ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు
సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు
5, మార్చి 2018, సోమవారం
ఆయన దర్శన భాగ్యం కలగడం ఎన్ని జన్మల పుణ్య ఫలమో ? బాలా త్రిపుర సుందరీ మంత్ర మహాయోగి –శ్రీ తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రిగారు .
ఆయన దర్శన భాగ్యం కలగడం ఎన్ని జన్మల పుణ్య ఫలమో ?
బాలా త్రిపుర సుందరీ మంత్ర మహాయోగి –శ్రీ తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రిగారు .
‘’నాకోసం మీరు కంచి కి ఇంత దూరం రావలసిన పని లేదు .చందోలు లో లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారున్నారు కదా !ప్రతి గురువారం వారిని దర్శించండి ‘’అని కంచి కామ కోటి పీథ పరమా చార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర యతీంద్రుల వారు చెప్పారు అంటే శాస్త్రి గారి యోగ సిద్ధి మహిమ ఎంతటి దో మనకు అర్ధమవు తుంది .
గుంటూరు జిల్లా చంద వోలు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి ,హనుమమ్మ దంపతులకు శాస్త్రి గారు1896 ఆగస్ట్ ఇరవై అయిదున లో జన్మించారు .నిష్టా గరిష్ట కుటుంబం వారిది .చంద వోలు శాస్త్రి గారని అందరు పిలుస్తారు .తాడి కొండ వాసి కేదార లింగం గారు ‘’బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని ‘’వీరికి ఇచ్చారు .పదహారో సంవత్సరం దాకా ఆ మంత్రోపాసన చేసి నందు వల్ల అమ్మ వారు వీరికి పిలిస్తే పలికేది .దెందు కూరి పాన కాల శాస్త్రి వద్ద తర్కం ,పొదిలి సీతా రామ శాస్త్రి వద్ద మంత్రం నేర్చారు .యవ్వనం లోనే సన్య సించాలి లనే కోరిక కలిగింది .శ్యామ లాంబ అనే యోగిని వీరి తండ్రి గారితో శాస్త్రి గారు సూర్య మండలాన్తర్వర్తి అయిన మహా సిద్ధుడు ఈ రూపం లో జన్మించాడని చెప్పింది .శాస్త్రి గారికి చిన్న తనం లో పిన తల్లి చూపించిన ఒక దృశ్యం గోచ రించింది .అందులో తాను ఒక సిద్ధుడు శ్రీ చక్రేశ్వారి అయిన కామేశ్వరి దూరం గా ఉన్న యువతుల్ని తీసుకు రమ్మన్నది .ఒకరిని మోసుకొని ఇద్దర్నీ తీసుకొచ్చాడు .అమ్మ వారు చిరు నవ్వు తో అతని మనసు కొంచెం చలించింది అని భూలోకం లో జన్మించమని తాను మోసుకొచ్చిన అమ్మాయే భార్య అవుతుందని అన్నది .19 వ ఏట అద్దేపల్లి మంగమ్మ ,పాపయ్య శాస్త్రుల కూతురు పార్వతి తో వివాహ మైంది .పిన్ని చూపించింది కూడా ఈమెనే .ఆమె పేరు ను శ్రీ దేవి గా శాస్త్రి గారు మార్చారు .
పాండిత్య ప్రకర్ష
శాస్త్రి గారు తండ్రి గారి వేద పాథ శాల నిర్వహణ లో తోడు పడుతూ ఉన్నారు .అయన పద్ధతి నచ్చిన చాలా మంది అమెరికా కు రమ్మన్నారు .వారికి ఇష్టం లేదు .పిన పాటి వీరభద్రయ్య తో నేత్రావధానం ,ఎలేశ్వరపు పురుషోత్తమ శాస్త్రి తో కవిత్వ సాధన చేశారు .అప్పటికే అనేక సభల వారు శాస్త్రి గారికి 400 కు పైగా సర్టి ఫికేట్స్ ఇచ్చారు .వ్యాకరణ గురువు గారు ముదిగొండ నాగ లింగ శాస్త్రి గారి తో అనేక అవధానాలు చేసి ,ఆ డబ్బు అంతా గురువు గారికే సమర్పించారు .పుష్పగిరి పీథా ది పతులు శ్రీ చంద్ర శేఖర భారతీ స్వామి సన్నిధి లో జరిగిన అష్టావదానికి వారు మెచ్చి ఉభయ శ్లేషకు లక్ష్యం గా ఒక శ్లోకం చెప్ప మంటే ఆశువుగా అద్భుతం గా చెప్పి ఒప్పించారు.
అమ్మ వారి సాక్షాత్కారం
దేశ సంచారం చేస్తూ ఒక సారి ఇంటికి వస్తే ఇల్లు ‘’అయ్యవారి నట్టిల్లు ‘’లా ఉంది .ఇంటి వద్దే ఉండి తండ్రికి తోడ్పడ్డారు .తిండికి గడవని పరిస్థితి .మూడు రోజులు అంతా ఉపవాసమే .మూడవ రోజు రాత్రి 27 సార్లు లలితా సహస్ర నామ పూజ చేసి నైవేద్యం పెట్టిన జలాన్నే త్రాగి అన్గోస్త్రం నేల మీద పరచి నిద్ర పోయారు .10 ఏళ్ళ బాలిక కలలో కన్పించి ‘’ఒర్ ! ముష్టి పె డ తాను .కొంగు పట్టు ‘’అన్నది .దోసెడు బియ్యం కొంగు లో పోసి ‘’బండి వస్తుంది .అందులో కావలసిన సామగ్రి అంతా వస్తుంది ‘’అన్నది .తెల్లారే సరికి ఖాజీ పాలెం సీతా రామ రాజు గారి బండి వచ్చింది .అక్కడ రాజు గారు కోరిన మీదట పురాణం చెప్పి రాత్రి ఇంటికి వచ్చే సరికి తలుపు దగ్గర రాజు గారు పోయించిన పుట్టెడు ధాన్యపు రాశి కన్పించింది . అప్పటి నుంచి శాస్త్రి గారింట లక్ష్మీ దేవి నిత్య సాక్షాత్కారమే .
అనేక గ్రామాలలో భాగవతం ,హరి వంశం ,పురాణం చెబుతూ రాత్రికి ఇంటికి చేరే వారు .పరమ నిష్టా గరిష్టం గా జీవించే వారు .ప్రాణాయామం తపస్సు కోన సాగించారు .ఇంట్లో వేరు సెనగ నూనె, వేరు సెనగ వాడ లేదు .దొండకాయ ,టమేటా ,బంగాళా దుంప ,ముల్లంగి కాబేజీ ,నిశిధం .కాశీ కి తప్ప ఎప్పుడు రైలు ప్రయాణం చేయ లేదు .శాస్త్రి గారికి మగ సంతానం లేదు
అష్ట సిద్దులు కైవశం
శాస్త్రి గారికి అష్ట సిద్ధులు వశ మైనాయి .వాటిని స్వంతానికి ఎప్పుడు వాడుకో లేదు .తాడి కొండ వేద పాథ శాలలో దేయాలు తిరిగి ఇబ్బంది పెడుతుంటే శాస్త్రి గారు మంత్రం పఠించి పార ద్రోలారు .ఒక సారి ‘’వశ్యంకర ఔషధి ‘’ని సేకరించాలని చంద్ర గ్రహణం రోజున కొండ ఎక్కి ,దాన్ని గుర్తు పట్టి తీసుకొందామని దగ్గరకు వెళ్తే ఒక బాలుడు అడ్డుకొన్నాడు .బలవంతాన లాక్కో బోతే ‘’నీకు ఈ మొక్క తో పని లేదు .నీ ముఖం చూస్తేనే అందరు వశు లౌతారు ‘’అన్నాడు .ఇంతలో గ్రహణం వదిలింది .బాలుడు మాయమయ్యాడు .తనకు దాన్ని పొందే యోగం లేదని భావించారు .అది దత్తాత్రేయ స్వామి అది పతి గా ఉన్న ఓషధి .పూర్వ జన్మ సఖుడైన ఒక యోగి కన్పించి సుఖ దుఃఖాలను సమానం గా భావించాలని చెప్పి మళ్ళీ 50 ఏళ్ళ కు కని పిస్తానని చెప్పి వెళ్లాడు .సరిగ్గా యాభై ఏళ్ళ తరువాత శాస్త్రి గారు అమరావతి వెళ్లి అమరేశ్వర స్వామిని దర్శించి తమ గదిలో ప్రాణాయామం చేస్తూ చాలా పైకి లేచి తల క్రిందులు గా పడి పోతుంటే తల నే లకు తగిలే సమయాన ఆయోగి వచ్చి చేయి అడ్డం పెట్టి కాపాడాడు .శాస్త్రి గారు నమస్కరించ గానే యోగి అదృష్యుడైనాడు .
తండ్రి గారు మొదలు పెట్టిన ‘’శ్రీ రామ కదామృతం ‘’ను వారి మరణానంతరం శాస్త్రి గారు పూర్తీ చేస్తున్నారు అయోధ్యా కాండం లో గాయత్రీ మంత్రం లోని ‘’భకార’’వర్ణం తో పద్యం రావటం లేదు .అమ్మను ఉపాశించి నిద్ర పోయారు .కలలో ఒక బీబీ జగన్మోహిని నిద్రిస్తుండగా 30ఏళ్ళ గడ్డం వాడొకడు ఆమె చొక్కా పైకెత్తి పాలు తాగుతున్నాడు .శాస్త్రి గారు ఆ దృశ్యం చూస్తుంటే ‘’ఎందుకు నిల బద్దావు ‘’?అని అడిగింది .’’నాకూ పాలు ఇస్తావా ?’’అని అడిగారు .మెలకువ వచ్చి ‘’భర్మ మయ రమ్య హర్మ్యము ‘’అనే భ వర్ణం తో పద్యం తేలిగ్గా వచ్చింది
ఒక సారి పుస్తక ముద్రణ కోసం చందాలకు తిరుగుతూ ఉంటె సత్తెన పల్లి లో ఒక బ్రాహ్మణుల ఇంట్లోకి ఇరవైయేళ్ళ యువతీ కని పించి ,నమస్కరించి లోపలి వెళ్ళింది .ఆమె గ్రహ పీడి తురాలు .అందర్ని కొడుతూ ,తిడుతూ ఉండేది .అలాంటిది శాస్త్రి గారిని చూడగానే అత్యంత వినయాన్ని ప్రదర్శించటం ఇంట్లో వారందరికి ఆశ్చర్యం కలిగించింది .ఆమెను గ్రహ ప్రేరణ చేసి ‘’ఏం చేస్తే నువ్వు పోతావు /’’అని అడిగారు .’’సహస్ర గాయత్రీ జప ఫలం ధార పోస్తే పోతాను ‘’అంది .శాస్త్రి గారు సహస్ర గాయత్రి జపం చేసి ధార పోశారు .ఇంటి ముందున్న వేప చెట్టు కొమ్మ విరిగి పడింది .దెయ్యం వదిలింది .వేరొక సారి నాగుల చవితి రోజు కాలవ లో స్నానం చేసి వస్తుంటే నాగలి చాలులో పడుకొన్న నాగు పాము తోక పై ఆయన కాలు పడింది .అది బుసలు కొడుతూ పైకి లేచి కాటు వెయ బూనితే ‘’గారుడ మంత్రం ‘’జపించారు .సర్పం తల నేల కు వాల్చింది .’’స్వామీ !నీ జోలికి నేను రాలేదు .నా జోలికి నువ్వు రావద్దు .పోర పాటున నా కాలు తగిలింది .వెళ్లి పొండి ‘’అనగానే పాము వెళ్లి పోయింది .ఆ రోజంతా గారుడ మంత్రం పతిస్తూనే ఉన్నారు .
శాస్త్రి గారు 90 ఏళ్ళ జీవిత కాలం లో 80 ఏళ్ళు ‘’బాలా మంత్రానుష్టానం ‘’చేసిన మహనీయులు .ఒక సారి కాశీ లో గంగా స్నానం చేస్తుంటే గంగా దేవి’గలగలా లాడే బంగారు చ్గాజులున్న చెయ్యి చూపించి ‘’నాకేమి కానుక తెచ్చావు ?’’అని అడిగింది .శాస్త్ర్రి గారికి ఏమీ పాలు పోక తన వ్రేలికున్న బంగారు దర్భ ఉంగరం తీసి ఆమె చేతి లో పెట్టారు .బసకు తిరిగి వచ్చి దేవతార్చన పెట్టె తెరిస్తే గంగకు అర్పించిన ఉంగరం అందులోనే ఉంది .తానేమైనా పొరపడి దర్భ ఉంగరం ఇవ్వలేదా అని సందేహించి ధ్యాన నిమగ్న మయ్యారు ..గంగమ్మ కని పించి ‘’కానుక ఇమ్మంటే దర్భ ఉంగరం ఇచ్చా వేరా ?’’అన్నది .’’అది నీకు పితృ తర్పణం చెయ్యటానికి ఉప యోగ పడుతుంది కాని నాకు ఆభరణం ఎలా అవుతుంది ?’’అని గద్దించింది .’’అమ్మా నేనేమీ నీ కోసం తేలేదు .ఆ సమయానికి అది స్పురించి ఇచ్చానంతే .’’అన్నారు .మళ్ళీ గంగమ్మ ‘’నీ భార్యదగ్గర నాకోసం తెచ్చిన నగ ఉంది అది తెచ్చివ్వు ‘’అన్నది గంగ .శాస్త్రి గారు భార్యను అడిగి నగను తీసుకొని పోయి ‘’గంగార్పణం ‘’చేశారు .
ఆయన తన కార్య క్రమాలన్ని ముగించుకొని వాకిలి అరుగు మీద కూర్చుంటే వందలాది మంది వచ్చి తమకు ముహూర్తం పెట్టమనో ,పేరు పెట్టమనో అడిగే వారు .కాసేపు కళ్ళు మూసుకొని ముహూర్త న్నిర్ణయం చేసే వారు .అంతే .ఆ కార్య క్రమం శుభప్రదం గా జరిగి పోయేది .దానికి తిరుగు లేదు .అదీ వారి మంత్ర సిద్ధి.
దాదాపు ముప్ఫై ఏళ్ళ క్రితం కాంచీ పరమాచార్యులు ఉయ్యూరు కే’సి’పి’వారి ఆహ్వానం ,గురజాడ లోని చల్లా శర్మ గారు ఏర్పాటు చేసిన కార్య క్రమం లో వారం రోజులున్నారు .అప్పుడు రాఘవ శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు అన్ని రోజులు .అప్పుడు వారిని చూశాను .జగద్గురువుల ను వీరినీ ఒకే సారి చూసే భాగ్యం కలిగింది .అప్పుడే ‘’నడయాడే దైవం ‘’అని పరమా చార్య మీద పుస్తకం ఆవిష్కరణ జరిగి నట్లు జ్ఞాపకం .10-12-1990ప్రమోదూత మార్గ శిర బహుళ నవమి నాడు శాస్త్రి గారు బాలా త్రిపుర సుందరి అమ్మ వారి ఒడిలోకి శాశ్వతం గా చేరి పోయారు .వారి పార్ధివ దేహానికి అగ్ని సంస్కారం చేస్తున్నప్పుడు అమ్మ వారి ఆకారం గా చితి మంటలు ఆకాశానికి లేవటం ఎందరో చూసి పరమాద్భుతం గా వర్ణించారు .శాస్త్రి గారు కారణ జన్ములు.
వారి పేరు వింటే చాలు సకల శుభాలు జరుగుతాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి