేయగలిగితే- మానవజన్మకు ఓ అర్థం, పరమార్థం లభిస్తాయి!

Virus-free. www.avast.com
Read More

అనంత ఫలదాయకం "అర్ఘ్య ప్రధానం"

అనంత ఫలదాయకం "అర్ఘ్య ప్రధానం"

మన తల్లిదండ్రులు,తాతముత్తాతలు మన చిన్నతనం నుండి ఉదయమే లేవటం మరియు సూర్యుడికి ఆర్ఘ్యం వదలటం వంటి ఆచారాలను నేర్పుతూ వొస్తున్నారు. నేటి సమాజంలో మనం వ్యవహరించే ఆచారాలు, విశ్వాసం మరియు నమ్మకం ఉన్న సూర్యుడికి నీరుని సమర్పించటం వంటివి నిజంగా మనకు సహాయపడుతున్నాయా లేదా కేవలం ఇది మరొక పురాణంలాగా వింటున్నామా! 

సూర్యునికి దోసిలిలో నీరుని సమర్పించటానికి అనేక పరిశోధనలు మరియు అనేక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. రెండు చేతులు దోసిలిగా పెట్టి, ఆ దోసిలిలో నీరు తీసుకుని రెండు చేతులను సూర్యదేవుని దిశగా పైకెత్తి పెట్టి, సన్నని ధారతో దోసిలిలోని నీరు వొదలాలి మరియు ఆ సమయంలో సూర్యుని నుండి వొచ్చే బలమైన కిరణాల వలన మనం సూర్యుని వైపు చూడలేము, మన పూర్వీకులు సూర్యభగవానుడికి ప్రాతఃకాలంలో విస్తృత అంచు కలిగి ఉన్న ఒక గిన్నెతో ఆర్ఘ్యం అందించేవారు. వారు నీటిని రెండు చేతులను సూర్యభగవానుని దిశగా పైకి ఎత్తి నీరుని సమర్పించేటప్పుడు వారి కళ్ళ ముందు ఆ సన్నని నీటి ధార దేవుడి దిశగా వెళుతున్నట్లుగా అనుభూతి చెందేవారు మరియు మన పూర్వీకులు (ఋషులు, సాధువులు) ఆ ప్రవహిస్తున్న నీటి చిత్రం ద్వారా.సూర్యభగవానుని చూసేవారు.

 సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్న కిరణాలు ( నీటి ప్రవాహం చిత్రం) వారి కళ్ళను మాత్రమే కాదు, వారి మొత్తం శరీరం మరియు ఆత్మను కూడా ఉత్తేజపరుస్తాయి. శాస్త్రవేత్తలు ఉదయాన్నే సూర్యుడు కిరణాలు సోకటం మానవునికి మంచిదని చెబుతారు. మానవ శరీరమే ఒక అద్వితీయమైన శక్తితో కూడుకున్నది. మానవ శరీరం ఐదు అంశాలతో చేయబడింది, గాలి (వాయు), నీరు (జల), భూమి (పృథ్వి) , అగ్ని (శక్తి) మరియు అంతరిక్షము (ఆకాశము) మరియు శరీరంలోని అన్ని రోగాల నివారణ ఈ ఐదు అంశాల వలన మాత్రమే సాధ్యమవుతుంది మరియు ఉదయిస్తున్న సూర్యుని కిరణాలలో ఈ అంశాలు ఉండటం ఒక విశేషం. 

పలు వ్యాధులు సూర్యుని కిరణాలను ఉపయోగించి నయం చేయవచ్చు ఉదా. గుండె జబ్బులు , కళ్ళు, కామెర్లు, కుష్టు మరియు బలహీనమైన మెదడు. మనల్ని నిద్ర నుండి మేల్కొలిపేలా చేసేది సూర్యభగవానుడు అని ఋగ్వేదం చెపుతున్నది. సూర్యుని కారణంగా అన్ని పనులు చురుగ్గా జరుగుతున్నాయి. జీవకోటి సృష్టి అంతా సూర్యుడి మీద ఆధారపడి ఉన్నది. సూర్యుడు అనేక భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక బలహీనతలను తొలగిస్తాడు మరియు ఆరోగ్యకరమైన , దీర్ఘాయువును ఇస్తాడు. సూర్యుడి ఏడు రంగులు ఆరోగ్యానికి చాలా మంచివి మరియు ముఖ్యమైనవి. ఎవరయితే ప్రాతః కాలాన్నే స్నానం ఆచరించి మరియు సూర్య దేవుడిని ప్రార్థించటం చేస్తారో మరియు వారి శరీరానికి సూర్యుని కిరణాలు తాకుతాయో, వారి శరీరం అన్ని రుగ్మతల నుండి విముక్తి పొందుతుంది మరియు వారి యొక్క మేధస్సు పెరుగుతుంది.

ప్రతీ రోజు సూర్యుడు ఉదయించకముందే అంటే ఉదయం 5 నుండి 6 లోపున సూర్యునికి ఆర్ఘ్యం అంటే మన రెండు చేతులతో దోసెడు నీళ్ళు తీస్కుని

సిందూరవర్ణాయ సుమండలాయ సువర్ణవర్ణాభరణాయ తుభ్యమ్‌ |. 
పద్మాభనేత్రాయ సపంకజాయ బ్రహ్మేంద్రనారాయణకారణాయ || 
సురత్నపూర్ణం ససువర్ణతోయం సకుంకుమాద్యం సకుశం సపుష్పమ్‌ |. ప్రదత్తమాదాయ సహేమపాత్రం ప్రశస్తమర్ఘ్యం భగవన్‌ ప్రసీద ||  

 అని నీళ్లను సూర్యుని చూస్తూ విడిచి పెట్టాలి. కొద్దిసేపు సూర్యునికి నమస్కారం చేసుకుని, పూజ గదిలో స్వామి వారి మూర్తికి దీపారాధన చేయటం ముఖ్యం, నమస్కారం చేస్తే చాలు సర్వ సౌఖ్యాలు ఇస్తాడు. అటువంటిది మనం ఇంకా శ్రద్ధగా సూర్య దీక్ష చేస్తే మనకు వచ్చే ఫలితం ఎంతో ఉంటుంది. దీక్షలో ప్రతీ ఆదివారం స్వామి వారికి ఆవుపాలతో చేయబడిన పాయశాన్ని నివేదెన చేసి ఆదిత్య హృదయం చదువుకోవాలి.....!

Virus-free. www.avast.com
Read More

తల్లితండ్రుల గొప్పదనం గురించి శాస్త్రాలలో చెప్పబడిన విధానం


💥 తల్లితండ్రుల గొప్పదనం గురించి శాస్త్రాలలో చెప్పబడిన విధానం 🔹

💥 ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి

🌷 ఆకాశము కన్నా ఉన్నతుడు తండ్రి

💥 ఒక్కసారి తల్లికి,తండ్రికి నమస్కరించిన గోదానము చేసిన పుణ్యము వచ్చును.

💥 సత్యం తల్లి ...... జ్ఞానం తండ్రి.

💥 పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. 
వందమంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి. 

💥 తల్లితండ్రులకు సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి.

💥 ఎవరు మాతృదేవతను సుఖముగ ఉంచరో, సేవించరో వారి శరీర మాంసాలు శునక మాంసము కన్నా హీనం

💥 ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ, కన్నతల్లి కంట కన్నీరు తెప్పించిన లక్ష గోవులు దానమిచ్చినా, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినా ఆ పాపం పోదు.

💥 తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పే అని ధర్మశాస్త్రం చెబుతోంది

💥 తల్లిని మించిన దైవం లేదు. గాయత్రిని మించిన మంత్రం లేదు.

Virus-free. www.avast.com
Read More

దేవనారు లోని శని దేవాలయం

 దేవనారు లోని శని దేవాలయం
*దేవనారు లోని శని దేవాలయం: ముంబైలోని దేవనారు ప్రాంతంలో ఒక శనీశ్వరాలయం ఉంది.
ఈ ఆలయం (ముంబై-పూణే-బెంగుళూరు) ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే మీద గోవండి,
దేవనార్-చెంబూరు కూడలి వద్ద శివాజి విగ్రహానికి తూర్పున నెలకొని ఉంది. ఈ
ప్రామంతానికి అసలు పేరు "దేవనవరు" అంటే దేవుడు గారు అని అర్థం. కాలాంతరంలో
తమిళ బాషా ప్రభావం వల్ల దేవనార్ గా మార్పు చెందింది. ఈ ఆలయంలో కొలువున్న
దేవుడు శనీశ్వర స్వామి: అందమైన, శక్తివంతమైన, గుబురు మీసాలతో
కొట్టొచ్చినట్టున్న గంభీరమైన ఏడడుగుల నల్లని విగ్రహం రూపం. అనేకమంది శని దోషం
గల భక్తులు, లేదా శని మహర్దశ, ఏలినన్నాటి శని దోషం ఉన్నవారు ఈ ఆలయంలో
తైలాభిషేకం చేసుంటారు. ముఖ్యంగా శనివారల్లో నువ్వుల నూనెను అత్యంత
భక్తిశ్రద్ధలతో శిరస్సునుంచి పాదాలవరకు విగ్రహం నూనెతో కప్పబడే విధంగా
తైలాభిషేకం చేస్తారు. ఈ నూనెతో పూజ చేసినట్లయితే శనీశ్వరుడు ప్రసన్నుడు
అవుతాడని నమ్మకం. అలాగే జిళ్ళేడు ఆకుల మాలలను ఆంజనేయస్వామికి సమర్పించుకుని,
శివునికి జలాభిషేకం చేయడం ఇక్కడి వారి ఆనవాయతి.*

*ప్రతి శనివారం సుమారు ఉదయం 10:30 గంటల సమయంలో, పూజారి మహా హారతి ఇచ్చిన
వెంటనే, పెద్ద పూజారిలో ('స్వామి' అని ప్రియంగా పిలుస్తారు అందరు) ఓ విధమయిన
తన్మయత్వంలో వూగిసలాడాడం ప్రారంభం అవుతుంది. అకస్మాత్తుగా, ఆ�°


Virus-free. www.avast.com
Read More

సామ్బో నః కులదైవతం పశుపతే

సామ్బో నః కులదైవతం పశుపతే 
సామ్బ త్వదీయా వయం
సామ్బం స్తౌమి సురాసురోరగగణాః 
సామ్బేన సన్తారితాః ।
సామ్బాయాస్తు నమో మయా విరచితం సామ్బాత్పరం నో భజే
సామ్బస్యానుచరోఽస్మ్యహం మమ రతిః సామ్బే పరబ్రహ్మణి ॥ 

సాంబుడే (జగదంబయగు పార్వతితో కూడిన శివుడు) మా కులదైవము . జీవులను పాలించు ఓ సాంబా! మేము నీవారిమే. సాంబునే స్తుతించుచున్నాను. దేవ - రాక్షస - సర్పగణములు సాంబుని చేతనే తరింపచేయబడినవి. నేను సాంబునకు నమస్కరించుచున్నాను.సాంబుని కంటే ఇతరుని పూజించను. నేను సాంబుని భక్తుడను. పరమాత్మయగు సాంబునియందే నాకు అనురాగము.

ॐ నమో నమో నమఃశివాయ

Virus-free. www.avast.com
Read More

ప్రవర యొక్క అర్ధం..

ప్రవర యొక్క అర్ధం..

చతుస్సాగర పర్యంతం
( మానవ పరిభ్రమణానికి నలువైపులా
కల మహాసముద్రాల అంచుల వరకూ )

గో బ్రాహ్మణేభ్య శుభం భవతు
( సర్వాబీష్ట ప్రదాయిణి అగు.. గోవూ మరియు నిత్యం సంఘహితాన్నే అభిలషించే సద్బ్రాహ్మణుడు అతడి రూపంలో ప్రకాశించే వేదధర్మం.. సర్వే సర్వత్రా దిగ్విజయంగా.. శుభప్రదంగా వర్ధిల్లాలని కోరుకుంటూ)

కాశ్యప అశిత దైవల
త్రయాఋషేయ ప్రవరాన్విత..

( మా వంశమునకూ.. మా గోత్రమునకూ మా నిత్యానుష్ట ధర్మశీలతకు మూలపురుషులైన మా ఋషివరేణ్యులకూ.. త్యాగే నైకే అమృతత్త్వ మానశుః అన్న వారి మహోన్నతమైన త్యాగనిష్ఠకు సాక్షీభూతుడనై..

శ్యాండిల్యస గోత్రః 
(మా గోత్రమునకూ..)

కాత్యాయని సూత్రః శుక్ల యజుశ్శాఖాధ్యాయీ 
( మా శాఖకూ.. అందలి శాస్త్ర మర్మంబులకు.. )

శ్రీనివాస కుమార శర్మ నామధేయస్య 

( కేవలం జన్మతహానే కాక.. ఉపనయనాది సంస్కారాలతో.. శాస్త్రపఠనంతో.. వేదాధ్యయనాది వైదిక క్రతువులతో.. 1. స్నానము 2. సంధ్య 3. జపము 4. హోమము 5. స్వాధ్యాయము 6. దేవ పూజ 7. ఆతిధ్యము 8. వైశ్యదేవము అనబడే అష్టకర్మలనూ క్రమంతప్పక నిర్వహిస్తూ.. త్రివిధాగ్నులు 1. కామాగ్ని 2. క్రోధాగ్ని 3. క్షుద్రాగ్ని.. అనే త్రివిధాగ్నులను అదుపులో (సమస్థితిలో) ఉంచుకొన్న వాడినై.. పేరుకు ముందు శ్రీ అనబడే.. ప్రకృతి స్వరూపమైన శక్తిస్వరూపాన్ని.. శుభప్రదమైన శ్రీకారాన్ని ధరించిన.. శ్రీనివాస్ కుమార్ శర్మా అనబడే సుశ్రోత్రియుడనైన నేను.. జన్మప్రధాతలైన జననీజనకులముందు..  జ్ఞానప్రధాతలైన ఆచార్యులముందు.. జ్ఞానస్వరూపమైన వేదముముందు.. యావత్ ప్రపంచానికే మార్గదర్శకమైన వేదధర్మము ముందు.. నిరాకార నిర్గుణ అవ్యాజ పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మ ముందు..

అహంభో అభివాదయే..
( కేవలం నేనూ అన్నదిలేక.. సర్వం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహ భాగ్యమేయన్న అహంకారభావ రహితుడనై.. నిగర్వినై.. త్రికరణ శుద్ధిగా ( మనసా, వాచా, కర్మణా) సాష్టాంగ పూర్వక (మానవశరీరంలోని అత్యంత ప్రాధాన్యమైన ఎనిమిది శరీరాంగములనూ శరణాగత హృదయంచే నేలపై వాల్చి సమర్పిస్తున్న) దండ ప్రణామమిదే.. అన్న పరిపూర్ణమైన ఆత్మపూర్వక వేదపూర్వక హృదయపూర్వక నమస్కార భావమే.. సశాస్త్రీయమైన ఈ ప్రవరలోని.. అర్ధం అంతరార్ధం పరమార్ధం కూడా.

భగవంతుని అర్చన విధిలో మాత్రం స్వ ప్రవర పూర్తిగా ఇలా చెప్పుట ఉత్తమం:
👉
చతుస్సాగర పర్యంతం
గో బ్రాహ్మణేభ్య శుభం భవతు
కాశ్యప అశిత దైవల
త్రయాఋషేయ ప్రవరాన్విత..
శాండిల్యస గోత్రోద్బ్వస్య భరణి నక్షత్ర ద్వితీయ చరణయుక్త మేషలగ్న్స్య కాత్యాయని సూత్రః శుక్ల యజుశ్శాఖాధ్యాయీ 
శ్రీనివాస కుమార శర్మ నామధేయస్య 
అహంభో అభివాదయే..అని పూర్తిగా చెప్తూ సంకల్పం,ప్రార్ధన చేయుట వల్ల.....ఎటువంటి అనుమానం లేకుండా ప్రతిఫలంను కర్త పొందవచ్చు.

గీర్దేవీ దయారవింద బహుముఖ నందన శ్రీ ఆచార్య శ్రీనివాస కుమార మనోహ్య కృతమిదం సర్వం శ్రీశారదాంకితం.

దేవీ ఇంద్రాయణీ మానసం మాధుర్య రస శోభితం
సతతం శ్రీవైష్ణవ వందితం శివకేశవ ప్రణమామ్యహమ్.

సర్వేజనా సుఖినో భవంతు..
లోకా సమస్తా సుఖినో భవంతు..

స్వస్తి..

Virus-free. www.avast.com
Read More

దుర్వాస మహర్షి తన భార్య అయిన ' కదళి ' తో ఒక పర్ణశాలలో నివశిస్తూ , జపతపాదులు చేసుకుంటూ ఉండేవాడు.

దుర్వాస మహర్షి తన భార్య అయిన ' కదళి ' తో ఒక పర్ణశాలలో నివశిస్తూ , జపతపాదులు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు కోపం ఎక్కువ .అందువల్ల 'కదళి ' నిరంతరం ఎంతో జాగ్రత్తగా ఆయనకోపానికి గురికాకుండా ఉంటుండేది.

ఒక సాయంసంధ్యా కాలంలో దుర్వాసమహర్షి ఎంతో అలసటగా ఉండటాన పర్ణశాల బయటి అరుగుపై నడుంవాల్చాడు. వెంటనే గాఢనిద్రలోకి జారు కున్నాడు. ఆయన అర్ధాంగి అయిన ' కదళి ' ఎంతో సేపు ఆయన నిద్రలేస్తాడని వేచి ఉండి, సాయం సంధ్య చేయవలసిన సమయం దాటిపోతుందన్న భయంతో , ఆయన్ను లేపడంతన కర్తవ్యంగా భావించి , ఆదమరచి నిద్రిస్తున్న దుర్వాసుని తట్టి నిద్రలేపింది.

నిద్రాభంగం కలిగినందున పరమకోపిష్టి ఐన ఆయన పట్టలేని ఆగ్రహంతో , కళ్ళుతెరచి భార్యను చూశాడు. ఆయన నేత్రాలనుండీ వెలువడిన అగ్నిజ్యాలలకు ఆమె భస్మమైపోయింది. ముందువెనుకలు ఆలోచించక తాను కోపం తెచ్చుకోడం వలన జరిగిన అనర్ధానికి దుర్వాసుడెంతో పశ్చాత్తపపడ్డాడు. చేసేదేంలేక మౌనంగా ఉండిపోయాడు.

ఐతే కొన్నిదినాల తర్వాత దుర్వాసుని మామగారు, తన కుమార్తెను చూసేందుకై ఆశ్రమానికి వచ్చాడు. ఆయన తనకుమార్తె గురించీ అడగ్గా, దుర్వాసుడు మామగారు తనకు శాపమిస్తాడనే భయం తో మెల్లగా జరిగిన విషయమంతా చెప్పి, క్షమించమని కోరి, తన తపోశక్తితో ఆభస్మం నుండీ , ఒకచెట్టును సృష్టించాడుట. అదే కదళీ వృక్షం ,అంటే అరటిచెట్టు.

దుర్వాసుడు తన మామగారితో " మీ కుమార్తె -' కదళి -'అందరికీ ఇష్టురాలై' కదళీఫలం రూపంలో అన్ని శుభకార్యాలలో భగవంతుని నివేదన కే కాక, మానవులు చేసే అన్ని వ్రతాల్లోనూ , నోముల్లోనూ అన్ని శుభకార్యాల్లోనూ ప్రాముఖ స్థానంలో ఉండి గౌరవం పొందు తుందని వరమిచ్చాడుట!

ఆ కదళీ ఫలాన్ని [ అరటి పండును] మనం కడిగి దేవునిముందుంచి కొద్దిగా తొక్క తీసి ' కదళీఫలం సమర్పయామి ' అంటూ నివేదన చేస్తాం.

Virus-free. www.avast.com
Read More

* బ్రోచేవారెవరురా * - మైసూర్ వాసుదేవాచార్య కృతి - MS సుబ్బలక్ష్మి అమ్మ గానం. 🙏🏻🙏🏻🙏🏻

* బ్రోచేవారెవరురా * - మైసూర్ వాసుదేవాచార్య కృతి - MS సుబ్బలక్ష్మి అమ్మ గానం. 🙏🏻🙏🏻🙏🏻

బ్రోచేవారెవరురా నిను విన రఘువరా  నను బ్రోచేవారెవరురా నిను విన రఘువరా నను రఘువరా నను బ్రోచేవారెవరురా నిను విన రఘువరా

నీ చరణాం భుజములునే విడజాల కరుణాల వాల బ్రోచేవారెవరురా నిను విన రఘువరా…
నీ చరణాం భుజములునే విడజాల కరుణాల వాల బ్రోచేవారెవరురా ఆ…
 

ఓ చతురా ననాది వందిత నీకు పరాకేలనయ్య

ఓ చతురా ననాది వందిత నీకు పరాకేలనయ్య

ఓ చతురా ననాది వందిత నీకు పరాకేలనయ్య

నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములిచ్చి వేగమె

నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములిచ్చి వేగమె

సా సనిదపద నిస నినిదదపమ

పాదమ గా మా పాదాని సానీదపమ నీదాపమ

గమపద మగరిస సమా గమపద మాపదని

ససరిని నినిసదా దదనిపాద మపదని

సానిదప మగమనిదని పదమాపదని

సమా గరిస రిసానిదప సానీదపమ గామపదని

 

బ్రోచేవారెవరురా ఆ…

 

సీతాపతే నాపై నీకభిమానము లేదా

సీతాపతే నాపై నీకభిమానము లేదా

వాతాత్మజార్చిత పాద నా మొరలను వినరాదా

భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా

భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా

భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా

నా పాతకమెల్ల పోగొట్టి గట్టిగ నా చేయి పట్టి విడువక

 

సా సనిదపద నిస నినిదదపమ

పాదమ గా మా పాదాని సానీదపమ నీదాపమ

గమపద మగరిస సమా గమపద మాపదని

ససరిని నినిసదా దదనిపాద మపదని

సానిదప మగమనిదని పదమాపదని

సమా గరిస రిసానిదప సానీదపమ గామపదని

 

బ్రోచేవారెవరురా ఆ…

Virus-free. www.avast.com
Read More

Powered By Blogger | Template Created By Lord HTML