ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు
సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు
5, మార్చి 2018, సోమవారం
#కలియుగంలో_కలిపురుషుడు_ఎక్కడ_నివసిస్తున్నాడు
#కలియుగంలో_కలిపురుషుడు_ఎక్కడ_నివసిస్తున్నాడు
ద్వాపరయుగం ముగిసి కలియుగం ఆరంభంలో శ్రీకృష్ణుడు కొన్నాళ్ళు ఉండటం వలన కలిపురుషుడు రావడానికి భయపడి ఆగిపోయాడు. దేవతలు వెళ్లి కలిపురుషుడికి నీయుగం ఆరంభం అయింది. ఇంకా వెళ్ళలేదేంటి? అన్నారు. అప్పుడు కలి! శ్రీకృష్ణుడు ఉండగా నేను వెళ్ళలేను. అని మొరపెట్టుకోగా దేవతలందరూ కలిసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి కలిపురుషుడు రావడానికి భయపడుతున్నాడని తెలియసిన కొన్నాళ్ళకి కృష్ణుడు భూమండలం మీదనుండి పాదం తీసేశాడు. (అవతార సమాప్తి చేశాడు.) అప్పటికి పరిక్షిత్ (అర్జునుడి మనవడు, శ్రీకృష్ణుడి మేనల్లుడు) భారతదేశ చక్రవర్తిగా భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. పురుపురమనె ఊరులోకి కలి ప్రవేశించాడని తెలిసి పరిక్షిత్ మహారాజు ఆ గ్రామం వెళ్ళాడు. అక్కడ ఒకడు గోమాతని ఎగిరి కాలితో తన్నడంతో ఆ ఆవు మలమూత్ర విసర్జన చేసి క్రింద పడిపోయింది. అదిచూసి దూడ ఆవు దగ్గరికి వెళ్తుంటే దూడని కూడా తన్నాడు. అదికూడా అలాగే పడిపోయింది. ఇదంతా దూరం నుంచి గమనించిన పరిక్షిత్ పరుగుపరుగున వాడి దగ్గరికి వచ్చి! ఓరీ నీచ్యాధమా! ఎవరు నువ్వు? గోవు దేవతని తెలియదా? సకల దేవతలు ఈగొవులొ ఉన్నారు. అలాంటి గోమాతని కొడతావా? ఇప్పుడే నిన్ను చంపేస్తా అని కత్తి దూశాడు. వెంటనే కలిపురుషుడు. ఆగాగు పరీక్షిత్ చక్రవర్తి. నేనేవరనుకున్నావ్? కలిపురుషుడిని. ఇది నా యుగం. అనగానే ఓ నువ్వేనా కలిపురుషుడంటే.! నిన్ను ఈక్షణమే అంతమొందిస్తానని కత్తి దూయబోతే! మహారాజా నన్ను చంపితే కలియుగమనేదే ఉండదు. కృత, త్రేతా, ద్వాపర, కలి అని మేము నలుగురు అన్నదమ్ములం. మేము నాలుగు యుగములు. ఈ నాలుగు యుగములలో నేనే గొప్పవాడిని. ఎందుకు అనుకుంటావేమో చెప్తాను విను. కృతయుగంలో 1000సంవత్సరాల పైబడి తపస్సు చేస్తే ఆ దేవుడు కరుణించి వరం ఇస్తాడు. త్రేతాయుగంలో 500 ఏళ్ళ పాటు చేయాలి. ద్వాపరయుగంలో కొంచం తక్కువగా చేయాలి. అదే కలియుగంలో ధర్మబద్దమైన జీవితం సాధించాలి అని అనుకుంటే చాలు. దేవతలు వెంటనే కరుణించి ఆ దిశగా ప్రయత్నించడానికి అనుకూల వాతావరణం కల్పిస్తారు. అనుక్షణం వెంట ఉంటారు. అదే కలియుగపు గొప్పతనం. కనుక నన్ను సంహరిస్తే ద్వాపర యుగం గడిచిన వెంటనే కృతయుగం వచ్చి మానవులు తరించే అవకాశం కోల్పోతారు. కనుక అలోచించి ఏమి చేయమంటావో నువ్వే చెప్పు అన్నాడు. కొంతసేపు ఆలోచించిన పరిక్షిత్! నీకు 4 స్థానాలు ఇస్తాను. నువ్వు కేవలం ఆ నలుగు స్థానాలలో మాత్రమే ప్రవేశించు అనగానే సరే ఆ స్థానాలు ఏమిటో చెప్పమన్నాడు కలి.
1. ధనం,
2. బంగారం,
3. స్త్రీ,
4. మద్యం.
ఈ నాలుగు స్థానములు ఆక్రమించి ఉండు అని ఆ నాలుగు స్థానాలు ఇచ్చాడు. అప్పుడు కలి ఈ నాలుగు తో బాటుగా వీటిని ఆక్రమించిన మరో నాలుగు ఉన్నాయి. వాటితో కలిపి 8 స్థానాలు మహారాజ. ఏమిటి ఆనాలుగు స్థానాలు? చెప్తాను వినండి.
నువ్వు ఇచ్చిన వాటిలో మొదటిది ధనం దీనిని ఆక్రమించి ఉన్నది అహం. రెండోది బంగారం, దీనిని ఆక్రమించింది ఆశ. మూడోది స్త్రీ, దీనిని ఆక్రమించింది కోరిక, నలుగు మద్యం, దీనిని ఆక్రమించింది బుద్ది. కనుక ఈ ఎనిమిది స్థానాలు నావే అన్నాడు.
ధనం సంపాదించినవాడు ఇంకా ఇంకా అంటూనే ఉన్నారు. ఎన్నెన్ని మోసాలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఆడవారికి బంగారం మీద విపరీతమైన ఆశ. బంగారం కోసం గొంతులు కోస్తున్నారు. స్త్రీ అంటే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కలిపురుషుడు ఇంకోరూపం అని చెప్పేయొచ్చు. మగాడు ఎంత గింజుకున్నా ఆడది మాత్రం తన నిగ్రహం మాత్రం కోల్పోకుండా నిలబడి ఉంటుంది. మద్యం మత్తు ఎక్కితే ఏమిచేస్తారో, ఏమి మాట్లాడుతారో కూడా తెలియదు. ఏమి చేయడానికి వెనకాడటం లేదు.
ఇక్కడ చెప్పిన సమస్యలు కొన్నే. వీటిని ఆక్రమించిన దోషాలు ఇంకెన్నో. కనుక పైన చెప్పిన నాలుగు స్థానముల పై వీలైనంత ఆశ తగ్గించుకోండి. అలాగే భక్తి కలిగి ఉండండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి