.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

14, మార్చి 2018, బుధవారం

భీష్మ పర్వము – 15 అయిదవ రోజు యుద్ధం - ii

భీష్మ పర్వము – 15
అయిదవ రోజు యుద్ధం - ii

ఇది చూసిన సాత్యకి క్రూర బాణములను భీష్మునిపై గుప్పించాడు.  భీష్ముడు కుపితుడై సాత్యకి సారధిని చంపాడు.  సాత్యకి రథం ఊగిసలాడింది.  రధముకు కట్టిన గుర్రములు కకావికలై పోగా వికల రధుడైన సాత్యకితో పోరు సల్ప ఇష్టపడక భీష్ముడు అతడిని విడిచి పాండవ సైన్యాలపై తన ప్రతాపం చూపసాగాడు.  ఇంతలో విరాటుడు భీష్ముని ఎదుర్కొని మూడు బాణాలతో భీష్ముని కొట్టాడు.  భీష్ముడు ఆ బాణములను మధ్యలో త్రుంచి పది బాణములతో విరాటుని కొట్టాడు.  భీష్ముని ఎదుర్కోవడానికి వచ్చిన అర్జునునికి అశ్వథ్థామ అడ్డం వచ్చి ఆరు బాణములతో అర్జునుని కొట్టాడు.  అర్జునుడు నవ్వుతూ అశ్వథ్థామ విల్లును విరిచాడు.  అశ్వథ్థామ మరొక విల్లందుకుని అర్జునుని మీద శరపరంపర కురిపించాడు.  అశ్వథ్థామ అస్త్ర, శస్త్ర ధాటికి నరనారాయణులు బాగా నొచ్చుకున్నారు.  కుపితుడైన అర్జునుడు అశ్వథామ శరీరాన్ని బాణాలతో కొట్టి రక్తసిక్తం చేసాడు.  భీష్ముని ఎదుర్కొన్న భీముని సుయోధనుడు అడ్డుకుని అయిదు బాణములు ప్రయోగించి భీముని కవచాన్ని ఛేదించాడు.  ఇరువురి మధ్య పోరు తీవ్ర రూపం దాల్చింది.  సుయోధనునికి సాయంగా భీష్ముడు, చిత్ర సేనుడు, పురుమిత్రులు వచ్చారు.  వారిని అభిమన్యుడు సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు.  అభిమన్యుని బాణములను వారిరువురు సమర్ధవంతంగా ఎదుర్కొని అభిమన్యునిపై బాణవర్షం కురిపించాడు.  అభిమన్యుడు కోపించి వేసవిలో అడవిని దావాగ్ని దహించిన విధంగా బాణపరంపర ప్రయోగించి చిత్ర సేనుని విల్లు విరిచి అతడి రధాశ్వాలను చంపాడు.  అలా పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్న అభిమన్యుని సుయోధన కుమారుడైన లక్ష్మణ కుమారుడు ఎదుర్కొన్నాడు.

అభిమన్యుడు ముందు లక్ష్మణుని గుర్రములను చంపి తరువాత సారధిని చంపి అతని రధమును విరుగ కొట్టాడు.  విరధుడైన లక్ష్మణుడు శక్తి బాణమును అర్జునిపై ప్రయోగించాడు.  అభిమన్యుడు దానిని మధ్యలోనే విరిచి లక్ష్మణుని శరీరం తూట్లు పడేలా బాణ ప్రయోగం చేసాడు.  ఇది గమనించిన కృతవర్మ లక్ష్మణుని తన రథంపై ఎక్కించుకుని తీసుకు పోయాడు. సుయోధనుడు తన సేనలను పోరుకు ఉత్సాహపరిచాడు.  భీష్ముడు పాండవ సేనను దునుమాడ సాగాడు.  సాత్యకి తన శరములతో కౌరవ సేనలను చికాకు పరుస్తున్నాడు.  ఇది గమనించిన సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఎదుర్కొని సాత్యకిని చికాకు పరిచాడు.  సాత్యకి పుత్రులు భూరిశ్రవుని ఎదుర్కొని "భూరిశ్రవా!  నీతో యుద్ధం చేసి వినోదించడానికి వచ్చాము.  కనుక మాలో ఒకరిని ఎన్నుకుని నీ పరాక్రమం చూపించు" అన్నారు.  భూరిశ్రవుడు "మీరంతా ఒక్కటిగా వచ్చినా నాకు భయం లేదు" అన్నాడు.  వారంతా ఒక్కుమ్మడిగా బాణవర్షం భూరిశ్రవునిపై కురిపించగా భూరిశ్రవుడు వారిని శరపరంపరలో ముంచెత్తాడు.  వీరోచితంగా పోరాడుతున్న సాత్యకి పుత్రులను భూరిశ్రవుడు వారి తలలు నరికి నేల కూల్చాడు.  ఇది చూసిన కౌరవ సేనలోఉత్సాహం పెల్లుబికింది.  తన కుమారుల మరణం సాత్యకిని ఆగ్రహోదగ్రుని చేయగా కౌరవ సేనపై విరుచుకు పడి దొరికిన వారిని దొరికినట్లు చంపి భూరిశ్రవుని రధాశ్వములు, సారధిని చంపాడు.  భూరిశ్రవుడు కూడా సాత్యకి రథం విరుగ కొట్టాడు.  ఇరువురు నేల మీదకు దుమికి కరవాలంతో యుద్ధం చేయసాగారు.  ఇంతలో సాత్యకిని భీముడు, భూరిశ్రవుని సుయోధనుడు తమ తమ రధములపై ఎక్కించుకుని తీసుకు వెళ్ళారు.  అర్జునుడు కౌరవ సేన మీదకు దూకి తన శరపంపరతో కౌరవ సేనుని నుగ్గు నుగ్గు చేసాడు.  సూర్యుడు పశ్చిమాద్రికి చేరుకుంటున్న తరుణంలో భీష్ముని ఆదేశంతో ఆనాటి యుద్ధం ముగిసింది.

Virus-free. www.avast.com

1 కామెంట్‌:

Powered By Blogger | Template Created By Lord HTML