.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

5, మార్చి 2018, సోమవారం

సమస్యలు - సాలిగ్రామ పూజ



సమస్యలు - సాలిగ్రామ పూజ




ఒకసారి శ్రీవైష్ణవ భక్తురాలు ఒకామె పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చింది. ఆమె సాంప్రదాయం ప్రకారం స్వామికి నమస్కరించి ఎదురుగుండా నిలుచుంది. అప్పుడు అక్కడ అంత రద్దీగా లేదు. ఆవిడ కళ్ళల్లో నిరీక్షణ, నమ్మకం, ఆరాటo ఎవరైనా ఇట్టే కనిపెట్టేయొచ్చు.




ఆమె సంసారం సమస్యల సుడిగుండంలా ఉంది. కుటుంబం మొత్తం రోగాలతో అల్లాడుతోంది. కూతురికి పెళ్ళై ఏడెనిమిదేళ్ళు గడచినా పిల్లలు కలగలేదు. మరో అమ్మాయికి యుక్తవయస్సు దాటిపోతున్నా పెళ్ళి కావడం లేదు. చదువుపై శ్రద్ధ పెట్టక పాడైపోతున్న కుమారుడు, ఆర్థిక సమస్యలు ఇలా ఏన్నో. ఆమె వీటికి పరిహారం కోసమై కేరళలోని ఒక జ్యోతిష్య నంబూద్రిని సంప్రదించి సలహా అడుగగా, పితృదేవతలను నిర్లక్ష్యం చేయడం వలన కలిగిన దుష్పలితాలు అని తెలుసుకుంది. పితృదేవతలకి సరిగ్గా కర్మలు చేయకపోవడం వల్ల ఆమెని రామేశ్వరం వెళ్ళి ఆ కార్యాలు చేయమని చెప్పారు. తను శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందినందున రామేశ్వర యాత్ర, అక్కడ చేసే ప్రాయశ్చిత్త కర్మలూ వారికి నిషిద్ధం.




“నాకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. నా సాంప్రదాయాన్ని ధిక్కరించలేను. అలా అని నా సమస్యలకు పరిష్కారం తెలిసీ, చెయ్యకుండా ఉండలేను. నా సమస్యలు తొలగిపోవాలి. పెరియవ నాకు ఒక మార్గం చూపాలి” అని ప్రాధేయపడింది.




”మీరు టెంకలై తెగకు చెందినవారా?” అని అడిగారు స్వామివారు.




“అవును పెరియవ”




“ఉప్పునీళ్ళు, గోమయం కలిపిననీరు, జటల నుండి జారిన నీరు మీ సాంప్రదాయమునకు వర్జనీయములు కదా”




“అవును పెరియవ. ఉప్పునీరు, పేడనీళ్ళు, జటలనీరు మా అమ్మగారు పరిగణించేవారు కాదు”




“అవును సరిగ్గా ఇదే! రామేశ్వరంలో సముద్రస్నానం ఉప్పునీరు, పంచగవ్యప్రాశనం పేడనీరు, గంగా స్నానం పరమశివుని జటలనుండి వచ్చిన నీరు. మీ సాంప్రదాయం అనుమతించకపోతే మీరు రామేశ్వరం వెళ్ళవలసిన పనిలేదు. ప్రతిరోజూ ఉదయం శాస్త్రప్రకారం సాలిగ్రామ పూజ చేసి తీర్థప్రసాదాలు స్వీకరించండి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి. పళ్ళు, పాలు, ఉడికిoచిన దుంపలు తీసుకోవచ్చు. ఆరోజు మీ భర్త ద్వాదశ పుండ్రాలను ధరించి పూజ చెయ్యాలి. మరుసటి రోజు ద్వాదశినాడు తెల్లవారుఝామునే పూజ ముగించి తులసి తీర్థము, ప్రసాదం స్వీకరించి పారణ చేయండి. ప్రతిరోజూ ఒక ఆవుకి చేతినిండుగా గ్రాసం పెట్టండి. ఇవన్నీ చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది” అని చెప్పారు స్వామివారు.




మహాస్వామివారు ఇలా ఒక్కొక్కమాట చెబుతుంటే, ఆమె పెదవులు అదురుతుండగా, బయటకు రాని నీళ్ళవల్ల కళ్ళు మెరుస్తుండగా వింటోంది. “ఇది నాకు సాక్షాత్తు నారాయణుడే ఆజ్ఞాపించినట్టుగా భావిస్తాను. పెరియవ రామేశ్వరం వెళ్ళమంటారేమో అని నేను చాలా కలవరపడ్డాను. మహాస్వామివారి మనస్సు స్ఫటికం వలె స్వచ్ఛమైనది. నాకు ఒక మంచి మార్గాన్ని చూపారు” అని అన్నది.




ఆమె ప్రసాదం తీసుకొని వెళ్తున్నప్పుడు ఆమె ముఖం స్ఫటికంలా చలా నిర్మలంగా భాసించింది.




[విష్ణువును ఆరాధించే తమిళ బ్రాహ్మణులు వైష్ణవులు. వీరినే అయ్యంగార్లు అని అంటారు. అయ్యర్లు శైవులు. వైష్ణవులలో టెంకలై, వడకలై అని రెండు తెగలు. వడకలై సాంప్రదాయాన్ని ప్రారంభించినవారు శ్రీ వేదాంత దేశికులు. ‘U’ నామం ధరించేవారు వడకలై వారు, ‘Y’ నామం ధరించేవారు టెంకలై వారు]




అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।




--- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML