ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు
సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు
5, మార్చి 2018, సోమవారం
ఏకాదశి ఫలములు:
ఏకాదశి ఫలములు:
ఏకాదశి వ్రతమును గురించి తెలియని వారు ఉండరు. శ్రీ మహావిష్ణువు ప్రీతీ కొరకు ఏకాదశి వ్రతమును పాటిస్తారు. ఆషాఢమాసం లో వచ్చే తొలి ఏకాదశి మొదలుకొని సంవత్సరంలో వచ్చే అన్ని ఎకాదశులకు వివిధ నామాలు, వాటియొక్క ఫలితములు తెలుసుకొందాం;
*1. ఆషాఢ శుద్ధ ఏకాదశి: శయనైకాదశి.: (తొలి ఏకాదశి ): దక్షిణాయన ప్రారంభం: ఆయుర్వృద్ధి.
2. ఆషాఢ బహుళ ఏకాదశి : కామ్యైకాదశి : ఇష్ట కామ్యార్ధ సిద్ది.
3. శ్రావణ శుద్ధ ఏకాదశి: పుత్రదైకాదశి: పుత్ర సంతాన ప్రాప్తి.
4. శ్రావణ బహుళ ఏకాదశి: అజైకాదశి: సమస్త దు:ఖల నుండి విముక్తి
5. భాద్రపద శుద్ధ ఏకాదశి: పరివర్తన ఏకాదశి: అసంపూర్ణంగా ఉండిపోయిన పనులు పూర్తి అగును.
6. భాద్రపద బహుళ ఏకాదశి. ఇంద్ర ఏకాదశి: ఇంద్ర భోగములు సమకూరును
7. ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి. మహార్జయ ఏకాదశి: సర్వత్రా విజయం;
8. ఆశ్వయుజ బహుళ ఏకాదశి: రామైకదసి: ఎంచుకున్న రంగంలో విజయం;
9. కార్తీక శుద్ధ ఏకాదశి: ఉత్థాన ఏకాదశి: ఈరోజు చేసే దాన ధర్మాల వాళ్ళ అనంతమైన పుణ్యం లభిస్తుంది.
10. కార్తీక బహుళ ఏకాదశి : ఉత్పత్తైకాదశి : అఖండమైన పుణ్యం .
11. మార్గశిర శుద్ధ ఏకాదశి: ఉత్తమైకాదశి: ( ధ్రువ ఏకాదశి) తృప్తి, స్థిర చిత్తం; కలుగుతాయి.
12. మార్గశిర బహుళ ఏకాదశి: సఫలైకాదసి అనూహ్య ఫల ఏకాదశి ): జీవిత గమనాన్ని మార్చివేసే ఉపకారం జరుగుతుంది.
13. పుష్య శుద్ద ఏకాదశి: మోక్షన్య ఏకాదశి: వైకుంఠ మోక్షం, విష్ణు సాయుజ్యం.
14. పుష్య బహుళ ఏకాదశి: షట్ తిలైకదసి: శని దోషాలు హరించును.
15. మాఘ శుద్ధ ఏకాదశి: జయ ఏకాదశి: }
16. మాఘ బహుళ ఏకాదశి: విజయ ఏకాదశి } సర్వత్రా విజయం.
17. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి: అమలక ఏకాదశి: పతితోద్ధారణం
18. ఫాల్గుణ బహుళ ఏకాదశి: పాప విమోచన ఏకాదశి: పాప సంహారము.
19. చైత్ర శుద్ధ ఏకాదశి: కామదా ఏకాదశి: అభిష్ట సిద్ది:
20. చైత్ర బహుళ ఏకాదశి: వరూధిని ఏకాదశి: గో సహస్ర దాన ఫలం
21. వైశాఖ శుద్ధ ఏకాదశి: మోహిని ఏకాదశి: వశీకరణ శక్తి
22. వైశాఖ బహుళ ఏకాదశి: అపర ఏకాదశి: తీర్థ యాత్రా ఫలం
23. జ్యేష్ట శుద్ధ ఏకాదశి: నిర్మల ఏకాదశి: }
24. జ్యేష్ట బహుళ ఏకాదశి: యోగిన్యేకదశి: } సర్వరోగ హరణం..
ఇవి సంవత్సరంలోని ఏకాదశి ఫలితములు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి