.

.

గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

Monday, March 5, 2018

అతీత లోకాలు...అదృశ్య శక్తులు..💐అతీత లోకాలు...అదృశ్య శక్తులు..💐
చాలామంది అతీతలోకాలు లేవని అనుకుంటారు. అదృశ్యశక్తులు కూడా లేవని అనుకుంటారు. అది నిజం కాదు. అవి ఉన్నాయి.
మనకు కనిపించనంత మాత్రాన "లేదు" అనుకోవడం వెర్రితనం. రాత్రిళ్ళు మనకు సూర్యుడు కనిపించడు. అంతమాత్రాన సూర్యుడే లేడు అనుకోవడం ఎంత తెలివితక్కువతనమో ఇదీ అంతే.
రాత్రి మాత్రమే తెలిసినవాడు సూర్యుడు లేడు అనుకోవచ్చు. కాని పగటిని చూచిన వాన్ని అడిగితే సూర్యుడున్నాడు అని అతను చెప్తాడు.
అలాగే, మనకు కనిపిస్తున్నదే సత్యమనీ తక్కినది అబద్దమనీ అనుకోవడం పిచ్చితనం. గోడ అవతల ఏముందో మనం చూడలేం. అంతమాత్రాన గోడ అవతల ఏమీ లేదు అనుకోవడం తప్పే కదా.
డైమన్షన్స్..💐

నిద్రాణంగా ఉన్న మన ఇంద్రియ శక్తులను యోగం ద్వారా నిద్ర లేపినపుడు అద్భుతాలు చూడవచ్చు. ఇంతవరకూ మనం చూస్తున్న లోకం వెనుక ఎన్ని లోకాలున్నాయో గమనించవచ్చు. వాటిలో ఎన్నెన్ని జీవులున్నాయో చూడవచ్చు. వారితో ఇంటరాక్ట్ కావచ్చు.
కొందరు పాశ్చాత్య శాస్త్రజ్ఞులు చెప్పినదాని ప్రకారం మనం చూస్తున్న డైమెన్షన్ వెనుక కనీసం ఆరు ఇతర డైమెన్షన్ లు ఉన్నాయి. అంటే మొత్తం ఏడు లోకాలున్నాయి అని అర్ధం. మన ప్రాచీనులు చెప్పిన భువర్లోక సువర్లోకాది సప్త ఊర్ధ్వలోకాలు అవే. వీటికి నెగటివ్ పోల్స్ నే అతల.. వితలాది సప్త అధోలోకాలు అన్నారు...
అతీత మానసం:.💐

మనిషి చూడలేని వేవ్ లెంగ్త్ లను కొన్ని జంతువులు చూడగలవు. కుక్కలకు ఆ శక్తి ఉంది. అవి ఒక్కొక్కసారి దయ్యాలను చూచి ఏడుస్తూ ఉంటాయి. అయితే కుక్క ఏడ్చిన ప్రతిసారీ అక్కడేదో దయ్యం ఉన్నట్లు అనుకోవడం కూడా తప్పే. దానికి ఆకలేసినా, సీజన్ వచ్చినా కూడా అలాగే ఏడుస్తుంది. ప్రేతాత్మలను చూచినప్పుడు కుక్క ఏడవటం ఒక తీరులో ఉంటుంది. అనుభవంలో దానిని కనిపెట్టవచ్చు.
గబ్బిలాలు సూక్ష్మ తరంగాల ఆధారంగానే దేనికీ తగలకుండా ఎగరగలుగుతాయి. పక్షులు తమలోని అయస్కాంత దిక్సూచి ఆధారంగానే వేలమైళ్ళు ప్రయాణంచేసినా మళ్లీ తమ గూటికి చేరుకోగలుగుతాయి.
పిల్లులు కూడా మనం చూడలేని వేవ్ లెంగ్త్ లో ఉన్న జీవులను చూడగలవు. పాములు ఈ విషయంలో మరీ శక్తివంతమైన జీవులు. మైళ్ళ దూరంలో ఉన్న మనిషి కదలికలను అవి గుర్తుపట్టగలవు. కొన్ని దేవతా సర్పాలకైతే అతీత శక్తులు ఉంటాయి. అవి మానవరూపం ధరించగలవు. మానవ భాషలో మాట్లాడగలవు కూడా.....
డైమన్షన్స్:.💐

ఒక్కొక్క డైమెన్షన్ లో ఒక్కొక్క రకమైన జీవులు ఉంటాయి. మళ్లీ వీటిలో విభిన్న తరగతుల వాళ్ళు ఉంటారు.
మానవలోకంలో అందరూ మానవులే అయినప్పటికీ వాళ్ళలో మళ్లీ తేడాలున్నట్లుగా అక్కడ కూడా ఉంటుంది.వీరిలో కొందరు ఉన్నత స్థాయికి చెందిన జీవులు వారి ఇష్టానుసారం మనకు కనిపించి సూచనలు ఇవ్వగలవు. మన కర్మలో పాలుపంచుకోగలవు. సద్గురువులకు ఈ శక్తి ప్రస్ఫుటంగా ఉంటుంది. తమ శిష్యులను జన్మజన్మాంతరాలవరకూ వారు గైడ్ చేయగలరు.
యోగసూత్రాలు-వాటి అన్వయం:.💐

పతంజలి మహర్షి ఒకచోట ఈ సూత్రాన్ని ఇచ్చారు "సమాన జయాత్ ప్రజ్వలనం". శరీరంలో ఉన్న సమానవాయువు అనేదాన్ని అదుపులోనికి తెచ్చుకుంటే యోగి తన శరీరం నుంచి జ్వలించే కాంతిని వెదజల్లగలడు. దీనిని సాధించిన యోగులు చాలామంది నేటికీ ఉన్నారు.
ఈ విషయాన్ని గురించి నేనొకసారి మాట్లాడుతున్నపుడు నా స్నేహితుడొకడు ఒప్పుకోలేదు. "ప్రకృతిలో సాధ్యం కాని విషయాలను ఏదో పుస్తకంలో రాసినంత మాత్రాన ఎలా నమ్మాలి?" అని వాదించాడు. అతనితో ఇలా చెప్పాను. "ప్రకృతిలో లేవని నీవు ఎలా అనుకుంటున్నావు? ఉన్నాయి. చూచే దృష్టి నీకు లేదు. నీకు తెలియనంత మాత్రాన ప్రకృతిలోనే ఇవి లేవు అని ఎలా నిర్ధారణకు వస్తున్నావు? మిణుగురు పురుగును చూచావుకదా. రాత్రిపూట అది తనలోనుంచి కాంతిని ఎలా వెదజల్లుతుంది? అలాంటి శక్తి ఈ టెక్నిక్ వల్ల మనిషికి కూడా…

[16:59, 3/5/2018] +91 90300 24183: ఏడవ శ్లోక భాష్యం - నాల్గవ భాగం
ఆమె పాదములు పూజించిన పుష్పములను గ్రహించి వాసన చూడాలనే ఆశను రేకెత్తిస్తాయి. ఆ తల్లి పద్మము పోలిన పాదములను మరీమరీ చూడాలనే తపనను కలిగిస్తాయి. మరి అమ్మ ఇంద్రియ సుఖాలనేకాదు అతీంద్రియమైన అత్యంతికమైన సుఖాన్ని కలగచేసే కరుణ కలిగినట్టిది.
దొంగ చేతిలో ఉన్న కత్తి మనను భయపెట్టి దోచుకోవడానికి ఉపయోగిస్తే, మన చేతిలోని కత్తి అతన్ని పరుగెత్తించేట్లు చేస్తుంది కదా!! మన్మథుని చేతిలో చెఱుకు వింటి రసం, పూల బాణముల నుండి స్రవించే తేనె కామరసంగా మారి లోకాన్ని కామమోహితుల్ని చేస్తుంది. అంబిక చేతులలో ఇదే వస్తువులు కరుణామృతాన్ని ప్రవహింపచేస్తాయి. తద్వారా మన హృదయాలలో ఆ తల్లిపై భక్తి ఏర్పడుతుంది. ఆమే కరుణా ప్రవాహం, మన భక్తి కలసి మన అస్తిత్వాన్ని మరపింపచేసి ముక్తిలోని బ్రహ్మానందాన్ని అనుభవింపచేస్తాయి.
మనను అంధకారంలో ఉంచేది మాయ. మన ఉనికిని మరిపింపచేసి కరిగింపచేసేది జ్ఞానం. ఒక్కమాటలో చెప్పాలంటే అంబిక చేతిలోని బాణాలు మన విషయ వాంఛలను అదుపులో పెడితే, ఆమె చెఱుకు విల్లు మన మనస్సును లయం చేస్తుంది. ఇది జరిగినప్పుడు ముక్తి సిద్ధిస్తుంది.
ఈ అయిదు బాణముల చేత పవిత్రము చేయబడిన పంచేంద్రియములు, చెఱుకు విల్లు చేత శుద్ధి చేయబడిన మనస్సు కూడి ఆరుకరణములుగా పిలవబడుతున్నాయి. తేనెటీగకు ఆరుకాళ్ళు ఉన్న విధంగా మానవునకు ఆరు కరణములు. తన ఆరుకాళ్ళతో తేనెటీగ పద్మంపై ఎలావాలుతుందో అలా మనమీ ఆరు కరణములతో అంబిక పాదపద్మములపై వాలిపోవాలి. ఆమె పాదములను పట్టుకొంటే మన రాగద్వేషములు కూడా అణగారిపోతాయి.
ఆచార్యులవారు అంబిక పాదములే వరదాభయములను ప్రసాదిస్తాయని పూర్వమే చెప్పారుకదా!! మళ్ళీ ఆమెకు నాలుగు చేతులెందుకు. ఆమె మహారాజ్ఞి!! రాజ చిహ్నములైన ధనుర్బాణాలను పట్టుకోవాలి. మరి ఆమె సామ్రాజ్యమెక్కడ ? అది జ్ఞాన సామ్రాజ్యం. రాగద్వేషాలను రూపు మాపి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని తెలియజేయడానికి పాశాంకుశములున్న చేతులు చూపబడ్డాయి. మీదు మిక్కిలి నాలుగు చేతులు ఆమెకు లోకాతీతమైన సౌందర్యాన్ని కలగజేస్తున్నాయి. ధనుర్బాణాలు మనంతటా మనం సమర్పించుకోవలసిన ఇంద్రియాలను, మనస్సును ఆమె పాదాలవైపుకు త్రిప్పుతాయి.
ఈ ధనుర్బాణాలతోనే అంబిక శుద్ధజ్ఞానమైన ఈశ్వరుని ప్రపంచ క్షేమం కోసం కామం వైపునకు మరలించి ఆయనను కరుణామూర్తిగా మలచింది. తాను శివకామసుందరి అయింది. యావజ్జీవజాలాన్నీ వారి ఇంద్రియాలను, మనస్సును తన చేతిలో ఉంచుకొని ఇవే ఆయుధాలతో రక్షిస్తోంది. ఆచార్యులవారు ఈ ధనుర్బాణాలతో చేయబడే లీల అమ్మ పాదములే చేయగలవంటున్నారు.
(సశేషం)
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML