.

.

గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

Monday, March 5, 2018

#వేదవ్యాసుడి_జననం..#వేదవ్యాసుడి_జననం..

చేది దేశం అని ఒక దేశం ఉన్నది (ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది). కాంధారి దేశం ఇప్పుడు కాంధహార్ అయ్యింది. (శకుని పాలించాడు దీన్ని). మద్రదేశం ఇప్పుడు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ అయింది. కాలిఫోర్నియా ని కపిలారణ్యం అనేవారు. కపిల మహర్షి అక్కడి నుండి ఇక్కడికి వచ్చేవాడు. అలా ప్రపంచం అంతటా వ్యాపించి ఉండేది ఆనాటి భారతదేశం.

చేది దేశం అని ఒక దేశం ఉన్నది. ఈ దేశాన్ని ఉపరిచర వసువు పరిపాలించేవాడు. అసలు పేరు వసుమహరాజు. దేశాన్ని బాగా పాలించేవాడు. ప్రజలని కన్నా బిడ్డల్లా చూసుకునేవాడు. మృగయా వేట వినోదర్ధం వేటకి వెళ్ళాడు. అలా వెళ్ళగా వెళ్ళగా ముని పల్లె కనిపించింది. దాన్ని చూసి వైరాగ్యం పొంది తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి ఇంద్రుడు ప్రత్యక్షమై నీ పరిపాలనకి, తపస్సుకు మెచ్చాను. ఇకనుండి అప్పుడపుడు నాదగ్గరకి కూడా వచ్చి నాతో స్నేహం చేయమని అని ఒక విమానం ఇచ్చాడు. ఆకాశంలో తిరగడానికి విమానం ఇచ్చాడు కనుక, ఆ విమానంలో తిరిగి ప్రజల సమస్యలు రాత్రైన, పగలైన తీరుస్తున్నాడు కనుక ఆయనకి ఉపరిచర వసువు అని పేరు వచ్చింది. ఇంద్రుడు వరం ఇచ్చిన రోజు గుర్తుంచుకుని ప్రతి ఏడాది ఆ తిదికి ఇంద్ర యాగం చేయడం మొదలైంది. అప్పటి నుంచి రాజులు అందరు రజ్యాభివృద్దికి, సంతానం కోసం ప్రతియేటా ఇంద్రుడికి యజ్ఞం చేయడం, అయన వచ్చి కోరిన వరం ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది. ఇలా కొంతకాలం తరువాత విమానంలో ఎక్కి అలా తిరిగుతుండగా ''సుప్తిమతి'' అని ఒక నది ఉంది. దాన్ని కోలాహలం అనే పర్వతం నన్ను పెళ్ళిచేసుకో అని అడ్డుకోవడంతో రక్షించండి అని అరిచింది. ఆ కేక విన్న వసువు ఇష్టం లేని ఆడదాని నిర్భందిస్తావా అని ఎడమకాలితో తన్నగానే ఆ పర్వతం ఎగిరి వెళ్లి ఎక్కడో దూరంగా పడిపోయింది. కోలాహలం అడ్డగించడం వల్ల గర్భం దాల్చింది. తరువాత రాజుగారిని ప్రశంసించి నీకు కొన్నాళ్ళలో కుమార్తెని, కుమారుడిని ఇస్తాను అంది. అలా ఒక పది మాసాలు గడిచిన తరువాత సుప్తిమతి అన్న మాట ప్రకారం మహారాజుకి ఒక, కొడుకు వసుపదుడు, కూతురు గిరిగని ఇచ్చింది. బావమరిది వసుపదుడుని సర్వ సైన్యాధ్యక్షుడిని చేశాడు. గిరిగని వివాహం చేసుకున్నాడు. ఒకనాడు మహారాజు భార్య ఋతిమతి అవ్వడంతో బ్రాహ్మణులు పితృకార్య నిమిత్తం అడవికి వెళ్లి ఏదైనా జింకని వేటాడి అ మాంసం పెట్టమన్నారు. ఇంతలో పితృదేవతలు వచ్చి మహారాజ నీ భార్యకి 5వ రోజు ఏదైనా మృగమాంసం పెట్టు. మంచి సంతానం కలుగుతారు(పూర్వకాలంలో భార్య ఋతుమతి అయిన 4రోజులు భర్త , భార్య మొహం చూడకూడదు. 5వ నాడు మృగమంసం పెట్టమన్నారు. కలియుగంలో మేషం బదులు మాషం(మినప గారెలు) పెట్టమన్నారు.) అని చెప్పడంతో వేటకోసం అడవికి వెళ్ళాడు. భార్య మీద వ్యామోహంతో ఆమె అందచందాలు, ఆమె మోము, ఆమె నాజుకైనా నడుము ఇలా అంగాంగ వర్ణనం చేసుకుంటూ మొహం అధికమై అడవి మద్యలో రేతఃస్కలనం అయ్యింది. ఈ అమోఘవీర్యం వృధా కాకూడదని ఋతుమతి అయిన భార్యకి ఇవ్వు. దీన్ని గర్భంలో ధరిస్తుంది అని ఒక దొన్నెలో పెట్టి గ్రద్దకి ఇచ్చాడు. ఆ వీర్యాన్నితీసుకెళుతున్న డేగ చూసి అది దొన్నె మాంసపు ముక్క అనుకోని ఇంకో డేగ వచ్చి కలియబడింది. దాంతో ఆ దొన్నె గంగా నదిలో పడిపోయింది.

దుర్వాసముని తపస్సు చేస్తుంటే అద్రిక అనే అప్సరస వచ్చి తపస్సుని చెడగొట్టాలని ప్రయత్నించింది. దాంతో కోపించిన దుర్వాస మహర్షి నువ్వు చేప అయిపో అని శాపం పెట్టాడు. శాపం వలన ఆ దేవకన్య చేపలా మారింది. మునేంద్ర క్షమించి శాప విమోచన మార్గం చెప్పండి అనగానే నువ్వు మానవులకి జన్మ ఇచ్చినపుడు శావిమోచనం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ నాటి నుండి చేపరూపంలో యమునా నదిలో తిరుగుతుంది.
యమునా నదిలో పడిన ఆ రేతస్సుని ఆ అద్రిక మింగడంతో గర్భం దాల్చింది. అక్కడ దాస్య రాజుగారు అని మత్స్య కారులకి రాజు ఉండేవాడు. అయన భటులు చేపలకోసం వేటకి వెళితే ఈ అద్రిక అనే చేప వాళ్ళ వలలో పడింది. ఆ చేపని తీసుకెళ్ళి మహారాజుకు ఇచ్చారు. మహారాజు మెచ్చుకొని ఆ చేపని కోయ్యమన్నాడు. దాని కడుపు చీల్చగానే ఆ చేప కడుపులో నుండి ఇద్దరు పిల్లలు బయటికి వచ్చారు. వారిలో ఒకడు మత్స్య రాజు అనే పేరుతొ మత్స్య నగరం స్థాపించి రాజయ్యాడు.(ఈయన మనవడే మత్స్య దేశాదిపతి విరాట్ రాజు).చేప కడుపులో నుండి పుట్టడం వల్ల మత్స్యరాజు అన్నారు. వెంటనే రెండవపిల్ల బయటికి వచ్చింది. ఈవిడ శరీరం కూడా 8మైళ్ళు దూరం చేపల వాసన వచ్చేది. ఆమెకి మత్స్యగంధి అన్నారు. అసలు పేరు సత్యవతి. మానవులని కంటే శాపం తోలగుతుందని వరం ఉండటంతో అప్సర రూపు దాల్చి దేవలోకానికి వెళ్ళిపోయింది. ఈ సత్యవతి తండ్రి దాస్యరాజు ఆజ్ఞ ప్రకారం పడవ నడుపుకుంటూ జీవితం గడుపుతుంది.
ఇలా ఉండగా ఒకనాడు వసిష్ఠ మహర్షి పౌత్రుడు అయిన శక్తి ముని కొడుకు పరాశర మహర్షి యమునా తీరం ఇటు నుండి అటు వైపుకి వెళ్ళడానికి పడవ కోసం చూస్తుండగా ఈ సత్యవతి కనపడింది. ఆమెని చూడగానే ఆమె ముగ్ధమొహన సౌందర్యానికి మతిపోయి! ఓ రూపవతి నిన్ను చూడగానే నా మనస్సు ఎందుకో అదుపు తప్పుతున్నది. నీ మీద కోరిక కలిగింది. ఇంతకు ముందు ఎందఱో అప్సరసలు వరించి వచ్చినా చలించని నేను నిన్ను చూడగానే మనస్సు వశం తప్పుతున్నది. ఇది కేవలం దైవ ప్రేరేపితం అని నాకనిపిస్తున్నది. తప్పక ఒక మహా పురుషుడు జన్మిస్తాడు. కోరిక తీర్చు అనగానే, మహర్షి నేను కన్యను. కన్నెరికం చెడితే ఇంకా మా తండ్రి గడప ఎలా తొక్కడం. కన్నెరికం చెడకుండా మార్గం చూపండి. అప్పుడు సమ్మ తించగలను అంది. పరాశర ముని దానికేమి భాగ్యం. నీ కన్నేరికానికి ముప్పు ఏమి కలగదు పదా అని పడవ ఎక్కాడు. సత్యవతి పడవని యమునా నదిలో ఉన్న ఒక ద్వీపానికి తీసుకెళ్ళింది. మళ్లి సందేహం వచ్చి ఇంతటి మిట్ట మద్యాహ్నం ఎలా సంభోగం అనగానే అప్పటికి అప్పుడు దట్టమైన మేఘాలతో మంచు కురిపించాడు. అనంతరం కొద్దిసేపటి తరువాత నీలి మేఘ చ్చాయ శరీరంతో ఒక బాలుడు పుట్టాడు. కృష్ణ వర్ణంలో ధగధగ మెరిసిపోతున్నాడు. అతనే వ్యాసుడు. కృష్ణ వర్ణంలో ద్వీపంలో పుట్టాడు కనుక కృష్ణ ద్వైపాయనుడు అయ్యాడు. వేదాలని విభజించాడు కనుక వేదవ్యాసుడు అయ్యాడు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML