.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

5, మార్చి 2018, సోమవారం



విశ్వామిత్రుడు👉 #బ్రహ్మర్షి

విశ్వామిత్రుడు పుట్టుకతో క్షత్రియుడు. మహారాజయిన గాధి కి కుమారుడైన విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యాపాలన చేశాడు. ఒకసారి ఆయన గొప్పదైన తన సైన్యంతో భూమి అంతా తిరుగుతూ తన రాజ్యంలోనే ఉన్న వశిష్టమహర్షి ఆశ్రమం లోకి వెళ్లారు. ఆ ఆశ్రమంలోఅనేక వేల మంది శిష్యులు ఉన్నారు. ఆ ఆశ్రమం పర్ణశాలలతో, చెట్లతో, జంతువులతో శోభాయమానంగా ఉంది.అంత పరమ పవిత్రమైన ఆశ్రమం లోకి విశ్వామిత్ర మహారాజు తన సైన్యాన్ని బయట విడిచి వెళ్లారు. కుశలప్రశ్నలు గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకున్న తరువాత విశ్వామిత్రుడు తానూ బయలుదేరుటకు అనుమతి ఇవ్వవలసినదిగా వశిష్టమహర్షిని కోరారు. అప్పుడు వశిష్టుడు అతిధిగా వచ్చిన విశ్వామిత్రుడు తమ ఆతిధ్యం తీసుకోవాలి అన్నాడు. ఐతే విశ్వామిత్రుడు తానూ ఒక్కడినే రాలేదు, తనతో తన సైన్యం వచ్చింది కనుక వారు అంతా అక్కలిగా ఉన్నప్పుడు తానూ భుజిoచలేను అని చెప్పాడు. అది విన్న వసిష్టుడు వారి సైన్యం ఎంతున్నా వారికి తానూ ఆతిధ్యం ఇవ్వగలను అని సర్వ సైన్యమును పిలచి నీటి ఏర్పాట్లు చేసారు.
అప్పుడు వశిష్ట మహర్షి నందినిని పిలిచి, "ఓ! నందిని, మన ఆశ్రమం లోకి ఈ రోజు విశ్వామిత్ర మహారాజు, వారి సైన్యం వచ్చారు. కనుక నువ్వువారికి ఉత్తమమైన భోజనం ఏర్పాట్లు చెయవలసినది . ఎవరికి ఏది కావాలో, ఎవరికి ఏది ఇష్టమో అది ఏర్పాటు చెయగలవు" అనిచెప్పారు. ఆ నందిని ఎవరెవరు మనసులో ఏమీ ఏమి కావాలి అనుకుంటున్నారో గ్రహించి, చెరుకు కర్రలు, తేనే, పానీయములు, అన్నపు రాశులు, కూరలు, పాచ్చళ్లు, పులుసులు, పళ్లరసాలు, పాలు, తాంబూలాలు మొదలైన సర్వo సిద్ధం చేసింది. ఆ భోజనాన్ని సైనికులందరు భుజించారు.
ఒక గోవు ఉత్తర క్షణంలో ఇన్‌న్టమందికి సరిపడా భోజనాన్ని సృస్టించింది అనే సరికి, విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆయనకి మెల్లగా ఆ నందినిని తన స్వంతం చేసుకోవాలి అనే కోరిక పెరిగింది. అప్పుడాయన వశిష్ట మహర్షి తో,ఒక లక్ష ఆవులకు ప్రతిగా నందినిని ఇవ్వమని అడుగగా వశిష్టుడు అంగీకరించలేదు. కోపించిన విశ్వామిత్రుడు " రాజ్యంలో ఎక్కడన్నా రత్నాలు ఉంటే అవి రాజుకే చెందుతాయి. రాజు దగ్గర విలువైనవి ఉండాలి. చాలా విలువైనది రత్నమైతే, ఈ నందిని కూడా రత్నమే. నా సొత్తు రత్నాన్ని నువ్వు ఉంచుకున్నావు. అందుకే ఇప్పుడు నేను ఈ రత్నాన్ని తీసుకెళ్తున్నాను" అని అన్నాడు.
నాయనా విశ్వామిత్రా! ఈ ఆవు ని నీవు వెలకడుతున్నావు, ఒక రత్నముగా దాచుకోవాలి అనుకుంటున్నావు. కానీ ఈ ఆవు మాకు ఆశ్రమo లో దేవతారాధనకి, పితృదేవతారాధనకి పాలు ఇస్తుంది. నా ప్రాణయాత్ర దీనితో జరుగుతుంది. ఈ ఆశ్రమo లోని యజ్ఞాలు, విధ్యాభ్యాసం సమస్తమూ ఈ నందిని మీద ఆధారపడి ఉంది. కాబట్టి, నేను ఈ గోవుని నీకు ఇవ్వాలేనని వశిష్ట మహర్షి అన్నారు. ఈ సారి విశ్వామిత్రుడు ఎంతో ధనాశచూపాడు. అయినా వసిష్టుడు అంగీకరించలేదు.
ఆగ్రహించిన విశ్వామిత్రుడు, కోపం తలకు ఎక్కినవాడయ్యి, నేను రాజును నాకు ఒకరు ఇవ్వటం ఏమిటి నేను ఆమిన తీసుకోగలను అని నందిని మెడలో తాడు కట్టి, సైనికులకిచ్చి తీసుకెళ్ళమన్నాడు. వాళ్ళు దాన్ని ఈడ్చుకెళుతుంటే, ఆ నందిని భాదపడి, నిశ్శబ్దంగా ఉన్నవశిష్టుని అడిగింది. "ఓ వశిష్టమహర్షి! నన్ను నీవు ఎందుకు వద్దనుకుంటున్నావు!నన్ను ఇతనితో ఎందుకు పంపిస్తున్నావు?"
అప్పుడు వశిష్టుడు, "నందిని!నేను నిన్ను వదల లేదు ఆ విశ్వామిత్రుడే నిన్ను బలవంతంగా తీసుకెళ్తున్నాడు. నేను బ్రహ్మనుడను, అతను రాజు. నేను అతనిని ఎదిరించి నిన్ను దక్కించుకోలేను. నీవు నిన్ను రక్షిoచుకోగలిగితే రక్షిo చుకో!"
అప్పుడు నందిని సూర్య ప్రకాశం తో సమానమైన కాంభోజ వంశీయులని, తన పొదుగు నుండి కొన్ని వేల పహ్లావులని, యోని నుండి యావనులని, గోమయం పడే స్థానం నుంచి సాకులు, రోమకూపాల నుండి హారీతులు మరియు కిరాతకులని సృస్టించింది. వీరందరు కలిసి విశ్వామిత్రుని సైన్యాన్ని సమూలంగా నాశనం చేసారు.
తన రధం నుండి కిందకు దిగి తన సైన్యాన్ని చూసిన విశ్వామిత్రుడు నిస్తేజుడు అయ్యాడు. ఆ ఆవు తలుచుకుంటే గొప్ప సైన్యాన్ని, అమోఘమైన భోజనాన్ని సృస్టించింది. తన సైన్యం ఎందుకు పనికి రాకుండా చనిపోయారు. కనుక రాచరికం కన్నా తపః శక్తి చాలా గొప్పది. ఈ వశిష్టుడిని నేను గెలవాలి అంటే నాకున్న శక్తి సరిపోదు. కావున నాకు ధనుర్వేదం లోని సమస్త అస్త్రశాస్త్రాలు తెలియాలి అనుకోని, ఒక కుమారుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి, రాజ్యపాలన చెయ్యమని చెప్పి, తాను తపస్సు చేసుకోవటానికి హిమాలయ పర్వతాలకి వెళ్లాడు.
హిమాలయ పర్వతాలమీద మహాదేవుని గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన పరమేశ్వరుడిని ఏగురు ఉపదేశం లేకుండానే ధనుర్వేదం ప్రసాదించమని కోరాడు. శివుడు తధాస్తు అన్నాడు. ఇప్పుడు వచ్చిన అస్త్రశస్త్రములను చూసుకుని ఆత్మవిశ్వాసంతో రధమెక్కి వశిష్టుడి ఆశ్రమాన్ని చేరుకున్నాడు. కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ అస్త్రాలని ఆశ్రమం మీద ప్రయోగించాడు. అనుకోని ఈ పరిణామాలు ఏమిటో తెలియని ఆ ఆశ్రమం లోని శిష్యులు, జంతువులు ఒక్కసారిగా ఆక్రందనలు చేసారు. క్షణాలలో ఆశ్రమ వాతావరణం మారిపోయింది. ఆశ్రమంలో వశిష్టుడు ఒక్కడే మిగిలాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. వశిష్టుడు తన బ్రహ్మాదండం పట్టుకుని కింద కూర్చున్నారు. ఆయన ఆ బ్రహ్మాదందాన్ని అలా పట్టుకుని ఉంటే ఆ ఆగ్నేయాస్త్రo చల్లారిపోయి ఆ బ్రహ్మాదండం లోకి వెళ్లిపోయింది.

అప్పుడు విశ్వామిత్రుడు ఒకేసారి వారూణాస్ట్రం, ఇంద్రాస్త్రం, పాశుపతాస్త్రం, గాంధర్వాస్త్రం,
బ్రహ్మపాశం, కాలపాశం, వారూణాపాశం, పిణాకాస్త్రం, క్రౌంచాస్త్రం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, త్రిశులం, కపాలం అనే కంకణం, రకరకాల పిడుగులు, పెద్ద పెద్ద గధలు మొదలైన రకరకాల అస్త్రాలని వశిష్టుడి మీద వేశాడు. కానీ ఆయన వేసినవన్ని వశిష్టుడి బ్రహ్మాదండం లోకి వెళ్ళిపోయాయి.

ఇక తనదగ్గర ఉన్న ఒకేఒక్క అస్త్రమైన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి వదిలాడు. అప్పటిదాకా ఎంతోమంది గొప్పవాల్ళని మట్టుపెట్టిన ఆ బ్రహ్మాస్త్రం నిశ్శబ్దంగావశిష్టుని బ్రహ్మాదండం లోకి వెళ్లిపోయింది.

వశిష్టుడు బ్రహ్మర్షి కనుక నేను ఆయనని ఓడించలేకపోయాను. కాబట్టి నేను బ్రహ్మర్షిని అవుతానని విశ్వామిత్రుడు దక్షిణ దిక్కుకి వెళ్లాడు.

అక్కడ ఆయన తన పెద్ద భార్య తో 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. ఈ కాలంలోనే ఆయనకి హవిష్పాంధుడు, మధుశ్యంధుడు, ధృదనేత్రూడు, మహారధుడు అని నలుగురు కుమారులు పుట్టారు. ఆయన తపస్సుకి సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై రాజర్షి విశ్వామిత్ర అని పిలిచారు. ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే రాజర్షి అయ్యాను, ఇంకా బ్రహ్మర్షి ఎప్పుడవుతానో అని విశ్వామిత్రుడు దిగులుపడ్డాడు.

విశ్వామిత్రుడు రాజర్షిగా ఉన్నప్పుడే త్రిశంకుడికి ప్రత్యేకమైన స్వర్గాన్ని నిర్మించాడు.

బ్రహ్మర్షి గా మారటానికి ఇంకా ఘోరమైన తపస్సు చేయదలచి పశ్చిమ దిక్కునకు వెళ్లి తపస్సు చెయ్యటం మొదలుపెట్టాడు. అదే కాలంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడు అనే రాజు పరిపాలన చేస్తుండేవాడు. ఆయన అశ్వమేధ యాగం చేసి వదిలిపెట్టిన గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్లిపోయాడు. అశ్వo దొరకకపోతే తనకి మంచి జరుగదని మహర్షులు చెప్పారు. కానీ, అశ్వానికి బదులుగా ఒక మనుష్యుడిని న్యాయంగా తీసుకువస్తే యాగాన్ని పూర్తి చెయ్యవచ్చు అన్నారు.
ఒక మనిషిని తీసుకురావటం కోసం అంబరీషుడు బయలుదేరగా ఒక చోట, భరుగూతూంగమనే ఒక పర్వత శిఖరం మీద, రుచీకుడు అనే ఒక ఋషి, భార్యా పిల్లలతో కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆ అంబరీషుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నా యాగాస్వాం అపహరణకి గురైనందున నాకు ఒక యాగపశువు కావాలి. మీకు ఉన్న పిల్లలలో ఒకడిని ఇచ్చి నన్ను అనుగ్రహించండి అన్నాడు.

అప్పుడా రుచీకుడు ఇలా అన్నాడు," పెద్ద కొడుకు ధర్మాసంతానం, శాస్త్రం ప్రకారం చిట్టచివరి వాడిని ఇస్తే ఐశ్వర్యం పోతుంది కావున నేను వారిని ఇవ్వలేను. అప్పుడు మధ్య కొడుకైన శునఃశెవుడు అంబరీషుడితో వస్తానన్నాడు.

రాజు బ్రతికి ఉంటే రాజ్యం బాగుంటుంది. రాజు బ్రతికి ఉండాలంటే, యాగం పూర్తవ్వాలి. యాగం పూర్తి చెయ్యటానికి తన కొడుకుని పంపాడు ఆ రుచీకుడు. అంబరీషుడు ఆయనకి లక్ష గోవులని దానంగా ఇక్చాడు. శునఃశెవుడిని తీసుకువెళ్తున్న అంబరీషుడు కొంత దూరం ప్రయాణించాక, విశ్రాంతి తీసుకుందాం అని ఒక చోట ఆగాడు. అప్పుడు అక్కడికి దగ్గరలో ఉన్న విశ్వామిత్రుడి ఆశ్రమాన్ని శునఃశెవుడు చూసాడు.

వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి తాను విశ్వామిత్రుని కి మేనల్లుడను అని చెప్పి, జరిగిన సంగతి అoతా చెప్పి తనకు తప్పస్సు చేసి స్వర్గానికి వెళ్ళాలి అని ఉందని చెప్పాడు. అది విన్న విశ్వామిత్రుడు తన కొడుకులను పిలచి వారిలో ఒకరిని యాగ పశువుగా వెళ్ళమని చెప్పాడు. కాని అతని పుత్రులు దానికి నిరాకరించటం తో కోపించిన విశ్వామిత్రుడు వారిని కూడా వశిష్టుడి కుమారుల జాతిలో పుట్టి వెయ్యి సంవత్సరాలు వాళ్ళ లాగా కుక్క మాంసం తింటూ బ్రతకండని శపించాడు.

అప్పుడాయన శునఃశెవుడి కి రెండు మన్త్రములని చెప్పి అతనికి యూపస్తంభానికి కట్టినప్పుడు జపించమనీ, అల జపించుటవల్ల బలి ఇవ్వకుండానే యాగఫలం లభిస్తుంది కనుక అతనిని వధిoచరు అని చెప్పాడు. శునఃశెవుడు అంబరీషుని వెంట వెళ్ళిపోయాడు. అప్పుడు తాను మరలా తన తపఃశక్తి ని తన కుమారులను శపించుటకు దుర్వినియోగం చేశాను అని తెలుసుకుని ఇంకా ఎవరితో మాట్లాడకూడదు అని నిర్ణయించుకుని మళ్లీ తపస్సు చెయ్యటం ప్రారంభించాడు.
ఒకనాడు స్నాన నిమిత్తమై పుష్కర క్షేత్రానికి వెళ్ళగా అప్పుడు అక్కడ స్నానం చేస్తున్న మేనక ను చూసి ఆమె సౌందర్యానికి ముగ్ధుడైనాడు.
ఆమెను ఒప్పించి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్లి ఆమెతో కాలం మరచిపోయాడు. కొంతకాలం తరువాత మళ్లీ తానూ తప్పస్సు మొదలుపెట్టిన విషయం గుర్తు వచ్చింది. తన తపస్సుని భంగం చేయటానికి దేవతలు ఈమెను పంపి ఉంటారు అని కోపం వచ్చినా అందులో ఆమె తప్పు ఏమిఉంటుంది అని భావించి ఈసారి ఉత్తర దిక్కుకి వెళ్ళి తపస్సు చెయ్యటం ప్రారంభించాడు.

ఉత్తర దిక్కున కౌశికి నది పక్కన కూర్చుని ఘోరాతిఘోర తపస్సు 1000 సంవత్సరాలు చేశాడు. అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మగారు ప్రత్యక్షమై మహర్షి వి అయ్యావు విశ్వామిత్రా అనిన్ చెప్పారు. కాని ఈ మాట విన్న విశ్వామిత్రుడికి ఏవిధమైన బాధ కానీ సంతోషం కానీ కలగలేదు. ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఇప్పటికీ మహర్షిని అయ్యాను. ఇక బ్రహ్మర్శిని ఎప్పుడో అవుతానో అని బ్రహ్మగారిని, నేను నా ఇంద్రీయాలని గెలిచానా అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, లేదు అని సమాధానం చెప్పారు.

ఇంతకాలం తపస్సు చేసిన కారణంగా విశ్వామిత్రుని పగ వశిష్టుడి మీద నుంచి తన ఇంద్రీయాల మీదకి వెళ్ళింది. తాను అనవసరంగా వశిష్టుడి మీద క్రోధాన్ని పెంచుకోవటానికి, మేనకతో కామానికి లొంగటానికి తన ఇంద్రీయాలే కారణమని గ్రహించాడు.మళ్లీ తపస్సు చెయ్యటం ప్రారంభించాడు. ఈ సారి పంచాగ్నుల మద్య తపస్సు చేశాడు. . విశ్వామిత్రుడు చేస్తున్న ఈ తపస్సుని చూసిన దేవేంద్రుడు ఆయనని పరీక్షించాలని రంభని పంపాడు.
మరుసటి రోజు విశ్వామిత్రుడు స్నానం చేద్దామని వెళుతుంటే, ఆయనకి అప్పుడే స్నానం చేసి బయటకొస్తున్న రంభ కనిపించింది. అయితే ఇదంతా ఇంద్రుడు తన తపస్సును భంగం చేయటానికి చేస్తున్న ప్రయత్నం అని గ్రహించి కోపంతో రంభను పదివేల సంవత్సరాలు రాయివై పడుండు అని శాపించాడు.తరువాత కొంతసేపటికీ మళ్లీ క్రోధానికి లోనైయ్యాడని గ్రహించి రంభ అడగకుండానే, ఒకనాడు ఒక బ్రహ్మాణుడు నీకు శాపవిమోచనం కలిగిస్తాడు అని అన్నాడు.

విశ్వామిత్రుడు ఈసారి తూర్పుకు వెళ్లి కుంభకం(యోగా లో ఒక క్రియ) ద్వారా తపస్సు చేయటం ప్రారంభించాడు. అలా వెయ్యి సంవత్సరాలు కుంభకంలో ఉండి తపస్సు చేసాడు. శరీరం లో బలం క్షీణించింది. కనుక దానిని నిలబెట్టుకోవటానికి ఒక్క ముద్ద ఏదైనా తినాలి అని అనుకుంటుండగా ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి, ఆకలిగా ఉంది కనుక ఏమైనా పెట్టమని అడిగాడు. వచ్చిన వాడు ఇంద్రుడు అని విశ్వామిత్రుడికి అర్ధం అయ్యింది. కానీ, ఈ సారి ఆయన ఇంద్రీయాలకి లొంగలేదు. ఇంద్రుడికి ఆ కబళాన్ని ఇచ్చి మళ్లీ కుంభకం లోకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.
అలా విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా తపోధూమo సమస్త లోకాలని కప్పేసింది. అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మగారు వచ్చి, "ఓ కౌశికా! నీ తపస్సుకి సంతోషించాను. నువ్వు బ్రహ్మర్షివయ్యావు. దేవతాలందరితో కలిసి నేను నిన్ను బ్రహ్మర్షి అని పిలుస్తున్నాను. నీకున్న సమస్త కోరికలు తీరుతాయి. నువ్వు దీర్ఘాయుష్మంతుడవై జీవిస్తావు" అన్నారు.

అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మ, "నేను బ్రహ్మర్షి అయిన మాట నిజమైతే, నాకు ఓంకారము, వశత్కారము వాటంతట అవి భాసించాలి అన్నాడు.అలాగే, ఎవరిమీద కోపంతో నేను బ్రహ్మర్షి అవ్వాలన్న పట్టుదలతో ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసానో, ఆ వశిష్టుడితో బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉందన్నాడు. బ్రహ్మసరే అన్నారు.

అప్పుడు దేవతలు వశిష్టుడిని తీసుకురాగా, ఆయన విశ్వామిత్రుడిని చూసి, బ్రహ్మర్షి విశ్వామిత్రా అని పిలిచారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ వశిష్టుడి కాళ్ళు కడిగి పూజ చేశాడు. ఏ వశిష్టుడి మీద కోపం తో ప్రారంభించాడో, ఆ వశిష్టుడి కాళ్ళు కడగటంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML