బ్రాహ్మణులేం చేశారో చెపుతా తెలుసుకో....
...................................................................
పాణిని సంస్కృత వ్యాకరణం వ్రాశాడు.
ఆయన వ్రాసిన పద్ధతిలో కొన్ని భాషలకు వ్యాకరణాలు వ్రాశారని తెలుస్తోంది.
కణాద మహర్షి వైశేషిక తర్కశాస్త్రం రచించాడు.
దానిలో ప్రపంచం పరమాణువులతో నిర్మింపబడిందని తెలిపాడు.
గౌతముడు వ్యవసాయం చేసి కరవుతో బాధపడే వారికి అన్నం పెట్టాడు.
ఆయన కార్యకారణ భావాన్ని, పదార్థ లక్షణాలను తెలిపే న్యాయశాస్త్రం రచించాడు
. పతంజలి యోగసూత్రాలు వ్రాసి ఆరోగ్యం పొందడానికి దారిచూపాడు.
చరకుడు ఆయుర్వేదం ద్వారా జనం ఆరోగ్య రక్షణకు బాట ఏర్పరచాడు.
సుశ్రూతుడు శస్తచ్రికిత్స ద్వారా ఆరోగ్య రక్షణకు ప్రయత్నించాడు.
ధన్వంతరి ఆయుర్వేద మూల పురుషుడు,
అగ్నివేశుడు వైద్య గ్రంథకర్త,
అష్టాంగ హృదయకర్త వాగ్భటుడు.
అత్రి, భరద్వాజుడు, ఆత్రేయుడు, గౌతముడు మొదలైనవారు ఆయుర్వేద ప్రవర్తకులు.
ఆంగ్లేయ వైద్యము భారతదేశంలో ప్రవేశించడానికి పూర్వం ఈ ఆయుర్వేదమే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడింది గదా!
అత్రిముని ‘అందరు సుఖంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంతో ఉండాలి, అందరూ శుభం పొందాలి. ఒక్క రు కూడా దుఃఖం పొందకూడదు అని బోధించాడు.
దానికనుగుణంగా ఆయన భార్య అనసూయ కరవుకాలంలో పంట పండించి అందరికీ అన్నదానం చేసింది.
యాస్కు డు పదాల వ్యుత్పత్తిని తెలిపే నిరుక్తం రచించాడు.
ఆర్యభటుడు ఖగోళానికి చెందిన అనేక విషయా లు తెలిపాడు. భూమి తిరుగుతుందని చెప్పిన శాస్తవ్రేత్త ఆయన. భాస్కరుడు
లీలావతీ గణిత శాస్త్రాన్ని రచించారు.
చాణక్యుడు అర్థశాస్త్రం రచించాడు. ఆ జ్ఞానంతో వౌర్య చంద్రగుప్తుని ప్రభువుగా చేశాడు.
మహామంత్రి తిమ్మరుసు విజయనగర సామ్రాజ్యానికి చేసిన సేవలు ప్రసిద్ధాలు
ఇక లోకానికి ఆనందాన్ని కల్గించే కావ్యాలు, నాటకాలు, కృతులు రచించిన మహానుభావులు సంస్కృతంలోను, దేశ భాషలలోను వందల సంఖ్యలో ఉన్నారు.
ధ్వని మా ర్గాన్ని కనుగొన్న ఆనందవర్ధనుడు......
ఔచిత్య విచార చర్చ చేసిన క్షేమేంద్రుడు.....
అభిజ్ఞాన శాకుంతలం రచించిన కాళిదాసు....
నాట్యశాస్త్రాన్ని రచించిన భరతుడు,
నీతి శాస్త్రం రచించిన శుక్రుడు,
కామశాస్త్రాన్ని రచించిన వాత్స్యాయనుడు,
పంచతంత్రం ద్వారా నీతి బోధ చేసిన విష్ణుశర్మ వీరందరూ బ్రాహ్మణులే కదా!
కృషి పద్ధతిని రచించినవాడు పరాశరుడు....
సుధన్వోపాధ్యాయుడు ధనుర్వేద గురువులలో ఒకడు....
కృష్ణమాచార్యుడు ధనుర్విద్యా విలాసమునకు రచయిత.
సంగీత రత్నాకరాన్ని రచించినవాడు శార్జ్ధర దేవుడు.
రుద్రభట్టు స్వర నిర్ణయం రచించాడు.
శిల్ప శాస్త్రం గర్గపరాశరులవలన విశ్వకర్మకు లభించింది.
నీలకంఠ భట్టు, విశ్వనాథ దేవుడు, నరహరి భట్టు, విశ్వనాథ ద్వివేది శిల్పశాస్త్ర గ్రంథాలను వ్రాశారు.
మానసార ముని రచించినది మానసారం. ఇది గృహ నిర్మాణ విషయాలనేకం తెల్పింది.
ఇక తెలుగులో ......
నన్నయభట్టు మొదలయిన కవుల గురించి తెలిపితే అదో పెద్ద గ్రంథమవుతుంది. ఇవన్నీ సమాజానికి మేలు కలిగించేవి కావా?
రూపాయి చేతితో తాకకుండా సాధన చేసి ఏ మతం ద్వారానైనా పరతత్త్వాన్ని పొందుతారని నిరూపించి, విశ్వమత ప్రవక్త వివేకానందుని తయారుచేసిన రామకృష్ణ పరమహంస,
అమెరికాలో యోగమార్గం ప్రచారం చేసిన పరమహంస యోగానంద, భారతదేశంలో యోగ గంగను ప్రవహింపజేసిన రామ్‌లాల్ ప్ర భూజీ బ్రాహ్మణులే.
గడచిన శతాబ్దాలలో.....
సంఘ సంస్కర్త, మహారచయిత, కవి కందుకూరి వీరేశలింగం పంతులు...
తన సర్వస్వం దేశంకోసం సమర్పించిన టంగుటూరి ప్రకాశం పంతులు, వావిలాల గోపాలకృష్ణయ్య,
శాస్తవ్రిజ్ఞాన ప్రచారకులు కొమర్రాజు లక్ష్మణరావు పంతులు, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొప్ప ఇంజనీరు మోక్షగుండం విశే్వశ్వరయ్య, గొప్ప ఆయుర్వేద వైద్యులు, బహుగ్రంథకర్త, పండిత గోపాలాచార్యులు ఇలా ఎందరి పేర్లయినా చెప్పవచ్చు. ప్రతి రంగంలో వారి కృషి తరువాతి వారికి మార్గదర్శకంగా ఉండేలా చేసిన వారెందరో!
ఆధునికులలో గేయ కవులలో గురజాడ, శ్రీశ్రీ, ఆరు ద్ర, సాంప్రదాయక కవులలో కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్య ఇలా ఎందరినో పేర్కొనవచ్చు.
భారతదేశంలో ఏ పార్టీకి మెజార్టీరాని పరిస్థితిలో ప్రతిపక్షాల మద్దతు కూడగట్టి అయిదు సంవత్సరాలు మధ్యలో ఎన్నికలు రాకుండా నెట్టుకుని వచ్చిన పి.వి.నరసింహారావు, ఇలా ప్రతి రంగంలోనూ సమాజానికి మేలుచేసిన బ్రాహ్మణులనెందరినైనా చెప్పవచ్చు.
పత్రికా రంగంలో ముట్నూరి కృష్ణారావు, నీలంరాజు వెంకట శేషయ్య, భావరాజు నరసింహారావు మొదలైనవారు అంకితభావంతో పనిచేసినవారే. మచిలీపట్నంలో ముట్నూరి కృష్ణారావు, డాక్టర్ పట్ట్భా సీతారామయ్య, కోపల్లె హనుమంతరావు ఆంధ్ర జాతీయ విద్యాపరిషత్తు నెలకొల్పి, ఒకప్రక్క స్వాతంత్య్రోద్యమ కృషి కొనసాగిస్తూ జాతీయ విద్యావ్యాప్తికి కృషిచేశారు. ఆ ఊరిలో రాంజీ పంతులు హరిజనులలో విద్యావ్యాప్తికి అంకితమయ్యారు. ఆయన స్థాపించిన పాఠశాల ఇప్పటికీ నడుస్తున్నది.
ఇంతెందుకు? లోకమాన్య బాలగంగాధర తిలక్, మో తీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ ఆశయాలకు అంకితమయిన భూదానోద్యమం నిర్వహించిన తపస్వి వినోభాభావే, ఆ కాలంలోనే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నెలకొల్పిన మదనమోహన మాలవ్యా బ్రాహ్మణులే గదా! వీరందరు సమాజానికి చేసిన మేలు చాలదంటారా? ఇంతకంటే ఈ విమర్శకుల వర్గం సమాజానికి చేసిన అధికమైన మేలు ఏమిటి?
పూర్వం చేశారు కాని ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించవచ్చు. ఇపుడు బ్రాహ్మణులు జీవన పోరాటంలో ఉన్నారు. కాబట్టి ఎల్లాగో శ్రమపడి ఏదో దేశానికి వెళ్ళి తన చాకచక్యం, కృషి పట్టుదలతో జీవిస్తున్నాడు. అలా వెళ్ళలేనివారు బ్రతుకుబండి భారంగా ఈడుస్తున్నారు. మేధావి, సంపన్నుడు ఎలాగో జీవిస్తాడు. సామాన్యుని మాటేమిటి? పూర్వం ధర్మం, నీతి, దయ, అహింస వంటి సుగుణాలను అలవరచిన కాలంలో స్వాతంత్య్ర సంపాదనమో, సామ్యవాదమో పరమధర్మమని భావించి ఎందరో యువకులు తమ సర్వస్వం వెచ్చించి దానికి అంకితమయ్యారు. సంపన్నులు కొందరయినా తమ డబ్బు గుడికో, బడికో ఇచ్చి చెరువోనుయ్యో తవ్వించి జన్మధన్యమయిందనుకునేవారు. తమ డబ్బుతో పేదలకు సాయం చెయ్యడంవల్ల పేదలకు వారిపై గౌరవం ఉండేది. దాతలకు పుణ్యం, భగవదనుగ్రహం లభిస్తాయనే తృప్తిఉండేది. ఇపుడు పాప పుణ్య విశ్వాసాలు తొలగిపోతున్నాయి. గుడులకు వెళ్ళినా కోరికలు తీరడానికి తప్ప, భగవదనుగ్రహంకోసం అనే పద్ధతి తగ్గింది.
ఇప్పుడు అకారణంగా బ్రాహ్మణులు సోమరులని, వీరి కులం ఉత్పత్తికి సంబంధించినది కాదని, వారు పేద వారైనా సహకరించవద్దని ప్రచారం చేస్తే బాధ, ద్వేషం కలగడం తప్ప దానివల్ల సమసమాజం రాదు. పూర్వం గురుస్థానాల్లో ఉన్న వర్గం ధర్మం చెబితే సమాజం పాటిం చేది. ఇప్పుడు తల్లిదండ్రులనే అనాధాశ్రమాల్లో చేర్పిస్తు న్నారు. రామా యణ, భారతాలు చదివితే మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, శౌచం, ఓరిమి, జ్ఞానం, సత్యం పల కం, పరిశుద్ధత, అహింస, దయ, దొంగతనం చేయక పోవడం ఇలాంటి సుగుణాలు అవలర్చుకోవాలని తెలుస్తాయ. అందువల్ల జనహితం కోరేవారు విశాల హృదయంతో సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలి. అంతేకాని ఒక కులాన్నో, వర్గాన్నో నిందిస్తే జరిగే పనా ఇది.
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు
సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు
5, మార్చి 2018, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి