వినాయకా ఓ విఘ్ననాశకా!
తొలుత పూజ నీకేనయ్యా!
ఓ బొజ్జగణపయ్యా దండాలయ్యా!
తొలి వందానాలివే అందుకోవయ్యా!
ఉండ్రాళ్ళు నివేదించేము నీకు
మా గండాలు బాపుమయ్యా !
పత్రితో నిను పూజించేమయ్యా!
మమ్ము అనుగ్రహించి కాపాడుమా
సింధూరంతో నిన్నుఅలంకరించేము
సిరిసంపదలనిచ్చి కాపాడుమా
నీ బంటులము మేమయ్యా!
ఎల్లవేళలా మావెంట ఉండవయ్యా!
కమ్మని నెయ్యితో పాయసం నీకయ్యా!
మాకు ఆయురారోగ్యాలను అనుగ్రహింపుమా
ముద్దపప్పు నివేదించేమయ్యా!
ముద్దులొలికే మా చిన్నారుల ఆశీర్వదించుమా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి